భోపాల్: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఓ గిరిజన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పోలీసుల తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద వైశ్య.. సింగ్రౌలీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు. ఓ గిరిజన వ్యక్తిపై గురువారం కాల్పులు జరిపాడని ఆరోపణలు వచ్చాయి. రోడ్డుపై వెళ్తుండగా.. స్థానిక గిరిజనులతో వివేకానంద వైశ్యాకి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వైశ్య.. వారిని బెదిరించడానికి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్టు స్థానిక గిరిజనుని అరచేతికి తగిలినట్లు వెల్లడించారు. అనంతరం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన అనంతరం వివేకానంద వైశ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం రూ.10 వేల రివార్డు కూడా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే.. రామ్ లల్లూ వైశ్య.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వివేక్ దోషి అని తేలితే శిక్షించండని చెప్పారు. బాధిత గిరిజనుడు తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపిన ఆయన.. ఈ విషయం తెలిసి బాధేసిందని చెప్పారు. గత ఐదేళ్లుగా వివేక్ తన కుటుంబంతో కలిసి ఉండటం లేదని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ ఘటనలో నిందితునిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు చెప్పారు.
मध्य प्रदेश के भाजपा नेताओं में आदिवासी समुदाय पर अत्याचार करने की होड़ मची है। सीधी में आदिवासी युवक पर पेशाब करने की घटना को अभी ज्यादा समय नहीं हुआ है कि सिंगरौली में भाजपा विधायक रामलल्लू वैश्य के बेटे विवेकानंद वैश्य ने एक आदिवासी युवक को गोली मार दी। युवक गंभीर रूप से घायल…
— Kamal Nath (@OfficeOfKNath) August 4, 2023
అయితే.. మధ్యప్రదేశ్‌లో వరుసగా గిరిజనులపై ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఫైరయ్యారు. గిరిజనులను, దళితులను పీడించడమే బీజేపీ పనా? అని ప్రశ్నించారు. నేరస్థులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుడిపై యూరినేషన్ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నా కారునే ఆపుతావా.. టోల్‌గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి
Comments
Please login to add a commentAdd a comment