MLA son
-
దారుణం: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఓ గిరిజన వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పోలీసుల తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద వైశ్య.. సింగ్రౌలీ ఎమ్మెల్యే రామ్ లల్లూ వైశ్య కుమారుడు. ఓ గిరిజన వ్యక్తిపై గురువారం కాల్పులు జరిపాడని ఆరోపణలు వచ్చాయి. రోడ్డుపై వెళ్తుండగా.. స్థానిక గిరిజనులతో వివేకానంద వైశ్యాకి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వైశ్య.. వారిని బెదిరించడానికి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్టు స్థానిక గిరిజనుని అరచేతికి తగిలినట్లు వెల్లడించారు. అనంతరం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం వివేకానంద వైశ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం రూ.10 వేల రివార్డు కూడా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటికొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే.. రామ్ లల్లూ వైశ్య.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వివేక్ దోషి అని తేలితే శిక్షించండని చెప్పారు. బాధిత గిరిజనుడు తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపిన ఆయన.. ఈ విషయం తెలిసి బాధేసిందని చెప్పారు. గత ఐదేళ్లుగా వివేక్ తన కుటుంబంతో కలిసి ఉండటం లేదని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ ఘటనలో నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. मध्य प्रदेश के भाजपा नेताओं में आदिवासी समुदाय पर अत्याचार करने की होड़ मची है। सीधी में आदिवासी युवक पर पेशाब करने की घटना को अभी ज्यादा समय नहीं हुआ है कि सिंगरौली में भाजपा विधायक रामलल्लू वैश्य के बेटे विवेकानंद वैश्य ने एक आदिवासी युवक को गोली मार दी। युवक गंभीर रूप से घायल… — Kamal Nath (@OfficeOfKNath) August 4, 2023 అయితే.. మధ్యప్రదేశ్‌లో వరుసగా గిరిజనులపై ఇలాంటి ఘటనలు జరగడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఫైరయ్యారు. గిరిజనులను, దళితులను పీడించడమే బీజేపీ పనా? అని ప్రశ్నించారు. నేరస్థులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుడిపై యూరినేషన్ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి -
ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి, వీడియో వైరల్
ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబయిలోని చెంబూర్‌లో సోమవారం జగిరిన మ్యూజిక్ కన్సర్ట్‌లో కొందరు ఆయనపై దాడికి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాలు.. ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ ఆధ్యర్యంలో ముంబయిలోని చెంబూరులో జరిగిన ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో సోనూనిగమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాటలు పాడి అలరించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా కొందరు ఆయనతో సెల్ఫీ దిగే వంకతో సోనునిగమ్పై దాడి చేశారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి స్టెప్స్‌పై నుంచి తొయడంతో ఆయన కిందపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూ నిగమ్‌పై దాడి చేస్తున్న క్రమంలో ఆయన సహచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై సైతం సదరు గ్రూప్ దాడి చేసేందుకు యత్నించగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న బాడీగార్డ్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో సోనూ నిగమ్ బృందంలోని ఇద్దరు వ్యక్తులు స్టేజ్‌పై నుంచి కింద పడటంతో వారిలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! ఇక ఈ ఘటన అనంతరం సోనూ నిగమ్ మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీ దిగాలని వచ్చి తనని తోయడంతో కింద పడ్డానని, వారిని ఆపేందుకు వచ్చిన తన అనుచరులపై కూడా దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్లు ఉద్ధవ్ ఠాక్రె పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కొడుకే ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు ఈ దాడికి పాల్పడినట్లు సోనూ నిగమ్ బృందం చెబుతుండగా.. సెల్ఫీలు తీసుకునే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే చెబుతుండటం గమనార్హం. #SonuNigam attacked by Uddhav Thackeray MLA Prakash Phaterpekar son and his goons in music event at Chembur. Sonu has been taken to the hospital nearby. pic.twitter.com/ERjIC96Ytv — Swathi Bellam (@BellamSwathi) February 20, 2023 Shocking😡 Padma Shri Singer #SonuNigam was attacked by the son of Shiv Sena MLA Prakash Phaterpekar. got some serious injuries & taken to Zen Hospital Chembur. Is this what a Padma Shri & a legend deserves? Demanding stringent action @Dev_Fadnavis @MumbaiPolice @mieknathshinde pic.twitter.com/4HnEMdTa9p — Akassh Ashok Gupta (@peepoye_) February 20, 2023 -
మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు హంగామా.. నడిరోడ్డుపై..
Sandeep Kanwar.. మాజీ హోం మంత్రి కుమారుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకాలదాకా మద్యం సేవించి ఒళ్లు మరిచిపోయి నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ మాజీ హోం మంత్రి, రాంపూర్ ఎమ్మెల్యే నానకీరామ్ కన్వర్ కుమారుడు సందీప్ కన్వర్ ఫుల్‌గా మద్యం సేవించి నడిరోడ్డుపై రచ్చచేశాడు. బస్సును ఆపి.. బస్సు కండక్టర్‌పై దాడికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా.. నడిరోడ్డు మీద బస్సుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో, ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సందీప్ కన్వర్ అక్కడి నుంచి ఆయన ఇంటికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, సందీప్ కన్వర్ ప్రస్తుతం కోర్బా ఏరియా నంబర్ 1 జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. సందీప్ తండ్రి నానకీరామ్ కన్వర్.. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో(2008-13) ఉన్న కాలంలో నానకీరామ్ హోం మంత్రిగా బాధ్యతలు కొనసాగించారు. -
అమ్నీషియా పబ్ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్ ఖాన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసింది. కాగా జువైనల్ హోమ్‌లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్ వచ్చింది. సుమారు ఘటన జరిగిన 48 రోజుల తర్వాత ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికే నలుగురు బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక రేప్ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. చదవండి: రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్ -
Amnesia Pub Case: జువైనల్ హోమ్‌కు ఎమ్మెల్యే కుమారుడు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో మైనర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోమ్‌కు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇచి్చంది. మిగతా ఐదుగురు మైనర్లనూ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసు.. రెండు కోర్టుల పరిధిలో.. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడిన ముగ్గురు మైనర్లను సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఎమ్మెల్యే కుమారుడు, మరో మైనర్‌నూ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అదే హోమ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ఓ చిత్రమైన అంశం వెలుగులోకి వచి్చంది. సాధారణంగా ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక డిజిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది. గ్యాంగ్ రేప్ జరిగిన జూబ్లీహిల్స్ ఠాణా నాంపల్లిలోని పదిహేడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు పరిధిలోకి వస్తుంది. ఈ ఠాణాలో నమోదైన కేసుల విచారణ, నిందితుల హాజరు వంటివన్నీ ఆ కోర్టులోనే జరుగుతాయి. అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులు మాత్రం నాంపల్లి సెషన్స్ కోర్టు పరిధిలోకి వెళ్తాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన వారిని మాత్రం రెండు వేర్వేరు కోర్టుల్లో హాజరుపర్చాల్సి వచి్చంది. ఈ కేసులో పోక్సో యాక్ట్ కూడా ఉండటంతో సాదుద్దీన్‌ను దానికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మిగతా వారంతా మైనర్లు కావడంతో వారిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువైనల్ జస్టిస్ కోర్టులో హాజరుపర్చారు. వీరి కస్టడీ పిటిషన్లను సైతం పోలీసులు రెండు న్యాయస్థానాల్లో వేర్వేరుగా దాఖలు చేయాల్సి వచ్చింది. రేపటి నుంచి పోలీసు కస్టడీకి.. సామూహిక అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం సాదుద్దీన్‌ను 4 రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పోక్సో కోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. పోలీ సులు గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అతడితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. నిందితుడిని తీసుకుని పబ్, కాన్సూ బేకరీలతోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. నిందితుడు, మిగతా మైనర్లు ఏ సమయంలో, ఎక్కడ, ఏం చేశారనేది తెలుసుకోనున్నారు. నేరం తర్వాత వారు వెళ్లిన ప్రాంతాలు, ఇన్నోవా దాచిన చోటుకూ నిందితుడిని తీసుకువెళతామని అధికారులు తెలిపారు. నేర నిరూపణలో ఇది కీలకాంశమని వెల్లడించారు. ఇక మరో ఐదుగురు మైనర్ నిందితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు. వారిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ వేశారు. పొటెన్సీ టెస్ట్ చేయించి.. గ్యాంగ్ రేప్ కేసులో పట్టుబడిన ఆరుగురిలో ఒకరే మేజర్‌కాగా మిగతా వారంతా మైనర్లు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి ప్రభుత్వ వైద్యుల ద్వారా పొటెన్సీ టెస్ట్ చేయించనున్నారు. ఈ పరీక్ష ద్వారా నిందితులకు లైంగిక పటుత్వం ఉందా? లేదా? అనేది వైద్యపరంగా నిర్ధారిస్తారు. అభియోగపత్రం (చార్జిïÙట్) దాఖలుకు ఇది కీలకం కావడంతో ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. మరోవైపు సాదుద్దీన్ సహా ఆరుగురి గత చరిత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో ఇన్నోవా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండి ఉంటుందని.. స్వాధీనం చేసుకునేప్పుడు అది లేదని పోలీసులు చెప్తున్నారు. ఓ నిందితుడిని పోలీసులు విచారించిన సమయంలో అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్ లేదని, కేవలం తెరలతో కూడిన షీల్డ్స్ ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. దీంతో కారు అద్దాలపై ఫిల్మ్ ఉండేదా? అనేది నిపుణుల సాయంతో గుర్తించాలని నిర్ణయించారు. ఫిల్మ్ ఉండి, తర్వాత తొలగించినట్టు తేలితే.. ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఐపీసీలోని 201 సెక్షన్‌ను జోడించాలని భావిస్తున్నారు. కారుపై రాని క్లారిటీ! బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజి్రస్టేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
-
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
సాక్షి, హైదరాబాద్: ఆమ్నేషియా పబ్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్‌లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడేనంటూ రఘునందన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోంమంత్రి పీఏ అమ్మాయిని లోపలికి పంపాడు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఓల్డ్ సిటీకి చెందిన ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు ఇందులో ఉన్నారన్నారు. లైంగిక దాడి కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్ ఇన్సోమియా పబ్ నుంచి బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది. (చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో నుంచి బయటకు వెళ్లి..) -
ఎమ్మెల్యే కుమారుల వీరంగం.. ఎఫ్ఐఆర్ నమోదు
ఎమ్మెల్యే కొడుకులు వీరంగం సృష్టించారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్నారనే నెపంతో అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షియోపూర్‌లోని బుధేరా ఫారెస్ట్ రేంజ్లో అటవీ శాఖ అధికారులపై విజయ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ కుమారులు దాడి చేశారు. తమ అక్రమ వ్యాపారాలను అడ్డుకున్నందుకే వారు దాడి చేశారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే కుమారులు ధనరాజ్, దీనదయాళ్.. అక్రమ మైనింగ్, అడవి నుంచి ఇసుక, రాళ్ల అక్రమ రవాణా, అక్రమంగా చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారని ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు వారిని అడ్డుకోవడంతో దాడి జరిగింది. అయితే, బుధేరా ఫారెస్ట్ రేంజ్‌లోని పిప్రాని ఫారెస్ట్ పోస్ట్‌లో తన వాహనాలను అడ్డుకున్నందుకు ధనరాజ్ అటవీ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అతని పక్కనే ఉన్న సోదరుడు దీనదయాళ్ సహనం కోల్పోయి వారి సహచరులతో కలిసి ఫారెస్ట్ గార్డులు రామ్రాజ్ సింగ్, రిషబ్ శర్మ, డ్రైవర్ హసన్ ఖాన్‌లను తిడుతూ వారిపై దాడి చేశారు. ఈ విషయం వారు అటవీశాఖ సీనియర్ అధికారులకు తెలపడంతో వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుమారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు షియోపూర్ పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రామ్ తిలక్ మాల్వియా తెలిపారు. BJP MLA'S SONS BEAT FOREST OFFICIALS In #MadhyaPradesh, a #BJP MLA's sons beat up forest workers on duty. In a video, Vijaypur Assembly's MLA #SitaramAdivasi's both sons can be seen beating forest officials on duty.@govindtimes reports. pic.twitter.com/o33tGNj4Sm — Mirror Now (@MirrorNow) April 23, 2022 ఇది కూడా చదవండి: లక్కీ ఫెలో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు -
కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?
సాక్షి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వనమా రాఘవేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం వనమా రాఘవేందర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు. చదవండి: భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి.. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. -
అసలేం జరిగింది? సూసైడ్ నోట్ రాసి ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య
భోపాల్: ఈ రోజుల్లో కొందరు తొందరపడి క్షణికావేశంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే ఓ 17 ఏళ్ల ఎమ్మెల్యే కుమారుడు తన తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైభవ్ యాదవ్ (17) గురువారం మధ్యాహ్నం 4 గంటలకు గోరఖ్‌పూర్ ప్రాంతంలోని వారి ఇంట్లో తన తండ్రి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆస్పత్రికి హూటా హుటిన తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజయ్ యాదవ్ జబల్పూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న బార్గి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అందులో రాసినట్లు ఎస్పీ తెలిపారు. చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు -
ఐఫోన్‌తో కేక్ కట్ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివకాల్లోకి వెళితే.. కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ దడేసుగూర్ కొడుకు పుట్టిన రోజు వేడుకలో కేక్‌ను తన ఐఫోన్‌తో కట్ చేశాడు. అతడు పుట్టినరోజును బళ్లారి జిల్లా హోసపేటలో జరుపుకోవడానికి తన స్నేహితులతో కలిసి బీఎండబ్ల్యూలో చేరుకున్నాడు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ కాగా ఈ వీడియోలో మొత్తం 8 కేకులను ఐఫోన్‌తో కట్ చేసి జరుపుకున్నాడు. అయితే దీనిపై అతడి తండ్రి ఎమ్మెల్యే బసవరాజ్ స్పందిస్తూ.. ‘‘నా కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో కొన్న ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడు. ఇందులో తప్పేముంది? కోవిడ్-19 వల్ల చేతులకు బదులు ఐఫోన్ ఉపయోగించాడు’’ అంటూ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘2018 ఎన్నికలకు ముందు ఎన్నికల ఖర్చుల కోసం ఆయన నియోజకవర్గంలో ప్రజలు డబ్బులు చందాలు వేసుకుని గెలిపించారు. ఆ విధంగా గెలిచిన ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించారు. A Karnataka BJP MLA’s son has stirred a controversy by cutting his birthday cake(s) using his iPhone pic.twitter.com/zht6HhD12X — Soumya Chatterjee (@Csoumya21) September 3, 2021 -
ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ
చండీగఢ్: పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫతేజంగ్ సింగ్ బజ్వా తన కుమారుడు అర్జున్ ప్రతాప్‌సింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్నట్టు స్పష్టం చేశారు. బజ్వా తండ్రి వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో బలి కావడంతో కారుణ్య నియామకాల కింద ఆయన కుమారుడికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల్లో ఒకరికి పోలీసు ఇన్స్పెక్టర్, ఇంకొకరికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మౌనం వీడిన ఎమ్మెల్యే తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ఆ ఉద్యోగం అక్కర్లేదని కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్‌పై అపోహలు తొలగించండి -
బెంట్లీ కారుతో ఎమ్మెల్యే తనయుడు విధ్వంసం
కర్ణాటక, బొమ్మనహళ్లి: ఆదివారం నగరంలోని మేక్రి సర్కిల్ వద్ద వరుసగా వాహనాలను ఢీకొట్టి, అక్కడే వదిలివెళ్లిన అత్యంత ఖరీదైన బెంట్లీ కారు ఎవరిదనేది పోలీసులు గుర్తించారు. ఈ కారును డ్రైవింగ్ చేస్తు ప్రమాదానికి కారణమైన వ్యక్తి బెంగళూరు శాంతి నగర నియోజకవర్గం ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు అయిన మహ్మద్ నలపాద్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటతో పాటు చట్టుపక్కల సిసి కెమెరాల్లో నమోదైన చిత్రాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. దాంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నలపాడుకు నోటిసు జారి చేసినట్లు డీసీపి రవికాంతెగౌడ తెలిపారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే నగరంలోని సదాశివర నగర పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏం జరిగింది నలపాద్కు వివాదాల్లోకి దిగడం కొత్త కాదు. గతంలో ఓ కేఫ్‌లో యువకున్ని తీవ్రంగా కొట్టి కొన్ని నెలల పాటు సెంట్రల్ జైలులో రిమాండు అనుభవించడం తెలిసిందే. తాజాగా ఆదివారం మేక్రిసర్కిల్ వద్ద ఉన్న అండర్ పాస్‌లో బెంట్లి కారులో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనంతో పాటు ఆటోను ఢీకొన్నారు. దీంతో బైకిస్టు కాలు విరిగిపోగా, ఆటో పూర్తిగా డ్యామేజీ అయింది. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడ వదలి వెళ్ళి పోవడం జరిగింది. ఆధారాలున్నాయి: డీసీపీ గౌడ ఈ ప్రమాదం కేసులో తానే డ్రైవింగ్ చేశానని ఒక వ్యక్తి వచ్చి పోలీసుల వద్ద లొంగిపోయాడు. అయితే పోలీసులు జరిపిన విచారణలో ఈ వ్యక్తి డ్రైవింగ్ చేయలేదని తేలింది. మహ్మద్ నలపాడ్ నడిపాడని గుర్తించి కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. నోటిసులు అందిన వెంటనే విచారణకు హాజరు కావాలి. రానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ రవికాంతేగౌడ అన్నారు.కారును నడిపింది నలపాడేనని ఆధారాలు ఉన్నాయని, హాజరుకాక పోతే తాము కోర్టులో ఆధారాలను ప్రవేశ పెడతామని తెలిపారు. ప్రమాద సమయంలో అతడు జారుకున్నాడు. కానీ స్నేహితుడు నఫి మహ్మద్‌నసీర్, అతని బాడిగార్డ్ బాలకృష్ణలను స్థానికులు గుర్తించారు. పలు చోట్ల ట్రాఫిక సిగ్నల్స్ వద్ద సిసి కెమరాల్లో నలపాడు కారు నడుపుతున్నట్లు రికార్డయింది. చిన్న ప్రమాదమే: దినేష్ గుండూరావు కాగా, ఇది ఒక చిన్న ప్రమాదం అని దానిని పెద్దగా చేయ వద్దని కేపిసిసి అధ్యక్షుడు దినేష్ గుండూరావు అన్నారు. కేపీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. కానీ కొంత మంది పని కట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కుమారుడైనా, ఇతరులైనా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. -
‘చంపేస్తామని బెదిరిస్తున్నారు’
లక్నో : ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన షహజన్పూర్కు చెందిన మహిళ తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ నేత కుమారుడిపై ఆరోపణలు చేసినప్పటి నుంచి హెచ్చరికలు వస్తున్నాయని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కితీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కొందరు దుండగలు బాధితురాలిని బెదిరిస్తున్నారని ఆమె న్యాయవాది అవధేష్ సింగ్ చెప్పారు. ఫిర్యాదును వెనక్కితీసుకోకుంటే హతమారుస్తామని గూండాలు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలిని బెదిరించారని వెల్లడించారు. తనను లైంగికంగా వేధించిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సదరు మహిళ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఉన్నావ్, కథువా లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై బాధితురాలు చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. -
జైలులోనూ ఎమ్మెల్యే కొడుకు అదే దూకుడు
సాక్షి, బనశంకరి: యుబీ సిటీలో ఒక రెస్టారెంట్ వ్యాపారవేత్త కొడుకు విద్వత్‌పై దాడికి పాల్పడిన కేసులో శాంతినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కొడుకు మహ్మద్ హ్యారిస్ నలపాడ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఎమ్మెల్యే కొడుకు అక్కడ కూడా తన దుందుడుకు తనం ప్రదర్శించాడు. జైలులో స్నేహితుడిపై దాడికి దిగాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఐదవ నిందితునిగా ఉన్న తన మిత్రుడు అబ్రాస్.. ‘నేను జైలుకు రావడానికి మీరే కారణం’ అని మహ్మద్ తిట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అబ్రాస్ పై మహ్మద్ కోపం పట్టలేక దాడికి దిగాడు. సెల్లో ఇద్దరూ ముష్టియుద్ధానికి దిగిన విషయం తెలుసుకుని జైలు అధికారులు ఇద్దరిని విడిపించారు. అబ్రాస్ను మరో సెల్‌కు తరలించారు. విలపిస్తూనే భోజనం విద్వత్‌పై దాడి కేసులో నగరంలోని 8 వ ఏసీఎంఎం కోర్టు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో బుధవారం సాయంత్రం మహ్మద్, మరో ఐదుగురిని పరప్పన జైలుకు తరలించడం తెలిసిందే. జైల్లో పెట్టిన అన్నం సాంబారును మహ్మద్ ఏడుస్తూనే తిన్నట్లు తెలిసింది. స్నేహితునితో గొడవతో అతని సెల్ వద్ద భద్రత పెంచారు. మిత్రులను వేర్వేరు గదులకు తరలించారు. మహ్మద్ హ్యారిస్‌పై గతంలో కూడా ఇటువంటి దుందుడుకు ఘటనలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. 2016వ సంవత్సరం జూన్‌లో యూబీ సిటీలోని పార్కింగ్‌లో కారు తీయడంలో ఆలస్యం చేసినందుకు మహ్మద్ ఒక యువకునిపై దాడికి పాల్పడగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, తండ్రి, ఎమ్మెల్యే హ్యారిస్ రాజకీయ పలుకుబడితో ఘటనను పెద్దది కాకుండా చేశారని సమాచారం. అదే సంవత్సరం ఆగస్ట్‌లో శాంతినగర లోని ఓ పబ్‌లో, కొద్దిరోజుల అనంతరం బౌరింగ్ క్లబ్లో బౌన్సర్లపై దాడి చేసి వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దయానంద కాలేజీ విద్యార్థి సౌరవ్‌పై తన తమ్ముడు ఒ మర్తో కలసి దాడి చేయడమే కాకుండా రూ.10లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా, ఒక కార్పోరేట్ రంగంలోకి దిగి మహ్మద్‌ను చీవాట్లు పెట్టినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ కుమార్తెను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెనక్కు తగ్గాడు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలతో పార్టీలు... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల çకుమారులతో కూడా మహ్మద్‌కు మంచి సంబంధాలున్నాయని సమాచారం. ప్రతీనెలా వీరంతా యూబీ సిటీలో పార్టీలు విందు వినోదాల్లో మునిగి తేలుతుంటారు. -
ఎమ్మెల్యే కుమారుడి వీరంగం..
బెంగళూరు: శాంతినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్ తన 10 మంది స్నేహితులతో కలసి శనివారం అర్ధరాత్రి ఓ రెస్టారెంట్లో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో విద్వత్ అనే వ్యక్తిని చితకబాదడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఎమ్మెల్యే కుమారుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ నలపాడ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎమ్మెల్యే హ్యారిస్ స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరమైన ఘటన.. బాధితుడి కుటుంబసభ్యులను పరామర్శించాను. నా కుమారుడు నలపాడ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది’’అని అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఘటనకు సంబంధించి ‘‘నిందితుడు ఎంతటి వ్యక్తి అయినా శిక్ష అనుభవించాల్సిందే’’అని ట్వీట్ చేశారు. -
మనోహర్‌రెడ్డి తనయుడి కారు బోల్తా
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైరు పగలడంతో బోల్తాపడింది. బెలూన్లు ఓపెన్ కావడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం... ఎమ్మెల్యే సతీమణి పుష్పలత, తనయుడు ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం కారులో కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్నారు. సుల్తానాబాద్ సమీపం లోని సేయింట్ మేరీస్ స్కూల్ వద్దకు రాగానే కారు టైరు పగిలి బోల్తాపడింది. కారు వేగంగా ఉండడంతో రెండు పల్టీలు కొట్టి చెట్టుకు ఢీకొట్టింది. వెంటనే ఏయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. డోర్లు లాక్ కావడంతో మరోవాహనంలో పెద్దపల్లికి వెళ్లిపోయారు. తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న దాసరి పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భార్య పుష్పలత, కుమారుడు ప్రశాంత్‌రెడ్డికి ప్రమాదం తప్పడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన స్థలం నుంచి బాధితులు పెద్దపల్లిలోని స్వగృహానికి చేరుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఇంటికి చేరుకున్నారు. ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో ఆర్టీసీచైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఇన్చార్జి డీసీపీ వేణుగోపాల్, ఏసీపీ హబీబ్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య, ఎంపీపీ సునీత, జెడ్పీటీసీ లంక సదయ్య ఉన్నారు. -
ఎమ్మెల్యే వరుపుల కుమారుడిపై లైంగిక దాడి కేసు
కాకినాడ : ఓ గిరిజన యువతిని నమ్మించి మోసం చేసిన నేరంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రెండో కుమారుడు వరుపుల రాజుబాబుపై గురువారం రాత్రి కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్లో లైంగిక దాడి కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని వై.రామవరం మండలం దాలిపాడు గ్రామం కొండరెడ్డి కులానికి చెందిన గిరిజన యువతిని నమ్మించి...పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకొని తరువాత వేధించడం ప్రారంభించడంతో పోలీసులను ఆశ్రయించగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో ఎమ్మెల్యే తనయుడి వీరంగం
బెంగళూరు(బనశంకరి): బెంగళూరులోని శాంతినగర ఎమ్మెల్యే కుమారుడు మద్యం మత్తులో ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. వివరాలు... శాంతినగరలోని ప్లాన్‌బీ పబ్‌లో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు ఉమర్ పీకల దాకా మద్యం సేవించి, మత్తులో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధిత యువకుడు అశోకనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు అంగీకరించడం లేదన్న వాదన వినిపిస్తోంది. -
తాగి ముగ్గురి ప్రాణాలు తీసిన ఎమ్మెల్యే కొడుకు
సాయంత్రం 6.15 నిమిషాల నుంచి బార్ లో తప్పతాగి అర్ధరాత్రి 12.30 గంటలకు హోటల్ బయటకు వచ్చిన ముగ్గురు యువకులు కారు డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరినట్లు చూపుతున్న సీసీటీవీ వీడియో కారు యాక్సిడెంట్ కేసులో ముగ్గరి ప్రాణాలు బలిగొన్న ఎమ్మెల్యే కొడుకు మెడకు ఉచ్చుబిగుసుకునేలా చేస్తోంది. ఈ నెల 2వ తేదీన సికర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నందకిశోర్ తనయుడు సిద్దార్ధ మహారియా తన స్నేహితులతో కలిసి తాగిన మత్తులో కారును వేగంగా నడుపుతూ ఓ ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. జైపూర్ లో బార్ అండ్ రెస్టారెంట్లలో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన అధికారులకు సిద్దార్ధ స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు కనిపిస్తున్న ఫుటేజీలు వారికి దొరికాయి. తాగి 100 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన సిద్దార్ధ ఆటోను ఢీ కొట్టడంతో అది ఒక్కసారిగా దాదాపు 200 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అక్కడితో ఆగని అతని కారు పార్కింగ్ చేసి ఉన్న పోలీసుకారును కూడా ఢీ కొట్టడంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. సిద్దార్ధను అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్రిత్ ఎనలైజేర్ తో పరీక్షించగా సాధారణ మోతాదు కంటే ఐదు రెట్లు అధికంగా మద్యం సేవించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో వర్షం కురుస్తోందని, ఆ సమయంలో అక్కడ లైట్లు కూడా లేవని, ఇంతలో ఓ ఆటో వేగంగా కారువైపుకు దూసుకురావడం వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు సిద్దార్ధ చెప్పారు. కారుకు ఎయిర్ బ్యాగ్స్ సౌకర్యం ఉండటం వల్ల తమ ప్రాణాలు మిగిలాయని అన్నారు. కాగా, ఈ కేసులో సిద్దార్ధ తరఫు వాదించేందుకు నందకిశోర్ ప్రముఖ అడ్వకేట్ ను సంప్రదించారు. -
ఎమ్మెల్యే కొడుకు ట్రాక్టర్ సీజ్
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా నెల్లిమర్ల శాసన సభ్యుడు పతివాడ నారాయణస్వామి నాయుడు కుమారుడు తమ్మునాయుడుకు చెందిన ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకొన్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చంపావతినది నుంచి అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎమ్మెల్యే నారాయణస్వామి స్వగ్రామైన చల్లవానితోట, రెల్లివలస పంచాయతీల్లో అనుమతి లేకుండా 90 స్టాక్ పాయింట్లులో ఉన్న 160 ట్రాక్టర్ల ఇసుకను గత మూడు రోజుల్లో సీజ్ చేసి డెంకాడ రీచ్‌కు అప్పగించారు. -
దటీజ్ ఎమ్మెల్యే హీరాలాల్!
జైపూర్: రాజకీయ నాయకులు ఎవరైనా తన కొడుకు ఆయన లాగా రాజకీయ నాయకుడు కావాలనో లేక వేరే పెద్ద ఉద్యోగాలు చేయాలనో కోరుకుంటారు. అందుకోసం అవసరమైతే దొడ్డిదారిలో కొడుక్కి ఉద్యోగాలు కూడా ఇప్పించుకుంటారు. కానీ రాజస్తాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ ఇందుకు విరుద్ధం. ఎనిమిదో తరగతి పాసైన తన కొడుక్కి ప్యూన్ ఉద్యోగమే సరియైనదని చెప్పారు. తన కొడుకు హన్స్‌రాజ్ అర్హత, శక్తి సామర్థ్యాలకు ఇలాంటి ఉద్యోగమే సరిపోతుందని సాక్షాత్తు ఆయనే చెప్పడం విశేషం. రాజస్థాన్ స్టేట్ వ్యవసాయ మార్కెట్ బోర్డులోని ఈ ఉద్యోగానికి శుక్రవారం అజ్మీర్‌లో జరిగిన ఇంటర్వ్యూ కి హన్స్‌రాజ్ హాజరయ్యారు. ఇంటర్వ్యూ బాగా జరిగిందని తన కొడుక్కి ఉద్యోగం వస్తుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వర్మ రాజకీయాల్లోకి రాక ముందు సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు. మూడు సబ్జెక్టులలో ఆయన మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. వర్మ గోల్డ్‌మెడలిస్ట్ కూడా. కానీ ఆయన కొడుక్కి మాత్రం చదువు అబ్బలేదు. ప్రస్తుతం హన్స్‌రాజ్ నెలకు రూ.5వేల జీతానికి ఓ ప్రై వేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు.