
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైరు పగలడంతో బోల్తాపడింది. బెలూన్లు ఓపెన్ కావడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం... ఎమ్మెల్యే సతీమణి పుష్పలత, తనయుడు ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం కారులో కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్నారు. సుల్తానాబాద్ సమీపం లోని సేయింట్ మేరీస్ స్కూల్ వద్దకు రాగానే కారు టైరు పగిలి బోల్తాపడింది. కారు వేగంగా ఉండడంతో రెండు పల్టీలు కొట్టి చెట్టుకు ఢీకొట్టింది. వెంటనే ఏయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. డోర్లు లాక్ కావడంతో మరోవాహనంలో పెద్దపల్లికి వెళ్లిపోయారు.
తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న దాసరి
పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భార్య పుష్పలత, కుమారుడు ప్రశాంత్‌రెడ్డికి ప్రమాదం తప్పడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన స్థలం నుంచి బాధితులు పెద్దపల్లిలోని స్వగృహానికి చేరుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఇంటికి చేరుకున్నారు. ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో ఆర్టీసీచైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఇన్‌చార్జి డీసీపీ వేణుగోపాల్, ఏసీపీ హబీబ్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య, ఎంపీపీ సునీత, జెడ్పీటీసీ లంక సదయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment