
ఆమ్నేషియా పబ్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్‌లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడేనంటూ ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: ఆమ్నేషియా పబ్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్‌లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడేనంటూ రఘునందన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోంమంత్రి పీఏ అమ్మాయిని లోపలికి పంపాడు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఓల్డ్ సిటీకి చెందిన ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు ఇందులో ఉన్నారన్నారు. లైంగిక దాడి కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు.
చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన