Raghunandan
-
మెదక్ లోక్‌సభ స్థానంపై వీడని సస్పెన్స్..!
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, బీఆర్ఎస్లు రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బుధవారం బీజేపీ మెదక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్‌ను ప్రకటించాయి. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధికారికంగా గాలి పేరును ప్రకటించారు. ఎంపీ టికెట్‌ను పలువురు ఆశించినప్పటికీ అధిష్టానం అనిల్‌కుమార్ వైపే మొగ్గుచూపింది. లోక్‌సభ పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే కారణంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్‌ను ప్రకటించిన వెంటనే గాలి అనిల్‌కుమార్.. పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. అయితే.. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కు అవకాశం కల్పించింది. ముందుగా ఊహించినట్లుగానే పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించిన 2 వ జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు రఘునందన్ సాక్షి కి తెలిపారు. అలాగే మెదక్ ఎంపీ స్థానానికి గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి.. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. తొలుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు వినిపించినా పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్‌ను నిర్మల కలిసి తనకు టిక్కెట్ ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు! -
దీనిని సెక్యులరిజం అంటారా?
సాక్షి, హైదరాబాద్: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతి స్తున్నామని బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు చెప్పారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీ ఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. వీరు కుహ నా లౌకిక వాదులుగా ప్రధాని మోదీని విమర్శించడమే కాకుండా బీజేపీకి ఇది చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే వారు మాట్లాడుతున్నారు తప్ప ఆ వర్గాలపై ప్రేమతో మాత్రం కాదని స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణంపై జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే కదా..మరి రామమందిర నిర్మాణం తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. ఒక్కొక్క కేసులో ఒక్కోలా మాట్లాడటం సెక్యులరిజమా అని రఘునందన్ నిలదీశారు. ఆదిలాబాద్‌లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి హత్య జరిగినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. -
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హకీంపేట దగ్గర పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు. రఘునందన్ రావుతో ఫోన్లో మాట్లాడిన ఈటల రాజేందర్.. అక్రమ నిర్భందాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చదవండి: కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా.. బండి మనసులో ఏముంది? -
ఆబిడ్స్ పీఎస్ లో ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు
-
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
సాక్షి, హైదరాబాద్: ఆమ్నేషియా పబ్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్‌లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడేనంటూ రఘునందన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోంమంత్రి పీఏ అమ్మాయిని లోపలికి పంపాడు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఓల్డ్ సిటీకి చెందిన ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు ఇందులో ఉన్నారన్నారు. లైంగిక దాడి కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
నేచురల్స్ విజయం.. ఆ రుచి వెనుక రహస్యం ఇదే
మంచి వ్యాపారి కావాలంటే ఉండాల్సిన అర్హతలు కుటుంబ నేపథ్యం, పెట్టుబడి, మేనేజ్మెంట్ డిగ్రీలు ఇవేమీ అక్కర్లేదనీ నిరూపించాడీ వ్యాపారి. పదో తరగతి పాస్ కావడానికే నానా తంటాలు పడ్డా కామన్ సెన్స్ తో బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడు. సహజత్వాన్ని మరో మెట్టుపైకి చేర్చాడు Naturals Ice Cream Success Story: రఘునందన్ శ్రీనివాస్ కామత్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆయన స్థాపించిన నాచురల్స్ ఐస్‌క్రీం అంటే తెలియని వారు తక్కువ. అక్కడి రుచిని తలచుకుని నోరూరని వారు అరుదు. అమితాబ్ బచ్చన్ నుంచి వివియన్ రిచర్డ్స్ వరకు ఆ ఐస్‌క్రీంకి ఫిదా అయిపోయారు. ఐస్‌క్రీం తింటున్నామా లేక పళ్లు తింటున్నామా అనేంత సహజంగా ఇక్కడ హిమక్రీములు తయారవుతాయి. ఒక్కసారి ఇక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వారు రెండో సారి గుర్తు పెట్టుకుని మరీ తింటారు. ఇంతకీ అంతలా ఆకట్టుకునే ఆ ఐస్‌క్రీం తయారీకి బీజం ఎలా పడింది. మంగళూరు టూ ముంబై కర్నాటకలోని మంగళూరుకి చెందిన శ్రీనివాస్ కామత్ పళ్ల వ్యాపారి. మార్కెట్లో వందల పళ్ల మధ్య పక్వానికి వచ్చి రుచి ఎక్కువగా పండుని ఎంపిక చేయడంలో ఆయన దిట్ట. దీంతో పళ్ల మంగళూరులో పళ్ల వ్యాపారం చేస్తూ భార్య, ఏడుగురు సంతానాన్ని పోషించేవాడు. అయితే పళ్లపై వచ్చే వ్యాపారం సరిపోకపోవడంతో కుటుంబాన్ని ముంబైకి మార్చాడు. అలా తన పదిహేనవ ఏట తల్లిదండ్రులతో కలిసి ముంబైలో అడుగు పెట్టాడు రఘునందన్ శ్రీనివాస్ కామత్. తినుబండారాల షాప్ పళ్ల వ్యాపారం వద్దనుకుని ముంబైలో తినుబండరాల షాప్‌ని ఓపెన్ చేసింది ఆ కుటుంబం. మిగిలిన అక్కడున్న మిగిలిన షాప్‌లని కాదని తమ దగ్గరికే కష్టమర్లు వచ్చేలా చేసేందుకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసేది రఘునందన్ తల్లి ప్రయత్నించేది. అయితే అంత తేలిగ్గా ఆ టేస్టీ ఫుడ్ రెసీపీ దొరికేది కాదు. అయినా ఆమె ప్రయత్నిస్తూనే ఉండేది. ఆమెకు తోడుగా రఘునందన్ వంటింట్లో ఎక్కువ సేపు గడిపేవాడు. వారి ప్రయత్నం ఫలించి రుచికరమైన రెసిపీలతో ఆ షాప్ బాగా నడిచింది. ఆర్థిక ఇబ్బందులు లేని స్థితికి ఆ కుటుంబం చేరుకుంది. దీంతో అక్కడే ఐస్‌క్రీంలు అమ్మడం కూడా ప్రారంభించారు. సొంత ప్రయత్నం ముంబైలోని ఈటెరీ షాప్‌లో ఇంట్లోనే తయారు చేసిన వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్లు అమ్మేవారు. అయితే అన్నతో వచ్చిన విబేధాల కారణంగా ఆ షాప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎవరూ చేయనిది ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఫ్రూట్ ఫ్లేవర్లు అప్పటి వరకు వెనీలా, స్ట్రాబెరీ, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌లే అమ్మేవారు. మ్యాంగో, జామ, ద్రాక్ష ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు ఎందుకు అమ్మకూడదనే ఆలోచన రఘునందన్‌లో కలిగింది. రుచి ఎక్కువగా ఉండే పళ్లను గుర్తించడంలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న నైపుణ్యం, కొత్త రెసిపీలు తయారు చేయడంలో తల్లి నుంచి నేర్చుకున్న మెళకువలు రంగరించి ఫ్రూట్ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేశాడు. ఫస్ట్ స్టోర్ ముంబైలో జనసంచారం ఎక్కువగా ఉండే జూహు రోడ్లో 1984లో కేవలం నాలుగు టేబుళ్లతో నాచురల్స్ ఐస్‌క్రీం స్టోర్‌ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు రెగ్యులర్ ఫ్లేవర్ల తిని మోహం మొత్తిపోయిన జనాలకు ఈ ఫ్రూట్ ఫ్లేవర్లు బాగా నచ్చాయి. అంతే మరుసటి ఏడాదికే విల్లేపార్లేలో మరో స్టోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ముంబైలో ఐస్‌క్రీమ్ అంటే నాచురల్స్ అనే పరిస్థితి మారింది. వివ్ మాటలతో లెజండరీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ హోస్ట్‌గా 1986లో సన్నీడేస్ కార్యక్రమం వచ్చేది. దానికి అతిధిగా వచ్చిన వివ్ రిచర్డ్స్ మాట్లాడుతూ.. తానెప్పుడు ముంబై వచ్చినా నాచురల్స్లో ఐస్‌క్రీమ్స్ తప్పక తింటానని, అక్కడ దొరికే రుచి మరెక్కడా దొరకదంటూ కితాబిచ్చాడు. ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా నాచురల్స్ పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్ నాచురల్స్ ప్రయాణం ప్రారంభైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ ప్రచారంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు రఘునందన్ కామత్ ఖర్చు పెట్టలేదు. అక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వాళ్లే ప్రచారం చేసి పెట్టారు. అందులో వివియన్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ఎందరో ఉన్నారు. అలా నోటిమాట సాయంతోనే ముంబై నుంచి దేశమంతటా నాచురుల్స్ రుచులు విస్తరించాయి. రూ.300 కోట్ల టర్నోవర్ రోడ్డు పక్కన చిన్న తినుబండరాల షాప్ నుంచి ప్రారంభమైన రఘునందన్ శ్రీనివాస్ కామత్ ప్రయాణం రోజు రూ. 300 కోట్ల టర్నోవర్‌కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 135 పైగా ఔట్లెట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు దోస, కోకోనట్, ద్రాక్ష, లిచి, జామ ఒకటేమిటి ఇలా అన్ని రకాల ఫ్లేవరల్లో ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. అదే రహస్యం నాచురల్స్ సక్సెస్ వెనుక ఉన్న రహాస్యం కామన్సెన్స్ అంటారు రఘునందన్ కామత్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ జ్ఙానంతోనే నాచురల్స్ స్థాపించానని చెబుతారు. వాళ్ల నుంచి నేర్చరుకున్న విషయాలనే మరింత సాన పెట్టానంటారు. అందులో కృత్రిమత్వం ఏమీ లేదనే. అందుకే తమ ఐస్‌క్రీమ్‌లు అంత సహాజంగా ఉంటాయంటారు. - సాక్షి, వెబ్‌డెస్క్ -
న్యాయవాదుల హత్య: సీబీఐ విచారణకు డిమాండ్
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాదలు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల దారుణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అడ్వకేట్ జేఏసి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు వామన్‌రావు దంపతులు హత్యకు గురైన ప్రాంతం రామగిరి మండల కల్వచర్ల సందర్శించి పరిశీలించారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన న్యాయవాదులకు ప్రభుత్వం పై నమ్మకం కలగాలంటే వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. వామన్ రావు కుటుంబానికి రక్షణ కల్పించి, ఆర్థిక సహాయం అందిచాలని డిమాండ్ చేశారు. అన్యాయాలపై, భూ కబ్జాలపై పోరాడడమే నేరమా అని ప్రశ్నించారు. హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని, వామన్ రావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు న్యాయవాదులు అంతా గట్టు కుటుంబానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, న్యాయవాదులు తడకపల్లి సుష్మిత, సౌమ్య, సంధ్య, ఆయేషా, రాజేందర్ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసులో మరికొన్ని వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు -
హాట్ టాపిక్‌గా పునర్నవి పోస్ట్; రేపే క్లారిటీ
బిగ్‌బాస్ 3 ఫేమ్, టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చివరికి జరగుతోంది’ అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు షాక్ గురయ్యారు. పునర్నవి రహస్యంగా నిశ్చితార్థ చేసేసుకుందని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతొ కొందరు అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం నిజంగా ఎంగేజ్మెంట్ జరిగిందా.. లేక సినిమా ప్రమోషనా అని అయోమయంలో ఉన్నారు. ఇక ఈ షాక్ నుంచి తేరుకోకముందే పునర్నవి గురువారం మరో పోస్టు చేశారు. ‘అతనికి యెస్ చెప్పాను అని ప్రముఖ యూట్యూబర్ ఉద్భవ్ రఘునందర్ అనే వ్యక్తి ఫోటోను షేర్ చేశారు. అంతేగాక జీవితంలోని గొప్ప రోజు గురించి రేపు (ఆక్టోబర్30) చెబుతానని పేర్కొన్నారు. మరో వైపు రఘునందర్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి ‘ఆమె నాకు అవునని చెప్పింది. రేపు మీకో విషయం చెప్పడానికి ఎంతో ఎదురుచూస్తున్నాను’. అని పేర్కొన్నారు. కాగా ఉద్భవ్ నటుడు, రచయిత, ఫిలిం మేకర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చికాగో సుబ్బారావు పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఇదిలా ఉండగా పునర్నవికి నిజంగా ఎంగేజ్మెంట్ అయ్యిందా అనే సందేహంలో అభిమానులు పిచ్చేక్కిపోతున్నారు. ఎటు తేల్చుకోలేని స్థితిలో అయోమయానికి గురవుతున్నారు. మరి అసలు విషయమెంటో తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. ఏదేమైనా పునర్నవి టాపిక్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.’ View this post on Instagram I had to say yes 🙃 @itsudbhav and I will tell you all about our BIG DAY tomorrow🙈 A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on Oct 29, 2020 at 2:30am PDT @PunarnaviBHU She said yes🕺🏽 Naaaice 😍 Can't wait to tell you all about the big day tomorrow 🌹 pic.twitter.com/Q4MbCqdn0c — Udbhav Raghunandan (@itsudbhav) October 29, 2020 View this post on Instagram Finally! It's happening 🥰❤️ A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on Oct 28, 2020 at 5:03am PDT -
సూర్యగ్రహణం నేడే
న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుంది. భారత్‌లో గుజరాత్లో మొదట గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించనుంది. సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. ► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును. ► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్ ఆఫ్ ఫైర్ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. ► సెంట్రల్ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని చూడొచ్చు. – రఘునందన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా -
రేపు అద్భుత ఖగోళ సంఘటన
సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) అద్భుత ఖగోళ సంఘటన జరగబోతోందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ అన్నారు. పూర్తి స్థాయి వలయాకార సూర్య గ్రహణం జరుగుతుందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుండి మధ్యాహ్నం 3.04 వరకు సూర్య గ్రహణం ఉంటుందని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గ్రహణాన్ని మొదట చూస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. మామూలుగా సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. కానీ రేపు గ్రహణం కారణంగా అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడతాయి. కాబట్టి కరోనా 0.001 శాతం చనిపోయే అవకాశం ఉంది. 100 శాతం అంతం కాదు. తెలంగాణలో సూర్యగ్రహణం రేపు ఉదయం 10.15 గంటల నుండి 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ( 21న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ) ఆంద్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుంది. గ్రహణం సమయంలో తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరు నరబలి ఇవ్వాలని చూస్తుంటారు. గతంలో హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని కూడా నరబలి ఇచ్చారు. అవన్నీ మూఢనమ్మకాలు అలాంటి వాటిని నమ్మకూడదు. సూర్యుని ద్వారా కరోనా వచ్చింది అని ప్రచారం జరుగుతుంది. రేపటి గ్రహణంతో కరోనా అంతం అవుతుందని అంటున్నారు. అది అవాస్తవం’’ అని తెలిపారు. -
నేడు సూర్యుడికి సమీపంగా భూమి..
సాక్షి హైదరాబాద్: అంతరిక్షంలో మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం సూర్యుడికి భూమి సమీపంగా చేరబోతుంది. ఖగోళ పరిభాషలో సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్ అని పిలుస్తుంటారు. గురువారం జరిగే ఈ వింతను పెరిహిలియన్‌గా పిలువనున్నారు. సూర్యుడికి భూమి దగ్గరగా, దూరంగా వెళ్లే ప్రక్రియ ఏటా రెండు మార్లు చోటు చేసుకుంటోంది. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. ఈ గమనంలో ఒకసారి సూర్యుడికి సమీపంగా, మరోసారి సూర్యుడికి దూరంగా వెళుతుంది. జనవరి 3న భూమి సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ప్రతి ఏటా ఈ వింత చోటు చేసుకుం టోంది. అయితే జీవుల కంటికి నేరుగా కనిపించని ఈ ఘటన ఖగోళపరంగా చాలా ముఖ్యమైంది. దీని వల్ల వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ముఖ్యమైన ఒక అంశాన్ని బోధించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు అపోహే.. సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వలన వాతావరణ మార్పులు వస్తాయనేది అపోహ మాత్రమే అనే విషయాన్ని ఈ ఖగోళ ఘటన ద్వారా రూఢీ చేసుకోవచ్చని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ తెలిపారు. ‘ఈ ఘటనలో భూమి సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పటికీ మనతో సహా ఉత్తర ధృవంలోనూ చలికాలమే కొనసాగుతోంది. జూలైలో భూమి సూర్యుడికి దూరంగా వెళ్లే ఘటన చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో మనకు వేసవికాలం. కాబట్టి సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వల్ల రుతువులు ఏర్పడతాయని, లేదా వాతావరణ మార్పులు కలుగుతాయనేది అవాస్తవం. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు భూమి వాలే తీరును బట్టి కాలాలు, రుతువులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఈ ఘటనను వారికి చూపించవచ్చు’అని రఘునందన్ పేర్కొన్నారు. పది రోజులు ఉల్కలు.. జనవరి 12 వరకు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఉల్కలను చూసే అవకాశం ఉందని, ముఖ్యంగా 4వ తేదీ నాడు ఈ అవకాశం మరింత ఎక్కువగా ఉందని రఘునందన్ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి, తూర్పు, ఈశాన్య దిశల్లో రాలే చుక్కల (ఉల్క)ను చూడవచ్చని చెప్పారు. -
శాన్వీ ఆత్మకు శాంతి!
చిన్నారితోపాటు నానమ్మ హత్యకేసు తీర్పుపై స్వగ్రామంలో హర్షం రఘునందన్‌కు ఉరి ‘అకలిగొన్నవారి మొఖం చూడలేకపోయేది సత్యవతి. గ్రామంలో ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసేది. మా గ్రామంలో అలాంటివారు ఇంకా పుట్టరు కూడా. బంగారం లాంటి కాపురం.. సత్యవతి మృతితోనే నాశనం అయింది. చిట్టిపొట్టి చిన్నారి శాన్విని కూడా పొట్టనపెట్టుకున్నాడు. అందుకే ఆ రఘు ఇప్పుడు శిక్ష అనుభవించాడు’ ఈ మాటలు ఇప్పుడు కుడుములకుంటలో వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా : శాన్వి ఆత్మకు శాంతి లభించింది.. ఆమె నాన్నమ్మకు కూడా! అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని.. నేరస్తులు తప్పించుకోలేరని హంతకుడు రఘునందన్‌కు విధించిన మరణశిక్షతో తేలింది. అమెరికాలో 2012లో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ వెన్న సత్యవతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సత్యవతి స్వగ్రామం అయిన హనుమంతునిపాడు మండలం కుడుముల కుంట వాస్తవ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నాభిన్నం అయిన కుటుంబం.. సత్యవతి భర్త వెన్నా కొండారెడ్డి చాలా కాలం గ్రామంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడంలేదు. వచ్చిన రోజు అన్నం వండుకొని.. కూరలను కనిగిరి నుంచి తెచ్చుకుని మళ్లీ కనపడకుండా వెళ్లిపోతారు. ఇద్దరు కుమారులు అమెరికా లోనే ఉన్నారు. కుమార్తె సుజాత గుంటూరులో ఉంటోంది. సత్యవతి లోకం విడిచాక ఇక్కడి ఇంటిలో దీపం వెలిగించేవారు లేకుండా పోయారు. ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. అందరి తలలో నాల్కలా ఉన్న సత్యవతి మరణాన్ని గ్రామస్తులు ఇప్పటికీ మరచిపోలేదు. వారి నిమ్మ తోటలు, ఆస్తిపాస్తులు అన్నీ నాశనం అయ్యాయి. నిందితునికి సరైన శిక్ష పడిందని అంతా అంటున్నారు. సత్యవతి ఇంటిలో దీపం పెట్టేవారే లేరు: చిన్నారి శాన్విని చూసుకోనేందుకు కుమారుడు ప్రసాదు రెడ్డి వద్దకు సత్యవతి వెళ్లింది. ఫోను చేసి గ్రామంలో అందరి కష్ట సుఖాలను తెలుసుకొనేది. ఆమె మరణంతో ఇంటిలో దీపం వెలిగించే వారు లేకుండా పోయారు. కొండారెడ్డి..కుమారులు, కుమార్తె వద్ద కాలం కడుపుతున్నాడు. – సానికొమ్ము వెంకటసుబ్బమ్మ ఎప్పుడో ఉరి శిక్ష వేసి ఉండాల్సింది: డబ్బుకు ఆశపడి చిన్నారి శాన్విని, నానామ్మ వెన్నా సత్యవతిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకుడు రఘునందన్‌కు వెంటనే ఉరివేసి ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మరణ శిక్షను విధించి మంచి పని చేసింది. – వీరాచారి -
బౌరంపేట గ్రామ కార్యదర్శిపై వేటు
అక్రమ నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో అక్రమాలకు పాల్పడిన కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బౌరంపేట గ్రామ పంచాయతీలో ధర్మగడ్డ ఉష ఐదేళ్లుగా కార్యదర్శిగా పని చేస్తోంది. బౌరంపేట గ్రామం ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉండడంతో భూములకు రెక్కలొచ్చాయి. అక్రమ లే అవుట్లు, వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కార్యదర్శిగా ఉన్న ఉష సదరు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని గతంలో వార్డు సభ్యులతో పాటు పలువురు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో కార్యదర్శి ఉష అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో సోమవారం కలెక్టర్ రఘునందన్ రావు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాచుపల్లి కార్యదర్శి సుధాకర్‌ను ఇన్చార్జి కార్యదర్శిగా నియమించినట్లు కుత్బుల్లాపూర్ మండల ఈఓపీఆర్డీ మల్లారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం
కాటేదాన్, న్యూస్‌లైన్: అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక. ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినిలతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొందించారు. అయితే పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకువచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. కాగా భావితరాలకు మార్గదర్శకాన్ని చూపిం చేందుకు ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు. -
రాజుకుంటోంది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గుర్తించేందుకు అధికార పార్టీ పరిశీలకులు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. వీరు మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలో మకాం వేస్తుండటంతో ‘బయోడేటా’లతో ఔత్సాహిక నేతలు సిద్ధమవుతున్నారు. అయితే జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ నేతలు విజ్ఞాపనలు సమర్పించనున్నారు. మహారాష్ట్రకు చెందిన శాసన సభ్యులు గడ్డం ఆనందరావు, బస్వరాజ్ పాటిల్‌లు సభ్యులుగా ఉన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనుంది. ఈ ఇద్దరు నేతలు సంగారెడ్డి ఐబీ అతిథిగృహం కేంద్రంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేతల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలకులు వినతులు స్వీకరించేలా షెడ్యూలు సిద్ధం చేసినట్లు సమాచారం. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు ఆనందరావు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానాలకు బస్వరాజ్ పాటిల్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఔత్సాహిక అభ్యర్థులు పరిశీలకులను కలిసి తమ బలాబలాలు, తాము ఏ రకంగా అర్హులమో వివరించే అవకాశం ఉంది. తమ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పరిశీలకులు హైదరాబాద్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరిశీలకులు సమర్పించే నివేదిక ఆధారంగా ఫిబ్రవరి పదో తేదీలోగా అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సుమారు మూడు నెలల క్రితం ఏఐసీసీ పరిశీలకుడు అమర్ కాలే జిల్లాకు వచ్చిన ఔత్సాహిక నేతల నుంచి విజ్ఞాపనలు స్వీకరించిన విషయం తెలిసిందే. సిట్టింగులున్నా పోటాపోటీ ప్రస్తుతం జహీరాబాద్ లోక్‌సభ స్థానంతో పాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మెదక్‌లో టీడీపీ, సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి ఇతరులకు అవకాశం ఇవ్వడం కష్టమే అయినా తమ వంతు ప్రయత్నాలు చేసేందుకు కొందరు నేతలు సన్నద్ధమవుతున్నారు. మెదక్, సిద్దిపేటతో పాటు పటాన్చెరు, దుబ్బాకలో ఈ రకమైన ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీసీ కోటాలో నందీశ్వర్కే మరోమారు అవకాశం ఖాయమనే ప్రచారం వినిపిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి భవిష్యత్ ప్రణాళికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుబ్బాకలో ముత్యంరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఇతర నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసే యోచనలో ఉన్నారు. దుబ్బాక విషయంలో తనకు పార్టీ అధిష్టానం నుంచి అనుకూలత ఉందనే ధీమాలో రఘునందన్ రావు ఉన్నారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మరోమారు టికెట్ ఆశిస్తున్నా పీసీసీ సభ్యుడు సుప్రభాతరావు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా భూపాల్? జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ సురేశ్ షెట్కార్ అభ్యర్థిత్వంపై ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన నరేంద్రనాథ్ పార్టీని వీడటంతో...డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి పార్టీలో అంతర్గత మద్దతు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నేతలంతా పరిశీలకుల ఎదుట వాదన వినిపించేందుకు, బల ప్రదర్శన జరిపేందుకు మద్దతుదారులను సమీకరించుకుంటుండటంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
మద్యం మత్తులో దేవస్థానం ఉద్యోగి..
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చెందిన ఉద్యోగి ఒకరు మద్యం మత్తులో ఉండగా ఆలయ ఈఓ గురువారం రాత్రి గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతిని కల్పించే సీఆర్ఓ కార్యాలయానికి పక్కనే ఉన్న సౌమిత్రి సదనంలో రమేష్ అలియాస్ బాబా అనే ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం సదనంలోని గదుల్లో బెడ్‌షీట్స్ సరిగా లేవని, వాటిన మార్చాలని భక్తులు పలుమార్లు కోరినా ఆ ఉద్యోగి స్పందించలేదు. దీంతో వారు ఆలయ ఈఓ రఘునాధ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈఓ హుటాహుటీన సత్రానికి వచ్చి పరిశీలించగా ఆ ఉద్యోగి ఓ గదిలో మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఈఓ ఆ ఉద్యోగిని మెడికల్టెస్ట్ల కోసం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని దేవస్థాన పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో అదే గదిలో మద్యం సీసాలు కూడా దొరికినట్లు సమాచారం. కొరవడిన అధికారుల పర్యవేక్షణ..... దేవస్థానానికి చెందిన సత్రాలు, కాటేజీలపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఈ సంఘటనతో మరోసారి నిరూపితమైంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ గురువారం సాక్షాత్తు దేవస్థాన ఉద్యోగే మద్యం మత్తులో ఈవోకు పట్టుబడటం గమనార్హం. ఇటీవలే కళ్యాణ మండపానికి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణాలయానికి చెందిన అద్దె గదులలో ప్రైవేటు ఉద్యోగులు మద్యం సేవిస్తూ దసరా రోజున స్థానికులకు పట్టుబడ్డారు. ఇటువంటి సంఘటనలతో పాటు గుట్టపై నున్న సత్రాలతో పాటు, దేవస్థాన గదులలో అసాంఘిక కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయని సమాచారం. వీటిపై గతంలో ఫిర్యాదులు చేసినా దేవస్థాన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఇటువంటి పనులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ ఈఓ, అధికారులు దేవస్థాన సత్రాలపై నిఘాను పెంచి భరోసా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
రఘునందన్కాంగ్రెస్ గూటికి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.రఘునందన్‌రావు మంగళవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీ కండువా కప్పి రఘునందన్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ మాఘం రంగారెడ్డి మధ్యవర్తిత్వంతో రఘునందన్‌రావు కాంగ్రెస్‌లో చేరినట్టు సమాచారం. జిల్లాకు చెందిన మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని రఘునందన్‌రావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరా ఇద్దరు నేతలు అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో చేరిన తరువాత రఘునందన్‌రావు ఢిల్లీ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన మేరకు పార్టీ జెండాలు పక్కన పెట్టి ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ చేతులను బలోపేతం చేయాలని కేసీఆర్ గతంలోనే అన్నారని ఆయన గుర్తుచేశారు. అందులో భాగంగానే తాను కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు. విజయశాంతి చేరికపై నిరసన గళం.. టీఆర్ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీలో నిరసన గళం వినిపిస్తోంది. విజయశాంతి పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కీలక నేతలు మంగళవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తుందని దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేసేం దుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఒకటి,రెండు రోజుల్లో ఇదే అంశంపై దిగ్విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతామని కాంగ్రెస్ కీలక నేత ఒకరు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరికపై సోమవారం దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయిన విజయశాంతి మంగళవారం ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీని కూడా కలిశారు. రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రుల్లో నెలకొన్న అపోహలు, భయాలు, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మొయిలీకి విజయశాంతి నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. -
కాంగ్రెస్‌లో చేరిన విజయరామారావు, రఘునందన్
న్యూఢిల్లీ: టిఆర్ఎస్కు రాజీనామా చేసిన గుండె విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ఆ పార్టీ నుంచి సస్పెండయిన రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దిగ్విజయ్ సింగ్ వారి భుజాలపై పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్కు రాజీనామ చేసిన రోజునే చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురితోపాటు మెదక్ ఎంపి విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి ఓ పక్క ఏఐసిసి అధ్యక్షురాలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఆమె వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్‌లను కలిశారు. ఈ నేపధ్యంలో ముందుగా వీరు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.