సాక్షి, హైదరాబాద్: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతి స్తున్నామని బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు చెప్పారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీ ఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. వీరు కుహ నా లౌకిక వాదులుగా ప్రధాని మోదీని విమర్శించడమే కాకుండా బీజేపీకి ఇది చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే వారు మాట్లాడుతున్నారు తప్ప ఆ వర్గాలపై ప్రేమతో మాత్రం కాదని స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణంపై జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే కదా..మరి రామమందిర నిర్మాణం తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. ఒక్కొక్క కేసులో ఒక్కోలా మాట్లాడటం సెక్యులరిజమా అని రఘునందన్ నిలదీశారు. ఆదిలాబాద్‌లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి హత్య జరిగినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment