Bilkis Bano Case
-
కఠిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోం
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్, కుటుంబసభ్యుల హత్య కేసు దోషుల మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు(రెమిషన్) చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ గత తీర్పులో తాము చేసిన పరుష వ్యాఖ్యలను తొలగించబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. కోర్టు వ్యాఖ్యానాల తొలగింపు అంశాన్ని పునర్సమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ రివ్యూ పిటిషన్లో ఎలాంటి పస లేదు. గతంలో తీర్పు సందర్భంగా మేం చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ కోణంలో గత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదు’’ అని కోర్టు స్పష్టంచేసింది. దోషులు రెమిషన్‌పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్‌కు ఉంటుందని 2022 మేలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ చెప్పడంతోనే తాము తుది నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ ప్రభుత్వం వాదించింది. అయితే మహారాష్ట్రలోని సీబీఐ కోర్టులో కేసు విచారణ జరిగినందున రెమిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని గుజరాత్ బలవంతంగా లాక్కుందని, తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం తెల్సిందే. 11 మంది దోషుల రెమిషన్‌ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గోధ్రాలో రైలు దహనం ఉదంతం తర్వాత 2002లో గుజరాత్లో ముస్లింలపై దాడుల సందర్భంగా ఐదునెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోను రేప్ చేసి, ఆమె మూడు నెలల కూతురుసహా ఏడుగురు కుటుంబసభ్యులను ఈ 11 మంది చంపేయడం తెల్సిందే. -
గుజరాత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలకు సంబంధించిన తమ(సుప్రీం) ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించిందికాగా 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపినందుకు దోషులుగా ఉన్న 11 మందిని ముందస్తుగా విడుదల చేయడంపై గత జనవరిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దోషుల శిక్షాకాలం ముగియకముందే ‘సత్ప్రవర్తన’ కారణంగా గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మండిపడింది. 11 దోషులందరూ వెంటనే జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.ఈ విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు పలు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని తెలిపింది. గుజరాత్ సర్కార్ దోషులతో కుమ్మకైందని,అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను తొలగించాలని గుజరాత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.సుప్రీం వ్యాఖ్యలు సరికాదని, కేసు రికార్డుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై పక్షపాతంతో వ్యవహరించారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది -
బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్‌దాస్ షా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు. ‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ను కూడా కోరారు. -
బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులు రాధేశైమ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రెమిషన్(శిక్ష తగ్గింపు) పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వాళ్ల అభ్యర్థనను తిరస్కరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో పెద్దఎత్తున మతపరమైన అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.... 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషుల్ని జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తీర్పును సవాలు చేస్తూ భగవాన్‌దాస్, బాబూలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా తమ రిమిషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు తాత్కాలికంగా తమను విడుదల చేయాలని, ఇందుకోసం బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్ చేస్తారని ప్రశ్నించింది. దీంతో.. ఇద్దరు పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది. -
మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ ఎక్కడుంది?
కోల్‌కతా: ‘సందేశ్‌ఖాలీ’ తుపాను ధాటికి పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని, నారీశక్తి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గద్దె దింపుతుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీటైన జవాబిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం తమదేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే గురువారం కోల్‌కతాలో ‘మహిళా హక్కులే మాకు ముఖ్యం’ పేరిట చేపట్టిన పాదయాత్రలో మమత ముందు నడిచారు. ఆమెను వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై మమత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ సందేశ్‌ఖాలీపై బీజేపీ దేశానికి తప్పుడు సందేశాలు పంపుతోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదంటూ నిన్న ఇక్కడికొచ్చి లెక్చర్లు దంచేసిన మోదీ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలు అకృత్యాలకు బలైనప్పుడు ఎందుకు మౌనం వహించారు?’’ అని నిలదీశారు. ‘‘మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినపుడు ఈ బీజేపీ ఏం చేసింది?. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో అత్యాచారం చేసి మృతదేహాన్ని బలవంతంగా తగలబెడితే బీజేపీ సర్కార్ ఏం చేసింది?. గుజరాత్లో సర్వం కోల్పోయిన బిల్కిస్ బానోకు దక్కిన న్యాయమెంత?’’ అని ప్రశ్నించారు. ‘నిజానికి దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం బెంగాల్’ అని ప్రకటించారు. ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం గురువారం బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌నూ మమత విమర్శించారు. ‘‘ తన తీర్పుల ద్వారా బెంగాల్లో వేలాది మంది యువత నుంచి ఉద్యోగాలు లాక్కున్నారు. వారు మిమ్మల్ని క్షమించరు. మీ తీర్పుల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా సరే మిమ్మల్ని ఓడించి తీరతాం’ అని అన్నారు. ‘‘ పింటూ బాబు(బీజేపీ) ఆగ్రహంతో ఊగిపోయినా సరే బెంగాల్లో మీ విభజన రాజకీయాలు నడవనివ్వను. బెంగాల్‌కు 450కిపైగా బృందాలను పంపిన పింటూ బాబు.. మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన మణిపూర్‌కు ఒక్క బృందాన్ని కూడా పంపలేదు’ అని మమత గుర్తుచేశారు. ‘బీజేపీపాలిత యూపీలో మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్‌లో మహిళలు రేప్‌కు గురై, అగి్నకి ఆహుతైన ఉదంతంలో అక్కడి బీజేపీ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలి’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ సందేశ్‌ఖాలీ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందే. టీఎంసీ కార్యకర్తలు బాధ్యుతులుగా తేలితే అరెస్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడను’ అని ఆమె స్పష్టంచేశారు. పాదయాత్రలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన 200కుపైగా మహిళలు పాల్గొన్నారు. -
‘బిల్కిస్’ దోషులు జైలుకు
గోధ్రా: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు గుజరాత్‌లోని గోధ్రా సబ్ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం దోషులందరూ జనవరి 21వ తేదీ అర్ధరాత్రి జైలుకు వచ్చినట్లు స్థానిక క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ ధ్రువీకరించారు. 2002లో గుజరాత్లో మత కలహాల సమయంలో బిల్కిస్ బానో అనే అయిదు నెలల గర్భవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అయితే, 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వీరిని సత్ప్రవర్తన కలిగిన వారిగా పేర్కొంటూ 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయంలేదని పేర్కొంది. దోషులు ఆదివారం నాటికి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే.. -
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?
బిల్కిస్ బానో కేసులో ఖైదీల క్షమాభిక్ష చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దోషులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ సర్కార్‌కు లేదని స్పష్టం చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థ మీద ఆశలు చిగురించాయి దేశవ్యాప్తంగా సంచనల రేపిన ఈ తీర్పు బాధితురాలితోపాటు, సామాజిక కార్యకర్తలు మహిళాసంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు ఊరటనిచ్చింది. మరోవైపు పలువురి పోరాటం,మద్దతు,మీడియా సాధించిన విజయని బిల్కిస్ బానో తరపున పిటీషన్ దాఖలు చేసిన వారు పేర్కొన్నారు. న్యాయం వ్యవస్థపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని రూప్‌రేఖా వర్మ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మహిళలు నిరాశ పడకుండా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చిందన్నారు. ఈ కేసులో సర్ఫరోషి ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, కమ్యూనిస్ట్ నాయకురాలు మాజీ ఎంపీ సుభాషిణి అలీ, బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ కూడా ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కేసులో ఆదినుంచీ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన బిల్కిస్ బానో, గుజరాత్ కోర్టు తీర్పు తరువాత ఏ మాత్రం ధ్యైర్యాన్ని కోల్పోకుండా, నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు గడప తొక్కిన వైనం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. వీరితో పాటు మరోపేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవ్వరో కాదు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ బీవీ నాగరత్న. ఇంతకీ ఎవరీ నాగరత్న? ఎవరీ జస్టిస్ బీవీ నాగరత్న బిల్కిస్ బానో రేపిస్టులను మళ్లీ జైలుకు పంపిన ఎస్సీ జడ్జి బీవీ నాగరత్న ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసిన రిమిషన్ ఉత్తర్వులను రద్దు చేసిన సుప్రీం న్యాయమూర్తి బీవీ నాగరత్న దోషులు రెండు వారాల్లో లొంగి పొవాలంటూ ఆదేశాలిచ్చి సంచలనం రేపారు. 1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ బెంగుళూరు వెంకటరామయ్య నాగరత్న ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. దివంగత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె.కర్ణాటకకు చెందిన తొలి సుప్రీం న్యాయమూర్తి కూడా. మాండ్య జిల్లా, ఎంగలగుప్పె చత్ర గ్రామానికి చెందిన నాగరత్న న్యూఢిల్లీలోని భారతీయ విద్యాభవన్‌లో విద్యను అభ్యసించారు.1984లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాల నుండి BA హిస్టరీ పట్టా తీసుకున్నారు. 1987లో న్యాయ పట్టా పొందారు. న్యాయవాద వృత్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 28, 1987న కర్ణాటక బార్ కౌన్సిల్లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. రాజ్యాంగ, వాణిజ్య, బీమా, సేవ, పరిపాలనా మరియు ప్రజా చట్టం, భూమి మరియు అద్దె చట్టాలు, కుటుంబ చట్టం మరియు మధ్యవర్తిత్వంలో నిపుణత సాధించారు. ఫిబ్రవరి 18, 2008న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగాను, ఫిబ్రవరి 17, 2010న శాశ్వత న్యాయమూర్తిగాను నియమితులయ్యారు. అనంతరం 2021 ఆగస్టులో భారత సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. జస్టిస్ నాగరత్న2027, సెప్టెంబరులో కేవలం 36 రోజుల వ్యవధిలో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (CJI) కావాల్సి ఉంది. కీలక తీర్పులు కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి పలు కీలక తీర్పులను వెలువరించిన నాగరత్నం 2012లో ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ఆమెకే దక్కింది. నోట్ల రుద్దు చట్ట విరుద్ధం: ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నోట్ల రద్దుపై ఆమె అభిప్రాయాలు ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అత్యంత ప్రముఖమైనదిగా పేరొంది. 2016 నవంబరు నాటి నోట్ల రద్దు నిర్ణయంపై, సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు డీమానిటైజేషన్ సమర్థించగా మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా జస్టిస్ నాగరత్న అది సదుద్దేశంతో కూడుకున్నదే కానీ చట్టవిరుద్ధని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడం కంటే దానిని అమలు చేయడానికి శాసన ప్రక్రియను అనుసరించాల్సి ఉందని చెప్పారు. 2019 తీర్పులో, జస్టిస్ నాగరత్న దేవాలయం వాణిజ్య సంస్థ కాదంటూ మరోసాహసోపేత తీర్పును వెలువరించారు. దాని ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులు కాదని, అయితే కర్ణాటక హిందూ మతపరమైన సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా చట్టం ప్రకారం ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. కర్నాటక హైకోర్టులో 2021లో పోక్సో చట్టంపై ఇచ్చిన తీర్పు గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 35లో పేర్కొన్న ఆదేశాన్ని పూర్తి కాని పక్షంలో నిందితులకు బెయిల్‌పై హక్కు ఉండదని జస్టిస్‌లు బీవీ నాగరత్న , ఎంజి ఉమతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అంటే కేసును మొదట గుర్తించినప్పటి నుండి ఒక సంవత్సరంలోపు విచారణను ముగించాలి. పిల్లల ప్రమేయం ఉన్నట్లయితే, నేరాన్ని అంగీకరించిన 30 రోజులలోపు కోర్టు వారి సాక్ష్యాలను నమోదు చేయాలి. ఏవైనా జాప్యాలు జరిగితే వాటిని వ్రాతపూర్వకంగా రికార్డు చేయాలని కూడా స్పష్టం చేశారు. బిల్కిస్ బానో కేసు 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సమయంలో బిల్కిస్ బానోపై ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలు నమోదైనాయి. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తరువాత ఈ తీర్పుపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షగా మారింది. అయితే గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున సత్ ప్రవర్తన, 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారంటూ క్షమాభిక్షపేరుతో విడుదల చేసింది. దీంతో దిగ్భాంతికి గురైన బిల్కిస్ బానో తిరిగి సుప్రీను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఈక్రమంలో జస్టిస్ నాగరత్న గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. దోషుల క్షమాభిక్షను రద్దు చేశారు. -
దీనిని సెక్యులరిజం అంటారా?
సాక్షి, హైదరాబాద్: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతి స్తున్నామని బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు చెప్పారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీ ఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. వీరు కుహ నా లౌకిక వాదులుగా ప్రధాని మోదీని విమర్శించడమే కాకుండా బీజేపీకి ఇది చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే వారు మాట్లాడుతున్నారు తప్ప ఆ వర్గాలపై ప్రేమతో మాత్రం కాదని స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణంపై జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టే కదా..మరి రామమందిర నిర్మాణం తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు. ఒక్కొక్క కేసులో ఒక్కోలా మాట్లాడటం సెక్యులరిజమా అని రఘునందన్ నిలదీశారు. ఆదిలాబాద్‌లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి హత్య జరిగినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. -
‘బిల్కిస్’ దోషులకు... శిక్ష తగ్గింపు చెల్లదు
న్యూఢిల్లీ/దాహోద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆమెపై అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో 11 మంది దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. వారు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు 251 పేజీల తీర్పు వెలువరించింది. ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారమెలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మత విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని స్పష్టం చేసింది. ‘‘శిక్ష తగ్గింపు (రెమిషన్) గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయం. ఈ విషయంలో దోషులతో ప్రభుత్వం పూర్తిగా కుమ్మక్కైంది. వారి విడుదల కోసం అన్నివిధాలా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అంటూ కడిగి పారేసింది. ‘‘సుప్రీంకోర్టులో రెమిషన్ పిటిషన్ సందర్భంగా దోషులు ఈ కేసులో వాస్తవాలను దాచారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చారు. తద్వారా రెమిషన్‌పై పరిశీలనకు ఆదేశాలు పొందారు’’ అంటూ ఆక్షేపించింది. ఆ తీర్పు కూడా చెల్లుబాటు కాబోదని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును బాధితురాలితో పాటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. బానో స్వస్థలంలో ఆమె బంధుమిత్రులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలుకు వెళ్లిన అనంతరం రెమిషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం దోషులకు ఉంది. గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు గుజరాత్లో 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగడం తెలిసిందే. ఆ సందర్భంగా మిగతా బిల్కిన్ బానో ఉదంతం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్‌పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2008లో తీర్పు వెలువరించింది. దీన్ని బాంబే హైకోర్టు కూడా సమరి్థంచింది. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు 2022 మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని సిఫార్సు ఆధారంగా మొత్తం 11 మందికీ రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ తీవ్ర ఆవేదన వెలిబుచి్చంది. రాజకీయ పారీ్టలతో పాటు అన్న విర్గాలూ వారి విడుదలను తీవ్రంగా తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వ చర్యపై దేశమంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి విడుదలను సుప్రీంకోర్టులో బిల్కిస్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 11 రోజుల వాదనల అనంతరం 2023 అక్టోబర్ 12న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రెమిషన్‌ను కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ జరిగి దోషులకు శిక్ష పడింది మహారాష్ట్రలో గనుక వారికి రెమిషన్ ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష తగ్గించిందంటూ తప్పుబట్టింది. రెమిషన్ నిర్ణయాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క ప్రాతిపదికే చాలని పేర్కొంది. ‘‘2022లో సుప్రీంకోర్టుకు వెళ్లిన నిందితులు కేసులో వాస్తవాలను దాచి ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించి పునఃసమీక్షకు తీర్పును పొందారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా వారితో కుమ్మకైంది’’ అంటూ ఆక్షేపించింది. ‘‘రెమిషన్ కోసం దోషుల్లో ఒకరు 2019లోనే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందిగా సూచించింది. 2020లోనూ మరో పిటిషన్ పెట్టుకున్నా కొట్టేసింది. దాంతో దోషి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. రెమిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐతో పాటు సీబీఐ ప్రత్యేక జడ్జి కూడా సిఫార్సు చేశారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు’’ అంటూ మండిపడింది. రెమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ బానో నేరుగా సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఆరి్టకల్ 32 ప్రకారం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘శిక్ష విధించాల్సింది ప్రతీకార దృష్టితో కాదు. నేరం పునరావృతం కాకుండా చూసేందుకు. దాంతోపాటు దోషుల్లో మార్పు తెచ్చేందుకు’’ అన్న గ్రీకు తత్వవేత్త ప్లేటో సూక్తిని జస్టిస్ నాగరత్న ప్రస్తావించారు. శిక్ష తగ్గింపు నిర్ణయానికి కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దోషుల హక్కులతో పాటు బాధితుల హక్కులనూ పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. బాక్సు తీర్పుపై స్పందనలు... ‘‘బానో అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్యాయంపై, బీజేపీ సర్కారు అహంకారంపై ఆమె సాధించిన విజయమిది. ఎన్నికల లబ్ధి కోసం నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్నదెవరో, న్యాయానికి పాతరేస్తున్నదెవరో సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఇది సాహసోపేతమైన తీర్పు. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు’’ – తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘బానోకు కేంద్రం తక్షణం క్షమాపణలు చెప్పాలి’’ – మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘‘మహిళలపై జరిగే అన్యాయాలను జాతి సహించబోదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది’’ – బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత -
క్షమాభిక్ష రద్దు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు
-
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బివి నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. బిల్కిస్ బానో పిటిషన్ విచారణకు అర్హత ఉందని పేర్కొంది. రెండు వారాల్లోగా లొంగిపోయి జైలుకు వెళ్లాలని దోషులను కోరింది. కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష కల్పించడాన్ని బాధితురాలు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. అటువంటి ఉత్తర్వులను జారీ చేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఎందుకంటే విచారణ మహారాష్ట్రలోనే జరిగిందని గుర్తుచేసింది. "అపరాధికి శిక్ష పడిన రాష్ట్ర (మహారాష్ట్ర) ప్రభుత్వానికే ఉపశమనాన్ని మంజూరు చేయడానికి తగిన అర్హత ఉంటుంది." అని తీర్పు వెలువరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. Bilkis Bano case: Supreme Court quashes remission order of Gujarat government Read @ANI Story | https://t.co/4K2Lx1nqbE#BilkisBanocase #SupremeCourt #GujaratGovernment pic.twitter.com/bahrsYnBOs — ANI Digital (@ani_digital) January 8, 2024 గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. దీనిని బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు -
బిల్కిస్ బానో కేసు.. రేపు సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురి దారుణహత్య ఘటనల్లో దోషులకు శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెలువరించనుంది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పిటిషన్లపై 11 రోజులపాటు వాదనలను వింది. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు గత ఏడాది అక్టోబర్ 12న ప్రకటించింది. అక్టోబర్ 16వ తేదీ కల్లా శిక్ష తగ్గింపు నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను తమ ముందు ఉంచాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులకు శిక్షను తగ్గించి, 2022 ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
అది మాకు తెలుసు.. లూథ్రాతో సుప్రీం ధర్మాసనం
ఢిల్లీ: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను సుప్రీం కోర్టు ధర్మాసనం సున్నితంగా మందలించింది. బిల్కిస్ బానో కేసులో దోషుల్లో ఒకరి తరపున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయగా.. జోక్యం చేసుకున్న బెంచ్ ‘కొంతమంది దోషులకు ఎక్కువ ప్రయోజనాలు’ ఉంటుంటాయని వ్యాఖ్యలు చేసింది. గురువారం సుప్రీం కోర్టులో లూథ్రా వాదిస్తూ.. యావజ్జీవ శిక్ష పడినవారిలో పరివర్తన, పునరావాసం కోసం క్షమాభిక్ష ప్రసాదించడమనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్నదేనని, హేయమైన నేరం దృష్ట్యా అలా చేయడం కుదరదని బిల్కిస్‌బానో తదితరులు వాదించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి నిర్ణయం వెలువడినందువల్ల ఇప్పుడు దానిని రద్దు చేయలేమని చెప్పారు. ఇంతలో బెంచ్ కలగజేసుకుని.. ‘క్షమాభిక్ష విధానం గురించి మాకు తెలుసు. అది అందరూ ఆమోదించినదే. ఇక్కడ బాధితురాలు, ఇతరులు ప్రస్తుత కేసుకు దీనిని వర్తింపజేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసుల్లో వెలువడిన తీర్పులను న్యాయస్థానానికి సమర్పించడంలో మాత్రమే సహకరించండి’ అని తెలిపింది. ఇక లూథ్రా వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. గుజరాత్ గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు కొందరి చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో వాళ్లందరికీ జీవిత ఖైదు పడింది. అయితే.. రెమిషన్ కింద పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి కిందటి ఏడాది విడుదల చేసింది. ఈ విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ప్రస్తుతం పిటిషన్‌ను విచారిస్తోంది. దోషుల్లో ఒకడైన రమేశ్ రూపాభాయ్ చందానా తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. రెమిషన్‌పై దోషుల్ని విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీం పలుమార్లు వివరణ కోరగా.. కచ్చితమైన వివరాలతో కూడిన నివేదికను మాత్రం ఇప్పటిదాకా ప్రభుత్వం అందించకపోవడం గమనార్హం. -
‘బిల్కిస్ బానో దోషుల్ని ఎలా రిలీజ్ చేస్తారు?’
ఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఇవాళ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషుల్ని ఎలా విడుదల చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది సుప్రీంకోర్టు. 2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబాన్ని ఊచ కోత కోశారు కొందరు. అయితే ఈ కేసుకు సంబంధించిన 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కలిపి ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటప్పుడు 14 ఏళ్ల శిక్షాకాలం ముగియగానే వాళ్లను ఎలా విడుదల చేశారు?. ఇతర ఖైదీలను అలాంటి ఉపశమనం ఎందుకు ఇవ్వలేకపోయారు?. సత్ప్రవర్తన వీళ్లు మాత్రమే కనబర్చారా?.. ప్రత్యేకించి ఈ కేసులోనే దోషుల్ని విడుదల చేయడంలో అంతర్యం ఏంటి? అని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. బిల్కిస్ దోషుల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం అందించాలని కోర్టు ఆదేశించింది. గోద్రా కోర్టులో విచారణ జరగకున్నా.. అభిప్రాయాన్ని ఎందుకు కోరారని కూడా ప్రశ్నించింది. అయితే ప్రశ్నలకు వివరణ కష్టతరమని, సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. దోషుల చట్టప్రకారమే విడుదల జరిగిందని, 1992 పాలసీ ప్రకారం రెమిషన్ కింద ముందస్తుగా వాళ్లను విడుదల చేసిందని, విడుదలకు వాళ్లు అన్ని విధాల అర్హత కలిగి ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం తరపున నుంచి సమగ్ర సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ఆయన విన్నవించారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ఈ కేసు విచారణ జరగడం కష్టతరం అవుతుందన్న ఉద్దేశంతో.. మహారాష్ట్ర కోర్టు(సీబీఐ కోర్టు)లో విచారణ జరిపించారు. సీబీఐ కోర్టు వాళ్లకు /జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేసింది. కానీ, ఈ కేసులో 11 మంది దోషుల్ని గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇక బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా వాదిస్తూ.. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం దోషి రాధేశ్యామ్ 15 సంవత్సరాల 4 నెలల శిక్షా కాలం పూర్తి చేసుకోవడంతో.. రెమిషన్ ఇచ్చే అంశం పరిశీలించాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి చెప్పింది. కానీ, ప్రతిగా గుజరాత్ ప్రభుత్వం దోషులందరినీ విడుదల చేసిందని శోభా వాదించారు. దోషుల్ని విడుదల చేయాలని ప్రతిపాదించిన ప్యానెల్ కమిటీ.. ‘‘సంప్రదాయ బ్రహ్మణులైన ఆ 11 మంది పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవివంచారని.. సత్ప్రవర్తన కారణంగానే వాళ్లను విడుదల చేయాలని తాము సూచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు దోషుల విడుదల గురించి తనకు ఎలాంటి సమాచారం అందించలేదన్న అభ్యంతరాలపై బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై ఆగష్టు 24వ తేదీన విచారణ జరగనుంది. ఇదీ చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది? -
‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో దోషులు ఓ వర్గం ప్రజలను వెంటాడి, హత్య చేయడమే లక్ష్యంగా రక్తదాహం ప్రదర్శించారని బాధితురాలి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని కోరారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే గర్భిణిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె కుటుంబంలోని ఏడుగురి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులకు యావజ్జీవ శిక్షపడగా, గత ఏడాది గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
Bilkis Bano Case: సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: బిలిస్క్ బానో రేపిస్టుల విడుదలకు సంబంధించిన ఫైల్స్ సమర్పించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన తరుణంలో.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్ని సవాల్ చేస్తూ సమీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు ఇవాళ సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పదకొండు మందిని ఎందుకు రిలీజ్ చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. మార్చి 27వ తేదీన సుప్రీం కోర్టు ‘ఇదొక భయంకరమైన ఘటన’ అని, నిందితుల్ని రెమిషన్ మీద ఎందుకు విడుదల చేశారో వివరణ ఇస్తూనే.. ఆ రిలీజ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే.. 11 మంది దోషుల శిక్ష ఉపశమనానికి సంబంధించిన పత్రాలను సమర్పించకూడదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని ఇంతకు ముందు సుప్రీంకు స్పష్టం చేసింది. అంతేకాదు ఒక సాధారణ హత్య కేసులో ఎలాగైతే దోషులకు రెమిషన్ కింద ముందస్తు విడుదల చేస్తామో.. అలాగే ఈ కేసులోనూ చేశామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ రెమిషన్ ఇవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో.. దోషులను ముందస్తుగా ఎందుకు రిలీజ్ చేసిందో తెలపాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ‘‘ఇవాళ ఈమె. రేపు మరొకరు. దేశంలోని నా సోదర సోదరీమణులకు ఏమి జరుగుతుందో అనే ఖచ్చితమైన ఆందోళన కలుగుతోంది’’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. అయితే.. గుజరాత్, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్.. సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌కు ఆలోచన చేస్తున్నామని, అది దాఖలు చేయాలా వద్దా అన్నది పూర్తిగా నిర్ణయించలేదని కోర్టుకు తెలిపారు. వెంటనే.. బిల్కిస్ బానో కేసు ఘోరమైన నేరమన్న బెంచ్, రెమిషన్ ప్రకటించేముందు మరో వైపు కూడా ఆలోచించాల్సి ఉండాల్సిందని, ఇది సరైన పద్ధతి కాదని గుజరాత్ ప్రభుత్వం తీరును తప్పు బట్టింది. ఫైల్స్ గనుక కోర్టుకు సమర్పించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు అంతా పక్కాగా చేసినప్పుడు.. భయపడాల్సిన అవసరం ఏముందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక గర్భవతిని(బిల్కిస్ బానో) గ్యాంగ్ రేప్ చేశారు. మరికొందరిని చంపేశారు. అలాంటప్పుడు ఈ కేసును సాధారణమైన హత్య కేసుగా పోల్చడానికి వీల్లేదు. యాపిల్స్‌ను బత్తాయిలతో పోల్చలేం.. అలాగే ఇంతటి మారణకాండను సింగిల్ మర్డర్‌గా పోల్చడానికి వీల్లేదు. నేరాలు అనేవి సాధారణంగా సమాజానికి, కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అసమానతలను సమానంగా చూడలేము అని కోర్టు అభిప్రాయపడింది. ఇవాళ బిల్కిస్.. రేపు ఇంకెవరో?. అది మీరైనా కావొచ్చు.. నేనైనా కావొచ్చు. రెమిషన్ ఇవ్వడానికి గల కారణాలను చూపించకపోతే, ఫైల్స్ సమర్పించపోతే.. న్యాయవ్యవస్థ తన స్వంత తీర్మానాన్ని తీసుకోవలసి ఉంటుందని గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. బిల్కిస్ బానో కేసులో పదకొండు మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలను మే 2వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. నోటీసు అందుకోని దోషులందరూ తమ ప్రత్యుత్తరాలు పంపాలని ఆదేశించింది. -
Bilkis Bano Case: కేంద్రం, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసు అనేక సమస్యలతో ముడిపడి ఉందని.. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. ‘బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషులను ఇతర కేసుల్లోని రెమిషన్ ప్రమాణాల ప్రకారమే విడుదల చేశారా? రెమిషన్ కోసం నిందితులు ఏళ్లుగా జైళ్లలోనే మగ్గుతుగున్న అనేక హత్య కేసులు మన ముందు ఉన్నాయి. ఈ కేసుల్లోనూ అవే నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదా?’ అని ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. తదుపరి విచారణ తేదీ నాటికి రెమిషన్ మంజూరుకి సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో భావోద్వేగాలకు తావు లేదని, చట్ట ప్రకారం విచారిస్తామని వెల్లడించింది. ఏప్రిల్ 18న కేసును మరోసారి విచారిస్తామని తెలిపింది. కాగా 2002 గోద్రా అల్లర్ల సమయంలోబిల్కిన్ బానోపై లైంగిక దాడి జరిగింది. ఆ సమయంలో ఆమె వయసు 21 ఏళ్ల కాగా.. అప్పటికే ఐదు నెలల గర్భవతి. అంతేగాక ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని హత్య చేశారు. ఇందులో మూడేళ్ల కూతురు సైతం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు విచారణను బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ.. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి. అయితే 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషి విడుదల అభ్యర్థనను పరిశీలించాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని మే 2022న కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ ప్రభుత్వం దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ విధానాన్ని అమలు చేసేందుకు గుజరాత్ సర్కారుకు అనుమతినిచ్చింది. ఫలితంగా జైలులో సత్ప్రవర్తన పేరుతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది ఆగష్టు 15న నిందితులు విడుదలయ్యారు. నిందితుల్లో కొందరు 15 సంవత్సరాలు, మరికొందరు 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలో నిందితుల ముందస్తు విడుదలపై సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దోషుల విడుదలపై పిటిషన్‌తో పాటు మే 13 2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందులో ఒకటి సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషుల విడుదల పిటిషన్‌పై మార్చి 22న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కొత్త బెంచ్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఈ అంశాన్ని అత్యవసరంగా జాబితా చేయాలని, నిందితుల విడుదలపై విచారణ అవసరమన్నారు. -
Bilkis Bano: ప్రత్యేక ధర్మాసనానికి ఓకే
ఢిల్లీ: గుజరాత్ అల్లర్ల అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో అభ్యర్థనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఆమె పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు బుధవారం అంగీకరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ మేరకు స్వయంగా బాధితురాలి తరపు న్యాయవాదికి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. బానో తరపున లాయర్ శోభా గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహా, జేబీ పార్దివాలాలతో కూడిన బెంచ్.. ఈ మేరకు బెంచ్ ఏర్పాటునకు అంగీకరించారు. ఈ కేసులో దోషులను రెమిషన్ మీద విడుదల చేయడం సరికాదు. ఈ(బానో) పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, దానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయల్సి ఉందని లాయర్ గుప్తా.. త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. దీనికి ‘‘ నేను బెంచ్ ఏర్పాటు చేస్తా. సాయంత్రమే దాన్ని పరిశీలిస్తా’’ అని స్వయంగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, గుప్తాకు తెలిపారు. ఈ పిటిషన్‌తో పాటు నిందితుల విడుదలను సవాల్ చేస్తూ బానో ప్రత్యేకంగా మరో పిటిషన్‌ను సైతం సుప్రీంలో దాఖలు చేశారు. 2002 గుజరాత్ అలర్ల సమయంలో.. బిల్కిస్ బానో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. అదే అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులు సైతం హత్యకు గురయ్యారు. ఇక ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పదకొండు మందిని.. గుజరాత్ ప్రభుత్వం కిందటి ఏడాది ఆగష్టు 15వ తేదీన రెమిషన్ కింద విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ గత డిసెంబర్లో బిల్కిస్ బానో సుప్రీంను ఆశ్రయించగా.. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక.. ఈ ఏడాది జనవరి 24వ తేదీన సైతం ఆమె మరో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ సమయానికి ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో పిటిషన్‌తో బిజీగా ఉండడం వల్ల ముందుకు కదల్లేదు. -
యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం
గుజరాత్‌లోని గోద్రా పేరు వినగానే మనకు స్ఫురణకు వచ్చేది సబర్మతి రైలు దుర్ఘటన, రెండోది రాష్ట్రమంతటా చెలరేగిన హింస. తద్వారా బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక మానభంగం, హత్యలు! ఈ ఘటనల పూర్వా పరాలను అవలోకిద్దాం. విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు వేలాదిమంది రామ సేవకులు, కరసేవకులు ‘పూర్ణాహుతి’ అనే మహా యజ్ఞంలో పాల్గొని అయోధ్య నుండి గుజరాత్ రాష్ట్రానికి 2002 ఫిబ్రవరి 26న సబర్మతి రైలులో తిరిగి వస్తుండగా గోద్రా రైల్వేస్టేషన్ దగ్గర కొందరు దుండగులు రైలుకు నిప్పు అంటించటంతో దాదాపు 60 మంది రామ భక్తులు మంటలకు ఆహుతయ్యారు. దానితో గుజరాత్ రాష్ట్రం మత కల్లోలాలతో అట్టుడికి దాదాపు 2,000 మంది హిందూ ముస్లింలు అసువులు బాశారు. 2002 మార్చి 3 నాడు ఐదు నెలల గర్భవతియైన 19 ఏళ్ల మహిళ బిల్కిస్ బానోపై మూకుమ్మడి అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన మరి కొంత మంది మహిళలపై అత్యాచారం, మూడున్నర సంవత్సరాల కూతురు హత్య జరిగింది. ఆ సంఘటనలో మొత్తంగా 7 మంది హతులయ్యారు. బిల్కిస్ బానో ఇచ్చిన ఫిర్యాదును సంబంధిత పోలీసు అధికారి సక్రమంగా నమోదు చేయలేదు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు పరిశోధన సీబీఐకి అప్పచెప్పబడింది. అప్పటికి గుజరాత్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరియైన న్యాయం చేసే అవకాశం లేదని బాధితుల కోరిక మేరకు అత్యున్నత న్యాయస్థానం కేసును మహారాష్ట్రకు బదిలీ చేసింది. ముంబై లోని ప్రత్యేక సెషన్స్ న్యాయస్థానం ముందు 19 మందిపై నేరారోపణ పత్రం సీబీఐ దాఖలు చేసింది. అందులో ఆరుగురు పోలీసు అధికారులూ, ఒక డాక్టర్ కూడ ఉన్నారు. సాక్షుల విచారణ పిదప 11 మంది ముద్దాయిలపై సామూహిక మానభంగం, కుట్ర, హత్య వంటి నేరాలకు గాను జీవిత ఖైదు విధిస్తూ జనవరి 2008లో తీర్పు చెప్పింది. ఏడుగురు ముద్దాయిలపై కేసు కొట్టివేయగా ఒకరు విచారణ మధ్యలో చనిపోయారు. శిక్ష విధింపబడ్డ ముద్దాయిలు బొంబాయి ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలు చేసుకోగా... 2017 మేలో అప్పీలును కొట్టివేస్తూ కింది కోర్టు తీర్పును ధ్రువీకరించింది. బిల్కిస్ బానోకి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం, ఉద్యోగం, ఇల్లు సుప్రీం ఆదేశాల కనుగుణంగా ఇవ్వాల్సి ఉండగా ఉద్యోగం, ఇల్లు ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన దాఖలా లేదు. ఇదిలా ఉండగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న 11 మందిలో ఒకరైన రాధే శ్యామ్ భగవాన్ దాస్ షా అనే దోషి... జీవితఖైదు నుండి విముక్తి కలిగిస్తూ ముందస్తు విడుదల ఉత్తర్వులు జారీ చేసే విధంగా గుజరాత్ ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2022 మార్చిలో సుప్రీం కోర్టును ఆశ్రయిం చాడు. అప్పటికే తాము 14 సంవత్సరాల పైచిలుకు శిక్షను అనుభవించినట్లు, కావున 1992 రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం జీవిత ఖైదును రద్దు చేస్తూ ముందస్తు విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరటం జరి గింది. దోషి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సరియైన ఉత్తర్వులు జారీ చేయమని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం 2022 మే 13న ఆదేశాలిచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వ ర్యంలోని 8 మందితో కూడిన జైలు అడ్వైజరీ కమిటీ 11 మంది దోషుల ముందస్తు విడుదలకు సిఫారసు చేసింది. 2022 ఆగస్టు పదిహేను నాడు 11 మంది దోషులనూ రాష్ట్ర ప్రభుత్వం 1992 పాలసీని అనుసరించి ముందస్తు విడుదల చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు శిక్ష విధింపబడ్డ నాటికి అమల్లో ఉన్న 1992 జులై నాటి రాష్ట్ర ప్రభుత్వ ఉపశమన విధాన పద్ధతి ఉత్తర్వుల ప్రామాణికతగా దోషులను విడుదల చేసి నట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. 2014లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ విధానం ప్రకారం జీవిత ఖైదీలూ, అత్యాచార దోషులూ, సీబీఐ విచారించిన కేసుల్లో ముందస్తు విడుదలకు అనర్హులు. 1992 పాలసీ ప్రకారం 14 సంవత్సరాల జైలు జీవితం గడిపిన జీవిత ఖైదీలను నిబంధనలకు లోబడి ముందస్తు విడుదల చేయవచ్చు. ముందస్తు విడుదలను సవాలు చేస్తూ బాధితుల పరంగా ఇది అన్యాయమంటూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. దీనిపై తీర్పు రావలసి ఉంది. రైలుకు నిప్పు అంటించిన కేసులో 31 మంది ముస్లింలకు కోర్టు శిక్ష విధించింది. మామూలుగా యావజ్జీవ ఖైదు అంటే తుది శ్వాస దాకా ఖైదు అని అర్థం. ‘శంబా జీ కృష్ణన్ జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ కేసులో 1974 లో సుప్రీం కోర్టు ఇదే తీర్పిచ్చింది. అయితే రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిక్షాకాలాన్ని నిబంధనలకు లోబడి తగ్గించే అధికారముంది. భారత రాజ్యాంగంలోని 161వ అధికరణ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో రాష్ట్ర గవర్నర్‌కు కనీస శిక్షాకాలం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో ప్రమేయం లేకుండా శిక్షాకాలాన్ని తగ్గించే అధికారం ఇచ్చింది. నేర విచారణ స్మృతి లోని 432, 433, 433అ సెక్షన్ల ప్రకారం... యావజ్జీవ ఖైదును ఎదుర్కొనే వారు కనీసంగా 14 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపిన వారిని మాత్రమే గవర్నరు ప్రమేయం లేకుండా ముందస్తు విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. శిక్ష విధింపబడ్డ తేదీ నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అమలులో ఉంటుందో ముందస్తు విడుదలకు దానినే ప్రామాణికంగా తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఇవే విషయాలను ‘స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ రాజ్ కుమార్ ఎట్ బిట్టు’ కేసులో సుప్రీం ధర్మాసనం 2021 ఆగస్టు మూడు నాడు పేర్కొంది. కొంత కాలం క్రితం రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులను కూడా నిబంధన లను అనుసరించి మూడు దశాబ్దాల తర్వాత ముందస్తు విడుదల చేయటం జరిగింది. కొందరు ఊహించుకున్నట్లు యావజ్జీవ శిక్ష అంటే 14 లేదా 20 సంవత్సరాల ఖైదు మాత్రం కాదు. తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జి ‘ 98485 45970 -
బిల్కిస్ బానోకు చుక్కెదురు.. దోషుల విడుదలపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, దోషుల విడుదలపై పోరాడుతున్న బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన, తమ కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని విడుదల చేయడంపై రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేసింది. అందులో ఒకటి దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్ బానో. తాజాగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదీ కేసు.. 2002లో గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు 2008 జనవరిలో జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లు జైలులో గడిపిన తర్వాత తమను విడుదల చేయాలంటూ అందులో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. అందుకు సుప్రీం కోర్టు సైతం అనుమతిచ్చింది. దీంతో వారు 2022, ఆగస్టు 15న దోషులను విడుదల చేశారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ -
Bilkis Bano Case: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ (డిసెంబర్ 13న) చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్ బేలా ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కొత్త బెంచ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు మంగళవారం బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల పిటిషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది విచారించాలనుకోవట్లేదని తెలిపారు మరో జడ్జీ జస్టిస్ అజయ్ రాస్తోగి. ‘ఈ ధర్మాసనం ముందుకు పిటిషన్ వచ్చినా.. అందులో ఒకరు తప్పుకున్నారు.’అని జస్టిస్ రాస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే, జస్టిస్ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఆగస్టు 15న 11 మంది దోషులను విడుదల చేయటాన్ని రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేశారు బిల్కిస్ బానో. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్ -
11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో
న్యూఢిల్లీ: తనపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు. అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భవతి కూడా. ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వీరిని ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'