గోధ్రా: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు గుజరాత్‌లోని గోధ్రా సబ్ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం దోషులందరూ జనవరి 21వ తేదీ అర్ధరాత్రి జైలుకు వచ్చినట్లు స్థానిక క్రైం బ్రాంచి ఇన్‌స్పెక్టర్ ఎన్‌ఎల్ దేశాయ్ ధ్రువీకరించారు.
2002లో గుజరాత్‌లో మత కలహాల సమయంలో బిల్కిస్ బానో అనే అయిదు నెలల గర్భవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అయితే, 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వీరిని సత్ప్రవర్తన కలిగిన వారిగా పేర్కొంటూ 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment