Godhra
-
బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులు రాధేశైమ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రెమిషన్(శిక్ష తగ్గింపు) పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వాళ్ల అభ్యర్థనను తిరస్కరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో పెద్దఎత్తున మతపరమైన అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.... 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషుల్ని జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తీర్పును సవాలు చేస్తూ భగవాన్‌దాస్, బాబూలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా తమ రిమిషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు తాత్కాలికంగా తమను విడుదల చేయాలని, ఇందుకోసం బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్ చేస్తారని ప్రశ్నించింది. దీంతో.. ఇద్దరు పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది. -
‘బిల్కిస్’ దోషులు జైలుకు
గోధ్రా: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు గుజరాత్‌లోని గోధ్రా సబ్ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం దోషులందరూ జనవరి 21వ తేదీ అర్ధరాత్రి జైలుకు వచ్చినట్లు స్థానిక క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ ధ్రువీకరించారు. 2002లో గుజరాత్లో మత కలహాల సమయంలో బిల్కిస్ బానో అనే అయిదు నెలల గర్భవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అయితే, 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వీరిని సత్ప్రవర్తన కలిగిన వారిగా పేర్కొంటూ 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
కాంట్రవర్సీ కథలకు ఫ్రీ పుబ్లిసిటీ
-
సుప్రీంకోర్టులో సెతల్వాద్‌కు ఊరట
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002 గోధ్రా ఘర్షణల తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు బుధవారం సెతల్వాద్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది. గోధ్రా హింసాకాండ కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని తీస్తా సెతల్వాద్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సెతల్వాద్‌పై చార్జిషీటు నమోదు కావడంతో ఆమెను మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘‘తీస్తా సెతల్వాద్ ఇప్పటికే తన పాస్‌పోర్టును సెషన్స్ కోర్టుకు సమర్పించారు. ఆమె సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదు. వారికి దూరంగా ఉండాలి’’ అని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తీస్తా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని పోలీసులు భావిస్తే నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది. -
టీప్పర్ లారీ ఢీ కొట్టిన కాని..
-
ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
గోద్రా: గుజరాత్ లోని గోద్రా-దాహోద్ రహదారిపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బస్సు అతి వేగమే కారణమని తెలుస్తోంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణానికి 10 కి.మీ దూరంలోని ఒర్వాడా గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని పంచమహల్ తాలూకా ఇన్స్పెక్టర్ తెలిపారు. -
దురదృష్టకరం.. అవాంఛనీయం!
దాద్రి ఘటన, గులాం అలీ కచేరీ రద్దుపై నోరు విప్పిన మోదీ * ఆలస్యంగా, మొక్కుబడిగా స్పందించారన్న విపక్షాలు * ‘గోద్రా’ను గుర్తు చేసిన శివసేన కోల్‌కతా/న్యూఢిల్లీ: గోమాంసం తిన్నాడన్న కారణంగా ఇఖ్లాక్ అనే వ్యక్తి హత్యకు గురైన ‘దాద్రి’ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పారు. దాద్రి ఘటన, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖగజల్ గాయకుడు గులాం అలీ కచేరీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మొదలైన ఘటనలు దురదృష్టకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించారు. అయితే, వాటికి, కేంద్రప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నిం చారు. ప్రతిపక్షాలు కుహనా లౌకికవాదంతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయం టూ విమర్శించారు. బెంగాలీ డైలీ ‘ఆనంద్ బజార్పత్రిక’కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా ఘటనలపై ఆయన మొదటిసారి ప్రత్యక్షంగా స్పందించారు. బీజేపీపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ.. ‘బీజేపీ ఇలాంటివాటిని ఎన్నడూ సమర్ధించదు. ఈ ఘటనలను చూపుతూ ప్రతిపక్షాలు బీజేపీపై మతతత్వ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ నిజానికి విభజన రాజకీయాలు చేస్తోంది విపక్షాలే. కుహనా లౌకికవాదాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. గతంలోనూ ఈ చర్చ వచ్చింది. ఇప్పుడూ వస్తోంది. ఇలాంటి వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. బీజేపీపై విష ప్రచారం చేస్తున్న పార్టీలు వాస్తవానికి మైనారిటీలు అభివృద్ది చెందాలని కోరుకోవడంలేదు. వారిని ఓటుబ్యాంకులుగానే చూస్తున్నాయి’ అని విపక్షాలపై ధ్వజమెత్తారు. కొట్టి, సారీ చెప్పినట్లుగా..! మోదీ తాజా స్పందనపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ‘ఇదేనా మౌనం వీడటమంటే? కొట్టి, సారీ చెప్పినట్లుగా ఉంది మోదీ తీరు.’ అంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ట్వీట్ చేశారు. క్రికెట్లో భారత్ గెలిస్తే తక్షణమే శుభాకాంక్షలు తెలిపే మోదీ, దాద్రి ఘటనపై చాలా ఆలస్యంగా స్పందించారని జేడీయు చీఫ్ శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. దాద్రి విషయంలో కచ్చితమైన కార్యాచరణ అవసరమని కాంగ్రెస్ ప్రధానికి సూచించింది. ‘మొత్తం దేశానికి ప్రధానినని, దేశంలోని మొత్తం 125 కోట్ల ప్రజల రక్షణ తన బాధ్యత అని మోదీ మరచిపోయారు. గులాం అలీ కచేరీ రద్దైన, సుధీంద్రపై ఇంకుపోసిన మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయాన్నీ ఆయన మరిచారు’ అని కాంగ్రెస్ ముఖ్యఅధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘గోద్రా’ వల్లే మీకీ గౌరవం..! పాక్ గాయకుడు గులాం అలీ సంగీత కచేరీని అడ్డుకోవడం దురదృష్టకరమన్న మోదీ వ్యాఖ్యలను సేన తప్పుబట్టింది. ‘గోద్రా, అహ్మదాబాద్‌ల వల్లనే మోదీకి గుర్తింపు, గౌరవం. అవే కారణాలతో మేమూ ఆయనను గౌరవిస్తాం. అలాంటి మోదీనే గులాం అలీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణను వ్యతిరేకించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తే.. ఆ వ్యాఖ్యలు మాకందరికి నిజంగానే దురదృష్టకరం’ అని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తెగతెంపుల దిశగా..! శివసేన జాతీయవాదం, దేశభక్తి విసుగెత్తిస్తే.. సంకీర్ణం నుంచి వైదొలగవచ్చంటూ మంగళవారం సేన చేసిన వ్యాఖ్యలు, సంజయ్ రౌత్ తాజా విమర్శలతో.. కేంద్రంలో, మహారాష్ట్రలో మిత్రపక్షాలైన బీజేపీ, సేనల మధ్య దూరం పెరుగుతోంది. గురువారం జరిగే బీజేపీ సమా వేశంలో దీనిపై చర్చ జరగవచ్చని భా విస్తు న్నారు. అయితే బీజేపీ-శివసేన పార్టీలు గిల్లికజ్జాలు పెట్టుకున్నా ఒకరిని వదిలి మరొకరు ఉండలేరని..అధికారం కోసం ఇద్దరూ కలిసే ఉంటారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.