గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు | Top Court Rejects Gujarat Plea To Remove Bilkis Bano Case Criticism | Sakshi
Sakshi News home page

Bilkis Bano Case: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Published Thu, Sep 26 2024 7:30 PM | Last Updated on Thu, Sep 26 2024 8:10 PM

Top Court Rejects Gujarat Plea To Remove Bilkis Bano Case Criticism

న్యూఢిల్లీ: గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదలకు సంబంధించిన తమ(సుప్రీం) ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది

కాగా 2002 గుజరాత్‌ గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపినందుకు దోషులుగా ఉన్న 11 మందిని  ముందస్తుగా విడుదల చేయడంపై గత జనవరిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దోషుల శిక్షాకాలం ముగియకముందే ‘సత్ప్రవర్తన’ కారణంగా గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై మండిపడింది. 11 దోషులందరూ వెంటనే జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.

ఈ విచారణ సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు పలు సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని తెలిపింది. గుజరాత్‌ సర్కార్‌ దోషులతో కుమ్మకైందని,అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడింది. 

అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను తొలగించాలని గుజరాత్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
సుప్రీం వ్యాఖ్యలు సరికాదని, కేసు రికార్డుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంపై పక్షపాతంతో వ్యవహరించారని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement