sub jail
-
రేపు గుంటూరుకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరుకు వెళ్లనున్నారు. ఉదయం సబ్ జైలుకి వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ములాఖత్ కానున్నారు. ఆపై క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన్ని పరామర్శిస్తారు. మూడేళ్ల కిందినాటి టీడీపీ మంగళగిరి కార్యాయలంపై దాడి కేసులో.. నందిగం సురేష్‌ను అక్రమంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. రిమాండ్ మీద ఆయన గుంటూరు జైలులో ఉన్నారు మరోవైపు.. సాంబిరెడ్డి ఇటీవలె టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేతగా వాళ్లకు ధైర్యం చెప్పేందుకు జగన్ పరామర్శించనున్నారు. ఇదీ చదవండి: ఇంత చేతగానితనమా చంద్రబాబు?: వైఎస్ జగన్ ఫైర్ -
‘బిల్కిస్’ దోషులు జైలుకు
గోధ్రా: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు గుజరాత్‌లోని గోధ్రా సబ్ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం దోషులందరూ జనవరి 21వ తేదీ అర్ధరాత్రి జైలుకు వచ్చినట్లు స్థానిక క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ ధ్రువీకరించారు. 2002లో గుజరాత్లో మత కలహాల సమయంలో బిల్కిస్ బానో అనే అయిదు నెలల గర్భవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అయితే, 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వీరిని సత్ప్రవర్తన కలిగిన వారిగా పేర్కొంటూ 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
రూ.78 కోట్లతో జిల్లా జైలు... శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఎన్సాన్పల్లి శివారులో జిల్లా జైలు ఏర్పాటు కానుంది. రూ.78 కోట్ల వ్యయంతో 34 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న భవానికి మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 మంది ఖైదీల కెపాసిటీతో సబ్ జైలు కొనసాగుతుండగా ఎన్సాన్‌పల్లిలో 21 ఫీట్ల ఎత్తుతో హై సెక్యూరిటీ గోడలు, 17 బ్లాక్‌లతో కొత్త జైలు త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త జైలులో అడ్మిన్ బ్లాక్, హాస్పిటల్ బ్లాక్, క్వార్టర్స్, రిసిప్షెన్, అడ్మిన్ బ్లాక్, డార్మెటరీ, లైబ్రెరీ, ఫీమెల్ బ్లాక్, పురుషులు, మహిళలు వేర్వేరుగా లాకప్‌లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. సుమారు 500 మంది ఖైదీల కెపాసిటీ, 50 మంది సిబ్బంది విధులు నిర్వహించేలా నిర్మించనున్నారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి అందుబాటులోకి తేనున్నట్లు పోలీస్ హౌసింగ్ ఏఈ సుధాకర్ తెలిపారు. -
టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం సీఐ పి.కనకారావుపై రాళ్లతో దాడి చేసి గాయపరచడంతోపాటు హత్యాయత్నానికి అనుచరులను ప్రేరేపించిన కేసులో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బుధవారం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసుల సమాచారం మేరకు.. ఈ కేసులో 11 మంది నిందితులను మంగళవారం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పది మందికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జడ్జి ఎదుట పట్టాభి ఆరోపించారు. దీంతో ఆయనకు విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించి తిరిగి కోర్టులో హాజరుపరచాలని జడ్జి శిరీష పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు పట్టాభికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు బుధవారం కోర్టుకు తీసుకువచ్చారు. పట్టాభి చేతులకు సాధారణ గాయాలు మినహా శరీరంపై కొత్త గాయాలు ఏమీ లేవని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టులో ఆయనకు చదివి వినిపించారు. మెడికల్ సర్టిఫికెట్‌పై పట్టాభి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాకుండా మిగిలిన నిందితులు ఉన్న గన్నవరం సబ్‌జైలుకు తనను రిమాండ్‌కు పంపించాలని పట్టాభి కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం పోలీసులు పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. అయితే సబ్ జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉండటంతో వీరందరినీ వేరే జైలుకు పంపించాలని జైలర్ యూనస్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడంతో పట్టాభితోపాటు మరో పది మంది నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. -
శివస్వాముల అరెస్ట్.. పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా
సాక్షి, వికారాబాద్: పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. శనివారం ఉదయం ఆ శివ స్వాములను రిమాండుకు తరలించేందుకు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు తాండూరు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నెలకొంది. శివ స్వాములు మాలలు తీసి వేస్తేనే జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది తాండూరు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో.. స్వాములను మళ్ళీ జైలు బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. మాయమాటలు చెప్పి తమను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని శివ స్వాములు చెప్తున్నారు. శివమాలలు తీయబోమని స్వాములు చెప్పడంతో.. పోలీసులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. మీడియాతో సహా జైలు ఆవరణలో ఎవరినీ ఉండకుండా పంపించేస్తున్నారు పోలీసులు. -
అందరికీ ఒకే జైలు..
సాక్షి, ఆదిలాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వివిధ రకాల నేరాల్లో అరెస్టు అయిన నిందితులందరినీ ఆదిలాబాద్ జిల్లా జైలుకే తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేటల్లో సబ్ జైళ్లు ఉన్నా కోవిడ్ నిబంధనలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ జైలుకే తీసుకొస్తున్నారు. సబ్ జైళ్లలో పాత ఖైదీలు మినహా కొత్త వారిని తీసుకోవడం లేదు. కరోనా వ్యాప్తితో ప్రభుత్వ నిబంధనల మేరకు ఖైదీల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నేరస్తులు, శిక్షపడ్డ ఖైదీలు ఉన్నారు. జైలు సామర్థ్యం 320 మంది కాగా, ప్రస్తుతం 170 మంది ఖైదీలు ఉన్నారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని సబ్ జైళ్లలో కొత్త వారిని తీసుకోవడం లేదు. ప్రధానంగా సబ్ జైళ్లలో కెపాసిటీ, వసతులను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టారు. దీంతో రెండు, మూడు నెలలుగా ఉమ్మడి జిల్లాలో అరెస్టు అయిన నేరస్తులను రిమాండ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. ఇటీవల వివిధ కేసుల్లో రిమాండ్ అయిన నేరస్తులకు కోవిడ్ టెస్టు చేయగా, ముగ్గురు నేరస్తులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని రిమ్స్ ఐసోలేషన్‌కు తరలించారు. ఈ విధంగా రిమాండ్ ఖైదీలను మొదట కోవిడ్ టెస్టు చేసిన తర్వాతే రిపోర్టుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక బ్యారక్ సాధారణంగా చిన్న చిన్న నేరాల్లో నేరస్తులను రిమాండ్ నిమిత్తం సబ్ జైలుకు తరలిస్తారు. కొంత తీవ్రత ఉన్న కేసుల్లో నేరస్తులను, శిక్షపడ్డ వారిని ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉంచుతారు. ప్రస్తుతం ఏదైనా కేసులో రిమాండ్‌లో భాగంగా జైలుకు వచ్చే ముందు కోవిడ్ టెస్టు చేయిస్తున్నారు. అందులో పాజిటివ్ వస్తే రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వారిని జిల్లాలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇలా కొత్తగా వచ్చే వారిని 20 రోజుల పాటు సపరేట్ బ్యారక్‌లో ఉంచుతున్నారు. అంతే కాకుండా ప్రతీ రెండు గంటలకు ఒకసారి బ్యారక్ పరిసరాల్లో శానిటైజేషన్ చేస్తున్నారు. అలాగే జిల్లా జైలులో ప్రతీరోజు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు. ఖైదీల సంరక్షణ కూడా.. కరోనా నేపథ్యంలో జైలులో ఉన్న ఖైదీల సంరక్షణకు జైలు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జైలులోనే ఉన్న ఆస్పత్రి సిబ్బందితో ఖైదీలకు వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రతీరోజు ప్రతి ఒక్కరూ మూడు సార్లు ఆవిరి పట్టుకునేలా చూస్తున్నారు. జైలు ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు ఖైదీలకు సీ–విటమిన్, మల్టీ విటమిన్ మాత్రలు ఇస్తున్నారు. రోజు వేడివేడి ఆహారం అందిస్తున్నారు. చాయ్‌లో జిందా తిలిస్మాథ్ కలిసి ఆ ద్రావణాన్ని ఖైదీలకు అందిస్తున్నారు. జైలు ఆవరణలో పండించిన నువ్వులు, ఆకుకూరలను విరివిరిగా ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ఖైదీల సంరక్షణకు ఆహార పదార్థాల్లో నువ్వులు ఉండేలా వివిధ పదార్థాలను తయారు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, బలహీనంగా ఉన్న ఖైదీలను గుర్తించి ప్రత్యేక డైట్ అందిస్తున్నారు. వారికి గుడ్లు, పాలు, పండ్లు అందిస్తున్నారు. నిత్యం ఖైదీలతో యోగా చేయిస్తున్నారు. జిల్లా జైలులో ప్రతీ బ్యారక్ దగ్గర హ్యాండ్‌వాష్‌ను తప్పని సరిచేశారు. ప్రతీ ఖైదీ చేతులు కడుక్కునేలా వసతులు కల్పించారు. ఖైదీలతో మాస్కులు తయారు చేయిస్తున్నారు. వీటిని జైలు బయట అమ్మకానికి పెట్టారు. సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. సబ్ జైళ్లలో కెపాసిటీ లేకపోవడంతోనే.. పల్లు నేరాల్లో అరెస్టు అయిన వారిని ఉంచేందుకు ఉమ్మడి జిల్లాలోని సబ్ జైళ్లలో కెపాసిటీ లేక ఆదిలాబాద్ జిల్లా జైలుకే తీసుకువస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ జైలులో ఉన్న ఖైదీల సంరక్షణకు చర్యలు చేపట్టాం. రిమాండ్ తర్వాత జైలుకు వచ్చే ముందు కోవిడ్ టెస్టు తప్పనిసరి చేశాం. నెగెటివ్ ఉంటేనే జైలులోకి తీసుకుంటున్నాం. పాజిటివ్ ఉంటే రిమ్స్ ఆస్పత్రి ఐసోలేషన్‌కు పంపిస్తున్నాం. అతను పూర్తిగా కోలుకున్నాక జైలులోకి తీసుకుంటున్నాం. – శోభన్‌రావు, జిల్లా జైలు అధికారి, ఆదిలాబాద్ -
టీడీపీ నేతకు సబ్ జైలులో రాచ మర్యాదలు
సాక్షి, కమలాపురం(కడప) : కమలాపురం సబ్ జైలు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. ఓ కేసులో గురువారం రాత్రి కమలాపురం సబ్ జైలుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కి జైలు అధికారులు రాచ మర్యాదలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీతో ములాఖత్‌కు రోజులో ముగ్గురు లేదా అయిదుగురు కలిసే వీలుంటుంది. కానీ పదుల సంఖ్యలో టీడీపీ నాయకులు వరుస కట్టారు. జైలు అధికారులు కిమ్మనకుండా అనుమతించారు. శుక్రవారం ఉదయం టీడీపీ నాయకులు లింగారెడ్డి, విజయమ్మ వారి అనుచరులతో వచ్చి రెడ్యంను కలిసి వెళ్లారు. సాయంత్రం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లు దాదాపు 30 మంది అనుచరులతో కలవడానికి వచ్చారు. జైలు అధికారులు నిబంధనలను పక్కన బెట్టి వారికి పూర్తిగా వత్తాసు పలికారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే ములాఖత్ ముగియాల్సి ఉండగా 6.30 దాటినా ములాఖత్ కొనసాగించారు. ములాఖత్‌కు వచ్చిన వారంతా తినుబండారాలు తీసుకెళ్లారు. ఏ ఒక్క విషయంలోనూ సబ్‌జైలు అధికారులు నిబంధనలు పాటించలేదు. సాధారణ ఖైదీలకు ఒక న్యాయం, టీడీపీ నాయకులకు ఒక న్యాయమా అని విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ జైలర్ వేణును వివరణ కోరగా వంటకాలకు అనుమతి లేదన్నారు. టైం ప్రకారమే పండ్లు, బిస్కెట్లు మాత్రమే అనుమతించామన్నారు. -
తాడేపల్లిగూడెంలో జిల్లా జైలు
సాక్షి, తాడేపల్లిగూడెం : మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో అధునాతనంగా పట్టణంలోని విమానాశ్రయ భూముల్లో సబ్‌జైలు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు మూడెకరాల భూమిని జైళ్లశాఖకు కే టాయిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు భూమిని జిల్లా సబ్‌జైళ్ల అధికారి అప్పలనాయుడు పట్టణానికి వచ్చి ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు.ప్రభుత్వ విధాన నిర్ణయాలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడితే ఈ జైలునే జిల్లా జైలుగా మార్చే విధంగా నిర్మాణాలు ఉంటాయని సమాచారం. జిల్లాలో ఉన్న సబ్‌జైళ్లలో ఖైదీల సంఖ్యను పాత సంవత్సరాల ఆధారంగా తీసుకొని, నేర ప్రవృత్తి, సబ్జైళ్లకు పంపించే రిమాండ్ ఖైదీలు, ముద్దాయిలు, నిందితులు ఎంత మంది ఉంటారనే అంచనాల ఆధారంగా అవసరమైన విధంగా కొత్త జైలును నిర్మించడంతో పాటు, ఖైదీలు పారిపోకుండా ఉండే విధంగా పక్కాగా రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జైళ్లశాఖ డీజీ పర్యవేక్షణలో పోలీసు హౌసింగ్ సొసైటీ ద్వారా ఇక్కడి జైలు నిర్మాణ పనులకు అధికారిక ఆమోదం అనంతరం పనులు చేపట్టనున్నారు. స్థల బదలాయింపు వ్యవహారం ఏడెనిదిమిది నెలల క్రితం పూర్తి కావాల్సి ఉంది. ఈలోపు ఎన్నికలు రావడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో స్థల బదలాయింపు ఆలస్యం అయ్యింది. గతంలోనే కొత్త జైలు నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లడం, కొత్తగా ప్రస్తుతమున్న తాలూకా ఆఫీస్ ప్రాంగణం నుంచి విమానాశ్రయ భూములకు సబ్‌జైలును తరలించే విధంగా, కొత్త జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. పాత సబ్‌జైలులో అసౌకర్యాలు ఉండటం, పల్లపు ప్రాంతంగా ఉండటంతో వానలు కురిసిన సమయంలో నీరు బ్యారక్‌లలోకి వెళ్లడంతో జైలులో కొత్తగా పనులు చేపట్టాలని అంచనాలు వేశారు. పనుల కోసం టెండర్లు పిలిచే సమయంలో ఈ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోవడంతో జైలులోని రక్షణ వ్యవహారంలో డొల్లతనం బహిర్గతమైంది.ఇద్దరు ఉద్యోగులపై వేటు కూడా పడింది. ఈ నేపథ్యంలో నూతన ప్రతిపాదన ఆధారంగా పట్టణానికి దూరంగా మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో సబ్‌జైలు నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈలోపు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యమైంది. భూ బదలాయింపు వ్యవహారం పూర్తి కావడంతో, ని ర్మాణ ప్రతిపాదనల కోసం పైలు జైళ్లశాఖ డీజీకి జిల్లా సబ్‌జైళ్ల శాఖ నుంచి వెళ్లనుంది. వెళ్లిన తర్వాత నిర్మాణ ప్రతిపాదనలు, బడ్జెట్ కేటా యింపు, ప్లానుల ఆమోదం అనంతరం టెండర్లు పనుల కోసం పిలువనున్నారు. జిల్లాజైలుగా నిర్మించే అవకాశం ఇక్కడ త్వరలో నిర్మించబోయే సబ్‌జైలును జిల్లాజైలుగా కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వి«ధాన నిర్ణయాలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటైతే గూడెంలోనే జిల్లా జైలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టెండర్లు పిలిచే సమయంలో ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే వీలుంది. తణుకు సబ్‌జైలుకు ఖైదీలు తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఖైదీలను తణుకు సబ్‌జైలుకు పంపుతున్నారు. వాస్తవానికి 2017 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఖైదీలను తణుకు సబ్‌జైలుకు పంపిస్తున్నారు. 2017 సెప్టెంబర్ 10వ తేదీన గూడెం సబ్‌జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఖైదీలకు క్షురకర్మ చేయించడానికి బ్యారక్ల నుంచి బయటకు తీసిన సమయంలో కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని బేతవోలు గ్రామానికి చెందిన సిరపు గణేష్, అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని నందలపాడుకు చెందిన బుగత శివ గూడెం సబ్‌జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఇద్దరు సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. ఘటన తర్వాత సబ్‌జైలును పరిశీలించిన అధికారులు ఖైదీలను ఉంచడానికి తాడేపల్లిగూడెం సబ్‌జైలు సరికాదని గుర్తించారు. అదేనెల 14న తాడేపల్లిగూడెం సబ్‌జైలును మూసివేస్తూ, ఖైదీలను తణుకు సబ్‌జైలుకు తీసుకెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రెండేళ్లుగా సబ్‌జైలు ఖైదీలను తణుకు తీసుకెళుతున్నారు. కొత్త జైలు నిర్మించే వరకు తణుకే తీసుకెళ్లాలి. -
సబ్జైల్లో వార్డెర్లు డిష్యుం డిష్యుం
గుత్తి: గుత్తి సబ్ జైల్లో చిన్నపాటి విషయంపై ఇద్దరు వార్డర్ల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో సిలార్‌ఖాన్ అనే వార్డర్‌కు గాయాలయ్యాయి. ఎస్ఐ యువరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వాటిని రిపేరీ చేయించడానికి చీఫ్ వార్డర్ జోగులు టెక్నీషియన్‌ను పిలిపించారు. సీసీ కెమెరాలు రిపేరీ చేయడానికి నిచ్చెనను జైల్లోకి తీసుకెళ్లారు. అయితే సూపరింటెండెంట్ అనుమతి లేకుండా నిచ్చెనను జైల్లోకి అనుమతించకూడదు. చీఫ్ వార్డర్ జోగులు నిచ్చెనను లోపలకి అనుమతించారు. దీనికి వార్డర్ సిలార్‌ఖాన్ అడ్డు చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సిలార్ ఖాన్ బయట ఉన్న ఖైదీలను, నిచ్చెనను సెల్ఫోల్లో వీడియో తీయసాగాడు. దీంతో జోగులు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. సిలార్‌ఖాన్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి జోగులు ప్రయత్నించాడు. అయితే సిలార్‌ఖాన్ సెల్‌ఫోన్‌ను ఇవ్వలేదు. ఆవేశంలో జోగులు రాయి తీసుకుని సిలార్‌ఖాన్ చెయ్యిపై దాడి చేసి గాయపరిచాడు. జోగులు రాయితో తనపై దాడి చేసి గాయపరిచినట్లు సిలార్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ యువరాజు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ సిలార్‌ఖాన్, జోగులు మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. జోగులు ఇష్టానుసారం జైల్లో వ్యవహరిస్తూ ఖైదీల పట్ల ఉదాసీనంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇది సిలార్ఖాన్కు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం జోగులు బండారాన్ని జైలు ఉన్నతాధికారులకు చూపించాలని జైల్లో జరుగుతున్న తంతును సెల్ఫోన్లో చిత్రీకరించడానికి సిలార్‌ఖాన్ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన జోగులు.. సిలార్‌ఖాన్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో కోపోద్రిక్తుడైన జోగులు రాయితో సిలార్ఖాన్ను గాయపరిచినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే జైల్లోకి సెల్‌ఫోన్, రాయి ఎలా వచ్చాయనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సాధారణంగా లేదా నిబంధనల మేరకు జైల్లో ఎలాంటి వస్తువులూ ఉండరాదు. అయితే సెల్‌ఫోన్, రాయి, నిచ్చెన ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది. -
సబ్‌జైలుపై పాత ఖైదీ దాడి
నందికొట్కూరు/పగిడ్యాల: సబ్ జైలుపై పాత ఖైదీ చంద్రశేఖర్ రాళ్లతో దాడి చేసి, కానిస్టేబుల్ బైక్‌ను ధ్వంసం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మణారావు తెలిపిన వివరాలు.. పగిడ్యాల మండలం పీకే ప్రాగటూరు గ్రామానికి చెందిన పాత ఖైదీ చంద్రశేఖర్ ఉదయం 7 గంటలకు జైలు వద్దకు చేరుకున్నాడు. తన తల్లి లక్ష్మిదేవిని చూపించాలంటూ జైలుపైకి రాళ్లతో దాడి చేశాడు. జైలు వద్ద పార్క్ చేసి ఉంచిన కానిస్టేబుల్ ప్రదీప్ బైక్‌పై బండరాళ్లు వేసి ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ మధుసూదన్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తన కుమారుడు చంద్రశేఖర్ సైకోగా మారి ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తూ తనకు తలవంపులు తెస్తున్నాడని నిందితుడి తండ్రి గుందిమల్ల వెంకటరమణ ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నందికొట్కూరు జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరచగా, విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలకు తరలించాలని కోర్టు ఆదేశించింది. -
రాష్ట్రంలో ఐదు సబ్ జైళ్ల మూసివేత
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదు సబ్ జైళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ జీవో నంబర్ 6158ని విడుదల చేశారు. నిర్వహణ భారం కారణంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ సబ్ జైళ్లతో పాటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని మదిర సబ్ జైళ్లను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్య పాలకుల హయాంలోనే ఆర్మూర్ సబ్ జైలును మూసి వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డప్పటికీ స్థానికులు, న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసారు. ఆర్మూర్ సబ్ జైలులో పది మంది రిమాండ్ ఖైదీలను ఉంచడానికి సరిపడా సౌకర్యాలు ఉండగా, 20 నుంచి 25 మంది రిమాండ్ ఖైదీలను ఇక్కడ ఉంచడానికి అవకాశం ఉంది. కానీ, జైళ్ల శాఖకు నిర్వహణ భారం అధికం అవుతుండటంతో తాత్కాలికంగా సబ్ జైలును మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. -
క్షణికావేశం..కన్నీరే మిగిల్చింది
ఆస్తి వివాదం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. తండ్రీ కొడుకుల మధ్య వివాదం చిలికి చిలికి చివరకు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసింది. క్షణికావేశంలో కొడుకును హతమార్చిన తండ్రి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కన్న కొడుకును తానే కడతేర్చాననే బాధను భరించలేక కృంగిపోయి చివరకు సబ్జైల్లోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమయింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. పాలకొండ రూరల్/పాలకొండ: రాజాం పట్టణంలో నవ్యనగర్ కాలనీకి చెందిన కలిపిండి సీతంనాయుడు హత్యకు పాల్పడ్డాడు. ఆస్తివివాదం కారణంగా గత నెల 28వ తేదీన తన స్వగృహంలో నిద్రిస్తున్న కన్న కుమారుడు శ్రీకాంత్ నాయుడును కత్తితో నరికాడు. ఈ ఘటనలో శ్రీకాంత్‌నాయుడు మరణించాడు. దీంతో నిందితుడు సీతంనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని రాజాం కోర్టులో హాజరుపర్చగా ఆయనకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో భాగంగా ఈ నెల 1వ తేదీన సీతంనాయుడును పాలకొండ సబ్‌జైల్‌కు తరలించారు. ఈ క్రమంలో సబ్జైల్లో ఉన్న సీతంనాయుడు ఆ రోజు నుంచి మనోవేదనతో ఉన్నట్టు జైలు సిబ్బంది చెబుతున్నారు. సక్రమంగా భోజనం చేయకపోవటంతో పాటు చనిపోయిన కుమారుడిని తలచుకొని మథనపడుతుండేవాడని తోటి ముద్దాయిలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీతంనాయుడు ఆరోగ్యం దెబ్బతిని శ్వాస సంబంధిత వ్యాధికి గురయ్యాడు. దీంతో ఈ నెల 4వ తేదీ గురువారం జైలు సూపరింటెండెంట్ వి.వెంకటరమణ తన సిబ్బందితో కలిసి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవలు చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చారు. అక్కడ కూడా సీతంనాయుడు తన అనారోగ్యానికి కారణం నేరం చేశానన్న మనోవేదనేనని చెప్పినట్టు వైద్యులు అంటున్నారు. అయితే ఇదే రోజు రాత్రి సబ్‌జైలులో తీవ్ర అస్వస్థతకు గురికావటంతో మళ్లీ అర్ధరాత్రి స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు ఇదిలా ఉంటే సీతంనాయుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన గుండెపోటుతో చనిపోయారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న అనుమాలు శుక్రవారం అంతా చక్కర్లుకొట్టాయి. పోస్టుమార్టం నివేదిక అందితే తప్ప పూర్తిస్థాయి వాస్తవాలు చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. సాయంత్రానికి చేరుకున్న భార్య సీతంనాయుడు మృతదేహం ఆస్పత్రి మార్చురీలో ఒంటరిగా మిగిలింది. చనిపోయిన విషయాన్ని కుటుం బసభ్యులకు తెలియజేసినప్పటికీ వారెవరు సాయంత్రం వరకు మృతదేహం వద్దకు వచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో అటు పోలీసులు, ఇటు జైలు సిబ్బంది తర్జనభర్జన పడ్డారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం మృతుని భార్య సరోజిని రావటంతో పాలకొండ న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి కిరణ్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి.స్వరూపారాణి, ఆర్డీవో రెడ్డి గున్నయ్య, సీఐ సూరినాయుడు సమక్షంలో శవపంచనామా పూర్తిచేసి పోస్టుమార్టం ప్రారంభించారు. మృతదేహాన్ని సీతంనాయుడు కుటుంబీకులకు అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. నివేదిక ఆధారంగానే బాధ్యులపై చర్యలు శ్రీకాకుళం సిటీ: పాలకొండ సబ్ జైలులో రిమాండ్‌ఖైదీ కలిపిండి సీతంనాయుడు మృతి ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా సబ్జైళ్లల సూపరింటెండెంట్(పర్యవేక్షణాధికారి) బి.వీరన్న తెలిపా రు. నివేదిక ఆధారంగానే బాధ్యులపై శాఖాపరమై న చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పీలేరు సబ్‌జైలులో ఖైదీల ఘర్షణ
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్‌జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాయిన్‌బాక్స్ వద్ద ఫోన్ చేసుకునే విషయమై ఖైదీల మధ్య గొడవ జరిగింది. కలికిరి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే ఖైదీ కాయిన్‌బాక్స్ వద్ద ఫోన్ మాట్లాడుతుండగా.. ఎంత సేపు మాట్లాడతావంటూ తోటి ఖైదీలు వాదనకు దిగారు. ఈ విషయమై ఖైదీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. నారాయణరెడ్డిపై తోటి ఖైదీలు దాడికి దిగారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు ఖైదీలను వారించి అక్కడి నుంచి పంపివేశారు. -
సబ్‌జైలును సందర్శించిన నాయ్యమూర్తి
కదిరి టౌన్ : కదిరి సబ్‌జైలును బుధవారం సాయంత్రం సీనియర్ సివిల్ జడ్జి సీ.ఆర్.సుమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెను జైలు సూపరింటెండెంట్ మల్లికార్జున, సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. ఖైదీల వంట గది, మినరల్ వాటర్ ప్లాంట్‌ను జడ్జి పరిశీలించారు. వంటను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఖైదీలకు అనుకూలంగా ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించారు. అనంతరం కాసేపు ఆమె ఖైదీలతో ముచ్చటించారు. న్యాయవాదులు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, సిరాజుద్దీన్, దశరథనాయక్, సిబ్బంది ప్రభాకర్ పాల్గొన్నారు. -
మూతపడిన ఉరవకొండ సబ్‌జైలు
∙కడప డీఐజీ నుంచి వెలువడిన ఉత్తర్వులు ∙ సబ్ జైలర్ కడపకు బదిలీ ఉరవకొండ : ఉరవకొండ సబ్ జైలు మూతపడింది. కడపలోని జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు ఉరవకొండ సబ్ జైలు అధికారులకు అందాయి. నెలకు ఒక సారి నిల్ లాకప్ నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 1983లో మొత్తం 23 మంది ఖైదీల సామర్థ్యంతో సబ్‌జైలు ఏర్పాౖటెంది. దీంతో పాటు 2010లో జైలును రూ.55 లక్షల వ్యయంతో ఆధునీకరించారు. జైలు నిర్వహణకు ఖైదీలు లేక పోయినా ఏడాదికి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు అవుతుండంతో ఉన్నతాధికారులు దీన్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ సబ్ జైలు మూతపడటంతో ఇక్కడ పని చేస్తున్న సబ్ జైలర్ రఘనాథరెడ్డిని కడప సెంట్రల్ జైలుకు, ఇద్దరు వార్డెన్లు వెంకటరవి, జయరాములును పెనగొండ సబ్‌జైలుకు, ఒక హెడ్వార్డె¯ŒS భాస్కర్‌రావును తాడిపత్రి, మరో హెడ్వార్డె¯ŒS నాగేంద్రప్రసాద్‌ను హిందూపురం సబ్ జైలుకు బదిలీ చేశారు. రికార్డులు పరిశీలించిన జిల్లా జైళ్లశాఖ అధికారి స్థానిక సబ్‌జైలులో రికార్డులను జైళ్లశాఖ జిల్లా అధికారి సుదర్శనరావు సోమవారం రాత్రి పరిశీలించారు. పలు కీలక రికార్డులను సబ్ జైలర్ నుంచి స్వాధీనం చేసుకొని, పర్నీచర్ను ఇతర సబ్ జైళ్లకు తరలించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ ఖైదీల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో సబ్‌జైలును మూత వేస్తున్నట్లు తెలిపారు. ఉరవకొండ సబ్‌జైలర్ రఘనాథ్రెడ్డితో పాటు సిబ్బందిని మరో సబ్ జైలుకు బదిలీ చేశామన్నారు. -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
తెనాలి రూరల్ (గుంటూరు జిల్లా) : ఓ హత్య కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న ఖైదీ అధిక మోతాదులో ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలులో సోమవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నందులపేటకు చెందిన వృద్ధుడి హత్యకేసులో పట్టణ ఐతానగర్‌కు చెందిన వల్లభాపురం రాజేష్ నిందితుడు. 41 రోజులు నుంచి సబ్జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురికావటంతో వైద్య సేవలు పొందిన రాజేష్, ఆ సమయంలో వైద్యులు ఇచ్చిన ట్యాబ్లెట్లు తన వద్దే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని బెయిల్ విషయంలో కుటుంబసభ్యులు సహకరించకపోవటంతో విరక్తి చెంది అధిక మోతాదులో ట్యాబ్లెట్లు మింగినట్లు తెలిసింది. విషయం గమనించిన జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం రాజేష్‌ను తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వైఎస్ఆర్ సీపీ నేతలకు వైఎస్ జగన్ పరామర్శ
-
సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య
ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్‌జైలులో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పటాన్ షమీర్ ఖాన్(35) అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం సబ్ జైలులో స్నానాల గదికి వెళ్లిన షమీర్ గంజి వార్చేందుకు ఉపయోగించే తాడుతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నానాల గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి వెళ్లి పరిశీలించగా... ఉరేసుకున్న విషయం తెలిసింది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతని భార్య షాను ప్రస్తుతం జిల్లాలోని సోమదేవపల్లి మండలం పత్తికుంటపల్లిలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఘటనపై జిల్లా జైళ్ల శాఖ అధికారి సుదర్శన్‌రావు విచారణ జరిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను జైళ్ల శాఖ డీఐజీకి పంపుతామని తెలిపారు. -
సబ్జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదవరి: తప్పుచేసిన తనతో కుటుంబ సభ్యులు మాట్లాడంలేదని.. మనస్తాపానికి గురైన ఖైదీ బాత్రూంలోని ట్యూబ్‌లైట్‌ను పగలగొట్టి దానితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్జైల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. జుట్టిగ యోహాన్ అత్యాచారం కేసులో జూన్16 నుంచి సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అప్పటినుంచి అతన్ని చూడడానికి అతని కుటుంబ సభ్యులు ఎవరు జైలుకు రాకపోవడంతో పాటు.. ఎన్నిసార్లు ఫోన్ చేసిన మాట్లాడక పోవడంతో.. మనస్తాపానికి గురైన యోహాన్ ఈ రోజు ఉదయం స్నానానికని బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న ట్యూబ్‌లైట్ పగలగొట్టి దానితో కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సబ్‌జైలుకు ఎన్సీఎస్ డెరైక్టర్లు
ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగారం కథ కీలక మలుపు తిరిగింది. చెరుకు బిల్లుల బకారుులు చెల్లించాలని కొన్నాళ్లుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు గడిచిన వారంలో ఉద్యమాన్ని వేడెక్కించారు. ఫలితంగా పోలీసుల లాఠీచార్జిలో రైతులు గాయపడడం, రైతు సంఘాల నేతల అరెస్ట్‌లు, రహదారుల దిగ్బంధంతో ఒక్కసారిగా ఉద్యమ స్వరూపం మారిపోయింది. ఈ క్రమంలో సుగర్స్ యూజమాన్యం భూములను స్వాధీనం చేసుకుని బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ స్వయంగా ప్రకటించి ఆందోళనకు దూరంగా ఉండాలని రైతులను కోరినా... రైతులు తమ పంథా వీడలేదు. ఈ క్రమంలో సుగర్స్ డెరైక్టర్లు ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు. అయినా తమ బిల్లులు చెల్లించే వరకు విశ్రమించేది లేదని రైతులు చెబుతున్నారు. అదే సమయంలో ఆదివా రం సమావేశమైన రైతు సంఘం నాయకులు మంగళవారం సుగర్స్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయూల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బొబ్బిలి : లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగారం చెరుకు రైతులకు రూ.24 కోట్ల బిల్లులు చెల్లించని కేసులో అరెస్ట్ అరుున కర్మాగార డెరైక్టర్లు నారాయణం మురళి, నారాయ ణం శ్రీనివాస్‌లకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని బొబ్బిలి సబ్‌జైలుకు పోలీసులు తరలించారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో వారిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. శనివారం అదుపులోకి తీసుకున్న డెరైక్టర్లను జిల్లా కేంద్రంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ ఆదివారం మీడియూ ముందు జిల్లా కేం ద్రం విజయనగరంలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి బొబ్బిలి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తరువాత సబ్‌జైలుకు తరలించే సమయంలో బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐ తిరుమలరావు బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఇదిలా ఉండగా డెరైక్టర్లు ఇద్దరిపై పార్వతీ పురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు బిల్లులు సకాలంలో చెల్లించలేదని, పూర్తిగా బిల్లులు ఇవ్వలేదని ఇద్దరు రైతులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వీరిపై మూడు కేసులను నమోదు చేశారు. మోసం చేసినందుకు 420 సెక్షన్‌ను, స్థిరాస్తులను దుర్వినియో గం చేసినందుకు 403 సెక్షన్‌ను, విశ్వాస ఘాతకానికి పాల్పడినందుకు 406 సెక్షన్‌ను, వ్యాపారిగా నమ్మించి మోసం చేసినందుకు 409 సెక్షన్‌ను, ఆర్థిక నేరాలకు కుట్ర పూర్వకంగా పాల్పడినందుకు 120 బి సెక్షన్‌ను నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన సమయంలో డెరైక్టర్లకు బెరుుల్ ఇవ్వాలని వారి తరఫున న్యాయవాదులు చేసిన దరఖాస్తును తిరస్కరించారు. సుగర్స్‌కు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు డెరైక్టర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు అభ్యర్థించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే డెరైక్టర్ల తండ్రి, మేనేజింగ్ డెరైక్టర్ అయిన నారాయణం నాగేశ్వరరావును ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగిన ఓ కుంభకోణం కేసులో ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ గ్రేవల్ విజయనగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. త్వరలోనే ఇక్కడకు రప్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా డెరైక్టర్లను అరెస్ట్ చేశారన్న వార్త తెలియడంతో కోర్టు, సబ్ జైలు వద్దకు ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులు వచ్చి వారిని కలుస్తున్నారు. -
రాజంపేట సబ్‌జైలుకు కన్నం
రాజంపేట, న్యూస్‌లైన్ : రాజంపేట సబ్‌జైలుకు కన్నం వేశారని ఆదివారం పట్టణంలో కలకలం రేగింది. దీంతో జైలు అధికారులు ఆ కన్నంను పరిశీలించారు. ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని భావించారు. ఇటీవల సబ్‌జైలును కొత్తగా నిర్మించారు. ఈ జైలుకు ప్రహారీ గోడ ఆఫీసర్స్ క్లబ్‌కు సమీపంలో ఉంది. ఈ గోడ అవతలి వైపు జైలులో ఉన్న వినాయకస్వామి గుడికి వస్తుంది. ఆ తర్వాత ఖైదీలు ఉండే గదులు, బాత్ రూములు ఉన్నాయి. ఈ గోడకు రంధ్రం ఎందుకు వేశారనే అన్న సందేహాలు వెలువడుతున్నాయి. జైలు ప్రహరీకి రంధ్రం పడిన విషయం తెలుసుకున్న జైలు సూపరిండెంట్ బీ.రవిశంకర్‌రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించారు. కన్నం కాదని, ఇది ఆకతాయిలు చేసిన పని అని వివరించారు.