అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్‌జైలులో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పటాన్ షమీర్ ఖాన్(35) అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్‌జైలులో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పటాన్ షమీర్ ఖాన్(35) అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం సబ్ జైలులో స్నానాల గదికి వెళ్లిన షమీర్ గంజి వార్చేందుకు ఉపయోగించే తాడుతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నానాల గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి వెళ్లి పరిశీలించగా... ఉరేసుకున్న విషయం తెలిసింది.
వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతని భార్య షాను ప్రస్తుతం జిల్లాలోని సోమదేవపల్లి మండలం పత్తికుంటపల్లిలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఘటనపై జిల్లా జైళ్ల శాఖ అధికారి సుదర్శన్‌రావు విచారణ జరిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను జైళ్ల శాఖ డీఐజీకి పంపుతామని తెలిపారు.