uravakonda
-
భూ వివాదంలో దళితులపై దాడి చేసిన టీడీపీ నేతలు
-
అనంతపురం జిల్లాలో బరితెగించిన పచ్చ పార్టీ నేతలు
-
వైఎస్సార్సీపీ పోరుబాటపై బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్‌కు పోలీసులు పిలిపించారు.వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే! -
ఉరవకొండ టీడీపీ నేతలకు ప్రణయ్ రెడ్డి వార్నింగ్
-
వైఎస్ఆర్ జయంతి.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-
మీ ప్రవర్తన మార్చుకోకపోతే.. మేము మారాల్సి వస్తుంది జాగ్రత్
-
ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
ఉరవకొండ తిరుగు ప్రయాణంలో వినతులు స్వీకరించిన సీఎం జగన్
-
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్‌గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. -
ఉరవకొండ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్ హైలైట్
-
చంద్రబాబు అభిమానం సంఘం కూడా స్టార్ క్యాంపెయినర్లే: సీఎం జగన్
-
ఉరవకొండలో సీఎం జగన్ బహిరంగ సభ
-
అభిమానానికి హద్దు లేదు..!
-
బటన్ నొక్కిన జగన్ నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!
-
ఉరవకొండకు సీఎం జగన్ వరాల జల్లు..!
-
జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా
-
మహిళా సాధికారతకు దన్నుగా నిలిచాం: సీఎం జగన్
అనంతపురం, సాక్షి: మహిళా సాధికారత సాధన.. సంక్షేమం అమలులో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల్ని మంగళవారం ఉరవకొండలో విడుదల చేశారాయన. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తున్నాం. నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైయస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతున్నాం. దేశ చరిత్రలోగానీ, మహిళా చరిత్రలోగానీ, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకొంటే అక్షరాలా రూ.25,570 కోట్లు ఖర్చు చేస్తున్నాం. .. ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా 21 శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డమీద, గడపగడపలోనూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 56 నెల్లలో ప్రతి అడుగూ మీ బిడ్డ ప్రభుత్వం వేసింది. మహిళా సాధికారతకు దన్నుగా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా 56 నెలల్లో సంక్షేమం, అభివృద్ధిలో తేడా కనిపించే విధంగా అడుగులు పడుతున్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే వివక్షకు, లంచాలకు చోటు లేకుండా ప్రతి పథకం మన రాష్ట్రంలో అమలవుతోంది. అర్హత కేవలం అదే.. ఈరోజు రూ.6,400 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా ఇచ్చేలా అడుగులు వేస్తున్నాం. ఈ ఒక్క పథకానికి(వైఎస్సార్ ఆసరా) సంబంధించి 25,570 కోట్లు ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాల్లో రూ.19,178 కోట్లు ఇవ్వడమే కాక, నాలుగో దఫా కింద రూ.6,400 కోట్లు కలుపుకొంటే రూ.25,570 కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పోతోంది. ఈ 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద 4968 కోట్లు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. వాళ్ల కాళ్ల మీద నిలబెట్టడం కోసం వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ ఆసరా రెండు కార్యక్రమాలు తీసుకుంటే 31వేల కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈరోజు నేడు విడుదల చేస్తున్న రూ. 6,400 కోట్లతో కలుపుకొంటే మనందరి ప్రభుత్వం 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.53 లక్షల కోట్లు. ఎక్కడా ఎవరూ ఎవరికి ఇస్తున్నాం అనేది వ్యత్యాసం చూపించడం లేదు. గతంలో ఏ పథకం కావాలన్నా మొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? అంతటితో ఆగిపోయేది కాదు జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరికీ లంచాలు. ఈరోజు 2.53 లక్షల కోట్లు ఎక్కడా కులం చూడటం లేదు, మతం, ప్రాంతం, వర్గం, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా మన పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి కుటుంబానికి పోతోంది. ఇంటింటా అక్కచెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్షరాలా 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికిచ్చిన సొమ్ము రూ.26.67 వేల కోట్లు. వైయస్సార్ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.25500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్క వైయస్సార్ చేయూత పథకం ద్వారా 45-60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఏకంగా 31.23 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ వారు బాగుండాలని, చిరునవ్వులు చూడాలని అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది రూ.14,129 కోట్లు. 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 22లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే. ఈ కడుతున్న ఇళ్లు పూర్తయితే రూ.2.70 లక్షలతో ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి రూ.5-20 లక్షల దాకా పలుకుతోంది. వాళ్లకు ఇస్తున్న ఆస్తి విలువ రూ.2-3 లక్షల కోట్లు. అవ్వా.. బాగున్నావా? అంటూ.. అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద తమ కాళ్ల మీద నిలబెట్టేందుకు కోటీ 5 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇచ్చినది రూ.4,968 కోట్లు. 25.40 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ పిల్లల కోసం విద్యాదీవెన కింద రూ.11,900 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275 కోట్లు ఇచ్చాం. కాపు అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం కింద రూ.2.28 వేల కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1,257 కోట్లు ఇచ్చాం. పేదల పెన్షన్ అందుకుంటున్న వారు 66.34 లక్షల మంది. ఇందులో 43,78,000 మంది పెన్షన్లు అందుకుంటున్న వారు నా అవ్వలు, నా అక్కచెల్లెమ్మలే. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా, అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా అని అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టి పోతున్నారంటే ఇది జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పెన్షన్ల సొమ్ము కింద ఖర్చు చేసిన సొమ్ము రూ.84,730 కోట్లు. ఇందులో 56,000 కోట్లు అవ్వలు, అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశాం. జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు రూ.2,610 కోట్లు అయితే, చేదోడు ద్వారా వాళ్లకు ఇచ్చిన సొమ్ము రూ.404 కోట్లు. ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో ఈ మాదిరిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసిందిగానీ, పట్టించుకున్నదిగానీ ఎప్పుడైనా చూశామా?. గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మిగలినవన్నీ మామూలే.అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనిపిస్తోంది. గతంలో ఎందుకు ఈ మంచి జరగలేదనేది ఆలోచన చేయమని అడుగుతున్నా. కారణం ఒక్కటే.గతంలో దోచుకో, పంచుకో, తినుకో. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎవరూ లంచం అడగడం లేదు, వివక్ష చూడం లేదు. దేశం మొత్తం వినిపించాలి.. వచ్చే 14 రోజులపాటు ఫిబ్రవరి 5వ తేదీ దాకా పండుగ వాతావరణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.6,400 కోట్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకుంటారు. అక్కచెల్లెమ్మల సంతోషాల్లో వీళ్లు ఏకమవుతారు. గ్రామ సచివాలయాల్లో మాట్లాడినప్పుడు అక్కచెల్లెమ్మలకు మైకులిచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, అక్కచెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయన్న కథలు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే వినిపించాలి. చంద్రబాబు చేసిన మోసం గుర్తుంది కదా? 2014 ఎన్నికల ముందు చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని, కట్టొద్దని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. కనపడకుండా చేశాడు. మాఫీ చేస్తానని చెప్పిన మాట గాలికొదిలేశాడు. అక్టోబర్ 2016 నుంచి అక్కచెల్లెమ్మలకు కడుతున్న సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. అప్పట్లో 14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు కాస్తా తడిసి మోపెడై వడ్డీలు,చక్రవడ్డీలు కట్టే పరిస్థితిలోకి పోయి 25500 కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు మాటతో ఏ రకంగా అక్కచెల్లెమ్మలు దెబ్బతిన్నారన్నదానికి ఇవే ఉదాహరణలు. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ నుంచి సంఘాలు చంద్రబాబు హయాంలో 19 శాతానికి పడిపోయాయి. కానీ, ఇవాళ.. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఈరోజు ఏకంగా 91 శాతం అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో సంఘాలు ఉన్నాయి.ఔట్ స్టాండింగ్ కింద 18 శాతం అక్కచెల్లెమ్మల రుణాలు ఎన్పీఏలుగా పడిపోయే కార్యక్రమం అప్పట్లో జరిగితే.. ఈరోజు పొదుపు సంఘాల్లో రుణాల రికవరీ 99.83 శాతంతో ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగిందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తపన, తాపత్రయంతో అడుగులు పడిన రోజులు ఈ 56 నెలల కాలంలోనే. సాధికారత దిశగా అడుగులు వేసే కార్యక్రమం జరిగింది. ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అడుగులు పడ్డాయి. నామినేషన్ పనుల్లో ఇచ్చే కాంట్రాక్ట్ పనులు కూడా 50 శాతం అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. భద్రత విషయంలోనూ.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక మహిళా కానిస్టేబుల్ నియమితులయ్యారు. దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లలో 1.46 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు, ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి ఏమైందని అడిగే గొప్ప వ్యవస్థ పుట్టుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే అని సీఎం జగన్ ప్రసంగించారు. ఇదీ చదవండి: రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. బాబుకు ప్రచారం: సీఎం జగన్ ఫైర్ -
ఉరవకొండలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు
-
జగన్ మామ పాటకు పిల్లల అందమైన డాన్స్
-
నారా లోకేష్, చంద్రబాబులకు విశ్వేశ్వర రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
వచ్చే 14 రోజులు పండగే: సీఎం జగన్
-
ఉరవకొండలో సీఎం జగన్ Grand Entry
-
పక్క పార్టీలో బాబుకి స్టార్ క్యాంపెయినర్లు: సీఎం జగన్
అనంతపురం, సాక్షి: ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై విసుర్లు విసిరారు. ‘‘ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు’’.. బాబు కోసం లిస్ట్ పెద్దదే.. ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోనూ.. .. వీళ్లుకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అంది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు. టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు. రక రకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే. స్టార్ క్యాంపెయినర్లలో నాది రికార్డు ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ * బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లూ లేరు. కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు. వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు. మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా? కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా.. కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా. వీళ్లే నాకు అండ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైయస్సార్ ఆసరా అందుకున్న నా అక్కచెల్లెమ్మలంతా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. -
‘అలా చేస్తే పయ్యావుల కూడా టీడీపీలో మిగలడు’
అనంతపురం, సాక్షి: ఎన్నికలొచ్చినప్పుడే పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ గుర్తొస్తుందని.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సీఎం జగన్మోహన్రెడ్డి హాజరైన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన విశ్వేశ్వరరెడ్డి.. పయ్యావులపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది. కులాలు మతాలకు అతీతంగానే కాదు.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పార్టీ కండువా కప్పుకుంటేనే లబ్ధి చేకూరుస్తామని చెప్పేవాళ్లు. మీలా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఒక్కరైనా ఉండేవారా?.. ఆఖరికి పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో మిగలడు. మేం ప్రజాస్వామ్య వాదులం కాబట్టే అలా చేయం. నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. ..ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు అని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు జరిగాయి. జగన్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి - సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించదు. సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు. ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా అని విశ్వేశ్వర్‌రెడ్డి తన ప్రసంగం ముగించారు. -
నాలుగో విడత వైఎస్సార్ ఆసరా: నిధులు విడుదల చేసిన సీఎం జగన్
వైఎస్సార్ ఆసరా.. సీఎం జగన్ ఉరవకొండ పర్యటన అప్డేట్స్ ►నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. 12:32 AM, జనవరి 23 2023 ఎంతో సంతోషంగా ఉంది: సీఎం జగన్ దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నాం వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్లు జమ చేశాం మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుంది ఎక్కడా లంచాలు ల్లేవ్.. వివక్షకు చోటు లేదు.. వ్యత్యాసాలు ల్లేవ్.. ఇది రికార్డే రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై సంతోష పడుతున్నా గతంలో అంతా లంచాల మయం ఇప్పుడు ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ప్రామాణికంగా లబ్ధి చేకూరుస్తున్నాం పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు చెల్లించాం ఆసరా, సున్నా వడ్డీ కింద రూ.31 వేల కోట్లు అందించాం 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు రూ.2.53 లక్షల కోట్లు అందించాం ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డు జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు అందించాం వైఎస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్ల రుణాలు చెల్లించాం వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు అందించాం గత ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో గతంలో అక్కచెల్లెమ్మలకు ఎందుకు మంచి జరగలేదు? అక్కచెల్లెమ్మల కుటుంబాలను పట్టించుకునే పరిస్థితి గతంలో చూశామా? 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఇళ్లు పూర్తయితే రూ.5 లక్షల విలువైన ఆస్తి వారి చేతుల్లో ఉంటుంది డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేశారు చంద్రబాబు మోసాలతో సంఘాల గ్రేడ్లు పడిపోయాయి అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉంది 12:12 AM, జనవరి 23 2023 మాకు జగనన్న ఉన్నాడనే భరోసా ఉంది మాది నిరుపేద కుటుంబం. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లిద్దరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుతున్నారు. ప్రభుత్వాల నుంచి వాళ్లకు లబ్ధి చేకూరుతోంది. నేను రూ.30 వేల లబ్ధి పొంది చిన్నవ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గతంలో లాగా లేదు ఇప్పుడు.. మీరిచ్చిన ధైర్యం మేం మరిచిపోలేం. ఆరోగ్యశ్రీ ద్వారా బేతారి పని చేసే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగానని భావోద్వేగానికి లోనయ్యారామె. చివర్లో సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నారామె. :::మమత.. వజ్రకరూర్ గ్రామం 12:12 AM, జనవరి 23 2023 సీఎం జగన్ చెప్పాడంతే.. చేస్తాడంతే: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రసంగం సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి కండువా వేసుకుంటేనే పథకం ఇస్తామన్న పాలన టీడీపీది నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే కండువా కప్పుకుంటానంటేనే పథకం ఇస్తానంటే.. మీ పార్టీలో ఎవరూ మిగిలేవారు లేరు మేం ప్రజాస్వామ్యవాదులం మీలా చేస్తే.. పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో ఉండేవాడు కాదు పయ్యావుల ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేం లేదు ఎన్నికలప్పుడు తప్పా ఎప్పుడూ జనాలకు కనిపించడు సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా 11:49 AM, జనవరి 23 2023 వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం ఉరవకొండలో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి హాజరు పూల మాలతో వైఎస్సార్‌కు నివాళి జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ 11:40 AM, జనవరి 23 2023 ఉరవకొండ సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్ సాదర స్వాగతం నడుమ.. ఉరవకొండ సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్ స్థానిక నేతలతో మాటామంతీ అక్కాచెల్లెమ్మల బాగోగులు అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ కాసేపట్లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం 11:01 AM, జనవరి 23 2023 ఉరవకొండకు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్ ఉరవకొండ బైపాస్ రోడ్డు బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభకు భారీగా హాజరైన డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలు నాలుగు విడతల్లో 25571 కోట్ల రూపాయల రుణాలను చెల్లించిన జగన్ ప్రభుత్వం సీఎం జగన్‌కి స్వాగతం పలికిన ఉరవకొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, నేతలు 10:06 AM, జనవరి 23 2023 పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు 09:25 AM, జనవరి 23 2023 ఉరవకొండ బయల్దేరిన సీఎం జగన్ అనంతపురం ఉరవకొండ బయల్దేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించి.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్ 09:15 AM, జనవరి 23 2023 సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా.. తొలుత ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు నేడు వైఎస్సార్ ఆసరా పంపిణీ నేడు రూ.6,394.83 కోట్ల నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కార్ భరోసా 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు ఇందులో మూడు విడతల్లో ఇప్పటికే రూ.19,175.97 కోట్లు చెల్లింపు నేటి నుంచి ఆఖరిదైన నాలుగో విడత మొత్తం జమ అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రెండు వారాలపాటు ఉత్సవంలా కార్యక్రమాలు ప్రజల్లో తనపట్ల ఉన్న విశ్వసనీయత, నమ్మకాన్ని మళ్లీమళ్లీ చాటుకుంటున్న జగన్ చంద్రబాబు నిర్వాకంతో కుదేలైన సంఘాలన్నీ మళ్లీ గాడిలోకి.. సర్కారు చర్యలతో పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుంచి 0.17 శాతానికి తగ్గుదల 56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి.. వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది. ► అంతేకాక.. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి. ► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ► అనంతరం.. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా‘, ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి. ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు.. ఇక వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే.. ► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు. ► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. ► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు. ► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. -
చెప్పింది చెప్పినట్లుగా.. నేడు ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ
సాక్షి, అమరావతి: చెప్పాడంటే చేస్తాడంతే.. అన్న నినాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మల విషయంలో అక్షరాలా నిజం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వారికి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. మాట ఇస్తే తప్పడని ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ఆయన తన విశ్వసనీయతను మళ్లీమళ్లీ చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని ఇప్పుడు సంపూర్ణంగా అమలుచేయబోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో ఆయన డ్వాక్రా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమచేయగా.. తాజాగా, మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను జమచేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్ పూర్తిస్థాయిలో నెరవేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) గణాంకాల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది డ్వాక్రా మహిళల పేరిట రూ.25,570.80 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ఆయా మహిళల ఖాతాల్లో జమచేశారు. ఇక మంగళవారం నుంచి నాలుగో విడతగా మిగిలిన రూ.6,394.83 కోట్లను కూడా నేరుగా వారి ఖాతాల్లో జమచేయబోతోంది. ఈ నేపథ్యంలో.. నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజానికి.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టొద్దు.. పొదుపు సంఘాల తరఫున తామే చెల్లిస్తామని 2014లో పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీ ఇచ్చారు. కానీ, దాన్ని అమలుచేయని కారణంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఆ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాటికి తిరిగి ఊపిరిపోశారు. ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు.. ఇక వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే.. ► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు. ► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. ► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు. ► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు. నేడు సీఎం జగన్ ఉరవకొండ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23న మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించి, డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేస్తారు. ఉ.8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు, ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. 56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి.. వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది. ► అంతేకాక.. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. ► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి. ► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ► అనంతరం.. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా‘, ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి. -
నేడు రాజనగరం, ఉరవకొండలో సామాజిక సాధికార యాత్ర
-
దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర పయ్యావుల కేశవ్‌దే: విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను బెదిరించేలా పయ్యావుల వ్యవహరిస్తున్నారని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు పయ్యావుల కేశవ్ నమోదు చేయించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తప్పేంటి?. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి?. దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌దేనని విశేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం -
ఉరవకొండలో సంబరాలు జరుపుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
జగన్ మరోసారి సీఎం కావాలంటూ నియోజకవర్గాల్లో బైక్ యాత్ర
-
తెలుగు టీచర్‌కు ‘తెగులు’.. విద్యార్థినులతో తరగతి గదిలోనే వికృత చేష్టలు
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తన చేష్టల ద్వారా వికృతరూపాన్ని బయటపెట్టాడు. ఆయన చేష్టలు శ్రుతిమించడంతో విద్యార్థినులు తమ ఇళ్లల్లో చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కామోపాధ్యాయుడి బడితపూజ చేయాలనుకున్న చర్యలను ఉపాధ్యాయులు నిలువరించారు. బాధితుల తల్లిదండ్రుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నింబగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొమ్మిది మంది టీచర్లు పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ వెంకటేశులు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు బోధిస్తున్నారు. ఈయన ఇటీవల కాలంలో పాఠాలను పక్కనపెట్టి అమ్మాయిలపై ‘ఫోకస్’ పెట్టాడు. ఓనీ తీసి డ్యాన్స్ చేయాలని, తనకు ముద్దులు పెట్టాలని అమ్మాయిలను ఒత్తిడి చేసేవాడు. ద్వందార్థాలు, వెకిలి చేష్టలు వికృతరూపం దాల్చాయి. టార్చర్ తట్టుకోలేక కొంతమంది విద్యార్థినులు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆగిపోతున్నారు. చదవండి: (ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!) ఇందుకు గల కారణాలను పలువురు తల్లిదండ్రులు తెలుసుకుని 15 రోజుల క్రితం టీచర్ వెంకటేశులుపై ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు పోలీసులు సదరు టీచర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. తాను సరిగా చదవకపోతే కొట్టాను తప్ప, అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పడంతో.. మరోసారి ఇలా జరగకుండా బుద్ధిగా ఉండాలని వెంకటేశులుకు చెప్పి పంపించేశారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. తన పంథా మార్చుకోలేదు. మళ్లీ అమ్మాయిలను వేధించడం కొనసాగించాడు. తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని తల్లిదండ్రులు రగిలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల వద్దకెళ్లి ఆందోళనకు దిగారు. తెలుగు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటాడా అంటూ ఆగ్రహంతో టీచర్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని పసిగట్టిన హెచ్ఎం విజయలక్ష్మి సదరు టీచర్ వెంకటేశులును ఓ గదిలో పెట్టి తాళం వేసి.. పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు. -
దుకాణంలో మంటలు.. రూ.8 లక్షల నగదు.. 50 పట్టు చీరలు దగ్ధం
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి రూ. 8 లక్షల నగదు, ఇల్లు దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు... స్థానిక 10వ వార్డులో నివాసముంటున్న చంద్రనాథ్ పట్టుచీరల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి చంద్రనాథ్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి, సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. అప్పటికే ఇంట్లో విలువైన వస్తు సామగ్రితో పాటు వ్యాపారం కోసం ఉంచిన 50 పట్టు చీరలు, రూ.8 లక్షల నగదు కాలిపోయాయి. రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఘటనపై సీఐ హరినాథ్ దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో పేకాట
ఉరవకొండ: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పలువురు టీడీపీ నేతలతో సహా 56 మందిని అరెస్ట్ చేశారు. రూ.10.51 లక్షల నగదు, ఐదు కార్లు, 14 బైక్‌లు, 54 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండలో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, సీఐ శేఖర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున పేకాట సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సీఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. వై.రాంపురం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు, రౌడీషీటర్ ఎర్రిస్వామి, కౌకుంట్ల టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు శీనా సహా 56 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా బెళుగుప్ప, కౌకుంట్ల, వై.రాంపురం తదితర గ్రామాలకు చెందిన వారు. టీడీపీ ముఖ్య నేత బోయ మారెప్ప ఆధ్వర్యంలో పేకాట స్థావరం కొనసాగుతున్నట్టు గుర్తించారు. చదవండి: (ఈ పాపం బాబుది కాదా?) -
‘జైద్ లే నాన్నా.. ఒక్కసారి ఇటు చూడు.. ఎంత పనిచేశావ్’
ఉరవకొండ(అనంతపురం జిల్లా): ‘నాన్నా జైద్ కన్నులు తెరు... ఒక్కసారి ఇటు చూడు... లే నాన్నా.. లే.. యా అల్లాహ్ ఎంత పనిచేశావయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఉన్న ఒక్క కొడుకూ చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వివరాల్లోకెళితే... ఉరవకొండ పట్టణంలోని ఇందిరానగర్‌లో జైనుల్లా, యాస్మిన్ దంపతులు నివాసం ఉంటున్నారు. జైనుల్లా టెంకాయల వ్యాపారం చేస్తున్నాడు. చదవండి: అర్ధరాత్రి ఆలయానికి ఎలుగు బంటి.. తాళాలు వేసి ఉండటంతో ఏం చేసిందంటే? వీరికి ఒక్కగానొక్క కుమారుడు మహ్మద్ జైద్ (20 నెలలు) ఉన్నాడు. మహ్మద్ జైద్ గురువారం ఎదురింట్లో ఆడుకోవడానికి వెళ్లాడు. తెరిచి ఉన్న సంప్ వద్ద ఆడుతుండగా పొరపాటున సంప్‌లో పడిపోయాడు. ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి కూడా గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత ఎదురు ఇంట్లో ఉన్న వారు గమనించి వెంటనే సంప్‌లోని నుంచి బాబును బయటకు తీసి హుటాహుటినా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించడంతో బాబు తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన లారీ
-
కారు, లారీ ఢీ..9 మంది దుర్మరణం
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ఇన్నోవా వాహనంలోనే మరణించగా.. దాన్ని నడుపుతున్న పెళ్లికుమార్తె తండ్రి, బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు (58) ఆస్పత్రిలో ప్రాణాలొదిలారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం, ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న పెద్దలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన వెంకటప్పనాయుడు కుమార్తె వివాహవేడుక ఆదివారం కర్ణాటక బళ్లారిలో జరిగింది. పెళ్లి ముగిశాక వెంకటప్పనాయుడు, ఆయన బంధువులు 8 మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వెంకటప్పనాయుడు డ్రైవింగ్ చేయసాగారు. బూదగవి వద్ద వీరి వాహనం, అనంతపురం నుంచి బళ్లారి వైపు ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రోడ్డుపక్కనున్న పొలంలోకి దూసుకెళ్లాయి. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఛిద్రమై.. ఇన్నోవాలోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో వెలికి తీయాల్సి వచ్చింది. చదవండి: చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం! అంతా బంధువులే.. ప్రమాదంలో కోకా వెంకటప్పనాయుడుతో పాటు బంధువులు బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చెందిన సరస్వతి(60), ఆమె కుమారుడు అశోక్(35), కుమార్తె స్వాతి(38), స్వాతి కవల పిల్లలు జాహ్నవి (12), జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ(48), రాయలప్పదొడ్డికి చెందిన సుభద్రమ్మ(60), పిల్లలపల్లికి చెందిన శివమ్మ (35) మృతిచెందారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇన్నోవా వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదస్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మార్చురీలోని మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరిశీలించి, మృతుల కుటుంబాలను ఓదార్చారు. కాగా మృతుల కుటుంబాలకు ఎంపీ తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. -
పదేళ్ల కల.. ఫలిస్తున్న వేళ
ఉరవకొండ: పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పాలనలో ఇళ్ల పట్టాలు పొందినా ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియవు. అడిగినా చూపేవారు లేరు. ఇక తమ ఆశలు అడియాసలయ్యాయనుకుంటున్న వేళ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 వైకుంఠ ఏకాదశి రోజున ఇళ్ల పట్టాల మంజూరుతో పాటు పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు నివేశన స్థలాల పంపిణీ కోసం 2008లో ఉరవకొండ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో 88 ఎకరాల భూమిని కొనుగోలు చేయించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఈ మేరకు భూమి సేకరించారు. అనంతరం టీడీపీ అధికారంలోకొచ్చింది. అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి అవకాశం ఉన్నా తాత్సారం చేశారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసుకుని లబ్ధి పొందేందుకు అసమగ్ర వివరాలతో కూడిన మూడు వేల పట్టాలను హడావుడిగా ఉరవకొండలో పంపిణీ చేశారు. అయితే 15 సర్వే నంబర్లతో పేర్కొన్న పట్టాలో ఎవరి స్థలం ఎక్కడుందో చూపించలేకపోయారు. చెక్కు బందీలు లేవు.. ఎవరు ఎక్కడో తెలీదు.. అయినా పక్కాగృహాలు కూడా మంజూరైనట్లు ప్రకటించారు. ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడారని పేదలకు నిదానంగా అర్థమయ్యింది. సొంతింటి కల సాకారమైందిలా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి పట్టా, పక్కా గృహ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులైన పేదలందరికీ పట్టాలు మంజూరు చేయనున్నారు. తాజాగా 8,651 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనుండగా.. గత టీడీపీ హయాంలో పక్కాగృహాలు మంజూరై నిర్మాణాలు చేపట్టని వారిని కూడా కలుపుకొని 25,391 మందిని ‘అందరికీ ఇళ్లు’ పథకంలో చేర్చారు. ఇళ్ల మంజూరులో రెండోస్థానం పేదలకు పక్కా ఇళ్ల మంజూరులో రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా తరువాత ఉరవకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా 25,391 పక్కాగృహాలు మంజూరయ్యాయి. పక్కా ఇళ్ల మంజూరులో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి ఇస్తున్న పట్టాలో స్థలం, చెక్కుబందీలు స్పష్టంగా కనబరిచారు. నివేశన స్థలాల కోసం ఎంపిక చేసిన లే అవుట్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టా కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. జగనన్న ప్రభుత్వం మాకు ఇంటి పట్టా మంజూరు చేసి ఈ నెల 25న అందిస్తోంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటి పట్టాతో పాటు పక్కా ఇల్లు కట్టిస్తుండటంతో నాసంతోషం మాటల్లో చెప్పలేను. – బీబీ, పదో వార్డు, ఉరవకొండ పార్టీలకతీతంగా ఇంటి పట్టా అర్హులైన ప్రతి పేదవారికీ జగనన్న ప్రభుత్వం ఇంటి పట్టా అందించబోతోంది. గత టీడీపీ హయంలో ఇంటి పట్టా కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం పారీ్టలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పట్టా, పక్కా ఇల్లు మంజూరు అవుతోంది. – ఏసీ పార్వతమ్మ, అంబేడ్కర్‌నగర్, ఉరవకొండ -
సొంత అన్ననే కడతేర్చిన తమ్ముడు..
సాక్షి, అనంతపురం: భార్యతో దుర్భాషలాడాడన్న కోపంలో సొంత అన్ననే తమ్ముడు హతమార్చిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో గురువారం చోటు చేసుకుంది. ఉరవకొండకు చెందిన మల్లెష్ భార్యను ఇటీవల తన అన్న రామాంజనేయులు అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయం మనసులో పెట్టుకున్న మల్లెష్ అన్న రామాంజనేయులును రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం అన్న మృతదేహం పక్కనే కూర్చుని మీడియాతో మాట్లాడాడు. -
మానవత్వం చాటిన ఎస్ఐ ధరణిబాబు
సాక్షి, ఉరవకొండ: కరోనా అనుమానిత లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఒక వ్యక్తి అంత్యక్రియలను ఉరవకొండ ఎస్ఐ ధరణి బాబు దగ్గరుండి జరిపించారు. వివరాలు ఇలా.. ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15న రాత్రి జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే 108తో పాటు ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబుకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే స్పందించి అందుబాటులో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్‌లో బాధితుడిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆ వ్యక్తి మృతిచెందాడు. కరోనా అనుమానిత లక్షణాలతో మృతిచెందడంతో మృతదేహాన్ని ఉరవకొండకు తరలించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు తిరిగి ఎస్ఐ ధరణిబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేయించి మృతదేహాన్ని ఉరవకొండకు రప్పించుకోవడమే కాక, దగ్గరుండి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయినా వారందరూ ఉన్నా.. ఒక్కరూ ముందుకురాని విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన ఎస్ఐకు ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి -
విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి
ఉరవకొండ: రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకునే అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ► స్థానిక బాలాజీ థియేటర్ ఎదురుగా ఎస్సీ కాలనీలో నివసిస్తున్న అన్నదమ్ములు రమేష్ (55), మల్లేష్ (52) రిక్షా తొక్కుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ► సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రమేష్ ఇంటికి సంబంధించిన విద్యుత్ సర్వీసు వైరు తెగిపోయి పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకు కంచెపై పడింది. ► ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన రమేష్ ట్యాంకు వద్ద ఉన్న కంచెను ముట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలాడు. ► అన్న కింద పడటం గమనించిన తమ్ముడు మల్లేష్ పరుగెత్తుకుని వెళ్లి కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మల్లేష్ కూడా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. ► కొద్ది సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ► విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట మృతదేహాలతో నిరసనకు దిగారు. ► అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ► పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ► రమేష్‌కు భార్య రాధమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లేష్‌కు భార్య తిప్పమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. -
వీడియో కాల్ ద్వారా కడసారి చూపు
ఉరవకొండ: లాక్డౌన్ కారణంగా ఆ తల్లిదండ్రులు కొడుకును కడసారి చూసుకోలేకపోయారు. అంత్యక్రియలను వీడియో కాల్లో చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, శివమ్మ దంపతుల కుమారుడు సుంకన్న(46) హైదరాబాద్‌లో కారు డ్రైవర్. ఆయన భార్య పార్వతి ఏడు నెలల గర్భిణీ. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాపిల్లలతో సుంకన్న (ఫైల్) ► సుంకన్న శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. ► అతడి తల్లిదండ్రుల సమక్షంలో అంత్యక్రియలు చేయాలని మృతదేహంతో పార్వతి బయలు దేరింది. ► అంత్యక్రియలు పూర్తయ్యాక 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఇక్కడి అధికారులు ఫోన్లో ఆమెకు చెప్పడంతో వెనుదిరిగింది. ► హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియో కాల్ ద్వారా ఆ కార్యక్రమాన్ని మృతుడి తల్లిదండ్రులకు చూపించారు. -
ఉరవకొండలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
టీడీపీ జల రాజకీయం
-
హద్దులు దాటిన ప్రేమ.. పెళ్లి కాకుండానే
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : తొందరపాటు నిర్ణయాలతో ఆ ప్రేమికులు పెళ్లి చేసుకోకనే ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి యువతి గర్భం దాల్చింది. పెద్దలకు చెప్పకుండా, అనుమానం రాకుండా చూసుకున్న యువతికి ఏడవ నెలలోనే పురిటినొప్పులు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆదివారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకముందే తానే కారణమంటూ ఓ యువకుడు పోలీసులను కలిసి ఒప్పుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. ఉరవకొండ పట్టణానికి చెందిన యువతి, యువకుడి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అలా శారీరకంగానూ కలుస్తుండటంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఇంట్లో ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టింది. రోజురోజుకూ ఆమె శరీరంలో మార్పులు వస్తున్నా తల్లిదండ్రులూ గమనించలేకపోయారు. ఏడు నెలల గర్భంతో ఉన్న యువతికి నొప్పులు రావడంతో తల్లి అనుమానం వచ్చి గట్టిగా మందలించింది. అప్పుడు తాపీగా అసలు విషయం చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఆ యువతి మగబిడ్డను ప్రసవించింది. విషయం తెలియగానే యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యువతిని ప్రేమించింది తానేనని ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బాధిత యువతి నుంచి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదు. (కూతురు క్యారెక్టర్‌ను అనుమానించి..) ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు తలుపుల: ప్రేమ పేరుతో కొందరు యువకులు బాలికల వెంటపడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. పెద్దలకు తెలిసినా మందలించినా వినకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తలుపుల మండలం కొత్తపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు సమీప గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అలా రోజూ పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో కలుసుకునేవారు. రెండు రోజుల కిందట మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత శనివారం రాత్రి గ్రామ సమీపంలోని వదిలేసి వెళ్లిపోయాడు. బాలికను మోసం చేసి తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్‌కుమార్‌రెడ్డిపై పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ మధు ఆదివారం తెలిపారు. (ఆ తప్పటడుగే యువతి ప్రాణం తీసింది) యువకుడిపై పోక్సో కేసు అనంతపురం న్యూసిటీ: తొమ్మిదో తరగతి అమ్మాయిని వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురంలోని సాయినగర్ 5వ క్రాస్‌లో ఉంటున్న ఎ.హుస్సేన్ జీసస్నగర్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో వారం రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు. బాలిక ఎక్కడికి వెళ్లినా ప్రేమించాలంటూ వెంటబడుతున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హుస్సేన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ ఎం.శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ప్రేమ విఫలమై మహిళా వలంటీర్ ఆత్మహత్య గుత్తి: ప్రేమ విఫలమై మహిళా వలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి 1వ బ్లాక్ వార్డు వలంటీర్ రమా భార్గవి (23), ఇదే గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ ఇమామ్ హుసేన్(మసి) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇమామ్ హుసేన్‌కు పది రోజుల కిందట మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రమాభార్గవి మదనపడుతుండేది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో తాను జీవించడం వ్యర్థమని భావించి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాసేపటి తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి రమాభార్గవిని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమా భార్గవి మృతికి వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది సంతాపం ప్రకటించారు. -
అంతు చూస్తాం: పయ్యావుల అనుచరులు
‘పంచాయతీ విభజన కావాలంటూ గ్రామ సభలో ఎవరైనా ఒప్పుకుంటే అంతుచూస్తాం... షావుకారికి వ్యతిరేకంగా మాట్లాడినా మీ ప్రాణాలు గాల్లో కలుస్తాయ్’ అంటూ రెండు రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పంచాయతీ విభజనను అడ్డుకుంటూ ప్రజలు నోరు మెదపకుండా పయ్యావుల అనుచరులు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 సంవత్సరాలు పైబడినా.. ఇంకా ఈ ప్రాంతాలు భూస్వాముల కబంధహస్తాల్లోనే చిక్కుకున్నాయనేందుకు ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి. ఇక్కడ వారు చెప్పిందే వేదం. వారి మాటను బేఖాతరు చేస్తే ఎంతటికైనా తెగిస్తారు. పయ్యావుల సోదరులు సాగిస్తున్న అరాచకాలతో కౌకుంట్ల పంచాయతీ ప్రజలు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద కౌకుంట్ల గ్రామానికి రక్త చరిత్రే ఉంది. ఇక్కడ భూస్వాములదే రాజ్యం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై అభిమానంతో పెద్ద కౌకుంట్ల పంచాయతీలోని వై.రాంపురం గ్రామంలో సూరయ్య అనే వ్యక్తి తన ఇంటిపై కాంగ్రెస్ జెండా కట్టాడు. ఈ విషయాన్ని పయ్యావుల సోదరులు అప్పట్లో జీర్ణించుకోలేకపోయారు. వారి కనుసన్నల్లోనే సూరయ్యను అత్యంత దారుణంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతోపాటు వైఎస్సార్ సీపీకి ఓటు వేశారన్న నెపంతో కౌకుంట్ల గ్రామంలోని దళితులపై విచక్షణారహితంగా పయ్యావుల అనుచరులు దాడులకు తెగబడ్డారు. దీని వెనుక కూడా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలోనే వారి కబంధ హస్తాల నుంచి విముక్తి కోరుకుంటూ పెద్ద కౌకుంట్ల పంచాయతీ విభజనకు ప్రజలు పట్టుబట్టారు. అడుగడుగునా అడ్డంకులు పెద్ద కౌకుంట్ల పంచాయతీ పరిధిలో కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మొత్తంగా 7,118 జనాభా ఉంది. 5,500 మంది ఓటర్లు ఉన్నారు. భూస్వాముల అరాచకాలను భరించలేక పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజన చేయాలంటూ గత ఏడాది ప్రభుత్వాన్ని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు అప్పట్లో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాతపూర్వకంగా అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై 2019, సెప్టెంబర్ 30న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే కేశవ్ ప్రమేయంతో అనచరులు గందరగోళాన్ని సృష్టించి అభిప్రాయాలను వెల్లడించకుండా ప్రజలను అడ్డుకున్నారు. పంచాయతీ విభజనకు అనుకూలంగా ఎవరూ చేతులెత్తకుండా పయ్యావుల గుండాలు పహారా కాశారు. అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి, నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీనిపై విచారణ అనంతరం ఈ నెల 30న మరోసారి అభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేయాలంటూ అధికారులను కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. పంచాయతీ విభజన జరిగితే తమ ఓటు బ్యాంక్‌కు దెబ్బపడడంతో పాటు, ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించిన పయ్యావుల వర్గం మరోమారు గ్రామసభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రెండు రోజులుగా పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి చీరలు, మద్యం బాటిళ్లను బలవంతంగా అంటగట్టి విభజనకు అనుకూలంగా చేతులెత్తితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. చాలామంది ఊళ్లు వదులుతున్నారు పంచాయతీ విభజన జరగకుండా పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు అడ్డుపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి విభజనకు వ్యతిరేకంగా చేతులెత్తాలని భయపెడుతున్నారు. దీంతో చాలా మంది ఊళ్లు వదిలి వెళుతున్నారు. – సిద్దారెడ్డి, కౌకుంట్ల పంచాయతీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు గ్రామంలో ప్రజలను పయ్యావుల కేశవ్ అనుచరులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బు, మందు బాటిళ్లు, చీరలు బలవంతంగా ప్రజలకు అంటగట్టి, పంచాయతీ విభజనకు వ్యతిరేకంగా చేతులు ఎత్తాలని చెబుతున్నారు. – వసంతమ్మ, కౌకుంట్ల ధైర్యంగా ముందుకు రండి కౌకుంట్ల భూస్వాముల అరాచక పాలనకు స్వస్తి పలకడానికి పంచాయతీ ప్రజలు ధైర్యంగా ముందుకు రావాలి. పంచాయతీ విభజనకు సంబంధించి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్త పరచాలి. చీరలు, డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురికావద్దు. – అశోక్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, రాకెట్ల -
ఉరవకొండలో ఆటో కార్మికుల సంబరాలు
సాక్షి, అనంతపురం: ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని..వారికి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండలో సోమవారం విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆర్థిక సాయం అందించిన సీఎం జగన్‌కు ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా హామీలను గాలికొదిలేయకుండా ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నాలుగు నెలల్లోనే నెరవేర్చి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారన్నారు. (చదవండి: నేను విన్నాను.. నేను చేశాను : సీఎం జగన్) -
గాంధీ మార్గం.. అనుసరణీయం
బ్రిటిష్ పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం మహాత్మాగాంధీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ... తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారిన తీరు అమోఘం. అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టిన తీరు అద్భుతం. ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బాపూజీ. తరాలు.... యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. గాంధీ అహింస సిద్ధాంతం కాలాతీతం. దానికి మరణం లేదు. ఈ నేపథ్యంలోనే మహాత్ముడి 150వ జయంతిని బుధవారం ఉత్సవంలా అంగరంగవైభవంగా చేయడానికి జిల్లా సిద్ధమైంది. ఇందులో భాగంగానే జిల్లాలో గాంధీ నడియాడిన ప్రాంతాలు, విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం అనంతలో మహాత్ముడి అడుగుజాడలు సాక్షి , అనంతపురం : స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ చాలా పర్యాయాలు అనంతలో పర్యటించారు. 1921లో లోకమాన్య తిలక్ నిధి వసూలు కార్యక్రమంలో, 1929లో ఖద్దరునిధి వసూలు కార్యక్రమంలో, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలో గాంధీజీ విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎప్పుడు వచ్చినా జిల్లావాసులు హార్థికంగా, ఆర్ధికంగా ఆదరించారు. భక్తి నీరాజనాలర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచారు. గ్రామాల నుంచి బండ్లు కట్టుకుని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. దురాచారాలు రూపుమాపండి 1921, సెప్టెంబర్ 20న గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. కలచవీడు వెంకటరమణాచార్యులు గాంధీజీని పద్యాలతో స్తుతించారు. హిందూముస్లింల ఐక్యత గురించి, జూదం, తాగుడు, వ్యభిచారం మానమని, అస్పృశ్యతను విడనాడాలని ఆ రోజుల్లో గాంధీజీ బోధించారు. ఆ సభలో వేలాది మంది స్త్రీలు తమ ఆభరణాలను స్వాతంత్ర సమరానికి విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 30న గాంధీజీని అరెస్టు చేస్తారన్న వదంతులు వ్యాపించడంతో బ్రిటీష్‌వారిని అడ్డుకోవడానికి కల్లూరు సుబ్బారావు ఆయన వెన్నంటే నడిచారు. అప్పుడే ఖద్దరు కట్టారు.. 1929, మే 16న మరోసారి అనంత పర్యటనకు గాంధీజీ వచ్చారు. కదిరి, కుటాగుళ్ల, ముదిగుబ్బ, దంపెట్ల గ్రామాలు తిరిగి రాత్రికి ధర్మవరం చేరుకున్నారు. దంపెట్ల గ్రామ ప్రజలు చిత్రావతి నది ఇసుకలో ఇరుక్కుపోయిన గాంధీజీ కారును దాటించారు. ధర్మవరంలో ప్రసగించిన అనంతరం ఆయన అనంతపురానికి చేరుకున్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు ఆయన వెంట ఉన్నారు. ఖద్దరు కట్టండని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో బ్రిటీష్ వస్త్రాలు తగలబెట్టి అనంతవాసులందరూ భారతీయత ఉట్టిపడే ఖద్దరు కట్టారు. అనంతరం గాంధీజీ తాడిపత్రికి వెళ్లారు. అక్కడ హైస్కూలు డ్రాయింగ్ మాస్టర్ ‘107’ అక్షరాలు రాసి బహుకరించిన బియ్యపు గింజ వేలం వేశారు. రూ.5,330లు నిధి వసూలైంది. అడుగడుగునా విరాళాల వెల్లువ.. 1934లో గుత్తి హైస్కూలు మైదానంలో జరిగిన సభలో కొందరు విద్యార్థులు గాంధీజీని పద్యాలతో సత్కరించారు. అనంతరం గుత్తి నుండి గుంతకల్లు వెళ్లే మార్గంలో తిమ్మన దర్గాలో ఒక తోళ్ల యజమాని కొడుకు మహదేవ (ఏడేళ్ల కుర్రాడు) గాంధీజీకి బంగారు ఉంగరం ఇచ్చాడు. అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్న గాంధీజీ అందరిలోనూ హృదయ పరివర్తన రావాలని అప్పుడే స్వాతంత్య్రం త్వరగా సిద్ధిస్తుందని చైతన్యపరిచారు. అక్కడ ఇద్దరు రైతులు విడివిడిగా కానుకలివ్వడంతో అందరూ ఐకమత్యంగా ఉంటేనే కానుకలు స్వీకరిస్తానని వారందరినీ సంఘటితపరిచారు. అక్కడ నుండి అనంతపురం చేరుకున్న గాంధీజీ హరిజన కాలనీలో కొళాయి ప్రారంభించారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లారు. హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ హరిజనుల పట్ల బేధభావం రూపుమాపాలని పిలుపునిచ్చారు. అంటరానితనం పోయేంత వరకూ తనకు మనశ్శాంతి లేదని పేర్కొన్నారు. గాంధీ పేరుతో వీధులు గాంధీజీ అడుగుపెట్టిన జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్యులు గాంధీజీ స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా ఘనంగా నివాళులర్పించడం పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా మారింది. గాంధీజీ తిరిగిన స్థ«లంగా భావించి పాతూరు ప్రధాన వీధికి గాంధీ బజారుగా నామకరణం చేశారు. నాలుగు కూడళ్ల మధ్యన నిలువెత్తు గాంధీజీ విగ్రహం అందరిని పలకరిస్తున్నట్లు అగుపిస్తుంది. ముఖ్యంగా కొత్తూరు ఆర్యవైశ్య సంఘం గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ సమీపంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహాన్ని పోలిన విధంగా భారీ ఎత్తున మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని బుధవారం రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. శాంతి ర్యాలీలు, మానవహారాలు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉరవకొండలో మహాత్ముడు జాతిపిత మహత్మాగాంధీ పాదస్పర్శతో 1934, మార్చిన ఉరవకొండ పునీతమైంది. విరాళాల సేకరణకు గాంధీజీ ఉరవకొండకు వచ్చారు. అప్పట్లో మహత్మ గాంధీ వెంట మాఘం సుబ్బరాయుడు, ఉప్పరగోవిందప్ప,ఎంసీ నరసింహులు, రామప్ప, బాబా సాహెబ్, నరసింహరెడ్డిలు ఉన్నారు. గాంధీ నడియాడిన పాత బజారుకు గాంధీ బజారు అని నేటికీ పిలుస్తున్నారు. ఆ రోజుల్లో గాంధీ ప్రసంగించిన చోటున స్వాతంత్య్ర సమరయోధుల చిహ్నం ఏర్పాటు చేశారు. గుత్తి కోటలో 1946, అక్టోబర్ 2న గాంధీ పుట్టిన రోజును జరుపుతున్న దృశ్యం మహాత్ముడు ప్రసంగించిన వేదిక దండి సత్యాగ్రహంలో భాగంగా 1925లో తాడిపత్రి పట్టణానికి మహాత్మా గాంధీ వచ్చారు. ఆ సమయంలో బాపూజీ సందేశాన్ని వినేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా స్థానిక నాయకులు పరిశీలించి ఓ ప్రాంతానికి ఎన్నుకుని అరుగు నిర్మించారు. ఆ అరుగుపై నుంచి గాంధీ ప్రసంగించారు. అప్పటి నుంచి ఆ అరుగుకు గాంధీ కట్ట అని పిలుస్తూ వచ్చారు. – తాడిపత్రి మధుర జ్ఞాపకం స్వాతంత్య్ర సమరం ఊపందుకున్న 1934లో పెద్దవడుగూరు గ్రామాన్ని గాంధీజీ సందర్శించారు. గ్రామానికి చెందిన కుమ్మెత చిన్నారపరెడ్డి ఆహ్వానం మేరకు గాంధీజీ ఇక్కడకు రావడం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. గుత్తి నుంచి ప్రత్యేకంగా తన కారులో చిన్నారపరెడ్డి ఆయనను ఇక్కడకు పిలుచుకువచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ స్థానికులు విరాళాలు అందజేశారు. ఆ సమయంలో తన వంతు విరాళంగా రూ.1,116ను చిన్నారపరెడ్డి అందజేశారు. ఆ డబ్బును కీర్తి శేషులు కేశవపిళై స్మతి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించబడే కేశవ విద్యాలయానికి విరాళంగా గాంధీ ప్రకటించారు. ఈ అంశాలను నాటి ఆంధ్రపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ పత్రిక నేటికీ చిన్నారపరెడ్డి కుటుంబసభ్యలు భద్రంగా దాచి ఉంచారు. – పెద్దవడుగూరు గుత్తి రైల్వే స్టేషన్లో గాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ప్రజలను చైతన్య పరుస్తూ 1931, నవంబర్ 21న గుత్తి రైల్వే స్టేషన్లో మహాత్మ గాంధీ అడుగుపెట్టారు. ఖద్దర్ నిధి వసూలు కార్యక్రమంలో భాగంగా పెద్దవడుగూరుకు వెళ్లడానికి ఆయన రైలు వస్తూ గుత్తిలో దిగారు. గుత్తి, పెద్దవడుగూరు ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయో«ధులు గుత్తి కేశవపిళ్లై, పీజే శర్మ, కుమ్మెత చిన్న నారప్పరెడ్డి, పామిడి తిరుపతిరావు, శరభారెడ్డి(చిన్న శరబయ్య), తదితరులు రైల్వే స్టేషన్లో ఆయనకు స్వాగతం పలికారు. పెద్దవడుగూరుకు చెందిన చిన్న నారప్పడ్డి తన సొంత కారులో గాంధీజీని ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన గ్రామానికి పిలుచుకెళ్లారు. అక్కడ ఖద్దర్ నిధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. గాంధీజీ జోలి పట్టి అడగడంతో మొత్తం రూ. 27వేలు వసూలైంది. ఆ సమయంలో తమ శరీరంపై ఉన్న బంగారాన్ని కూడా మహిళలు స్వచ్ఛందంగా అందజేశారు. – గుత్తి -
హత్యా రాజకీయాలకు కేరాఫ్.. పయ్యావుల కేశవ్
సాక్షి, ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని, ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలంటూ ఆయన నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఉరవకొండ మండలం రాకెట్లలో సోమవారం సుంకలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన కౌకుంట్ల గ్రామ ప్రజలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పయ్యావుల కేశవ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పరిపాలన సౌలభ్యం కోసం పెద్ద కౌకుంట్ల పంచాయతీని విభజించేందుకు పెట్టిన గ్రామసభలో కేశవ్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయకుండా ప్రజలను భయపెట్టారన్నారు. దాదాపు 8500 మంది జనాభా ఉన్న పంచాయతీలో కనీసం 1500 మంది కూడా పాల్గొనకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేగా కేశవ్ ఎన్నికే అప్రజాస్వామ్యం అని, కోట్లు ఖర్చుచేసి ప్రలోభాలకు గురిచేసి రిగ్గింగ్‌తో గెలుపొందిన ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం, అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గత ఐదు దశాబ్ధాలుగా ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారో, ఎవరు ఎవరు ఎవర్ని హత్యలు చేయించారో ప్రజలందరికీ తెలుసున్నారు. కేశవ్ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అటు అమరావతిలో, ఇటు కియా కార్ల కంపెనీ వద్ద దాదాపు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులలో వందల కోట్లు రూపాయలు దోపిడీ చేసిన అతి పెద్ద దోపిడీ దొంగ కేశవ్ అని మండిపడ్డారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాస్వామ్యం కచ్చితంగా అపహాస్యం అయిందన్నారు. -
పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం!
సాక్షి, అనంతపురం : పయ్యావుల కేశవ్ సొంత పంచాయతీ కౌకుంట్లలో నలభై ఏళ్లుగా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారని ఉరవకొండ మాజీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆదివారం మండిపడ్డారు. కౌకుంట్ల పంచాయతీ విభజన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అధికారులను, ప్రజలను బెదిరిస్తున్నారనీ, ఈ ఆగడాలు ఇక సహించేదిలేదన్నారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
జీవితాన్ని మార్చేసిన కరివేపాకు
సాక్షి, ఉరవకొండ: అనంతపురం జిల్లాలో అత్యంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉరవకొండ నియోజకవర్గంలోనే. చుట్టూ ఎటు చూసినా నల్లరేగడి భూములు. వేల అడుగుల లోతున బోరుబావులు తవ్వించినా.. నీటి చెమ్మ తగలని భూములు. వర్షాధారంపైనే పంటల సాగు. సాగునీటి వనరులంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఇటుగా వచ్చిన హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీటిని అందించడంలో గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కనబరిచింది. ఫలితంగా దారుణమైన పరిస్థితులను ఈ ప్రాంత రైతులు చవిచూస్తూ వచ్చారు. పంటల సాగు భారమైన ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలోని తట్రకల్లు గ్రామ రైతులు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. కరివేపాకు సాగుతో ఏటా తిరుగులేని ఆదాయం గడిస్తున్నారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ జనాభా 1,800. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయామే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో వంద ఎకరాలు సాగులో ఉండగా.. మొత్తం కరివేపాకు సాగు చేపట్టడం గమనార్హం. ఇక్కడ సాగు చేస్తున్న కరివేపాకును రైతులు ముంబయికి ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఒకే పంట తట్రకల్లులో 15 ఏళ్లుగా రైతులు ఒకే రకం పంట సాగు చేపట్టారు. అంతకు ముందు వివిధ రకాల పంటల సాగు చేపట్టి వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన కరివేపాకు సాగు ఆ గ్రామ రైతుల పాలిట కల్పతరువుగా మారింది. గ్రామ రైతులు తమకు చెందిన వంద ఎకరాల్లో కరివేపాకు పంట సాగును బిందు సేద్యం ద్వారా చేపట్టారు. పంట సాగుకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ. లక్ష వరకూ పెట్టుబడులు పెడుతూ ఎకరాకు మూడు క్వింటాళ్ల విత్తనం వేస్తున్నారు. ఏడాదిలో మూడు సార్లు పంట కోతకు వస్తోంది. నికర ఆదాయం కచ్చితం కరివేపాకు సాగులో తట్రకల్లు రైతులు ఏనాడూ నష్టపోలేదు. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తోంది. మార్కెట్లో టన్ను కరివేపాకు రూ.9,500 నుంచి రూ.10వేల వరకూ అమ్ముడుపోతోంది. పంటను మార్కెట్‌కు తరలించే భారం కూడా లేకుండా ముంబయికి చెందిన పలువురు వ్యాపారులు నేరుగా తట్రకల్లుకు చేరుకుని పంట కోత కోయించి తీసుకెళుతుంటారు. కోత కోసిన పంటను వాహనాల్లో గుంతకల్లుకు తరలించి, అక్కడి నుంచి రైళ్లలో ముంబయికి చేరవేస్తుంటారు. ఏడాదిలో మూడుసార్లు పంట కోత ద్వారా నికర ఆదాయం కచ్చితంగా వస్తుందని స్థానిక రైతులు అంటున్నారు. ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం మహిళ రైతు ఓబులమ్మ పదేళ్లుగా తనకున్న అయిదెకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. పొలంలో ఉన్న బోరు ద్వారా అరకొర నీరు వస్తోంది. ఆ నీటినే పొదుపుగా బిందుసేద్యం ద్వారా వాడుకుంటూ పంట సాగుచేస్తూ వస్తున్నారు. ఎకరాకు అయిదు టన్నుల దిగుబడి వస్తోంది. టన్ను పంటను రూ.9,500తో విక్రయించినా... ఐదు ఎకరాల్లో రూ.2,37,500 ఒక కోతకు ఆదాయం గడిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి మూడు కోతలకు గానూ రూ.7 లక్షలకు పైగా ఆదాయం అందుతోంది. -
పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి: చట్టసభలకు సంబంధించి ప్రజాపద్దుల సంఘం(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం పయ్యావుల పేరును ఖరారు చేశారు. కాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పీఏసీ చైర్మన్ పదవి రేసులో టీడీపీ సీనియర్ పేర్లు వినిపించినా చంద్రబాబు చివరకు పయ్యావుల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రతిపాదనలు పంపారు. -
పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం
పాండవులు పన్నెండేళ్లు వనవాసం చేస్తే... ఓ తల్లి కష్టాలతో పద్నాలుగేళ్లుగా సహవాసం చేస్తోంది. బిడ్డ, అల్లుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా.. అనారోగ్యంతో 14 సంవత్సరాల మనవడు అచేతనంగా మారాడు. అయినా గుండెదిటువు చేసుకుని ముందుకే సాగింది. కానీ పగబట్టిన మృత్యువు ఆమె కోడలిని కబలించగా.. ఆసరాగా నిలిచిన కుమారుడు మంచం పట్టాడు. అప్పటికీ దయ చూపని దేవుడు... ఆమెను కేన్సర్ జబ్బుబారిన పడేశాడు. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవ ఆదుకోకపోవడంతో శక్తికి మించి అప్పులు చేసి చికిత్స చేయించుకుంది. అయినా ఫలితం దక్కలేదు. సర్వమూ కోల్పోయిన ఆమె... సాయం చేసే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. సాక్షి,ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ పట్టణానికి చెందిన సుంకన్న, సుజాతమ్మ దంపతులకు కుమారుడు బాలరాజు, కుమార్తెలు శ్రీలత, కవిత సంతానం. పాల విక్రయంతో జీవనం సాగించే సుజాతమ్మ ఉన్నంతలో కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొచ్చేది. పెద్ద కుమార్తె శ్రీలతకు పదేళ్ల క్రితం కూడేరు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి కుమారుడు విశ్వనాథ్కిచ్చి పెళ్లి చేసింది. కూతురుకు తొలికాన్పులోనే కొడుకు పుట్టగా సంబరపడిపోయింది. పవన్ అని పేరుపెట్టుకుని అపురూపంగా చూసుకుంది. కానీ ఆ చిన్నారికి తలలో ఉమ్మునీరు చేరి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తూ వచ్చింది. కూతురు అల్లుడుని కబలించిన రోడ్డు ప్రమాదం 2013 డిసెంబర్లో ద్విచక్రవాహనంపై అనంతపురానికి బయలుదేరిన సుజాతమ్మ కూతురు శ్రీలత, అల్లుడు విశ్వనాథ్ మార్గమధ్యలో ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుమారుడు పవన్ పోషణ భారం ఆమెపై పడింది. అయితే ధైర్యం కోల్పోని సుజాతమ్మ తన సంపాదనలో కొంత పవన్‌కు వైద్యం చేయించేందుకు ఖర్చుపెడుతూ వస్తోంది. హైదరాబాద్, కర్నూలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి దాదాపు రూ. లక్షల్లో ఖర్చు చేసింది. ఆపరేషన్ వికటించి అంధుడిగా మారిన పవన్ ఓ రోజు పవన్ పరిస్థితి విషమించడంతో సుజాతమ్మ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు పవన్‌కు ఆపరేషన్ చేయాలని రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కుటుంబానికి జీవనాధారంగా ఉన్న మూడు ఎనుములను అమ్మి మనవడు పవన్‌కు 2016లో ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ అయిన మూడు నెలలకే పవన్ కాళ్లు, చేతులు వంకర పోయి, మూర్చ వ్యాధి వచ్చింది. కళ్లు కూడా కన్పించకపోవడంతో మళ్లీ కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ వికటించి పవన్ పూర్తిగా కంటి చూపు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. తిరిగి వైద్యం చేయాలని అందుకు బాగా ఖర్చవుతుందని తెలిపారు. సుజాతమ్మపై కేన్సర్ పిడుగు మనవడిని బతికించుకునేందుకు ఉన్నదంతా అమ్మి రూ.7 లక్షల వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుజాతమ్మపై విధి మరోసారి కేన్సర్ రూపంలో పంజా విసిరింది. ఓ రోజు ఛాతిలో నొప్పిగా ఉండటంతో సుజాతమ్మ స్థానిక వైద్యులకు చూపించింది. వారు కేన్సర్ అన్న అనుమానంతో అనంతపురం వెళ్లాలని సూచించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రొమ్ము కేన్సర్ అని ధ్రువీకరించారు. వ్యాధి సోకి చాలా ఏళ్లు అయ్యిందని, వెంటనే ఆపరేషన్ చేసుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. దీంతో ఆమె అప్పట్లో ఎన్టీఆర్ వైద్యసేవకు దరఖాస్తు చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఆపరేషన్ చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఏం చేయాలో తెలియని సుజాతమ్మ... రూ 2 లక్షలకు ఇంటిని తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించుకుంది. అయినా సుజాతమ్మ ఆరోగ్యం కుదట పడలేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మనవడిని కాపాడుకోలేక, తన ఆరోగ్యాన్ని సంరక్షించుకోలేక నరకయాతన అనుభవిస్తోంది. కోడలు మృతి... మంచం పట్టిన కుమారుడు ఓవైపు తీవ్ర అనారోగ్యం... మరోవైపు అచేతనంగా మారిన మనవడు... ఇంకోవైపు రుణదాతల ఒత్తిళ్లతో సుజాతమ్మ సతమతమవుతోంది. ఇలాంటి తరుణంలోనే సుజాతమ్మ కుమారుడు బాలరాజు భార్య శ్రీదేవి హృద్రోగంతో కన్ను మూసింది. రూ.2 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. భార్య మృతితో బాలరాజు మనోవేదనతో మంచం పట్టాడు. ఈ పరిస్థితుల్లో 70 ఏళ్ల వృద్ధుడైన సుజాతమ్మ భర్త సుంకన్న శక్తిలేకపోయినా కుటుంబాన్ని పోషించేందుకు కూలి పనులకు వెళ్తున్నాడు. రూ. 20 లక్షల అప్పులు సుజాతమ్మ తన కేన్సర్ చికిత్స, మనవడి, కోడలి వైద్యం కోసం శక్తికి మించి ఖర్చు చేసింది. అంతా కలిపితే రూ.20 లక్షలకు చేరింది. ఇంటిపై చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.4 లక్షలకు పైగా చేరింది. బయట వ్యక్తుల వద్ద చేసిన అప్పులు మరో రూ.6 లక్షలు ఉన్నాయి. సుజాతమ్మ బతికుండగానే ఉన్న ఇంటిని ఇలాగైనా రాయించుకోవాలని రుణదాతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. -
‘నేనెవరో తెలుసా.. పయ్యావుల కేశవ్ మనిషిని’
సాక్షి, ఉరవకొండ: మహిళా ఉద్యోగులపై టీడీపీ నేతల దౌర్జన్యం ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుడు ఓ మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉరవకొండ ఎస్ఐ రాజోల్ రాజేశ్వరి శనివారం రాత్రి అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. రేణుమాకుపల్లి రహదారిలో ఓ వాహనం రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తనిఖీ చేయగా పయ్యావుల కేశవ్ ప్రధాన అనుచరుడు పార్యం కేశవానంద తన అనుచరులతో మద్యం తాగుతూ కనిపించాడు. ఇలా చేయడం తప్పని ఎస్ఐ చెప్పడంతో కేశవానంద ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ‘నేను ఎవరో తెలుసా. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మనిషిని. నన్నే ప్రశ్నిస్తావా. మేము చేసేది ఇంతే. నీకు ఇష్టమున్న చోట చెప్పుకో’ అంటూ మద్యం మత్తులో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పార్యం కేశవానందను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కేశవానందపై 506, 509, 353 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అన్నదాత ఆత్మహత్య
అప్పులు ఓ రైతు ఉసురు తీశాయి. వ్యవసాయంలో నష్టాలు అతడిని ఆర్థికంగా కుదేలు చేశాయి. పొట్టకూటి కోసం వలసబాట పట్టి బేల్దారి పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి ఆశలు చిగురించాయి. ఈసారి పంట సాగు చేస్తే దేవుడి దయ వల్ల చేతికందితే కష్టాల నుండి గట్టెక్కవచ్చనుకున్నాడు. అంతే స్వగ్రామానికి చేరుకుని సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం వెళ్తే.. అప్పులిచ్చిన వారు సూటిపోటి మాటలతో మనసును గాయపరిచారు. జీవితంపై విరక్తి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఇది. సాక్షి, ఉరవకొండ/ ఉరవకొండ రూరల్ : అప్పుల బాధ భరించలేక బూదగవి గ్రామానికి చెందిన రైతు జి.వీరేష్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. వీరేష్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. గ్రామంలో మరో పది ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వర్షాధారం కింద వేరుశనగ సాగు చేసేవాడు. వరుస కరువుల కారణంగా మూడేళ్లుగా పంట చేతికందలేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు దాదాపు రూ.3లక్షలకు చేరుకున్నాయి. దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. విధిలేని పరిస్థితిలో ఉన్న ఊరు వదిలి ఆరునెలల క్రితం తిరుపతికి వెళ్లాడు. అక్కడ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీపై విత్తన వేరుశనగ పంపిణీ చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు. వర్షాలు కూడా సమృద్ధిగానే కురుస్తుండటంతో మళ్లీ వ్యవసాయం వైపు ధ్యాస మళ్లింది. మృతుడు వీరేష్ మాటలు తూటాల్లా గుచ్చుకుని.. ఖరీఫ్‌లో వేరుశనగ సాగుచేసేందుకని వీరేష్ సోమవారం బూదగవి గ్రామానికి వచ్చాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బు కోసం ఒత్తిడి చేశారు. తనకు కాస్త గడువు ఇవ్వాలని అతడు కోరాడు. అయినా కొందరు సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఉరవకొండకు వచ్చి ఆటోస్టాండ్ వద్ద పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఆటో డ్రైవర్ల ుగమనించి వీరేష్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. వీరేష్‌కు భార్య కవిత, పదేళ్ల కుమారుడు ఉన్నారు. -
ఎమ్మెల్సీ పదవికి పయ్యావుల రాజీనామా
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
ఉరవకొండలో ఎన్నికల అధికారుల నిర్వాకం
అనంతపురం: ఉరవకొండలో ఎన్నికల అధికారుల నిర్వాకం బయటపడింది. ఫోటోలు లేవన్న కారణంతో 13 మంది వైఎస్సార్సీపీ నేతలకి ఉరవకొండ ఆర్వో శోభాస్వరూపారాణి కౌంటింగ్ పాసులు ఇవ్వలేదు. ఫోటోలతో కూడిన దరఖాస్తులు వైఎస్సార్సీపీ నేతలు ఇదివరకే సమర్పించినా కూడా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్ల ఫోటోలు కావాలని తొలగించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఉరవకొండ కౌంటింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, కౌంటింగ్‌లో అక్రమాలు చేసేందుకు కుట్ర రచించినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లకు కౌంటింగ్ పాసులు ఇవ్వాలని, ఫోటోలు తొలగించిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌కు సహకరిస్తున్న ఉరవకొండ ఎన్నికల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నేతలకు కౌంటింగ్ పాసులు ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి, ఎన్నికల అధికారిణి స్వరూపారాణితో వాగ్వాదానికి దిగారు. పయ్యావులకు ఉరవకొండల ఎన్నికల అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
ఉరవకొండలో పోస్టల్ బ్యాలెట్ అక్రమాలు
-
జగన్ మాట ఇస్తే తప్పరు
-
ఉరవకొండలో జోరుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
భూస్వాముల అడ్డా..ఉరవకొండ
ఉరవకొండ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం ఉరవకొండ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఇప్పటి వరకూ 12 సార్లు జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా నిలుస్తూ వచ్చింది. సాగునీటి వనరులు అంతంత మాత్రమే ఉన్న ఈ నియోజకవర్గంలో ఆది నుంచి అత్యధిక జనాభా చేనేతరంగంపైనే ఆధారపడి జీవిస్తూ వచ్చింది. అణగారిన, పీడిత వర్గాలే నియోజకవర్గంలో అత్యధికులు ఉన్నారు. మొత్తం ఓటర్లు :2,07,7 పురుషులు:1,04,1 మహిళలు:1,03,5 ఇతరులు :19 పెత్తందారీ ఆధిపత్యంలో హత్యా రాజకీయాలు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడుతున్నా.. నేటికీ ఉరవకొండ నియోజకవర్గంలో భూస్వామ్య వాసనలు పోలేదు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం అన్న చందంగా నేటికీ వారి వంశీకులు శాసిస్తూ వస్తున్నారు. వారిని కాదని మనుగడ సాగించడం చాలా కష్టం. నియోజకవర్గంలోని కౌకుంట్లలో భూస్వాముల ఆధిపత్యంపై కమ్యూనిస్టులు సాగించిన పోరాటం చారిత్రాత్మకం. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కౌకుంట్లలో భూస్వాముల అరాచక పాలన పేట్రెగిపోయింది. వందలాది ఎకరాల పేదల భూములను ప్రస్తుత ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ తండ్రి పయ్యావుల వెంకటనారాయణప్ప తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించేవారు. ఇది అన్యాయమంటూ ఎవరైనా గొంతెత్తితే భరించలేనంతగా దాడులు, దౌర్జన్యాలు చేసేవారు. అదే సమయంలో వెంకటనారాయణప్ప ఆధీనంలో ఉన్న పేదల భూములను వెంటనే పేదలకు స్వాధీనం చేయాలంటూ సీపీఐ నేత రాకెట్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతంగా ఎగిసిపడ్డాయి. నారాయణరెడ్డి పోరాటాలతో ఎన్టీఆర్ ప్రభుత్వం దిగొచ్చింది. స్వయానా కౌకుంట్ల గ్రామానికి ఎన్టీఆర్ వచ్చి భూ సమారాధన పేరుతో పయ్యావుల కుటుంబీకుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న పేదల భూములను ఆ పేదలకే పంచి పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని పెత్తందారులు రాకెట్ట నారాయణరెడ్డి, ఆయన కుమారుడు రవీంద్రారెడ్డిని అతి దారుణంగా హతమార్చి నెత్తుటి రాజకీయాలకు బీజమేశారు. చతికిల బడ్డ చేనేత పరిశ్రమ చేనేతకు ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలో చేనేత పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు గతంలో హామీనిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో నేడు ఉరవకొండలో చేనేతలు ఉనికి కోల్పోయారు. గతంలో 15 వేలకు పైగా మగ్గాలు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఐదు వేలకు మించి లేవు. దాదాపు మూడు వేలకు పైగా చేనేత కార్మికులు మగ్గాలు వదిలి కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నారు. ఒక్క ఎకరాకూ అందని సాగునీరు హంద్రీ–నీవా మొదటి దశ కింద నియోజకవర్గంలోని 80వేల ఎకరాల ఆయకట్టును గుర్తించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. ఐదేళ్లుగా కంటి ముందే నీరు పారుతున్నా.. పొలాలకు పెట్టుకోలేక రైతులు పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేనిది. హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తన సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించుకుపోయేందుకు ఈ ప్రాంత రైతులకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. జీడిపల్లి నిర్వాసితులకు మొండి చెయ్యి బెళుగుప్ప మండలంలో జీడిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు మరో ప్రాంతంలో పక్కా గృహాలు నిర్మించి ఇస్తామంటూ సీఎం చంద్రబాబు రెండు పర్యాయాలు పక్కా హామీనిచ్చారు. దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. అయితే ముంపు గ్రామాల బాధితులను ఆదుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ఈ విషయంలో సీఎంతో చర్చించి నిర్వాసితులకు న్యాయం జరిగిలే చూడడంలో ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ పూర్తిగా విఫలమయ్యారు. ఐదేళ్లలో ‘విశ్వ’ పోరాటాలు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలైన పయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి సీఎం చంద్రబాబు తన కులపిచ్చిని బహిర్గతం చేసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని కాదని తాను ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీకి నియోజకవర్గ పాలనపరమైన పగ్గాలు అప్పగించి దోపిడీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో హంద్రీ–నీవా పనుల అంచనాలను భారీగా పెంచి రూ. కోట్లలో కేశవ్ దోచుకున్నారు. గాలిమరల కంపెనీలకు భూములు కట్టబెట్టే విషయంలోనూ వ్యాపారం సాగించి రైతులను దగా చేస్తూ రూ. కోట్లు దోపిడీ చేశారు. కేశవ్ అక్రమాలపై విశ్వ సాగించిన పోరాటాలు ఒకానొక దశలో రాష్ట్రాన్ని కుదిపేశాయి. ప్రధానంగా పేదలకు ఇంటిపట్టాలు, పక్కా గృహ నిర్మాణాల కోసం వేలాది మందితో రోడ్డు పై బైఠాయించి ఎమ్మెల్యే విశ్వ అరెస్ట్ అయ్యారు. నియోజకవర్గంలోని 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలంటూ రాగులపాడు పంప్‌హౌస్‌ను ముట్టడించారు. ఉరవకొండ, బెళుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో జలజాగరణలు చేసి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పోరాటాల ఫలితంగా ఉరవకొండ పట్టణంలో పేదలకు ఇంటిపట్టాలు దక్కాయి. -
ప్రలోభాల పర్వం..
సాక్షి, ఉరవకొండ: ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. తాయిలాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పథకం వేశారు. ఆదరణ పథకం కింద గతంలోనే మంజూరైన పనిముట్లను, మిషన్లను ఇంతకాలం పంపిణీ చేయకుండా అలానే ఉంచుకున్నారు. వాటిని ఎన్నికల తాయిలాలుగా అందించి ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఉరవకొండలోని వీరశైవ కల్యాణ మంటపం సమీపంలో గల ప్రభుత్వ గోడౌన్‌కు ఒక లారీ వచ్చింది. అందులోంచి కుట్టుమిషన్లు, చేనేత జాకార్డ్ యంత్రాలు, వాషింగ్ మెషిన్లు, ఐరన్‌బాక్సులు, మోటార్లు వంటివి దించుతుండగా వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, నిరంజన్‌గౌడ్, వెంకటేష్, లెనిన్, శంకర్, ప్రభాకర్ లు అడ్డుకున్నారు. పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులన్నింటిపైనా చంద్రబాబు స్టిక్కర్లు కుడా వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వీటిని గోడౌన్లో దింపడం ఏంటని ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హనుమంతును ప్రశ్నించారు. తాను ఎంపీడీఓ ఆదేశాల మేరకు వీటిని దింపుతున్నట్లు తెలిపాడు. దీనిపై వెంటనే వైఎస్సార్సీపీ నేతలు కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి, ఉరవకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. గోడౌన్ సీజ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అక్రమంగా దింపుతున్న చేనేత జాకార్డ్ యంత్రాలు 46, కుట్టుమిషన్లు 200, ఇస్త్రీ పెట్టెలు 100, వాషింగ్మెషిన్లు 200, మోటార్లు 400, ఇతర వస్తువులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఎస్ఐ సుధాకర్‌యాదవ్ అధ్వర్యంలో సీజ్ చేశారు. లారీలో ఉన్న చేనేత యంత్రాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చేనేత కార్మికులను మభ్యపెట్టడానికి యంత్రాల పంపిణీ జిల్లాలో ధర్మవరం తరువాత ఉరవకొండలో అత్యధిక మంది చేనేతపై ఆధార పడి జీవిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేత రుణమాఫీ చేయలేక వైఫల్యం చెందడంతో కార్మికులు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. వ్యతిరేకత నుంచి బయటపడేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేనేత కార్మికులకు జాకార్డ్ యంత్రాలు ఇచ్చి తద్వారా ఓట్లు వేయించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు పట్టణంలోని కొంతమందికి కుట్టుమిషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. కోడ్ ఉల్లంఘనే బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆదరణ పనిముట్లను అర్ధరాత్రి పూట దిగుమతి చేసుకోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది. దీంతో ఫిర్యాదు రాగానే గోడౌన్ సీజ్ చేయించి లారీని పోలీసుస్టేషన్‌కు తరలించాం. దీనిపై ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్ వివరణ తీసుకుని తదిపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –శోభా స్వరూపారాణి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి -
ఉరవకొండలో టీడీపీ ప్రలోభాల పర్వం
-
ఉరవకోడలో వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన సభ
-
అనంతపురం జిల్లాలో భూ ప్రకంపనలు
సాక్షి, ఉరవకొండ రూరల్: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల, రాకెట్ల, చిన్నముస్టూరు, పెద్దముస్టూరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి భూమి కంపించింది. పెద్ద శబ్దాలు రావడం, ఇళ్లలోని సామాగ్రి కదిలినట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మూడు గ్రామాల్లోనూ ప్రజలు రాత్రంతా జాగరణ చేశారు. భూకంపం వల్ల పాత ఇళ్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. -
జన్మభూమి కార్యక్రమంలో ఆధికారులను నిలదీసిన గ్రామస్తులు
-
ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్..
సాక్షి, అనంతపురం: ఉరవకొండలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉరవకొండలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ బైక్ ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ విధులను అడ్డుకున్నారంటూ.. అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ.. విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు ప్రణయ్‌రెడ్డి సహా 10మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న పక్షపాతపూరితమైన తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అక్రమ కేసులను బనాయించడాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. -
ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఉరవకొండలో భారీ బైక్ ర్యాలీ
-
స్థలం ఉన్నా...పట్టాలిచ్చే నాథుడే లేడు
-
తహశీల్దార్, ఎంపీడీవో నిర్భందం.. ఉరవకొండలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : ఉరవకొండ తహశీల్దార్, ఎంపీడీవో, హౌంసింగ్ సిబ్బందిని ఆందోళనకారులు నిర్భంధించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. సోమవారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇచ్చిన వివరణతో అసంతృప్తి చెందిన ఆందోళనకారులు వారిని నిర్భందించారు. ఇళ్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేని అసమర్థుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం ఉరవకొండలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఆయన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు కట్టించారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఉరవకొండ పట్టణంలో 89 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. ఆయన కేటాయించిన భూమిని పంపిణీ చేసేందుకు శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉరవకొండలో పయ్యావుల బ్రదర్స్ కుటుంబ పాలన చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కక్ష సాధింపు చర్యలు సరికాదని హితవుపలికారు. -
భర్త చేతిలో భార్య హత్య
ఉరవకొండరూరల్: లత్తవరం గ్రామానికి చెందిన మాణిక్యబాయి (40) తన భర్త చేతిలో దారుణహత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మాణిక్యబాయి, లక్ష్మానాయక్ దంపతులు. వీరు శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడ్డారు. శనివారం ఉదయం పొలానికి వెళ్లినపుడు కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆవేశానికి లోనైన భర్త బండరాయి తీసుకుని భార్య తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జనార్దన్‌నాయుడు తెలిపారు. -
గణతంత్ర వేడుకలకు వెళుతూ..
సాక్షి, ఉరవకొండ: కళాశాలలో జరిగే జెండా వందనానికి వెళ్తూ ఓ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. చిన్నముస్టూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. మూలగిరిపల్లికి చెందిన సునీల్ (18) ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలలో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు స్నేహితుడు సుధాకర్‌తోపాటు తమ గ్రామానికే చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినితో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. చిన్నముస్టూరు సమీపంలో ఎద్దుల బండిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని వీరి బైక్ ఢీకొనడంతో సునీల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులు, కళాశాల విద్యార్థులతోపాటు అధ్యాపకులు రాజశేఖర్, లత, పద్మ, అనితలు ఆసుపత్రికి చేరుకుని సునీల్ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. -
ఆ..డ పిల్ల
గర్భాన తొమ్మిది నెలలు మోసిన ఆ తల్లికి వచ్చిన కష్టమేమో కానీ.. ఓ పురిటి బిడ్డ చెత్తకుప్ప పాలయైంది. ఇదంతా కన్నపేగుకు తెలిసి జరిగిందా? లేక ఆమె అనుమతితోనే కుటుంబసభ్యులు ఇంతటి నిర్ధయకు ఒడిగట్టారా అనేది ప్రశ్నార్థకమైంది. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండలోని ఇందిరానగర్ ఆరవ లైన్.. గురువారం తెల్లవారుజామున... స్థానికంగా ఉంటున్న కళావతి తన ఇంటిలోని చెత్తను తీసుకెళ్లి సమీపంలోని చెత్త కుప్పలో పడేసి వెనుదిరిగింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి అదె చెత్త కుప్పలో ఓ పసికందును పడేసి వెళ్లాడు. ఇది గమనించిన కళావతి పిలిచే లోపు అతను వెళ్లిపోయాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడ గుమికూడి చూస్తే.. పురుటి నెత్తుటిని సైతం తుడవని ఓ ఆడశిశువు చెత్త కుప్పలో కనిపించింది. కాలనీ వాసులు ఆ పసికందును చేరదీసి సమాచారం అందించడంతో ఎస్ఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేశారు. పసిగుడ్డను స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పసికందును అనంతపురంలోని బాలభవన్‌కు తరలించనున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ రాబియా తెలిపారు. - ఉరవకొండ -
నా పయనం జగన్‌తోనే..
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీలోకి వెళుతున్నట్లు తనపై వస్తున్న వార్తలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారం క్రితం ఓ పత్రికలో కథనం ప్రచురితమైందని, కొందరు అరకొర సమాచారంతో వార్తలు రాస్తారని వదిలివేశానన్నారు. అయితే మంగళవారం మరో పత్రికలో అలాంటి కథనమే ప్రచురితమైందన్నారు. తాను ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నానని, భవిష్యత్‌లోనూ ఇదే పార్టీలో ఉంటానన్నారు. రాజకీయ జీవితం జగన్‌తోనే సాగుతుందని స్పష్టం చేశారు. అనైతిక, విలువలు లేని రాజకీయాలు తాను చేయనని, వ్యక్తిత్వం ఉన్న మనిషినని పేర్కొన్నారు. తనపై తప్పుడు వార్తలు రాసే వారు తన గురించి పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. -
హంద్రీనీవా.. కన్నీటి తోవ
డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లొదిలే కుట్ర - ఇప్పటికే 2015లో జీఓ జారీ - తెరపైకి లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ - ఉరవకొండలో 20వేల హెక్టార్లకు రూ.899 కోట్లు కేటాయింపు - ఇందులో 50 శాతం నిధులతో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యే అవకాశం - ప్రభుత్వ తీరుతో రైతుల్లో గందరగోళం రాష్ట్ర ప్రభుత్వం అనంత రైతును దగా చేస్తోంది. హంద్రీనీవా ఆయకట్టుకు ఏడాదిలో నీరిస్తామని 2014లో హామీ.. ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు తీయొద్దని 2015లో జీఓ.. 2016 ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్ఈ, సీఈలతో ప్రకటన.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూమి సమతులంగా లేదని.. లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నామని కొత్త పల్లవి. మొత్తంగా రూ.899 కోట్లకు ‘టెండర్’ పెడుతూ అస్మదీయులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షిప్రతినిధి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45లక్షల ఎకరాల ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. ఐదేళ్లుగా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే వీలుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో హంద్రీనీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారు. 2015 ఫిబ్రవరిలో కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఈపీఐఎల్(ఇంజనీరింగ్ ప్రాజñక్టు ఇండియా లిమిటెడ్), 34ను ఆర్‌వీసీపీఎల్(రెడ్డివీరన్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వి.. ఆ పరిధిలో ఉప, పిల్లకాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. అయితే పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కారణమేంటని ఆరా తీస్తే.. 5–6 కిలోమీటర్ మధ్య రాయి ఉంది. బ్లాస్టింగ్ చేయాలని అధికారులు చెప్పగా.. దీన్ని పక్కనపెట్టడంతో పాటు మేజర్ కెనాల్‌లోని కల్వర్టులను కూడా పూర్తి చేయని పరిస్థితి. ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు మరోమాట చెప్పారు. 34వ ప్యాకేజీలో కూడా డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి. ఇందులో డీ–1, 8.25, డీ–2. 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకు బ్రేక్ పడింది. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. నిజానికి కొత్తరేట్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాబట్టి పనులు చేస్తే ఏజెన్సీలకు ఎలాంటి నష్టం రాదు.. లాభం తప్ప. వీటితో పాటు 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336కోట్లు కేటాయిస్తూ దీనికి గతేడాది ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమతులం పేరుతో డిస్ట్రిబ్యూటరీలను తప్పించే ఎత్తుగడ ఉరవకొండ నియోజకవర్గంలో కమ్యూనిటీ లిఫ్ట్, డ్రిప్ ఇరిగేషన్(సీఎల్ఐడీ) పథకం పేరుతో రూ.899కోట్లు కేటాయిస్తూ ఈ నెల 5న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ప్యాకేజీల్లో భూభాగం సమతులంగా లేకపోవడంతో 11,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంది. అంటే ఈ ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేయమని చెప్పకనే చెప్పినట్లయింది. అలాగే ఈ ఆయకట్టుకు నీరిందంచడానికి కేటాయించిన 1.45టీఎంసీలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడం వల్ల మిగిలే 0.24 టీఎంసీలు కలిపి 1.69టీఎంసీలతో 20వేల హెక్టార్లకు అందిస్తామని పేర్కొంది. ‘ఆలీ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు.. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు.. నీళ్లు ఇవ్వలేదు.. అప్పుడే 0.24 టీఎంసీలు మిగిలాయని ప్రభుత్వం ఎలా చెబుతుందో అంతుపట్టని పరిస్థితి. జీఓలో పేర్కొన్న అంశాలు, 33, 34 ప్యాకేజీల పురోగతి పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటరీలను పక్కనపెట్టినట్టే అనేది సుస్పష్టమవుతోంది. ఆయకట్టు స్థిరీకరిస్తేనే నీటిపై హక్కు ఫేజ్–1లో 1.18 లక్షల ఎకరాలకు హంద్రీ–నీవాపై హక్కు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసి ఆయకట్టును స్థిరీకరించాలి. అప్పుడే ఈ నీటిపై రైతులకు హక్కు వస్తుంది. అలా కాకుండా లిఫ్ట్, డ్రిప్ అంటూ డిస్ట్రిబ్యూటరీని పక్కనపెడితే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. దీంతో నీటిపై రైతులు హక్కును కోల్పోతారు. పైగా లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.899కోట్లు కేటాయించారు. ఫేజ్–1లో పూర్తిగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసినా అందులో 50శాతం నిధులు కూడా ఖర్చు కావు. ‘అనంత’లో సాగునీరు అందక, ఏటా రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటరీలతోనే చట్టబద్ధమైన హక్కులు చట్టబద్ధమైన హక్కులు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలు తప్పనిసరి. లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇస్తే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. రైతులకు హక్కు ఉండదు. దీనికి రూ.900కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ.20వేల ఎకరాలకు నీరిస్తామంటున్నారు. ఇందులో 50శాతం లోపు ఖర్చు చేస్తే ఫేజ్–1లోని రూ.1.18లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. ఆపై లిఫ్ట్, డ్రిప్ అంటే నమ్మొచ్చు. డిస్ట్రిబ్యూటరీని పక్కనపెట్టి ఈ చర్యలకు ఉపక్రమిస్తే నిధులు దండుకునే ఉద్దేశం మినహా మరొకటి కాదు. – రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి నీళ్లున్నా ఆయకట్టుకు ఇవ్వని దౌర్భగ్యపు ప్రభుత్వం ఇదే.. హెచ్చెల్సీ ద్వారా 10, హంద్రీనీవా ద్వారా 34 కలిపి గతేడాది 44టీఎంసీల నీళ్లు వచ్చాయి. వీటితో 5–6లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. కానీ డిస్ట్రిబ్యూటరీలు చేయకుండా ఎకరాకు కూడా నీళ్లివ్వని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదే. డిస్ట్రిబ్యూటరీలు చేయకుండా 0.24 టీఎంసీ మిగిలింది. వీటితో కలిపి 1.69టీఎంసీలను డ్రిప్ ద్వారా ఇస్తామంటున్నారు. దీనికే మిగులు జలాలు అని ఆలోచిస్తే పేరూరు, బీటీపీకి అవసరమయ్యే 5–10 టీఎంసీలను ఎలా కేటాయిస్తారు. మోసం చేయడం, డబ్బులు దండుకోవడం మినహా మరొకటి కాదు. ఆయకట్టు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుకు మేమే హారతి పట్టేవాళ్లం. జలహారతి అవసరం లేదు. – అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
నేడు ఉరవకొండకు సీఎం
అనంతపురం, అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 6న ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం ముచ్చుమర్రి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.15 గంటలకు ఉరవకొండకు చేరుకుంటారు. 2.30 గంటలకు ఇంద్రావతి అక్విడెక్టు వద్ద జలసరి హారతిలో పాల్గొంటారు. 3.05 గంటలకు ఉరవకొండ సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 3.15 గంటలకు బహిరంగ సభ వేదిక వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. -
ఉరవకొండ.. హామీల బండ
- సీఎం గారూ.. గుర్తున్నాయా! అత్యంత కరువు పీడిత ప్రాంతమైన ఉరవకొండ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఊసే మరిచారు. అధికారంలోకి రాక మునుపు 2014 మార్చిలో ‘మీకోసం వస్తున్నా’ పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుతం అధికారం చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా నోరు మెదపని చంద్రబాబు నేడు మరోసారి ఇక్కడి ప్రజల ముందుకు రాబోతున్నారు. మాటలతో మాయ చేసే సీఎం.. ఇప్పుడు సరికొత్త హామీలతో ఎలాంటి గారడీ చేస్తారోనని ప్రజల్లో చర్చ జరుగుతోంది. - ఉరవకొండ: 1. మార్చి 12, 2014న ఉరవకొండలోని మూగబసన్న కట్ట వద్ద ఎస్సీ కాలనీలో మాదిగలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదింపజేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి పెద్ద మాదిగనవుతానన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా వర్గీకరణ ఊసే కరువయింది. 2.డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేసి ప్రతి పొదుపు మహిళకు తిరిగి కొత్త రుణాలు మంజురు చేస్తామన్నారు. –నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలు డ్వాక్రా రుణాలు మాఫీ కాక చంద్రబాబు మోసం చేశాడంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇదే సమయంలో డ్వాక్రా సంఘాలు ఛిన్నాభిన్నమయ్యాయి. 3. పేద ముస్లిం మహిళల ఉపాధికి కుట్టు శిక్షణనిప్పించి చిన్న తరహా కుట్టు పరిశ్రమను స్థాపిస్తామన్నారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు. 4. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి, వారిని ఆర్థింగా ఆదుకుంటమన్నారు. మహానేత వైఎస్ కల్పించిన 4 శాతం రిజర్వేషన్‌ను కూడా నెలబెట్టుకోలేకపోతున్నారు. 5. ఉరవకొండ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేసి కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్ వసతి కల్పిస్తామన్నారు. ఇప్పటి వరుకు ఎలాంటి అభివృద్ధి కనిపించని పరిస్థితి. 6. జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని.. వారికి మరో చోట ఇళ్లు నిర్మిస్తామన్నారు. వాస్తవంలోకి వస్తే నిర్వాసితులకు కనీసం స్థలాలు కూడా చూపించలేకపోయారు. 7. ఉరవకొండకు చేనేత టెక్స్టైల్ పార్కు, చేనేత రుణమాఫీ చేసి బ్యాంకుల్లో కార్మికులకు వడ్డీలేని రుణాలు రూ.లక్ష వరకు మంజూరు చేయిస్తామన్నారు. అయితే టెక్స్టైల్ పార్కు కాదు కదా.. రుణామఫీ కాకపోవడంతో కార్మికులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. -
గూడు గోడు ‘పట్టా’ని సర్కార్
– ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే విశ్వ దశలవారీ పోరాటాలు – అయినా స్పందించిన పాలకులు – సీఎం పర్యటన నేపథ్యంలోనైనా పట్టాల పంపిణీకి మోక్షం కలిగేనా? ఉరవకొండ: నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉరవకొండ పట్టణంలోని పేదలకు ఇంటి పట్టాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 2008లో 88 ఎకరాల స్థలాన్ని రూ.కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి పట్టాలు పంపిణీ చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. మున్సిపాలిటీ హోదా కల్గిన ఉరవకొండ పట్టణంలో 45 వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇందులో 70 శాతం వరుకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలూ అధికమే. అందుకే బాడుగ ఇళ్లలో అంటూ అద్దెలు కట్టలేక వారంతా అల్లాడిపోతున్నారు. ఇల్లు మంజూరు చేయకపోయినా కనీసం పట్టాలైనా ఇస్తే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామని పేదలంతా అధికారులను కోరుతున్నారు. కానీ వారి గూడుగోడు ఎవరికీ పట్టడం లేదు. పట్టాల పంపిణీకి గ్రహణ టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా నియోజకవర్గంలో ఏ మంఽఽడలంలో కుడా పేదలకు పట్టాలు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజురు చేసిన పాపాన పోలేదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గతంలో ఎవరూ చేయని విధంగా దశల వారీగా పోరాటాలు చేశారు. అయితే ఎమ్మెల్యే ఆందోళనతో దిగొచ్చిన అధికారులు పూటకో ప్రకటన చేస్తూ పట్టాలు పంపిణీ చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని భావించిన స్థానిక టీడీపీ నాయకులు అధికారుల పైఒత్తడి తెచ్చి పట్టాలు పంపిణీ కాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఈనెల 8న సీఎం చంద్రబాబు ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో తమకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారని అర్హులైన పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. స్థలమున్నా పట్టాలివ్వడం లేదు ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. వైఎస్సార్ హయాంలో భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో పట్టాలిచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయింది. మాలాంటి పేదేళ్ల బాధలు వాళ్లకు ఎప్పుడు అర్థమవుతాయో. అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. -జైబూన్, ఉరవకొండ కనికరం చూపండి ఇంటి పట్టాల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికైనా మా మీద కనికరం చూపాలి. కూలీ పనులు చేసుకుని బతికే మేము.. బాడుగ చెల్లించలేక పోతున్నాం. కనీసం ఇప్పుడైనా అధికారులు మాకు పట్టాలివ్వాలి. -నిర్మల, ఉరవకొండ -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఉరవకొండ: ఉరవకొండలో ఈనెల 8న సీఎం పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్, జేసీ–2 ఖాజమోహిద్దీన్లు పరిశీలించారు. పైలాన్ స్థూప నిర్మాణ పనులు, ఇంద్రావతి డీప్‌కట్ జలహరతి పనులు, హెలీప్యాడ్ నిర్మాణం, బహిరంగ సభ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, వర్షం కారణంగా పనులకు కాస్త ఆటంకం కలిగినా ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. -
సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపాలి
– హంద్రీనీవా మొదటి దశ కింద ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి – ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉరవకొండలో సీఎం పర్యటనను తాము స్వాగతిస్తున్నామని, ఎలాంటి నిరసనలు తెలియచేయమని స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, వాటిని ఆయన పరిష్కరించాలన్నారు. జలహరతి కార్యక్రమం కేవలం పుష్కరాలకే చేస్తారని అయితే సీఎం చంద్రబాబు టీబీ డ్యాం, శ్రీశైలం నీళ్లు వచ్చినా ప్రతిసారి హరతి కార్యక్రమం పెట్టుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఉరవకొండ హంద్రీనీవా లాంటి గొప్ప పథకానికి ముఖద్వారం లాంటిదని, మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుండి పనులు ప్రారంభించారని చెప్పారు. వైఎస్సార్ హయాంలో మొదటి దశ కింద జీడిపల్లి వరకు 97 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేవలం తాము పోరాటాలు చేసిన సమయంలో మాత్రమే ప్రభుత్వం హడావిడి చేస్తుందే తప్ప ఎక్కడా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గత యేడాది ఆగస్టులోనే ఆయకట్టుకు నీరు ఇస్తామని ప్రకటించారని అయితే ఇప్పటి వరకు నీటి విడుదలను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఉరవకొండ పర్యటనలోనైనా ఆయకట్టుకు నీరు ఇస్తామని ప్రకటించాలన్నారు. అలాగే వైఎస్సార్ హయంలో కొనుగోలు చేసిన 88 ఎకరాల భూమికి వెంటనే పట్టాలు ఇచ్చి, బహిరంగ సభలోనే పక్కా ఇళ్లు కుడా ప్రకటించాలన్నారు. దీంతో పాటు ఉరవకొండను మున్సిపాలిటీగా ప్రకటించి, నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు రూ. 50 కోట్ల నిధులు ప్రకటించాలన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు రేషన్ పై ఇచ్చే సబ్సిడీని సక్రమంగా అందించి, తొలగించిన పాసుపుస్తకాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు తిప్పయ్య, కన్వీనర్ నరసింహులు, జయేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు బసవరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటించే ప్రాంతాల పరిశీలన
ఉరవకొండ: ఈనెల 8న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉరవకొండ పర్యటనకు వస్తుండటంతో ప్రత్యేక పోలీసు బలగాలతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఉరవకొండ సీఐ చిన్నగౌస్తో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రావతి డీప్‌కట్ వద్ద మొదట సీఎం చేపట్టే జలహరతి కార్యక్రమం, అనంతరం పైలాన్ ప్రారంభోత్సవం, హంద్రీనీవా వెడల్పు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు స్థలాలను పరిశీలించారు. అనంతరం ఉరవకొండ ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయిస్తామని ఎస్పీ తెలిపారు. -
ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు
- పయ్యావుల సోదరుల కనుసన్నల్లో జూద కేంద్రం - నంద్యాలలో టీడీపీ అప్రజాస్వామిక గెలుపు - జగనన్న వస్తున్నాడని ప్రతి ఒక్కరికీ చెప్పండి - నవరత్నాల సభలో వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు ఉరవకొండ: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై బూత్‌లెవల్ కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఉరవకొండలోని శ్రీ వీరశైవ కల్యాణమండపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యాన ‘నవరత్నాల’ సభ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివచ్చారు. వజ్రకరూర్ మండల కన్వీనర్ జయేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. అధికారంలోకి రావడానికి గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హమీలు ఇచ్చారని, ఇందులో ఒక్కటీ నేరవేర్చలేక పోయారని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. హంద్రీ- నీవా ఆయకట్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయినా ఒక్క ఎకరాకు కుడా సాగునీరు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాల కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. కూడేరు మండలం కొర్రకోడు డ్యాం వద్ద ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు శీనప్పల అండదండలతో జూద కేంద్రం నడుస్తోందన్నారు. జూదకేంద్రం వద్దే మద్యం కూడా అందుబాటులో ఉంచారని, ఇక్కడ ఒక ఎస్ఐ కూడా కాపలా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూద కేంద్రం ద్వారా వచ్చే ఆదాయంలో పయ్యావుల సోదరులకు మామూళ్లు ముట్టజెబుతున్నారని ఆరోపించారు. గతంలో తాడిపత్రికి చెందిన ఒక వ్యక్తి జూదంలో రూ.లక్షలు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులను హతమార్చి, చివరకు తనూ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు జూదం, మద్యం మాఫియాను పెంచిపోషిస్తున్నారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తు కోట్లాది రూపాయలు గుమ్మరించి టీడీపీ అక్కడ గెలిచిందన్నారు. ఓటర్లను బెదిరించి, ప్రలోభ పెట్టి గెలవడం గొప్ప విషయం కాదన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన 20 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదికగా ప్రకటించిన నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, జగనన్న వస్తున్నాడని ఊరూవాడా చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు యువనేత వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, మాన్యం ప్రకాష్, కాకర్ల నాగేశ్వరావు, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ, నిర్మలమ్మ, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, చేనేత విభాగం జిల్లా కమిటీ సభ్యులు ఎంసీ నాగభూషణం, చెంగల మహేశ్వర తదితరులు పాల్గొన్నారు. -
గణపతి లడ్డు ‘ రూ.76 వేలు
ఉరవకొండ: వినాయక చవితిని పురస్కరించుకుని ఉరవకొండలోని రంగావీధిలో కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొలువుదీర్చిన గణనాథుడిని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వద్ద ఉంచిన లడ్డును వేలం వేయగా అదే వీధికి చెందిన నాగభూషణం రూ. 76 వేలకు పాట పాడి దక్కించుకున్నారు. అదే సమయంలో వినాయకుడికి కప్పిన శాలువను రూ. 33 వేలకు సూర్యనారాయణ, కండువాను రూ. 10,500కు విజయ్‌కుమార్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు అభినందించారు. -
19న ఉరవకొండకు దగ్గుపాటి పురందేశ్వరి రాక
అనంతపురంసెంట్రల్: నియోజకవర్గ విస్తారక్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న ఉరవకొండలో బూత్ కమిటీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లాఅధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆపార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా మోర్చా ఇన్చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పెన్నానది నిర్మించిన చాగళ్లు, పెండేకల్లు ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో పాలకులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలను సమానదృష్టి చూడాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేంటి కేశవా ?
– రూ. 56 కోట్ల తాగునీటి పథకం ప్రారంభానికి రాజకీయ గ్రహణం – ప్రభుత్వానికి వినిపించని 40 గ్రామాల ప్రజల దాహం కేకలు – నీరు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతల కుటిల రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రజల దాహర్తి తీర్చడంలో కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారు. గత ఏడాదే పూర్తి అయిన రూ. 56 కోట్ల తాగునీటి పథకాన్ని ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారు. దీంతో 46 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే.. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుతో పాటు మరో రెండు మండలాల ప్రజల దాహర్తిని తీర్చేలా రూ.56 కోట్లు వెచ్చించి కూడేరు మండలంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని నిర్మించారు. దీని పనులు గత యేడాదే పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన ట్రయిల్‌రన్ కుడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజలు కుడా ఇక తమకు తాగునీటి కష్టాలు తీరతాయని భావించారు. అయితే నేటివరకు ఈ పథకాన్ని ప్రారంభంచడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడు అడ్డుపడటం వల్లే ఈ తాగునీటి పథకం నేటిని ప్రారంభం కావడం లేదని ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ప్రారంభిస్తే జనం దాహం తీరినట్టే ! కూడేరు మండలంతో పాటు ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లోని 40 గ్రామాలతో పాటు అనంతపురం రూరల్ పరిధిలోని పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2013లో ఈపథకం ప్రారంభించారు. రూ. 56 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ పథకం పనులు గత యేడాది పూర్తయ్యాయి. కూడేరు మండలం పీఎబీఆర్ జలాశయం వద్ద ఊట బావిని నిర్మించి అక్కడి నుండి నీటిని సమీపంలో నిర్మించిన సంప్ల ద్వారా పైప్లైన్ల నుండి సరఫరా చేయాల్సి ఉంది. తాగునీటిని అందించడానికి దాదపు 130 కిమీ మేర పైప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 7 మిలియన్ లీటర్ల నీరు ఈ పథకానికి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. గత యేడాది సెప్టెంబర్‌లో పనులు పూర్తవడంతో డిసెంబర్ నెలలో అధికారులు ట్రయిల్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అయినప్పటికి తాగునీటి పథకాన్ని మాత్రం ప్రారంభించలేక పోయారు. ఎమ్మెల్యే పోరాటం రూ. 56 కోట్ల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా పోరాడుతూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. వేలాది మందితో పీఏబీఆర్ వద్ద ఉన్న తాగునీటి పథకాన్ని ప్రారంభించేందుకు వెళ్లగా ఎమ్మెల్యేతో పాటు మిగిలిన వారిని కూడా ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఆ తర్వాత అనంతపురంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావడం లేదు. అడ్డుపడే వారికి బుద్దిచెబుతాం - గౌరమ్మ, కురుట్లపల్లి తాగునీరు కోసం ప్రజలు పడే కష్టాలు అన్నీ నాయకులకు తెలుసు. అయినా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడతున్నారు. అలాంటి వారికి తప్పకుండా బుద్ది చెబుతాం. పథకం పూర్తి అయినా నీళ్లు ఇవ్వడానికి మీకు మనస్సు రాదా. నీళ్లు ఉన్నా వాడుకోలేని దుస్థితి - లక్ష్మిదేవి, అంతరగంగ మా గ్రామానికి దగ్గరగా డ్యాం ఉన్నా మాకు గుక్కెడు తాగునీరు అందని దుస్థితి నెలకొంది. పనులన్నీ వదులుకోని నీళ్ల కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి. మా బాధలు ప్రభుత్వానికి పట్టలేదు. -
నత్తే నయం
- ముందుకు సాగని హంద్రీ-నీవా వెడల్పు పనులు - ఫలితమివ్వని 90 రోజుల కార్యచరణ - ఆందోళనలో రైతన్నలు – ఆయకట్టుకు నీరివ్వాలని వేడుకోలు అనంత రైతులకు హంద్రీ-నీవా జలాలు అందనంటున్నాయి. కార్యాచరణ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితం కాగా...రైతుల ఆశలన్నీ నీరుగారుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించిన 90 రోజుల ప్రణాళిక కూడా ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరాల తరబడి సాగుతున్న పనులతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఉరవకొండ : ‘‘అనంత రైతాంగానికి హంద్రీ-నీవా జలాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం..90 రోజుల్లో డిస్ర్టిబ్యూటరీలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తాం..పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం’’ మార్చి మొదటి వారంలో అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి. దీంతో అనంత రైతులంతా ఈ ఖరీఫ్‌కు హంద్రీ-నీవా జలాలు అందుతాయని ఆశగా ఎదురుచూశారు. కానీ పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా 90 రోజుల ప్రణాళిక ప్రకటించారు. అనంత రైతాంగానికి హంద్రీ-నీవా నీళ్లిచ్చి తీరుతామని గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పనులు సా....గుతున్నాయి. జూన్ 10న ప్రారంభం హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులు జూన్ 10న యుద్ధప్రతిపాదికన ప్రారంభయ్యాయి. వారం రోజుల పాటు ఐదు చోట్ల భారీ యంత్రాలతో చురుగ్గా సాగినా.... ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. 216 కిలోమీటర్లు కాలువ వెడల్పు పనులు మూడు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టుర్లకు అప్పగించినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా? హంద్రీనీవా కాలువ తవ్వడానికి ఏడేళ్లు పట్టింది. అంతేస్థాయిలో ఉన్న కాలువ వెడల్పు పనులు మూడంటే మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమైయ్యే పనేనా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కాలువను 10 మీటర్లు మేర(బెడ్ లెవెల్) తవ్వడానికే ఏడేళ్లు పట్టింది. ప్రస్తుతం కాలువ బెడ్‌ను 19.5 మీటర్లకు పెంచాల్సి ఉంది. అంటే గతంలో జరిగినంత మేర మళ్లీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏడేళ్లు సాగిన పనులను 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పైగా నిధుల సమస్య, భూసేకరణ లాంటివి కుడా కాలువ వెడల్పు పనులకు ఆటంకం కల్పించనున్నాయి. పనుల కేటాయింపు ఇలా... 216 కి.మీ. నిడివి కలిగిన హంద్రీనీవా కాలువను వెడల్పు పనులు చేయడానికి మూడు ప్యాకేజీలుగా విభజించారు. కర్నూలు జిల్లా మాల్యాల నుంచి 64వ ప్యాకేజీని రిత్విక్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ సంస్థకు, 64వ కి.మీ. నుంచి 134 కి.మీ. వరకూ రెండవ ప్యాకేజీని హిందూస్థాన్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థకు. 134 కి.మీ. నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరుకు మూడవ ప్యాకేజీ పనులను ఎంఈఐఎల్ సంస్థకు అప్పగించారు. మన జిల్లా పరిధిలో 82 కి.మీ. కాలువ పనులను ఎంఈఐఎల్ సంస్థ చేపట్టింది. మట్టి తొలగించి కాలువ వెడల్పు చేసే పనులను ఆ సంస్థ ఐదు కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కాలువలో ఉన్న సిమెంట్ నిర్మాణాల వద్ద లైనింగ్, బెడ్డింగ్ పనులు మాత్ర సదరు సంస్థ స్వయంగా చేపట్టింది. ఇందులో భాగంగా కాలువలో 134, 176, 179, 180, 182 కి.మీ. వద్ద మట్టి తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కానీ రాగులపాడు పంప్‌హౌస్ వద్ద హంద్రీ-నీవా కాలువ వెడల్పు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు 34 ప్యాకేజీలో కాలువను ఎంత మేర వెడల్పు చేయాలో కనీసం మార్కింగ్ కూడా వేయలేదు. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా జలాలు అనంత రైతులకు అందాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పనులు వేగవంతానికి చర్యలు 90 రోజుల్లో హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. పనులపై ఏరోజుకారోజు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాము. భారీ యంత్రాలతో పనులు ప్రారంభించాము. పనులు మందకొడిగా జరుగుతున్నాయనుకున్న చోట నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతమయ్యేలా చూస్తాం. -రాజశేఖర్‌బాబు, కార్యనిర్వాహక ఇంజనీరు, హంద్రీనీవా -
కోర్టుకు లాగారు!
డ్వాక్రా మహిళలకు సర్కార్ మోసం రుణమాఫీ పేరుతో దగా చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తిసిన వైనం మాఫీ అవుతుందనుకున్న మహిళలకు నిరాశ తేరుకునే లోపు కోర్టు నుంచి నోటీసులు గౌరవంగా బతుకుతున్న తమను బజారుకీడుస్తారా? ‘జీవనోపాధుల కోసం తీసుకున్న రుణాలను ఏ ఒక్కరూ చెల్లించకండి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాను’ అంటూ ఎన్నికలకు ముందు మహిళా సంఘాలకు చంద్రబాబు ఇచ్చిన హామీలో డొల్లతనం బయటపడింది. అప్పటి వరకూ రుణాలు సక్రమంగా చెల్లిస్తూ వచ్చిన మహిళా సంఘాలు సైతం చంద్రబాబు హామీతో చెల్లింపులపై మిన్నకుండి పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతూ వచ్చిన సర్కార్... చివరకు మహిళలను కోర్టుకు లాగింది. తీసుకున్న రుణాలను నయాపైసాతో సహా చెల్లించాలంటూ కోర్టు ద్వారా పంపిన బ్యాంకర్లు నోటీసులతో మహిళలు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సంసారం నెట్టుకు వస్తున్న తమను బజారు కీడ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - ఉరవకొండ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన మహిళా సంఘాలు.. చంద్రబాబు రుణమాఫీ మాయాజాలంలో చిక్కుకుని బ్యాంక్‌లలో డీఫాల్డ్ గ్రూపులుగా మారాయి. 2012 నుంచి 2014 వరకూ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 4,567 మహిళా సంఘాల్లోని 46,107 మంది సభ్యులకు జీవనోపాధుల కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేశాయి. వీటి కంతులను సకాలంలో ఆయా మహిళా సంఘాలు చెల్లిస్తూ వచ్చాయి. సంఘానికి రూ. 10 వేల ప్రకారం రెండు విడతలుగా రూ. 30.18 కోట్ల పెట్టుబడి నిధిని బ్యాంకర్లు మంజూరు చేయగా... వీటిలో అత్యధిక శాతాన్ని మహిళా సంఘాలు చెల్లించాయి. ప్రస్తుతం బ్యాంక్‌లకు మహిళా సంఘాలు రూ. 14.90 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా రుణమాఫీ ప్రకటనతో నిలిచిపోయిన సొమ్ము కావడం గమనార్హం. అధికారం దక్కించుకోవడంలో భాగంగా మహిళా సంఘాలను మభ్యపెట్టి కంతులు చెల్లించకుండా అప్పట్లో చంద్రబాబు నిలువరించి ఉండకపోయి ఉంటే ఈ బకాయి కూడా ఉండేది కాదని పలువురు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందే తీసుకున్న రుణాలను చెల్లించాలంటూ కోర్టు ద్వారా వందలాది మహిళా సంఘాలకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలకు చెందిన 670 మహిళా సంఘాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ల నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహిళా సంఘాల సభ్యుల్లో గగ్గోలు మొదలైంది. ఏనాడూ కోర్టు మెట్టు ఎక్కని మహిళలు... న్యాయస్థానంపై గౌరవంతో రెండ్రోజుల క్రితం కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి తాము మోసపోయామంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. వడ్డీతో రుణాలు చెల్లించలేమని, అసలు మాత్రమే చెల్లిస్తామని, ఇందుకు నెల రోజుల గడవు తీసుకుని వచ్చారు. రుణమాఫీ అయివుంటే తమకు ఆర్థికంగా కొంత ఉపశమనం దొరికేదని, అయితే ముఖ్యమంత్రి తమను ఇలా దగా చేస్తారని ఊహించలేదంటూ ఈ సందర్భంగా పలువురు మహిళలు వాపోయారు. అవమానపరిచారు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు కోర్టు ద్వారా నోటీసులు పంపి మమ్మల్ని అవమానపరిచారు. సంఘంలో మొత్తం 10 మంది రోజూ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో ఒక్కసారిగా వడ్డీ భారం పెరిగిపోయింది. దీంతో రుణం చెల్లించలేని దుస్థితి నెలకొంది. - ముత్యాలమ్మ,, షెక్షానుపల్లి సీఎం సమాధానం చెప్పాలి రుణమాఫీ చేస్తానంటూ హమీ ఇచ్చిన సీఎం సార్ సమాధానం చెప్పాలి. ఆయన చెప్పిన మాట విని మేము డబ్బు కట్టలేదు. అయినా రుణాలు మాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హమీ ఇవ్వాలి? మమ్మల్ని బజారుకీడ్చడానికా? - రామాంజినమ్మ, షెక్షానుపల్లి -
చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
ఉరవకొండ : ఉరవకొండ పట్టణం రంగావీధిలోని వ్యాపారి ఎర్రిస్వామి ఇంట్లో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ చోరీ కేసులో నిందితులైన వెలిగొండ ఎణ్ణప్ప, పులి రమేష్‌లను గుంతకల్లు రోడ్డులో అరెస్ట్ చేసినట్లు ఇన్చార్జ్ సీఐ గుర్నాథ్బాబు, ఎస్ఐ నగేష్‌బాబు మంగళవారం తెలిపారు. అప్పట్లో రూ.20వేల నగదు, జత బంగారు కమ్మలు, ఉంగరం చోరీ అయ్యిందన్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్ అక్రమంగా తపంచా కలిగి ఉన్న కేసులో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న డ్రైవర్స్ కాలనీ మహబూబ్‌సాహెబ్ కుమారుడు వన్నూరుసాబ్ను చెన్నైలో అరెస్ట్ చేసి ఉరవకొండకు తీసుకొచ్చినట్లు ఎస్ఐ నగేష్‌బాబు తెలిపారు. -
రాకాసి రహదారులు
- వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలకు ముగ్గురి దుర్మరణం - దైవదర్శనానికి వెళ్లొస్తూ ఇద్దరు ‘అనంత’ విద్యార్థులు.. - బైక్‌పై బయలుదేరిన కాసేపటికే వ్యాపారి.. రాకాసి రహదారులు ప్రజల రక్తం తాగుతున్నాయి. అయిన వారి కన్నీళ్లతో తడిసి ముద్దవుతున్నాయి. నిర్లక్ష్యం.. అజాగ్రత్త..అలసత్వం.. ఏదైనా సరే.. నిండు జీవితాలు అర్ధాంతరంగా బలైపోతున్నాయి. తాజాగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు దైవదర్శనానికి వెళ్లొస్తూ ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే మృత్యుబారినపడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో తీరని విషాదం నెలకొంది. కూడేరు(ఉరవకొండ) : కూడేరు మండలం శివరాంపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం రుద్రంపేటకు చెందిన పుల్లప్ప కుమారుడు కుమార్(13), రామాంజనేయులు కుమారుడు ముఖేష్(14) మరణించారు. ఎస్ఐ రాజు తెలిపిన మేరకు... కుమార్, ముఖేష్ సహా మరో ముగ్గురు కలసి ఆటోలో పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం వారంతా అదే ఆటోలో తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న ఆటో శివరాంపేట వద్దకు రాగానే అనంతపురం నుంచి ఉరవకొండకు బయలుదేరిన లారీ విపరీతమైన వేగంతో వచ్చి, బలంగా ఢీకొనడంతో కుమార్ తలభాగం పూర్తిగా తెగిపోగా, మొండెం మాత్రం మిగిలింది. తీవ్రంగా గాయపడిన ముఖేష్‌ను అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమార్ 8వ తరగతి, ముఖేష్ 9వ తరగతి చదువుతున్నారు. పుల్లప్పకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కాగా, ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహంపై పడి రోదించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
గ్రామాలకు నీరొచ్చేసింది
తన నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు పట్టువీడని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేసిన పోరాటాలు ఫలించాయి. తాగునీటి దగ్గర రాజకీయాలను సహించనని, 4వ తేదీలోపు నీటి పథకాన్ని ప్రారంభించకుంటే ప్రజలతో కలిసి తామే ఆ పని చేసుకుంటామని శనివారం ఆయన హెచ్చరించడంతో అధికారపార్టీ నాయకులు, అధికారుల్లో చలనం వచ్చింది. ఆదివారం ప్రాజెక్టును ప్రారంభించి గ్రామాలకు నీరు సరఫరా చేశారు. కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకాన్ని అధికారులు ఎట్టకేలకు ఆదివారం ప్రారంభించి గ్రామాలకు నీరు సరఫరా చేశారు. కూడేరు మండలమంతటికీ నీరందింది. నియోజవర్గంలోని కూడేరు, ఉరవకొండ, వజ్రకరూర్, విడపనకల్లు మండలాల్లోని 90 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు 2013 నవంబర్‌లో రూ.56 కోట్లతో ఈ పథకం పనులు ప్రారంభించారు. కానీ పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. నిబంధనల మేరకు 2015 నవంబర్‌తో గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. దీంతో గడువు మళ్లీ పొడిగించారు. తర్వాత కూడా పనులు వేగం పుంజుకోలేదు. ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ పనులను పర్యవేక్షిస్తూ వచ్చారు. పలుమార్లు ఇరిగేషన్ అధికారులను కలిసి తాగునీటి సమస్య తీవ్రతను వివరించారు. స్పందించిన అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం పనులు పూర్తయ్యాయి. కానీ దాని ప్రారంభానికి అధికారపార్టీ నాయకులు అడ్డు తగులుతూ వచ్చారు. దీనిపై సాక్షి దినపత్రిక కొన్ని కథనాలను కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన నిలిచి పోరాటానికి దిగారు. మే 4వ తేదీ లోపు ప్రారంభించకుంటే ప్రజా ఉద్యమం చేపట్టి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తామే ప్రారంభించుకుంటామని శనివారం కూడేరులో చేపట్టిన ధర్నాలో డెడ్‌లైన్ పెట్టి హెచ్చరించారు. దీంతో ఇరిగేషన్ అధికారుల్లోనూ, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం వచ్చింది. ప్రాజెక్టును ప్రారంభించడంతో ప్రజల దాహార్తి తీరుతోంది. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే
- సాగుభూమి కోసం రైతు ఆందోళన - పురుగు మందుడబ్బాతో ధర్నా ఉరవకొండ : తాను 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్న భూమిని అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ భూమి అంటున్నారని తనకు న్యాయం చేయాలని మండల పరిధిలోని రాకెట్ల గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి రమేష్ వాపోయాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు డబ్బాతో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ 2005లో దాసరి చెన్నమ్మ అనే మహిళ తన తండ్రి ఎర్రిస్వామి, తల్లి అక్కమ్మకు 12.85 ఎకరాల భూమి విక్రయించిందన్నాడు. వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని తెలిపాడు. భూమికి పాసుపుస్తకం కూడా మంజురైందని, అందులో వేరుశనగ, పప్పుశనగ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ, బీమా కూడా అధికారులు మంజురు చేశారని, అయితే అధికారులు ప్రస్తుతం ఈభూమి డైక్లాడ్లో ప్రభుత్వ భూమిగా చూపుతున్నారన్నారు. ఈ భూమి ప్రభుత్వ భూమి అయినపుడు ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అధికారులు చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. తమ భూమి తమకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ తిమ్మప్ప బాధిత రైతును పిలిపించి వివరాలు సేకరించారు. -
ఉరవకొండలో వరుస చోరీలు
ఉరవకొండ: ఉరవకొండలో సోమవారం అర్ధరాత్రి దొంగలుపడ్డారు. వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. స్థానిక లాలూస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న రాజేశ్వరి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి, అందులోని రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు, వెండి నగలను అపహరించారని ఏఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంటి బయట నిద్రిస్తున్నట్లు వివరించారు. ఆ తరువాత మల్లేశ్వరస్వామి ఆలయంలోనూ దొంగలు ప్రవేశించారు. స్వామి వారి హుండీని ధ్వంసం చేసి, అందులోని వేలాది రూపాయల నగదును ఎత్తుకెళ్లారని చెప్పారు. అర్చకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా డాగ్‌స్కా్వడ్‌ను రప్పించి రాజేశ్వరి ఇంట్లో తనిఖీ నిర్వహించారు. త్వరలోనే దొంగలను గుర్తించి పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
ఉరవకొండలో బాలిక కిడ్నాప్
ఉరవకొండ : పట్టణంలోని గవిమఠం సమీపంలో నివాసముంటున్న కూలీ యుగంధర్ కుమార్తె ఉమ (14) ఆదివారం రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ బెళుగుప్ప కేజీబీవీలో 8వతరగతి చదువుతోంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ఉమను పెద్దనాన్న శ్రీనివాసులు పని ఉందంటూ పిలుచుకెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శ్రీనివాసులుకు ఫోన్ చేయగా నంబర్ పనిచేయలేదు. ఆందోళనకు గురై శ్రీనివాసులు ఇంటి వద్దకు వెళితే తలుపులకు తాళం వేసి ఉంది. అక్కడి నుంచి బస్టాండ్ ప్రాంతంలో వెతుకుతుండగా ద్విచక్రవాహనంలో ఉమను బలవతంగా పెద్దనాన్న, మరో యువకుడు తీసుకెళుతుండటం కనిపించింది. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ యుగంధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్’
ఉరవకొండలో బరి తెగించిన టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్న ఆ ‘ఐదుగురు’ గోవింద్ కనుసన్నల్లో నిత్యం సెటిల్మెంట్లు అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యం కంప్యూటర్ ఆపరేటర్ రామలింగం ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వాస్తవాలు ఓ స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని రామలింగంతో యథేచ్ఛగా పనులు నిబంధనలకు విరుద్ధంగా పని చేయలేక ఆత్మహత్య! తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రామలింగం ఆత్మహత్య వెనుక పెద్ద కుట్ర దాగుందా? ఓ స్థలం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు అతన్ని బ్లాక్మెయిల్ చేసి.. యథేచ్ఛగా అక్రమాల పర్వాన్ని సాగించారా? ఉరవకొండలో ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కొల్లగొడుతున్నా, నిత్యం సెటిల్మెంట్లు సాగిస్తున్నా అధికార యంత్రాంగం ‘జీహుజూర్’ అనడం మినహా అడ్డుకట్ట వేయలేకపోయిందా? కొంతమంది అధికారులు కూడా టీడీపీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారా?... ఉరవకొండలో కొంతకాలంగా సాగుతున్న వ్యవహారాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఉరవకొండలో అధికార పార్టీకి చెందిన ఐదుగురు టీడీపీ నేతల బృందం అరాచకశక్తిగా మారింది. ఈ బ్యాచ్‌లో లత్తవరం మాజీ సర్పంచ్ గోవింద్ కీలకమని తెలుస్తోంది. ఉరవకొండతో పాటు చుట్టుపక్కల భూదందాలు, సెటిల్మెంట్లు, ఇతర పంచాయితీలు ఏవైనా వీరి దృష్టికి వస్తే క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ‘వ్యవహారాన్ని చక్కబెడతాం..మీకింత- మాకింత’ అని రేటు కుదుర్చుకుంటారు. అధికార పార్టీని, అధికారులను అడ్డుపెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తారు. వీరి దందాను ఎవరైనా ప్రశ్నిస్తే నోట్లకట్టలతో మభ్యపెడతారు. దారికి రానివారిని తమదైన శైలిలో భయపెడతారు. ఇదే తరహాలోనే కంప్యూటర్ ఆపరేటర్ రామలింగాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందట రామలింగం షేక్షాన్పల్లిలో తన భార్య పేరుతో ఐదెకరాల పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. దీన్ని టీడీపీ నేత గోవింద్ పసిగట్టారు. రామలింగంతో చర్చించారు. తాను చెప్పిన పనులు చేస్తే ఐదెకరాల వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతానని, లేదంటే విలేకరులకు చెబుతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో రామలింగం భయపడి సరెండర్ అయిపోయాడు. అతన్ని అడ్డుపెట్టుకుని గోవింద్ తహసీల్దార్ కార్యాలయంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ముష్టూరు సమీపంలోని ఓ ప్రభుత్వ స్థలంపై గోవింద్బ్యాచ్ కన్ను పడింది. అందులో ప్లాట్లు వేసి విక్రయించాలని భావించారు. డీసీల్యాండ్గా ఉన్న ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ అయ్యేలా మరో సర్వే నంబర్‌కు మార్చి అడంగల్‌లో పొందుపరచాలని ఒత్తిడి తెచ్చారు. అతను అలాగే చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వీరి ఒత్తిడితో తహసీల్దార్ కార్యాలయంలో చాలా వ్యవహారాలు చేసినట్లు సమాచారం. అయినా వారు వదలకపోవడంతో ఇలాంటి పనులు మరిన్ని చేయలేక ఆత్మహత్యకు తెగించినట్లు తెలిసింది. ఉరవకొండ బ్యాచ్ దందాల్లో కొన్ని – ఉరవకొండలోని సర్వే నంబర్ -127లో కొంత భూమిని స్వాతంత్య్ర సమరయోధునికి ఇచ్చారు. దీన్ని ‘పచ్చబ్యాచ్’ సర్వే నంబర్ 102–ఏగా మార్చి తొమ్మిది మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనూ రామలింగాన్ని గోవింద్ వాడుకున్నట్లు సమాచారం. – ఎక్కడైనా లేఅవుట్ వేసేముందు 30 శాతం స్థలాన్ని పంచాయతీకి వదలాలి. ఉరవకొండలో ఇలా వదిలిన ఓ విలువైన స్థలంపై ‘బ్యాచ్’ కన్నుపడింది. దాన్ని తాము తీసుకుని బదులుగా మరోచోట ఇస్తామని ‘ఎక్సే్ఛంజ్ ఆఫ్ ల్యాండ్’ కింద పంచాయతీకి లేఖ రాశారు. ఉరవకొండ టీడీపీ సర్పంచ్ నర్రా సుజాత భర్త కేశన్న కూడా ఇందులో చేయి కలిపినట్లు తెలుస్తోంది. దీంతో ‘ఎక్సే్ఛంజ్ ఆఫ్ ల్యాండ్’కు పంచాయతీ ఒప్పుకుంటూ తీర్మానం కూడా చేసినట్లు సమాచారం. – ఉరవకొండలో రోడ్డు విస్తరణకు ముందు చికెన్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం వాటిని తొలగించారు. వీటి వెనుక ఓ వృద్ధురాలు ఇల్లు ఉంది. విస్తరణ తర్వాత ఆమె ఇల్లు మెయిన్‌రోడ్డుపైకి వచ్చింది. దీనిపై గోవింద్ కన్నుపడింది. ఎమ్మార్పీఎస్ నాయకుడి పేరుతో ఈ స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి నెలకిందట ఆమెను ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ స్థలం గవిమఠానికి సంబంధించినది. – గవిమఠానికి సంబంధించి 50 సెంట్ల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు డాక్యుమెంట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మఠం ఏజెంట్ రాజన్న కూడా చేతులు కలిపినట్లు సమాచారం. ఈ స్థలం ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని ఓ వర్గం చెబుతోంది. – ఉరవకొండలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన రూ.1.60 కోట్లు విలువచేసే స్థలం వివాదంలో ఉంది. ఈ కుటుంబం అప్పుల్లో ఉంది. స్థలం విక్రయించి బాకీలు చెల్లించాలని రుణదాతలు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గోవింద్ జోక్యం చేసుకుని.. స్థలాన్ని ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి విక్రయించేలా చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇతనికీ భారీగానే ముట్టినట్లు వినికిడి. – ఉరవకొండ టవర్‌క్లాక్ సమీపంలోని ఓ కాంప్లెక్స్ వ్యవహారంలోనూ పంచాయితీ చేసి భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది. – ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వెనుక ఓ బావి ఉండేది. కాలక్రమంలో దాన్ని పూడ్చేశారు. ప్రభుత్వ స్థలమైన దీన్ని కూడా మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు వెలుగులోకి రాని ఎన్నో దందాలు గోవింద్ అండ్ కో ఖాతాలో ఉన్నాయని ఉరవకొండలో చర్చించుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా తమ పని కాలేదంటే ఎమ్మెల్పీ పయ్యావుల కేశవ్‌కు చెప్పి బదిలీ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగుతారని తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగిన వెంకటేశ్ హత్య కేసులో ఓ టీడీపీ మండలాధ్యక్షుడు, ఓ లాయర్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉందని పట్టణం మొత్తం కోడై కూసింది. ఈ కేసులో నిందితుల పేర్లను పూర్తిగా మార్చేలా గోవింద్ పోలీసులను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. సివిల్ పంచాయితీలకు సంబంధించి ఎవరైనా దారికి రాకపోతే ఈ బ్యాచ్ పోలీసులను ఆశ్రయిస్తుంది. పోలీసులు వారిని తీసుకొచ్చి బెదిరించి ఈ బ్యాచ్‌కే అండగా నిలుస్తారన్న విమర్శలున్నాయి. ఉరవకొండలో ఈ స్థాయిలో అధికార పార్టీ అరాచకాలు నడుస్తోంటే సామాన్యుల ఆస్తులకు ఏమేరకు భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పచ్చ బ్యాచ్’ ఆగడాలపై ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలని ఉరవకొండ ప్రజానీకం విన్నవిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
విడపనకల్లు(ఉరవకొండ): విడపనకల్లు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం మళాపురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మోహన్‌కృష్ణ(35) మరణించినట్లు ఎస్ఐ రత్నం తెలిపారు. విడపనకల్లు నుంచి బైక్‌లో కర్ణాటకలోని బళ్లారికి బయలుదేరగా.. మార్గమధ్యంలోని పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే చేళ్లగురికి నుంచి విడపనకల్లు వైపునకు ఎదురొచ్చిన మరో బైక్ ఢీకొనడంతో మోహన్‌కృష్ణ తలకు బలమైన గాయమైందని, ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య మాధురి, కొడుకు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మళాపురానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి సంతాపం తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, తదితరులు ఉన్నారు. ఉరవకొండ ఆస్పత్రి మార్చురీలోని మోహన్‌కృష్ణ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
ఉరవకొండ : మండల పరిధిలోని షేక్షానుపల్లిలో ఈనెల 1న హత్యకు గురైన విజయ్ (25) కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ నగేష్‌బాబు హత్యకేసులో నిందితుల వివరాలు వెల్లడించారు. నెరిమెట్ల గ్రామానికి చెందిన పూసల ఎర్రిస్వామి భార్యతో విజయ్ అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడన్న అనుమానంతో ఎర్రిస్వామి తన సోదరులు నాగరాజు, నారాయణస్వామి, శంకరప్పతో ఈనెల 1న అర్థరాత్రి విచక్షణారహితంగా దాడి చేయించాడు. విజయ్ తీవ్ర గాయాలతో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 2న మృతి చెందాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాగరాజు, నారాయణస్వామి అనే వ్యక్తులను పెన్నహోబిళం సమీపంలో సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి దాడికి పాల్పడిన కట్టెలను కుడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శంకర్ కోసం గాలిస్తున్నామన్నారు. ఏఎస్ఐ మహేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉరవకొండలో అగ్నిప్రమాదం
- రూ.2 లక్షల ఆస్తి నష్టం ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక పాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సమీపంలో నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక సెలూన్, సైకిల్ షాపు, హోటల్, కిరాణ దుకాణం దగ్ధమైన సంఘటనలో రూ. 2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరో గిట్టని వారు ఈ పనికి పాల్పడ్డారని దుకాణ యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో తాము రోడ్డున పడ్డామని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
ఉరవకొండ : స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉరవకొండ గవిమఠ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి చిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 25 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్ర స్వామి పోటీలను ప్రారంభించారు. కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. రెండోస్థానంలో తేరనిపల్లి ఎడ్లు, మూడోస్థానంలో కాశేపల్లికి చెందిన ఎడ్లు నిలిచాయి. నాల్గోస్థానంలో కర్నూలుకు చెందిన ఎడ్లు, ఐదో స్థానంలో తాడిపత్రికి చెందిన ఎడ్లు బహుమతులు గెలిచాయి. విజేతలకు మోహన్, నర్రాకేశన్న, శివన్న, గుత్తా నరసింహులు, మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందు, పవన్ రెస్టారెంట్ రాజు, మదమంచి ఈశ్వరయ్య, మాసినేని రామ్మోహన్ బహుమతులు అందించారు. -
హరహర మహదేవ శంభోశంకర
- నేత్రపర్వంగా సాగిన చంద్రమౌళీశ్వర బ్రహ్మరథోత్సవం - భక్తులతో పోటెత్తిన గవిమఠ సంస్థానం ఉరవకొండ : హరహర మహదేవ శంభోశంకర అనే నామస్మరణతో గవిమఠ సంస్థానం మార్మోగింది. గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా సాగాయి. వేడుకలు తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గవిమఠ సంస్థానం కిటకిటలాడింది. ఉదయం సంప్రదాయబద్ధంగా మేజర్ పంచాయతీ వారు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించిన భారీ గజమాలను రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్టు అధినేత నర్రాకేశన్న అధ్వర్యంలో ఊరేగింపుగా గవిమఠానికి సమర్పించారు. అనంతరం గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి వారి అధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. తర్వాత భక్తులు హరహర మహదేవ శంభోశంకర అంటూ రథాన్ని ముందుకు లాగారు. ఉరవకొండ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శాయికుమారి, గవిమఠం సహాయ కమిషనర్ ఆనంద్, ఈఓ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్ఐ లింగేష్, మాజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవితో పాటు జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ కొత్తలక్ష్మిదేవి, ఎంపీటీసీ సభ్యులు విజయ్, రవి, మాలింగ, ఎర్రిస్వామి పాల్గొన్నారు. -
గవిమఠం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉరవకొండ : ఉరవకొండ గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వరస్వామి వారి బ్రహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకుమార్చన నిర్వహించారు. ఆదోని చౌకిమఠం పీఠాధిపతి కళ్యాణస్వామి, మఠం సహాయ కమిషనర్ ఆనంద్ అధ్వర్యంలో గంగాజలంతో ఊరేగింపుగా కంకణ మండపానికి చేరుకున్నారు. అనంతరం పూజలు చేశారు. మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపీ పాల్గొన్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి నాగాభరణ ఉత్సవం జరగనుంది. -
మూతపడిన ఉరవకొండ సబ్‌జైలు
∙కడప డీఐజీ నుంచి వెలువడిన ఉత్తర్వులు ∙ సబ్ జైలర్ కడపకు బదిలీ ఉరవకొండ : ఉరవకొండ సబ్ జైలు మూతపడింది. కడపలోని జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు ఉరవకొండ సబ్ జైలు అధికారులకు అందాయి. నెలకు ఒక సారి నిల్ లాకప్ నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 1983లో మొత్తం 23 మంది ఖైదీల సామర్థ్యంతో సబ్‌జైలు ఏర్పాౖటెంది. దీంతో పాటు 2010లో జైలును రూ.55 లక్షల వ్యయంతో ఆధునీకరించారు. జైలు నిర్వహణకు ఖైదీలు లేక పోయినా ఏడాదికి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు అవుతుండంతో ఉన్నతాధికారులు దీన్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ సబ్ జైలు మూతపడటంతో ఇక్కడ పని చేస్తున్న సబ్ జైలర్ రఘనాథరెడ్డిని కడప సెంట్రల్ జైలుకు, ఇద్దరు వార్డెన్లు వెంకటరవి, జయరాములును పెనగొండ సబ్‌జైలుకు, ఒక హెడ్వార్డె¯ŒS భాస్కర్‌రావును తాడిపత్రి, మరో హెడ్వార్డె¯ŒS నాగేంద్రప్రసాద్‌ను హిందూపురం సబ్ జైలుకు బదిలీ చేశారు. రికార్డులు పరిశీలించిన జిల్లా జైళ్లశాఖ అధికారి స్థానిక సబ్‌జైలులో రికార్డులను జైళ్లశాఖ జిల్లా అధికారి సుదర్శనరావు సోమవారం రాత్రి పరిశీలించారు. పలు కీలక రికార్డులను సబ్ జైలర్ నుంచి స్వాధీనం చేసుకొని, పర్నీచర్ను ఇతర సబ్ జైళ్లకు తరలించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ ఖైదీల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో సబ్‌జైలును మూత వేస్తున్నట్లు తెలిపారు. ఉరవకొండ సబ్‌జైలర్ రఘనాథ్రెడ్డితో పాటు సిబ్బందిని మరో సబ్ జైలుకు బదిలీ చేశామన్నారు. -
ఇద్దరు పోలీసు అధికారులకు నోటీసులు
అనంతపురం : విడపనకల్లు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ సుమారు 21 ఏళ్ల కిందట అదృశ్యమైన దామోదర్ ఆంజనేయులు (2019)కు సంబంధించిన కేసు విషయమై ఎస్ఐ, ఉరవకొండ సీఐకు సమాచార హక్కు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 38/1995 కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో మార్చి 1న కమిషనర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసు పురోగతిపై దామోదర్ బంధువు ఎస్.అనిల్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద స్టేషన్ హౌస్ ఆఫీసర్, విడపనకల్లుకు దరఖాస్తు చేశారు. అయితే అధికారులు అరకొర సమాచారం ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని అనిల్‌కుమార్ అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసినా అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సమాచార కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 1న హాజరుకావాలంటూ సమాచార కమిషనర్ నుంచి నోటీసులు ఇచ్చారు. ఇదిలాఉండగా ఇటీవల ఎస్పీ విడపనకల్లు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆ సమయంలో దామోదర్ ఆంజనేయులు కేసు విషయమై ఆరా తీసినట్లు తెలిసింది. విడపనకల్లు ఎస్ఐ వచ్చి తనను వివరాలు అడిగారని అనిల్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఉరవకొండలో వైఎస్ జగన్ మహాధర్నా
-
హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరివ్వాల్సిందే
ఉరవకొండ మహాధర్నాలో ముక్తకంఠంతో డిమాండ్ చేసిన విపక్ష నేతలు ధర్నాకు స్వచ్ఛందంగా, భారీగా తరలివచ్చిన నియోజకవర్గ రైతులు 90 శాతం పనులు ఎప్పుడో పూర్తయితే.. 10శాతం పూర్తి చేయలేకపోతున్నారని వైఎస్ జగన్ మండిపాటు ఐదేళ్లుగా నీరొస్తున్నా ఆయకట్టుకు ఎందుకివ్వలేదని మాజీ ఎంపీ అనంత సూటి ప్రశ్న హంద్రీ–నీవాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే విశ్వ డిమాండ్ భూములు కోల్పోతున్నామనే వేదనతో గుండె ఆగి చనిపోయిన రైతు బాలునాయక్ కుటుంబానికి జగన్ పరామర్శ తమ భూములను ప్రభుత్వం లాక్కోకుండా అండగా నిలవాలని జగన్‌తో మొరపెట్టుకున్న రైతులు గొల్లపల్లి రిజర్వాయర్ పరిధిలో భూసేకరణను తప్పుబట్టిన ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తిరిగిస్తామని హామీ ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ–నీవా పనులు 90 శాతం పూర్తయ్యాయి.తక్కిన పది శాతం డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి ఫేజ్–1 ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోతున్నారు. ప్రభుత్వం ఆయకట్టుకు నీళ్లిచ్చేదాకా పోరాటం చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పూర్తి చేస్తాం’’ అని విపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హంద్రీ–నీవా ఆయకట్టుకు నీళ్లివ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఉరవకొండలోని టవర్‌క్లాక్ సమీపంలో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. హంద్రీ–నీవా ఆయకట్టులో అధిక భాగం ఉరవకొండ నియోజకవర్గంలో ఉండటం, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో నీటి సాధనే లక్ష్యంగా రైతులంతా స్వచ్ఛందంగా, భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. రైతులతో ఉరవకొండ ప్రధాన దారులతో పాటు వీధులన్నీ కిక్కిరిశాయి. రైతులనుద్దేశించి ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీరు లేక, పంటలు పండక రైతులు భిక్షాటన చేస్తున్న దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. కళ్లెదుట ఉన్న నీటిని కూడా ఆయకట్టుకు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. 10శాతం పనులు కూడా పూర్తి చేయలేని చేతకాని ముఖ్యమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. వెంటనే ఆయకట్టుకు నీరిచ్చి రైతులకు అండగా నిలవాలని, లేదంటే సుదీర్ఘపోరాటం చేస్తామఽని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లికి ఐదేళ్లుగా కృష్ణాజలాలు వస్తున్నా ఆయకట్టు పనులు ఎందుకు చేపట్టలేదని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు కూడా జిల్లా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘ ప్రాజెక్టు వస్తే నీళ్లొస్తాయి, కొంత భూమి పోయినా, ఉన్న భూమిలో బంగారు పంటలు పండించుకోవచ్చని రైతులు భూములను త్యాగం చేశారు. కానీ కళ్లెదుట నీళ్లున్నా ఆయకట్టుకు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాల’ని సూచించారు. ఉద్యాన పంటలకు ‘అనంత’ అనువైన ప్రాంతమని, సాగునీరు అందుబాటులో ఉంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందంటూ వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ద్రాక్షగెలను తీసుకొచ్చి జగన్‌కు చూపించారు. వజ్రకరూరు లంబాడీ మహిళలు జగన్‌కు తలపాగా సమర్పించారు. గొల్లపల్లి భూ బాధితులకు పరామర్శ ఉరవకొండ ధర్నా అనంతరం జగన్ నేరుగా పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న మక్కాజిపల్లి తండా, అమ్మవారిపల్లికి వెళ్లారు. పారిశ్రామికవాడ పేరుతో భూములు లాక్కుంటున్నారన్న ఆవేదనతో గుండెపోటుకు గురై చనిపోయిన మక్కాజిపల్లి తండా రైతు బాలునాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వేదన చెందొద్దని, వైఎస్సార్సీసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి అమ్మవారిపల్లికి చేరుకున్నారు. జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు అప్పటికే రైతులంతా అక్కడ వేచి ఉన్నారు. వారిని జగన్ పలకరించారు. గొల్లపల్లికి నీళ్లొస్తే పంటలు పండుతాయని ఆశపడ్డామని, కానీ నీళ్లొచ్చి రెండు నెలలు కూడా కాకముందే పారిశ్రామికవాడ పేరుతో భూములు లాక్కుంటున్నారని వాసెచానే. దీనిపై స్పందించిన జగన్.. జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే కానీ రిజర్వాయర్ పరిధిలోని భూములు తీసుకోవడం దారుణమని అన్నారు. దూరప్రాంతాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను ప్రభుత్వం సేకరించాలన్నారు. భూములు కోల్పోతున్నందుకు ఎవరూ అధైర్యపడొద్దని, తమ ప్రభుత్వం రాగానే తిరిగిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కోఆర్డినేటర్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉషశ్రీ చరణ్, తిప్పేస్వామి, సిద్దారెడ్డి, నవీన్ నిశ్చల్, జొన్నలగడ్డ పద్మావతి, వై. వెంకట్రామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యువజన , రైతు, సేవాదళ్, ట్రేడ్ యూనియన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, వెంకటచౌదరి, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బోయ సుశీలమ్మ, మాజీ మేయర్ రాగేపరుశురాం, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మీసాల రంగన్న, నదీమ్ అహ్మద్, పార్టీ నేతలు వీరన్న, రమేశ్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి భరత్, రాయలసీమ అధ్యక్షుడు తరిమెల శరత్ చంద్రారెడ్డి, కేశవరెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగన్ మహాధర్నా
హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ ఉరవకొండఽలో పూర్తయిన ఏర్పాట్లు అమ్మవారిపల్లిలో భూనిర్వాసిత రైతులతో భేటీ కానున్న విపక్షనేత ఐదేళ్లుగా హంద్రీ–నీవాకు నీళ్లొస్తున్నా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కనీసం మొదటి దశకు నీళ్లిచ్చినా 1.18 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కానీ డిస్ట్రిబ్యూటరీలపై ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. ఓవైపు సాగునీరు లేక పంటలు పండక రైతులు, రైతు కూలీలు కేరళ, తమిళనాడు, కర్ణాటకకు వలస వెళుతున్నారు. ఏ దారీ లేని ఇంకొందరు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా ప్రభుత్వం కనిపకరం చూపడం లేదు. పొలాలకు నీరిచ్చి రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ క్రమంలో విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉరవకొండలో ధర్నా చేయనున్నారు. ఇందుకోసం ఉరవకొంఽడ క్లాక్‌టవర్ వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో పాటు గొల్లపల్లి రిజర్వాయర్ సమీపంలో పారిశ్రామిక వాడకోసం భూములు కోల్పోతున్న రైతులతోనూ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు. వాస్తవానికి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి, బంగారు పంటలు పండుతాయని రైతులు ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక వాడ పేరుతో వారి భూములను బలవంతంగా లాక్కునేందుకు సిద్ధమైంది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ బతుకుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఎన్ని లక్షలు ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అమ్మవారిపల్లి రైతులతో జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. – సాక్షిప్రతినిధి, అనంతపురం -
ప్రజా హక్కులను కాలరాస్తున్నారు
- పోరాటాలతోనే హంద్రీనీవా ఆయకట్టుకు నీరు - 6న నిర్వహించే ధర్నాకు భారీగా తరలిరండి - వైఎస్సార్సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి బెళుగుప్ప : ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, హంద్రీనీవా ద్వారా ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందించే వెసులుబాటు ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రజా హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలు విమర్శించారు. గురువారం బెళుగుప్ప, బెళుగుప్ప తండాలో పర్యటించి ఈనెల 6న ఉరవకొండలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ధర్నాకు హంద్రీనీవా ఆయకట్టు రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ 2014లో కొంత మందికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగా.. 2015, 16 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదన్నారు. అలాగే 2016లో పంటల బీమాను రైతులకు అందించలేదని ధ్వజమెత్తారు. హంద్రీనీవా ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. 2014 నుండి 23 టీఎంసీల చొప్పున జీడిపల్లి రిజర్వాయర్‌కు వస్తున్నా ఎకరం ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేదన్నారు. ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే సాగునీరు సాధ్యమన్నారు. రైతన్నలకు మద్దతుగా ఈనెల 6న ఉరవకొండలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో చేపట్టిన ధర్నాకు రైతులు తరలివచ్చి వచ్చే ఖరీఫ్‌కైనా సాగునీటిని తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.5,500 కోట్లను ఖర్చు పెట్టి హంద్రీనీవా ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఇదే ప్రాజెక్టు ఇప్పుడైతే రూ.30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చేదని చెప్పారు. అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి ఎన్నో సార్లు వచ్చినా ఒక్కసారి కూడా హంద్రీనీవా మొదటిదశ ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని చెప్పకపోవడం బాధాకరమన్నారు. నీటి సాధనతో పాటు సమస్యలను పరిష్కరించుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో చేస్తున్న ధర్నాకు రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
6న ఉరవకొండలో మహాధర్నా
– హాజరు కానున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి – రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే... – జిల్లా ఎస్పీని కలిసి అనుమతి కోరిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు - ఉరవకొండలో ధర్నా స్థలం పరిశీలన అనంతపురం సెంట్రల్ / ఉరవకొండ : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీన ఉరవకొండలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం వారితో పాటు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి సీపీ వీరన్న తదితరులు జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబును కలిసి ధర్నాకు అనుమతి కోరారు. ఈ సందర్భంగానూ, ఉరవకొండలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతోనూ వారు మాట్లాడారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలో ప్రతిపాదిత ఆయకట్టు 3.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు నీరందించాలన్నారు. ఉరవకొండ పట్టణంలో అర్హులైన పేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇచ్చి..పక్కా గృహలు నిర్మించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవాకు 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండానే వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టారన్నారు. ఆయన కృషి ఫలితంగానే జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు. ప్రతియేటా కృష్ణా జలాలు వస్తున్నా ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే హంద్రీ-నీవా ఆయకట్టు కింద ఉన్న మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ హంద్రీ-నీవా ఆయకట్టుకు నీరు అందించకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడటానికి తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారన్నారు. ఈ ధర్నాకు ప్రజలు, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సభలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని, ఉరవకొండలోనూ భారీఎత్తున ధర్నా జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతులకు హక్కుగా అందాల్సిన నీటిని సాధించడానికి వైఎస్ జగన్ ఉరవకొండలో ధర్నా తలపెట్టడం గొప్పవిషయమన్నారు. ధర్నా స్థలం పరిశీలన ఫిబ్రవరి 6న ఉరవకొండలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మహా ధర్నాకు అనువైన స్థలాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పరిశీలించారు. గుంతకల్లు డీఎస్పీ రవికుమార్, ఉరవకొండ సీఐ సూర్యనారాయణతో కలిసి క్లాక్‌టవర్, పాత బస్టాండ్, ఎస్కే ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం, గవిమఠం ప్రాంగణంలోని స్థలాలను చూశారు. మహాధర్నాకు వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. -
ఉరవకొండలో మహాధర్నా చేపడుతాం
అనంతపురం: హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మహాధర్నా చేపడుతామని ఆ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరిలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ఆర్ పూర్తిచేసిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షాలను శత్రువులుగా చూస్తున్నారని వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ఉరవకొండలో రానా సందడి
ఉరవకొండ : సురేష్ ప్రొడెక్షన్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను మంగళవారం ఉరవకొండ ఎస్కె ప్రభుత్వ క్రీడా మైదానంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రానా నటిస్తున్నారు. అనంతపురం జిల్లా రాజకీయ నేపథ్యంలో పలు సన్నివేషాలను చిత్రీకరించారు. చిత్రంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా జోగేంద్ర (రానా) ఎన్నికల ప్రచార సభను షూట్ చేశారు. ఇక... ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న కాజోల్కు సంబంధించిన సన్నివేశాలను మండల పరిధిలోని ఆమిద్యాల, రాకెట్ల, కొట్టాలపల్లిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన
పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేదు ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు : రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన సాగుతోందని, ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఉరవకొండ మండలం నింబగల్లులో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా మార్చుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో శాసన సభ్యులతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు, పింఛన్లు, సబ్సిడీ రుణాల మంజూరులో ప్రజాప్రతినిధులకు హక్కులేకుండా చేసి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ, అంగన్వాడీ కమిటీ, అసైన్ కమిటీలను నామమాత్రం చేసి విలువలేకుండా చేశారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా సమావేశాల్లో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేస్తుండటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలోనూ అధికార పార్టీ నాయకుల జోక్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇటీవల ఉరవకొండ ప్రభుత్వ ఆసత్రిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పెత్తనం ఎక్కువైపోయిందనీ, చివరికి తాగునీటి పనులను కూడా ఆపుతున్నా రని చెప్పారు. టీడీపీ నాయకులు అన్ని అధికారాలు అనుభవిస్తున్నా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. వాతావరణ కింద బీమా కూడ ఇవ్వలేదని, వర్షాభావంతో పప్పుశనిగ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇన్సూరెన్సు చేయించడంలో కూడా అధికారులు నిర్లక్షం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి టీడీపీ నాయకులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారపార్టీ నాయకులు, ప్రభుత్వపెద్దలు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. -
హంద్రీనీవా నీటి వినియోగంపై ఆంక్షలు
నీటిని పొలాలకు మళ్లించుకోరాదని హెచ్చరికలు పోలీసు బందోబస్తుతో పంట పొలాల్లో దాడులు ఉరవకొండ : హంద్రీనీవా ద్వారా నాలుగేళ్ల నుంచి కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నా ప్రతిపాదిత ఆయకట్టులో ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు. పొలాల పక్కనే నీరు పోతున్నా వాటిని మళ్లించుకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. హంద్రీనీవా మొదటి దశ కింద 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.అందులో అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలు ఉంది. మొదటి దశలో 30 నుంచి 36 ప్యాకేజీ వరకు ఉన్నాయి. అందులో నియోజకవర్గంలో 33 ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు ఉన్నాయి. హంద్రీనీవా నీటివాడకంపై అధికారుల కొరడా : ఉరవకొండ నియోజవర్గంలో ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుతడి పంటలైన మిర్చి, వరి,ప్రత్తి పంటలు సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మోటార్లు, పైపులు కొనుగోలు చేశారు. పంటలకు కనీసం రెండు తడులైనా నీరు అందించాలని హంద్రీనీవా నీటిని వాడుకుంటున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో అధికారులు ఉన్నఫలంగా మోటార్లతో నీటిని వాడుకుంటే చర్యలు తీసుకుంటామని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల పరిధిలోని కాలువ పొడువునా దాడులు చేయడానికి చర్యలు చేపట్టారు. వజ్రకరూరు మండలంలోని కడమలకుంట, రాగులపాడు, పీసీ ప్యాపిలి, ఉరవకొండ మండలంలోని లత్తవరం, చిన్నమూస్టురు, పెద్దమూస్టురు, ఇంద్రావతి గ్రామాల్లో ఇప్పటికే రైతులను అధికారులు మోటార్లు పెట్టుకోరావని హెచ్చరించారు. అధికారుల తీరుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హక్కుగా వాడుకోవాల్సిన హంద్రీనీవా నీటిపై ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు పరిస్థితి ఎంటీ : నాగరాజు, రాయంపల్లి కొద్దో గొప్పో హంద్రీనీవా నీటితో పంటలకు నీరు అందుతుంది. ఇప్పడు మోటార్లు పెట్టి వాడుకోరాదు అంటే పంటలు పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు. అధికారులు రైతుల గురించి ఆలోచించాలి. మా వాటా నీరు ఇవ్వండి : లక్ష్మినారాయణ, ఆయకట్టు రైతు హంద్రీనీవా నీరు మాకు రావాల్సిన హక్కు. ఆయకట్టుకు నీరు ఇచ్చి మాకు న్యాయం చేయాల్సింది పోయి, ఇప్పుడు మోటార్లు పెట్టరాదంటూ అధికారులు చెప్పడం సరైంది కాదు. ఒక తడి ఇస్తే పంట చేతికొస్తుంది : గోవిందు, రైతు ప్రస్తుతం ఒక్క తడి నీరు అందితే మిర్చి పంట చేతికందే అవకాశం ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, ఎంతో ఆశగా పంట చేతికొస్తుందని ఎదురుచూస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే : బ్రహ్మయ్య, తహసీల్దార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నిబంధన అమలు చేస్తున్నాం. రైతులు ఎవ్వరు హంద్రీనీవా నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసుకోరాదు. రైతులు అధికారులకు సహకరించాలి. -
ఏటీఎం అద్దాలు ధ్వంసం
ఉరవకొండ: నెల రోజుల నుంచి ఉరవకొండ పట్టణంలోని ఒక్క ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని కొందరు స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం అద్దాలను ధ్వంసం చేశారు. -
అధ్యాపకుల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తా..
ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అనంతపురం రూరల్ : కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను అసెంబ్లీలో వినిపించి, పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనకు మంగళవారం ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు విస్మరించారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మెతో ఇంటర్ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడినా ప్రభుత్వం పరిష్కరించడానికి ఏమాత్రమూ చొరవ చూపడం లేదని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీనీ టీడీపీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, అనిల్‌కుమార్ గౌడ్‌తోపాటు కాంట్రాక్టు అధ్యాపకులు యర్రప్ప, హనుమంతరెడ్డి, సుబ్రమణ్యం, అక్బర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
చిరు వ్యాపారి ఆత్మహత్య
ఉరవకొండ : పట్టణంలోని పార్కు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నివాసముంటున్న కార్తీక్ (26) అనే చిరువ్యాపారి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ మగ్బూల్ తెలిపిన కథనం మేరకు.. కార్తీక్‌కు కళ్యాణదుర్గానికి చెందిన వాణితో మూడు నెలల క్రితం వివాహమైంది. మిక్చర్, చకోడీల వ్యాపారం చేసుకునే కార్తీక్‌కు వ్యాపార అభివృద్ధి కోసం అప్పు దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం ఇంట్లోనే పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఫ్రిజ్ పేలి రూ.లక్షల నష్టం
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన జి.గాదిలింగప్ప అనే రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిజ్ పేలింది. ప్రమాదంలో రూ.9 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిల్లింది. ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ పేలింది. దీంతో పక్కనే ఉన్న బీరువాలకు మంటలు వ్యాపించి రూ.2 లక్షల నగదు, మరోలక్ష విలువ గల పట్టుచీరలు, 10 తులాల బంగారం కాలిపోయింది. పొలాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతాపుస్తకాలు, స్థలాలకు సంబంధించిన దస్త్రాలు, నిత్యావసర సరుకులు కూడా కాలిపోయినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే ఇంటిపైకప్పు కూడా దెబ్బతినింది. గుంతకల్లు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా అప్పటికే పూర్తి నష్టం జరిగిపోయింది. స్థానిక ఉపసర్పంచు గురు, ఆర్ఐ సావిత్రి, వీఆర్వో మారెన్న తదితరులు అక్కడకు చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఉరవకొండలో కొనసాగుతున్న బంద్
ఉరవకొండ: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండలో బంద్ కొనసాగతుతోంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
అనంతపురం : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ నిరసన చేపట్టారు. ఆయన సుమారు అయిదు గంటలు పాటు నిరసన చేసినా అధికారులు పట్టించుకోలేదు. దాంతో విశ్వేశ్వర్ రెడ్డి ఉరవకొండలో రాస్తారోకోకు దిగటంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే అరెస్ట్‌ను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
ఉరవకొండలో చిరుత సంచారం
-
ఉరవకొండ సమస్యలపై నేడు నిరవధిక మహాధర్నా
∙తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి∙రోడ్డు పైనే వంటా వార్పు ఉరవకొండ: ఉరవకొండ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సవుస్యల పరి ష్కారం కోసం స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉద్యమానికి సిద్ధమయ్యారు. శుక్రవారం వేలాది వుం ది ప్రజలతో కలిసి ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై నిరవధిక వుహాధర్నా చేపడుతున్నారు. ఈయన ఈ నెల ఎనిమిది నుంచి ‘గడప గడపకు వైఎస్ఆర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉరవకొండలో పలు ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై పోరుబాట కుసిద్ధమయ్యారు. మహాధర్నాలో ప్రజలుపెద్దసంఖ్య లో పాల్గొని.. ప్రభుత్వం కళ్లు తెరి పించే లా చేద్దావుని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రధాన డివూండ్లు ఇవే.. పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం 2008 సంవత్సరంలో 83 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అయితే ఇప్పటికీ అర్హులకు స్థలాలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించాలి.∙చేనేత అప్పులు రద్దు చేయాలి. కార్మికులకు సబ్సిడీతో రేషం అందించాలి.∙పట్టణ ప్రజలకు పరిశుభ్రమైనlనీటిని సరఫరా చేయాలి. కొత్త ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించడంతో పాటు పాత పైప్‌లైన్‌ను వూర్చాలి.∙గతంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు తొలగించారు. దీనివల్ల బహిర్భూమికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వ్యక్తిగత వురుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలి. ∙అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలి.∙ఉరవకొండలో అభివృద్ధి పనులకు తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలి.∙బాలికల జూనియర్ కాలేజీకి పక్కా భవనాలు నిర్మించాలి.∙వంద పడకల ఆస్పత్రి పనులు ప్రారంభించాలి. -
సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని సమావేశం
ఉరవకొండ (అనంతపురం) : ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షి ప్రసారాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాపై ప్రభుత్వం దమనకాండను సమావేశం ముక్తకంఠంతో ఖండింది. వెంటనే సాక్షి టీవీ ప్రసారాలు పునురుద్ధరించాలని.. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, ఎమ్మార్పీఎస్, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలతోపాటు విలేకరులు పాల్గొన్నారు. -
తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ (అనంతపురం) : పెళ్లి పేరుతో ఓ వ్యక్తి వేధింపులకు దిగగా.. తట్టుకోలేక తల్లి, కుమార్తెలు ఆత్మహత్యాయత్నం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన శివమ్మ, ఆమె కుమార్తె పవిత్ర (25) సోమవారం ఉదయం యాంటీబయోటిక్ మాత్రలు, నెయిల్ పాలిష్ మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మగదిక్కులేని శివమ్మ కుటుంబానికి కరుణాకరన్ (38) అనే వ్యక్తి అండగా ఉంటూ... తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె కుమార్తె పవిత్రను వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక వారు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. -
సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య
ఉరవకొండ : అనంతపురం జిల్లా ఉరవకొండ సబ్‌జైలులో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పటాన్ షమీర్ ఖాన్(35) అనే రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం సబ్ జైలులో స్నానాల గదికి వెళ్లిన షమీర్ గంజి వార్చేందుకు ఉపయోగించే తాడుతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నానాల గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి వెళ్లి పరిశీలించగా... ఉరేసుకున్న విషయం తెలిసింది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతని భార్య షాను ప్రస్తుతం జిల్లాలోని సోమదేవపల్లి మండలం పత్తికుంటపల్లిలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఘటనపై జిల్లా జైళ్ల శాఖ అధికారి సుదర్శన్‌రావు విచారణ జరిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను జైళ్ల శాఖ డీఐజీకి పంపుతామని తెలిపారు. -
ఎన్‌హెచ్ 44పై భారీగా ట్రాఫిక్ జామ్
-
ఎన్‌హెచ్ 44పై ట్రాఫిక్ జామ్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం బ్రిడ్జిపై ఓ లారీ నిలిచిపోవడంతో ఎన్‌హెచ్ 44 మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బళ్లారి నుంచి అనంతపురం వైపు వెళుతున్న ఓ లారీ మంగళవారం ఉదయం బ్రిడ్జిపైకి వచ్చిన సమయంలో ఎదురుగా ఆటో రావడంతో తప్పించే క్రమంలో దిమ్మెను ఢీకొని పక్కకు ఒరిగింది. ఈ బ్రిడ్జి పై ఒక వాహనం మాత్రమే పట్టేంత స్థలం మాత్రమే ఉంటుంది. దీంతో ఉదయం 6.30 గంటల నుంచి వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆ లారీని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఉరవకొండలో భారీ వర్షం
ఉరవకొండ(అనంతపురం): అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా మంగళవారం కూడా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని రవాణా మార్గాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే మండల కేంద్రంలోని 25 ఇళ్లు కూలిపోయాయి. కాగా, మూలగిరిపల్లెలో వర్షానికి 250 గొర్రె పిల్లలు మృతి చెందాయి. -
సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బంద్
అనంతపురం: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో శుక్రవారం సీపీఎం, సీపీఐ లు బంద్ నిర్వహించాయి. ఈ మేరకు పట్టణంలో రాకపోకలన్నీ నిలిపి పోయాయి. ఉరవకొండలో కోదండరామిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. నేడు అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం పూర్తి చేశారు. కోదండ రామిరెడ్డి పేరిట ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శివశంకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బ్యాంకు అధికారులపై రైతుల ఆగ్రహం!
-
'చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో చంద్రబాబు విఫలమయ్యారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయటం లేదని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. ఉరవకొండను మున్సిపాలిటీ చేయకపోవడం వల్లే అభివృద్ధికి దూరంగా ఉందని వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
-
బరితెగించిన పయ్యావుల: విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బోయ సూరయ్య హత్య కేసు నుంచి తన సోదరుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. కేసు ఉపసంహరించుకోనందుకు సూరయ్య కుటుంబీకులపై అక్రమ కేసు బనాచించారని అన్నారు. సూరయ్య హత్యతో పయ్యావుల శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిందని చెప్పారు. పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బోయ సూరయ్య... ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టు 24న దారుణ హత్యకు గురయ్యారు. నిందితుల్లో ఒకరైన పయ్యావుల శీనప్ప తన పేరును చార్జిషీటు నుంచి తొలగింపజేసేందుకు శతవిధాలా ప్రయత్ని విఫలమయ్యాడు. సూరయ్య కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో కక్ష సాధింపునకు దిగాడు. -
చిట్టీల పేరుతో.. కుచ్చుటోపీ!!
-
విజయవాడలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ
-
బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్, ఫైనాన్స్ సంస్థలు
చిట్లు, ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డులేకుండా పోతోంది. విజయవాడలోను, అనంతపురం జిల్లా ఉరవకొండలోను తాజాగా ఈ తరహా మోసాలు జరిగాయి. విజయవాడలో పది వేలకు లక్ష రూపాయలు, 5 వేలకు 50 వేల రూపాయలు చొప్పున ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించిన ఉమమహేశ్వరి చిట్‌ఫండ్స్ సంస్థ అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేసింది. భగత్‌సింగ్ నగర్ లాడర్ ఫంక్షన్ హాల్లో ఈ డిపాజిట్లు సేకరించారు. ప్రకటన చూసి మహిళలు వేల సంఖ్యలో డిపాజిట్లు సేకరించారు. తీరా బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు. బాబా చిట్‌ఫండ్స్ అనే సంస్థ కోటి రూపాయలకు పైగా టోకరా వేసి బోర్డు తిప్పేసింది. నిర్వాహకులు పరారైపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. -
'అనంత రైతులకు సాగు నీరు ఇవ్వండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలోని తుంగభద్ర హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కింద ఉన్న ఆయకట్టకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురంలో మాట్లాడుతూ.. హెచ్ఎల్సీ, జీబీసీలో భారీగా నీరు ఉన్న... సాగు నీరు విడుదల చేయకపోవడంపై ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు కాలువల కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలలో సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతులు ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. -
'తాగునీటి సమస్యను పరిష్కరించండి'
అనంతపురం : అనంతపురం ఉరవకొండలో తాగునీటి సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాగా మండల కేంద్రంలోని పూరి గుడిసెల కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిన్న ఎంపీడీవో కార్యాలయం ఎదుట కదిరి-హిందుపురం రహదారిపై రాస్తారోకో చేశారు. -
'వైఎస్ జగన్‌పై కక్ష సాధిస్తే సహించేది లేదు'
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం అనంతపురంలో విశ్వేశ్వరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పార్టీలోని సంస్థాగత లోపాలుంటే వాటిని సవరించుకుంటామన్నారు. మే 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉరవకొండ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వై. విశ్వేశ్వరరెడ్డి... ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవుపై గెలుపొందిన విషయం విదితమే. -
విశ్వేశ్వరరెడ్డి విజయకేతనం
ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆయనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి 2,275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ మినహా తక్కిన 16 రౌండ్లలో విశ్వేశ్వరరెడ్డి స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. తన ఓటమి ఖాయమని తెలుసుకున్న పయ్యావుల కేశవ్ 16వ రౌండ్ లెక్కింపు కొనసాగుతుండగానే కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో మొత్తం 1,93,398 ఓట్లు ఉండగా 1,65,251 పోలయ్యాయి. ఇందులో విశ్వేశ్వరరెడ్డికి 81,042, కేశవ్‌కు 78,767 ఓట్లు లభించాయి. చివర్లో మళ్లీ కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన పయ్యావుల తన ఓటమిని జీర్ణించుకోలేక అనుచరులతో కలిసి నానా రభస సృష్టించారు. రీకౌంటింగ్ జరిపించాలంటూ జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో కలిసి హంగామా చేశారు. వీరి వాదన న్యాయబద్ధంగా లేకపోవడంతో అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా కౌంటింగ్ పూర్తి చేశారు. విజయం సాధించిన విశ్వేశ్వరరెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశిదేవి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విశ్వేశ్వరరెడ్డిని భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. -
కదిరిలో చాంద్‌బాషా, ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. కదిరిలో చాంద్ బాషా, ఉరవకొండ నుంచి విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపును విజయం సాధించారు. ఇక గెలుపొందిన టీడీపీ అభ్యర్థుల వివరాలు: *అనంతపురం అర్బన్- వి.ప్రభాకర్ చౌదరి *తాడిపత్రి-జేసీ ప్రభాకర్ రెడ్డి *గుంతకల్లు-జితేందర్ గౌడ్ *కళ్యాణదుర్గం-ఉన్నం హనుమంతరాయ చౌదరి *పెనుకొండ-వీకే పార్థసారధి *హిందూపురం-బాలకృష్ణ *మడకశిర-ఈరన్న *పుట్టపర్తి-పల్లె రఘునాథ్ రెడ్డి *ధర్మవరం-వరదాపురం సూరి *రాప్తాడు-పరిటాల సునీత *అనంతపురం ఎంపీగా- జేసీ దివాకర్ రెడ్డి *హిందూపురం ఎంపీగా- నిమ్మల కిష్టప్ప -
పయ్యావుల గోడౌన్లపై విజిలెన్స్ దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా ఉరవకొండలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చెందిన గోడౌన్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 కోట్ల విలువైన శనగ, ధనియాలును సీజ్ చేశారు. నిల్వలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో విజిలెన్స్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
'పయ్యావుల కేశవ్ ను అరెస్ట్ చేయండి'
అనంతపురం: దళితులపై దాడి చేసిన పయ్యావులను అరెస్ట్ చేయాలని దళిత సంఘం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి దళిత సంఘం నేతలు పయ్యావులపై ఫిర్యాదు చేశారు. ఉరవకొండ ప్రాంతంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వారన్నారు. పయ్యావుల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్క్షప్తి చేశారు. అంతేకాకుండా నాగన్న కుటుంబంపై దాడి చేసిన కేసునమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో పయ్యావులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని దళిత సంఘం నేతలు ఆరోపించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసిన దళిత సంఘం నేతల్లో శ్రీనివాస్, పెన్నోబులేసు ఉన్నారు. మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ ప్రశ్నించిన పాపానికి గ్రామస్థులపై మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. -
జగన్‌తోనే సీమాంధ్ర అభివృది
ఉరవకొండ, సీమాంధ్ర ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని, ఈ ప్రాంతాన్ని ఆ మార్గంలో నడిపించగల సమర్థత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని వైఎస్సార్ సీపీ ఉరవకొండ నియోజకవర్గ సవున్వయుకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోవువారం పట్టణంలోని 7,8 వార్డుల్లో గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రవుం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయన వూట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం యుూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించగా, టీడీపీ పూర్తి సహకారం అందించిందన్నారు. రాబోవు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జీడిపల్లి రిజర్వాయుర్ నుంచి 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా వజ్రకరూర్ వుండలంలో 6,754 ఎకరాలకు, విడపనకల్లు వుండలంలో 12,146 ఎకరాలకు, ఉరవకొండలో 18, 410 ఎకరాలకు సాగునీటిని అంది స్తావుని హామీ ఇచ్చారు. ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్ సీపీ కృషితో ఇంటి పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇళ్లు నిర్మించి ఇస్తావుని తెలిపారు. కార్యక్రవుంలో జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, ఎస్సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు తిప్పయ్యు, పట్టణ నాయుకులు చెంగలవుహేష్, తులసీదాస్, పట్టణ కన్వీనర్ బసవరాజు, మైనార్టీ నాయుకులు శర్మాస్ఖాన్లు పాల్గొన్నారు. -
తెలుగుదేశం.. గడ్డుకాలం
ఉరవకొండ ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీకి జనాదరణ పెరుగుతోంది. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల పట్ల కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలను విస్మరించి.. సమైక్యాంధ్ర పరిరక్షణలో విఫలమైన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పయ్యావుల కేశవ్‌ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుల సవుస్యలను గాలికి వదిలేయడంతో పట్టణంలోనే 300 పైగా వుగ్గాలు వుూత పడ్డారుు. పట్టణంలోని 1, 2, 3, 4 వార్డుల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఆయా వార్డుల్లోని ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకులంగా లేఖ ఇచ్చి, రాష్ర్ట విభజనకు పూర్తి సహకారం అందించినా దీన్ని అడ్డుకోవడంలో సీవూంధ్ర ప్రజాప్రతినిధులు, వుుఖ్యంగా ఎమ్మెల్యే కేశవ్ నోరు మెదపక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ తన ఇమేజ్ను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఇందు కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకునేందుకు డబ్బు ఎర చూపుతోంది. డబ్బుకు మాట వినని వారిని నేతలు బెదిరించి తమవైపు తిప్పుకుంటున్నారు. -
జేసి బస్సును అడ్డుకున్న సమైక్యవాదులు
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనని ప్రైవేటు బస్సు యజమానులపై ఉద్యమకారులు విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ మంత్రి జేసి దివాకర్‌రెడ్డి బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాకెట్ల, బూదగవి గ్రామస్తుల రిలేదీక్షలు చేపట్టారు. పద్మశాలిసంఘం ఆధ్వర్యంలో రాయదుర్గంలో ర్యాలీ, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమంలో చురుకైనా పాత్ర పోషించిన డాక్టర్ సుమంత్ గుండెపోటుతో మృతి చెందారు. గుంతకల్లులో టీవీ చూస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.