హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు | doolam competetions in uravakonda | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు

Published Thu, Mar 9 2017 12:03 AM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు - Sakshi

హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు

ఉరవకొండ : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉరవకొండ గవిమఠ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి చిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 25 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్ర స్వామి పోటీలను ప్రారంభించారు. కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. రెండోస్థానంలో తేరనిపల్లి ఎడ్లు, మూడోస్థానంలో కాశేపల్లికి చెందిన ఎడ్లు నిలిచాయి. నాల్గోస్థానంలో కర్నూలుకు చెందిన ఎడ్లు, ఐదో స్థానంలో తాడిపత్రికి చెందిన ఎడ్లు బహుమతులు గెలిచాయి. విజేతలకు మోహన్, నర్రాకేశన్న, శివన్న, గుత్తా నరసింహులు, మాజీ సర్పంచ్‌ బోదపాటి గోవిందు, పవన్‌ రెస్టారెంట్‌ రాజు, మదమంచి ఈశ్వరయ్య, మాసినేని రామ్మోహన్‌ బహుమతులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement