gavimatam
-
స్కూల్ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఉరవకొండ : ప్రైవేట్ స్కూల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉరవకొండ గవిమఠం ప్రాంగణంలోని ‘ది ఎడిసన్’ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు గురువారం ఉదయం 40 మంది విద్యార్థులను తీసుకుని పట్టణంలోని పోలీస్స్టేషన్ వైపు నుంచి వెళ్తుండగా వెనుక టైరు రోడ్డు పక్కనున్న చిన్న గోతిలోకి దిగింది. వెంటనే స్థానికులు పిల్లలందరినీ బస్సులోంచి దించేశారు. బస్సును క్రేన్ సాయంతో యథాస్థితికి తెచ్చారు. గతంలోనూ ఎడిసన్ స్కూల్కు చెందిన ఓ బస్సుకు లైసెన్స్ లేకపోవడంతో ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
ఉరవకొండ : స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉరవకొండ గవిమఠ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి చిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 25 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్ర స్వామి పోటీలను ప్రారంభించారు. కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. రెండోస్థానంలో తేరనిపల్లి ఎడ్లు, మూడోస్థానంలో కాశేపల్లికి చెందిన ఎడ్లు నిలిచాయి. నాల్గోస్థానంలో కర్నూలుకు చెందిన ఎడ్లు, ఐదో స్థానంలో తాడిపత్రికి చెందిన ఎడ్లు బహుమతులు గెలిచాయి. విజేతలకు మోహన్, నర్రాకేశన్న, శివన్న, గుత్తా నరసింహులు, మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందు, పవన్ రెస్టారెంట్ రాజు, మదమంచి ఈశ్వరయ్య, మాసినేని రామ్మోహన్ బహుమతులు అందించారు. -
గవిమఠం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉరవకొండ : ఉరవకొండ గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వరస్వామి వారి బ్రహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకుమార్చన నిర్వహించారు. ఆదోని చౌకిమఠం పీఠాధిపతి కళ్యాణస్వామి, మఠం సహాయ కమిషనర్ ఆనంద్ అధ్వర్యంలో గంగాజలంతో ఊరేగింపుగా కంకణ మండపానికి చేరుకున్నారు. అనంతరం పూజలు చేశారు. మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపీ పాల్గొన్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి నాగాభరణ ఉత్సవం జరగనుంది.