
తెలుగుదేశం.. గడ్డుకాలం
ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి జనాదరణ పెరుగుతోంది. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల పట్ల కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉరవకొండ
ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి జనాదరణ పెరుగుతోంది. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల పట్ల కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రజా సమస్యలను విస్మరించి.. సమైక్యాంధ్ర పరిరక్షణలో విఫలమైన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. పయ్యావుల కేశవ్‌ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికుల సవుస్యలను గాలికి వదిలేయడంతో పట్టణంలోనే 300 పైగా వుగ్గాలు వుూత పడ్డారుు.
పట్టణంలోని 1, 2, 3, 4 వార్డుల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఆయా వార్డుల్లోని ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకులంగా లేఖ ఇచ్చి, రాష్ర్ట విభజనకు పూర్తి సహకారం అందించినా దీన్ని అడ్డుకోవడంలో సీవూంధ్ర ప్రజాప్రతినిధులు, వుుఖ్యంగా ఎమ్మెల్యే కేశవ్ నోరు మెదపక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భగ్గుమంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో టీడీపీ తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఇందు కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకునేందుకు డబ్బు ఎర చూపుతోంది. డబ్బుకు మాట వినని వారిని నేతలు బెదిరించి తమవైపు తిప్పుకుంటున్నారు.