పయ్యావుల కేశవ్ కు చేదు అనుభవం
అనంతపురం:జిల్లాలోని ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇక్కడకు విచ్చేసిన పయ్యావులను స్థానిక సమస్యలపై మహిళలు నిలదీశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్ల సమయంలో ప్రజల ముందుకు రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఒక మహిళ పయ్యావులను ఎదురుగా వచ్చి నిలదీయడంతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురైయ్యాయి.
రెండేళ్ల కిందట తన కుమారుని మృతికి ఇప్పిస్తానన్న నష్ట పరిహారం ఇప్పటి వరకూ ఎందుకు ఇప్పించలేదని పద్మావతి అనే మహిళ ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పయ్యావుల సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.