womens protest
-
మందు పునాదులను పెకలించిన మహిళలు
-
‘సందేశ్‌ఖాలీ నిరసన: ఒక్క మహిళా ఫిర్యాదు చేయలేదు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్లో దుమారం రేపుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్‌ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్‌ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు -
వైన్ షాప్ తొలగించాలని మహిళల ఆందోళన
-
మహిళలపై హింసను సహించం
నందిగ్రామ్: బీజేపీ కార్యకర్త అని చెబుతున్న వ్యక్తి తల్లి మృతి ఘటన పశ్చిమ బెంగాల్లో సంచలనాత్మకంగా మారింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహిళలపై హింసను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని పేర్కొన్నారు. వృద్ధురాలి మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఆమె సోమవారం నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గురించి మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హథ్రాస్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బెంగాల్లో తన తల్లులు, సోదరీమణులపై హింసను సహించే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే ముగ్గురు చనిపోయారని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం శాంతిభద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వెల్లడించారు. నందిగ్రామ్‌లో దీదీ భారీ రోడ్ షో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానం నుంచి మంచి మెజార్టీలో విజయం సాధించాలని మమత సంకల్పించారు. ఇక్కడ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. రేయపారా ఖుదీరామ్ మోరే నుంచి ఠాకూర్‌చౌక్ వరకూ 8 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో దీదీ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. నందిగ్రామ్‌లో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటిదాకా తాను ఇక్కడే ఉంటానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. -
ఐ లవ్ జీబీవీ!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వీడన్ ఫ్యాషన్ దుస్తుల కంపెనీ ‘హెచ్ అండ్ ఎమ్’ ఊహించని చిక్కుల్లో పడింది. గత ఏడాది ఈ సంస్థ తయారు చేసిన దుస్తుల నిల్వలు పేరుకుపోయి వాటిని ఎలా అమ్ముకోవాలా అని దిక్కులు చూసింది. తర్వాత మార్కెట్లో ఆఫర్లు పెట్టి గండాన్ని గట్టెక్కింది. ఈ ఏడాది మరో కొత్త కష్టం వచ్చి పడింది. దానికి కష్టం అనే చిన్న పదం సరిపోదు. పేద్ద వివాదంలోనే చిక్కుకుంది హెచ్ అండ్ ఎమ్. మహిళలు షాపింగ్ చేసేటప్పుడు హెచ్ అండ్ ఎమ్ క్యారీ బ్యాగ్‌ను కూడా గర్వంగా పట్టుకునే వాళ్లు. అయితే ఆ కంపెనీ ఇటీవల విడుదల చేసిన దుస్తుల మీద ‘ఐ లవ్ జీబీవీ’ అని ముద్రించి ఉంది. సరిగ్గా ఈ మాటే ఇప్పుడు దుమారాన్ని రేపింది. ఆడవాళ్లు తమ చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్‌ను అమాంతం విసిరి డస్ట్ బిన్లో వేసేట్టు చేసింది. జీవీబీ అనే అక్షరాలను జెండర్ బేస్డ్ వయొలెన్స్ అనే అర్థంలో వాడతారు. అంటే ‘ఐ లవ్ జెండర్ బేస్డ్ వయొలెన్స్’ అని అర్థం వస్తోంది. దీని మీద మహిళల హక్కుల కార్యకర్తలు విరుచుకు పడుతున్నారు. దీనికి హెచ్ అండ్ ఎమ్ ప్రతినిధి చెప్పిన సమాధానం కూడా వినండి. ‘‘ఆ దుస్తులను డిజైన్ చేసింది జీయెమ్బట్టిసావల్లి అనే ఇటలీ డిజైనర్. అతడి డిజైన్లను అతడి పేరులోని పొడి అక్షరాలతోనే ప్రమోట్ చేశాం. అంతే తప్ప వయొలెన్స్ అనేది మా ఆలోచనలోనే లేదు. మహిళల పట్ల వయొలెన్స్‌ని మాత్రమే కాదు, ఎటువంటి వయొలెన్స్నైనా మేము ఖండిస్తాం. సమానత్వపు సమాజం కోసం మా వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం’’ అని సుదీర్ఘంగా సంజాయిషీ ఇచ్చుకున్నారు హేకెన్ ఆండర్సన్.‘ఐ లవ్ జీబీవీ’ అనే ఈ ట్యాగ్ లైన్‌ని ప్రస్తావిస్తూ ప్రపంచ హ్యూమన్ రైట్స్ సలహాదారుల సంస్థకు చెందిన మహిళల హక్కుల సమన్వయకర్త హెదర్ బార్.. ‘‘తెలియక చేసినా తప్పు తప్పే’’ అన్నారు. ‘‘ఇందులో నిగూఢమైన అర్థం ఏమీ లేదు. సామాన్యులకు అంత తెలియని పదమేమీ కాదు. జెండర్ బేస్డ్ వయొలెన్స్ అనాల్సిన ప్రతి చోటా అంత పెద్ద వాక్యాన్ని ఉపయోగించకుండా కుదించి జీబీవీ అనే వ్యవహరిస్తారు. ఇంత మామూలు పదం తెలియకపోవడం ఏమిటి’’ అని నిలదీస్తున్నారు. -
బతుకమ్మ చీరలు మాకొద్దు
సాక్షి, మునిపల్లి(అందోల్): బతుకమ్మ చీరలు మా కొద్దు అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌర స్తాలో కాలనీవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ డీలర్‌ను బుదేరా చౌరస్తాకు సపరేట్గా ఏర్పాటు చేయాలని నాలుగు నెలలుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అధికారుల తీరుపై మండిపడ్డారు. రేషన్ డీలర్ షాపును ఏర్పాటు చేసేంతవరకు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలు, వివిధ రకాల మొక్కలను కూడా తీసుకోబోమని నినాదాలు చేశారు. దీంతో తహసీల్దార్ సువర్ణ రాజుకు అక్కడికి చేరుకుని నిరసన కారులతో మాట్లాడి రేషన్ డీలర్‌ను బుదేరా చౌరస్తాకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించారు. అనంతరం మహిళలు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. -
28 ఏళ్ల తరువాత.. తొలిసారి
బెర్న్: మనదేశంలోనే కాదు దాదాపు ప్రపంచమంతా మహిళలపై అనేక రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమెరికా, నార్వే, స్కాండినేవియన్ వంటి దేశాల్లో మహిళలకు ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని దేశాలు మాత్రం కల్పించలేకపోతున్నాయి. మహిళల హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఏదోఒక ఉద్యమం సాగుతునే ఉంటుంది. తాజాగా తామకు సమాన హక్కులు కల్పించాలని కోరుతూ.. స్విట్జర్లాంట్‌లో మహిళలు ఆందోళన బాట పడ్డారు. గత రెండు రోజుల నుంచి లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పనికి సామానవేతనం కల్పించాలని, పురుషులతో సమానంగా హక్కుల్లో ప్రాధాన్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా 28 ఏళ్ల తరువాత ఇంత పెద్దఎత్తున స్విస్‌లో మహిళలు ఉద్యమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మహిళలకు ఓటు హక్కు కల్పించాలని మొదటి సారి వారు ఆందోళన బాటి పట్టారు. దీనికి ప్రతిఫలితంగా 1971లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం వారికి తొలిసారి ఓటు హక్కును కల్పించింది. అప్పటి వరకు ఆ దేశంలో మహిళకు ఓటు హక్కులేకపోవడం గమన్హారం. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని 1991లో మరోసారి మహిళాలోకం ఆందోళన బాట పట్టింది. వారి డిమాండ్లకు తలొగ్గిన స్విస్ ప్రభుత్వం తొలిసారి వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమనిచింది. వారి ఉద్యమ ఫలితమే నేడు ఆదేశ మంత్రిమండలిలో ఎనిమిది మంది మహిళా మంత్రులకు అవకాశం కల్పించింది. కాగా తాజాగా వేతంలో తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. పురుషులతో పోల్చుకుంటే 20శాతం తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని, మరికొన్ని అంశాల్లో తమకు పూర్తి స్వేచ్చను కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనికి ఆదేశ పలువురు మహిళా ప్రముఖులు పూర్తి మద్దతును ప్రకటించారు. 1991 ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకుంటామని అప్పటి ఉద్యమంలో పాల్గొన్నవారు చెపుతున్నారు. -
మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల వర్షం
-
మహిళామంత్రి సమక్షంలో ఆడపడుచులపై దౌర్జన్యం
ఆత్మకూరు: రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో మహిళలపై దౌర్జన్యం జరిగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు మంత్రి సునీత కాన్వాయ్‌పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయకుండా మోసం చేసి, తిరిగి ఎన్నికల సమయంలో మోసపు మాటలు చెప్పడం, ప్రశ్నించిన మహిళలను పోలీసులతో అరెస్టు చేయించి విచక్షణారహితంగా వ్యవహరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తిలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి పరిటాల సునీత వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే గ్రామంలోకి మంత్రిని అడుగుపెట్టనిస్తామని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో 400 మంది పోలీసుల భద్రతతో మంత్రి వెళ్లారు. మంత్రి వస్తున్న సమయంలో వందలాది మంది మహిళలు నల్లజెండాలు చేతపట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. మహిళలపై పోలీసుల జులుం మహిళలను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. రుణమాఫీ చేస్తామని చేయకుండా కేవలం రూ.10వేలు పెట్టుబడి నిధి కింద ఇచ్చారని, ఇది బ్యాంకర్లు రుణం కింద జమ చేసుకున్నారని.. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు ఇస్తాం, స్మార్ట్ ఫోన్లిస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని.. మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించడంతో కొందరికి గాయాలయ్యాయి. రోడ్డుపై కిందపడిపోతే ఈడ్చుకుంటూ వెళ్లి వాహనంలోకి ఎక్కించారు. సమావేశానికి మహిళలను తెచ్చుకున్న మంత్రి అనంతరం తన కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలను సొంతంగా ఏర్పాటు చేసిన 60 వాహనాల్లో ఇతర గ్రామాలనుంచి రప్పించారు. మంత్రి కారుపై గ్రామస్తులు పెద్ద ఎత్తున చెప్పులు విసిరారు. అదే సమయంలో మంత్రి తనయుడు పరిటాల శ్రీరాం తన అనుచరులతో గ్రామానికి వచ్చారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారితో సమావేశం తూతూమంత్రంగా నిర్వహించి వెనుదిరిగారు. తాళిబొట్టు తెంపేశారు డ్వాక్రా రుణం మాఫీ కాలేదని మంత్రిని ప్రశ్నించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకోవడంతో దాదాపు మూడు గంటల పాటు రోడ్డు పైనే కూర్చున్నాం. మంత్రి వస్తున్నారని పోలీసులు రోడ్డుపై ఉన్న మమ్మల్ని ఈడ్చిపడేశారు. ఆ సమయంలో నా తాళిబొట్టు తెగిపోయింది. ఇంత అరాచకం చేస్తారా? ఒక మహిళగా మంత్రి సునీత వ్యవహరించిన తీరు ఏం బాగోలేదు. మా ఉసురు తప్పక తగులుతుంది. – మమత, తోపుదుర్తి -
ఒంగోలులో తాగునీటి కోసం రోడడ్డెక్కిన మహిళలు
-
కర్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో ఖాళీ బిందెలతో నిరసన
-
దాహార్తి తీర్చాలని మహిళల ఆందోళన
విస్సన్నపేట(తిరువూరు): మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని రాజీవ్‌కాలనీవాసులు మంగళవారం సత్తుపల్లి– విస్సన్నపేట ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీబిందెలతో రాస్తారోకో చేశారు. తమ కాలనీకి గత నెల రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒహెచ్‌ఆర్ ద్వారా పంచాయతీ ఆధ్వర్యంలో నీరు సరఫరా కావటం లేదని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే వేసవి ఎండలు అధికంగా ఉన్నాయని, తాగేందుకు నీరు దొరక్క దాహార్తితో అలమటిస్తున్నామని ఆవేదన చెందారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. పంచాయతీ ఈవో సరోజిని దృష్టికి సమస్య తీసుకెళ్లినా తగిన రీతిలో స్పందించలేదని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని చెప్పారు. మహిళలకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఎస్ఐ బి.తులసీధర్ రాస్తారోకో ప్రదేశానికి చేరుకొని మహిళలకు నచ్చజెప్పి విరమింపజేశారు. అధికారులను పిలిపించి మాట్లాడారు. ఈవోపిఆర్డీ శంకరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చక్రధర్ స్థానికులతో సంప్రదింపులు చేశారు. త్రీపేజ్ కరెంట్‌తో మోటారు నడుస్తున్నందున తగిన విధంగా విద్యుతు సరఫరా లేకపోవటంతో ఓహెచ్‌ఆర్ నిండటం లేదని వారు చెప్పారు. రాజీవ్‌కాలనీలో ఉన్న చేతి పంపునకు సింగిల్‌పేజ్ మోటారు అమర్చి తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. -
బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం
►బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి ►చీరలు కాల్చి బతుకమ్మ ఆడిన మహిళలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామన్న ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం...తీరా డామేజ్ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు. కేవలం వంద రూపాయల విలువచేసే సాధారణ చీరలు పంపిణీ చేసిందని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో మహిళలు.. చీరలు కాల్చేసి బతుకమ్మ ఆడారు. జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఆందోళనకు దిగారు. 50రూపాయలు విలువ కూడా చేయని చీరలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవ పరుస్తున్న అని ఎద్దేవా చేశారు. ఆ చీరలు బతుకమ్మకు కట్టుకోమని మహిళలు వాటిని అక్కడే పడేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 22, 23వ వార్డులో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అయితే వాటిని అందుతున్న మహిళలు చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప్పగా వేసి నిప్పు పెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ్మ ఆడారు. పోచంపల్లి చేనేత చీరెలు పంపిణీ చేస్తానని కేవలం 50 రూపాయలు విలువచేసే పాలిస్టర్ చీరెలు పంపుతారా అని కోపోద్రుక్తులయ్యారు. జగిత్యాల జిల్లా జిల్లా మండలం చల్గల్, లింగంపేటలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల ధర్నాకు దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి మహిళలు తమ నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోనూ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వాలీబాల్ కోర్టులోని నెట్‌కు చీరలను కట్టి తమ అసంతృప్తిని వెల్లడించారు. పంట చేళ్లల్లో పక్షుల కోసం బెదురుగా కట్టే చీరల కంటే హీనంగా బతుకమ్మ చీరలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలో భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్ కాలనీవాసులు బతకమ్మ చీరలను కుప్పగా పోసి నిప్పంటించారు. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలను ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మళ్లీ మంచి చీరల్ని పంపిణీ చేయాలని కోరారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వ ధనాన్ని నాశనం చేస్తున్నారని, డబ్బులిస్తే తామే మంచి చీరల్ని కొనుక్కుంటామని మహిళలు తెలిపారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
దాహం కేక!
► తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు ► బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన ► రెండు గంటలపాటు నిలచిన వాహనాల రాకపోకలు ► అడ్డుకోబోయిన పోలీసులతో స్థానికుల వాగ్వాదం ► ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు ► సమస్య పరిష్కరించాలని డిమాండ్ ► ఆర్డబ్ల్యూఎస్ డీఈ హామీతో ఆందోళన విరమణ ఎన్నికల వేళ ఇంటింటికీ తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించే ప్రజాప్రతి నిధులు.. అవసరం తీరాక ఓట్లేసి గెలిపించిన జనం గోడు పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడ్డారు. వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నా తమ సమస్య పట్టించుకున్న నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం రాచర్లకు చెందిన మహిళలు స్థానిక బస్టాండ్ సెంటర్లో శనివారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యే వచ్చి, నీటి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. రాచర్ల : తమ గ్రామానికి గడచిన ఆరు రోజులుగా తాగునీటి ట్యాంకర్ రాక, ఇబ్బందులు పడుతున్న రాచర్ల వాసులు శనివారం పెద్ద సంఖ్యలో స్థానిక బస్టాండ్ సెంటర్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ధర్నా చేస్తున్నప్పటికీ ఆర్డబ్ల్యూఎస్, మండల పరిషత్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడ చూడలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు ధర్నాను మరింత ఉద్ధృతం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ధర్నా చేస్తున్న మహిళలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. తాగునీటి సమస్య పరిష్కారం చేసే వరకూ ధర్నాను కొనసాగిస్తామని మహిళలు ఆందోళనకు అడ్డుకుంటున్న పోలీసులకు తేల్చిచెప్పారు. ఆందోళన కారణంగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వచ్చే ట్యాంకర్లను ఆపేశారు..: ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బందం శకుంతల మాట్లాడుతూ రాచర్ల పంచాయతీతో 5,200 మంది జనాభా ఉండగా అధికారులు 16 వాటర్ ట్యాంకులు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అవి సరిపోక తాము మరో 15 ట్యాంకులు సరఫరా చేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వర్గీయులకు ఏజెన్సీ ఇచ్చేందుకు ఆ 15 ట్యాంకుల నీటి సరఫరా నిలిపివేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష చెప్పడంతో సరఫరా ఆపేశామన్నారు. దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా మారి, మహిళలు రోడ్డెక్కాల్సి వచ్చిందని సర్పంచ్ పేర్కొన్నారు. నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా చేసిన బిల్లులు ఇంత వరకూ మంజూరు చేయలేదని, రూ.10 లక్షల బిల్లులు రావాల్సి ఉందని సర్పంచ్ తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తాం..: డీఈ రాచర్ల గ్రామానికి అదనంగా 16 వాటర్ ట్యాంకులు మంజూరు చేసి తాగునీటి సమస్య పరిష్కారిస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆందోళన విషయం తెలుసుకుని బస్టాండ్ సెంటర్‌కు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, యూఆర్డీ షేక్ మస్తాన్‌వలి, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో పర్యటిస్తారని, వాటర్ ట్యాంకులు నిలిపేందుకు స్థలాలను కేటాయించి ఆ స్థలంలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని డీఈ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
మహిళా మండలి భవనంలో జిమ్ పెడతారా?
రాజేంద్రనగర్: మహిళా మండలికి చెందిన భవనంలో జిమ్ ఏర్పాటు చేయటంపై రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి జిమ్‌కు సంబంధించిన పరికరాలను ఆ భవనంలో ఉంచగా మంగళవారం మహిళలంతా అక్కడికి తరలివచ్చి ధర్నాకు దిగారు. పరికరాలను తీసుకు వచ్చి బయటపడేశారు. మహిళల ఫిర్యాదు మేరకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడి, మహిళా మండలికే భవనాన్ని కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
మద్యం అమ్మితే ఊరుకోం...
- మహిళల ధర్నా, మూసివేత - ప్రజాసంఘాల మద్దతు మద్యం అమ్మకాలపై మహిళలు భగ్గుమన్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ప్ల కార్డులు చేతపట్టి ప్రదర్శన చేశారు. దుకాణం మూసే వరకూ ఉద్యమం ఆపేది లేదంటూ బైఠాయించారు. ఉలవపాడు: నిత్యం మా పిల్లలు ఇక్కడ నుంచి బస్సు ఎక్కాలి... ఒంటరిగా బస్సు దిగుతారు. మా పిల్లలకు రక్షణ ఉండాలంటే ఇక్కడ మద్యం షాపు ఉండకూడదు... బరితెగించి పెడితే ఊరుకునేది లేదంటూ మహిళలు ధ్వజమెత్తారు. పంచాయితీ తీర్మానం లేకుండా అన్యాయంగా గత మూడు రోజులుగా ఇక్కడ మద్యం షాపు నిర్మించారు. గత మూడు రోజులు నుంచి ఆందోళనలు చేస్తున్నా మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ధర్నాకు దిగారు. ఎంపీపీ చిన్నమ్మి కూడా మద్దతు పలికారు. బస్‌స్టేషన్ నుంచి పీవీరావు విగ్రహం, అంబేద్కర్ బొమ్మ, పాతబస్టాండ్ వరకు ప్ల కార్డులు చేతపట్టి ప్రదర్శన చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని, అనుమతులు ఇచ్చిన సర్పంచి, కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్.ఐ. రాజేష్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. అనుమతి ఉందా అని దుకాణం నిర్వాహకులను ఎస్ఐ అడిగినా చూపించలేకపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నమ్మి , పంచాయతీ వార్డు సభ్యుడు ప్రభావతి, రైతు కూలీ సంఘం నాయకులు ఆర్. మోహన్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, సి.ఐ.టి.యు. నాయకులు కుమార్, దళిత నాయకులు, అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, వాసవీ వనితా క్లబ్ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మద్యం దుకాణం ఎదుట రాస్తారోకో మార్కాపురం టౌన్: పట్టణంలోని వైపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని వార్డు కౌన్సిలర్‌తోపాటు మహిళలు మంగళవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. సమీపంలో చర్చిలు, ప్రైవేటు పాఠశాలలు నివాస గృహాలున్నాయని, ఎత్తివేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. రోడ్డుపై బైఠాయించటంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ ఆదిమూలపు సుశీల, మాజీ కౌన్సిలర్ కొండయ్య, ఆ ప్రాంత మహిళలు పాల్గొన్నారు. -
నిరసన బతుకమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పెద్దల పండగ పెతరమాస వేళ ఎంగిలి పూల రాగాలతోనే పల్లెలు నిద్ర లేస్తాయి. తీరొక్క పువ్వేసి బతుకమ్మలు ఆడుతాయి. పడుచు పిల్లల దగ్గర నుంచి పండుటాకుల వరకు కొత్త చీరలుకట్టి వంటి నిండా నగలు సింగారించుకొని ఆడుతారు..పాడుతారు. సొంత రాష్ట్రంలో తొలి వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా చేపట్టిన వేళ పండగ శోభ మరింత సంతరించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈ సీన్ రివర్స్ అయ్యింది. ఉత్సాహంగా ఆడిపాడుతూ బతుకమ్మ ఆడాల్సిన మహిళలు.. బుధవారం ఎస్బీహెచ్ బ్యాంకు ముందు తమ కష్టాలను కైగట్టి పాడారు. తమ నిరసనను పాట రూపంలో చెబుతూ ఎంగిలి పూలతోనే బతుకమ్మ ఆడారు. సొమ్ములు లేకుండా సంబురాలు ఎట్టాచేసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎందుకిలా అంటే... ఐదేళ్ల నుంచి కరువు కాటేయడంతో రైతులు అప్పుల పాలయ్యారు. మహిళల ఒంటి మీద పుస్తేల దగ్గర నుంచి మొదలు పెట్టి కాళ్ల మెట్టెల వరకు బ్యాంకులో కుదవబెట్టి పంట రుణాలు తీసుకున్నారు. కానీ కాలం కలిసి రాక పెట్టిన పెట్టుబడి మట్టిలోనే కలిసిపోయింది. సాధారణ ఎన్నికల వేళ గులాబి దళపతి ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణ మాఫీకి ప్రాముఖ్యత ఇవ్వడంతో, ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టారు. అయితే సీఎం కేసీఆర్ రైతు రుణాల మీద రోజుకో ప్రకటన చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతు రుణాలు మాఫీ కాలేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు సుమారు రూ.3,321 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇందులో దాదాపు రూ.184 కోట్ల బంగారు రుణాలు ఉన్నాయి. గత ఏడాది దాదాపు 50 వేల మంది మహిళలు నగలు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. పంట రుణాలు మాఫీ చేశామని, కొత్త పంట లోన్లు కూడా ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ ఇంత వరకు రుణాలు మాఫీ కాలేదు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం బ్యాంకు ఎదురుగానే బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. -
చంద్రబాబుపై మన్యం మహిళల కన్నెర్ర
అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తాం.... టీడీపీకే ఓట్లు వేయమని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడుపై మన్యం మహిళలు కన్నెర్ర చేశారు. రుణమాఫీపై మాట తప్పిన బాబు సర్కార్‌పై డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని ఏడు మండలాల పరిధిలోని గ్రామల నుంచి డ్వాక్రా మహిళలు నిన్న రంపచోడవరం తరలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథకం కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీపై చంద్రబాబు చెబుతున్న కుంటిసాకులపై వారు నిప్పులు చెరిగారు. డ్వాక్రా మహిళలకు ట్వాక్రా వేశారంటూ ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాలకు చెందిన సుమారు 50వేలమంది రుణమాఫీ కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీతో 30 కోట్ల మేర రుణం మాఫీ అవుతుందని మహిళలు ఆశపడ్డారు. ఓట్లు వేయించుకున్న బాబు... సీఎం అయినా ఆ హామీ అమలు చేయకపోవటంతో నిరాశ చెందారు. అధికారంలోకి వచ్చాక బాబు రుణాలు రద్దుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినందునే మహిళలు, రైతులు ఓట్లు వేశారన్నారు. బేషరతుగా రుణాలు మాఫీ చేయాలని లేకుంటే ఈ నెల 18న ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై డ్వాక్రా మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు ట్వాక్రా వేసిన చంద్రబాబు అసలు ఆదాయ వ్యయాలపై శే్వతపత్రం విడుదలచేస్తే గుట్టు రట్టు కాగలదని అన్నారు. -
పయ్యావుల కేశవ్ కు చేదు అనుభవం
అనంతపురం:జిల్లాలోని ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇక్కడకు విచ్చేసిన పయ్యావులను స్థానిక సమస్యలపై మహిళలు నిలదీశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్ల సమయంలో ప్రజల ముందుకు రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఒక మహిళ పయ్యావులను ఎదురుగా వచ్చి నిలదీయడంతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురైయ్యాయి. రెండేళ్ల కిందట తన కుమారుని మృతికి ఇప్పిస్తానన్న నష్ట పరిహారం ఇప్పటి వరకూ ఎందుకు ఇప్పించలేదని పద్మావతి అనే మహిళ ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పయ్యావుల సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.