(ఫైల్ ఫొటో)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్‌లో దుమారం రేపుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు.
సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు.
‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్‌ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్‌ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment