కోల్‌కతా అభయ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన జరిగిన రోజులు గడుస్తున్నా ఆందోళనలతో దేశం అట్టుడికిపోతుంది. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ తరుణంలో అభయకు మద్దతుగా కోల్‌కతాలో ‘అమ్ర తిలోత్తోమా’ పేరుతో పలువురు నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనల్లో ఓ మానవ మృగం బరి తెగించాడు. మానవత్వం మరిచి పోయి రద్దీగా ఉండే ఎస్ప్లానేడ్ క్రాసింగ్ సమీపంలో నిరసనలో పాల్గొన్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
చదవండి : ఆర్‌జీకార్ ఆస్పత్రికి సీబీఐ అధికారులు.. ఏం చేశారంటే
బాధితురాలు కేకలు వేయడంతో నిరసన కారులు అప్రమత్తయ్యారు. నిందితుణ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే నిరసన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు మాత్రం నిందితుడు స్థానికుడేనని, మతిస్థిమితం లేదని విడిచిపెట్టగా.. పోలీసులు తీరుపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేధింపులకు పాల్పడిన నిందితుణ్ని ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. నిందితులు, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment