enquiry
-
రేపు ‘ఈడీ‘ ముందుకు కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) గురువారం(జనవరి16) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా- ఈ రేసుల కేసు (Formula-e race case)లో జనవరి 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్‌పై ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇదే కేసులో జనవరి మొదటి వారంలోనే ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ తుదితీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని తెలపడంతో ఈడీ కేటీఆర్‌కు సమయమిచ్చింది. అనంతరం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బుధవారం(జనవరి 15) సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విషయంలో కేటీఆర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో కేటీఆర్ తన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ కోసం కేటీఆర్‌కు ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి -
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను -
అమోయ్‌కుమార్ ల్యాండ్ కేసు: ఆర్డీవోకు ‘ఈడీ’ పిలుపు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం(నవంబర్ 5) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్‌లో శుక్రవారం తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరింది.ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్,ఎమ్మార్వో జ్యోతిలను ఈడీ విచారించింది. ఈ విచారణ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.మహేశ్వరం నాగారంలోని సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్,ఎమ్మార్వో జ్యోతి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఇదీ చదవండి: 12 నుంచి ఐఏఎస్‌ల విచారణ -
‘జన్వాడ’ కేసు: రాజ్‌పాకాల విచారణలో కీలక విషయాలు వెల్లడి
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన జన్వాడ ఫామ్‌హౌజ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల విచారణ ముగిసింది. రాజ్‌పాకాలను మోకిల పీఎస్ పోలీసులు ఎనిమిది గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం రాజ్‌పాకాలను పోలీసులు విడిచిపెట్టారు. రాజ్‌పాకాల దగ్గర లిక్కర్, గేమింగ్ మినహా డ్రగ్స్ ఆనవాళ్లు దొరలేదని సమాచారం. రాజ్‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న అతడి స్నేహితుడు విజయ్ మద్దూరికి సంబంధించి పోలీసులు విచారణలో ఆరా తీశారు. విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో తనకు సంబంధం లేదని, అతడి ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని రాజ్‌పాకాల చెప్పినట్లు తెలిసింది. కాగా, విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసుకు విజయ్ సమాచారమిచ్చాడు. విజయ్ కాల్‌లిస్ట్, సిగ్నల్ ఆధారంగా డ్రగ్స్ కేసు చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.విజయ్ డ్రగ్స్ ఎక్కడ కొన్నాడు. ఎక్కడ వాడాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జన్వాడలోని రాజ్‌పాకాల ఇంట్లో ఇటీవల జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు దాడి చేసిన అక్రమ మద్యానికి సంబంధించిన కేసులు పెట్టారు. ఇదీ చదవండి: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్.. పోలీసుల మెరుపు దాడి -
TG: అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్‌కుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్‌కుమార్‌ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్‌కుమార్‌కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్‌డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్‌లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్‌పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్’ ఆరా
సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్ ఆరా తీస్తోంది.నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్‌మిల్, ల్యాబ్, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలించింది.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ -
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
-
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
TG: పవర్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ లోకూర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్‌ను నియమించింది. గతంలో పవర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్ లోకూర్‌ను ఎంపిక చేసింది. జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. -
పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’
న్యూయార్క్: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూ హత్య కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. సెనేట్ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్‌గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్ తెలిపారు.పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్ రిపబ్లిక్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్ రిపబ్లిక్ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్‌కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
రెండో రోజు విచారణ...కవిత భర్తను విచారించనున్న ఈడీ
-
‘సందేశ్‌ఖాలీ నిరసన: ఒక్క మహిళా ఫిర్యాదు చేయలేదు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్లో దుమారం రేపుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్‌ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్‌ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు -
కేసీఆర్‌ను కాపాడాలని చూస్తోంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్‌ను కాపాడాలని చూస్తున్నట్టు అనుమానం కలుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభ కోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషి యల్ ఎంక్వైరీతో కాలయాపన చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయా న్ని సుమారు రూ.63 వేల కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలుపెంచి.. వేలకోట్ల అవినీ తికి పాల్పడిందన్నారు. ఆదివారం అరుణ మీడి యాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించడం కంటే సీబీఐ దర్యాప్తు జరి పిస్తే నిజానిజాలు బయటపడతాయన్నారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
నేటి నుంచి చంద్రబాబు విచారణ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడును విచారించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. చంద్రబాబు అవినీతి బండారాన్ని జాతీయస్థాయిలో బట్టబయలు చేసిన ఈ కేసుపై దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ తదితర విభాగాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ముసుగులో భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారని నిర్ధారించాయి. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల నకిలీ ప్రాజెక్టును చూపిస్తూ రూ.371 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంలో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు సీఐడీ శాస్త్రీయంగా సంసిద్ధమవుతోంది. ఈ కేసులో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. దాంతో న్యాయస్థానం మార్గదర్శకాలను పాటిస్తూ శని, ఆదివారాల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే చంద్రబాబును సీఐడీ విచారించనుంది. అందుకోసం ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో నలుగురు సీఐలు, సహాయక సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం రాత్రే రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ బృందంలో మొత్తం 12 మంది ఉన్నారు. సీఐడీ వాదనకు కొండంత బలం స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోసం న్యాయస్థానం అనుమతి పొందడం ద్వారా సీఐడీ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో నిధులను అక్రమంగా మళ్లించిన అవినీతి నెట్‌వర్క్‌ను సీఐడీ ఛేదించింది. ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరింది. దాంతో ఏ–1 చంద్రబాబుతో పాటు 8 మందిని సీఐడీ ఇప్పటివరకు అరెస్టు చేసింది. చంద్రబాబు అరెస్టు సరైనదేనంటూ ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడం, తాజాగా రిమాండ్‌ను పొడిగించడం ద్వారా సరైన రీతిలోనే సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడిందన్న విషయం వెల్లడైంది. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ కేసునే కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. సీఐడీ వాదనకు మరింత బలం చేకూరింది. ఈ కేసుపై టీడీపీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతంతో నిమిత్తం లేకుండా సీఐడీ నిబంధనల ప్రకారం దర్యాప్తును కొనసాగిస్తోంది. కీలక దశలో దర్యాప్తు ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ.. చంద్రబాబును రెండు రోజులపాటు కస్టడీలో విచారించడం ద్వారా మరిన్ని కీలక ఆధారాలను రాబట్టాలని భావిస్తోంది. ఈ నెల 9న చంద్రబాబును అరెస్ట్ చేసి సిట్ కార్యాలయంలో విచారించిన సమయంలో ఆయన తనకు ఏమీ తెలియదని, గుర్తు లేదని, మరచిపోయాను అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చి తప్పించుకునేందుకు యతి్నంచారు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి చంద్రబాబును అడగాల్సిన ప్రశ్నలపై సీఐడీ అధికారులు తగిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు డీఎస్పీలతో శాస్త్రీయమైన రీతిలో రూపొందించిన ప్రశ్నావళి నుంచి ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధించనుంది. ప్రధానంగా సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరిట జీవో ఎలా ఇచ్చారు? ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి? రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు? ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావును ఏకంగా నాలుగు కీలకస్థానాల్లో ఎందుకు నియమించారు? ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయమని ఎందుకు ఆదేశించారు? ఏకంగా 13 చోట్ల నోట్‌ఫైళ్లపై సంతకాలు చేసి మరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు? డిజైన్‌టెక్ కంపెనీకి చేరిన నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించడం గురించి మీకు తెలుసా? అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారి మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏమిటి? ఆయన మీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు రూ.241 కోట్లు ఎందుకు అందించారు? ఆ నిధులను ఆయన మీకు చేర్చారా? సీఐడీ నోటీసులు అందగానే మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పరారయ్యారు వంటి పలు కోణాల్లో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కేసులో ప్రధాన సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ చంద్రబాబును అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తదుపరి ప్రశ్నలను సంధించనున్నారు. జైల్లోనే విచారణకు ఏర్పాట్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించేందుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్‌లో సీసీ కెమెరాలు ఉన్నందున అక్కడే విచారించాలా లేక వేరే గదిలో విచారించాలా అన్న విషయమై సమాలోచనలు చేస్తున్నారు. భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే 300 మంది ఆక్టోపస్, ఇతర పోలీసు బలగాలతో జైలు బయట భద్రత కట్టుదిట్టం చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు రిమాండ్ 24 వరకు పొడిగింపు -
కొనసాగిన ధార్మిక పరిషత్ కమిటీ విచారణ
తిరుపతి కల్చరల్: హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న సమయంలో అర్జున్‌దాస్ పలు అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ కమిటీ సభ్యులు ఏబీ కృష్ణారెడ్డి, జోలా చైతన్య, శ్రీరామమూర్తి, విజయరాజు, రామకృష్ణారెడ్డి రెండో రోజు కూడా విచారణ నిర్వహించారు. అర్జున్‌దాస్ గురువారం కూడా విచారణకు హాజరవ్వలేదు. అయితే విచారణ కమిటీ సభ్యులు మఠంలోని రికార్డులను నిశితంగా పరిశీలించారు. రికార్డుల్లోని లావాదేవీలపై సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ పూజారులు అర్జున్‌దాస్ వల్ల తాము పడిన ఇబ్బందులను విచారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో మఠం భూముల విషయంలో అర్జున్‌దాస్ చేసిన అక్రమాలను పలువురు కమిటీకి విన్నవించారు. అనంతరం విచారణ కమిటీ సభ్యుడు ఏబీ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణకు అర్జున్‌దాస్ సహకరించట్లేదని చెప్పారు. అర్జున్‌దాస్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నివేదిక సమరిస్తామని తెలిపారు. -
‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’
శ్రీరాంపూర్(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్షీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్(ఆర్జీ 1), మనోహర్(ఆర్జీ 2), అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ బదిలీ.. మణిపూర్ అల్లర్ల వెనుక ఎవ్వరున్నా వదలం: అమిత్ షా
ఇంఫాల్: మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణమైన వారిని వదలబోయేది లేదని అన్నారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు ఒక కమిటీని, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ఒక కమిటీని, శాంతిని నెలకొల్పేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం చెప్పి... అమిత్ షా అల్లర్ల నేపథ్యంలో భయబ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. ఈ సందర్బంగా మెయితేయి, కుకీ వర్గాలవారు తొందరపడొద్దన్నారు. ప్రజాసంఘాల వారు కూడా సంయమనం పాటించాలని కోరారు. డీజీపీ బదిలీ... ప్రస్తుత డీజీపీ పి.దౌన్గల్‌ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో CRPF ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ సింగ్ ను నూతన డీజీపీగా నియమించారు. ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు ఎటువంటి సంబంధం లేని తటస్థ వర్గానికి చెందిన వారిని డీజీపీగా నియమిస్తే శాంతిభద్రతలను తొందరగా అదుపులోకి తేవచ్చనే ఉద్దేశ్యంతోనే డీజీపీని బదిలీ చేశారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కలిగిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు హోంమంత్రి. ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉన్నట్లయితే వారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.లేదంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పేందుకు కమిటీ... అలాగే మణిపూర్ ప్రజల్లో భయాందోళనలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో మరో కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెయితేయి, కుకీ వర్గాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
రేపే సుప్రీంకోర్టు ముందుకు అవినాష్ రెడ్డి మ్యాటర్
ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. సంఖ్య విషయం సంబంధిత సమాచారం 1 డైరీ నెంబర్ 20416/2023 2 కేసు నెంబర్ MA 00 1285 3 విచారణ తేదీ 23 మే 2023 4 CL నెంబర్ 36 5 కేటగిరీ క్రిమినల్ మ్యాటర్స్ 6 సబ్జెక్ట్ బెయిల్ 7 బెంచ్ 1. జస్టిస్ J.K.మహేశ్వరీ 2. జస్టిస్ పమిడిగంఠం శ్రీ నరసింహా 8 పిటిషనర్ సునీత నర్రెడ్డి 9 రెస్పాండెంట్స్ 1. Y.S.అవినాష్ రెడ్డి 2. డైరెక్టర్, CBI 10 సునీత తరపు న్యాయవాది జెసల్ వాహి 11 అవినాష్ తరపు న్యాయవాది ముకుంద్ P.ఉన్నీ ఈ పిటిషన్ ను సునీత నర్రెడ్డి గతంలో దాఖలు చేశారు. మరో వైపు ఇదే వ్యవహారంపై అవినాష్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. తల్లి అనారోగ్యం వల్ల వారంపాటు సిబిఐ విచారణకు రాలేనని, సిబిఐ విచారణకు హాజరుపై మినహాయింపు కావాలని కోరారు. తన తల్లికి చికిత్స జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. ఇదే విషయాన్ని సిబిఐకి కూడా లిఖిత పూర్వకంగా తెలిపారు. (చదవండి : అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి) -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ
►అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. ఆదివారం విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వక స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ► ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దాదాపు గంటన్నరగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ పాత్రపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరయ్యేందుకు ముందు ఓ వీడియో కూడా విడుదల చేశారు కేజ్రీవాల్. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని సీబీఐతో సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వినకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అయ్యాక అనేక మార్పులు తీసుకొచ్చానని, భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. -
'కేజ్రీవాల్ అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్క నిజాయితీపరుడు ఉండడు'
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరయ్యే ముందు వీడియో రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశా. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టా. 30 ఏళ్లలో గుజరాత్లో ఏం అభివృద్ధి చేశారు. నా జీవిత లక్ష్యం భారత్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ చేయడం. నేను షుగర్ వ్యాధిగ్రస్తుణ్ణి. ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నా. అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశా. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెప్తా. దేశం కోసం పుట్టాను దేశం కోసం చస్తాను.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖలో ఒకప్పుడు కమిషనర్‌గా పనిచేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. బీజేపీ తాను అవినీతిపరుడ్ని అని ప్రచారం చేస్తోందని, అలాంటి వాడినైతే అప్పుడే రూ.కోట్లు సంపాదించేవాడినని పేర్కొన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాలే అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్కరు కూడా నిజాయితీ పరుడు ఉండడని అన్నారు. చదవండి: రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్ -
'రామోజీరావు స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం.. శైలజను 6న విచారిస్తాం'
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో రామోజీరావును 8 గంటలపాటు విచారించారు సీఐడీ అధికారులు. అనంతరం సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధార్ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్గదర్శిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. 'ఒక కేసుకు సంబంధించి రామోజీరావును విచారించాం. ఆయన స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశాం. తన కోడలు శైలజా కిరణ్ ఇంటికి వచ్చి విచారించాలని రామోజీరావు కోరారు. అందుకే ఇక్కడే విచారణ జరిపాం. ఈ కేసులో కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా రామోజీరావును మళ్లీ విచారిస్తాం. రామోజీ స్టేట్మెంట్ను అనలైజ్ చేయాల్సి ఉంది. ట్రాన్స్ఫరెన్స్ దర్యాప్తులో బాగంగా విచారణ జరిపాం. ఐవోతో సహా టెక్నికల్ స్టాఫ్ విచారణలో పాల్గొన్నారు. రామోజీరావు కోడలు శైలజాకిరణ్‌ను ఈనెల 6న విచారిస్తాం. ఆమెకు కూడా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చాం.' అని సీఐడీ ఎస్పీ తెలిపారు. చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం? -
ఎల్లుండి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
-
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని, కానీ ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి -
విశాఖ సీబీఐ అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినతిపత్రం
-
గుంటూరు: చంద్రబాబు సభ తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
గుంటూరు ఘటనపై విచారణ: విసరడంతోనే తొక్కిసలాట!
‘చంద్రబాబునాయుడు వెళ్లిపోయిన తర్వాత క్యూలైన్లో నిల్చున్నాం.. లారీలపై ఉన్న వలంటీర్లు కానుకలను కిందకు విసరడంతో టోకెన్ లేకపోయినా ఇస్తున్నారంటూ అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.. కానుకలు విసరడంతోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నా కుమార్తె గాయపడగా నేను అదృష్టవశాత్తూ బయటపడ్డా...’ – విచారణ కమిటీ ఎదుట గుంటూరుకు చెందిన రాఘవి వాంగ్మూలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: నూతన ఏడాది తొలిరోజు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై బాధితులు, ప్రత్యక్ష సాక్షులు గురువారం విచారణ కమిటీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జనవరి 1వ తేదీన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. గుంటూరులో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కమిషన్ మైదానం సామర్థ్యం, ఎంత మంది ఉన్నారు? తొక్కిసలాట ఎలా జరిగింది? అనే అంశాలపై కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌లతోపాటు బాధితులు, నిర్వాహకులను ఆరా తీసింది. సభ జరిగిన ప్రదేశం కొలతలు సేకరించింది. ఎంత మందికి కానుక టోకెన్లు ఇచ్చారు? పంపిణీ వద్ద ఎంతమంది ఉన్నారు? తదితర సమాచారాన్ని సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో విచారణ కొనసాగించారు. గాయపడ్డ వారు, మృతుల కుటుంబీకుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. తక్షణమే స్పందించడంతో.. తాము 60 క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు పోలీసులు వెల్లడించారు. 30 ఏర్పాటు చేస్తామని చెప్పి చివరికి 12 మాత్రమే ఏర్పాటు చేశారని వివరించారు. బారికేడ్లలో ఒక్కో క్యూలైన్ వెడల్పు ఐదు అడుగులకుపైగా ఉండటంతో కానుకలు తీసుకుని వెనక్కి వచ్చే వారు ఇరుక్కుపోయి తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. తాము వెంటనే స్పందించి కానుకల పంపిణీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో బాధ్యతలు నిర్వహించిన పోలీసు అధికారులు కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చారు. అంతా ఒకే లైన్లోనే.. చంద్రబాబు సభ ముగిసే వరకు చీరల పంపిణీ వద్దకు ఎవరిని వెళ్లనివ్వలేదు. సభ ముగిసిన తరువాత వెళితే ఒక కౌంటర్లో ఐదు వేల మందికిపైగా ఉన్నారు. ఒకే లైన్ ద్వారా వెళ్లటం, తిరిగి బయటకు రావటంతో ఇరుక్కుని తొక్కిసలాట జరిగింది. కళ్ల ముందే ఎంతో మంది గాయాలపాలయ్యారు. నిర్వహణ సరిగా లేకపోవటంతోనే తొక్కిసలాట జరిగింది. – గుంటముక్కల సౌందర్య (స్వర్ణభారతినగర్) అక్కా అంటూ ఆప్యాయంగా.. మా ఇంటి పక్క వీధిలో నివసించే షేక్ బీబీ తొక్కిసలాటలో మృతి చెందింది. అక్కా అని ఎంతో అభిమానంగా ఉండేదాన్ని. తొక్కిసలాటలో కళ్ల ముందే చనిపోవటాన్ని మరవలేకపోతున్నా. నేను స్పహ కోల్పోయి రెండు రోజుల పాటు ఐసీయూలో కోమాలో ఉన్నా. వెన్నుపూస దెబ్బతిని నరకం అనుభవిస్తున్నా. – తెల్లమేకల రంగాదేవి (మారుతీనగర్) కాలు విరిగింది.. సభకు వెళ్లిన వారిని మధ్యాహ్నం నుంచి కుర్చీల్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత ఒక్కసారిగా వదిలిపెట్టడంతో ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో నాకు కాలు విరగడంతో ఆపరేషన్ చేశారు. 15 రోజుల తరువాత అడుగు కిందకు పెట్టా. మాకు న్యాయం చేయాలి. – షేక్ హుస్సేన్‌బీ (ఏటీ అగ్రహారం) -
ఆ శునకం ఎలా గర్భం దాల్చింది? సరిహద్దు భద్రతా దళం దర్యాప్తు!
షిల్లాంగ్: ఏదైనా శునకం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, ఆర్మీలోని భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఏకంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టింది. మేఘాలయ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తమ దళంలోని ఓ స్నైఫర్ డాగ్ మూడు పిల్లలకు జన్మనివ్వడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కూడా. మేఘాలయ రాష్ట్ర బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్ షిల్లాంగ్ ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సేకరించింది. స్నైఫర్ డాగ్ గర్భం దాల్చడంపై డిసెంబర్ 19న బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు బార్డర్ ఔట్ పోస్టు బాఘ్మారాలో స్నైఫర్ డాగ్ లాల్సీ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అంశంపై డిప్యూటీ కమాండెంట్ ర్యాక్ అధికారి సమ్మరీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేయాలని పేర్కొంది. డిసెంబర్ 30, 2022 నాటికి దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు.. శిక్షణ ఇచ్చే బీఎస్ఎఫ్ శునకాలు వాటి సంరక్షకుల పర్యవేక్షణలో భద్రంగా ఉంటాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు జరుగుతాయన్నారు. ఈ శునకాలు ఇతర వాటితో ఎప్పుడూ కలవవని, బ్రీడింగ్ చేపడితే అది పశువైద్యుల పర్యవేక్షణలోనే ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలకు జన్మనిచ్చిన స్నైఫర్ డాగ్ లాల్సీ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కాపలా కాస్తోంది. ఇదీ చదవండి: Cameroon Green: వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా -
హీరా గోల్డ్ కేసులో ఈడీ విచారణకు నౌహీరా షేక్
-
‘లైగర్’ పెట్టుబడులపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: లైగర్ చిత్రానికి పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, శుక్రవారం సినీ ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమా పెట్టుబడులపై ఇదివరకు పూరీ జగన్నాథ్, చార్మి, విజయ్ను ప్రశ్నించినప్పుడు, శోభన్‌ను ప్రశ్నించినప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: విజయ్‌కి ‘లైగర్’ సెగ! -
మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థల ఆదాయం, పన్నుల చెల్లింపులకు సంబంధించి ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలపై విచారణ ప్రారంభమైంది. అధికారులు మరో పదిమందికి నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆయన బంధువుల ఇళ్లు, ఓ సహకార బ్యాంకు చైర్మన్ ఇంటిపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల నగదు స్వాధీనంతోపాటు పలు కీలకపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు అకౌంట్లు, లాకర్లను పరిశీలించిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు గోపాల్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్లు, కొందరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను మొత్తం 13 మందిని ఐటీ అధికారులు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో డోనేషన్ల పేరుతో సుమారు వందకోట్ల రూపాయలు వసూలు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, వస్తున్న ఆదాయానికి చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నించారు. సొసైటీ పేరిట ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటూ, విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన అంశంపై అధికారులకు లభించిన ఆధారాలను వారి ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన అంశాలపై విడతలవారీగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహేందర్‌రెడ్డి కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ సోమవారంనాటి విచారణలో లేరు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి తరఫున ఆయన ఆడిటర్‌తోపాటు మరికొంతమంది విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేవరకు వారిని ప్రశ్నించనున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం: రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సోమవారం తాము, తమ సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు విచారణకు హాజరైనట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి, భద్రారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సోదాల్లో స్వా«దీనం చేసుకున్న పలు పత్రాలకు సంబంధించి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చామన్నారు. కాల్‌డేటాను ఓ క్రమపద్ధతిలో ఇవ్వాలని కోరగా సరేనని చెప్పామని భద్రారెడ్డి వివరించారు. కాగా, మరో పదిమందికి ఐటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. చదవండి: టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ -
బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్‌కు 41–ఏ సీఆర్పీసీ కింద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్‌కు నోటీసులు అందించేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించక పోవడంతో, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు అందించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేస్తారా? సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్ వెల్లాపల్లి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతి.. తుషార్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేయాలా? బీఎల్ సంతోష్‌కు మాదిరిగానే వారికి కూడా మరోసారి నోటీసులు జారీ చేయాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సిట్ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోసారి కస్టడీపై నేడు విచారణ ఈ కేసుకు సంబంధించి రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని, మరోసారి వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సిట్‌కు స్వేచ్ఛ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం స్పష్టీకరణ -
నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబితా సీరియస్
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శిని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా పేర్కొన్నారు. భవిష్యుత్తలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆమె సూచించారు. కాగా రామంతాపూర్ నారాయణ కాలేజీలో సెంకడ్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థి సాయి నారాయణ.. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత, నారాయణ ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మొత్తం ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. అయితే యశోద ఆసుప్రతిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. సందీప్ సహా వెంకటేష్‌చారీ, కాలేజ్ ఏవో అశోక్‌కు డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: (రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది?) -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్‌కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్‌లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్‌లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్‌ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
ఒకే చోట 15 ఏళ్ల సర్వీసా..!
శ్రీకాకుళం న్యూకాలనీ: సమగ్రశిక్ష అభియాన్ జిల్లా కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్(ఎఫ్ఏఓ)గా ఓ వ్యక్తి 14 ఏళ్లుదాటి పనిచేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒకే పోస్టులో ఇన్నేళ్లపాటు రిలీవింగ్, బదిలీ ఉత్తర్వులు లేకుండా పనిచేస్తున్న ఉదంతంపై కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే సంబంధిత ఎఫ్ఏఓ పోస్టుకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేయాలని సమగ్రశిక్ష అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కవిటి మోహనరావు మాతృశాఖ ఖజానా శాఖ. సంబంధిత మాతృశాఖ నుంచి రిలీవింగ్ ఆర్డర్ లేకుండా, సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టరేట్ నుంచి బదిలీ ఉత్తర్వులు లేకుండా 2008లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ప్రస్తుతం సమగ్రశిక్షగా పేరు మార్చారు)లో అకౌంటెంట్‌గా విధుల్లో చేరారు. 8 ఏళ్లు పనిచేసిన తర్వాత అదే శాఖలో 2015 డిసెంబర్ 23 నుంచి (మధ్యలో కొన్ని నెలలు విధులకు దూరంగా ఉన్నారు) ఇప్పటి వరకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వ్యక్తిగత అవసరాల కోసం సెలవులు మంజూరు చేయమని ఏపీసీ జయప్రకాష్‌ను కోరడంతో రచ్చ మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని రోజులు కుదరదని, ఖజనాశాఖ నుంచి రిలీవింగ్ లెటర్ చూపించాలని, లేదా స్టేట్ సమగ్రశిక్ష ఆఫీస్ నుంచి బదిలీ ఉత్తర్వులైనా చూపించాలని కోరగా, అవేవీ తన వద్ద లేవని మోహనరావు బదులివ్వడంతో ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఏపీసీ నివేదించినట్లు తెలిసింది. ఈ ఉదంతంపై కలెక్టర్‌తోపాటు స్టేట్ సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వీ ఆరా తీసి ఫైల్ సిద్ధంచేయాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ రోణంకి జయప్రకాష్ శాఖాపరంగా తీసుకున్న కార్యాలయం మార్పు, నిర్ణీత గడువుకు ముందే సెక్టోరియల్ అధికారుల తొలగింపు, కొత్త నోటిఫికేషన్ తదితర నిర్ణయాలను తప్పుపడుతూ ఎఫ్ఏవో సైతం ఏపీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ రెండు ఉదంతాలపై పూర్తి నివేదిక అందజేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. విచారణాధికారిగా సైతం నియమించారు. -
మహేష్ బ్యాంకు హ్యాక్ కేసు.. షాకింగ్ విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంకు నిధుల గోల్మాల్ కేసులో కీలక పురోగతి కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నేరగాళ్లు నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్‌లో చొరబడి 14 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని నగర పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్ చేసి డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో.. మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ కోపరేటివ్ బ్యాంకు, మహేష్ నిధులను లూటీ చేశారు. మహేష్ బ్యాంకు కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో ఉండి నైజీరియన్ కి సపోర్ట్ చేసిన కీలక సూత్రధారి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల దోపిడిలపై కీలక విషయాలను హైదరాబాద్ సీపీ వెల్లడించనున్నారు. చదవండి: Mahesh bank Fraud Case: తప్పించుకునేందుకు భవనం నుంచి దూకిన నైజీరియన్ -
భార్యను వదిలించుకోవడానికి భర్త మాస్టర్ ప్లాన్.. వైద్యం పేరుతో
ఆర్మూర్ టౌన్(నిజామాబాద్ జిల్లా): వైద్యం పేరుతో భార్యకు స్టెరాయిడ్స్ అందించిన భర్త గంగసాగర్పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆర్మూర్‌కు చెందిన ఆర్ఎంపీ గంగసాగర్ తన భార్యను వదిలించుకోవడానికి చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై ఆయన భార్య స్రవంతి సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసింది. చదవండి: వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే! దీంతో కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరపాలని సఖీ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సఖీ టీం వారు క్షేత్ర స్థాయిలో విచారించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్మూర్ పోలీసులకు సూచించారు. కాగా రెండేళ్ల క్రితం కులం పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తల మధ్య సమస్య పరిష్కారం కాక పోవడంతో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. అలాగే స్టెరాయిడ్స్ కేసులో భర్త గంగసాగర్పై విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో విచారణ
-
ఇప్పుడు టోనీ.. అప్పుడు చుక్స్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ టోనీని న్యాయస్థానం అనుమతితో ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పంజగుట్ట పోలీసులు కీలకాంశాలను గుర్తించారు. దేశవ్యాప్తంగా డ్రగ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న అతగాడు భారీ మాఫియానే నడిపాడని తేల్చారు. గతంలో టోనీ కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నట్టు, ఎక్సైజ్ పోలీసులకు సంబంధించిన రెండు కేసుల్లో వాంటెడ్ అయినట్టు తేల్చారు. ఈ వివరాలు దర్యాప్తు అధికారులు గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. 2013 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న టోనీ అనేక ప్రాంతాల్లో సంచరించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా.. టోనీ ఒక్కొక్కచోట ఒక్కొక్క పేరు, గుర్తింపుతో నివసించాడు. తొలుత ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేశాడు. ఇతడి అనుచరులు అక్కడ అరెస్టు కావడంతో తన మకాం బెంగళూరుకు మార్చాడు. ఆ నగరంలోనూ కొన్నాళ్లు డ్రగ్స్ దందా చేసిన ఇతగాడు ఎక్కడా తన ఉనికి బయటపడనీయలేదు. ఆ నగరంలోనూ మాదక ద్రవ్యాల కేసుల్లో ఇతడి అనుచరులే పట్టుబడ్డారు. దీంతో 2019లో హైదరా బాద్‌కు వచ్చిన టోనీ టోలిచౌకిలోని అద్దె ఇంట్లో నివసించాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎస్కే చుక్స్ పేరుతో చెలామణి అయ్యాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ తన అనుచరులైన ఐవరీ కోస్ట్ జాతీయులు పాట్రిక్స్, అబ్దుల్యా, కెన్యాకు చెందిన సులేమాన్ ఇబ్రహీంలతో అమ్మించాడు. ఆ ఏడాది గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఆ కేసుల్లో చుక్స్గా టోనీ పేరు నమోదైంది. ఇప్పటికీ ఆ రెండు కేసుల్లోనూ ఇతడు వాంటెడ్‌గానే ఉన్నాడు. నిఘా పెరగడంతో ముంబైకి.. ఇలా హైదరాబాద్‌లోనూ టోనీపై నిఘా పెరగ డంతో మళ్లీ ముంబైకి మకాం మార్చాడు. గతంలో నివసించిన ప్రాంతానికి దూరంగా అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దందా చేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. టోనీ ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పంజగుట్ట పోలీసులు అతనితో పాటు తాజాగా అరెస్టయిన ముగ్గురు అనుచరులనూ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిం చారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి సమర్పిం చిన రిమాండ్ రిపోర్ట్‌లో టోనీకి సంబంధించి కీలకాంశాలు పొందుపరిచారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు టోనీనీ పీటీ వారెంట్‌పై ఆ కేసుల్లో అరెస్టు చేయనున్నారు. ఆపై కోర్టు అనుమతితో టోనీని తమ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ
-
Eluru Town: యువతిపై లైంగికదాడి.. సీఐపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, ఏలూరు టౌన్: ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పోలీసు శాఖలో అధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏలూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఈ కేసుకు సంబంధించి యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలేమి లేకుండా చేసుకునేందుకు సీఐ తీవ్రంగా ప్రయత్నించారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) అయితే యువతి ఫిర్యాదుపై రాష్ట్రస్థాయి అధికారుల విచారణ నేపథ్యంలో సీఐపై వేటు తప్పదని తెలుస్తోంది. సదరు సీఐ ఇటీవల అటాచ్‌మెంట్‌పై మరో విభాగంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఐను వీఆర్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలో సీఐపై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏలూరు రూరల్ స్టేషన్లో గతంలో పనిచేసిన సీఐ, ఎస్సై పై వేటు పడింది. వీరిద్దరిపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. చదవండి: (భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..) -
విజయవాడ సైబర్ మోసంపై దర్యాప్తు జరుగుతోంది: పోలీసులు
-
పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు!
సాక్షి,హైదరాబాద్: నగరంలో పని చేసే పోలీసు అధికారిణికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొన్నాళ్లుగా ఓ గుర్తుతెలియని వ్యక్తి అశ్లీల ఫొటోలు పంపుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడి కోసం కేరళకు వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అరెస్టుకు అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేసి సరిపెట్టారు. రాష్ట్ర మహిళ భద్రత విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా (ఏఎస్సై) ఓ అధికారిణికి కొన్ని రోజులుగా గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా అశ్లీల ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. తొలినాళ్లల్లో యాదృచ్ఛికంగా జరిగిందని భావించిన ఆమె సందేశాలతోనే మందలించారు. అయినప్పటికీ ఈ వేధింపులు ఆగకపోవడంతో తీవ్రంగా పరిగణించారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాధారణ మహిళలపై జరిగే నేరాలనే సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఓ పోలీసు అధికారిణే బాధితురాలిగా మారడంతో కేసు దర్యాప్తునకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నిందితుడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక బృందంతో బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టిన ప్రత్యేక బృందం సోమవారం అతడిని అరెస్టు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో నిందితుడు ఉండే ప్రాంతానికి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం చేరుకుంది. అక్కడ అతగాడి పరిస్థితి చూసిన నగర అధికారులు అవాక్కయ్యారు. మహిళ ఏఎస్సైకి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపుతున్న వ్యక్తి చిన్న గుడిసెలో నివసిస్తున్న మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు. దీనికి తోడు మూగ–చెవిటి వ్యక్తి కావడంతో కుటుంబీకులు సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. అత్యవసర సమయంలో తమకు సంప్రదించడానికి ఇలా చేశారు. అయితే ఈ ఫోన్‌ను వినియోగించే సదరు నిందితుడు అనేక మందికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నాడని తేలింది. అతడి ఫోన్ పరిశీలించిన అధికారులు అందులో అనేక ఫొటోలు, వీడియోలు గుర్తించారు. ఈ విషయం నిందితుడి కుటుంబీకులకు తెలిపారు. వారి సాయంతో ప్రశ్నించగా... తనకు మహిళ ఏఎస్సై ఎవరో తెలియదని, ఏదో ఒక ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకుని ఇలా పంపిస్తుంటానని నిందితుడు చెప్పాడు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అనేక సమస్యలు వస్తాయని కుటుంబీకులను పోలీసులు హెచ్చరించారు. నిందితుడిని అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. -
జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై NCB విచారణ
-
కొలిక్కిరాని ‘కొడనాడు’ కేసు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు
కొడనాడు ఎస్టేట్ కేసు ఐదేళ్లయినా ఒక కొలిక్కిరాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని అన్న, భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నీలగిరి జిల్లా కొత్తేరి సమీపంలోని కొడనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు టీ ఎస్టేట్, బంగ్లా ఉన్నాయి. వారు ఏడాదికి రెండుసార్లు ఈ ఎస్టేట్‌లో కొన్నాళ్లు సేదదీరడం అలవాటు. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2017 ఏప్రిల్ 23వ తేదీ అర్దరాత్రి కొందరు అగంతకులు ఎస్టేట్‌లో ప్రవేశించి ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. అడ్డు వచ్చిన ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ను హతమార్చారు. జయలలిత వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన కనకరాజ్ సహా 11 మంది దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: (ఫడ్నవీస్‌కు గడ్కరీ పాఠం?) ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కనకరాజ్ అను మానాస్పద స్థితిలో మరణించాడు. అదే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ రాత్రి సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని చందనగిరి అనే ప్రాంతంలో కనకరాజ్ మృతదేహం లభించగా సయాన్ అనే వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని కోర్టులో సయాన్ పిటిషన్ వేయడంతో కొడనాడు లోని కొత్తేరి పోలీసులు పునర్విచారణ చేపట్టారు. దక్షిణ మండల ఐజీ సుధాకర్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తన తమ్ముడు కనకరాజ్‌ను పథకం ప్రకారం హత్య చేశారని అన్న ధనపాల్ విచారణాధికారికి ఫిర్యాదు చేశాడు. చదవండి: (దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన) అలాగే కనకరాజ్ భార్య కలైవాణి సైతం తన భర్త మరణంలో అనుమానాలు ఉన్నాయని వాంగ్మూలం ఇచ్చింది. ఈ కారణంగా కనకరాజ్ మృతిపై పునర్విచారణ జరపాల్సిందిగా సేలం జిల్లా ఎస్పీ అభినవ్ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక విచారణాధికారిగా ఆత్తూరు డీఎస్పీ రామచంద్రన్‌ను నియమించారు. ఆయన శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించారు. 20 మందికిపైగా పోలీసులు ఐదు వాహనాల్లో ఉదయం 6.45 గంటలకు అత్తూరుకు వచ్చారు. శక్తినగర్‌లోని కనకరాజ్ బంధువుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
Disha Case: విచారణకు హాజరైన వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్ కమిషన్) ఎదుట హాజరయ్యారు. ఎన్కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్మెంట్ను కమిషన్ నమోదు చేయనుంది. కాగా, ఇప్పటికే ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్ స్టేట్మెంట్ కీలకం కానుంది. చదవండి: (‘దిశ’ ఎన్కౌంటర్: నా కళ్లలో మట్టి పడింది) -
బుల్లెట్ల శబ్దం వినిపించిందా?.. లేదు ఆ సమయంలో నిద్రపోతున్నా!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 2019 డిసెంబర్ 5న నిందితులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ నుంచి రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లిలో దిశ మృతదేహాన్ని కాల్చే సిన ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన వాహనం డ్రైవర్ యాదగిరిని గురువారం త్రిసభ్య కమిషన్ విచారించింది. ఎన్కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా? అని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. ‘లేదు, ఆ సమయంలో నేను వాహనంలోనే పడుకున్నా’అని డ్రైవర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్కౌంటర్లో మరణించిన నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృపాల్ గుప్తా, బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తాలను కూడా కమిషన్ విచారించింది. మృతదేహాలకు పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించలేదని కృపాల్ గుప్తాను ప్రశ్నించగా.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇవ్వలేదని పొంతనలేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మృతదేహాలపై ఏమైనా గాయాలున్నాయా అని ప్రశ్నించగా.. లేవని కృపాల్ సమాధానమివ్వగా, సుధీర్ గుప్తా మాత్రం మృతదేహాలపై పోలీసులు కొట్టినట్లు గాయాలున్నాయని చెప్పినట్లు సమాచారం. శుక్రవారం కూడా గాంధీ ఆసుపత్రి వైద్యుల విచారణ కొనసాగనుంది. దిశ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది. చదవండి: Tollywood Junior Artists: ప్రియుడు మోసం చేయడంతో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ విచారణ
సాక్షి,విజయవాడ: ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. ఎస్ఎస్సీ బోర్డులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్నవేధింపులపై కొద్దిరోజుల క్రితం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఎస్ఎస్సీ బోర్డులో ఉద్యోగిణులు వేధింపులపై వచ్చిన ఫిర్యాదులపై ఆరోపణల వివరాలతో కూడిన విచారణ నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వివిధ శాఖల ఉద్యోగ బాధ్యతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కానీ మహిళలపై ఇతర వేధింపుల సంఘటనలను సీరియస్‌గా పరిగణిస్తామని తెలిపారు. -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి
చండీగఢ్: పంజాబ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్‌లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ అమానుషాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎన్సీఎస్సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా, విచారణ వివరాలను మెయిల్ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను విచారించిన ఈడీ
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. మనీ లాండరింగ్ కేసుతో పాటు, ఎన్నికల కమిషన్‌తో సంబంధం ఉన్న లంచం కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయమై సోమవారం ఫెర్నాండెజ్ విచారించిన ఈడీ.. పలు అంశాలపై ఆరా తీసింది. సుకేశ్ చంద్రశేఖర్ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఆమెను విచారించినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 24న, చంద్రశేఖర్‌కు చెన్నైలో ఉన్న ఓ బంగ్లాను, 82.5 లక్షల నగదు, డజనుకు పైగా విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నేరపూరిత కుట్ర, మోసం, దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు దోపిడీకి సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం చంద్రశేఖర్‌ని రోహిణి జైలులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. Enforcement Directorate (ED) is questioning Bollywood actress Jacqueline Fernandez in Delhi for the last five hours, in a money laundering case. (File photo) pic.twitter.com/ftUj2CkNcN — ANI (@ANI) August 30, 2021 చదవండి: Payel Sarkar: నటికి ఫేక్ డైరెక్టర్ అసభ్య సందేశాలు -
సినీతారల డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మరుగునపడ్డ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారనే దానిపై విచారణ చేపట్టనుంది. గతంలో డ్రగ్స్ సరఫరా, వినియోగం వరకూ ఎక్సైజ్ శాఖ దృష్టిపెట్టింది. ఈ కేసులో చికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానిస్తోంది. ఎక్సైజ్‌శాఖ్ నుంచి వివరాలు తీసుకుని ఈడీ విచారించనుంది. చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం.. మనీల్యాండరింగ్ కేసు నమోదు -
మధుసూదన్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో విచారణ ముమ్మరం
హైదరాబాద్: మధుసూదన్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దర్యాప్తులో.. మధుసూదన్‌రెడ్డిని గంజాయి మాఫియానే హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు కర్ణాటక బీదర్‌కు చెందిన సంజయ్, జగన్నాథ్, హరీష్, సంజీవ్‌గా పేర్కొన్నారు. గత నెలలో గంజాయి తీసుకొస్తుండగా సంజయ్ గ్యాంగ్‌ను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కాగా గంజాయి స్మగ్లింగ్ కోసం లారీ, డబ్బుని మధుసూదన్‌రెడ్డి సమకూర్చారు. చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా అనుకోకుండా గంజాయ్ గ్యాంగ్ పోలీసులకు పట్టుబడటంతో డబ్బు తిరిగి ఇవ్వాలని అతను ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో కిడ్నాప్ చేసి హత్యకు స్కెచ్ ప్లాన్ చేశారు. రౌడీషీటర్ ఎల్లంగౌడ్ హత్య కేసులో మధుసూదన్‌రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మధుసూదన్‌రెడ్డి హత్య వెనకాల ప్రతికారం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగం? -
విస్కీ బాటిల్ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా
వాషింగ్టన్: విస్కీ బాటిల్ కనిపించడం లేదని అమెరికా విచారణ చేపట్టింది. ఈ విస్కీ ఖరీదు 5800 డాలర్లు (రూ.4.30 లక్షలు) కాగా, దాన్ని 2019 లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహుకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆ బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సంబంధిత అధికారులు మాయమైన ఆ విస్కీ బాటిల్ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా పాంపియో పని చేస్తున్నప్పుడు జూన్ 24, 2019 న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు బహుమతి ఇవ్వగా అది పాంపియో స్వీకరించాడా లేదా అనేది అస్పష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై పాంపియో న్యాయవాది స్పందిస్తూ.. మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదు, అలానే ఆ బాటిల్ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక వస్తువు మాయంకావడంతో ఈ వార్త అక్కడ వైరల్‌గా మారింది. -
ఐదున్నర గంటల పాటు తీన్మార్ మల్లన్న విచారణ
సాక్షి, చిలకలగూడ( హైదరాబాద్): క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురువారం చిలకలగూడ పోలీసుస్టేషన్లో హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లన్న ఠాణాకు వచ్చారు. పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కోణాల్లో ఆయనను విచారించారు. ఆదివారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. తనను తీన్మార్ మల్లన్నబ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించాడని, డబ్బు డిమాండ్ చేశాడని సీతాఫల్‌మండికి చెందిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత్‌శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణకు మల్లన్న గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. మహంకాళి ఏసీపీ రమేష్ నేతృత్వంలో చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ విచారించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ..న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర అన్నారు. -
దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదు: కలెక్టర్ కార్తికేయమిశ్రా
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆశ్రమ్ ఆస్పత్రిలో ఘటనపై కమిటీ నిజనిర్ధారణ చేసిందని కలెక్టర్ కార్తికేయమిశ్రా అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. డయాబెటిక్ పేషెంట్ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక అసలు కారణాలను వెలికితీయాలని తమిళనాడులో కొత్తగా కొలువుతీరిన డీఎంకే ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఆసుపత్రిలో జయలలిత చివరి ఆరునెలల కాలంలో ఫైళ్లపై సందేహాస్పద సంతకాలు, రూ.కోట్ల ఒప్పందాలు, టెండర్లు కట్టబెట్టడం తదితర అంశాలపై కూపీలాగాలని ఐఏఎస్ అధికారులను నూతన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ కోవిడ్ పరిస్థితులను చక్కబెట్టడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుచేసిన కోవిడ్ ఆంక్షలకు తోడుగా పూర్తి లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టేందుకు స్టాలిన్ రహస్యంగా సమాయుత్తం అవుతున్నారు. అన్నాడీఎంకే హ యాంలో చేసుకున్న ఒప్పందాలు, జరిపిన నియా మకాలు, ఎవరెవరికి ప్రభుత్వ పనులు అప్పగించారు? ఏ పనులకు ఎంత ఖర్చు చేశారు? అనే అం శాలపై పూర్తి వివరాలు సేకరించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. తన చుట్టూ అత్యంత విశ్వాసపాత్రులు, నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారులను నియమించుకున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించిన ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని అనేక వ్యవహారాలపై కూపీలాగే బాధ్యతలను సదరు ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ అంశాల్లో ప్రధానమైనది ప్రభుత్వ ఫైళ్లలో ‘జయలలిత సంతకం’. 2016 సెపె్టంబరు 23న అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన జయలలిత అదే ఏడా ది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి అసలు కారణాలను కనుగొనేందుకు అప్పటి ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఇంతకాలమైనా ఇంకా నివేదిక సమరి్పంచలేదు. మరణానికి ముందు.. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్న ఆరునెలల మధ్య కాలంలో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. జయ ఆసుపత్రిలో చేరేముందు కొన్ని వారాలపాటు ఫైళ్లపై ఆమె సంతకాలు చేయలేదనే ఆరోపణలు, విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పెరిగాయి. అధికారులు కొన్ని ఫైళ్లను వెలికి తీసి పరిశీలించగా జయలలిత సంతకం చేయకుండానే నిర్ణయాలు జరిగినట్లు బయటపడింది. ఆయా ఫైళ్లలో సీఎం హోదాలో జయలలిత సంతకం చేయాల్సిన చోట ‘జే æజే’ అనే అక్షరాలే ఉన్నాయి. ఇలాంటి సంతకాలున్న ఫైళ్లపైనే ముఖ్యంగా విచారణ జరపాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రూ.కోట్ల విలువైన కొన్ని టెండర్లు సైతం జయసంతకం లేకుండానే ఆమోదం పొందినట్లు తేలింది. జయకు తెలియ కుండానే ఈ నిర్ణయాలు జరిగాయా? లేక ఆసుపత్రిలో ఉన్న ఆమెకు చెప్పి చేశారా? అప్పట్లో అత్యున్నత బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారుల ప్రమే యంపై సైతం దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. జె.జె. అనే అక్షరాలు జయలలిత సంతకమేనని ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె అలా సంతకం చేశా రని కొందరు చెబుతున్నారు. డీఎంకే అధికారం చేపట్టిన తరువాత అన్నాడీఎంకేను ఎ లాంటి ఒత్తిళ్లకు గురిచేయలేదు. కానీ, గత ప్రభుత్వ అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు పరోక్షంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతిని విచారించేందుకు ‘సిట్’ పోలీసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం ఆ యువతికి నోటీసులు జారీ చేశారు. విజయపుర (బిజాపుర) జిల్లా నిడగుంది పట్టణంలోని ఆమె ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఇంటికి తాళాలు వేసి ఉంది. అలాగే సదరు యువతి స్నేహితులు, బెంగళూరులో ఆమె ఉంటున్న ఇంటి యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. ఇంటి యజమానికి యువతి ఫోన్ బెంగళూరులోని ఆర్టీ నగరలో అద్దె ఇంట్లో ఉంటున్న యువతి రాసలీలల వీడియోలు విడుదలయిన తరువాత గోవాకు వెళ్లిపోయింది. ఆ సమయంలోనే తన ఇంటి యజమానులకు ఫోన్‌చేసి, తనవల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యాయని, తనను క్షమించాలని కోరినట్లు తెలిసింది. త్వరలో తిరిగి వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పింది. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని శనివారం యువతి వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశామని మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళానాయుడు తెలిపారు. యువతికి రక్షణ కల్పించాలని హోం మంత్రిని కోరతామన్నారు. ఈ కేసు వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని, ఆత్మహత్యాయత్నం కూడా చేశానని యువతి చెప్పడం ఆందోళనకరమన్నారు. చదవండి: (రాసలీలల కేసు: వీడియో రిలీజ్ చేసిన బాధిత యువతి) -
పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నం!
రామగుండం క్రైం: ఓ బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి యత్నించిన ఘటన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బాలిక(16) తనకు పరిచయం ఉన్న యువకుడితో సోమవారం సాయంత్రం టూ ఇంక్లైన్ సమీపంలోని దర్గా వద్ద మాట్లాడుతోంది. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది. స్థానిక యువకులు కొందరు గమనించి, గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వాహనం రావడం గమనించిన నిందితులు యువతిని వదిలిపెట్టి పరారయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు రమేష్‌బాబు, రాజ్‌కుమార్‌గౌడ్, క్రైం పార్టీ బృందం సభ్యులు బాధితురాలిని ఠాణాకు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకొని, ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ వన్ టౌన్ సీఐలు, బాధిత బాలికతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకున్న సీఐలతోపాటు ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై శారద, క్రైమ్ పార్టీ బృందం సభ్యులు నిజాంపేట్ శేఖర్, ఏలియా, రహీంలను ఏసీపీ అభినందించారు. చదవండి: ‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’ -
బ్యాంకు మేనేజర్‌కు ఇలా లిఫ్ట్ ఇచ్చి..అలా దోచేశారు!
ఖమ్మంరూరల్: కారులో లిఫ్ట్ ఇచ్చి మార్గమధ్యంలో విలువైన వస్తువులు దోచుకున్నసంఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను మంగళవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్‌కు చెందిన మట్టయ్య ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్. ఈయన ఫిబ్రవరి 26న ఖమ్మం వచ్చేందుకు ఎల్బీ నగర్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా..మారుతి కారులో వచ్చిన దారావత్ కవిత, కూర అయ్యన్న అనే ఇద్దరు ఎక్కించుకున్నారు. తల్లంపాడు వద్ద ఆపి కత్తులతో బెదిరించి రెండు చేతి ఉంగరాలు, సెల్‌ఫోన్, రూ.600 దోచుకుని వెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి కొత్తగూడెంలోని సుజాతనగర్లో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. చదవండి: వైరల్: చేతిలో పైథాన్, భుజంపై చిలుక.. -
మీకు మాస్కు లేదు.. కేసు వాదించొద్దు
ముంబై: ఒక న్యాయవాది వాదించే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. కారణం.. సదరు న్యాయవాది మాస్క్ ధరించకుండా తన వాదనను వినిపించేందుకు సిద్ధం కావడమే.. నో మాస్క్ నో విచారణ అని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన జస్టిస్ చవాన్ వెంటనే స్పందిస్తూ.. ఆ కేసును విచారించేందుకు నిరాకరించి మరో కొత్త తేదిని ప్రకటించారు. లాక్డౌన్ కాలంలో కోర్టులు ఆన్లైన్లోనే కేసుల్ని విచారించాయి. ఈ మధ్యనే కోర్టులు భౌతికంగా న్యాయవిచారణ చేపట్టాయి. అదే సమయంలో కరోనా నిబంధనల ను అనుసరించి తీరాలనీ తీర్మానించారు. ఈ ఎస్‌ఓపీఎస్ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం అనివార్యం చేశారు. జస్టిస్ పథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ‘కోర్టులో న్యాయ విచారణ చేపట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలనీ, మిగతా న్యాయవాదులంతా పక్క రూమ్‌లో తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాలి, కేసు విచారణ సమయంలో సబార్డినేట్లు వాదిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తులు కూడా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సిందే’ అని తెలిపారు. చదవండి: (మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు) -
చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ కేసులు అధికమైన నేపథ్యంలో ఈ పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల ఆచూకీని కనిపెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని పెదవి విరిచింది. చిన్నారుల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అలాగే అదృశ్యమైన చిన్నారుల వివరాలను అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరో రెండు వారాల్లో 33 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) మాట్లాడుతూ.. రాష్ట్రంలో దర్పన్ కార్యక్రమం అమలవుతుందని ధర్మాసనానికి వివరించారు. కాగా, పిటీషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. -
స్వర్ణ ప్యాలెస్ ఘటన: మూడు రోజులపాటు కొనసాగనున్న విచారణ
-
స్వర్ణ ప్యాలెస్ ఘటన: రమేష్‌బాబు విచారణ
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేష్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేష్‌బాబుపై సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తున్నారు. మూడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు మేష్ బాబుపై ప్రశ్నల వర్షం కురిపించడానికి బెజవాడ పోలీసులు ఇప్పటికే అనేక ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో హోటల్ యాజమాన్యానికి రమేష్‌బాబుకు అగ్రిమెంట్ ఉందా.. లేదా..?. ఘటన జరిగిన వెంటనే పోలీసు విచారణకు సహకరించకుండా ఎందుకు వెళ్లిపోయారు..?. అగ్నిప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సరైన సమాధానం చెప్పకుండా ఎక్కడకు వెళ్లారు..?. ఇప్పటి వరకు రమేష్‌బాబునును ఎవరు నడిపించారు..? అంటూ ఇలా అనేక ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది. కోవిడ్ లేకపోయినా, లక్షణాలు ఉన్నాయంటూ రోగులను భయపెట్టి లక్షల రూపాయలు నగదు దోచుకున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకంటే అధికంగా డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలపైనా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు. సీఆర్పీసీ 41, 160 కింద నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదనే విషయంపైనా పోలీసులు వివరణ కోరనున్నారు. హోటల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదనే కోణంలోనూ మూడు రోజుల కస్టడీలో భాగంగా విచారణ కొనసాగనుంది. కాగా, ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చనిపోగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు డాక్టర్ రమేశ్ బాబు సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, విజయనగరం : గంట్యాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా రావడం పట్ల డిప్యూటీ సీఎం , వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్‌హెచ్‌వోను కూడా సూచించినట్లు తెలిపారు. (చదవండి : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు) ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోంక్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ క్వారంటైన్లో ఉండే విద్యార్థులకు ప్రతి రోజు వైద్య బృందం వారి ఆరోగ్యం పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ విద్యార్థులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ అందచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.కరోనా సోకకుండా అన్ని పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్స్ వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని కోరుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
కరోనా మూలాలు తేలాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు. కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్‌ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు) -
అంతర్వేది ఘటనపై ప్రాథమిక నిర్ధారణ
సాక్షి, విజయవాడ: అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో పోలీసు శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలాన్ని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్ ఆదివారం పరిశీలించారు. అయితే రథం ఉంచిన ప్రాంతంలో పై భాగాన తేనె తుట్టె ఉన్నట్లు గుర్తించారు. రథానికి రక్షణగా తాటాకులు, సర్వే కర్రలు ఉంచగా, రాత్రి వేళ కొందరు వ్యక్తులు తేనె తుట్టెను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే తేనె తుట్టెకు నిప్పుపెట్టడంతో తాటాకులకు అంటుకుని ప్రమాదం జరిగింది. దీంతో రథం దగ్దమైనట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆ తరువాతే సుశాంత్ చికిత్స ఆపేశాడు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు నలుగురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సుశాంత్‌కి థెరపీ సెషన్స్ ఇచ్చిన సైకోథెరపిస్ట్‌ను సోమవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఐదు గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. సైకోథెరపిస్ట్‌లను కాకుండా, పోలీసులు గత వారం ముంబైకి చెందిన మరో ముగ్గురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. సుశాంత్ డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నాడని, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజులు ముందు దానిని ఆపేశాడని అతని స్నేహితులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. దిషా సాలియన్ మరణించినప్పటి నుంచి సుశాంత్ చికిత్స తీసుకోవడం మానేశాడు. దిషా మరణించిన తరువాత పోలీసులు సుశాంత్‌ను విచారించారు. దీంతో సుశాంత్ చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దిశా సాలియన్ సుశాంత్ టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగిని. ఈ సంస్థను ఉదయ్ సింగ్ గౌరీ నిర్వహించేవారు. ఇదిలా ఉండగా సుశాంత్ రెండుసార్లు మాత్రమే దిశను కలిశారని గౌరీ పోలీసులకు తెలిపారు. చదవండి: ‘అమిత్‌షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’ జూన్ 9న 14వ అంతస్తులోని ఫ్లాట్ నుండి దూకి దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె సుశాంత్ మాజీ మేనేజర్ అని వివిధ వార్తా కథనాల ద్వారా తెలిసింది. దీంతో పోలీసులు సుశాంత్‌ను పలు విధాలుగా ప్రశ్నించడంతో ఒత్తిడికి గురై డిప్రెషన్ మందులు వాడటం కూడా ఆపేశాడు. గౌరీ స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు, ఎవరైనా ప్లాన్ చేసి సుశాంత్‌ను బెదిరించడం వల్ల మరణించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. నెగిటివ్ స్టోరీ యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నారు. చాలా మంది అగ్రశ్రేణి బాలీవుడ్ టాలెంట్ మేనేజర్లు, కాస్టింగ్ మేనేజర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పోలీసులు మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. -
ఎంక్వైరి పేరుతో మహిళకు అర్థరాత్రి ఫోన్
చెన్నై: అర్థరాత్రి మహిళకు ఫోన్ చేసి ఎంక్వైరి పేరుతో పిచ్చి వేషాలు వేసిన ఓ పోలీసు అధికారి చేత ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయించారు. వివరాలు.. సదరు పోలీసు తిరుచురాపల్లి సమీపంలోని పెరంబలూర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు ఓ కేసు నిమిత్తం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి సదరు అధికారి ఎంక్వైరి పేరుతో రాత్రి పూట మహిళకు ఫోన్ చేసి అక్కరకు రాని విషయాల గురించి మాట్లాడుతుండే వాడు. కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న మహిళ.. చివరకు సదరు అధికారి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడి మీద గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడంతో పొన్మలై స్టేషన్ నుంచి పెరంబలూర్‌కు బదిలీ చేశారు. ఇక్కడ కూడా అలానే ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు 1977 బ్యాచ్‌కు చెందిన సదరు అధికారి చేత పదవీ విరమణ చేయించారు. -
సుశాంత్ నెలకు ఎంత ఖర్చు చేస్తారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేదని ఆయన మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీ పోలీసుల విచారణలో వెల్లడించారు. 2019 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ శ్రుతి.. సుశాంత్ వద్ద పనిచేశారు. సుశాంత్ నెలకు 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసేవారని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఆయన తన బాంద్రా అపార్ట్‌మెంట్‌కు నెలకు 4.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించేవారని, లొనావాల సమీపంలో లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌కు లక్షల రూపాయల్లో అద్దె చెల్లించేవారని శ్రుతి తెలిపారు. కార్లు, బైక్‌లను అమితంగా ఇష్టపడే సుశాంత్ వద్ద రేంజ్ రోవర్, మాసరెటి వంటి లగ్జరీకార్లతో పాటు బీఎండబ్ల్యూ బైక్ ఉండేదని చెప్పారు. సుశాంత్ నాలుగు ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్నారని సినిమాలతో పాటు ఆయనకు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నటనకు సంబంధించిన కోర్సులపై ఆసక్తి ఉండేదని వెల్లడించారు. తన వర్చువల్ రియాలిటీ ప్రాజెక్టు కోసం సుశాంత్ రెడ్ రియలిస్టిక్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారని, నేషన్ ఇండియా ఫర్ వరల్డ్ అనే ప్రాజెక్టుపై పనిచేయడం ద్వారా సుశాంత్ నాసా, ఇస్రోల గురించి పలు విషయాలు తెలుసుకున్నారని శ్రుతి చెప్పారు. మరోవైపు సుశాంత్ ‘జీనియస్ అండ్ డ్రాపవుట్స్’ అనే ప్రత్యేక సామాజిక ప్రాజెక్టుపైనా పనిచేస్తున్నారని శ్రుతి తండ్రి వెల్లడించారని ఓ వార్తాసంస్థ పేర్కొంది. ప్లానెట్స్, నక్షత్రాలను ప్రేమించే సుశాంత్ ఇంట్లో ప్రత్యేక టెలిస్కోప్ ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: సుశాంత్ మరణం: మరో అభిమాని ఆత్మహత్య -
రెగ్యులర్ విచారణ ఇప్పట్లో కుదరదు
న్యూఢిల్లీ: కోర్టు విచారణలను గతంలో మాదిరిగానే మళ్లీ ప్రారంభించాలన్న న్యాయవాద సంఘాల డిమాండ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా విస్తృతిని పరిశీలించి, జూన్ 30న మరోసారి భేటీ కావాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు సీనియర్ జడ్జీల కమిటీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలో కరోనా నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను కొనసాగించే అవకాశాలపై కమిటీ సమీక్ష జరిపింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ ప్రతిపాదనను కమిటీ తోసిపుచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని స్పష్టం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 30న మరోసారి సమావేశమై, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కమిటీ భావించిందని తెలిపాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆన్లైన్ విచారణలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
మార్చి 26న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్చి 26న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్ పోస్టు లేదా ఈ మెయిల్/ ఫ్యాక్స్ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in, jrlawnhrc@nic.in మెయిల్ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్ చేయవచ్చన్నారు. రిజిస్టర్ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది. -
రాజేంద్రనగర్ పేలుడు ఘటనపై డీసీపీ దర్యాప్తు
-
మాల్యా అప్పీల్‌పై విచారణకు హైకోర్టు ఓకే
లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఊరట లభించింది. మాల్యాను భారత్‌కు అప్పగించే నిర్ణయం తీసుకుంటూ గతంలో బ్రిటన్ హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై మాల్యా చేసుకున్న అప్పీల్‌ను విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది. మాల్యా అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న విషయంపై జస్టిస్ జార్జ్ లెగ్గాట్ట్, జస్టిస్ ఆండ్రూ పాపుల్‌వెల్‌ల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తాము అప్పీల్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మాల్యా తరఫున న్యాయవాది క్లారీ మోంట్‌గోమెరీ వాదనలు వినిపించగా, భారత హై కమిషన్ కార్యాలయ అధికారులు, మాల్యా భాగస్వామి పింకీ లల్వానీ, కొడుకు సిద్ధార్థ్‌లు కూడా కోర్టుకు వచ్చారు. మాల్యా అప్పీల్ పిటిషన్‌ను కోర్టు తదుపరి రోజుల్లో విచారించనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం అప్పు తీసుకుని, బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను బ్రిటన్ పోలీసులు 2017 ఏప్రిల్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన అక్కడే బెయిల్‌పై ఉంటున్నారు. అప్పటి నుంచి మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగానే మాల్యా రుణాలను ఎగ్గొట్టారనడానికి ఆధారాలు ఉన్నాయని గతేడాది డిసెంబర్లోనే లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తేల్చింది. దీంతో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ హోం శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. -
మన్యంలో యాక్షన్ టీం?
సాక్షి, మహబూబాబాద్: కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చాలా రోజుల తరువాత మావోలు వచ్చారనే చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం, చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుంచి నేరుగా జిల్లాలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో మావోయిస్టు యాక్షన్ టీం వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే యాక్షన్ టీం సభ్యులు మండలాల్లో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఇక్కడి ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకున్నారని సమాచారం. యాక్షన్ టీంలు వస్తే ఎందుకు వచ్చారు? ఇన్ఫార్మర్లుగా పనిచేసే వారిని గాని, అధికార పార్టీ నాయకులను గానీ టార్గెట్ చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. టార్గెట్‌గా ఉన్న రాజకీయ నాయకులను, ఇన్ఫార్మర్లను కొద్ది రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, భద్రన్న, ధర్నన్న తదితరులతో కూడిన యాక్షన్ టీం కొత్తగూడ, గంగారం మండలాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దశలో రెండు రోజులుగా పోలీసులు మావోయిస్టు సానుభూతి పరులు, మద్దతు దారులను, అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో మావోల కదలికలతో కలకలం కొనసాగుతోంది. హరిభూషణ్ వచ్చాడా.. గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఆలియాస్ హరిభూషణ్, భద్ర న్న, ధర్మన్నలు వారి యాక్షన్ టీంతో జిల్లాలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గంగారం మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 40మంది మావోలతో కలసి కోమట్లగూడెం, జంగాలపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. ఈ ప్రాంతంలో స్వగ్రామమైన మడగూడెం వస్తున్నాడని, వచ్చి వెళ్లారని రక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.10సంవత్సరాల క్రితం గ ట్టి నిర్భందం సమయంలో పెద్దఎల్లాపూర్ గ్రామంలో ఒక భూ వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర కార్యదర్శి హోదాలో 200మంది మావోలతో గ్రా మాన్ని చుట్టుముట్టి హరిభూషణ్ సమస్యపై ప్రజా దర్భార్ నిర్వహించి సంచలనం సృష్టించారు. కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన హరిభూషణ్ కొత్తగూడకు వచ్చే అవకాశాలు తక్కువనే మరో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ ఎంత వరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ హరిభూషణ్ వస్తే ఎందుకు, ఏ విషయంపై వచ్చాడని, సాధారణంగా అతడు ఈ ప్రాంతానికి రాడు అని సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. కొత్త రిక్రూమెంట్ కోసమేనా..? తెలుగు రాష్ట్రాలలో గతంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి నష్టం చేకూర్చాయి. ప్రపంచీకరణంతో పాటు, పోలీసుల నిఘా పెరగటం, తదితర కారణాలతో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు రిక్రూమెంట్ ఆగిపోయింది. దీంతో పార్టీ బలహీనంగా మారి, మావోయిస్టు ప్రభావం తగ్గిపోయింది. ఈ దశలో తిరిగి నూతన రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టు యాక్షన్ టీం తిరిగి జిల్లాలోకి ప్రవేశించిందా..? లేకపోతే గత కొద్ది రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోడు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఖరీఫ్ సాగు ప్రారంభం కావటం, పోడు సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నా రు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా మావోలు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ దాడుల్లో భూములు కోల్పోయిన వారిని దళంలో చేర్చుకుని బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మావోలు ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఇదే రిక్రూట్మెంట్కు మంచి సమయం అని మావోయిస్టు యాక్షన్ టీం ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించిందని పోలీసులు భావిస్తున్నారు. డేగ కన్నులతో.. యాక్షన్ టీం జిల్లాలో ప్రవేశించిందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. గతంలో పార్టీలో పనిచేసిన వారు, సానూభూతి పరులను విచారిస్తున్నారు. వారి పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ దశలో ఏ క్షణంలో ఏమి జరుగునోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్నాం ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీం ప్రవేశించినట్లు ఎటువంటి సమాచారం లేదు. అలాంటివి అన్ని ఊహాగానాలే. నెల రోజులుగా ఏజెన్సీలో సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే మీ దగ్గరిలోని పోలీసులకు సమాచారం అందించండి. –నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ -
లెక్క తేలాల్సిందే!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై లెక్క తేల్చేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక విద్యా విభాగానికి చెందిన ప్రత్యేక అధికారులతో కూడిన బృందం ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 3,157 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 వరకు సెకండరీ పాఠశాలలు (హైస్కూల్ స్థాయి) ఉన్నాయి. సాక్షి, మచిలీపట్నం: పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా వివిధ రకాలుగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వ శిక్షాభియాన్ విభాగం నుంచి, ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ విభాగం నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు స్కూల్ కాంప్లెక్స్(పాఠశాల సముదాయం)గా గుర్తించిన వాటికి ప్రత్యేకంగా ఏడాదికి సుమారుగా రూ. 20 వేల వరకు నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో స్కూల్ గ్రాంట్, మెయింటినెన్స్ రూపేణా వేర్వేరుగా నిధులు విడుదల చేయగా, 2017–18 విద్యా సంవత్సరంలో ఈ రెండింటినీ కలిపి, విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సెక్షన్లను పరిగణనలోకి తీసుకుని స్కూల్ గ్రాంట్ రూపేణా నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ. 12,500, ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఇచ్చారు. అదేవిధంగా మండల స్థాయిలోని విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ కోసం రూ. 34 వేల నుంచి రూ.50 వేల వరకు మంజూరు చేశారు. ఇవే కాకండా పాఠశాలల్లో స్వచ్ఛభారత్ పేరిట, టీఎల్ఎం మేళా, సైన్స్‌ఫేర్ నిర్వహణ, విద్యార్థులను ఎక్స్కర్షన్ ట్రిప్‌కు తీసుకువెళ్లేందుకు ఇలా వివిధ రకాలుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటిని ఎలా వినియోగించారనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం అధికారులు పరిశీలనకు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ఇలా.. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నూజివీడు. నందిగామ డివిజన్ల వారీగా ఆర్‌ఎంఎస్‌ఏ బృందం సభ్యులు పర్యటించనున్నారు. డివిజన్ కేంద్రాల్లోని ఒక చోట అందుబాటులో ఉంటారు. ఆయా డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తగిన రికార్డులు, నివేదికలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నెల 20న గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్, 21న నూజివీడులోని డెప్యూటీ డీఈఓ కార్యాలయం, 22న విజయవాడ, నందిగామ డివిజన్లకు చెందిన పాఠశాలల రికార్డులను పరిశీలించనున్నారు. రెండు డివిజన్లకు చెందిన ఉపాధ్యాయులంతా విజయవాడలోని పటమట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 24న మచిలీపట్నంలోని ఆర్సీఎం హైస్కూల్లో బృందం అందుబాటులో ఉండి డివిజన్లోని పాఠశాలల నివేదికలను పరిశీలించనున్నారు. సమగ్ర పరిశీలన బ్యాంక్ స్టేట్మెంట్, 2019 మార్చి 31 వరకు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ పాస్ పుస్తకం, నిధుల మంజూరీకి సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర ఉత్తర్వులు సిద్ధం చేసుకొని తీసుకువెళ్లాలి. అదేవిధంగా లావాదేవీలకు సంబంధించిన పుస్తకం, నగదు నిల్వ పుస్తకం, ఇందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకులో కాకుండా చేతిలో ఉన్న నగదు, ఎందుకు నగదు ఉంచుకున్నారనే దానిపై తగిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో చేసిన సివిల్ వర్క్స్ వివరాలు, వాటికి వెచ్చించిన నిధులు, మెజర్మెంట్ (ఎంబుక్) పుస్తకం, పాఠశాల అభివృద్ధి కమిటీ తీర్మానాల పుస్తకం, మిగులు నిధులు బ్యాంకులో చెల్లిస్తే, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విచారణ బృందానికి అందజేయాల్సి ఉంటుంది. వీటిని సమగ్రంగా పరిశీలన చేసి ఆర్‌ఎంఎస్‌ఏ బృందం విద్యా శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మళ్లీ పాఠశాలలకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి సమగ్ర నివేదికలతో ఆడిట్ బృందం ముందు హాజరుకావాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. -
రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ