ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని భూముల కొనుగోలు స్కామ్ వెలుగులోకి తెచ్చినందుకు నలుగురు సాక్షి దినపత్రిక జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. కుంభకోణాలు వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులకు సమన్లు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనంటూ ఐజేయూ ప్రధానకార్యదర్శి దేవులపల్లి అమర్ పీసీఐ చైర్మన్ జస్టిస్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన పీసీఐ పోలీసులను విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. సీఎం పర్యటనను సాకుగా చూపుతూ సోమవారం జరిగిన విచారణకు పోలీసులు హాజరుకాకపోవడంపై జస్టిస్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తర్వాతి విచారణకు పోలీసులు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని పీసీఐ హెచ్చరించింది.