
ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) తెలంగాణలోకి ప్రవేశించింది. తొలి కోవిడ్-19 కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయింది. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల భయాందోళన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ నుంచి ఎవరికి వారు స్వయంగా రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంగళవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.