ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Feb 5th Disha Police stations to be built in Every district says Sucharitha | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Wed, Feb 5 2020 6:54 PM | Last Updated on Wed, Feb 5 2020 7:29 PM

Today Telugu News Feb 5th Disha Police stations to be built in Every district says Sucharitha - Sakshi

అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద మహిళల ఉసురు పోసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ములుగు జిల్లా మేడారంలో జన జాతర మొదలైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో వనాలన్నీ జనమయమయ్యాయి. ఇక, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement