
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇకపోతే, మున్సిపల్ ఎన్నికల విషయంలో కేటీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.