ఆంధ్రప్రదేశ్ శానసమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభకు హాజరైన 133 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇదిలా ఉండగా శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు ఈనాడులో ఆ నిర్ణయాన్ని కీర్తిస్తూ ఎడిటోరియల్స్ రాశారని చెప్పారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ ఓ ఆశ్రమానికి వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. సోమవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment