
ఈయన ఫిబ్రవరి 26న ఖమ్మం వచ్చేందుకు ఎల్బీ నగర్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా..మారుతి కారులో వచ్చిన దారావత్ కవిత, కూర అయ్యన్న అనే ఇద్దరు ఎక్కించుకున్నారు.
ఖమ్మంరూరల్: కారులో లిఫ్ట్ ఇచ్చి మార్గమధ్యంలో విలువైన వస్తువులు దోచుకున్నసంఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను మంగళవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్‌కు చెందిన మట్టయ్య ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్. ఈయన ఫిబ్రవరి 26న ఖమ్మం వచ్చేందుకు ఎల్బీ నగర్‌లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా..మారుతి కారులో వచ్చిన దారావత్ కవిత, కూర అయ్యన్న అనే ఇద్దరు ఎక్కించుకున్నారు.
తల్లంపాడు వద్ద ఆపి కత్తులతో బెదిరించి రెండు చేతి ఉంగరాలు, సెల్‌ఫోన్, రూ.600 దోచుకుని వెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి కొత్తగూడెంలోని సుజాతనగర్‌లో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.