Men Rob Car At Gunpoint In Delhi Pragati Maidan Tunnel - Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..

Published Mon, Jun 26 2023 3:39 PM | Last Updated on Mon, Jun 26 2023 8:25 PM

Men Rob Car At Gunpoint In Delhi Pragathi Maidan Tunnel - Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయారు. 1.5 కిలోమీటర్ల పొడవు  ఉండే ప్రగతి మైదాన్ టన్నెల్‌లో గన్‌తో బెదిరించి దుండగులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుని గుర్‌గ్రామ్ వెళుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నలుగురు యువకులు రెండు బైక్‌లపై వచ్చి టన్నెల్ మధ్య భాగంలో నడి రోడ్డుపై కారును అడ్డగించారు. గన్‌తో బెదిరిపంచి రూ.2 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకుపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 

ఇదీ చదవండి: పిల్లాడి టైమ్‌ టేబుల్‌.. చదువుకు కేటాయించిన టైమ్‌ చూస్తే నవ్వాపుకోలేరు!

ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్‌ సక్సేనాకు చేతకాకపోతే తమకు ఆ బాధ్యతను అప్పగించవలసిందిగా కోరారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. 

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. టన్నెల్‌ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచినట్లు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: వార్నీ..! రద్దీ రోడ్డులో స్కూటీపై ఏడుగురు పిల్లలతో ప్రయాణం..వీడియో వైరల్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement