gunpoint
-
షాప్‌లో వృద్ధుడి నుంచి రూ.లక్ష దోచుకెళ్లిన కేటుగాళ్లు.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన దుకాణం ముందే ఓ వృద్ధుడిని గన్‌తో బెదిరించి రూ.లక్ష దోచుకెళ్లారు. ఢిల్లీలోని విహార్ హర్ష ప్రాంతంలో ఓ షాప్ ఓనర్(70) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి దుకాణాన్ని మూసేశారు. షాప్‌లో ఆ రోజు వచ్చిన లక్ష రూపాయల కలెక్షన్‌ను బ్యాగులో పెట్టుకుని చేతిలో పట్టుకున్నారు. షాప్ ముందే బైక్ మీద కూర్చున్న అతనిపై ఇద్దరు దొంగలు గన్‌తో బెదిరించి దాడి చేశారు. బ్యాగు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video: 70-Year-Old Delhi Man Robbed Of ₹ 1 Lakh At Gunpoint https://t.co/FAi8GKfL0P pic.twitter.com/2EIPqvClY5 — NDTV (@ndtv) June 27, 2023 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి -
రెచ్చిపోయిన దొంగలు.. టన్నెల్లో కారును అడ్డగించి.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయారు. 1.5 కిలోమీటర్ల పొడవు ఉండే ప్రగతి మైదాన్ టన్నెల్లో గన్‌తో బెదిరించి దుండగులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుని గుర్‌గ్రామ్ వెళుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నలుగురు యువకులు రెండు బైక్‌లపై వచ్చి టన్నెల్ మధ్య భాగంలో నడి రోడ్డుపై కారును అడ్డగించారు. గన్‌తో బెదిరిపంచి రూ.2 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకుపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi. If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ — Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023 ఇదీ చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనాకు చేతకాకపోతే తమకు ఆ బాధ్యతను అప్పగించవలసిందిగా కోరారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. టన్నెల్‌ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచినట్లు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! రద్దీ రోడ్డులో స్కూటీపై ఏడుగురు పిల్లలతో ప్రయాణం..వీడియో వైరల్.. -
మహిళ గొలుసును కొట్టేస్తూ కెమెరాకు చిక్కిన దొంగలు: వీడియో వైరల్
ఒక మహిళ గొలుసును బెక్ మీద నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. అందుకు సంబంధించిన సీఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. వీడియోలో..దుకాణం వద్ద ఉన్న ఒక మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తున్నట్లు కనిపిస్తోంది. వారిని చూసి అప్రమత్తమైన మహిళ కేకలు వేస్తూ.. దుకాణం లోపలికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో ఆ వ్యక్తులు ఆ మహిళను తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆ దుకాణంలోని వ్యక్తి ఆమెకు సాయం చేద్దామని ముందుకు వస్తాడు కానీ వారి వద్ద ఉన్న తుపాకీని చూసి భయంతో పారిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ దుండగుల ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Caught On Camera: Thieves Snatch Delhi Woman's Chain At Gunpoint pic.twitter.com/VEX5aGSBAJ — NDTV Videos (@ndtvvideos) April 15, 2023 (చదవండి: విమానం గాల్లో ఉండగా విండ్ షీల్డ్‌కు పగుళ్లు.. సౌదీ ఫ్లైట్ కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..) -
తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, న్యూఢిల్లీ: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు దుకాణంలోకి తుపాకీలతో దూరి యజమానిని బెదిరించారు. దుకాణదారులను గన్‌తో బెదిరించి గల్లాపెట్టెలో ఉన్న నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని ఖేరాఖుర్దు ప్రాంతంలో ఉన్న హర్డ్‌వేర్ దుకాణంలోకి శనివారం ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి తుపాకీలతో దూసుకొచ్చారు. ఏం జరుగుతుందో అర్థం కాక దుకాణ యజమాని నిల్చుండిపోయాడు. నగదు కౌంటర్ వద్ద ఉన్న యజమానికి గన్ షాట్ పెట్టి పక్కకు నెట్టారు. అనంతరం కౌంటర్ తెరచి నగదు తీసుకున్నారు. ఈ దోపిడీపర్వం సీసీ ఫుటేజీలో కనిపించింది. ఆ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ దొంగలు చాలా తెలివితో వ్యవహరించారు. కౌంటర్‌ను టిష్యూ ధరించి తెరవడంతో వారి వేలిముద్రలు గుర్తించడం కష్టంగా మారింది. మాస్క్‌లు, హెల్మెట్ ధరించి వచ్చారు. దీంతో వారిని గుర్తించలేకపోతున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దోపిడీ పాత నేరస్తుల ముఠానే పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
న్యాయవాది తలకు గురిపెట్టిన గన్ ఎవరిది?
హిమాయత్‌నగర్: భూ వివాదంలో న్యాయవాదిపై జరిగిన హత్యాయత్నంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా మలక్‌పేటకు చెందిన వైద్యుడికి, ఓ వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన వ్యవహారంపై వాగ్వివాదం జరిగింది. ఆ భూమి ఎలాగైనా తనకే దక్కాలని మలక్‌పేటకు చెందిన డాక్టర్ మాలిక్.. హిమాయత్‌నగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌సింగ్ చౌదరిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో న్యాయవాది.. ఆ వ్యక్తితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడంటూ డాక్టర్ మాలిక్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. ఫైల్ అడిగి దాడికి యత్నం.. ఈ నెల 16న హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్–7లో నివాసం ఉండే సిద్ధార్థ్‌సింగ్ చౌదరి వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చారు. అపార్ట్మెంట్ వాచ్‌మన్‌కు తాము న్యాయవాదిని కలిసేందుకు వచ్చామని చెప్పి 2వ అంతస్తులోని సిద్ధార్థ్ సింగ్‌చౌదరి వద్దకు మాస్కులు, గ్లౌజులు ధరించి వెళ్లారు. వెళ్లగానే డాక్టర్ మాలిక్ ఫైల్ కావాలని అడిగారు. మీరెవరంటూ న్యాయవాది ప్రశ్నించాడు. ఆలోపే దుండగులు గన్ తీసి న్యాయవాది తలకు గురిపెట్టారు. కత్తులతో పొడిచేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే న్యాయవాది అరుస్తూ.. వారి నుంచి తప్పించుకుని బాల్కనీలోకి పరిగెత్తుకొచ్చాడు. అతడి అరుపులకు అపార్ట్‌మెంట్‌వాసులు, చుట్టుపక్కల వారు రావడంతో.. ఆ ముగ్గురు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల అదుపులో నిందితులు! అప్పటికే సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసేందుకు పాల్పడ్డ దుండగులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు నిందితులు సంఘటనా స్థలానికి కారులో వచ్చారు. ఇద్దరు కారులోనే ఉండగా.. సిద్ధార్థ్ ఇంటిలోకి ముగ్గురు మాత్రమే వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. న్యాయవాది ఇంటి నుంచి 7 బుల్లెట్లు, నాలుగైదు కత్తులను, చిన్నపాటి రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సుపారీ ఇచ్చిన వైద్యుడు ఘటన జరిగిన వెంటనే డాక్టర్ మాలిక్‌పై సిద్ధార్థ్ చౌదరి ఫిర్యాదు చేశారు. డాక్టర్‌కు సంబంధించిన వారే తనపై దాడి చేశారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో డాక్టర్ మాలిక్‌కు, మరో వ్యక్తికి మధ్య వివాదం నడుస్తోందని చోటు చేసుకుంటున్నాయి. ఈ భూమి తనదంటే తనదంటూ.. ఇద్దరి మధ్యా కొంతకాలంగా వాగ్వివాదం జరుగుతోంది. అయితే ఈ కేసులో ఎలాగైనా గెలిచి ఆ భూమి దక్కించుకోవాలని డాక్టర్ మాలిక్.. సిద్ధార్థ్ సింగ్ చౌదరిని ఆశ్రయించారు. అయితే న్యాయవాది, తన ప్రత్యర్థితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడని డాక్టర్ కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని అంతమొందించేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. వైద్యుడిని ఈ కేసునుంచి తప్పించేందుకు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ గన్ ఎవరిది..? ఈ ఘటనలో లభ్యమైన గన్ ఎవరిదనే దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులను దీనిపై ప్రశ్నించగా.. వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా.. ఈ విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేవు. దీంతో సమీపంలోని రెండు కిరాణా దుకాణాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, కారులో ఉన్న మరో ఇద్దరు ఏమయ్యారు.. అసలు ఎందరు అరెస్టయ్యారు..నిందితులను రిమాండ్‌కు పంపారా అనే విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వట్లేదు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! 3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి.. -
పైలట్‌పై ముసుగు దొంగల దాడి
సాక్షి, న్యూఢిల్లీ : విధులకు హాజరవుతున్న పైలట్‌ను తుపాకితో బెదిరించి దోచుకున్న వైనం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఐఐటీ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. కరోనా వైరస్, లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సేవల్లో వున్న సిబ్బందిపై ఇదే ప్రాంతంలో వరుస దోపిడీ ఘటనలు నమోదైనట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్ విమాయాన సంస్థలో పనిచేసే పైలట్ యువరాజ్ సింగ్ తెవాతియా(30) ఫరీదాబాద్ నుంచి ఆఫీసు క్యాబ్‌లో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన సుమారు పదిమంది దుండగులు అడ్డుకున్నారు. తుపాకీతో బెదిరించి యువరాజ్ పర్సులోని సొమ్మును, ఇతర వస్తువులను దోచుకున్నారు. మరింత కావాలని డిమాండ్ చేస్తూ రాడ్లతో దాడికి దిగారు. కారు అద్దాలను పగలగొట్టి, కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో పైలట్ స్వల్పంగా గాయపడగా, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవేందర్ ఆర్య తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. -
దారుణాతి దారుణం.. గ్యాంగ్ రేప్
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు చోచాంగ్ గ్రామానికి వచ్చిన ఓ ఎన్జీఓ బృందానికి చెందిన ఐదుగురు మహిళలపై దుండగులు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. వలసలు, మానవ అక్రమ రవాణాలపై అవగాహన కల్పించేందుకు 11 మంది సభ్యులతో కూడిన ఎన్జీఓ బృందం గ్రామానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దుండగులు బృందంలోని పురుషులను చితకబాది ఐదుగురు మహిళలను సమీప అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి తుపాకీ గురిపెట్టి లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితులను గుర్తించిన పోలీసులు ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ అమోల్ వీ హోంకర్ తెలిపారు. లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు ఘటనపై అధికారులకు తెలియపరచలేదని, తమకు అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. -
‘తుపాకీ గురిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు’
ఇస్లామాబాద్: తలకు తుపాకీని గురిపెట్టి మరీ పాకిస్థాన్ వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ భారతీయురాలు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. తిరిగి తనను మాతృదేశం(భారత్) పంపించే వరకు వెళ్లబోనంటూ స్పష్టం చేసింది. మరోపక్క, ఆమె భర్త మాత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక వర్గాల సమాచారం ప్రకారం ఉజ్మా అనే భారతీయ మహిళకు తాహిర్ అలీ పాక్ వ్యక్తికి మలేషియాలో పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో తన బంధువులను చూసేందుకు వెళుతున్నానని చెప్పి ఉజ్మా వాఘా సరిహద్దు గుండా మే 1న పాక్‌కు వెళ్లింది. అక్కడే వారి వివాహం మే 3న అయినట్లు తెలుస్తోంది. అయితే, అతడికి అంతకు ముందే వివాహం అయినట్లు, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం ఉజ్మాకు తెలియదు. పైగా, కేవలం చూసేందుకు వెళ్లిన తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరించి, తుపాకీ గురి పెట్టి మరి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి శారీరకంగా, లైంగికంగా హింసిస్తున్నాడంటూ భారత హైకమిషనర్‌ను ఆశ్రయించింది. వెంటనే తనను భారత్ పంపించాలని, తన వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ దస్తా వేజులు కూడా వారు దొంగిలించారని ఆరోపించింది. ఈ విషయంపై అటు ఇండియాలోని పాక్ హైకమిషనర్, పాక్‌లోని భారత హైకమిషనర్ సమన్వయ పరుస్తున్నాయి. -
నగల దుకాణంలో తలకు గన్ పెట్టి..
-
నగల దుకాణంలో తలకు గన్ పెట్టి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఓ నగల దుకాణంలో దోపిడిదొంగల అరాచకం సీసీటీవీ ఫొటేజీలో కనిపించింది. మంగళవారం అలాహాబాద్ పట్టణంలోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు.. నగల వ్యాపారి తలకు గన్ పెట్టి బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. పక్కా ప్లాన్‌తో మొహానికి ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు నగల దుకాణంలోకి ప్రవేశించారు. అందులో ఓ వ్యక్తి వ్యాపారి తలకు గన్ పెట్టగా.. మిగతా ఇద్దరు బ్యాగుల్లో ఆభరణాలు నింపుకున్నారు. అనంతరం ముగ్గురూ అక్కడ నుంచి నిమిషాల్లో పారిపోయారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫొటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
టీవీ నటికి తుపాకీతో బెదిరింపులు
పారిస్: హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పారిస్ హోటల్ లో బస చేసిన ఆమెను ఆదివారం ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించారు. పోలీసులు దుస్తులు ధరించి, ముసుగడు వేసుకుని వచ్చిన దుండగులు హోటల్ లోకి చొరబడ్డారని సీఎన్ఎన్ తెలిపింది. ఈ ఘటన జరిగినట్టు కిమ్ కర్దాషియన్ తరపు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ ధ్రువీకరించారు. దుండగులు తుపాకీతో బెదిరించడంతో ఆమె వణికిపోయిందని వెల్లడించారు. అయితే ఆమెకు ఎటువంటి హాని చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిమ్ కర్దాషియన్ నుంచి ఏమైనా దోచుకెళ్లారా, లేదా అనేది వెల్లడి కాలేదు. ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు బుధవారం నుంచి ఆమె పారిస్ లో బస చేశారు. తన భార్యను దుండగులు బెదిరించారన్న వార్త తెలియగానే న్యూయార్క్ సిటీఫీల్డ్ లో మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ లో పాల్గొన్న కిమ్ కర్దాషియన్ భర్త కాన్ యె వెస్ట్ తన ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. కుటుంబ సమస్య కారణంగా ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు తెలిపారు. -
గన్‌పెట్టి డ్యాన్సర్‌పై నలుగురు లైంగిక దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ డ్యాన్సర్‌పై నలుగురు మేనేజర్ స్థాయి ఉద్యోగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరంతా ఓ ప్రముఖ ఆయుర్వేద మందుల కంపెనీకి చెందిన వారని తెలుస్తోంది. లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని బాంథారాలో తమ కార్యాలయానికి సంబంధించి ఓ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సత్యవీర్ సింగ్, దేవ్ రాజ్ సింగ్, రాష్ట్రీయ భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్ధాయి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి అష్ఫాక్ అనే వ్యక్తి ద్వారా పార్టీలో డ్యాన్స్ చేసేందుకు ఓ ట్రూప్ కావాలని కోరాడు. దీంతో ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన బృందంతో వచ్చిన డ్యాన్సర్ అర్ధరాత్రి గడిచే వరకు ఆడిపాడింది. ఇది చూస్తూ పార్టీలో ఉన్నవాళ్లంతా బాగా తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ నలుగురు మాత్రం పీకల దాకా తాగి అక్కడి ఇతర డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో ప్రధాన డ్యాన్సర్ వారిని ప్రశ్నించింది. సత్యవీర్ సింగ్ మాత్రం పేమెంట్ గురించి మాట్లాడుకుందామని ఓ గదిలోకి పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె ఆ గదిలోకి వెళ్లగానే అప్పటికే అందులో ఉన్న ముగ్గురు తలుపు వేశారు. అనంతరం ఆమె తలకు తుపాకీ గురిపెట్టి చంపుతామని బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి నలుగురి అరెస్టు చేసి జైలుకు తరలించారు. వీరంతా లక్నోకు చెందినవారే. -
ఒలింపిక్ హీరోకు దొంగలు గట్టి ఝలక్
రియోడిజనిరో: అతడు ఓ ఒలింపిక్ హీరో.. కానీ.. ముగ్గురు దొంగలముందు మాత్రం జీరో అయ్యాడు. మారు వేషాల్లో వచ్చిన దొంగలు తాము పోలీసుల మని చెప్పి గట్టి ఝలక్ ఇచ్చారు. ఆ ఒలింపిక్ హీరోను మరో ముగ్గురు ఒలింపిక్ అథ్లెట్లను దోచుకున్నారు. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి దొంగలు ఈ పని చేశారు. అసలే బ్రెజిల్ దోపిడీలకు అడ్డా అని ముందుగానే అందరికీ తెలిసిందే. అమెరికన్ స్విమ్మర్ రియా లోక్టే.. తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో అప్పుడే ఓ బంగారు పతకాన్ని తన ఖాతాలో కూడా వేసుకున్నాడు. ఈ గేమ్ ముగిసిన వెంటనే మరో ముగ్గురు అథ్లెట్లతో కలిసి ఓ రెస్టారెంట్ లో పార్టీకి వెళ్లిన అతడు ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగొస్తుండగా అనూహ్యంగా వారి కారును ముగ్గురు వ్యక్తులు ఆపేశారు. వారంతా పోలీసులు దుస్తుల్లో ఉన్నారు. ఆ రియన్ తో సహా ముగ్గురుని గ్రౌండ్‌పై మోకరిల్లమని బెదిరించారు. మిగితా ముగ్గురు అలా చేయగా తాను ఏం తప్పు చేయలేదని, ఎందుకు మొకాళ్లపై నిల్చోవాలని రియాన్ ప్రశ్నించాడు. దీంతో ఆ దొంగ పోలీసుల్లో ఒకరు రియాన్ తలకు తుపాకీ గురిపెట్టారు. అనంతరం వారి పర్సులను తీసుకొని ఉడాయించారు. ఈ సీన్ రియాన్ కు చెమటలు పట్టించింది. వారి ఏం చేయకుండానే వెళ్లడంతో హమ్మయ్య అనుకొని బయల్దేరారు. జరిగిన ఘటనను పోలీసులకు వివరించారు. -
పెన్ పేరిట మహిళకు గన్ పెట్టి..
నోయిడా: పట్టపగలే గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి సర్వం దోచారు. ఇంట్లోని మహిళ కణతకు తుపాకీ గురిపెట్టి విలువైన వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లారు. సహాయం కోసం చుట్టుపక్కలవారిని పిలిచే ప్రయత్నం చేయగా ఆమెను పిచ్చికొట్టుడు కొట్టి వెళ్లారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. బదల్పూర్ లోని డిఫెన్స్ ఎన్క్లేవ్ ప్రాంతంలో రాజ్ హన్స్ శర్మ అనే వ్యక్తి ఇంట్లోకి శుక్రవారం ఉదయం 11గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. అందులో ఓ వ్యక్తి తలుపు తీయాలని అలారం కొట్టాడు. అశోక్ ఎవరో తమకు తెలియదని ఆమె చెప్పగా తన భర్తకు తెలుసని పెన్ను కావాలని అడిగాడు. పెన్నును ఆమె డోర్ తీయకుండా డోర్ కింద నుంచి ఇచ్చింది. ఆ తర్వాత నోట్ బుక్ కావాలని అడిగారు. అయితే, నోట్ బుక్ కూడా అలాగే ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా అది రావడం లేదన్నట్లు వారు నటించారు. ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి డోర్ కొంచెం ఓపెన్ చేసి ఇచ్చేటట్లుగా చేశారు. ఆమె అలా డోర్ లాక్ ఓపెన్ చేసిందో లేదో వెంటనే దబాళ్లుమని లోపలికి తోసుకొచ్చి ఆమెకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టారు. అనంతరం మరో ఇద్దరు దొంగలు సర్వం దోచుకున్నారు. ఆమె అరిచే ప్రయత్నం చేయడంతో బాగా కొట్టి పోయారు. -
టీచర్ పై గ్యాంగ్ రేప్
లక్నో: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన మరకముందే ఉత్తరప్రదేశ్ లో మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బరేలిలోని 24వ హైవేకు సమీపంలో మంగళవారం జరిగింది. పాఠశాలకు వెళుతున్న టీచర్ ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఈ దురాగతాన్ని వీడియో తీశారు. దీని గురించి ఎక్కడైనా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాధితురాలిని బెదిరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేశ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. -
మేయర్ కు గన్ గురిపెట్టి...
శాన్ఫోర్డ్: నగర మేయర్‌నే బెదిరించి కారు ఎత్తుకు పోయారు దుండగులు. అమెరికాలోని శాన్ఫోర్డ్ నగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెల్లవారుజామున తన ఇంటి ముందు నిలుచున్న శాన్ఫోర్డ్ నగర్ మేయర్ జెఫ్ ట్రిప్లెట్ వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ఇద్దరు తుపాకీని మేయర్ కు గురిపెట్టి బెదిరించారు. మరొకడు కారు తాళాలు తీసుకున్నాడు. తర్వాత ముగ్గురు కలిసి మెర్సిడెజ్ బెంజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గురించి జెఫ్ ట్రిప్లెట్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన పోలీసులు జెర్మైన్ జాక్వెస్(18)తో పాటు 17 ఏళ్ల వయసున్న మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి ప్రథమ పౌరుడినైన తన కారునే దొంగిలించడం పట్ల జెఫ్ ట్రిప్లెట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. -
పఠాన్‌కోట్‌లో మరో కారు.. అలాగే దోపిడీ!
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జల్లాలో మళ్లీ కలకలం రేగింది. ఉగ్రదాడి సమయంలో తుపాకి చూపించి ఓ ఎస్పీ కారు ఎత్తుకెళ్లినట్లే.. ఈసారి ఓ పౌరుడిని తుపాకితో బెదిరించి అతడి కారును కొంతమంది సాయుధులు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి పఠాన్‌కోట్ జిల్లాలోని సుజన్పూర్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈసారి మాత్రం జరిగిన ఘటనలో ఉగ్రకోణం ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా జిల్లాలో హై ఎలర్ట్ ప్రకటించారు. ఫోర్డ్ ఫిగో కారులో వెళ్తున్న వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు ఆపారని, అతడిని తుపాకితో బెదిరించి బలవంతంగా కిందకు దించారని పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వాళ్లలో ఇద్దరు కారులో పారిపోగా మూడో వ్యక్తి మోటారు సైకిల్‌పై వెళ్లాడన్నారు. పఠాన్‌కోట్ - జమ్ము హైవే మీద పఠాన్‌కోట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే సుజన్పూర్ నగరం ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కారు దోపిడీ ఘటనను కూడా భద్రతాదళాలు తీవ్రంగానే పరిగణిస్తున్నాయి. -
తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఐదుగురు దుండుగులు పదో తరగతి విద్యార్థిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరూ ఆ అమ్మాయికి తెలిసినవారే. వారం రోజుల క్రితం బాధితురాలు స్కూల్‌కు వెళ్తున్న సమయంలో నిందితులు ఓ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. మొబైల్ ఫోన్లో వీడియా తీశారు. ఈ సంఘటన గురించి బయటకే చెప్పరాదంటూ తుపాకీతో ఆ అమ్మాయిని బెదిరించారు. బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తుపాకీ, ఫోన్ రికార్డును కూడా స్వాధీనం చేసుకోవాల్సివుంది. -
తుపాకితో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం
దేశరాజధానిలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెకు తెలిసున్న ఐదుగురు కలిసి తుపాకి చూపించి బెదిరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలిక వారం రోజుల క్రితం స్కూలుకు వెళ్తుండగా, దారిలో అటకాయించిన నిందితులు పశ్చిమ ఢిల్లీలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. నిందితులు ఐదుగురిలో ముగ్గురు మైనర్లు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను తుపాకితో బెదిరించినట్లు బాలిక తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. అత్యాచారం సంఘటనను నిందితులు సెల్ఫోన్లో రికార్డు చేశారని కూడా బాధితురాలు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం నిందితుల వద్ద తుపాకి ఏమీ దొరకలేదు. తనకు ఒంట్లో బాగోలేదని బాలిక వారం రోజుల తర్వాత చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడు తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని, 20 ఏళ్ల నిందితుడిని వాళ్ల ఇంట్లోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. -
తుపాకీతో బెదిరించి యువతిపై అత్యాచారం
ముజఫర్‌నగర్: తుపాకీతో బెదిరించి సోదరుడి ముందే ఓ యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రన్‌పూర్ జిల్లాలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు తన సోదరుడితో కలిసి సహ్రన్‌పూర్ నుంచి కర్నాల్ వెళ్తోంది. మార్గమధ్యంలో లిఫ్ట్ అడిగి వారు ఓ వాహనంలో ఎక్కారు. అయితే అందులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని దారి మళ్లించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. సోదరుడిని నిర్బధించి, తుపాకీతో బెదిరించి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి అక్కడ్నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ ధర్మేందర్ సింగ్ చెప్పారు.