ఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్‌లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన దుకాణం ముందే ఓ వృద్ధుడిని గన్‌తో బెదిరించి రూ.లక్ష దోచుకెళ్లారు.
ఢిల్లీలోని విహార్ హర్ష ప్రాంతంలో ఓ షాప్ ఓనర్(70) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి దుకాణాన్ని మూసేశారు. షాప్‌లో ఆ రోజు వచ్చిన లక్ష రూపాయల కలెక్షన్‌ను బ్యాగులో పెట్టుకుని చేతిలో పట్టుకున్నారు. షాప్ ముందే బైక్ మీద కూర్చున్న అతనిపై ఇద్దరు దొంగలు గన్‌తో బెదిరించి దాడి చేశారు. బ్యాగు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
Video: 70-Year-Old Delhi Man Robbed Of ₹ 1 Lakh At Gunpoint https://t.co/FAi8GKfL0P pic.twitter.com/2EIPqvClY5
— NDTV (@ndtv) June 27, 2023
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి
Comments
Please login to add a commentAdd a comment