rupees
-
అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?
అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు.రామ్‌లల్లా ఆలయానికి భూమి పూజ 2020, ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుండి రామభక్తులు ఆలయ నిర్మాణానికి రూ. 55 వేలకోట్లకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్‌లో రామమందిర్ ట్రస్ట్ దాదాపు రూ. 3500 కోట్ల విరాళాలను అందుకుంది. గడచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు.రామమందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్టు 10 వేల రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి. 2024 జనవరి 22న రామాలయంతో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి రామ భక్తులు ప్రతిరోజూ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్ల మందికి పైగా రామ భక్తులు ఆలయాన్ని సందర్శించారు. వీరు విరాళాలతో పాటు బంగారు, వెండి కానుకలను కూడా అందజేస్తున్నారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం రామభక్తులు ఇప్పటి వరకు ఐదువేల కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. విదేశాలలో ఉంటున్న రామభక్తులు కూడా ఉత్సాహంగా విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రామమందిర్ ట్రస్ట్ విదేశాల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. -
ఢిల్లీ బడ్జెట్: మహిళలకు కేజ్రీవాల్ మరో కానుక
దేశరాజధాని ఢ్లిలీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతీనెలా రూ. 1,000 అందుకోకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా పలు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని అతిషి ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా ‘అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. #WATCH | Delhi Finance Minister Atishi reaches the Vidhan Sabha ahead of the Budget presentation. pic.twitter.com/73fBsKG9a9 — ANI (@ANI) March 4, 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అతిషి మర్లెనా మాట్లాడుతూ.. ‘రామరాజ్యంలో తదుపరి అడుగు మహిళల భద్రత. మహిళల అవసరాలను తీర్చడంలో ముందున్నందుకు గర్వపడుతున్నాం. ఉచిత విద్యుత్తు, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం మొదలైనవి చేపట్టాం. 2014తో 2024ను పోల్చినప్పుడు మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించాం’ అని అన్నారు. #DelhiBudget | "In 2014, the per capita income of Delhi was Rs 2.47 lakhs and today the per capita income of Delhi has reached 4.62 lakhs which is two and a half times more than the national average...Today, I am going to present a budget of Rs 76,000 crores," says Delhi Finance… pic.twitter.com/RMjQlA9EMA — The Times Of India (@timesofindia) March 4, 2024 ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి అతిషి ప్రతిపాదించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అతిషి అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 933 మంది బాలికలు నీట్లో ఉత్తీర్ణత సాధించగా, 123 మంది బాలికలు జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. -
ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?
ఓ మహిళకు సంబంధించిన విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. జేస్ ఎల్లీస్ అనే మహిళ ఒకటో, రెండు కాదు ఏకంగా 13 బొమ్మలను తన పిల్లల మాదిరిగా సాకుతుంది. ఆమె ప్రతిరోజూ ఆ బొమ్మల డైపర్లను మారుస్తుంది. ఆ బొమ్మలను బయటకు తీసుకెళ్లి ఆడిస్తుంది. ఆమె చేస్తున్న ఈ పనిలో ఆమెకు కాబోయే భర్త కూడా సహాయం చేయడం మరింత విచిత్రం. తూర్పు లండన్‌లోని ప్లాస్టోలో ఉంటున్న ఆ మహిళ పేరు జేస్ ఎల్లీస్. ఆమె వయస్సు 27 ఏళ్లు. ఆమె వృత్తిరీత్యా హెచ్ఆర్ బిజినెస్ పార్టనర్. ది సన్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో జేస్ ఎల్లీస్ ఒంటరితనానికి గురయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఆన్లైన్లో కొన్ని రీబోర్న్ బొమ్మలను చూసింది. అవి అచ్చం పిల్లల్లాగే ఆమెకు కనిపించాయి. 2020, మే నెలలో ఆమె అలాంటి అనేక బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. ఇలా ఆమె 13 బేబీ డాల్స్‌కి తల్లిగా మారింది. ఈ విధంగా బొమ్మలను కొనుగోలు చేయడం తనను పేరెంట్‌హుడ్‌కి సిద్ధం చేస్తుందని జేస్ తెలిపింది. జేస్ తొలుత రెబెక్కా అనే బొమ్మను కొనుగోలు చేసింది. ఇది ఒక నెల వయసు కలిగిన రీబోర్న్ బొమ్మ. ఆమె దానిని 250 యూరోలకు కొనుగోలు చేసింది. అనంతరం ఆమె షామ్, బ్రూక్లిన్, జాన్, లిల్లీ, అన్నలీస్, అరియా, కుకీ, చార్లీ, పిప్పా, జూన్‌తో సహా మరో రెండు బేబీ బొమ్మలను కొనుగోలు చేసింది. ఈ బొమ్మలను కొనుగోలు చేసేందుకు ఆమె £6,000 (రూ. 6 లక్షల 18 వేలకు పైగా) వెచ్చించింది. ఆమె దగ్గరున్న అత్యంత ఖరీదైన బొమ్మ కుకీ, ఆమె దానిని £1,700కి కొనుగోలు చేసింది. ఆమెకు కాబోయే భర్త అవేరీ రాసెన్ పేస్ట్రీ చెఫ్ ఆమె అభిరుచికి సాయం అందిస్తున్నారు. ఆమె దగ్గరున్న బేబీ బొమ్మలకు దుస్తులు ధరింపజేయడంలో, వాటి డైపర్లను మార్చడంలో ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది కూడా చదవండి: డబ్బున్న భర్త దొరకాలన్న ఆమె కోరిక ఎలా తీరింది? అందుకోసం ఏం చేసింది? -
హృదయాల్ని కదిలించే ఘటన: మళ్లీ ఆడబిడ్డే! రూ.800 తీసుకుని..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రెండవసారి కూడా కూతురు పుట్టడంతో ఆ తల్లి ఆ నవజాత శిశువుకు రూ.800కు అమ్మేసింది. ఈ విషయం ఆ నవజాత శిశువు తండ్రికి తెలియగానే, అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. నవజాత శిశువును విక్రయించిన ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన మయూర్భంజ్ జిల్లా ఖూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులియా గ్రామంలో చోటుచేసుకుంది. పేదరికంలో మగ్గిపోతున్న ఆ తల్లి రెండవసారి కూడా తనకు కుమార్తెనే పుట్టడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది. దీంతో ఆమె రూ.800కు ఆ శిశువును ఒక దంపతులకు విక్రయించింది. ఈ విషయం తమిళనాడులో ఉంటున్న ఆమె భర్తకు తొలుత తెలియలేదు. తనకు రెండవసారీ కుమార్తెనే పుట్టడంతో ఆ తల్లి ఈ విషయమై ముర్ము అనే వ్యక్తితో చర్చించింది. అతను ఆ నవజాత శిశువును రూ. 800కు విక్రయించేందుకు ఒక దంపతులతో మాట్లాడాడు. ఇంతలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. అతను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను తమిళనాడు నుంచి వచ్చే సరికి తన చిన్న కుమార్తె ఇంటిలో లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో తన భార్యను ప్రశ్నించగా జరిగిన సంగతంతా తెలిపిందన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి, ఈ ఉదంతంతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో శిశువును విక్రయించినవారు, కొనుగోలు చేసినవారు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇది కూడా చదవండి: హనీమూన్‌లో భర్తకు షాక్.. సినిమా మధ్యలో భార్య పరార్! -
షాప్‌లో వృద్ధుడి నుంచి రూ.లక్ష దోచుకెళ్లిన కేటుగాళ్లు.. వీడియో వైరల్..
ఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై కేటుగాళ్లు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్లో కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయిన ఉదంతం మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన దుకాణం ముందే ఓ వృద్ధుడిని గన్‌తో బెదిరించి రూ.లక్ష దోచుకెళ్లారు. ఢిల్లీలోని విహార్ హర్ష ప్రాంతంలో ఓ షాప్ ఓనర్(70) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్లడానికి దుకాణాన్ని మూసేశారు. షాప్‌లో ఆ రోజు వచ్చిన లక్ష రూపాయల కలెక్షన్‌ను బ్యాగులో పెట్టుకుని చేతిలో పట్టుకున్నారు. షాప్ ముందే బైక్ మీద కూర్చున్న అతనిపై ఇద్దరు దొంగలు గన్‌తో బెదిరించి దాడి చేశారు. బ్యాగు లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video: 70-Year-Old Delhi Man Robbed Of ₹ 1 Lakh At Gunpoint https://t.co/FAi8GKfL0P pic.twitter.com/2EIPqvClY5 — NDTV (@ndtv) June 27, 2023 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దోషులకు కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: దొంగలకు ఊహించని అనుభవం.. పైసలు దొరక్క.. తిరిగి రూ. 100 చేతిలో పెట్టి -
ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షల అందుకోండి!
ఎవరైనా మీకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తూ, వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో సొమ్ము ఇస్తామంటే కాదంటారా? నిజంగా ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే. అటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సుదూరతీరంలో ఉన్న ఐలాండ్లలో నివసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. అక్కడి నివసించేందుకు ఆసక్తి చూపేవారికి భారీ మొత్తంలో సొమ్ము అందిస్తోంది. జూలై 1 నుంచి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వీడి రిమోట్ ఐలాండ్‌లో ఉండాలనుకునేవారికి రూ. 70 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రద్దీ ప్రాంతాలను వీడి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండాలనుకునేవారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఫథకానికి ఐర్లాండ్ ప్రభుత్వం ‘అవర్ లివింగ్ ఐలాండ్ పాలసీ’ అని పేరు పెట్టింది. మెట్రో యూకే రిపోర్టును అనుసరించి ఇప్పటి వరకూ మొత్తం 23 ఐలాండ్లను ఇందుకోసం సెలెక్ట్ చేశారు. ఆయా ఐలాండ్లలో ఉండేందుకు జనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐలాండ్లు రద్దీ ప్రాంతాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి కోసం ప్రభుత్వం ఇళ్లు, భూములు ఇవ్వడంతోపాటు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకునేందుకు లక్షల రూపాయలు అందజేస్తోంది. ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే.. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని వారు వివిధ కారణాలతో పట్టణాలకు వలస వెళుతున్నారు. ఫలితంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ఇళ్లు, రోడ్లు వృథాగా మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐలాండ్లకు వెళ్లేందుకు సుముఖత చూపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 1993కు ముందు నిర్మించిన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రభుత్వం అందించే సొమ్మును ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ప్రతీ ఐలాండ్‌లో నివసించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. వాటిని అక్కడ ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఐలాండ్లలో నివసించేందుకు విదేశీయులకు ఏమాత్రం అనుమతి లేదు. కాగా ఈ విధానం ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయడం లేదు. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి అద్భుత ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్, ఇటలీ, చిలీ, మారిషస్, గ్రీస్, క్రొయేషియా మొదలైన దేశాలున్నాయి. ఈ దేశాలు శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడేవారికి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. -
కుప్పలుగా పోగయిన భారత్ కరెన్సీ! దిక్కుతోచని స్థితిలో రష్యా
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా వద్ద కుప్పకుప్పలుగా భారత్ కరెన్సీ వచ్చి పడింది. దీంతో ఏం చేయాలో తెలియడం లేదంటూ రష్యా గగ్గోలు పెడుతోంది. ఆ కరెన్సీని తాము ఉపయోగించుకోలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. తమ వద్ద బిలయన్ల కొద్దీ భారత్ కరెన్సీ ఉందని, అది తమకు సమస్యగా మారిందని సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఈ రూపాయలను మరొక కరెన్సీలలో బదిలీ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి 11 నెలల్లో రష్యాకు భారత్ మొత్తం ఎగుమతులు 11.6% తగ్గి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐతే దిగుమతులు దాదాపు ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకించింది. ఐతే రష్యా అనుహ్యంగా రిఫైనరీ రాయితీ ఇవ్వడంతో దిగుమతుల్లో ఒక్కసారిగా పెరుగుదల వచ్చింది. ఈ మేరకు డేటా ఇంటిలిజెన్స్ సంస్థ వొర్టెక్సా లిమిటెడ్ ప్రకారం.. భారత్ రష్యా క్రూడ్ దిగుమతులు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 1.68 మిలియన్ బారెళ్లకు చేరుకున్నాయి. అదీగాక రష్యా యద్ధం కారణంగా బ్యాంకులపై ఆంక్షలు, స్విఫ్ట్ ఉపయోగించే లావాదేవీల నిషేధం తదితర కారణాల రీత్యా రష్యా భారత్‌ని తమ కరెన్సీలలో వ్యాపారం చేయమని ప్రోత్సహించింది. కానీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూబుల్లో అస్థిరత ఏర్పడింది. ఒక పక్క భారత్ తమ కరెన్సీతో కొనుగోళ్లు చేయడంతో రష్యాలో ఉపయోగించలేని కరెన్సీ ఏకంగా పదివేల బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ అలెగ్జాండర్ నోబెల్ అన్నారు. దీంతో రష్యన్ ఎగుమతిదారులు ఆ రూపాయలను స్వదేశానికి తీసుకురావడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్యాంక్ ఆఫ్ రష్యా గవర్నర్ ఎల్విరా నబియుల్లినా తెలిపారు. మరోవైపు అమెరికా ఆంక్షాలను ఉల్లంఘించని చెల్లింపు విధానం లేకపోవడంతో రష్యాకు రక్షణ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ తరణంలో భారత్ రష్యాకి అతిపెద్ద సైనిక ఆయుధాల సరఫరాదారుగా నిలిచింది. వాస్తవానికి రష్యా కొనుగోళ్లకు రూపాయలను అంగీకరించడానికి ఇష్టపడుదు కానీ యుద్ధ నేపథ్యంలో భారత్ మాత్రమే రష్యా చమురును, ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో మాస్కోకు ఈ రూపాయల చిక్కు వచ్చి పడింది. ఐతే దీన్ని చమురు శుద్ధి సంస్థలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు, రూబిళ్లు, రూపాయిలు ఉపయోగించి ముడి చమురు రాయితీ చెల్లింపులతో పరిష్కిరించుకునేందకు రష్యా యత్నిస్తోంది. (చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం..10 నిమిషాల పాటు 141 కి.మీ చక్కర్లు..!) -
ఎక్కడ..2 వేల నోట్లు ..?
-
డాలర్ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా?
కొద్దిరోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ దేశ కరెన్సీని అయినా అమెరికన్ డాలర్‌తోనే పోల్చుతుంటారు. అందువల్ల డాలర్ అంటే బాగా విలువైన కరెన్సీ అనే భావన ఉండిపోయింది. నిజానికి అమెరికన్ డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలు దాన్ని ఆమోదిస్తాయి. డాలర్లలోనే ప్రపంచ వాణిజ్యం జరుగుతుంటుంది కూడా. అందుకు ప్రతి కరెన్సీని, వాణిజ్యాన్ని డాలర్లతో పోల్చుతూ, లెక్కవేస్తూ ఉంటారు. అయితే, డాలర్ కన్నా విలువైన కరెన్సీలు కూడా ఉన్నాయి. దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, జీడీపీ, అభివృద్ధి రేటు వంటి అంశాల ఆధారంగా వాటి కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిదేశాల కరెన్సీ విలువ డాలర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక్క కువైట్ దినార్‌కు 3.26 అమెరికన్ డాలర్లు వస్తాయి. అంటే రూ.270 అన్నమాట. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దేశాలన్నీ చమురు ఉత్పత్తితో సంపన్నంగా మారినవి, పారిశ్రామిక విప్లవంతో అభివృద్ధి చెందినవే కావడం గమనార్హం. కువైట్ దినార్ కంటే కూడా విలువైన కరెన్సీ ఒకటి ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండే గుర్తింపులేని ఓ చిన్నదేశం (మైక్రోనేషన్) ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గా’కు చెందిన సెబోర్గన్ ల్యూగినో కరెన్సీ అది. ఈ కరెన్సీని స్థానికంగా లావాదేవీలకు, బ్యాంకుల్లో వినియోగిస్తారు. బయట ఎక్కడా చెల్లదు. ఇక్కడి బ్యాంకుల్లో కరెన్సీ మార్పిడి విలువ ప్రకారం.. ఒక్కో సెబోర్గన్ ల్యూగినోకు ఆరు డాలర్లు ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ.498 అన్నమాట. ఒక డాలర్‌కు 42,350 ఇరాన్ రియాల్లు ప్రపంచంలో అత్యంత తక్కువ విలువైన కరెన్సీ ఇరాన్ రియాల్. ఒక డాలర్‌కు ఏకంగా 42,350 ఇరాన్ రియాల్స్ వస్తాయి. మన కరెన్సీతో పోల్చితే.. ఒక్క రూపాయికి 510 ఇరాన్ రియాల్స్ వస్తాయి. నిజానికి భారీగా చమురు ఉత్పత్తి చేసే ఇరాన్.. ఇతర దేశాల్లా సంపన్నంగా మారి ఉండేది. కానీ ఆ దేశంలో రాజకీయ అనిశి్చతి, అణు ప్రయోగాల వల్ల ఆర్థిక ఆంక్షల వల్ల పరిస్థితి దారుణంగా మారింది. -
ఇక ‘రూపీ’లోనూ విదేశీ వాణిజ్యం!
ముంబై: భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా గుర్తించే దిశగా కీలక అడుగు పడింది. వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్మెంట్ (నిర్వహించేందుకు) చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. తాజా చర్య భారతదేశం నుండి ఎగుమతులకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడానికి అలాగే రూపాయిపై గ్లోబల్ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దాదాపు 6 శాతం కరిగిపోయిన రూపాయికి మద్దతును ఇవ్వడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే దేశం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ దిశలో తాజాగా అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి భారత్ రూపాయి పట్ల విశ్వాసం పెరగడానికి కీలకచర్య తీసుకుంది. లాభం ఏమిటి? కొన్ని దేశాలతో వాణిజ్యం కోసం అమెరికా డాలర్ వంటి ప్రపంచ కరెన్సీని ఉపయోగించకుండా, ప్రత్యామ్నాయ మార్గాన్ని భారత్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు, ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యాకు డాలర్ అందుబాటును అమెరికా తగ్గించింది. ఇది రష్యన్ వస్తువుల తక్కువ ధరను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న భారతీయ కంపెనీలను... దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులవైపు చూసేలా చేసింది. కొత్త యంత్రాంగం పనితీరు ఇలా... కొత్త సెటిల్మెంట్ యంత్రాంగం ప్రకారం, ఎగుమతులు– దిగుమతులు రెండు వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల మధ్య మార్కెట్ నిర్ణయించబడే మారకపు రేటుతో రూపాయిలో డినామినేట్ అవుతాయి. ఈ మేరకు ఇన్వాయిస్ రూపొందుతుంది. ఈ వాణిజ్య ఒప్పందాల సెటిల్మెంట్కు అధీకృత భారతీయ బ్యాంకులు భాగస్వామి ట్రేడింగ్ దేశంలోని ఆ దేశ అధీకృత బ్యాంకులో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరవాలి. ఈ యంత్రాంగాన్ని ఉపయోగించే భారతీయ దిగుమతిదారులు రూపాయల్లో చెల్లించాలి. ఈ మొత్తాలు వస్తువులు లేదా సేవల సరఫరాలకు సంబంధించి ఇన్వాయిస్లకుగాను భాగస్వామి దేశం కరస్పాండెంట్ బ్యాంక్ ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోకి జమ అవుతాయి. మరోవైపు భారతీయ ఎగుమతిదారులు, భాగస్వామి దేశం కరస్పాండెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోని బ్యాలెన్స్ నుండి రూపాయలలో తమ డబ్బును పొందుతారు. ఈ విధానం కింద భారతీయ ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులను కూడా రూపాయిల్లో పొందవచ్చు. అయితే, అటువంటి ముందస్తు చెల్లింపు చేయడానికి ముందు, బ్యాంకులు సంబంధిత ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులను ముందుగా అమలు చేసిన ఎగుమతి ఆర్డర్ల కు చెల్లింపులు చేయడానికి ఉపయోగించాలి. ఆపై నిధులనే పరస్పర అవగాహన మేరకు ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులుగా వినియోగించాలి. 80 దిశగా రూపాయి... డాలర్ మారకంలో రూపాయి పతన రికార్డు ఆగడం లేదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం 19 పైసలు పతనంతో 79.45కు క్షీణించింది. ఒక దశలో 79.50ని కూడా చూసింది. రూపాయికి ఈ రెండు స్థాయిలూ చరిత్రాత్మక కనిష్టాలు. అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్, దేశం నుంచి విదేశీ పెట్టుబడుల వరద, క్రూడ్ ఆయిల్ ధరల అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు వంటి పలు అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. -
రేషన్‌షాపుల్లో డబ్బుల పంపిణీ
* బియ్యం ఇవ్వకండా డబ్బులు పంచుతున్న డీలర్లు * టీడీపీ నేత ఆధ్వర్యంలో బియ్యం రాకెట్ * లబోదిబోమంటున్న పేదలు పేద, బడుగు, బలహీనులకు ఆహారభద్రత కల్పించేందుకు వారికి కేజీ రూపాయికే అందజేస్తున్న రేషన్ బియ్యం అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు వరమైంది. రేషన్ డీలర్ల రూపంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు షాపుల నుంచే పేదల బియ్యంకు అధికరేటు ఇచ్చి నల్లబజారుకు తరలిస్తున్నారు. కొంతమందికి నెలల తరబడి ఇవ్వకపోగా, మరికొంతమంది బియ్యంకు బదులు కేజీకి రూ.6 నుంచి రూ.7 రేటు కట్టి డబ్బులను పంపిణీచేస్తున్నారు. నరసరావుపేట(గుంటూరు): జిల్లా మొత్తం 57 మండలాల్లో 2731 షాపులు ఉండగా, .నరసరావుపేట ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో ఐదు మండలాలలకు సంప్రందించి 230 మంది డీలర్లు ఉన్నారు. ప్రతి నెలా 1500 టన్నులు బియ్యం, 49టన్నుల పంచదార పంపిణీ చేయాల్సివుంది. నియోజకవర్గంలో ఎక్కడా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ కావట్లేదు. ఏషాపునకు ఇది రేషన్ షాపు అంటూ బోర్డులు ఉండవు.ప్రతి డీలర్ వద్ద 250 కార్డుల నుంచి 700 కార్డులవరకు ఉన్నాయి. కార్డులను బట్టి ఇద్దరు, ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు షాపులను కేటాయించారు. వారందరూ ప్రతి నెలా తమకు ఇష్టమైతే రేషన్‌షాపు తీస్తున్నారు, నోరు కలిగిన వారికి బియ్యం ఇస్తున్నారు. అడగలేనివారికి ముందుగానే వేలిముద్రలు సేకరించి రేపు రండి అంటూ స్లిప్‌లు ఇచ్చి ఇక ప్రతిరోజూ రేపు అని షాపుల చుట్టూ తిప్పుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సమస్యతో ఐరిస్, వేలిముద్రలు పడడంలేదంటూ పదే పదే షాపుల చుట్టూ తిప్పుతూ లబ్ధిదారులను విసుగెత్తించి వారికి డబ్బులు తీసుకునేలా డీలర్లు ప్రోద్భలం చేస్తున్నారు. పట్టణంలోని వరవకట్టలో ఇద్దరు డీలర్లు రెండు నెలలుగా తమకు రేషన్ ఇవ్వట్లేదంటూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలు వినాయకచవితిరోజు మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లను కలిసి మొర పెట్టుకున్నారు. పాతూరు శివాలయం ఎదురు వీధిలోని డీలర్ ఒకరు గత నెల 29వ తేదీ నుంచే తన ద్విచ్రకవాహనంపై ట్రిప్పుకు ఒక బస్తా రేషన్ బియ్యంను నల్లబజారుకు తరలించాడని స్థానికులుతెలియచేస్తున్నారు. టీడీపీ ముఖ్య కార్యకర్త నిర్వహిస్తున్న షాపును పట్టణ శివారులో నిర్వహిస్తూ ప్రతినెలా ఠంచన్‌గా లబ్దిదారులను మాయచేస్తూ సరుకును నల్లబజారుకు తరలిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పెట్లూరివారిపాలెం కేంద్రంగా నడుస్తున్న రాకెట్.. బియ్యం రాకెట్‌కు మళ్లీ నియోజకవర్గంలో తెరలేచింది. నరసరావుపేట మండలంలోని పెట్లూరివారిపాలెం కేంద్రంగా బియ్యం డంపును నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట శివారు చిలకలూరిపేట జంక్షన్‌లోని ఒక పాడుబడిన గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.30లక్షల విలువైన రేషన్‌బియ్యం బస్తాలను స్వయంగా పట్టించారు. ఇప్పటివరకు నిందితులపై చర్యలేమీలేవు. అప్పటి నుంచి రూట్ మార్చిన నాయకుడు సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు కేంద్రంగా నిర్వహిస్తూ వచ్చాడు. ప్రకాశం జిల్లాకు దగ్గరగా ఉంటుందనే కారణంతో పెట్లూరివారిపాలెం గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని బియ్యాన్ని అక్రమార్కుల నుంచి సేకరిస్తున్నారు. డీలర్ల వద్ద నుంచి బియ్యాన్ని సేకరించి లారీలు, ఆటోల ద్వారా ఇక్కడ నిర్వహించే డంపునకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసినా పోలీసులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. -
గెల రూ.500
అరటి గెలలకు డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకు గిట్టుబాటు ధర రావడం లేదని నిరుత్సాహంతో ఉన్న అరటి రైతులకు ఊరట లభిస్తోంది. శ్రావణమాసం కావడంతో పూజాపునస్కారాలు, శుభకార్యాల కోసం వినియోగదారులు అరటి పండ్లను బాగా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు అరటి దిగుబడి కూడా తగ్గిపోవడంతో ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో అరటి మార్కెట్లో బుధవారం గెల గరిష్టంగా రూ. 500, కనిష్టంగా రూ.60 ధర పలికింది. ఈ ఏడాది తొలిసారి అధిక రేటు రావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ఈ మార్కెట్‌కు వారానికి 800 గెలల వరకు అమ్మకానికి వస్తాయి. కానీ ఈ వారం కేవలం 400 గెలలు మాత్రమే అమ్మకానికి వచ్చాయని వ్యాపారులు తెలిపారు. – అశ్వారావుపేట రూరల్ -
బోన్ క్యాన్సర్ విద్యార్థికి ఆర్థిక సహాయం
నిజామాబాద్‌అర్బన్ : బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థికి పాఠశాల అధ్యాపక బృందం, డీఈవో లింగయ్య సంయుక్త ఆధ్వర్యంలో రూ. 21 వేల ఆర్థిక సహాయం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇతనికి జిల్లా విద్యాశాఖ అధికారి రూ. 21 వేలు అందించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రూ. 8 కోట్లతో బస్టాండ్ల అభివృద్ధి
మార్కాపురం, న్యూస్‌లైన్: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 32 ఆర్టీసీ బస్టాండ్లలో జూలై 2వ తేదీ నుంచి ప్రతి టికెట్‌పై ప్రయాణికుల నుంచి ఒక రూపాయి వసూలు చేస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ విధంగా వసూలయ్యే రూ. 8 కోట్ల నిధులతో బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు కల్పిస్తామని నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సూర్యచంద్రరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్లపై అదనపు వసూలు ద్వారా నెలకు దాదాపు రూ. 80 లక్షలకుపైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, ప్రయాణికులు కూర్చొనేందుకు బెంచీల ఏర్పాటు, బస్టాండ్ల మరమ్మతులు చేపడతామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడాదికి రూ. 2 కోట్లకు మించి ఇవ్వడం లేదని, దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామన్నారు. మూడు జిల్లాల్లోని మూడు రీజియన్లలో మూడేసి బస్టాండ్ల చొప్పున మొత్తం 9 బస్టాండ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి నిధులిస్తే ఆర్టీసీ మరికొంత కలిపి సంబంధిత బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. జోన్ పరిధిలో మార్చి నెలాఖరు నాటికి 210 బస్సులు రావాల్సి ఉండగా, ఇప్పటికే 60 బస్సులు వచ్చినట్లు చెప్పారు. అవి పాత బస్సుల స్థానంలో వచ్చాయన్నారు. జవహర్లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం కింద నెల్లూరు రీజియన్‌కు వంద బస్సులు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఇవి వస్తే నెల్లూరుకు 50, తిరుపతికి 50 బస్సులు కేటాయిస్తామన్నారు. చిత్తూరు, ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీ నష్టాల్లో ఉందని తెలిపారు. తిరుమల, తిరుపతి, అలిపిరి, నెల్లూరు- 2 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి డిపో లాభాల బాటలో ఉండగా, అద్దంకి డిపో నష్టాల్లో ఉందన్నారు. జిల్లాలోని మిగిలిన 7 డిపోలు నష్టాలను అధిగమించాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 7 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవడం లేదని చెప్పారు. ఒంగోలులో మూడు రోజులు బస్సులు తిరగలేదన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో తమపై భారం పడుతోందని, నష్టాలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించుకోవడంతో పాటు ఇంధన పొదుపు పాటిస్తున్నామని తెలిపారు. కిలోమీటరుకు తమకు రూ. 27 ఖర్చవుతుండగా, రూ. 20 ఆదాయం వచ్చినా బస్సులు తిప్పుతామని చెప్పారు. మార్కాపురం డిపోకు నూతనంగా ఆరు బస్సులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కంభం, దోర్నాల పట్టణాల్లో బస్టాండ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, సురేశ్‌లు నిధులు కేటాయించారన్నారు. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు. బస్టాండ్‌లో పర్యటన: ఈడీ సూర్యచంద్రరావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో పర్యటించారు. డిపోలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వివిధ డిపోల కండక్టర్లతో మాట్లాడి ఆదాయ, వ్యయాలను పరిశీలించారు. ప్రయాణికులను గౌరవిస్తూ సంస్థ గౌరవాన్ని నిలబెట్టి నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట డిపో మేనేజర్ సునీల్ జోసఫ్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చిన్నయసూరి తదితరులు ఉన్నారు.