రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా వద్ద కుప్పకుప్పలుగా భారత్ కరెన్సీ వచ్చి పడింది. దీంతో ఏం చేయాలో తెలియడం లేదంటూ రష్యా గగ్గోలు పెడుతోంది. ఆ కరెన్సీని తాము ఉపయోగించుకోలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. తమ వద్ద బిలయన్ల కొద్దీ భారత్ కరెన్సీ ఉందని, అది తమకు సమస్యగా మారిందని సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. ఈ రూపాయలను మరొక కరెన్సీలలో బదిలీ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి 11 నెలల్లో రష్యాకు భారత్ మొత్తం ఎగుమతులు 11.6% తగ్గి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఐతే దిగుమతులు దాదాపు ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకించింది. ఐతే రష్యా అనుహ్యంగా రిఫైనరీ రాయితీ ఇవ్వడంతో దిగుమతుల్లో ఒక్కసారిగా పెరుగుదల వచ్చింది. ఈ మేరకు డేటా ఇంటిలిజెన్స్ సంస్థ వొర్టెక్సా లిమిటెడ్ ప్రకారం.. భారత్ రష్యా క్రూడ్ దిగుమతులు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 1.68 మిలియన్ బారెళ్లకు చేరుకున్నాయి.
అదీగాక రష్యా యద్ధం కారణంగా బ్యాంకులపై ఆంక్షలు, స్విఫ్ట్ ఉపయోగించే లావాదేవీల నిషేధం తదితర కారణాల రీత్యా రష్యా భారత్‌ని తమ కరెన్సీలలో వ్యాపారం చేయమని ప్రోత్సహించింది. కానీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూబుల్‌లో అస్థిరత ఏర్పడింది. ఒక పక్క భారత్ తమ కరెన్సీతో కొనుగోళ్లు చేయడంతో రష్యాలో ఉపయోగించలేని కరెన్సీ ఏకంగా పదివేల బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ అలెగ్జాండర్ నోబెల్ అన్నారు. దీంతో రష్యన్ ఎగుమతిదారులు ఆ రూపాయలను స్వదేశానికి తీసుకురావడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్యాంక్ ఆఫ్ రష్యా గవర్నర్ ఎల్విరా నబియుల్లినా తెలిపారు.
మరోవైపు అమెరికా ఆంక్షాలను ఉల్లంఘించని చెల్లింపు విధానం లేకపోవడంతో రష్యాకు రక్షణ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ తరణంలో భారత్ రష్యాకి అతిపెద్ద సైనిక ఆయుధాల సరఫరాదారుగా నిలిచింది. వాస్తవానికి రష్యా కొనుగోళ్లకు రూపాయలను అంగీకరించడానికి ఇష్టపడుదు కానీ యుద్ధ నేపథ్యంలో భారత్ మాత్రమే రష్యా చమురును, ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో మాస్కోకు ఈ రూపాయల చిక్కు వచ్చి పడింది. ఐతే దీన్ని చమురు శుద్ధి సంస్థలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు, రూబిళ్లు, రూపాయిలు ఉపయోగించి ముడి చమురు రాయితీ చెల్లింపులతో పరిష్కిరించుకునేందకు రష్యా యత్నిస్తోంది.
(చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం..10 నిమిషాల పాటు 141 కి.మీ చక్కర్లు..!)
Comments
Please login to add a commentAdd a comment