Billion
-
‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది?
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 800 కోట్ల క్రితం విశ్వంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాన్ని గుర్తించింది. ఈ విస్ఫోటనం ఇన్ని వందల కోట్ల ఏళ్లకు భూమికి చేరుకుందని వారు తెలిపారు. ఈ పేలుడును ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ (ఎఫ్ఆర్బీ) అని అంటారు. కొత్తగా గుర్తించిన ఈ విస్ఫోటనానికి ఎఫ్ఆర్బీ-20220610ఏ అని పేరు పెట్టారు. గత ఏడాది జూన్ 10న రేడియో టెలిస్కోప్ సాయంతో దీనిని గుర్తించారు. ఈ విస్ఫోటనం ఎక్కడ నుండి ఉద్భవించిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ, వెరీ లార్జ్ టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ ఎఫ్ఆర్బీ ఇప్పటివరకూ కనుగొన్న అన్ని ఎఫ్ఆర్బీల కంటే పురాతనమైనదని, అత్యంత దూరం కలిగినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’లనేవి రేడియో తరంగాల ప్రకాశవంతమైన పేలుళ్లు. వీటి వ్యవధి మిల్లీసెకండ్ స్కేల్లో ఉంటుంది. ఈ కారణంగానే వాటి మూలాన్ని గుర్తించడం, అంతరిక్షంలో వాటి స్థానాన్ని కనుగొనడం అత్యంత కష్టమైన పని. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ను మొదటిసారిగా 2007 సంవత్సరంలో కనుగొన్నారు. నాటి నుండి శాస్త్రవేత్తలు దాని మూలాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసేంత శక్తిని ఈ పేలుళ్లు సెకనులో వెయ్యి వంతులో ఉత్పత్తి చేస్తాయి. ఎఫ్ఆర్బీ పేలుళ్లు ఎందుకు సంభవిస్తాయో శాస్త్రవేత్తలు నేటికీ గుర్తించలేకపోయారు. అయితే ఎఫ్ఆర్బీలు విశ్వంలో జరిగే సాధారణ దృగ్విషయం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఈ దృగ్విషయాలను అధ్యయనం చేయడం వలన విశ్వం ఎలా ఏర్పడిందనేది తెలుసుకునేందుకు సహాయపడుతుంది. అత్యంత వేగవంతమైన ఈ రేడియో పేలుళ్లు అనూహ్యంగా ఉంటాయి. వాటిని గమనించడం కష్టం. కెనడాలోని డొమినియన్ రేడియో ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ ఎఫ్ఆర్బీలను ట్రాక్ చేసే అబ్జర్వేటరీలలో ఒకటి. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఎఫ్ఆర్బీలపై మరింత అవగాహన కలిగేందుకు దోహదపడనుంది. కాగా ఈ అధ్యయనం వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: యూదుడైన్ ఐన్‌స్టీన్ హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్లకు..
ఆధునిక ప్రపంచంలో సంపన్నులెవరు? అంటే వెంటనే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. భారతదేశం విషయానికి వస్తే ముఖేష్ అంబానీ పేరు చెబుతారు. వీరందరికంటే ముందు ఒకప్పుడు ఈ భూమిపైన అత్యంత సంపన్నుడెవరు? అనగానే 'మన్స ముస' (Mansa Musa) పేరే వినిపించేది. ఇంతకీ ఆయనెవరు? ఈయన సంపద విలువ ఎంత ఉండొచ్చు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 14వ శతాబ్దంలో ఆఫ్రికన్ చక్రవర్తి అయిన మన్స ముస ఈ భూమిపై నివసించిన అత్యంత ధనవంతుడని నమ్ముతారు. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ సంపన్నుడు 1280 ADలో జన్మించినట్లు, పశ్చిమ ఆఫ్రికాలోని విస్తారమైన మాలి సామ్రాజ్యానికి 1312 ADలో రాజై పరిపాలించినట్లు తెలుస్తోంది. ఈయన సంపద విలువ సుమారు 400 బిలియన్ డాలర్లని అంచనా.. అంటే ఇప్పటి భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 లక్షల కోట్లు కంటే ఎక్కువ. మాన్సా మూసా సంపద.. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 235 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు. ఇప్పటి ప్రపంచ కుబేరులకంటే మన్స ముస సంపద రెట్టింపు అనే చెప్పాలి. అప్పట్లో ఆ దేశపు వనరులు ఉప్పు, బంగారం. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) చరిత్రకారుల ప్రకారం.. హజ్ తీర్థయాత్ర కోసం మాలి నుంచి మక్కాకు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ప్రయాణం సాగించిన అతి తక్కువ మందిలో మన్స ముస ఒకరని, అప్పట్లోనే ఈ మార్గంలో వంద ఒంటెలు, భారీ మొత్తంలో బంగారం, 12000 మంది సేవకులు, 8000 మంది అనుచరులను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!) మన్స ముస ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన రాజు మాత్రమే కాదు, దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఈ కారణంగానే ఇతన్ని 'కింగ్ ఆఫ్ కింగ్స్' అని పిలిచేవారు. తన ప్రజలకు బంగారాన్ని విరివిగా దానం చేసేవాడని, మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని ఉత్పత్తి చేసిన ఘనత పొందిందని చెబుతున్నారు. -
కుప్పలుగా పోగయిన భారత్ కరెన్సీ! దిక్కుతోచని స్థితిలో రష్యా
రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా వద్ద కుప్పకుప్పలుగా భారత్ కరెన్సీ వచ్చి పడింది. దీంతో ఏం చేయాలో తెలియడం లేదంటూ రష్యా గగ్గోలు పెడుతోంది. ఆ కరెన్సీని తాము ఉపయోగించుకోలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. తమ వద్ద బిలయన్ల కొద్దీ భారత్ కరెన్సీ ఉందని, అది తమకు సమస్యగా మారిందని సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఈ రూపాయలను మరొక కరెన్సీలలో బదిలీ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి 11 నెలల్లో రష్యాకు భారత్ మొత్తం ఎగుమతులు 11.6% తగ్గి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐతే దిగుమతులు దాదాపు ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకించింది. ఐతే రష్యా అనుహ్యంగా రిఫైనరీ రాయితీ ఇవ్వడంతో దిగుమతుల్లో ఒక్కసారిగా పెరుగుదల వచ్చింది. ఈ మేరకు డేటా ఇంటిలిజెన్స్ సంస్థ వొర్టెక్సా లిమిటెడ్ ప్రకారం.. భారత్ రష్యా క్రూడ్ దిగుమతులు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 1.68 మిలియన్ బారెళ్లకు చేరుకున్నాయి. అదీగాక రష్యా యద్ధం కారణంగా బ్యాంకులపై ఆంక్షలు, స్విఫ్ట్ ఉపయోగించే లావాదేవీల నిషేధం తదితర కారణాల రీత్యా రష్యా భారత్‌ని తమ కరెన్సీలలో వ్యాపారం చేయమని ప్రోత్సహించింది. కానీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూబుల్లో అస్థిరత ఏర్పడింది. ఒక పక్క భారత్ తమ కరెన్సీతో కొనుగోళ్లు చేయడంతో రష్యాలో ఉపయోగించలేని కరెన్సీ ఏకంగా పదివేల బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్ అలెగ్జాండర్ నోబెల్ అన్నారు. దీంతో రష్యన్ ఎగుమతిదారులు ఆ రూపాయలను స్వదేశానికి తీసుకురావడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్యాంక్ ఆఫ్ రష్యా గవర్నర్ ఎల్విరా నబియుల్లినా తెలిపారు. మరోవైపు అమెరికా ఆంక్షాలను ఉల్లంఘించని చెల్లింపు విధానం లేకపోవడంతో రష్యాకు రక్షణ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ తరణంలో భారత్ రష్యాకి అతిపెద్ద సైనిక ఆయుధాల సరఫరాదారుగా నిలిచింది. వాస్తవానికి రష్యా కొనుగోళ్లకు రూపాయలను అంగీకరించడానికి ఇష్టపడుదు కానీ యుద్ధ నేపథ్యంలో భారత్ మాత్రమే రష్యా చమురును, ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో మాస్కోకు ఈ రూపాయల చిక్కు వచ్చి పడింది. ఐతే దీన్ని చమురు శుద్ధి సంస్థలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌లు, రూబిళ్లు, రూపాయిలు ఉపయోగించి ముడి చమురు రాయితీ చెల్లింపులతో పరిష్కిరించుకునేందకు రష్యా యత్నిస్తోంది. (చదవండి: షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం..10 నిమిషాల పాటు 141 కి.మీ చక్కర్లు..!) -
నిహారిక ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
5జీ దూకుడు మామూలుగా లేదుగా, ఎన్ని అవాంతరాలున్నా తగ్గేదేలే!
సాక్షి,న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ రికార్డు స్థాయిలో దూసుకుపోనుంది. గ్లోబల్ 5జీ మొబైల్ సబ్స్క్రిప్షన్లు 2022లో 100కోట్లను అధిగమించ గలవని అంచనా వేస్తున్నట్లు, స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తాజాగా వెల్లడించింది. qఅయితే బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అనిశ్చితుల కారణంxe తమ అంచనాలో 2022లో సుమారు 100 మిలియన్ల మేర తగ్గాయని కంపెనీ తన ద్వైవార్షిక మొబిలిటీ నివేదికలో పేర్కొంది. 10 ఏళ్లకు బిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన 4జీ కంటే రెండేళ్ల ముందుగానే ఈ మార్కును చేరుకుంటుందని వ్యాఖ్యానించింది. తాజా నివేదిక ప్రకారం మొదటి త్రైమాసికంలో 5జీసబ్స్క్రిప్షన్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 620 మిలియన్లకు చేరుకోగా, 4జీ సబ్స్క్రైబర్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 4.9 బిలియన్లకు చేరుకున్నాయి. 4 జీ కంటే 100 రెట్ల వేగాన్ని అందించే 5జీ వినియోగదారుల సంఖ్య గరిష్ట స్తాయికి చేరుకుంటుందని తెలిపింది. 4జీ వినియోగదారుల వృద్ధి ఈ సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ 5జీ నేపథ్యంలో సబ్స్క్రైబర్ల తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. కాగా 4 జీ చందాదారులు రికార్డుస్థాయికి చేరతారని గత ఏడాది ఎరిక్సన్ ముందుగానే అంచనా వేసింది. 5జీ నెట్వర్క్, 120 డాలర్ల కంటే తక్కువకు హ్యాండ్సెట్ ధరల కుదింపులో టెలికాం ఆపరేటర్ల ఒత్తిడి 5జీ స్వీకరణకు సహాయపడిందని రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పీటర్ జాన్సన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తర అమెరికాలో65 మిలియన్లతో పోలిస్తే 2021లో 270 మిలియన్ల చైనా వినియోగదారులున్నారని వెల్లడించారు. అయితే 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఏడాది చివరి నుండి భారత్‌లో 5జీ సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. కాగా దేశీయంగా 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని ఎరిక్సన్ గతంలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
ఉక్రెయిన్‌కు భారీ సాయం... పెద్ద మనసు చాటుకున్న బిలియనీర్!
Japan Billionaire in a letter addressed to Ukraines President: జపనీస్ బిలియనీర్ ఇ-కామర్స్ దిగ్గజం రకుటెన్ వ్యవస్థాపకుడు హిరోషి మిక్కి మికిటాని ఉక్రెయిన్ ప్రభుత్వానికి రూ. 65 కోట్లు విరాళంగా అందిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి రాసిన లేఖలో తెలిపారు. అంతేకాదు ఉక్రెయిన్‌లో హింసకు గురైన వ్యక్తులకు సహాయం చేయడానికి, మానవతా కార్యకలాపాల నిమిత్తం ఈ విరాళం అందజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన ఆలోచనలు అన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి, ప్రజలు చుట్టూనే తిరుగుతున్నాయని కూడా లేఖలో రాశారు. "శాంతియుత ప్రజాస్వామ్య ఉక్రెయిన్ను అన్యాయమైన శక్తితో తొక్కడం ప్రజాస్వామ్యానికి సవాలు అని నేను నమ్ముతాను. రష్యా, ఉక్రెయిన్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోగలవని, ఉక్రెయిన్ ప్రజలు వీలైనంత త్వరగా శాంతిని పొందాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను" అని లేఖలో పేర్కొన్నారు. తాను 2019లో ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను సందర్శించి జెలెన్స్కీని కలిశానని కూడా మికిటాని చెప్పారు. రష్యా దండయాత్ర ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నుంచి విస్తృత ఆర్థిక ఆంక్షలను ప్రేరేపించేలా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయడానికి విరాళాలను అభ్యర్థించాయి కూడా. జపాన్ ప్రభుత్వం మాస్కోపై ఆస్తులను స్తంభింపజేయడమే కాక రష్యన్ మిలిటరీకి సంబంధించిన సంస్థలకు సెమీకండక్టర్స్ వంటి కీలక ఎగుమతులను నిషేధించడంతో సహా పలు ఆంక్షలను ప్రకటించింది. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
Covid Vaccination : 5 రోజులు 10 కోట్ల టీకాలు
వెబ్‌డెస్క్: కరోనాకే కొత్త పాఠాలు నేర్పింది చైనా. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను నిజం చేస్తూ కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంతో అదే పద్దతిలో టీకా కార్యక్రమం చేపట్టి కోవిడ్ 19కి చెక్ పెడుతోంది. వైరస్‌కి చెక్ కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందో అదే తీరులో టీకా కార్యక్రమాన్ని చైనా నిర్వహించింది. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే 101 కోట్ల మందికి పైగా ఆ దేశ ప్రజలకు టీకాలు అందించింది. ఈ వివరాలను తాజాగా చైనాకి చెందిన నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. వ్యాక్సిన్ యాక్షన్ ప్లాన్ గత డిసెంబరులో కరోనా టీకా కార్యక్రమాన్ని చైనా ప్రారంభించింది. మార్చి నెల చివరి నాటికి కేవలం 10 కోట్ల డోసుల టీకాలు మాత్రమే అందివ్వగలిగింది. అయితే ఈ మూడు నెలల కాలంలో జరిగిన టీకా కార్యక్రమాన్ని బేరీజు వేసుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దీంతో ఆ తర్వాత కేవలం 25 రోజుల్లోనే 20 కోట్ల డోసుల టీకాలు ప్రజలకు అందించింది. ఆ వెంటనే 16 రోజుల వ్యవధిలోనే 30 కోట్ల టీకాలు అందించింది. ఇలా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచుకుంటూ పోయింది. చివరకు 80 కోట్ల నుంచి 90 కోట్ల టీకాలు వేసేందుకు కేవలం 6 రోజుల సమయమే తీసుకుంది. సగటున ప్రతీ రోజు 1.7 కోట్ల వ్యాక్సిన్లు అందిస్తూ ఆరు రోజుల్లో పది కోట్ల మందికి పైగా ప్రజలకు చైనా వైద్య బృందం వ్యాక్సిన్లు అందివ్వగలిగింది. 101 కోట్ల మంది జూన్ 19 నాటికి 101,04,89,000 మందికి టీకాలు అందించినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. జూన్ చివరి నాటికి దేశంలో 40 శాతం మంది ప్రజలకు రెండు డోసుల టీకా పూర్తవుతుందని చైనా వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 70శాతం మంది చైనీయులకు కరోనా నుంచి విముక్తి లభిస్తుందని అక్కడి ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. వైరస్ వ్యాప్తి కరోనా వైరస్ వ్యాప్తి తొలి దశలో నెమ్మదిగా ఉంటుంది. కరోనా ఫస్ట్ వేవ్‌లో లక్ష కేసులు నమోదు కావడానికి 117 రోజుల సమయం తీసుకుంటే 15 రోజుల్లోనే రెండు లక్షల కేసులకు చేరుకుంది. ఆ తర్వాత 10 రోజుల్లోనే మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయి. అక్కడి నుంచి 4 లక్షల కేసులకు చేరుకోవడానికి 8 రోజులు పట్టింది. చివరికి ఐదు లక్షల కేసులకు చేరుకోవడానికి కేవలం 6 రోజుల సమయమే తీసుకుంది. ప్రారంభంలో నెమ్మదిగా మొదలై ఆ తర్వాత వాయు వేగంతో కేసులు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతాయి. కరోనా వైరస్ వ్యాప్తి తరహాలోనే చైనా వ్యాక్సినేషన్ చేపట్టింది. 2021 జూన్ 19 వరకు వివిధ దేశాలకు సంబంధించి వ్యాక్సినేషన్ వివరాలు చదవండి: Fact Check: వుహాన్ ల్యాబ్ నుంచి వయాగ్రా దోమల లీక్.. కలకలం! -
కొత్త ఫీచర్ : 100కోట్ల మార్క్ దాటేసిన ఇన్స్టాగ్రామ్
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ యూజర్లకు సంబంధించి బిలియన్ (100కోట్ల) మార్క్‌ను దాటేసింది. ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్ తాజాగా ఒక వీడియో ప్లాట్‌ఫాంను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం యూజర్లు ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక్క నిమిషంలోపు ఉన్న వీడియోలనే పోస్ట్ ఈ పరిమితిని గంటకు పెంచింది. దీంతో ఫేస్బుక్ సొంతమైన ప్లాట్‌ఫాంలలో 100కోట్ల యాక్టివ్ యూజర్లను సాధించిన నాలుగవదిగా నిలిచింది. యూట్యూబ్‌కు పోటీగా వీడియో ఐటీవీటీ (ఇన్స్టాగ్రామ్ హోమ్ స్క్రీన్‌లో ఒక బటన్, అలాగే స్టాండలోన్ యాప్) పేరుతో దీన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం సెలబ్రిటీలే కాకుండా యూజర్లందరూ తమ కిష్టమైన గంట వ్యవధి గల వీడియోలను షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఐజీటీవీ వీడియో ఫీచర్ లాంచింగ్ సందర్భంగా ఇన్స్టాగ్రామ్, సహ వ్యవస్థాపకుడు, సీఈవో కెవిన్ సిస్టో ఈ విషయాన్ని వెల్లడించారు. 2010లో లాంచ్ అయినప్పటినుంచి క్రమంగా పుంజుకున్న తమసంస్థ 100 కోట్ల వినియోగదారులను సాధించిందని, ఇది గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. అలాగే ఐజీటీవీ గొప్ప ఆవిష్కారమని పేర్కొన్నారు. జస్ట్ టీవీ ఆన్ చేసినట్టుగానే ఐజీటీవీలో వీడియోలు ఓపెన్ అవుతాయని, అలాగే ప్రత్యేకంగా సెర్చ్ చేయాల్సిన లేకుండానే యూజర్ల ఫాలోవర్లు షేర్ చేసిన వీడియె కంటెట్‌ను వీక్షించవచ్చు. డైరెక్టుగా వీడియోలను ఫ్రెండ్స్‌కు షేర్ చేసుకోవచ్చని కెవిన్ సిస్టో వెల్లడించారు. అంతేకాదు డిస్కవర్ మోర్, ఫర్ యూ లాంటి ఇతర ఆప్షన్లు కూడా లభ్యం. ఎక్కువ నిడివి వీడియోలను వీక్షించే అవకాశంతోపాటు, ఇతర వీడియోలను, ఛానల్స్‌ను చూడవచ్చని తెలిపారు. అలాగే లైక్‌లు కమెంట్లు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎవరైనా ఇందులో సొంత ఛానెల్‌ని ప్రారంభివచ్చు. యాప్ లేదా వెబ్‌లో సొంత ఐజీటీవీ వీడియోలను అప్లోడ్ చేయవచ్చని కెవిన్ తెలిపారు. ఫేస్బుక్లో కూడా చాలా ఈజీగా ఐజీటీవీ వీడియోలను షేర్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా 2012 ఏప్రిల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వంటకాలతో వందకోట్ల టర్నోవర్..
భోజన ప్రియులను విభిన్న రకాల వంటకాలతో ఆకట్టుకున్న ఓ వ్యాపారి ఏకంగా కోట్లకు పడగలెత్తాడు. చవులూరించే రుచులతో ఆన్ లైన్ లో అందరినీ ఆకట్టుకునేందుకు కుక్ ప్యాడ్ వెబ్సైట్ ను స్థాపించి.. ఇప్పుడు ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా చెప్పే జపాన్ లో జపనీస్ పారిశ్రామికవేత్త అకిమిస్తు సానో.. ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంప్రదాయ ప్రాంతీయ జపనీస్ ప్రత్యేక వంటకాలలు భోజన ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రిల్డ్ స్క్విడ్, పాన్ కేక్స్ తో పాటు... చీజ్ కేక్, పాస్తా, బోలోగ్ నీస్ వంటి 2.1 మిలియన్ల అన్యదేశ వంటకాలతో 58.8 మిలియన్ల వినియోగదారులతో 'కుక్ ప్యాడ్' కొనసాగుతోంది. జపనీయులు ఇంటి భోజనాన్ని ఆస్వాదించేందుకు రకరకాల రుచులను అందిస్తున్న కుక్ ప్యాడ్.. జపాన్ లో అత్యంత ఎక్కువమంది వీక్షించే వెబ్‌పైట్లలో 55వ స్థానంలో ఉంది. గత ఏడు సంవత్సరాల్లో ఈ సంస్థ పన్నెండు రెట్లు విస్తరించింది. ఇంచుమించుగా జపాన్ మహిళల్లో సుమారు ఇరవైనుంచి ముఫ్ఫై సంవత్సరాల మధ్య వయసుగల మహిళల్లో సగంకంటే ఎక్కువ మంది కుక్ ప్యాడ్ ను సందర్శిస్తుంటారు. 1997 లో సానో స్థాపించిన ఈ కుక్ ప్యాడ్..ఎంతో ప్రజాదరణ పొంది 2009 నాటికి 80శాతం రెవెన్యూ పెంచుకుంది. గతేడాది 65 మిలియన్ డాలర్ల కు చేరిన రెవెన్యూ సుమారు 19 మిలియన్ డాలర్ల లాభాలను మిగుల్చుకుంది. గత నెల దీని షేర్లు కూడ 20 శాతం పెరిగి, కంపెనీలో సానో వాటాను 44శాతానికి పెంచడంతోపాటు... కంపెనీ మొత్తం విలువ వంద కోట్లకు చేరింది. అత్యంత అరుదుగా మీడియా ముందుకు వచ్చే 42ఏళ్ళ సానో... జపాన్ కీయో విశ్వవిద్యాలయంలో పట్టభద్రత పొంది కుక్ ప్యాడ్ లో పని ప్రారంభించాడు. 2012 లో అక్కడ సీఈవో పాత్రను వదిలిన సానో... ఆ తర్వాత ఆదాయ సముపార్జనపై దృష్టి సారించాడు. మనానో వెడ్డింగ్ పేరిట ఉన్న జపనీస్ వివాహ వేదిక రివ్యూ సైట్ ను, కుకుంబర్ టౌన్ అనే ఆమెరికాకు చెందిన ఓ ఆహార బ్లాగింగ్ వేదికను కొనుగోలు చేసి, ఈ సంవత్సరంలో లెక్కలేనంత ఆదాయాన్ని చేజిక్కించుకున్నాడు. పూర్వం చదువు లేకుండానే వంట జ్ఞానాన్ని ఎలా పొందారో తెలియదుకానీ, ఇప్పటి వారు వంటలు చేసేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదని, అయితే రుచికరమైన వంటకాలు కుటుంబాలను సమష్టిగా ఉంచేందుకు ఎంతో సహకరిస్తాయని సానో గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సానో..అతని భార్య వారి కెంపెనీ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఓ చిన్నపాటి పరిశ్రమలా కనిపించే సంప్రదాయ పాకశాలలో(వంటిల్లు) ప్రతిరోజూ విధిగా ఉద్యోగులకు స్వయంగా వండి పెడుతుంటారట. అంతేకాక సానో తనకు కావలసిన, సమీప బంధువులు వండిన వంటకాలనే భుజిస్తాడని కూడా అతని గురించి బాగా తెలిసినవారు చెప్తుంటారు. -
50 కోట్ల డాలర్ల సమీకరణ బాటలో స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా ఆలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్ తదితర సంస్థల నుంచి 50 కోట్ల డాలర్లు (రూ. 3,000 కోట్లకుపైగా) సమీకరించనుంది. ఇందుకోసం వాటితో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది వారాల్లో ఫండింగ్ వివరాలు వెల్లడి కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా డీల్‌తో స్నాప్‌డీల్ విలువ 4-5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని తెలిపాయి. దీనిపై స్నాప్‌డీల్, సాఫ్ట్‌బ్యాంక్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి. ఆలీబాబాతో ఇటీవలే నిధుల కోసం చర్చలు జరిపినప్పటికీ స్నాప్‌డీల్ భారీ వేల్యుయేషన్లు కోరడంతో అవి విఫలమయ్యాయి. వివిధ సంస్థల నుంచి స్నాప్‌డీల్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమీకరించింది.