సాక్షి,న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ రికార్డు స్థాయిలో దూసుకుపోనుంది. గ్లోబల్ 5జీ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లు 2022లో 100కోట్లను అధిగమించ గలవని అంచనా వేస్తున్నట్లు, స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తాజాగా వెల్లడించింది. qఅయితే బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అనిశ్చితుల కారణంxe తమ అంచనాలో 2022లో సుమారు 100 మిలియన్ల మేర తగ్గాయని కంపెనీ తన ద్వైవార్షిక మొబిలిటీ నివేదికలో పేర్కొంది. 10 ఏళ్లకు బిలియన్ సబ్‌స్క్రైబర్‌లను సాధించిన 4జీ కంటే రెండేళ్ల ముందుగానే ఈ మార్కును చేరుకుంటుందని వ్యాఖ్యానించింది.
తాజా నివేదిక ప్రకారం మొదటి త్రైమాసికంలో 5జీసబ్‌స్క్రిప్షన్‌లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 620 మిలియన్లకు చేరుకోగా, 4జీ సబ్‌స్క్రైబర్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 4.9 బిలియన్లకు చేరుకున్నాయి. 4 జీ కంటే 100 రెట్ల వేగాన్ని అందించే 5జీ వినియోగదారుల సంఖ్య గరిష్ట స్తాయికి చేరుకుంటుందని తెలిపింది.
4జీ వినియోగదారుల వృద్ధి ఈ సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ 5జీ నేపథ్యంలో సబ్‌స్క్రైబర్ల తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. కాగా 4 జీ చందాదారులు రికార్డుస్థాయికి చేరతారని గత ఏడాది ఎరిక్సన్ ముందుగానే అంచనా వేసింది.
5జీ నెట్‌వర్క్, 120 డాలర్ల కంటే తక్కువకు హ్యాండ్‌సెట్ ధరల కుదింపులో టెలికాం ఆపరేటర్ల ఒత్తిడి 5జీ స్వీకరణకు సహాయపడిందని రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పీటర్ జాన్సన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తర అమెరికాలో65 మిలియన్లతో పోలిస్తే 2021లో 270 మిలియన్ల చైనా వినియోగదారులున్నారని వెల్లడించారు. అయితే 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఏడాది చివరి నుండి భారత్‌లో 5జీ సబ్‌స్క్రిప్షన్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. కాగా దేశీయంగా 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని ఎరిక్‌సన్ గతంలో అంచనా వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment