
40 జీబీకి సగటు డేటా వినియోగం
2028 నాటికి నోకియా అంచనా
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ యూజర్ల సంఖ్య వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) 2.65 రెట్లు పెరగనుంది. 77 కోట్లకు చేరనుంది. అలాగే, నెలవారీ డేటా వినియోగం యూజర్‌కు సగటున 40 జీబీ స్థాయికి చేరుతుందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా ఓ నివేదికలో అంచనా వేసింది. గత అయిదేళ్లలో 2024 నాటికి 4జీ, 5జీ డేటా వినియోగం వార్షికంగా 19.5% పెరిగి 27.5 జీబీకి చేరిందని పేర్కొంది.
గతేడాది 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ లభ్యత (ఎఫ్‌డబ్ల్యూఏ) పెరుగుతుండటంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందని నోకియా ఇండియా టెక్నాలజీ, సొల్యూషన్స్ హెడ్ సందీప్ సక్సేనా తెలిపారు. యాక్టివ్ 5జీ డివైజ్‌ల సంఖ్య వార్షికంగా రెట్టింపై 2024లో 27.1 కోట్లకు చేరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment