Ericsson
-
ఏఐపై ఎరిక్సన్ ఫోకస్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ భారత్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. కృత్రిమ మేథ (ఏఐ), జనరేటివ్ ఏఐ, నెట్వర్క్ ఏపీఐలు, 6జీ టెక్నాలజీ అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం గణనీయంగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2024లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ భారత విభాగం హెడ్ ఆండ్రెస్ విసెంటి ఈ విషయాలు తెలిపారు. 1994లో నుంచి భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తున్నామని, అంతర్జాతీయంగా తమకు కీలక మార్కెట్లలో ఇది కూడా ఒకటని వివరించారు. 5జీ సాంకేతికతను వినియోగంలోకి తేవడంలో భారత్ వేగంగా పనిచేసిందని ఆండ్రెస్ తెలిపారు. కేవలం 22 నెలల్లోనే అయిదు లక్షల పైగా బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా 90 శాతం మేర కవరేజీ సాధించిందని చెప్పారు. దీంతో నెట్వర్క్ పనితీరుకు సంబంధించి భారత్ 86వ స్థానం నుంచి 16వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. టెలికం దిగ్గజాలు భారతి ఎయిర్టెల్, జియోతో ఎరిక్సన్కి గతంలో ఒప్పందాలు ఉన్నాయి. ఇటీవలే 4జీ, 5జీ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌నకు సంబంధించి వొడాఫోన్ ఐడియాతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశీయంగా ఎరిక్సన్కి చెన్నై, బెంగళూరు, గురుగ్రామ్‌లో ఆర్అండ్డీ కేంద్రాలు ఉన్నాయి. టెలికం రంగంలో రవాణా, క్లౌడ్ తదితర విభాగాలకు సంబంధించిన సాంకేతికతలపై ఇవి పని చేస్తున్నాయి. -
వొడాఫోన్‌లో నోకియా, ఎరిక్సన్ వెండర్లకు 166 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: భారీ రుణ భారాన్ని మోస్తున్న మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో కీలక వెండార్ సంస్థలు నోకియా, ఎరిక్సన్ ఇండియాకు వాటా లభించనుంది. నెట్వర్క్ పరికరాలను సరఫరా చేసే వీటి బకాయిలను పాక్షికంగా చెల్లించేందుకు షేరుకి రూ. 14.8 ధరలో వొడాఫోన్ ఐడియా ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. ఇది ఎఫ్‌పీవో ధరకంటే 35 శాతం అధికంకాగా.. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 10 ముఖ విలువగల 166 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వీఐఎల్ తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 2,458 కోట్ల విలువైన వాటాను నోకియా, ఎరిక్సన్ పొందనున్నాయి. అయితే వీటికి 6 నెలల లాకిన్ వర్తించనుంది. నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, ఎరిక్సన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ దీర్ఘకాలంగా కీలక వెండార్లుగా సేవలందిస్తున్నట్లు వీఐఎల్ పేర్కొంది. నోకియాకు రూ. 1,520 కోట్లు(1.5 శాతం వాటా), ఎరిక్సన్కు రూ. 938 కోట్ల(0.9 శాతం) విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీఐఎల్‌లో ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ సంయుక్త వాటా 37.3 శాతంకాగా.. ప్రభుత్వ వాటా 23.2 శాతానికి చేరనుంది. -
5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్‌గ్రేడ్ అయ్యారు?
న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్‌గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్‌లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్‌లో మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్‌ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్‌లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్‌లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్‌ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
దేశంలో 5జీ హవా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్‌గా భారత్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2028 చివరి నాటికి మొబైల్ చందాదార్లలో దాదాపు 57 శాతం వాటా 5జీ కైవసం చేసుకోనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక వెల్లడించింది. ‘2022 డిసెంబర్ చివరినాటికి దేశంలో 5జీ చందాదార్లు ఒక కోటి ఉన్నట్టు అంచనా. భారత్‌లో 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారీ నెట్వర్క్ విస్తరణ జరుగుతోంది’ అని ఎరిక్సన్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా 150 కోట్లు.. కొన్ని మార్కెట్లలో భౌగోళిక రాజకీయ సవాళ్లు, స్థూల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. 2023 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మొబైల్ చందాదార్లు 5జీ వేదికపైకి రానున్నారు. ఉత్తర అమెరికాలో 5జీ చందాదార్ల వృద్ధి గత అంచనాల కంటే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో 2022 చివరి నాటికి 5జీ విస్తృతి 41 శాతం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు నెలవారీ అంతర్జాతీయ సగటు డేటా వినియోగం 20 జీబీ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా’ అని నివేదిక వివరించింది. -
షాకింగ్: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం
సాక్షి,ముంబై: స్వీడన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్ భారీగా ఉద్యోగులను తొలగించింది. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రాయిటర్స్ శుక్రవారం నివేదించింది. లోకల్ బిజినెస్‌ను బట్టి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయిని ప్రకటించిన ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ ఇప్పటికే ఆయా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. (ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!) టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుననాయి. అయితే టెలికాం పరిశ్రమలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. కాగా స్వీడన్లో దాదాపు 1400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది ఉద్యోగాల కోతలను ప్రకటించిన ట్విటర్, గూగుల్, మెటా ,మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల లీగ్‌లో ఎరిక్సన్ చేరింది. (పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!) -
Layoff Crisis: వేలాదిమందిని తొలగిస్తున్న మరో దిగ్గజ కంపెనీ
న్యూఢిల్లీ: టెలికా గేర్ మేకర్, మొబైల్ సంస్థ ఎరిక్సన్ కూడా ఉద్యోగాల తీసివేతకు నిర్ణయించింది. భారీగా ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్న సంస్థ స్వీడన్లో దాదాపు1400 మంది, పలు దేశాల్లో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో వివిధ దేశాల్లో అనేక వేల ఉద్యోగాల కోతలను ప్రకటించ వచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఉత్తర అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడంతో 2023 చివరి నాటికి ఖర్చులను 880 మిలియన్ డాలర్ల క తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు ఎరిక్సన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయాలను తగ్గించే విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపులను కంపెనీ పేర్కొంది. 2017లో ప్రత్యర్థుల పటీ, నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో 25 వేల మంది ఉద్యోగులను తొలగించి ఎరిక్సన్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఖర్చుల తగ్గింపును ఎలా నిర్వహించాలనే దానిపై కంపెనీ స్వీడన్‌లోని ఉద్యోగుల సంఘంతో నెలల తరబడి చర్చలు జరుపుతోంది. సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT)అందించే ప్రముఖ సంస్థలలో ఎరిక్సన్ ఒకటి. ఎరిక్సన్ ఇటీవల ప్రకటించిన నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే తక్కువగా లాభాలు నమోదైన నెల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా లాంటి అధిక మార్జిన్ మార్కెట్లలో 5జీ పరికరాల విక్రయాలు మందగించడంతో ఈ కంపెనీ షేర్లు తాజా కనిష్ట స్థాయిలను తాకాయి. దీంతో కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్ , ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లాంటి కాస్ట్ కట్ చర్యలపై ప్రణాళికలు వేస్తోందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. తాము వివిధ దేశాల కార్మిక చట్టాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్లవారీగా తొలగింపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
భారత్‌లో 5జీ దూకుడు: కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో నిలిపివేత!
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ జోరు మీద ఉండనుంది. 2028 చివరి నాటికి మొత్తం మొబైల్ కనెక్షన్స్‌లో సగానికంటే ఎక్కువ వాటా 5జీ కైవసం చేసుకోనుందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. ‘టెలికం చరిత్రలో అత్యధికంగా 2024లో 4జీ కనెక్షన్స్ 93 కోట్ల స్థాయికి చేరనున్నాయి. ఆ తర్వాత క్రమంగా 4జీ కస్టమర్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఒక్కో స్మార్ట్‌ఫోన్ ద్వారా డేటా సగటు వినియోగం నెలకు ప్రస్తుతం ఉన్న 25 జీబీ నుంచి 2028 నాటికి 54 జీబీకి పెరగనుంది. 2022 డిసెంబర్ చివరినాటికి 5జీ చందాదార్ల సంఖ్య 3.1 కోట్లను తాకుతుంది. ఆరేళ్లలో ఈ సంఖ్య 69 కోట్లకు చేరుతుంది. 2028 చివరినాటికి మొత్తం మొబైల్ చందాదార్లలో 5జీ కనెక్షన్ల వాటా 53 శాతానికి ఎగుస్తుంది. 4జీ చందాదార్లు 57 కోట్లకు పరిమితం అవుతారు. మొబైల్ వినియోగదార్లలో స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 77 శాతం నుంచి ఆరేళ్లలో 94 శాతం తాకనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2028 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 500 కోట్లకు చేరనుంది. మొత్తం మొబైల్ చందాదార్లు 840 కోట్ల నుంచి 920 కోట్లకు పెరగనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా 79 శాతం మొబైల్ చందాదార్లు స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 230 టెలికం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించాయి. 5జీలో 700లకుపైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు కొలువుదీరాయి’ అని నివేదిక వివరించింది. (సామాజిక భద్రత, మెటర్నీటీ బెనిఫిట్స్‌పై ఆర్థిక వేత్తల కీలక లేఖ) ఎయిర్‌పోర్టుల్లో 5జీ సేవల నిలిపివేత పౌర విమానయాన శాఖ అభ్యర్ధన మేరకు టెలికం శాఖ (డాట్) ఆంక్షలు విధించిన నేపథ్యంలో టెల్కోలు .. హై-ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఉండే 5జీ సర్వీసులను విమానాశ్రయాల లోపల, చుట్టుపక్కల నిలిపివేయాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏవియేషన్ శాఖ ఇచ్చిన బఫర్, భద్రతా జోన్ల వివరాల ఆధారంగా విమానాశ్రయాల్లో రన్‌వేకు రెండు చివర్లా 2.1 కిలోమీటర్ల దూరం వరకూ, రన్‌వే మధ్య గీత నుండి 910 మీటర్ల దూరం వరకూ 3.3-3.6 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 5జీ బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయొద్దని టెల్కోలను డాట్ ఆదేశించింది. (GST డీక్రిమినైజేషన్‌పై కీలక చర్చ, వారికి భారీ ఊరట!) ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఇది తాత్కాలికమేనని, అన్ని విమానాల అల్టీమీటర్ల ప్రమాణాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్దేశించాక సర్వీసులను పునరుద్ధరించవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. పాట్నా, బెంగళూరు తదితర కొన్ని విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ ఎయిర్టెల్ మాత్రమే 5జీ సర్వీసులను అందిస్తోంది. పైలట్లు నిర్దిష్ట ఎత్తులో విమానాలను నడిపేందుకు అల్టీమీటర్ పరికరం ఉపయోగపడుతుంది. దీని సిగ్నల్స్‌కు 5జీ సిగ్నల్స్ అంతరాయం కలిగించే పరిస్థితిని నివారించే విధంగా తమ 5జీ బేస్ స్టేషన్లను సరిచేసుకోవాలంటూ నవంబర్ 29న టెల్కోలకు డాట్ సూచించింది. ఇదీ చదవండి: ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు -
5జీ సేవలు: ప్రధాన ప్రత్యర్థులతో జియో కీలక డీల్స్
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సేవల విషయంలో శరవేగంగా అడుగులు వేస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా నోకియాతో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతోపాటు ఎరిక్సన్ కంపెనీతో కూడా మరో ముఖ్యమైన డీల్ కుదుర్చుకుంది. ఈ కంపెనీల ద్వారా 5G RAN (రేడియో యాక్సెస్ నెట్వర్క్) పరికరాలను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా సోమవారం ఒకప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ముఖ్యంగా నోకియాతో మల్టీ-ఇయర్ డీల్ చేసుకుంది. నోకియా, జియో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు బహుళ-సంవత్సరాల ఒప్పందం కాబట్టి, భారతీయ మార్కెట్లో నోకియాకు ఇది భారీ విజయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే తద్వారా సాధారణ వినియోగదారులకు కూడా 5జీ స్టాండ్‌లోన్ నెట్‌వర్క్‌ను అందించే దేశీయ తొలి టెల్కోగా జియో అవతరించనుంది. నోకియా డీల్‌పై రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. నోకియాతో తమ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన 5జీ నెట్వర్క్ని అందించే సంస్థగా తాము నిలవనున్నట్టు చెప్పారు. నోకియా ప్రెసిడెంట్, సీఈవో పెక్కా లండ్మార్క్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో లక్షలాది మంది ప్రీమియం 5 జీ సేవలు ఆస్వాదించనున్నారని తెలిపారు. ఎరిక్సన్తో డీల్ దేశీయంగా 5జీ స్టాండ్‌లోన్ నెట్వర్క్ నిమిత్తం నోకియా ప్రధాన పోటీదారు ఎరిక్సన్తో కూడా జియో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-ఎరిక్సన్ మధ్య కుదిరిన ఈ తొలి డీల్ దేశంలో రేడియో యాక్సెస్ నెట్వర్క్నుమరింత విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. జియో 5జీ సేవలు, ‘డిజిటల్ ఇండియా' విజన్ సాధనలో ఈడీల్ ఒక పునాదిగా ఉపయోగపడుతుందని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ విశ్వాసాన్ని ప్రకటించారు. -
5జీకి ఎక్కువ చెల్లించడానికైనా రెడీ
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ రెడీ స్మార్ట్ఫోన్లు ఉన్న 10 కోట్ల మందికి పైగా యూజర్లు అత్యంత వేగవంతమైన సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటి కోసం 45 శాతం వరకూ ఎక్కువ చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఎరిక్సన్ కన్జూమర్ల్యాబ్ రూపొందించిన ’5జీ హామీ’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దీన్ని నిర్వహించారు. 5జీ సర్వీసులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (యూజరుపై సగటు ఆదాయం) ఆర్జించే అవకాశాలు దేశీయంగా టెల్కోలకు మరింత ఊతమివ్వగలవని నివేదిక పేర్కొంది. కంపెనీ లకు యూజర్లు కట్టుబడి ఉండాలంటే 5జీ నెట్వర్క్ పనితీరే కీలకంగా ఉంటుందని వివరించింది. సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఏ నెట్వర్క్ బాగుంటే దానికే మారిపోవాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది యూజర్లు తెలపడం ఇందుకు నిదర్శనం. మెరుగైన కవరేజీ కన్నా 5జీతో వినూత్నమైన కొత్త ఉపయోగాల గురించి ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం మంది పేర్కొన్నారు. ఇందుకోసం వారు ఆయా ప్లాన్ల కోసం 45 శాతం వరకూ ప్రీమియం చెల్లించేందు కైనా సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులో ఉన్న బ్రిటన్, అమెరికాలతో పోలిస్తే కొత్త సర్వీసులకు అప్‌గ్రేడ్ అవ్వాలని భావిస్తున్న వారి సంఖ్య భారత నగరాల్లో రెండింతలు ఎక్కువగా ఉంది. ► రెండేళ్లలో 5జీ హ్యాండ్సెట్ వినియోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 5జీ రెడీ ఫోన్లు ఉన్న 10 కోట్ల మంది పైగా యూజర్లు 2023లో 5జీ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే యోచనలో ఉన్నారు. వీరిలో సగం మంది వచ్చే 12 నెలల్లో మరింత ఎక్కువ డేటా ప్లాన్లకు మారాలని భావిస్తున్నారు. ► సేవల నాణ్యత, లభ్యతపై మరింతగా దృష్టి పెడుతూ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు టెలికం సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదు. తొలినాళ్లలోనే 5జీ సేవలను ఎంచుకునే వారికి వినూత్నమైన అనుభూతిని అందించగలిగితే కంపెనీలు మరింతగా ఆర్జించే అవకాశాలు ఉంటాయి. -
5జీ దూకుడు మామూలుగా లేదుగా, ఎన్ని అవాంతరాలున్నా తగ్గేదేలే!
సాక్షి,న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ రికార్డు స్థాయిలో దూసుకుపోనుంది. గ్లోబల్ 5జీ మొబైల్ సబ్స్క్రిప్షన్లు 2022లో 100కోట్లను అధిగమించ గలవని అంచనా వేస్తున్నట్లు, స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తాజాగా వెల్లడించింది. qఅయితే బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అనిశ్చితుల కారణంxe తమ అంచనాలో 2022లో సుమారు 100 మిలియన్ల మేర తగ్గాయని కంపెనీ తన ద్వైవార్షిక మొబిలిటీ నివేదికలో పేర్కొంది. 10 ఏళ్లకు బిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన 4జీ కంటే రెండేళ్ల ముందుగానే ఈ మార్కును చేరుకుంటుందని వ్యాఖ్యానించింది. తాజా నివేదిక ప్రకారం మొదటి త్రైమాసికంలో 5జీసబ్స్క్రిప్షన్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 620 మిలియన్లకు చేరుకోగా, 4జీ సబ్స్క్రైబర్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 4.9 బిలియన్లకు చేరుకున్నాయి. 4 జీ కంటే 100 రెట్ల వేగాన్ని అందించే 5జీ వినియోగదారుల సంఖ్య గరిష్ట స్తాయికి చేరుకుంటుందని తెలిపింది. 4జీ వినియోగదారుల వృద్ధి ఈ సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ 5జీ నేపథ్యంలో సబ్స్క్రైబర్ల తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. కాగా 4 జీ చందాదారులు రికార్డుస్థాయికి చేరతారని గత ఏడాది ఎరిక్సన్ ముందుగానే అంచనా వేసింది. 5జీ నెట్వర్క్, 120 డాలర్ల కంటే తక్కువకు హ్యాండ్సెట్ ధరల కుదింపులో టెలికాం ఆపరేటర్ల ఒత్తిడి 5జీ స్వీకరణకు సహాయపడిందని రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పీటర్ జాన్సన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తర అమెరికాలో65 మిలియన్లతో పోలిస్తే 2021లో 270 మిలియన్ల చైనా వినియోగదారులున్నారని వెల్లడించారు. అయితే 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఏడాది చివరి నుండి భారత్‌లో 5జీ సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. కాగా దేశీయంగా 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని ఎరిక్సన్ గతంలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
5జీ నెట్వర్క్ అదుర్స్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు
న్యూఢిల్లీ: మొబైల్ చందాదార్ల విషయంలో 5జీ టెక్నాలజీ చరిత్ర సృష్టించనుంది. భారత్‌లో 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం మొబైల్ చందాదార్లలో ఇది 39 శాతం వాటా అని టెలికం గేర్ మేకర్ ఎరిక్సన్ వెల్లడించింది. ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల సంఖ్య ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 81 కోట్లుగా ఉంటుంది. ఆరేళ్లలో ఇది 120 కోట్లకు ఎగుస్తుందని అంచనా. 4జీ యూజర్లు 79 కోట్ల నుంచి 71 కోట్లకు వచ్చి చేరుతుంది. 4జీ చందాదార్ల వాటా ప్రస్తుతం ఉన్న 68 నుంచి 55 శాతానికి పడిపోతుంది. అంతర్జాతీయంగా మొత్తం చందాదార్లలో 5జీ యూజర్ల సంఖ్య సుమారు 50 శాతానికి చేరుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 62 శాతం వాటా వీరిదే. చైనా, ఉత్తర అమెరికా నుంచి అంచనాలను మించి డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2011 నుంచి మొబైల్ డేటా ట్రాఫిక్ 300 రెట్లు అధికమైంది. 2021 చివరినాటికి 200 కోట్లకుపైగా ప్రజలకు 5జీ నెట్వర్క్ చేరువ అవుతుంది. మొత్తం మొబైల్ నెట్వర్క్ డేటా ట్రాఫిక్ 2027 చివరికి 370 ఎక్సాబైట్స్ నమోదు కానుంది’ అని ఎరిక్సన్ తెలిపింది. చదవండి: భారత్‌లో ఎక్కువగా కొంటున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే..! -
దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఎరిక్సన్తో కలిసి దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్ నిర్వహించింది. టెలికామ్ శాఖ ఎయిర్‌టెల్‌కు కేటాయించిన 5జీ ట్రయల్ స్పెక్ట్రమ్ ద్వారా దిల్లీ-ఎన్సీఆర్ శివార్లలోని భైపూర్ బ్రమనన్ గ్రామంలో ఈ ట్రయల్స్ జరిపాయి. డిజిటల్ అంతరాన్ని చెరిపేసి, డిజటలీకరణ ప్రక్రియను సంపూర్ణం చేసే సామర్థ్యం 5జీ నెట్‌వర్క్‌కు ఉందనే విషయం ఈ ప్రయోగాల్లో వెల్లడైందని ఇరు సంస్థలు వెల్లడించాయి."సైట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3జీపీపీ-కంప్లైంట్ 5జీ ఎఫ్‌డబ్ల్యుఎ పరికరంలో 200కి పైగా ఎంబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. భౌగోళికంగా మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజీని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు" టెలికామ్ మేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. 3500మెగాహెర్ట్జ్ బ్యాండ్, ఇప్పటికే ఉన్న ఎఫ్డిడి స్పెక్ట్రమ్ బ్యాండ్ ద్వారా ఈ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయిల్స్‌లో భాగంగా ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయిల్స్‌లో 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్ఎస్ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్టెల్ నిలిచింది. (చదవండి: మాట్లాడితే మీనింగ్ ఉండాలి: జుకర్‌బర్గ్ ఆగ్రహం) -
5జీ యూజర్లు @ 33 కోట్లు!
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ టెలికం సేవలకు సంబంధించి యూజర్ల సంఖ్య 2026 నాటికి 33 కోట్లకు చేరే అవకాశం ఉంది. అలాగే ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై నెలవారీగా డేటా వినియోగం మూడు రెట్లు ఎగిసి 40 గిగాబైట్లకు (జీబీ) చేరనుంది. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ బుధవారం ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం నెలవారీ ప్రతీ స్మార్ట్‌ఫోన్‌పై సగటు వినియోగం 14.6 జీబీగా ఉంటోంది. తద్వారా అత్యధిక డేటా వినియోగంలో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘‘భారత్ ప్రాంతంలో 4జీ సబ్స్క్రిప్షన్లు 2020లో 68 కోట్లుగా ఉండగా 2026 నాటికి 83 కోట్లకు చేరతాయని అంచనా. 2026 ఆఖరు నాటికి భారత్‌లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 5జీ కనెక్షన్లు 26 శాతంగా దాకా .. అంటే సుమారు 33 కోట్ల స్థాయిలో ఉండవచ్చు’’ అని ఎరిక్సన్ నివేదికలో పేర్కొంది. 5జీపై మెట్రోల్లో ఆసక్తి.. మెగా, మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఇంటి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం కేవలం 4జీపైనే ఆధారపడుతున్న వారిలో దాదాపు 42 శాతం మంది .. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ కనెక్షన్లపై ఆసక్తిగా ఉన్నట్లు ఎరిక్సన్ ఇండియా హెడ్ నితిన్ బన్సల్ తెలిపారు. ‘‘5జీ కనెక్టివిటీకి కేవలం 10 శాతం అధికం చెల్లించాల్సి రావచ్చు. అయితే, బండిల్డ్ డిజిటల్ సర్వీసులు కూడా లభిస్తే 5జీ కోసం 50 శాతం ఎక్కువైనా చెల్లించేందుకు భారత్‌లో 50 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. 5జీ అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో 4 కోట్ల మంది యూజర్లు కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. 2020లో స్మార్ట్‌ఫోన్ సబ్స్క్రిప్షన్లు 81 కోట్లుగా ఉండగా, ఏటా 7 శాతం వృద్ధి రేటుతో 2026 నాటికి 120 కోట్లకు చేరనున్నాయి. 2020లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో స్మార్ట్ఫోన్ల వాటా 72 శాతంగా ఉంది. స్మార్ట్ఫోన్ల వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి ఇది 98 శాతానికి చేరనుంది. భారత్‌లో స్మార్ట్ఫోన్ల వాడకం అధికంగా ఉండటంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ అవసరాల కోసం కూడా స్మార్ట్ఫోన్లను వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా ఉంది. గతంలో నెలకు 6.9 ఎక్సాబైట్లుగా (ఈబీ) ఉన్న మొ బైల్ డేటా వినియోగం, 2020 నాటికి 9.5 ఈబీకి పెరిగింది. 2026కి 4 రెట్లు పెరిగి 41 ఈబీకి చేరనుంది. కొత్తగా 43 కోట్ల పైచిలుకు స్మార్ట్ఫోన్లు సబ్స్క్రిప్షన్లు జత కానుండటంతో 2016 నాటికి వీటి సంఖ్య 120 కోట్లకు చేరనుంది. -
ఏడాదిలో రెట్టింపైన టెలికాం రంగం ఉద్యోగాలు
టెలికాం రంగంలో త్వరలో రాబోయే 5జీ టెక్నాలజీ వల్ల 2020 నాల్గవ త్రైమాసికం, 2021 మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల నియామకం రెట్టింపు అయినట్లు డేటా అండ్ ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్‌డేటా తన నివేదికలో వెల్లడించింది. కొత్త తరం టెక్నాలజీ 5జీపై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు, ప్రభుత్వం ట్రయల్స్, టెస్టింగ్ కోసం అనుమతించినట్లు తెలిపింది. 5జీ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న నెట్వర్క్ ఎలిమెంట్స్‌కి అనుసంధానించాలని కంపెనీలు చూస్తున్నాయి. "2020 నాల్గవ త్రైమాసికంలో, 2021 మొదటి త్రైమాసికంలో మధ్య ఉద్యోగాల నియామకం రెట్టింపు అయ్యాయి. 5జీ డొమైన్లో నైపుణ్యం గల ఇంజనీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నెట్‌వర్క్‌లు, ఐపీ నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, ఫర్మ్‌వేర్, ఆటోమేషన్ వంటి రంగాలలో అనుభవం గల ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నట్లు" గ్లోబల్‌డేటాలో బిజినెస్ ఫండమెంటల్స్ అనలిస్ట్ అజయ్ తల్లూరి తెలిపారు. టెలిఫోనాక్టిబోలాగేట్ ఎల్ఎమ్ ఎరిక్సన్(ఎరిక్సన్) భారతదేశంలో 2020 జనవరి 1 నుంచి కొత్తగా మరో 20 శాతం ఉద్యోగా నియామకాలను చేపట్టింది. ఎందుకంటే కంపెనీ సెల్యులార్, రేడియో నెట్వర్క్ అవకాశాలను పరిశీలిస్తుంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 5జీ ప్రాజెక్టుల కోసం సిస్కో సిస్టమ్స్ 5 బిలియన్ డాలర్ల(రూ.36,546 కోట్లు)ను పెట్టుబడి పెట్టింది. అందులో భాగంగానే 2020 1 జనవరి నుంచి కంపెనీ భారతదేశంలో మరో 30 శాతానికి కంటే ఎక్కువ శాతం ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వర్చువలైజ్డ్ క్లౌడ్ సేవలను ప్రారంభించడానికి సిస్కో క్లౌడ్ కోర్, ప్యాకెట్ కోర్ కోసం ఇంజనీర్లను ఎంచుకుంటుంది. డెల్ టెక్నాలజీస్ (డెల్), క్వాల్కామ్ టెక్నాలజీస్ వంటి 5జీ డొమైన్లో భారీగా ఉద్యోగా నియామకాలు చేపడుతున్నాయి. అందుకే కేవలం ఒక ఏడాదిలో ఈ డొమైన్లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు గ్లోబల్‌డేటా సంస్థ తన నివేదికలో పేర్కొంది. చదవండి: RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి -
టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రూ.12,195 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. టెలికం శాఖ(డాట్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పథకంలో నమోదు చేసుకునే ప్రక్రియ శుక్రవారం (జూన్ 4న) ప్రారంభమై జూలై 3 దాకా కొనసాగుతుంది. అర్హత పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 దాకా పెట్టే పెట్టుబడులు, విక్రయాలపై ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపజేస్తారు. అధునాతన టెక్నాలజీ ఊతంతో దేశీ కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం స్కీము ప్రధాన లక్ష్యమని డాట్ వెల్లడించింది. ఈ పథకం ఊతంతో వచ్చే అయిదేళ్లలో దేశీయంగా రూ. 2.44 లక్షల కోట్ల విలువ చేసే టెలికం పరికరాల ఉత్పత్తి జరగగలదని అంచనా. టెలికం పీఎల్ఐ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో దాదాపు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, రూ.17,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరగలదని అంచనాలు ఉన్నాయి. దేశ, విదేశ కంపెనీలు.. చిన్న, మధ్య తరహా సంస్థలు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి.. ఎంఎస్ఎంఈలకు రూ.10 కోట్లుగాను, ఇతర సంస్థలకు రూ.100 కోట్లుగాను ఉంటుంది. స్థలం, నిర్మాణ వ్యయాలను పెట్టుబడి కింద పరిగణించరు. ఎరిక్సన్, నోకియా, హెచ్ఎఫ్సీఎల్ వంటి అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడంపై ఆసక్తిగా ఉన్నాయి. స్టీల్, ఆటో, జౌళి రంగాలు త్వరలో నోటిఫై ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి రంగాల్లో అమలుకుగాను ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐ) కేంద్రం త్వరలో నోటిఫై చేయనుంది. తద్వారా ఈ పథకం కింద ఆయా రంగాల్లో పెట్టుబడులకు సంబంధిత సంస్థలకు వీలుకలుగుతుంది. పథకం అమలుకు సంబంధించి ప్రకటించిన నోటిఫికేషన్ విధివిధానాలకు అనుగుణంగా సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకోగలుగుతాయి. అనంతరం దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్ వంటి రంగాలకు పీఎల్ఐ నోటిఫై జరిగింది. ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి వంటి రంగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీపీఐఐటీ(పారిశ్రామిక, అంతర్గత వాణిజాభివృద్ధి శాఖ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా గురువారం జరిగిన ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ వెబినార్‌లో వెల్లడించారు. భారత్ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేయడానికి వీలుగా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితికిగాను రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 రంగాలకు ఈ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి. ఏసీసీ బ్యాటరీ, సోలార్ మాడ్యూల్స్ విభాగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. సప్లై చైన్ సవాళ్ల పరిష్కారం, తయారీ రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులకు కూడా తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వెబినార్‌లో సుమితా దావ్రా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ స్కీమ్ దోహదపడుతుందన్నారు. చదవండి: భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ సగటు వినియోగం -
గామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ పరీక్షలు జరిపేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఆరు నెలలపాటు ట్రయల్స్ నిర్వహించుకునేలా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, గుజరాత్లో ఈ పరీక్షలు జరుగుతాయి. టెస్టుల్లో భాగంగా టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయం తీరును సైతం పర్యవేక్షిస్తారు. అనుమతి రుసుము చెల్లించిన తర్వాత ఎంటీఎన్ఎల్కు కూడా ట్రయల్ స్పెక్ట్రం కేటాయించనున్నారు. ఢిల్లీలో 5జీ ట్రయల్స్ కోసం సీ-డాట్‌తో ఈ సంస్థ చేతులు కలిపింది. భారత్‌లో 5జీ పరీక్షల కోసం ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సి-డాట్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. చైనా కంపెనీలకు ఈ విషయంలో అవకాశం ఇవ్వలేదు. రిలయన్స్ జియో తన సొంత టెక్నాలజీతోపాటు శామ్సంగ్ నెట్వర్క్ గేర్స్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. 4జీతో పోలిస్తే 5జీ డౌన్లోడ్ వేగం పదిరెట్లు మెరుగ్గా ఉంటుందని టెలికం శాఖ అంచనా వేస్తోంది. చదవండి: స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్ -
నెలకు 25 జీబీ డేటా!!
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల ద్వారా డేటా వినియోగం 2025 నాటికల్లా నెలకు 25 జీబీ స్థాయికి చేరనుంది. చౌక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, వీడియోల వీక్షణలో మారుతున్న అలవాట్లు ఇందుకు కారణం కానున్నాయి. టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 గణాంకాల ప్రకారం భారతీయులు నెలకు సగటున 12 జీబీ డేటా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇది అత్యధికం కావడం గమనార్హం. దేశీయంగా 2025 నాటికి కొత్తగా 41 కోట్ల పైచిలుకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎడిటర్ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. అప్పటికి భారత్‌లో 18 శాతం మంది 5జీ నెట్‌వర్క్‌ను, 64 శాతం మంది 4జీ నెట్వర్క్, మిగతా వారు 2జీ/3జీ నెట్వర్క్ వినియోగిస్తుంటారని వివరించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2020 ఆఖరు నాటికి 5జీ యూజర్ల సంఖ్య 19 కోట్లుగా ఉండొచ్చని, 2025 ఆఖరు నాటికి ఇది 280 కోట్లకు చేరే అవకాశం ఉందని ఎరిక్సన్ అంచనా వేస్తోంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో 4జీ ప్రధాన మొబైల్ యాక్సెస్ టెక్నాలజీగా ఉంటుందని పేర్కొంది. -
2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవల సబ్‌స్క్రిప్షన్‌కు మరో రెండేళ్ల సమయం పడుతుందని స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ అంచనావేసింది. చందాదారులకు ఈ సేవలు 2022లో అందుబాటులోకి రానున్నాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ (ఈఎంఆర్) పేరిట తాజాగా విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్ సబ్స్క్రిప్షన్లు ఎల్టీఈని కలిగి ఉంటాయని అంచనాకట్టింది. ఒక్కో స్మార్ట్‌ఫోన్ సగటు నెలవారీ ట్రాఫిక్ 2025 నాటికి 24జీబీకి చేరనుందని విశ్లేషించింది. -
అనిల్ అంబానీకి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ 453 కోట్లు క్లియర్ చేయడంతో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కొట్టివేసింది. అనిల్ కంపెనీకి ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ బాసటగా నిలవడం, కంపెనీ ఆస్తులను జియో కొనుగోలు చేయడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎరిక్సన్కు బకాయిలను చెల్లించింది. అంతకుముందు రిలయన్స్ జియోకు ఆస్తులు విక్రయించినప్పటికీ తమ బకాయిలను చెల్లించలేదని ఎరిక్సన్ సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, అనిల్ అంబానీతో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చీఫ్ ఛాయా విరానీలను నిందితులుగా సుప్రీం విచారణ సాగింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్ ఇండియాకు రూ 453 కోట్లను చెల్లించాలని లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారికి రూ కోటి చొప్పున జరిమానా కూడా విధించింది. -
అనిల్ అంబానీకి తప్పిన ‘కారాగార’ ముప్పు
న్యూఢిల్లీ: బిలియనీర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి ‘కారాగార’ ముప్పు తప్పింది. అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు సరిగ్గా ఒక్కరోజు ముందు స్వీడన్ టెలికం పరికరాల తయారీ సంస్థ– ఎరిక్సన్కు ఇవ్వాల్సిన రూ.458.77 కోట్లను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చెల్లించింది. సోమవారం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించినట్లు ఆర్‌కామ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ నుంచి రావాల్సిన మొత్తం అందినట్లు (సోమవారం రూ.458.77 కోట్లు. అంతక్రితం 118 కోట్లు) ఎరిక్సన్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. వడ్డీతోసహా రావాల్సిందంతా అందినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. సోమవారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ షర్ ధర నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో 9 శాతం పడి, రూ.4 వద్ద ముగిసింది. కేసు క్రమం ఇదీ... ►ఆర్‌కామ్ దేశవ్యాప్త టెలికం నెట్వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్‌తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ►రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది. ►అయితే ఈ కేసును ఆర్‌కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. ►ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ►ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్‌కామ్‌కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ►డిసెంబర్ 15లోపు బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చని సూచించింది. ► అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ► దీనిపై ఫిబ్రవరి 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును ప్రకటించింది. ► ఈ కేసులో అనిల్ అంబానీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ► నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ►ఈ కేసులో ఆర్‌కామ్ చైర్మన్ అనిల్‌తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చిరహా విరాణి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. ► ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. ►తదనంతరం ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను ఎరిక్సన్కు చెల్లించేందుకు అనుమతివ్వాలంటూ ఆర్‌కామ్ రుణ దాతలు– బ్యాంకర్లును అభ్యర్థించింది. అయితే ఇందుకు అవి ససేమిరా అన్నాయి. ఆదుకున్న అన్న! ‘‘ఈ క్లిష్ట సమయాల్లో నా వెంట నిలిచిన గౌరవనీయులైన నా అన్న, వదిన ముకేశ్, నీతాలకు హృదయపూర్వక ధన్యవాదములు. సకాలంలో సహకారం అందించడం ద్వారా మా కుటుంబ విలువలకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. నేను, నా కుటుంబం గతాన్ని దాటి వచ్చినందుకు కృతజ్ఞులం’’ అంటూ ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. దీంతో ఎరిక్సన్కు బకాయిల చెల్లింపునకు కావాల్సిన మొత్తాన్ని సోదరుడు ముకేశ్ అంబానీ సమకూర్చి ఆదుకున్నట్టు అనిల్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. -
అబ్బే... అదెలా కుదురుతుంది!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్కు బాకీ చెల్లింపునకు ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను వినియోగించాలన్న ఆర్‌కామ్ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇందుకు అనుమతించాలంటూ ఆర్‌కామ్ చేసిన విజ్ఞప్తిని ఫైనాన్షియల్ క్రెడిటార్స్ (రుణ దాతలు) తోసిపుచ్చారు. ఈ మేరకు తమ వాదనలను ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో వినిపించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌కామ్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియ అమలు కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనితో సంస్థ ఏ చెల్లింపులు జరపాలన్నా తప్పనిసరిగా రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిఫండ్స్ ఆర్‌కామ్ వినియోగంపై విధించిన మారటోరియంను తొలగించాలని అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆర్‌కామ్ ఆశ్రయించింది. ఆయితే మారటోరియం తొలగించరాదని రుణ గ్రహీతలు తమ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ మార్చి 11న జరుగుతుంది. 8వ తేదీలోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. ఎరిక్సన్కు బకాయిల కేసులో ఇప్పటికే ఆర్‌కామ్ 118 కోట్లు డిపాజిట్ చేసింది. మిగిలిన మొత్తం రూ.453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించకుండా మూడు నెలలు కంపెనీ చీఫ్ అనిల్ అంబానీ, మరో ఇరుగ్రూపు సంస్థల డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ నెల 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీనితో కంపెనీ నిధుల సమీకరణ ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. -
అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఎరిక్సన్ ఇండియా వివాదంలో రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి భారీ షాక్ తగిలింది. రూ. 550 కోట్ల బకాయిలను చెల్లించే ఉద్దేశం ఆర్‌కాంకు లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగువారాలలో ఎరిక్సన్ ఇండియాకు రూ. 453 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఎరిక్సన్ వాదనను కోర్టు సమర్ధించింది. కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆర్‌కాంకు సుప్రీం మొట్టికాయలేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది. ఇందుకు అనిల్ అంబానీతో పాటు ఇద్దరు డైరెక్టర్లను (రిలయన్స్ టెలికం ఛైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ అధ్యక్షురాలు ఛాయా విరాని) ఈ కేసులో దోషులుగా సుప్రీం తేల్చింది. ఒక్కొక్కరికీ కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. నెల రోజుల్లోగా వీటిని డిపాజిట్ చేయవలసిందిగా ఆదేశించింది. లేదంటే నెలరోజుల పాటు జైలుకెళ్లాల్సి వుంటుందని తీర్పు చెప్పింది. 4 వారాల్లో ఈ సొమ్మును చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మరోవైపు అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలన్న ఎరిక్సన్ పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి లాభాల మార్కెట్లో అడాగ్ గ్రూపు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కాగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌కాం ఎరికసన్ బకాయిలను చెల్లించడంలో ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది. రిలయన్స్ జియోకు ఆస్తుల విక్రయం ద్వారా నిధుల సమీకరణ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఆస్తుల విక్రయంలో విఫలంకావడంతో నిధుల కొరత కారణంగా ఎరిక్సన్కు చెల్లింపులను చేయలేకపోయానని అనిల్ అంబానీకి కోర్టుకు తెలిపారు. అయితే 2018 డిసెంబర్ 15లోగా బకాయిలను చెల్లించవలసిందిగా గత అక్టోబర్ 23న కోర్టు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) సంస్థ ఆర్‌కామ్‌ను సుప్రీం ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించింది కూడా. అయినా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపాలనీ, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలంటూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం రూ. 550కోట్లను చెల్లించాల్సిందిగా అనిల్ అంబానీకి ఆదేశాలు జారీచేయమంటూ కోర్టును అభ్యర్థించింది. దీన్ని విచారించిన సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. -
అంబానీకి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పందన కోరుతూ సోమవారం నోటీసులు జారీ చేసింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం అంబానీ, ఇతరులను ఆదేశించింది. అయితే బకాయి కింద రూ.118కోట్లను అంగీకరించాల్సిందిగా ఆర్‌కాం తరపున వాదించిన న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహతగి కోర్టును కోరారు. అయితే ఎరిక్‌సన్‌దీనికి ససేమిరా అంది. మొత్తం బకాయిని డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. దీంతో కోర్టు రిజిస్ట్రీలో రూ. 118 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను డిపాజిట్ చేయాల్సింగా ఆర్‌కాంను కోరింది. అలాగే రిలయన్స్ జియోతో కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఆర్‌కాంకు నారిమన్ సూచించారు. పరస్పరం సమస్యను పరిష్కరించుకోని పక్షంతో తామేమి చేయలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు స్పెక్ట్రం ట్రేడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఆర్‌కాం కొనుగోళ్లపై సిద్ధంగా ఉన్నారా అని జియోను కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే ముందస్తు బకాయిలతో ఉన్న సమస్యల నేపథ్యంలో, ఆర్‌కాంకు ఫిజికల్ గ్యారంటీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని జియో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ ఇటీవల ఆర్‌కాంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. అనిల్ అంబానీని అరెస్టు చేయాలని, దేశం విడిచి పారిపోకుండా నియంత్రించాలంటూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించింది. బకాయిల చెల్లింపునకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన అనిల్ అంబానీ గడువు తీరినా స్పందించడం లేదని, తద్వారా కోర్టు గడువును కూడా ఉల్లంఘించారని ఎరిక్సన్ తన పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అనిల్ అంబానీకి స్వీడన్ సంస్థ ఎరిక్సన్ షాక్