న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవల సబ్‌స్క్రిప్షన్‌కు మరో రెండేళ్ల సమయం పడుతుందని స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ అంచనావేసింది. చందాదారులకు ఈ సేవలు 2022లో అందుబాటులోకి రానున్నాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ (ఈఎంఆర్) పేరిట తాజాగా విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు ఎల్‌టీఈని కలిగి ఉంటాయని అంచనాకట్టింది. ఒక్కో స్మార్ట్‌ఫోన్ సగటు నెలవారీ ట్రాఫిక్ 2025 నాటికి 24జీబీకి చేరనుందని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment