
భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5G సేవలు (5G Services) అందుబాటులోకి వచ్చాయి. దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio) , భారతీ ఎయిర్‌టెల్ (Airtel), 5జీ సేవలను కొన్ని మెట్రో నగరాల్లో అందిస్తున్నాయి. 5జీ ఇంటర్నరెట్ స్పీడ్ 4జీతో పోల్చితే పది రెట్లు వేగవంతంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 5G డేటా స్పీడ్ ఎంతో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా టెస్ట్ చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
వామ్మో ఏం స్పీడ్!
అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెలికాం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను పరీక్షించిగా అందులో 5G డౌన్‌లోడ్ స్పీడ్ 16.27 Mbps నుంచి 809.94 Mbps వరకు ఉందని విశ్లేషణలో తేలింది. సాధారణంగా మన ఇండియాలో 4G ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ యావరేజ్‌గా సెకన్‌కు 21.1MB ఉంటుంది. ఈ స్పీడ్‌తో పోలిస్తే ప్రస్తుతం 5G నెట్‌వర్క్ ఇండియాలో కొన్ని చోట్ల చాలా రెట్లు అధికంగా డౌన్‌లోడ్ స్పీడ్ ఆఫర్ చేస్తోంది.
నివేదికలోని డేటా ప్రకారం.. 5G టెస్ట్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ వేగం 500 Mbpsకి చేరుకుంది. అనగా సెకండ్‌కు 500 mbps డేటా డౌన్‌లోడ్ అవుతోంది. రిలయన్స్ జియో 598.58 Mbpsతో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్‌టెల్ ఢిల్లీలో 197.98 Mbps రెండో స్థానంలో ఉంది. జూన్ 2022 నుంచి ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసితో సహా - నాలుగు మెట్రోలలో 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ను Ookla రికార్డ్ చేసింది. ముంబైలో ఎయిర్‌టెల్ 271.07 Mbps మధ్యస్థ డౌన్‌లోడ్ వేగంతో జియో కంటే వెనుకబడి ఉంది. ఓక్లా ప్రకారం, ఆగస్టు 2022లో మొబైల్ డౌన్‌లోడ్ వేగం 13.52 Mbpsతో భారతదేశం ప్రపంచంలో 117వ స్థానంలో ఉంది.
చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment