దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ టారిఫ్ ధరల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ మరికొన్ని రోజుల్లో 5జీ ప్లాన్స్ ధరల్ని ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఎయిర్‌టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..5జీ వినియోగదారులు తక్కువగా ఉండి, టారిఫ్ ధరలు ఎక్కువగా ఉంటే..ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) పెరగదని తెలిపారు. అదే సమయంలో థాయిల్యాండ్‌లో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉందని, అందుకు కారణం ఈ ఫాస్టెస్ట్ నెట్ వర్క్ టారిఫ్ ధరలు ఎక్కువగా ఉండడమేనని అన్నారు.
కాబట్టే భారత్‌లో 4జీ తో పోలిస్తే 5జీ ధరలు ఎక్కువగా ఉండవని చెప్పారు. ‘టెలికం రంగంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ఆర్‌ఓఐ) కేవలం 7శాతం మాత్రమే ఉంది. ఆర్‌ఓఐ పెరిగలంటే అది ఏఆర్‌పీయూతోనే సాధ్యమని పేర్కొన్నారు.
చదవండి👉ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదంట!
Comments
Please login to add a commentAdd a comment