5g test
-
ఇక ప్రైవేట్ సంస్థలకు బాడ్ టైమే!.. 5జీ ట్రయల్స్ సక్సెస్..
-
గుడ్‌న్యూస్.. బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం
BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు."బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.Connecting India! Tried @BSNLCorporate ‘s #5G enabled phone call. 📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024 -
సిమ్ కార్డ్, నెట్ లేకుండానే వీడియోలు.. ఎలాగంటే..
మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూడవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్(డీ2ఎం) ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 మెగాహెర్డ్జ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రాడ్‌కాస్టింగ్‌లో వీడియో ట్రాఫిక్‌ను 25 నుంచి 30 శాతం డీ2ఎంకి మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌లు అన్‌లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చుని అభిప్రాయపడ్డారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌లు జరిగాయన్నారు. దేశంలో 69 శాతం కంటెంట్‌ను వీడియో ఫార్మాట్లోనే చూస్తున్నారని చెప్పారు. అయితే వీడియోలను అధికంగా వీక్షిస్తున్నపుడు మొబైల్ నెట్‌వర్క్‌ల వల్ల డేటాకు కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం టెక్నాలజీను టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల్లో ప్రసారం చేసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! దేశంలోని దాదాపు 28 కోట్ల కుటుంబాల్లో కేవలం 19 కోట్ల టెలివిజన్ సెట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 80 కోట్ల స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ డీ2ఎం సాంకేతికత అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్ల వినియోగం ఒక బిలియన్(100 కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. ఈ టెక్నాలజీ ద్వారా డేటా ట్రాన్స్మిషన్ ఖర్చులు తగ్గుతాయని, సమర్థమైన నెట్వర్క్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఐఫోన్ యూజర్లకు షాక్.. వామ్మో రెండు నెలలు వరకు..
దేశంలో 5జీ(5G) సేవల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 5జీ సేవల ప్రారంభం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. 5జీ సేవలు ప్రారంభమైనా, ఇంకా కొన్ని స్మార్ట్ఫోన్లలో దానికి అనువైన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ జాబితాలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ యాపిల్ కూడా ఉంది. తాజాగా ఈ అంశంపై ఐఫోన్ మేకింగ్ కంపెనీ స్పందించింది. డిసెంబర్ వరకు ఆగండి ప్రస్తుతం తమ కంపెనీ ఫోన్లలో 5జీ సేవలను వినియోగించేలా అప్డేట్ చేస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు విజయవంతం కాగానే అప్డేట్ అందిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని, డిసెంబరు నాటికి ఐఫోన్ 14 సహా మిగిలిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌లతో పాటు ఐఫోన్ ఎస్ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఎయిర్టెల్, జియో ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. యాపిల్ కూడా ఈ రెండు 5జీ నెట్‌వర్క్‌లపై పరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా మరో వైపు ఇప్పటికే కోట్ల మంది 5జీ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకుని, ఈ సేవలను వినియోగించాలని ఎదురుచుస్తున్నారు. దీంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం.. టెలికాం రంగంలోని ప్రముఖులతో పాటు ఫోన్ తయారీదారులు, చిప్ తయారీదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీస్ ప్రొవైడర్లు, అనేక పరిశ్రమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయనుంది. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్వేర్ అప్డేట్లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనుంది. చదవండి: క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా? -
5జీ డౌన్లోడ్ స్పీడ్ టెస్టింగ్.. వామ్మో అంత వస్తోందా!
భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5G సేవలు (5G Services) అందుబాటులోకి వచ్చాయి. దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio) , భారతీ ఎయిర్టెల్ (Airtel), 5జీ సేవలను కొన్ని మెట్రో నగరాల్లో అందిస్తున్నాయి. 5జీ ఇంటర్నరెట్ స్పీడ్ 4జీతో పోల్చితే పది రెట్లు వేగవంతంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 5G డేటా స్పీడ్ ఎంతో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా టెస్ట్ చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వామ్మో ఏం స్పీడ్! అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెలికాం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను పరీక్షించిగా అందులో 5G డౌన్లోడ్ స్పీడ్ 16.27 Mbps నుంచి 809.94 Mbps వరకు ఉందని విశ్లేషణలో తేలింది. సాధారణంగా మన ఇండియాలో 4G ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ యావరేజ్‌గా సెకన్‌కు 21.1MB ఉంటుంది. ఈ స్పీడ్‌తో పోలిస్తే ప్రస్తుతం 5G నెట్వర్క్ ఇండియాలో కొన్ని చోట్ల చాలా రెట్లు అధికంగా డౌన్లోడ్ స్పీడ్ ఆఫర్ చేస్తోంది. నివేదికలోని డేటా ప్రకారం.. 5G టెస్ట్ నెట్‌వర్క్‌లో డౌన్లోడ్ వేగం 500 Mbpsకి చేరుకుంది. అనగా సెకండ్‌కు 500 mbps డేటా డౌన్లోడ్ అవుతోంది. రిలయన్స్ జియో 598.58 Mbpsతో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్టెల్ ఢిల్లీలో 197.98 Mbps రెండో స్థానంలో ఉంది. జూన్ 2022 నుంచి ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసితో సహా - నాలుగు మెట్రోలలో 5G డౌన్లోడ్ స్పీడ్‌ను Ookla రికార్డ్ చేసింది. ముంబైలో ఎయిర్టెల్ 271.07 Mbps మధ్యస్థ డౌన్లోడ్ వేగంతో జియో కంటే వెనుకబడి ఉంది. ఓక్లా ప్రకారం, ఆగస్టు 2022లో మొబైల్ డౌన్లోడ్ వేగం 13.52 Mbpsతో భారతదేశం ప్రపంచంలో 117వ స్థానంలో ఉంది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
5జీ:తరం మారింది..సూపర్ వేగం వచ్చేసింది
శంకరాభరణం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. ‘‘పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటానూ.. కట్టిన రాగమూనూ అది. ఇప్పుడు బస్సులు.. రైళ్లు, విమనాలు.. రాకెట్లు.. జాకెట్లు...’’ అని. ఇంకొన్ని నెలలు గడిస్తే దేశంలోనూ ఇలాంటి డైలాగులే వినిపిస్తాయి. కాకపోతే కొంత మార్పుతో.. ఎలాగంటే... ‘‘ఆపేయ్.. ఆపేయ్.. ఎప్పుడో 4జీ కాలం నాటి ఇంటర్నెట్టూ.. స్ట్రీమింగ్ సర్వీసున్నూ. ఇప్పుడు సెకనుకు 20 గిగాబైట్ల 5జీ’’ అని!! :::గిళియారు గోపాలకష్ణ మయ్యా అవును. ఇదే వాస్తవం. మొబైల్ ఫోన్లలో సరికొత్త తరం.. విప్లవం మన ముంగిట్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం దాదాపుగా పూర్తవడంతో మునుపెన్నడూ చూడని వేగం, సౌకర్యాలతో ఇప్పుడున్న నాలుగో తరం మొబైల్ టెక్నాలజీని తోసిరాజని వినూత్నమైన 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఏమిటీ 5జీ? ఎలా పనిచేస్తుంది?ఎందుకు దీనికంత క్రేజ్? మనకొచ్చే లాభాలేమిటి? 1979లో తొలి తరం మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత ఈ నలభై ఏళ్ల కాలంలో టెక్నాలజీ ఎంత మారిపోయిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కళ్లముందు ప్రత్యక్షంగా తార్కాణాలు కనిపిస్తునే ఉన్నాయి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రంక్ కాల్ బుక్ చేసి ఆపరేటర్ కాల్ కలిపేదాకా వేచి చూడటమన్న ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్ టెక్నాలజీకి బ్రేక్ వేసి వైర్లెస్ పద్ధతిలో మొబైల్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు కేవలం మాటలు... అది కూడా అరకొరగా వినిపించేవి. ఇప్పుడు స్పష్టమైన హై డిఫినిషన్ వీడియోలూ అరచేతుల్లోని స్మార్ట్ఫోన్లలోకి ఇమిడిపోయాయి. వినోదం, వ్యాపారం, విద్య అన్నీ ఈ స్మార్ట్ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. అయితే.. వేగం, సౌకర్యం అన్న రెండు అంశాల విషయంలో మనిషి దాహం అంతులేనిది. సెకనుకు గిగాబైట్ వేగంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగల 4జీతో తప్తి పడలేదు. అంతకంటే వేగం, మరింత ఎక్కువ సౌకర్యాలు... వాటితోనే అనేకానేక ఇతర లాభాలను ఆశిస్తూ ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో 5జీ మొబైల్ టెక్నాలజీని ఆవిష్కరించారు. మూడేళ్ల క్రితం కొన్ని దేశాల్లో ప్రయగాత్మకంగా 5జీ సేవలు మొదలయ్యాయి కూడా. ఈ ఏడాది అక్టోబరుకల్లా భారత్‌లోనూ 5జీ సేవలకు రంగం సిద్ధమైంది. 4జీ ఎల్టీఈ కంటే భిన్నం.... 5జీ మొబైల్ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్న 4జీ ఎల్టీఈ కంటే పూర్తిగా భిన్నమైంది. 4జీ ఎల్టీఈ కేవలం ఒకే శ్రేణి రేడియో తరంగాలతో పనిచేస్తే.. 5జీ ఏక కాలంలో మూడు రకాల తరంగాలతో పనిచేయగలదు. గిగాహెర్ట్›్జకంటే తక్కువ పౌనఃపున్యమున్న తరంగాలు మొబైల్ ఫోన్ సంకేతాల పరిధి ఎక్కువగా ఉండేందుకు సాయపడతాయి. భవనాల గోడల గుండా సులువుగా సంకేతాలు ప్రయాణం చేయగలవు. తక్కువ లాటెన్సీ (సంకేతాలు మొబైల్‌ఫోన్ నుంచి సెల్ టవర్‌కు చేరేందుకు పట్టే సమయం), ఎక్కువ వేగం (సెకనుకు గిగాబైట్ వరకూ) ఇవ్వగల మిడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను కూడా 5జీలో వాడతారు. చివరగా సెకనుకు పది గిగాబైట్ల వేగం ఇవ్వగల హైబ్యాండ్ స్పెక్ట్రమ్ తరంగాలూ ఈ కొత్త టెక్నాలజీలో భాగం కావడం గమనార్హం. 4జీలో లాటెన్సీ గరిష్టంగా 98 మిల్లీసెకన్లయితే 5జీలో ఇది మిల్లీ సెకను కంటే తక్కువ. డౌన్లోడింగ్ వేగాలు చూస్తే 4జీలో 1సెకనుకు 100 మెగాబైట్ల నుంచి ఒక గిగాబైట్ వరకూ ఉంటుంది. 5జీలో 1సెకనుకు కనీసం పది గిగాబైట్ల నుంచి గరిష్ఠంగా 20 గిగాబైట్ల వరకూ ఉంటుంది. అంతేకాదు.. ఇప్పటి నెట్‌వర్క్‌లో ఒక్కో మొబైల్ టవర్ ద్వారా 200 నుంచి 400 మందికి సేవలందితే.. 5జీలో వంద రెట్లు ఎక్కువ మంది సులువుగా అందుకోగలరు. లోటుపాట్లూ లేకపోలేదు... 5జీ టెక్నాలజీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఉన్న వాటిని తొలగించి కొత్త బేస్‌స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. టెక్నాలజీ ఎంత విజయవంత మవుతుందనేది ఈ లోపాలను అధిగమించడంలో ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు అత్యధికంగా మొబైల్ నెట్‌వర్క్‌లోకి చేరుతూండటం వల్ల భద్రత, వ్యక్తిగత గోప్యత వంటివి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు హ్యాకర్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మన దేశంలో ఎందుకాలస్యం..? అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ సౌదీ అరేబియా వంటి దాదాపుగా 72 దేశాల్లో 1950 వరకు నగరాల్లో 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. 2019లోనే దక్షిణ కొరియా 5జీ సేవల్ని ప్రారంభించింది. మన దేశంలో 2020లోనే 5జీ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో టెలికమ్యూనికేషన్ శాఖ 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంతేకాకుండా 5జీ నెట్‌వర్క్‌కు కావాల్సిన ఫైబర్ నెట్వర్క్ లైన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గత ఏడాది నాటికి కేవలం దేశంలో 30% ప్రాంతాల్లో ఈ ఫైబర్ నెట్వర్క్ లైన్లు పూర్తయితే, మరో 70 శాతం మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. టెలికాం సంస్థలన్నీ పూర్తి స్థాయిలో ఫైబర్ నెట్వర్క్ లైన్లు వెయ్యాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అంచనా. అందుకే ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. టెక్నాలజీతో మన బుర్రలు మందగిస్తాయా? 5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మనుషులకు పని తగ్గిపోతుంది. అయితే దీనివల్ల మన బుర్రలు మందగిస్తాయని కొందరి వాదన. ఒకప్పుడు 30 నలభై ఫోన్ నెంబర్లను అలవోకగా గుర్తుంచుకోగలిగేవాళ్లమని... మొబైల్ ఫోన్లు వచ్చిన తరువాత అది సాధ్యం కావడం లేదని తమ వాదనకు ఆధారంగా కొందరు వ్యాఖ్యానిస్తూంటారు. ఇందులో నిజం కొంతే. ఎందుకంటే అవసరం లేని విషయాలపై దృష్టి పెట్టకపోవడం మెదడుకు ఉన్న సహజ లక్షణం. అలాగని మనం మెదడును వాడుకోవడం లేదని కూడా అనుకోనవసరం లేదు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా మునుపటి స్థాయిలో ఫోన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవడం కష్టమేమీ కాదు. మునుపటితో పోలిస్తే మన పరిచయాలు.. ఫోన్ నెంబర్ల సంఖ్య ఎంత పెరిగిందో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు... మొబైల్ఫోన్ల వల్ల మన బుర్ర మందగిస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. విమానాలకు 5జీతో ముప్పు? అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు మొదలైన సందర్భంగా కొంత గందరగోళం ఏర్పడింది. పలు దేశాలు అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నారు. 5జీ మొబైల్ సర్వీసుల కోసం ఉపయోగించే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ, విమానాల్లో ఎత్తును సూచించేందుకు వాడే రేడియో ఆల్టీ మీటర్ వాడే ఫ్రీక్వెన్సీ దాదాపు ఒకే స్థాయిలో ఉండటం వల్ల సమస్యలు వస్తాయని గుర్తించడం ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరిలో వెరిజాన్, ఏటీ అండ్ టీ టెలికామ్ సంస్థలు అమెరికాలో తమ 5జీ సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంలో ఈ విషయాన్ని గుర్తించారు. 5జీ సంకేతాల కారణంగా రేడియో ఆల్టీమీటర్ ఇంజిన్ తాలూకూ బ్రేకింగ్ వ్యవస్థను ప్రభావితం చేసి విమానాలు ల్యాండింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా చేస్తుందని.. దీనివల్ల విమానాలు రన్‌వే పై ఆగకపోవచ్చునని అమెరికా ప్రభుత్వ సంస్థ ఎఫ్ఏఏ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. రేడియో తరంగాలను ఫిల్టర్ చేసే పరికరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని అంచనా. ఈ ఏడాది చివరికల్లా బోయింగ్ ఇంజిన్ కలిగిన విమానాలు ఈ రేడియో ఫిల్టర్లను అమర్చుకోవాలని ఫెడరల్ ఏవియేష¯Œ ఏజెన్సీ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ తొలి తరం...(1జీ) 1979 మొట్టమొదట వైర్లెస్ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది జపాన్‌కు చెందిన నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ (ఎన్టీటీ) టోక్యో నగరంలో ప్రారంభించింది. 1979లో మొదలు కాగా.. 1984 నాటికి జపాన్ మొత్తం 1జీ నెట్వర్క్ విస్తరణ జరిగింది. అమెరికాలో 1980లో, యునైటెడ్ కింగ్డమ్లో 1985లో 1జీ సేవలు మొదలయ్యాయి. గరిష్ట వేగం సెకనుకు కేవలం 2.4 కిలోబైట్స్ మాత్రమే. మాటలు మాత్రమే ఉన్న మొబైల్ సర్వీస్ ఇది. రెండో తరం... (2జీ) 1991 యూరోపియన్ దేశం ఫిన్లాండ్లో 1991లో మొదలైంది రెండో తరం మొబైల్ సర్వీస్. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ (జీఎస్ఎమ్) ప్రమాణాలతో డిజిటల్ సిగ్నలింగ్ ఆధారంగా మాటలు మాత్రమే ఉన్న ఈ సర్వీస్ లాభం ఏమిటయ్యా అంటే.. సామర్థ్యం, వేగం రెండూ 1జీ కంటే ఎక్కువ అని చెప్పాలి. బ్యాండ్‌విడ్త్‌ను చూసుకుంటే 30 – 200 కిలోహెర్ట్›్జమధ్యలో ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్‌లు పంపుకునేందుకు కూడా అవకాశం లభించింది. కాకపోతే ఈ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్‌ల వేగం గణనీయంగా తక్కువ. 2జీ నెట్వర్క్ ద్వారా అత్యధిక వేగం సెకనుకు 64 కిలోబైట్స్ మాత్రమే. మాటలకు వీడియోలు తోడైన మూడో తరం... (3జీ) 2001 మాటలకు... డేటా తోడైన మూడో తరం మొబైల్ సర్వీసులు 2001లో ఎన్టీటీ డోకోమో ద్వారా ప్రారంభమయ్యాయి. వినియోగదారులందరికీ ఒకే రకమైన ప్రమాణాలతో, అత్యధిక సామర్థ్యంతో డేటాను ప్రసారం చేయడంతోపాటు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ వేగం ఉండేలా ఇందులో జాగ్రత్తలు తీసుకున్నారు. మొబైల్ఫోన్ల ద్వారా వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, స్ట్రీమింగ్ సౌకర్యాలు కూడా దీంతోనే అందుబాటులోకి వచ్చాయి. 3జీ గరిష్ఠ వేగం సెకనుకు మూడు మెగాబైట్లు కావడం గమనార్హం. స్మార్ట్ఫోన్ల శకానికి నాందీ పలికిన నాలుగో తరం... (4జీ) 2009 యూరోపియన్ దేశం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్, నార్వే రాజధాని ఓస్లోలలో 2009లో తొలి 4జీ సర్వీసులు మొదలయ్యాయి. లాంగ్‌టర్మ్ ఎవల్యూషన్ (ఎల్టీఈ), 4జీ ప్రమాణాల పుణ్యమా అని మాటల్లో స్పష్టత, లాటెన్సీ (నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యేందుకు ఫోన్ లేదా పరికరానికి పట్టే సమయం), ఇన్స్టంట్ మెసేజింగ్ వంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇంకోలా చెప్పాలంటే స్మార్ట్ఫోన్లు, హ్యాండ్‌హెల్డ్ పరికరాల శకం మొదలైందన్నమాట. సోషల్‌మీడియా, నాణ్యమైన స్ట్రీమింగ్ సేవల హవా మొదలైందీ ఇప్పటి నుంచే. గరిష్ఠవేగం సెకనుకు 15 నుంచి 20 మెగాబైట్లు. అన్నింటా వేగం.. 5జీ (2019) డేటా ట్రాన్స్ఫర్, అప్లోడ్/డౌన్లోడ్ వేగాలు 4జీ కంటే కనీసం పది రెట్లు ఎక్కువ వేగవంతమైన మొబైల్ సర్వీసు ఈ ఐదో తరం క్లుప్తంగా 5జీ. ’’మీరు కాల్ చేస్తున్న వినియోగదారుడు నెట్వర్క్ పరిధికి ఆవల ఉన్నాడు’’ అన్న సందేశం అస్సలు వినిపించదంటే అతిశయోక్తి కాదు. తక్కువ యాంటెన్నాలతో ఎక్కువమందికి కనెక్షన్లు ఇచ్చేందుకూ వీలు కల్పిస్తుంది ఇది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ల్యాప్‌టాప్‌లతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోవలోకి వచ్చే పరికరాలకూ డేటా సామర్థ్యం అలవడటం వల్ల అనేకానేక లాభాలు ఉంటాయని అంచనా. 2019లో పాశ్చాత్యదేశాల్లో ప్రయోగాత్మంగా మొదలైన ఈ కొత్త మొబైల్ టెక్నాలజీ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. ►2024 నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 65 శాతం మందికి 5జీ సేవలు అందుతాయని ఎరిక్సన్ మొబైల్ రిపోర్ట్ చెబుతోంది. ►2019లో 5జీని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సష్టించింది. ►10 కోట్లు... ప్రస్తుతం దేశంలో 5జీ సామర్థ్యమున్న స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్నవారి సంఖ్య ►50 కోట్లు... 2027 నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ►97 కోట్ల 96 లక్షల 27 వేల కోట్ల రూపాయలు!! 2035 నాటికి 5జీ టెక్నాలజీ కారణంగా అందే వస్తు, సేవల విలువ. ►మూడు కోట్ల 58 లక్షల 42 వేల కోట్ల రూపాయలు!! రానున్న 15 ఏళ్లలో కేవలం 5జీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు అందే మొత్తం. ఆరోగ్యం.. ఆనందం... సౌకర్యం... చిటికెలో రొబోటిక్ సర్జరీలు... 5జీతో వచ్చే మెరుపు వేగం అమెరికా వైద్యుడు అనకాపల్లిలో ఉన్న రోగికీ శస్త్రచికిత్స చేయడాన్ని సుసాధ్యం చేస్తుంది. కనురెప్ప మూసి తెరిచేలోపు గిగాబైట్ల సమాచారం ఖండాలు దాటగలవు కాబట్టి... అత్యవసర పరిస్థితుల్లోనూ సులువుగా ప్రపంచంలోని ఏమూలన ఉన్న నిపుణుడినైనా సంప్రదించవచ్చు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలకు శ్రీకారం చుట్టగల టెలిమెడిసిన్ విస్తృత వాడకంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తుంది ఈ టెక్నాలజీ. అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చునని అంచనా. కొత్త అనుభూతుల లోకం... ఇంటర్నెట్ అంటే ఇప్పటివరకూ మనకు దృశ్య శ్రవణ అనుభూతులను మాత్రమే ఇచ్చేది. అయితే 5జీ రాకతో స్పర్శ కూడా అనుభవంలోకి వస్తుంది. హ్యాప్టిక్స్ అని పిలిచే ఈ కొత్త అనుభవం ఎన్నో లాభాలు తెచ్చిపెట్టనుంది. సమాచారం మెరుపువేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి... అమెరికాలో ఓ వైద్యుడు మెడికల్ రోబో ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న రోగికి శస్త్రచికిత్స చేయగలడు. వీడియోగేమ్‌లు, సినిమాల ద్వారా స్పర్శతోపాటు అనేక ఇతర ఇంద్రియ జ్ఞానాలను ఎక్కడికైనా ప్రసారం చేయవచ్చు. 5జీతో రేడియో ఫ్రీక్వెన్సీల్లోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్కు అనుసంధానమైన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోతుంది. డ్రైవర్ అవసరం లేని వాహనాలు... డ్రైవర్లు అవసరం లేని వాహనాలు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నాయి కానీ... 5జీ విస్తత వాడకంలోకి వస్తే ఇవి సర్వవ్యాప్తమవుతాయి. వేగవంతమైన డేటా ట్రాన్స్‌మిసబిలిటీ కారణంగా వాహనాల్లోని సెన్సర్లు, కెమెరాలు, మైక్రోప్రాసెసర్లు పరిసరాల్లోని ఇతర వాహనాలతో సంభాషించగలవు. తద్వారా ప్రమాదాలు కనిష్ఠస్థాయికి చేరతాయి. వాహనాల మధ్య సంభాషణ సాధ్యమైన కారణంగా రహదారిపై ముందు వెళుతున్న వాహనం ఏదైనా ప్రమాదాన్ని శంకిస్తే లేదా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటే ఆ విషయాన్ని వెనుకన వస్తున్న వాహనాలకు ప్రసారం చేయడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించగలవు. ఫ్యాక్టరీలు నడుస్తాయి.... దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌కు జరిగిన వేలంలో కొంత భాగాన్ని అదానీ గ్రూపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే అదానీ గ్రూపు టెలిఫోన్ సేవలు అందించే అవకాశం తక్కువ. బదులుగా ఇండస్ట్రియల్ అంటే ఫ్యాక్టరీలు నడిపేందుకు 5జీని వాడుకుంటున్నారు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు (ఐఓటీ)లకూ 5జీ ఉపయోగపడుతుంది కాబట్టి.. సెన్సర్లు, రోబోల ద్వారా మొత్తం ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చక్కబెడతారన్నమాట. ఫ్యాక్టరీలేం ఖర్మ... భవిష్యత్తులో ఇళ్లు, భవనాలు కట్టేందుకూ 5జీ ఆధారిత రోబోలు పనికొస్తాయంటే ఆతిశయోక్తి ఏమీ కాదు. పనిచేయాల్సిన ప్రాంతాన్ని కచ్చితంగా మ్యాప్ చేయగలడం, ఇతర రోబోలు, పరికరాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వేగంగా, సురక్షితంగా భవన, వాహనాలు మాత్రమే కాకుండా... ఏ వస్తువునైనా అసెంబుల్ చేయడం సాధ్యమవుతుంది. కృత్రిమ మేధకు ఊపు.... లాటెన్సీ అతితక్కువగా ఉండటం, డేటా ప్రసార వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల కృత్రిమ మేధతో పనిచేసే అల్గారిథమ్‌లను మెరుగైన నాణ్యతతో నడిపించవచ్చు. అంటే కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ నిర్ణయాలు తీసుకోవడం మరింత వేగంగా జరుగుతుందన్నమాట. దీనివల్ల అత్యంత కీలకమైన విషయాల్లోనూ మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు సురక్షితంగా జరిగిపోతాయి. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే.. మానవుల అవసరమే లేకుండా డ్రోన్లు, సెన్సర్లు, కెమెరాలు, స్వతంత్రంగా వ్యవహరించే కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లు కలిసికట్టుగా మన కోసం వ్యవసాయం చేస్తాయి. ఎప్పుడు ఏ కీటకనాశినిని వాడాలి? నీరెప్పుడు అందించాలి? కలుపుతీతకు సమయమేది? వంటివన్నీ తనంతట తానే వాతావరణ, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేందుకు 5జీ వీలు కల్పిస్తుంది. 5జీ టెక్నాలజీలో ’మేకిన్ ఇండియా’కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో ప్రత్యేకమైన 5జీ ఎకోసిస్టమ్ ఏర్పడనుంది.టెక్నాలజీలు, పరికరాలు ఇండియా కేంద్రంగా రూపొందనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో సంస్కరణలు కూడా 5జీ టెక్నాలజీకి దోహదపడతాయి.– కె.జి.పురుషోత్తమన్, కేపీఎంజీ. కోవిడ్ కాలంలో ఆన్లైన్లో వైద్యులను సంప్రదించడం ఎక్కువైంది. 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే టెలిమెడిసిన్‌తోపాటు ఆరోగ్య రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వేగవంతమైన, సురక్షితమైన టెక్నాలజీ కారణంగా వైద్యం అందించే పద్ధతులు కొత్తపుంతలు తొక్కుతాయి. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో, దేశ భద్రత, నిఘా వ్యవస్థల్లోనూ 5జీ కీలకపాత్ర పోషించనుంది. 5జీ ద్వారా కేవలం వీడియోలను చూసి విశ్లేషించడం మాత్రమే కాకుండా.. గుట్టుగా ఫేస్ రికగ్నిషన్ చేసేందుకూ ఉపయోగపడుతుంది. భారత్‌లో 5జీ ఆధారిత టెక్నాలజీలు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కషి చేస్తున్న స్టార్టప్‌లకు క్వాల్కామ్ ఇండియా తనవంతు సహకారం అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు 5జీ హ్యాకథాన్, స్టార్టప్ హబ్‌లలో చురుకుగా పాల్గొంటున్నాము. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా ఛాలెంజ్, ఇన్నొవేషన్ ఫెలోషిప్, యాక్సలరేటర్ సర్వీసస్, ఇన్నొవేషన్ ల్యాబ్స్ వంటి కార్యక్రమాలతో 5జీ టెక్నాలజీల వద్ధికి ప్రయత్నిస్తున్నాం. – రాజెన్ వగాడియా, వైస్ ప్రెసిడెంట్, క్వాల్కామ్ ఇండియా. -
5జి కాల్ విజయవంతం.. ఇంత కాలానికా?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! బలహీనత మంచిదా? ఇండియాలో 1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సరళీకరణ మొదలై, రూపాయి పతనమైంది. సింగపూర్‌లో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ప్రసిద్ధ పెట్టుబడుల బ్యాంకర్‌ను ఆ పతనం గురించి అడిగాను. అది మనకేమీ మంచి చేయదని చెప్పారు. ‘కానీ అది ఎగుమతులకు మంచిది కదా?’ అని నేను ప్రశ్నించాను. ఆయన నవ్వి, ‘బలమైన దేశాలు బలహీన కరెన్సీ కలిగివున్నాయా?’ అన్నారు. కానీ దీన్నే మీరు ‘భక్తానమిస్టులను’ అడిగితే, బలహీన రూపాయి మంచిదని చెబుతారు. – సలీల్ త్రిపాఠీ, కాలమిస్ట్ ఏం జరగనుంది? ఇప్పుడు ట్విట్టర్ డీల్ నుంచి బయటపడాలని వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చూస్తున్నాడు; కానీ దాన్ని కొనాల్సిందేనని ట్విట్టర్ పట్టుబడుతోందా? ఇప్పుడున్న పరిస్థితిని నేను సరిగ్గానే అంచనా వేస్తున్నానా? ఏంటో ఈ చీదర వ్యవహారాన్ని నేను ఫాలో కాలేకపోతున్నాను. – తిమ్మిన్ గెబ్రూ, కంప్యూటర్ సైంటిస్ట్ తెలియాల్సింది తెలుసు ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు ఏం తెలుసో అది అబ్బురపరుస్తుంది. ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు ఏం తెలియదని జనం అనుకుంటారో అది ఆందోళన కలిగిస్తుంది. – నీల్ డెగ్రాస్ టైసన్, ఆస్ట్రో ఫిజిసిస్ట్ వ్యతిరేకతా మంచికే! టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అవకాశవాద హడావిడి వల్ల, ‘నాటో’ కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్లను చేర్చుకోవాలన్న పిచ్చి నిర్ణయం గనక నెమ్మదిస్తే– ప్రత్యేకించి రష్యాతో ఫిన్లాండ్కు సుదీర్ఘ సరిహద్దు ఉన్న నేపథ్యంలో– ఆయన ప్రపంచానికి సేవ చేస్తున్నట్టే. – అజము బరాకా, యాక్టివిస్ట్ ఆత్మనిర్భర్ 5జి ఐఐటీ మద్రాసులో 5జి కాల్‌ను విజయవంతంగా పరీక్షించడమైంది. ఈ ‘ఎండ్ టు ఎండ్’ నెట్వర్క్ మొత్తం రూపకల్పన, అభివృద్ధి ఇండియాలోనే జరిగింది. – అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి ఇంత కాలానికా? బిహార్ కోర్టు 108 ఏళ్ల నాటి ఒక కేసులో తీర్పునిచ్చింది. అది ఆరా సివిల్ కోర్టులో 1914 సంవత్సరానికి సంబంధించిన ఒక భూవివాదం కేసు. ఓ నా ప్రియమైన దేశమా, దుఃఖపడు! – ప్రకాశ్ సింగ్, పోలీస్ మాజీ ఉన్నతాధికారి ఇదేనా పరిష్కారం? సైబర్ దాడుల మీద జరుగుతున్న ఒక చర్చలో, ఆ దాడిని నిరోధించడానికి గానూ మహిళలు తమ ఫొటోలను ఆన్లైన్లో పోస్టు చేయకూడదని ఒకాయన చెప్పే అభిప్రాయాన్ని అతిథులు అనుమతించారు. హ్మ్! – హనా మొహిసిన్ ఖాన్, పైలట్ అలవాటైతే అంతే! కాఫీ చేదుగా ఉంటుంది సరే, కానీ నెమ్మదిగా నువ్వు ఆ చేదుకు అలవాటు పడతావు. – ఐశ్వర్యా ముద్గిల్, వ్యాఖ్యాత -
అదిరిపోయేలా 5జీ డౌన్‌లోన్ స్పీడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా 5జీ డౌన్లోడ్ స్పీడ్ 5.92 జీబీపీఎస్ నమోదైనట్టు ప్రకటించింది. ఎరిక్సన్తో కలిసి మహారాష్ట్రలోని పుణేలో నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఈ మైలురాయిని చేరుకున్నట్టు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. గతంలో డౌన్లోడ్ స్పీడ్ 4 జీబీపీఎస్ నమోదైందని వివరించింది. చదవండి: 5జీ ప్రొడక్ట్స్ తయారీకి విప్రో, హెచ్ఎఫ్సీఎల్ జోడీ -
ఎయిర్టెల్-టీసీఎస్ 5జీ ప్రయోగం విజయవంతం!
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌లో అల్ట్రా ఫాస్ట్, తక్కువ లేటెన్సీ గల సాఫ్ట్ వేర్ మేజర్ న్యూరల్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ కేసులను విజయవంతంగా పరీక్షించినట్లు భారతి ఎయిర్టెల్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రకటించాయి. ఈ టెక్నాలజీ ధ్రువీకరణ కోసం ఎయిర్‌టెల్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ ట్రయల్ స్పెక్ట్రమ్ కేటాయించింది. ఈ టెక్నాలజీ మైనింగ్, కెమికల్ ప్లాంట్, ఆయిల్ & గ్యాస్ ఫీల్డ్ వంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసే రిమోట్ రోబోటిక్ కార్యకలాపాలను నిర్వహించడానికి సహకరిస్తుంది. ఎయిర్టెల్ 5జీ టెక్నాలజీని రిమోట్ రోబోటిక్స్ ఆపరేషన్లు, విజన్ ఆధారిత నాణ్యత తనిఖీల విషయంలో టీసీఎస్ విజయవంతంగా పరీక్షించింది. టీసీఎస్ న్యూరల్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్, 5జీ టెక్నాలజీ కలిసి పారిశ్రామిక కార్యకలాపాలను ఎలా నిర్వావర్తించగలవో, నాణ్యత ఉత్పాదకత & భద్రతను గణనీయంగా ఎలా పెంచగలదో ఈ టెస్టింగ్ నిరూపించింది. పారిశ్రామిక కార్యకలాపాల కోసం 5జీ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడతుందో ఈ ప్రయోగం నిరూపించింది. 5జీ కేవలం ఈ పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొని రానుంది. (చదవండి: విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్ ఆఫర్..!) -
5జీ నెట్వర్క్ మొదట హైదరాబాద్‌కే!?
న్యూఢిల్లీ: 5జీ పరికరాలను, నెట్‌వర్క్‌ను పరీక్షీంచేందుకు ఉపయోగపడే టెస్ట్‌బెడ్ ప్రాజెక్టు తుది దశలో ఉందని టెలికం విభాగం తెలిపింది. ఇది డిసెంబర్ 31 నాటికి పూర్తి కాగలదని పేర్కొంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా తదితర టెల్కోలు హైదరాబాద్, చెన్నైతో పాటు పలు నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహణకు సైట్లను ఏర్పాటు చేసుకున్నాయని వివరించింది.వచ్చే ఏడాది ఈ నగరాల్లోనే తొలుత 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని టెలికం విభాగం పేర్కొంది. 5జీ టెస్ట్‌బెడ్ ప్రాజెక్టుకు టెలికం విభాగం దాదాపు రూ. 224 కోట్ల మేర నిధులు అందిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌తో పాటు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ మొదలైన ఎనిమిది సంస్థలు దీనిపై దాదాపు 36 నెలలుగా పని చేస్తున్నాయి. చదవండి:6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే.. -
దేశంలో తొలిసారిగా గ్రామంలో 5జీ టెస్టింగ్..!
5జీ నెట్వర్క్ విషయంలో దేశంలో మరో ముందడుగు పడింది. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ కోసం మొదటి సారిగా 5జీ ట్రయల్స్ గురువారం ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్రంలోని అజోల్ గ్రామం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీనగర్‌లోని ఉనావా పట్టణంలో బేస్ ట్రాన్స్ సీవర్ స్టేషన్(బిటిఎస్)ను ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహించింది. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ వేగాన్ని కొలవడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన అధికారులు, ఇద్దరు ప్రైవేట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో కూడిన బృందం గ్రామానికి చేరుకుంది. ఈ బృందంలో డిడిజిలు రోషామ్ లాల్ మీనా, అజత్శత్రు సోమని, డైరెక్టర్లు వికాస్ దాదిక్, సుమిత్ మిశ్రా ఉన్నారు. వారి వెంట నోకియా, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఎల్)కు చెందిన సాంకేతిక బృందాలు కూడా ఉన్నాయి. 5జీ ట్రయల్స్ సమయంలో అధికారులు డౌన్లోడ్ వేగం గరిష్టంగా 105.47 ఎంబిపీఎస్, అప్లోడ్ వేగం గరిష్టంగా 58.77 ఎంబిపీఎస్ నమోదైనట్లు తెలిపారు. ట్రయల్స్ వివరాలను మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. రియల్ టైమ్ వీడియో స్ట్రీమ్‌లతో కూడిన విఆర్ కనెక్టెడ్ క్లాస్ రూమ్, 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ(విఆర్) కంటెంట్ ప్లేబ్యాక్, 5జీ ఇమ్మర్సివ్ గేమింగ్ టెక్నాలజీ, 5జి ఇమ్మర్సివ్ గేమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) ఆధారిత 360 డిగ్రీల కెమెరాలను ట్రయల్ సైట్లో పరీక్షించినట్లు తెలిపారు. A team of senior officials of @DoT_India , Gujarat LSA along with the technical team of Vodafone Idea Limited (VIL) and Nokia, visited yesterday the #5G testing sites in the rural area of Gandhinagar. @AshwiniVaishnaw @devusinh @PIBAhmedabad (1/2) pic.twitter.com/QsGDFKhbAd — PIB_INDIA Ministry of Communications (@pib_comm) December 23, 2021 (చదవండి: దివాలా చట్టంలో కీలక సవరణలకు కేంద్రం కసరత్తు..!) -
జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్’
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడే ‘టెస్ట్‌బెడ్’ను జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ (డాట్) కార్యదర్శి కె. రాజారామన్ ఈ విషయం వెల్లడించారు. నిర్దిష్ట ఉత్పత్తి లేదా సర్వీసును పరీక్షించేందుకు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ మొదలైనవి ఇందులో ఉంటాయి. సుమారు రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌బెడ్‌ను రూపొందించే ప్రతిపాదనకు 2018 మార్చ్‌లో కేంద్ర టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని ఐఐటీ విద్యా సంస్థలు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ దీని రూపకల్పనలో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్ సంస్థలకు టెలికం శాఖ స్పెక్ట్రం కేటాయించింది. ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు గడువును మే 26 దాకా లేదా వేలం తర్వాత వ్యాపార అవసరాల కోసం స్పెక్ట్రంను కేటాయించే దాకా పొడిగించింది. చదవండి:5జీ నెట్వర్క్ అదుర్స్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు -
భారత్‌లోని తొలి టెలికాం సంస్థగా రికార్డు సృష్టించిన ఎయిర్టెల్..!
దేశవ్యాప్తంగా పలు దిగ్గజ టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి సంస్థలు 5జీ ట్రయల్స్‌ను ముమ్మరం చేశాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 700MHz బ్యాండ్‌తో దేశంలో 5జీ ట్రయల్స్ టెస్ట్‌ను నిర్వహించిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.5జీ ట్రయల్స్ టెస్ట్‌ను నోకియా భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ టెస్ట్‌ను కోల్కత్తా నగర శివార్లలో నిర్వహించింది. ఈస్ట్రన్ ఇండియాలో నిర్వహించిన తొలి టెస్ట్ కూడా ఇదే. 700 MHz బ్యాండ్ సహాయంతో ఎయిర్టెల్, నోకియా కంపెనీలు రియల్‌టైమ్ పరిస్ధితుల్లో రెండు 3GPP ప్రామాణిక 5G ప్రాంతాల మధ్య 40 కి.మీల హై-స్పీడ్ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కవరేజీని సాధించగలిగాయి. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఎయిర్టెల్ నోకియాకు చెందిన 5G పోర్ట్‌ఫోలియో పరికరాలను వాడింది. ఈ సందర్భంగా ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సింగ్ సెఖోన్ మాట్లాడుతూ...5జీ టెక్నాలజీలో భాగంగా కంపెనీ భారత మొట్టమొదటి 700 MHz బ్యాండ్‌లో 5జీ డెమోను నిర్వహించిన తొలి కంపెనీగా ఎయిర్టెల్ నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఎయిర్టెల్ ప్రత్యక్ష 4G నెట్వర్క్ సహాయంతో తొలి 5G టెక్నాలజీ అనుభవాన్ని ప్రదర్శించింది. చదవండి: అడిడాస్ సంచలనం..! ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా మెటావర్స్ పై కసరత్తు -
వేగం పెంచిన వోడాఫోన్.. 5జీ వేగం ఎంతంటే?
న్యూఢిల్లీ: 5జీ ట్రయల్స్‌లో భాగంగా వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌పై వేగం 9.85 జీబీపీఎస్ నమోదైందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా తెలిపింది. 80 గిగాహెట్జ్ స్పెక్ట్రంలో ఈ–బ్యాండ్ మైక్రోవేవ్‌ను వినియోగించి ఈ ఘనతను సాధించినట్టు వెల్లడించింది. ఫైబర్ కేబుల్స్ వేయలేని ప్రాంతాల్లో ఈ–బ్యాండ్ ద్వారా.. స్మాల్సెల్స్, మాక్రోసెల్స్ను అనుసంధానించడం ద్వారా ఫైబర్ స్థాయి వేగంతో 5జీ సేవలను అందించేందుకు వొడాఫోన్ ఐడియా ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని కంపెనీ తెలిపింది. -
త్వరలో 5జీ నెట్వర్క్.. అందుబాటులో ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా ఊరిస్తోన్న 5 జీ నెట్వర్క్ సేవలు మరింత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు రావడం మినహా.. అసలు 5జీ నెట్వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మొబైల్ కంపెనీలో ఎడాపెడా 5జీ హ్యాండ్సెట్లను రిలీజ్ చేస్తూ మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. నవంబరులోపే 5జీ ట్రయల్స్ కోసం 2021 మే నెలలో ప్రభుత్వం టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ఈ ట్రయల్స్ నిర్వహించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంఎన్టీఎల్లు అనుమతి పొందాయి. ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం నవంబర్‌లోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. గడువు పెంచండి నవంబరు సమీపిస్తుండటంతో ఇక కమర్షియల్‌గా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అశించిన వారికి నిరాశే ఎదురైంది. నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి చేయలేకపోయామని, ట్రయల్స్‌కి మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కోలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కారణం అదేనా 5జీ ట్రయల్స్‌కి సంబంధించి చైనా తయారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించద్దని టెల్కోలకి కేంద్రం సూచించింది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ డాట్ తదితర ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తే పర్వాలేదని పేర్కొంది. దీంతో టెల్కోలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఆలస్యమైంది. ఫలితంగా నవంబరులోగా పూర్తి స్థాయిలో ట్రయల్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది టెలికం కంపెనీలో కోరినట్టు మరోసారి ట్రయల్స్ గడువు పెంచితే 5 జీ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు 2022 ఏప్రిల్–జూన్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వోడఫోన్ ఐడియా చేపట్టిన ట్రయల్స్‌లో నెట్ స్పీడ్ 3.7 గిగాబైట్ పర్ సెకండ్‌గా రికార్డు అయ్యింది. చదవండి:ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట -
అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇంకా 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్ జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి. ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది. అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది. -
దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఎరిక్సన్తో కలిసి దేశంలో తొలిసారి గ్రామీణ ప్రాంతంలో 5జీ ట్రయల్స్ నిర్వహించింది. టెలికామ్ శాఖ ఎయిర్‌టెల్‌కు కేటాయించిన 5జీ ట్రయల్ స్పెక్ట్రమ్ ద్వారా దిల్లీ-ఎన్సీఆర్ శివార్లలోని భైపూర్ బ్రమనన్ గ్రామంలో ఈ ట్రయల్స్ జరిపాయి. డిజిటల్ అంతరాన్ని చెరిపేసి, డిజటలీకరణ ప్రక్రియను సంపూర్ణం చేసే సామర్థ్యం 5జీ నెట్‌వర్క్‌కు ఉందనే విషయం ఈ ప్రయోగాల్లో వెల్లడైందని ఇరు సంస్థలు వెల్లడించాయి."సైట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3జీపీపీ-కంప్లైంట్ 5జీ ఎఫ్‌డబ్ల్యుఎ పరికరంలో 200కి పైగా ఎంబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. భౌగోళికంగా మారుమూల ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవరేజీని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు" టెలికామ్ మేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. 3500మెగాహెర్ట్జ్ బ్యాండ్, ఇప్పటికే ఉన్న ఎఫ్డిడి స్పెక్ట్రమ్ బ్యాండ్ ద్వారా ఈ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయిల్స్‌లో భాగంగా ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయిల్స్‌లో 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్ఎస్ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్టెల్ నిలిచింది. (చదవండి: మాట్లాడితే మీనింగ్ ఉండాలి: జుకర్‌బర్గ్ ఆగ్రహం) -
Vodafone Idea: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు
కేంద్రం ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించడం, అలాగే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతి ఇవ్వడంతో టెలికామ్ కంపెనీలు తిరిగి తమ ప్రణాళికలను వేగంగా రచిస్తున్నాయి. దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. వొడాఫోన్ ఐడియా(వీఐ) పూణేలో నిర్వహిస్తున్న 5జీ ట్రయల్స్ సమయంలో 3.7 జీబీపీ వేగంతో డేటాను బదిలీ చేసినట్లు సంస్థ తెలిపింది. గాంధీనగర్, పూణేలో కేటాయించిన మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో 1.5 జీబీపీ వరకు గరిష్ఠ డౌన్ లోడ్ వేగాన్ని అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్ 5జీ స్పీడ్ కంటే వీఐ డౌన్ లోడ్ స్పీడ్ ఎక్కువ.పూణే (మహారాష్ట్ర), గాంధీనగర్(గుజరాత్)లో ప్రభుత్వం కేటాయించిన 5జీ స్పెక్ట్రమ్ లో కంపెనీ తన టెక్నాలజీ విక్రేతలతో కలిసి 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ నెట్ వర్క్ ట్రయల్స్ కోసం సాంప్రదాయక 3.5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్ వంటి హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను డీఓటీ కేటాయించింది.(చదవండి: ఆన్లైన్లో వైరల్ అవుతున్న రియల్మీ జీటీ నియో 2 ఫీచర్స్) 5జీ ట్రయల్స్ కోసం రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా చేసుకున్న దరఖాస్తులను మేలో డీఓటీ ఆమోదించింది. ఆ తర్వాత 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియా, శామ్ సంగ్, సీ-డీఓటీలతో ఆరు నెలల ట్రయల్స్ కోసం అనుమతి మంజూరు చేసింది. జూన్ నెలలో జియో 1 జీబీపీల గరిష్ట వేగాన్ని నమోదు చేసిందని, జూలైలో ఎయిర్ టెల్ 1.2జీబీపీ గరిష్ట వేగాన్ని నమోదు చేసిందని డీఓటీ తెలిపింది. టెలికామ్ కంపెనీలు అన్నీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందించడం కోసం సిద్దమవుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్ఎన్ఎల్ ఇంకా భారతదేశం అంతటా 4జీని విడుదల చేయలేదు. -
5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై–డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్–19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్–నవంబర్ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంచనాలను మించి..: సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి–జూన్ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్ బలపడుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. కాగా, 2020లో 5జీ మోడళ్ల వాటా కేవలం 3 శాతమే. ఈ ఏడాది ఇది 19 శాతం వాటాతో 3.2 కోట్ల యూనిట్లను తాకనుంది. 5జీ చిప్సెట్ చవక కావడం, స్మార్ట్ఫోన్ల ధర తగ్గడంతో ఈ విభాగంలో అమ్మకాలు దూసుకెళ్లనున్నాయి. ఎంట్రీ లెవెల్లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
ఆగస్ట్ 15న విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు?!
ఆగస్ట్ 15 సందర్భంగా ప్రధాని మోదీ 5జీ నెట్ వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారంటూ టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5జీ నెట్ వర్క్ వినియోగంతో భారత్ లో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలకు తిరుగుండదనే కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ 'ఊక్లా' మనదేశంలో ఇంటర్నెట్ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 5జీ వినియోగంతో మనదేశంలో ఇంటర్నెట్ వేగం 10టైమ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇండియన్ టెక్నాలజీపై చైనా యాప్స్ ప్రభావం ఇండియా - చైనా సరిహద్దు వివాదం కారణంగా కేంద్రం డ్రాగన్ కంట్రీకి చెందిన సుమారు 200యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో ఇండియన్ టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ స్థాపించేందుకు సొంతంగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. అందుకోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, క్వాల్ కమ్ వంటి టెక్ కంపెనీలతో హార్డ్ వేర్ లను తయారు చేసుందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే చైనాకు చెందిన హువావే, జెడ్‌టీఈ సంస్థలు భారత్‌లో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ కేంద్రం సున్నితంగా తిరస్కరించి దేశీ పరిజ్ఞానంతో 5జీ నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం సమాచార నిపుణుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 5జీ నెట్ వర్క్ వినియోగం ►2020 థాయిలాండ్, ఫిలిప్పిన్స్‌లో 5జీ నెట్ వర్క్ ప్రారంభమైంది. ఊక్లా అంచనా ప్రకారం..ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్ టీఈ(Long-Term Evolution) నెట్ వర్క్ కంటే 5జీ స్పీడుగా ఉంటుందని, దాన్ని బేస్ చేసుకొని 2021 ఏప్రిల్ నాటికి దాని వేగం 9రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ లో విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ వేగం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ►2021 మార్చిలో 52.9 శాతం నుండి జూన్ నాటికి 64.5 శాతం మంది 4G వినియోగదారులు 5ఎంబీపీఎస్ కంటే ఎక్కువగా వీడియోల్ని డౌన్లోడ్ చేస్తున్నారని, దీన్ని బట్టి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు 5G నెట్ వర్క్‌ను ఎలా వినియోగిస్తారో చెప్పడం అసాధ్యం. అయితే దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ వినియోగం పెరిగిపోతుందని ఊక్లా ప్రతినిధులు వెల్లడించారు. ►మనదేశంలో జియో నెట్ వర్క్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. ఆ జియో నెట్ వర్క్ డౌన్లోడ్ వేగం మార్చి 2021లో 5.96 Mbps నుండి జూన్‌లో 13.08 Mbps కి పెరిగింది. ►ప్రస్తుతం, యూకే,యూఎస్ వంటి దేశాల్లో 5 నెట్ వర్క్‌ను విస్తరించే పనిలోపడ్డారు. ఆ విషయంలో భారత్ వెనకబడినా.. ఇటీవల కాలంలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ఊక్లా గుర్తించింది. ►5జీ నెట్ వర్క్ ఆలస్యం వల్ల ఆపరేటర్లకు లబ్ధి చేకూరుతుందని, తక్కువ ఖర్చుతో నెట్వర్క్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ ఆపరేట్లు ఓపెన్ ర్యాన్ నెట్ వర్క్ (open radio access network architecture) వల్ల 5జీ నెట్ వర్క్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని ఓ ఇంటర్నెట్ టెస్టింగ్ గ్లోబల్ లీడర్ ఊక్లా అంచనా వేసింది. -
అదే స్పీడు అదే జోరు, 5జీ ట్రయల్స్‌లో ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఇంటర్నెట్ వేగం 1,000 ఎంబీపీఎస్ పైగా నమోదైంది. ముంబైలోని ఫీనిక్స్ మాల్లో జరుగుతున్న లైవ్ ట్రయల్స్‌లో నోకియా తయారీ గేర్స్‌ను వాడుతున్నారు. టెలికం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా 3500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎయిర్టెల్ 5జీ పరీక్షలు జరుపుతోంది. కోల్‌కతాలోనూ ట్రయ ల్స్ నిర్వహించనున్నట్టు నోకియా ప్రతినిధి వెల్లడించారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్ లో లైవ్ నెట్‌వర్క్‌లో దేశంలో తొలిసారిగా ఎయిర్టెల్ ఈ ఏడాది ప్రారంభంలో 5జీ పరీక్షలను హైదరాబాద్‌లో విజయవంతంగా జరిపింది. చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ? Exclusive: #Airtel’s #5G trial network goes live in Mumbai’s Phoenix Mall, Lower Parel. 1Gbps speeds. Nokia is the equipment provider for this trial. pic.twitter.com/4vO3RWUbXh — Danish (@DanishKh4n) July 12, 2021 -
Reliance AGM 2021: రిలయన్స్ జియో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?
ముంబై: రిలయన్స్ తన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో 5జీ గురించి ప్రకటించింది. టెక్ దిగ్గజం గూగుల్ సహకారంతో తన కొత్త ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ ను అభివృద్ది చేసినట్లు తెలిపింది. జియో 5జీ కోసం రిలయన్స్ గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు ప్రకటించింది. జియో 5జీ గూగుల్ సంస్థ క్లౌడ్ స్టోరేజ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొనున్నట్లు ఈ సమావేశంలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ సహకారంతో 10 ఎండబ్ల్యూ సామర్ధ్యం గల జియో-అజ్యూరే క్లౌడ్ డేటా సెంటర్లు నిర్మించినట్లు కూడా ఉదహరించింది. అంబానీ నేతృత్వంలోని సంస్థ జియో 5జి టెక్నాలజీని పరీక్షించినట్లు తెలిపింది. టెస్టింగ్ సమయంలో 1జీబీపీఎస్ వేగాన్ని తకినట్లు పేర్కొంది. దేశంలోనే పూర్తి స్థాయి 5జీ సేవలను ప్రారంభించిన మొదటి నెట్ వర్క్ రిలయన్స్ జియోనే సంస్థ ప్రకటించింది. 5జీ పరికరాల అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం, రిటైల్ రంగాలలో పెనుమార్పులు సంభవిస్తాయని వివరించింది. రిలయన్స్ ఫౌండేషన్ పాఠశాలల్లోని విద్యార్థులకు జియో 5జీ సహాయంతో ఎఆర్/విఆర్ కంటెంట్‌ను అందించనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. జియో ఫైబర్ డేటా వినియోగం ఒక సంవత్సరం క్రితం తో పోలిస్తే 3.5 రెట్లు పెరిగింది. జియో ఫైబర్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయని అంబానీ అన్నారు. చదవండి: ప్రపంచంలో 'అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్' లాంచ్ చేసిన జియో -
ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?
గుర్గావ్: కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీతో సహా ఇతర నాలుగు భారతీయ టెలికం సర్కిల్‌లలో ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రంను డీఓటి కేటాయించింది. 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకున్న ఎయిర్టెల్ ఎయిర్టెల్ దేశంలోని ఇతర ప్రాంతాలలో మిడ్-స్పెక్ట్రంను పరీక్షించే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ టెలికాం నివేదిక ప్రకారం.. ఈ ట్రయిల్స్ లో 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఎయిర్‌టెల్‌కు 5జీ ట్రయల్ కోసం 3500 మెగాహెర్ట్జ్, 28 గిగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను కేటాయించినట్లు నివేదిక పేర్కొంది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(వి)లకు 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌లను కేటాయించారు. 5జీ ట్రయిల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న టీఎస్‌పీలలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్టిఎన్ఎల్ ఉన్నాయి. ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీ ప్రొవైడర్లతో టీఎస్పీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా, రిలయన్స్ జియో తన సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ యొక్క వ్యవధి 6 నెలల మాత్రమే. ఇందులో పరికరాల సేకరణ, ఏర్పాటు కోసమే 2 నెలల పడుతుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్ఎస్ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్టెల్ నిలిచింది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీలతో పోల్చినప్పుడు 5జీ 10x స్పీడ్స్, 10 ఎక్స్ లేటెన్సీ, 100 ఎక్స్ కంకరెన్సీని అందించగలదని గతంలో ఎయిర్టెల్ నిరూపించింది. చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త! -
5G Network: 5జీ పై భయాందోళనలు
ప్రపంచ ప్రజానీకాన్ని అనుసంధానించటంలో... భారీ పరిమాణంలో వుండే డేటాను సైతం రెప్పపాటున బదిలీ చేయటంలో వినూత్న పోకడలు పోతుందంటున్న అయిదో తరం వైర్లెస్ సాంకేతికత(5జీ టెక్నాలజీ) అతి త్వరలో దేశంలో అడుగుపెట్టబోతోంది. దాని పనితీరును నిపు ణులు ఇప్పటికే ప్రాథమికంగా పరీక్షించారు. నెట్వర్క్ సంస్థలు, మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు సంసిద్ధంగా వున్నాయి. మన దేశంలో ఈ ఏడాది ఆఖరుకల్లా అది విస్తరించటం మొదలవుతుంది. వచ్చే ఏడాదంతా 5జీ కోలాహలమే వినిపించబోతోంది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ బాలీవుడ్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ అందరిలోనూ చర్చనీయాంశమవుతోంది. పౌరుల ఆరోగ్యంపై ఆ సాంకేతికత తీవ్ర ప్రభావం చూపే అవకాశము న్నదని, పర్యావరణానికి సైతం అది హానికరం కాగలదని ఆమె వాదన. అలాగని అత్యాధునిక సాంకేతికత అమలును తాను వ్యతిరేకించటం లేదంటున్నారు. పర్యవసానాలపై అధ్యయనం చేయ కుండా ప్రవేశపెట్టడంపైనే తనకు అభ్యంతరమని వివరిస్తున్నారు. 5జీ కోసం సెల్ టవర్లలో, ఫోన్లలో వాడే సాంకేతికత, వాటినుంచి వెలువడే రేడియేషన్ మనుషులకూ, పశుపక్ష్యాదులకూ తీవ్ర హాని కలిగించగలదని నమ్మడానికి తగిన కారణాలున్నాయని ఆమె చెబుతున్నారు. కొత్త సాంకేతికతతో పాటే సంశయాలూ వ్యాపిస్తాయి. విద్యుత్ దీపాలు వచ్చినప్పుడు ప్రాణాలకు ముప్పు కలుగుతుందన్న భయంతో అనేక గ్రామాలు చాన్నాళ్లు వాటికి దూరంగా వుండి పోయాయని చరిత్ర చెబుతోంది. మన దేశంలో మాత్రమే కాదు...ప్రపంచమంతటా ఈ ధోరణి కన బడుతుంది. బ్రిటన్, అమెరికా, స్విట్జర్లాండ్ వంటిచోట్ల ఏడెనిమిదేళ్లుగా అనేకులు 5జీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మనుషులకు మాత్రమే కాక, మొత్తంగా జీవరాశులకు ముప్పు తెస్తుందని వాదిస్తున్నారు. ఇలా అంటున్నవారిలో శాస్త్రవేత్తలు సైతం వుండటం సాధారణ పౌరుల్లోని భయాం దోళనలను మరింత పెంచుతున్నాయి. జుహీ చావ్లా లేవనెత్తిన అభ్యంతరాలు రాగలకాలంలో మన దేశంలో మరింత గట్టిగా వినబడతాయి. వీటిని ఒక్క మాటతో కొట్టి పారేయడం తేలిక. విశ్వసనీయత కలిగిన శాస్త్రవేత్తలు సవివరమైన పరిశోధనలు నిర్వహించి 5జీపై వుండే సంశయాలకు జవాబి వ్వగలగాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా వుండే అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐఏఆర్సీ) కొంతకాలంక్రితం 5జీలో వినియోగించే రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) మనుషుల్లో కేన్సర్ కారకం కాగలదని...ముఖ్యంగా కొన్ని రకాల మెదడు కేన్సర్లను ఇది మరింత ప్రేరేపించే అవకాశం వున్నదని సందేహం వ్యక్తం చేసింది. అలా అంటూనే దీనిపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం వున్నదని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తర్వాత విడుదల చేసిన నివేదికలో ‘ప్రతి ఆరోగ్యపరమైన సమస్యనూ వైర్లెస్ సాంకేతికతతో ముడిపెట్టడం సరికాద’ని భావించింది. ప్రస్తుతం ఆ సంస్థలోని శాస్త్రవేత్తలు 5జీ సాంకేతికతను జల్లెడ పడుతు న్నారు. ఆ నివేదిక వచ్చే ఏడాదికి గానీ విడుదలయ్యే అవకాశం లేదు. 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొబైల్ ఫోన్ల సమస్యలపై కూడా ఆరా తీసింది. చివరకు వాటివల్ల మెదడు కేన్సర్లు వస్తాయనడానికి ఆధారాల్లేవని తేల్చింది. ప్రస్తుతం టచ్ స్క్రీన్ సౌకర్యం వుండే స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే అప్పుడు వినియోగించిన ఫోన్లు సురక్షితమైనవి. పైగా పాత ఫోన్లు కేవలం మాట్లాడు కోవటానికి, ఎస్సెమ్మెస్ సందేశాలు పంపుకోవడానికి మినహా మరెందుకూ ఉపయోగపడేవి కాదు. స్మార్ట్ ఫోన్లు అలా కాదు...భూగోళాన్ని మన చేతుల్లో పెడుతున్నాయి. విషాదమేమంటే వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకూ పరిశోధించిన దాఖలా లేదు. అందుకే నాలుగేళ్లక్రితం 39 దేశా ల్లోని 190మంది శాస్త్రవేత్తలు స్మార్ట్ ఫోన్లతో వచ్చే ప్రమాదాలను ఏకరువుపెడుతూ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. అయితే అశాస్త్రీయమైన నమ్మకాల ఆధారంగా కొందరు అనవసర భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారని 2019లో మరికొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఆసుపత్రుల్లో ఇప్పుడు విస్తృతంగా ఉపయోగిస్తున్న సీటీ–స్కాన్, ఎక్స్‌రే యంత్రాలతోనూ సమస్యలున్నాయి. అవి భారీగా రేడియేషన్‌ను కలగజేస్తాయన్న ఉద్దేశంతోనే బాధ్యతాయుతమైన వైద్యులు ఎంతో అత్యవసరమనుకుంటే తప్ప రోగులకు సీటీ–స్కానింగ్ సూచించరు. రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించడం మొదలై శతాబ్దం కావస్తోంది. అయితే 5జీలోని రేడియో ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువ. సుదూర ప్రాంతాలకు సైతం అది సరిగా అందాలంటే సెల్ టవర్లు ముమ్మరంగా వినియోగించాలి. కనుక జనాభాలో అత్యధికులు దీని ప్రభావానికి లోనుగాక తప్పదు. ఇప్పుడున్న సాంకేతికతల ఆధారంగా 5జీని కొలవడం సరికాదన్నదే నిపుణుల భావన. అందుకే దీని సంగతి త్వరగా తేల్చాలని ఈమధ్యే 44 దేశాలనుంచి 253మంది శాస్త్రవేత్తలు ఐఏఆర్సీకి లేఖ రాశారు. మనుషుల్లోని నాడీమండల వ్యవస్థ, రక్తంలో కొన్ని రకాల రసాలను స్రవించే వినాళగ్రంధి వ్యవస్థ దెబ్బతింటాయన్నది వీరి ఆందోళన. బ్రిటన్ శాస్త్రవేత్తలైతే ప్రస్తుతానికి 5జీ అమలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కనుక జుహీ చావ్లా భయాందోళనలను తేలిగ్గా తీసుకోలేం. దేశంలో వున్న సమస్యలు చాలలేదన్నట్టు ఇంకా పరిపూర్ణమైన సమాచారం లేని ఈ సాంకేతికతను పులుముకోవటం విజ్ఞత కాదేమో ఆలోచించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వచ్చే వరకూ వేచిచూడటమే అన్నివిధాలా శ్రేయస్కరం. -
గామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ పరీక్షలు జరిపేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఆరు నెలలపాటు ట్రయల్స్ నిర్వహించుకునేలా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, గుజరాత్లో ఈ పరీక్షలు జరుగుతాయి. టెస్టుల్లో భాగంగా టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయం తీరును సైతం పర్యవేక్షిస్తారు. అనుమతి రుసుము చెల్లించిన తర్వాత ఎంటీఎన్ఎల్కు కూడా ట్రయల్ స్పెక్ట్రం కేటాయించనున్నారు. ఢిల్లీలో 5జీ ట్రయల్స్ కోసం సీ-డాట్‌తో ఈ సంస్థ చేతులు కలిపింది. భారత్‌లో 5జీ పరీక్షల కోసం ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సి-డాట్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. చైనా కంపెనీలకు ఈ విషయంలో అవకాశం ఇవ్వలేదు. రిలయన్స్ జియో తన సొంత టెక్నాలజీతోపాటు శామ్సంగ్ నెట్వర్క్ గేర్స్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. 4జీతో పోలిస్తే 5జీ డౌన్లోడ్ వేగం పదిరెట్లు మెరుగ్గా ఉంటుందని టెలికం శాఖ అంచనా వేస్తోంది. చదవండి: స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్ -
5జీ ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు
న్యూఢిల్లీ: 5జీ కోసం ఎదురుచూస్తున్న టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. కొద్దీ కాలం క్రితమే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం శాఖ (డాట్) తాజాగా ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ట్రయల్స్‌ను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్‌తో సహా ఇతర మెట్రో నగరాల్లో నిర్వహించనున్నారు. "700 మెగాహెర్ట్జ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెర్ట్జ్ బ్యాండ్, 24.25-28.5 గిగాహెర్ట్జ్ బ్యాండ్లను టెలికాం సంస్థలకు వివిధ ప్రదేశాలలో ట్రయిల్స్ కోసం అనుమతించినట్లు" టెలికాం కంపెనీ అధికారి తెలిపారు. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎమ్టీఎన్ఎల్ నుంచి వచ్చిన దరఖాస్తులను మే 4న డీఓటీ ఆమోదించింది. కానీ, చైనా కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని 5జీ కోసం వినియోగించకూడదు అనే షరతు విధించింది. ఈ షరతుకు కట్టుబడి ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్లు 5జీ ట్రయల్స్ కోసం చేసుకున్న ధరఖాస్తులను కూడా డీఓటీ ఆమోదించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఒక అడుగు ముందుకు వేసి సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్‌లో భాగంగా టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ వంటివి పరీక్షించనున్నారు. ప్రస్తుతం ఈ ట్రయల్స్ వ్యవధి 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల కాలంలో 2 నెలలు 5జీ టెక్నాలజీని పరీక్షించే పరికరాలను సమీకరించుకోవడానికే సమయం సరిపోతుంది. ప్రతి కంపెనీ కూడా కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌లో మాత్రం ఏ కంపెనీకీ స్ప్రెక్ట్రమ్ కేటాయించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చదవండి: చౌక స్మార్ట్‌ఫోన్ కోసం జియో, గూగుల్ కసరత్తు -
5జీతో భారీగా కొత్త నియామకాలు
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే టెలికం రంగంలో వచ్చే రెండేళ్లలో భారీగా ఒప్పంద ఉద్యోగుల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగంలో రిక్రూట్మెంట్ విషయంలో 5జీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది. నివేదిక ప్రకారం.. కోవిడ్-19 నేపథ్యంలో అస్పష్టతలు ఉన్నప్పటికీ ఒప్పంద నియామకాల దృక్పథం సానుకూలంగా ఉంది. నియామకాల రంగంలో పెద్ద మార్కెట్లలో టెలికం విభాగం ఒకటి. మహమ్మారి సమయంలోనూ ఈ రంగం వృద్ధి చెందింది. ట్రెండ్ ఈ ఏడాదీ కొనసాగనుంది. ఎకానమీ వృద్ధికి సైతం భవిష్యత్తులో 5జీ తోడుగా ఉండనుంది. టెక్నీషియన్స్ మొదలుకుని ఇన్స్టలేషన్ ఇంజనీర్స్ వరకు, సివిల్ ఇంజనీర్స్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ల దాకా నియామకాలు ఉంటాయి. మొత్తంగా ఈ ఏడాది రిక్రూట్మెంట్ 18 శాతం వృద్ధికి అవకాశం ఉంది. టెలికంను అత్యవసర సేవల కింద ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019తో పోలిస్తే గతేడాది టెలికం రంగంలో 50 శాతం అదనంగా నియామకాలు చేపట్టినట్టు టీమ్‌లీజ్ వెల్లడించింది. చదవండి: ట్యాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా..? -
Fact Check: 5జీ టెస్టింగ్ వల్లే కోవిడ్ సెకండ్ వేవ్..!
న్యూఢిల్లీ: గతేడాది మొదలైన కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొద్ది రోజుల పాటు తెరపిచ్చినట్లు కనిపించినప్పటికి.. ఆ తర్వాత ప్రారంభమైన సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల బయట రోగులు బెడ్స్ కోసం నిరీక్షిస్తూ.. అలానే కళ్లు మూస్తున్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యి ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికి ఇంతవరకు కోవిడ్ వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైంది అనే దాని గురించి సరైన సమాచారం లేదు. మనతో సహా ప్రపంచ దేశాలన్ని చైనానే వైరస్‌ని భూమ్మీదకు వదిలిందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏంటంటే.. 5జీ టెస్టింగ్ వల్లనే వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభం అయ్యిందని.. పైగా దీన్ని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బిహార్, మహారాష్ట్రలో భారీ సంఖ్యలో జనాలు మరణించారని ఆడియోక్లిప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై నిగ్గు తేల్చేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) రంగంలోకి దిగింది. వీటిలో వాస్తవమెంతో తేల్చేందుకు టెలికామ్ అధికారులను కలిసింది. ఈ వార్తలపై టెలికామ్ అధికారులు ఆదోళన వ్యక్తం చేశారు. ఇవన్ని పుకార్లని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తికి, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పుకార్లపై టెలికాం పరిశ్రమ సంస్థ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఓఏఐ, టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (టీఏఐపీఏ) శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణం అంటూ కొన్ని ప్రాంతీయా మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించిందని.. 5 జీ టెక్నాలజీకి, కోవిడ్ -19 కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని సిఐఐఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. చదవండి: శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! -
5జీ వదంతులపై టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, వాటిని నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు కొన్ని ప్రాంతీయ మీడియాలో కూడా కోవిడ్–19 కేసుల ఉధృతికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతుండటం తమ దృష్టికి వచ్చినట్లు సీవోఏఐ శుక్రవారం తెలిపింది. ‘ఈ వదంతులన్నీ పూర్తిగా తప్పులతడకలే. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను విశ్వసించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు 5జీ నెట్‌వర్క్‌లను ప్రారంభించాయి. ఆయా దేశాల్లోని ప్రజలు కూడా ఈ సర్వీసులను సురక్షితంగా వినియోగించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా 5జీ టెక్నాలజీకి, కోవిడ్–19కి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది‘ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
బ్రేకింగ్: 5జీ ట్రయల్స్ కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్(టీఎస్పి)కు టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) మంగళవారం ఆమోదం తెలిపింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ లలో భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, ఎమ్టిఎన్ఎల్ ఉన్నాయి. ఈ టీఎస్పిలు ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ వంటి టెక్నాలజీ ప్రొవైడర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే, రిలయన్స్ జియోఇన్ఫోకామ్ లిమిటెడ్ కూడా సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. మిడ్-బ్యాండ్ (3.2 GHz నుంచి 3.67 GHz), మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్ (24.25 GHz నుంచి 28.5 GHz) మరియు సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్ (700 GHz) వంటి వివిధ బ్యాండ్లలో ట్రయల్స్ నిర్వహించడానికి డీఓటీ ఆమోదం తెలిపింది. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి టీఎస్పిలకు వారి స్వంత స్పెక్ట్రం 800 MHz, 900 MHz, 1800 MHz, 2500 MHz 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి కూడా కేంద్రం అనుమతించింది. 5జీ ట్రయల్స్ పట్టణ ప్రాంతాలలో మాత్రమే కాకుండా పల్లె ప్రాంతాలలో కూడా పరీక్షలు నిర్వహించవచ్చు. 5జీ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. దేశీయంగా అభివృద్ది చేసిన 5జీ టెక్నాలజీని ట్రయల్స్ నిర్వహించడానికి డీఓటీ ప్రోత్సహిస్తుంది. దేశీయంగా 5జీ టెక్నాలజీని ఐఐటి మద్రాస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ(సిఇవిఐటి), ఐఐటి హైదరాబాద్‌లు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల టెలిమెడిసిన్, టెలీడ్యూకేషన్, ఆగ్మెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్స్ వంటి రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ టెక్నాలజీ డేటా డౌన్లోడ్ వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ కేవలం స్మార్ట్‌ఫోన్‌కే పరిమితం కాకుండా అన్ని రంగాలలో విప్లవాన్ని సృష్టించనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: SBI: ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ -
సెకన్ల వ్యవధిలోనే సినిమా మొత్తం డౌన్లోడ్!
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులకు తమ నెట్వర్క్ సర్వం సిద్ధంగా ఉందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తెలిపింది. హైదరాబాద్ నగరంలో లైవ్‌గా 5జీ నెట్‌వర్క్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు వెల్లడించింది. యూజర్లు పూర్తి నిడివి సినిమాను 5జీ ఫోన్లో కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోగలిగినట్లు పేర్కొంది. తగినంత స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక, ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించిన తర్వాత పూర్తి స్థాయి సేవల అనుభూతిని కస్టమర్లకు అందించవచ్చని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు, 5జీకి సంబంధించిన కీలక నెట్వర్క్ అంతా దేశీయమైనదే కావవాలని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్వీసెస్ (ఎన్ఐసీఎస్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2జీ, 3జీ, 4జీలో వెనుకబడినప్పటికీ 5జీ విషయంలో మాత్రం మిగతా దేశాల కన్నా భారత్ వేగంగా కొత్త టెక్నాలజీని అమలు చేయగలదని పేర్కొన్నారు. నవంబర్‌లో 43.7 లక్షల కొత్త యూజర్లు.. సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకునే విషయంలో దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోమారు దుమ్మురేపింది. గతేడాది నవంబర్‌లో 43.7 లక్షల మంది కొత్త యూజర్లను సొంతం చేసుకున్న ట్రాయ్ గణాంకాలు తెలిపాయి. ఫలితంగా మొత్తం యూజర్ల సంఖ్య 33.46 కోట్లకు పెరిగింది. ఇదే నవంబర్‌లో తన సమీప ప్రత్యర్థి రిలయన్స్ జియో కూడా 19.36 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను దక్కించుకుంది. తద్వారా జియో మొత్తం యూజర్ల సంఖ్య 40.82 కోట్లకు పెరిగింది. నవంబర్లోనే 28.9 లక్షల మంది యూజర్లు వోడాఫోన్ ఐడియాకు గుడ్‌బై చెప్పడంతో కంపెనీ యూజర్ల బేస్ 28.99 కోట్లకు తగ్గింది. దేశవ్యాప్తంగా టెలిఫోన్ సబ్స్క్రైబర్లు నవంబర్ నాటికి 1,175.27 మిలియన్లకు చేరుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. -
రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాక్
హైదరాబాద్: దేశీ ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్టెల్ తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది. గతంలో 5జీ సేవల కోసం కొంత సమయం కావాలని కోరిన ఎయిర్టెల్, ఒక్కసారే 5జీ సేవలను ఒక ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించే సరికి జియో కూడా విస్మయానికి గురి అయ్యింది.(చదవండి: 'రిలయెన్స్ జియో' మరో రికార్డ్) న్యూఢిల్లీకి చెందిన ఒక టెల్కో కంపెనీ నాన్-స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ లో 5జీ సేవలను పరీక్షించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు అందించవచ్చు అని పేర్కొంది. ప్రస్తుత నెట్వర్క్ టెక్నాలజీ కంటే 5జీ నెట్వర్క్ వేగం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. 5జీ ఫోన్లో ఫుల్ మూవీని కొన్ని సేకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది.(చదవండి: నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త!) ఎయిర్టెల్ కొత్త 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నుంచి పూర్తి అనుమతులు, సరిపడినంత స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఎయిర్టెల్ 5జీ సేవలు యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త 5జీ సేవల కోసం వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఎయిర్టెల్ పేర్కొంది. విజయవంతంగా 5జీ సేవలను పరీక్షించినందుకు ఇంజినీర్లను కంపెనీ అభినందించింది. 5జీ పరీక్షల కోసం ఎయిర్టెల్ ఒప్పో రెనో 5ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2ప్రో స్మార్ట్ఫోన్లను ఉపయోగించింది. ఎయిర్టెల్ ప్రత్యర్థి, భారతదేశపు అతిపెద్ద టెలికాం నెట్వర్క్ జియో 2021 రెండవ భాగంలో దేశంలో తన 5జి సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. -
‘చైనా కంపెనీలపై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చేపట్టే 5జీ నెట్వర్క్ ప్రక్రియలో హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్లు పాల్గొనకుండా నిషేధించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అఖిలభారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశాయి. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, జడ్‌టీఈలను 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనేందుకు అనుమతించరాదని మంత్రికి రాసిన లేఖలో సీఏఐటీ విజ్ఞప్తి చేసింది. ఈ చైనా కంపెనీలపై అంతర్జాతీయంగా గూఢచర్యం, కుట్ర, మనీల్యాండరింగ్ వంటి పలు నేరారోపణలు నమోదయ్యాయని పేర్కొంది. గల్వాన్ ఘటన అనంతరం చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా ప్రశంసించారు. 59 చైనా యాప్‌లను నిషేధించడం.. చైనా కంపెనీలకు అప్పగించిన హైవే, మెట్రో, రైల్వే కాంట్రాక్టులను రద్దు చేయడం వంటి చర్యలను స్వాగతించారు. జూన్ 10న తాము చేపట్టిన బాయ్‌కాట్ చైనా ప్రచారానికి అనుగుణంగా జాతి మనోభావాలకు అద్దంపడుతూ ప్రభుత్వం సముచిత చర్యలు చేపట్టిందని అన్నారు. చైనాకు గట్టి సందేశం పంపేలా భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లో పాల్గొనకుండా హువాయి, జడ్‌టీఈ కార్పొరేషన్లను నిషేధించాలని భార్టియా కోరారు. అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఈ కంపెనీల భాగస్వామ్యాన్ని అనుమతించడం లేదని భారత్‌లోనూ వాటిని అనుమతించరాదని స్పష్టం చేశారు. చదవండి : చైనాకు షాక్ : 4500 గేమ్స్ తొలగింపు -
భారత్– అమెరికా.. 5 చిక్కుముళ్లు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాల్లోని ఐదు చిక్కుముడులు ఏమిటన్నది చూస్తే.. వాణిజ్య పన్నుల వివాదాలు: భారత్‌ను టారిఫ్ కింగ్ అని ఇటీవలే ట్రంప్ చేసిన వ్యాఖ్య పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది. 2018 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం విలువ 142.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నా గత ఏడాది అమెరికా స్టీలు, అల్యూమినియం దిగుమతులపై పన్నులు పెంచింది. భారత్‌కిచ్చే కొన్ని ప్రత్యేక రాయితీలను కూడా ఉపసంహరించుకుంది. భారత్ ఎగుమతు లపై ఈ నిర్ణయం ప్రభావం సుమారు 5600 కోట్ల డాలర్ల వరకూ పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ బాదంపప్పు, వాల్నట్, ఆపిల్‌పండ్ల వంటి 28 వస్తువుల దిగుమతులు కొన్నింటిపై పన్నులు పెంచడం అమెరికా గుర్రుగా ఉంది. హెచ్–1బీ వీసాలు:అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టేందుకు కారణమైన హెచ్–1బీ వీసాలపై నియంత్రణలు విధిస్తామన్న హామీతోనే ట్రంప్ గద్దెనెక్కారు. ఇందుకు తగ్గట్టుగానే ట్రంప్ ప్రభుత్వం హెచ్–1బీ వీసాల సంఖ్యను తగ్గించడంతో పాటు తాజాగా వీసా చార్జీలను రెండు వేల డాలర్ల నుంచి రెట్టింపు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. త్వరలోనే హెచ్–1బీ వీసా పొందిన వ్యక్తుల భార్య/భర్తలు అక్కడ ఉద్యోగం చేసే అంశంపైనా త్వరలో సమీక్ష చేపట్టనున్నట్లు చెబుతోంది. భారతీయ ఐటీ కంపెనీలు దాఖలు చేసే హెచ్–1బీ వీసాల్లో 24% తిరస్క రణకు గురవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ భారతీయులకు ఇబ్బంది కలిగించేవే. డేటా లోకలైజేషన్: పౌరుల సమాచారంపై హక్కు తమదేనన్న భారత ప్రభుత్వ వాదన అమెరికాతో సంబంధాలను కొంతవరకూ ప్రభావితం చేస్తోంది. 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని స్థానికంగానే స్టోర్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలు వీసా, మాస్టర్‌కార్డ్‌లపై తీవ్రంగా ఉంది. ఆర్బీఐతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా డేటా విషయంలో నియంత్రణలు విధించడం మొదలు పెట్టడంతో అమెరికన్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటి వల్ల ఆ కంపెనీలకు 780 కోట్ల డాలర్ల అదనపు ఖర్చులు వచ్చినట్లు అంచనా. ఇరాన్, రష్యాలు: ముడిచమురు విషయంలో భారత్ ఎక్కువగా ఆధారపడ్డ ఇరాన్‌పై గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించడంతో సమస్య మొదలైంది. అమెరికా ఒత్తిడితో భారత్ కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంది. రష్యా నుంచి దూరశ్రేణి క్షిపణులు (ఎస్–400) కొనుగోలు చేయాలన్న భారత్ లక్ష్యం కూడా అమెరికా ఆంక్షల కారణంగా సందిగ్ధంలో పడుతోంది. 5జీ పరీక్షలపై కూడా నీడలు: భారత్‌లో 5జీ సర్వీసుల పరీక్షలను చేపట్టనున్న హువాయి విషయమూ ఓ చిక్కుముడిగా మారింది. చైనా మద్దతుతో హువాయి ప్రపంచ టెలికామ్ నెట్‌వర్క్‌లో రహస్య సాఫ్ట్వేర్లను పెట్టి ఇతర దేశాలపై నిఘా పెడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆ కంపెనీపై నిషేధం విధించింది. అటువంటి సంస్థ భారత్‌లో 5జీ సర్వీసులను చేపట్టడం అగ్రరాజ్యానికి రుచించడం లేదు. -
‘మిల్లీమీటర్’ స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు
న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల కోసం మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కీలకమైన 24.75–27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని వీలైతే వచ్చే ఏడాదే వేలం వేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ధర, వేలం విషయంలో పాటించాల్సిన ఇతరత్రా విధి విధానాల గురించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో టెలికం శాఖ (డాట్) త్వరలో చర్చలు జరపనున్నట్లు వివరించాయి. సుమారు రూ. 5.22 లక్షల కోట్ల ధరతో 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం నిర్వహించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) డిసెంబర్ 20నే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 2020 మార్చి–ఏప్రిల్ మధ్యలో ఈ వేలం నిర్వహించనున్నారు. దీనికి అదనంగా ‘మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్స్’గా వ్యవహరించే 24.75–27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌లోనూ కొంత స్పెక్ట్రంను విక్రయించాలని డాట్ భావిస్తోంది. దీనిపైనే వచ్చే నెలలో ట్రాయ్ అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా స్పెక్ట్రంతో కలిపి దీన్ని కూడా విక్రయించాలని డాట్ యోచించినప్పటికీ.. ట్రాయ్‌తో సంప్రదింపులకు నిర్దిష్ట కాలావధులు ఉండటం వల్ల అది సాధ్యపడే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్వాగతించిన సీవోఏఐ.. కొత్త బ్యాండ్ స్పెక్ట్రం వేలంపై ట్రాయ్‌ను సంప్రదించాలన్న డాట్ నిర్ణయాన్ని టెల్కోల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. దీనితో తగినంత స్థాయిలో 5జీ స్పెక్ట్రం లభించగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. అయితే, రిజర్వ్ ధర ఎంత నిర్ణయిస్తారన్నది వేచి చూడాల్సిన అంశమని పేర్కొన్నారు. మార్చి–ఏప్రిల్‌లో నిర్వహించే వేలంలో తగినంత 5జీ స్పెక్ట్రం అందుబాటులో ఉండదని, 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లోనూ వేలం వేసే విషయంపై ట్రాయ్ అభిప్రాయాలు తీసుకోవాలంటూ కొంతకాలంగా కేంద్రాన్ని సీవోఏఐ కోరుతూ వస్తోంది. తాజాగా ఆ దిశలోనే డాట్ చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. మరోవైపు, ఇప్పటికే అధిక రుణభారం, ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్న టెల్కోలు .. మార్చి –ఏప్రిల్‌లో విక్రయించే స్పెక్ట్రంనకు భారీ రేటు నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఈ ధర నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటోందంటున్నాయి. అయితే, దీన్ని తగ్గించాలని టెలికం సంస్థలు కోరినప్పటికీ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఐవోటీకి 5జీ ఊతం.. వచ్చే ఏడాది నుంచీ ఎడ్జ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) మరింత ప్రాచుర్యంలోకి వచ్చేందుకు 5జీ సర్వీసులు గణనీయంగా ఉపయోగపడతాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. టెలికం, హెల్త్, వాహనాలు, గృహాలు ఇలాంటి వివిధ విభాగాల్లో ఐవోటీ పరిశ్రమ వచ్చే ఏడాది ఏకంగా 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ఐవోటీ పరిశ్రమ 2020లో 300 బిలియన్ డాలర్లకు చేరనుందని, వచ్చే అయిదేళ్లలో భారత్ ఈ మార్కెట్లో కనీసం 20 శాతం వాటాను దక్కించుకోగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఒక నివేదికలో పేర్కొంది. -
2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవల సబ్‌స్క్రిప్షన్‌కు మరో రెండేళ్ల సమయం పడుతుందని స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ అంచనావేసింది. చందాదారులకు ఈ సేవలు 2022లో అందుబాటులోకి రానున్నాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ (ఈఎంఆర్) పేరిట తాజాగా విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్ సబ్స్క్రిప్షన్లు ఎల్టీఈని కలిగి ఉంటాయని అంచనాకట్టింది. ఒక్కో స్మార్ట్‌ఫోన్ సగటు నెలవారీ ట్రాఫిక్ 2025 నాటికి 24జీబీకి చేరనుందని విశ్లేషించింది. -
చైనాలో 5జీ సేవలు షురూ
బీజింగ్: టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్‌రహిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ వంటి వాటికి ఇవి ఉపయోగపడనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో.. 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. 5జీ పరికరాల ఉత్పత్తిలో అగ్రగాములైన చైనా సంస్థలు హువావే, జెడ్‌టీఈలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
5జీ ఫోన్ రేసులో ఒప్పో
సాక్షి, ముంబై: ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది. బార్సిలోనాలో జరగనున్న క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో ఒప్పో 5జీ సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ చేసినవివరాల ప్రకారం ఒప్పో కొత్త 5 జీ మొబైల్ డ్యూయల్-మోడ్‌తోవస్తుంది. స్టాండ్‌లోన్ (ఎస్ఐ), నాన్-స్టాండలోన్ (ఎన్ఎస్ఎ) నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. 5 జీపై ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఉత్పత్తులు, యాప్స్, భవిష్యత్తరానికి అందనున్న కట్టింగ్ ఎడ్జ్ అనుభవాలపై తన అంచనాలను పంచుకున్నారు. తమ తరువాతి తరం డ్యూయల్-మోడ్ 5జీ డివైస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మార్కెట్లలో ఎక్కువమంది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 2019 నాటికి, 2,500 గ్లోబల్ పేటెంట్ ఫ్యామిటీకి దరఖాస్తు చేయగా 1,000 కి పైగా యూరోపియన్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ కు ప్రకటించినట్టుఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
మరో ఐదేళ్లలో 5జీ క్రేజీ..
బీజింగ్ : దీర్ఘకాలంలో భారత్‌లో 5జీ మార్కెట్ భారీగా వృద్ధి చెందనుందని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్థితిగతులపై చైనా ప్రభుత్వం ప్రచురించిన ఓ పుస్తకం అంచనా వేసింది. భారత్‌లో ఇంటర్నెట్ వ్యాప్తి విస్తరించడం, పెద్దసంఖ్యలో యూజర్లు ఆన్‌లైన్‌కు మళ్లడంతో ఈ రంగంలో వేగవంతమైన పురోగతి చోటుచేసుకుంటోందని పేర్కొంది. 2025 నాటికి భారత్‌లో 35 శాతం మంది 5జీకి కనెక్ట్ అవుతారని ఈ బుక్ వెల్లడించింది. భారత్‌లో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తుండటంతో చైనాకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ 2018లో ఏకంగా 560 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని వివరించింది. ప్రపంచ ఇంటర్నెట్ అభివృద్ధి నివేదిక పేరిట విడుదలైన ఈ పుస్తకాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైబర్‌స్పేస్ స్టడీస్ (సీఏసీఎస్) ప్రచురించింది. 3జీ, 4జీ కంటే వేగవంతమైన సెల్యులార్ టెక్నాలజీగా 5జీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భారత్‌లో 5జీ మార్కెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా భారత్‌లో 5జీ లైసెన్స్ దక్కించుకునేందుకు చైనా టెలికం దిగ్గజం హువై రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ఇంటర్నెట్కు సంబంధించి వివిధ పారామీటర్లను పరిగణనలోకి తీసుకున్న సీఏసీఎస్ అంతర్జాతీయ ఇంటర్నెట్ అభివృద్ధి సూచీలో భారత్ 8వ స్ధానంలో నిలిచిందని పేర్కొంది. ఈ జాబితాలో అమెరికా, చైనాలు వరుసగా ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో ఉన్నాయి. చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌ను కలిగిఉందని సీఏసీఎస్ విశ్లేషించింది. అలీబాబా,టెన్సెంట్, బైట్‌డ్యాన్స్ వంటి చైనా టెక్ దిగ్గజాలు ఇప్పటికే భారత్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో ఇంటర్నెట్ వృద్ధి వేగంగా పరుగులు పెడుతున్నా ఇంటర్నెట్ సంబంధిత మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా వెనుకబడే ఉందని ఈ నివేదిక వెల్లడించింది. -
5జీ టెక్నాలజీ భావితరాలకు వరం
సాక్షి, హైదరాబాద్: టెలికమ్యూనికేషన్ రంగంలో 5జీ ప్రవేశంతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుందని అమెరికన్ సైబర్ నిపుణుడు హెరాల్డ్ ఫర్ష్‌టాగ్ అన్నారు. 5జీ, సైబర్ భద్రత అంశాలపై రకరకాల పరిశోధనలు చేసిన హెరాల్డ్ ఈ అంశాలపై పలు పుస్తకాలు రాశారు. బుధవారం బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోవు తరాలకు 5జీ వరంలా మారుతుందని అన్నారు. మనం గతంలో ఊహించనంత స్పీడ్, డేటా ట్రాన్స్ఫర్, అత్యాధునిక అప్లికేషన్లు, వైర్లెస్ టెక్నాలజీతో కమ్యూనికేషన్ల రంగంలో 5జీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని తెలిపారు. 5జీ రాకతో వ్యాపార, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత నదుల సమాచారం, జంతువుల కదలికలు, పంటలకు చీడలు తదితర వివరాలను ఇప్పటికంటే వేగంగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. మంచితోపాటు దుష్ప్రభావాలు.. 5జీ రాకతో మంచితోపాటు, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని హెరాల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాల్లో గూఢచర్యానికి పాల్పడేవారు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్రోహ, ఉగ్ర చర్యలకూ ఆస్కారం ఉంటుందని అన్నారు. కమ్యూనికేషన్, రక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన వ్యవస్థలను హ్యాక్ చేసే ప్రమాదాలు లేకపోలేదన్నారు. గతంలో ఉక్రెయిన్‌లో పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థను కొందరు రష్యన్ హ్యాకర్లు స్తంభింపజేసారని గుర్తుచేశారు. ప్రస్తుతం చైనా 5జీ సాంకేతికత అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఆదేశానికి చెందిన పలు హువాయ్, జెడ్‌టీఈ తదితర కంపెనీలు ఇప్పటికే చైనాలో 5జీ సేవలు అందించడం మొదలుపెట్టాయని తెలిపారు. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా ఆ సాంకేతికతను ఎగుమతి చేస్తోందన్నారు. అయితే, చైనాకు చెందిన కంపెనీల వల్ల భారతదేశానికి ఎలాంటి సైబర్ ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, ఆ దేశానికి చెందిన పలు స్మార్ట్ఫోన్లలో భద్రతకు సంబంధించిన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని తెలిపారు. ఈ కారణంగా ఆ తరహా ఫోన్లు త్వరగా హ్యాకయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో సైబర్ భద్రత ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌గా మారనుందని, అందుకే అనుమానాస్పద మాల్వేర్ సాఫ్ట్వేర్ల దిగుమతిని అమెరికా 2010 నుంచే నిలిపివేసిందని పేర్కొన్నారు. -
ఆప్టికల్ ఫైబర్‌కు ‘5జీ’ జోష్!
న్యూఢిల్లీ: హైస్పీడ్ ఇంటర్నెట్ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్సీ నెట్వర్క్ సుమారు 1.4–1.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర విస్తరించి ఉంది. ఇంటర్నెట్ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరాలంటే 2022 నాటికి ఈ నెట్‌వర్క్‌కు దాదాపు నాలుగు రెట్లు అధికంగా 5.5 మిలియన్ కేబుల్ రూట్ కిలోమీటర్స్ మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏకంగా రూ. 1,80,000 కోట్ల స్థాయిలో పెట్టుబడులు అవసరం. టెలికం సంస్థలు ప్రధానంగా టవర్ల పెంపునకు అవసరమైన ఫైబర్ కేబుల్స్ వేయడంపైనే ముందుగా దృష్టి పెట్టాల్సి రానుండటంతో ఈ పెట్టుబడుల్లో సింహభాగం వాటా ప్రభుత్వమే భరించాల్సి రానుంది. 5జీ సేవలను ముందుగా పెద్ద నగరాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో వచ్చే రెండు, మూడేళ్లలో టవర్స్ సంఖ్య 5,00,000 నుంచి 7,50,000కు పెంచుకోవాల్సిన అవసరం ఉందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ఇందులో 70 శాతం టవర్స్‌కు అవసరమైన ఫైబర్ కేబుల్ వేయాలంటేనే దాదాపు రూ. 50,000 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఓఎఫ్సీ అవసరమేంటంటే.. ఇంత భారీ స్థాయిలో ఓఎఫ్సీ వినియోగించాల్సి రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణంగా 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం చాలా శక్తిమంతమైనదే అయినా దాని పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. దీంతో మరింత పెద్ద సంఖ్యలో టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 4జీతో పోలిస్తే 5జీ కోసం 3 రెట్లు ఎక్కువగా టవర్స్ అవసరమవుతాయని ఓఎఫ్సీ తయారీ దిగ్గజం హిమాచల్ ఫ్యూచరిస్టిక్ చైర్మన్ మహేంద్ర నహతా తెలిపారు. ఇక రెండో కారణం విషయానికొస్తే.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టవర్లలో కేవలం 20% టవర్స్‌కి మాత్రమే ఫైబర్ కేబుల్స్ ఉపయోగిసున్నారు. 5జీ సేవలను సముచిత స్థాయిలో అందించాలంటే వచ్చే మూడేళ్లలో దీన్ని కనీసం 70 శాతానికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని మాథ్యూస్ చెప్పారు. మరోవైపు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకోసం కూడా ఓఎఫ్సీ అవసరం. ఇక రిలయన్స్ జియో ప్రకటించిన ఫైబర్ టు హోమ్ సర్వీసుల కోసం కూడా భారీ స్థాయిలో ఓఎఫ్సీ కావాల్సి ఉంటోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 1,600 నగరాల్లో 7.5 కోట్ల మందికి టీవీ, వాయిస్, డేటా సేవలను అందించే దిశగా రిలయన్స్ జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కూడా ఓఎఫ్సీ చాలా కీలకం. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా ప్రజలకు చౌక బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీ–ఫైబర్ పేరిట 12,700 పంచాయతీల్లో 2 కోట్ల జనాభాకు బ్రాడ్ బ్యాండ్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. చాలా సవాళ్లున్నాయ్.. ఓఎఫ్‌సీకి ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ టెల్కోలు కేబుల్ వేయడంలో టెల్కోలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. రహదారులను తవ్వి కేబుల్స్ వేయాలంటే చాలా వ్యయాలతో కూడుకున్నదిగాను, మున్సిపాలిటీల నుంచి అనుమతులు పొందటం కష్టతరంగాను ఉంటోందని టెలికం వర్గాలు తెలిపాయి. ముంబై వంటి నగరాల్లో ఓఎఫ్సీ వేయాలంటే కిలోమీటరుకు రూ. 1 కోటి పైగా వ్యయం అవుతుందని వివరించాయి. అండర్‌గ్రౌండ్‌లో ఓఎఫ్సీ వేసేందుకు అయ్యే మొత్తం ఖర్చులో కేబుల్ ఖరీదు 15 శాతం కూడా దాటదని పేర్కొన్నాయి. ఇక ఇప్పటికే భారీ రుణభారంతో సతమతమవుతున్న టెల్కోలకు మళ్లీ ఖరీదైన 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేయడానికి, ఫైబర్ వేయడానికి కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న సందేహాలూ నెలకొన్నాయి. మూడు దిగ్గజ టెల్కోలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ ఏడాది దాదాపు రూ. 1,00,000 కోట్లు వ్యయం చేస్తున్నాయి. ఇవి మళ్లీ ఫైబర్ కోసం మరో రూ. 15,000 కోట్లు ఖర్చు చేయగలవా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అటు ప్రభుత్వానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓఎఫ్‌సీపై భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. -
ఈ ఏడాదే స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ సేవలకు సంబంధించి టెలికం స్పెక్ట్రం వేలాన్ని ఈ ఏడాదే నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే వచ్చే 100 రోజుల్లో 5జీ ట్రయల్స్ కూడా ప్రారంభించాలని భావిస్తోంది. కొత్తగా టెలికం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రవి శంకర్ ప్రసాద్ సోమవారం ఈ విషయాలు తెలిపారు. ‘స్పెక్ట్రం వేలంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు సమర్పించింది. స్థాయీ సంఘం, ఆర్థిక కమిటీ మొదలైనవి పరిశీలిస్తున్నాయి. ఒక నిర్ణయానికొచ్చాక ప్రతిపాదన క్యాబినెట్ ముందుకొస్తుంది. ప్రస్తుతానికి తగినంత స్పెక్ట్రం అందుబాటులో ఉంది. ఈ ఏడాదే వేలం కూడా నిర్వహించవచ్చని భావిస్తున్నాను‘ అని మంత్రి తెలిపారు. 5జీ సేవలకు కూడా ఉపయోగపడే 8,644 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయొచ్చని ట్రాయ్ సూచించింది. దీనికి మొత్తం బేస్ ధర రూ.4.9 లక్షల కోట్లుగా నిర్దేశించవచ్చని పేర్కొంది. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తాము ఇంత భారీ రేటును భరించలేమంటూ టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మార్కెట్‌ను ప్రతిబింబించే సూచీ .. 100 రోజుల్లో 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించడంతో పాటు దేశీయ మార్కెట్లో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే బ్రాడ్‌బ్యాండ్ సంసిద్ధత సూచీని (బీఆర్ఐ) ఏర్పాటు చేయడం కూడా మంత్రి ఎజెండాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇన్ఫ్రా, అనుమతుల ప్రక్రియ, హై స్పీడ్ ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలను బీఆర్ఐ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే అయిదు లక్షల వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, దేశీయంగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించడం వంటి వాటిపైనా దృష్టి పెట్టనున్నారు. ‘అణగారిన వర్గాల సంక్షేమానికి, విద్య .. వైద్యం వంటి వాటిని మెరుగుపర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సాంకేతికతను చేరువ చేసేందుకు 5జీ టెక్నాలజీని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, 5జీ ట్రయల్స్‌లో చైనా కంపెనీ హువావేని కూడా అనుమతించే విషయంపై స్పందిస్తూ.. ఇది భద్రతాపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున.. మరింత లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని యన చెప్పారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయనివ్వొద్దు ఉగ్రవాదం, మతతత్వాలకు సోషల్ మీడియా వేదిక కాకూడదని రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా సైట్లు దుర్వినియోగం కాకుండా ఆయా సంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డేటా భద్రత బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో 10 నగరాల్లో ఆధార్ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. -
వంద రోజుల్లో 5జీ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త టెలికాం శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ దూకుడు పెంచారు. మరో వంద రోజుల్లో 5 జీ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే హువావే 5 జీ ట్రయల్స్‌లో పాల్గొనే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని చెప్పారు. భారతదేశంలో 5 జి ట్రయల్స్ ప్రారంభించడానికి 100 రోజుల గడువుని నిర్ణయించారు . ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 5 జీ ఆధారిత తదుపరి స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని చెప్పారు. ట్రయల్ మొదలైన తరువాత 5 జిలో పాల్గొనడం అనేది తప్పనిసరికాదు అని, భద్రతా సమస్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాధాన్యత జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కీలకంగా ఉంటుందన్నారు. ఎందుకంటే, ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉనికి సమంజసమని తాను భావిస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఐటీ, న్యాయశాఖమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. -
5జీ స్పెక్ట్రమ్ బేస్ ధర భరించలేనిది
న్యూఢిల్లీ: ట్రాయ్ సిఫారసు చేసిన 5జీ స్పెక్ట్రమ్ ధర భరించలేని స్థాయిలో, అత్యధికంగా ఉందని భారతీ ఎయిర్టెల్ ఆందోళన వ్యక్తం చేసింది. 5జీ సేవలు వేగంగా విస్తరించేందుకు వీలుగా స్పెక్ట్రమ్ బేస్ ధరను ప్రభుత్వం సమీక్షించాలని కోరింది. 5జీ స్పెక్ట్రమ్, రిజర్వ్ ధరను ప్రభుత్వం సమీక్షిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అప్పుడే తాము 5జీ గురించి పరిశీలిస్తామని భారతీ ఎయిర్టెల్ భారత్, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌విట్టల్ తెలిపారు. 100 మెగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్‌కు ట్రాయ్ నిర్ణయించిన ధర రూ.50,000–55,000 కోట్లుగా ఉన్నట్టు విట్టల్ తెలిపారు. ‘‘5జీకి చాలా పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్ అవసరం అవుతుంది. 40 మెగాహెర్జ్ ఉంటే 5జీ తరహా అవసరాలకు చాలదు. వేగం, సామర్థ్యం పరంగా పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్ కావాల్సిందే. స్పష్టంగా చెప్పాలంటే ఈ ధరలను మేం భరించలేం’’ అని విట్టల్ తెలిపారు. -
హువావే దూకుడు : 8కే 5జీ స్మార్ట్ టీవీలు
చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అమెరికా దిగ్గజం యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించిన హువావే ప్రపంచంలోనే తొలి 5జీ సపోర్ట్ టీవీని ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకు రానుందని నికాయ్ ఏషియన్ రివ్యూ నివేదించింది. 5జీ సపోర్ట్ ఫీచర్‌తో 8కే స్మార్ట్ టీవీని త్వరలోనే ఆవిష్కరించనుంది. దీని ప్రకారం కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. ఈ అంచనాలు నిజమైతే 5జీ, హైఎండ్ రిజల్యూషన్ డిస్ప్లే, గిగాబిట్ సామర్థ్యంతో వైర్లెస్ స్టాండర్ట్ కేపబుల్ టీవీని ఆవిష్కరించిన కంపెనీగా హువావే చర్రిత సృష్టించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది. కాగా ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటైన హువావే అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్దిని సాధించి యాపిల్‌ను సైతం వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. -
తొలి దేశీయ 4జీ సెమీకండక్టర్ చిప్
న్యూఢిల్లీ: 4జీ, ఎల్టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్‌ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్‌ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనపై సిగ్నల్‌చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ అభినందించారు. మరోవైపు, భద్రతాప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయంగా చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింతగా అధ్యయనం చేయనున్నట్లు అరుణ చెప్పారు. ‘చాలా దేశాలు చైనా సంస్థల టెలికం పరికరాల విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి భారత్ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది‘ అని చిప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా కంపెనీలు.. ముఖ్యంగా హువావే సంస్థ తయారు చేసే టెలికం పరికరాలను ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, హువావేకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. జర్మనీ తదితర దేశాలు మాత్రం ఆ సంస్థ పరికరాల వినియోగం కొనసాగించే యోచనలో ఉన్నాయి. -
2020లో 5జీ టెక్నాలజీ తెస్తాం: కేంద్రం
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2020 నాటికి దేశంలో 5జీ మొబైల్ టెక్నాలజీని తీసుకొస్తామని ఐటీ మంత్రి రవిశంకర్ తెలిపారు. దేశంలోని గ్రామ పంచాయతీలను ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో అనుసంధానించే ప్రాజెక్టు ఈ ఏడాదిలో పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించే సిటిజన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి ఉపాధిని అందిస్తున్నామని పేర్కొన్నారు. 55 అడుగుల రోబో: సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆవిష్కరించిన భారీ రోబో ప్రతిమ ఇది. 55 అడుగుల ఎత్తున్న ఈ రోబో పేరు మెటల్ మాగ్నా. 25 టన్నుల బరువున్న దీన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు రెండు నెలలు శ్రమించి తయారు చేశారు. -
తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్‌ను మొబైల్ నెట్వర్క్ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్ నాయక్ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శాటిలైట్ ఫోన్లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్సెట్స్ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ చిప్సెట్స్.. దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ప్లాంటులో తయారవుతున్నాయి. -
షావోమీ నుంచి తొలి 5జీ ఫోన్
చైనా: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న మొబైల్ దిగ్గజం షావోమి తాజాగా మొబైల్ మార్కెట్లోకి మరో అధునాతనమైన మొబైల్‌ని లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత కొద్ది కాలంగా పలు మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్ తయారీపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇతర దిగ్గజ కంపెనీలకంటే ముందే షావోమీ తన మిక్స్ ఫ్లాగ్‌షిప్‌లో తొలి 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. బీజింగ్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో తొలి 5జీ ఫోన్ ఎంఐ మిక్స్ 3ని ప్రదర్శించింది. 5జీ నెట్వర్క్ ద్వారా మరింత స్పీడ్‌ను ఎలా అందుకోవచ్చో డెమో వీడియో ద్వారా చూపించింది. ఈ ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855తో రానుందని తెలిపింది. 5జీ వేగాన్ని అందుకోవడానికిగాను ఎక్స్50 మోడెమ్‌ను అమరుస్తున్నారు. దీనివల్ల 2ఎంబీపీఎస్ వేగాన్ని అందుకోవచ్చు. 2019 మొదట్లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎంఐ మిక్స్3 ఫీచర్లు 6.39 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 10 జీబీ ర్యామ్ 256జీబీ అంతర్గత మెమోరీ 12+12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 24+2 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 3200 ఎంఏహెచ్ బ్యాటరీ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం -
నాలుగేళ్లలో... 5జీ: ట్రాయ్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాలజీని వినియోగించటమనేది కీలకంగా మారుతోంది’’ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గుప్తా వ్యాఖ్యానించారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో మీడియా కంటెంట్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించడంపై మీడియా పరిశ్రమ మరింతగా దృష్టి పెడితే, కంటెంట్ వినియోగం గణనీయంగా పెరగగలదని గుప్తా తెలిపారు. మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు 5జీ సేవలు ఉపయోగపడతాయి. అలాగే, తయారీ, రిటైల్, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉంది. 5జీతో జీడీపీ రెట్టింపు: అరుణ సుందరరాజన్ స్థూల దేశీయోత్పత్తిని రెట్టింపు చేయగలిగే సత్తా 5జీ సేవలకుదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టెలికం ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. అంతర్జాతీయంగా టెలికం రంగంపై పెట్టుబడులు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనున్నాయని, ఒక్క చైనాయే డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా ఏర్పాటుపై ఏటా 188 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు. కేవలం 5జీకే చైనా బడ్జెట్ సుమారు 500 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరుణ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, నిర్దాక్షిణ్యమైన పోటీ వల్ల భారత టెలికం పరిశ్రమ పెను సవాళ్లమయంగా మారిందని అరుణ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారీ పెట్టుబడులను ఆకర్షించేంత లాభదాయకత, వ్యాపార అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయని చెప్పారామె. ‘‘దేశీ టెలికం పరిశ్రమమ ఇప్పుడిప్పుడే విప్లవాత్మకమైన మార్పులను చూస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరెన్నో చూడాల్సి వస్తుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిలకడగా మూడు దశాబ్దాల పాటు భారత్ 9– 10 శాతం మేర వృద్ధి చెందాలంటే డిజిటల్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇందుకోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పటిష్టం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది వన్ ప్లస్ 5జీ ఫోన్.. 5జీ టెక్నాలజీ సేవలకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నట్లు చైనా హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వెల్లడించింది. ముందుగా యూరప్‌లో దీన్ని ప్రవేశపెడతామని స్నాప్‌డ్రాగన్ టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ తెలిపారు. టెలికం ఆపరేటర్ ఈఈ భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. మరింత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌తో ఇది రూపొందుతుందని పీట్ చెప్పారు. -
5జీపై టెలికం శాఖతో చర్చల్లో క్వాల్కామ్
హవాయ్: భారత్‌లో 5జీ టెలికం సర్వీసుల విస్తృతికి అపార అవకాశాలు ఉన్నాయని మొబైల్ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా మల్లాది తెలిపారు. 5జీతో అవకాశాలపై దేశీయంగా మరింత అవగాహన కల్పించేందుకు తీసుకోతగిన చర్యలపై టెలికం శాఖతో పాటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. 5జీ సర్వీసులు వచ్చినంత మాత్రాన 4జీ ఎల్టీఈ సేవలు పూర్తిగా నిల్చిపోవని ఆమె పేర్కొన్నారు. 5జీ సేవలు ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు వెల్లడించేందుకు నిరాకరించారు. స్నాప్‌డ్రాగన్ టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ సదస్సులో భాగంగా లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌ను క్వాల్కామ్ ఆవిష్కరించింది. శాంసంగ్ తదితర హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టే 5జీ ఫోన్స్‌లో వీటిని వినియోగించనున్నాయి. ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు విమానప్రయాణంలో కూడా ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఇన్–ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనో జ్ సిన్హా చెప్పారు. న్యాయ శాఖ అనుమతులు లభిస్తే జనవరిలోనే నిబంధనలను వెల్లడిస్తామన్నారు. -
తొలి 5జీ ట్రయల్స్ సక్సెస్..