హైదరాబాద్: దేశీ ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది. గతంలో 5జీ సేవల కోసం కొంత సమయం కావాలని కోరిన ఎయిర్‌టెల్, ఒక్కసారే 5జీ సేవలను ఒక ప్రైవేట్ నెట్‌వర్క్ ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించే సరికి జియో కూడా విస్మయానికి గురి అయ్యింది.(చదవండి: 'రిలయెన్స్ జియో' మరో రికార్డ్)
న్యూఢిల్లీకి చెందిన ఒక టెల్కో కంపెనీ నాన్-స్టాండలోన్ (ఎన్‌ఎస్‌ఏ) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ లో 5జీ సేవలను పరీక్షించినట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు అందించవచ్చు అని పేర్కొంది. ప్రస్తుత నెట్‌వర్క్ టెక్నాలజీ కంటే 5జీ నెట్‌వర్క్ వేగం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. 5జీ ఫోన్‌లో ఫుల్ మూవీని కొన్ని సేకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది.(చదవండి: నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త!)
ఎయిర్‌టెల్ కొత్త 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నుంచి పూర్తి అనుమతులు, సరిపడినంత స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఎయిర్‌టెల్ 5జీ సేవలు యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త 5జీ సేవల కోసం వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ పేర్కొంది. విజయవంతంగా 5జీ సేవలను పరీక్షించినందుకు ఇంజినీర్లను కంపెనీ అభినందించింది. 5జీ పరీక్షల కోసం ఎయిర్‌టెల్ ఒప్పో రెనో 5ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించింది. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి, భారతదేశపు అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ జియో 2021 రెండవ భాగంలో దేశంలో తన 5జి సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment