relaince jio
-
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. జియో టీవీ బంపర్ ఆఫర్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటవల తన సబ్స్క్రైబర్ల ఓ సరి కొత్త ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ కొత్త ప్లాన్స్ ప్రకారం ఏకంగా 14 ఓటీటీలను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ప్లాన్ల ధరలు రిలయన్స్ జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో రూ.398, రూ.1198, రూ.4498 ధరలతో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ ఇప్పటికే (15 డిసెంబర్ 2023) అందుబాటులో ఉన్నాయి 👉రూ.398తో ప్రారంభమయ్యే ప్లాన్ రోజుకు 2GB డేటాతో 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంతే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే అందిస్తుంది. 👉రూ.1198తో ప్రారంభమయ్యే ప్లాన్ అనేది 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో రోజుకి 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు, JioTV ప్రీమియం (14 ఓటీటీలు) వంటివి పొందవచ్చు. 👉రూ.4498తో ప్రారంభమయ్యే ప్లాన్ 365 రోజులు పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో కూడా రోజుకి 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు వంటివి లభిస్తాయి. పైగా 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను పొందవచ్చు. కంపెనీ ఈ ప్లాన్ కోసం ఈఎమ్ఐ వెసులుబాటుని కూడా అందిస్తుంది. జాబితాలోని రీజనల్ అండ్ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు జియోసినిమా ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ జీ5 సోనీలైవ్ ప్రైమ్ వీడియో (మొబైల్) లయన్స్‌గేట్ ప్లే డిస్కవరీ+ డాక్యుబే హోఇచోయ్ SunNXT ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
రిలయన్స్ చేతికే డిస్నీ?, డీల్ విలువ రూ.80,000 కోట్లు
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్,అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీల మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. డిస్నీ ఆస్తులన్నీ తన వద్దే ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలి, స్టాక్స్‌ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. డీల్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్నీ ఆస్తులను కొంత కాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్ డిస్నీ అనుకుంటుందని సమాచారం. ఐపీఎల్ దెబ్బ.. ఆపై 2022లో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు అంబానీ సొంతం చేసుకున్నారు. జియో సినిమా ఫ్లాట్‌ఫారమ్‌లో ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీవో షోలను భారత్‌లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కుల్ని రిలయన్స్ సొంతం చేసుకోవడం వంటి వరుస పరిణామాలతో వాల్ట్‌డిస్నీ స్టార్ డిస్నీని అమ్మేలా నిశ్చయించుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 35 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. -
జియో దెబ్బకు నష్టాల్లోకి వోడాఫోన్! ఏకంగా..
Reliance Jio: ఏప్రిల్ 2023లో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో తన ఆధిపత్య స్థానాన్ని నిలుపుకోవడంలో 'రిలయన్స్ జియో' (Reliance Jio) ముందు వరుసలో నిలిచినట్లు 'టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో 2023 ఏప్రిల్ నెలలో కొత్తగా 3.04 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందగలిగింది. ఇదే సమయంలో భారతి ఎయిర్టెల్ (Bharti Airtel) 76,328 మంది వినియోగదారులను పొందినట్లు తెలిసింది. వోడాఫోన్ ఏకంగా 2.99 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. కాగా మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య మార్చి 2023లో 1,143.93 మిలియన్ల నుంచి ఏప్రిల్ 2023లో 1,143.13 మిలియన్లకు తగ్గింది. దీని ప్రకారం నెలవారీ క్షీణత రేటు 0.07 శాతం. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో సంఖ్య పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) టెలికామ్ రంగంలో ప్రైవేట్ హవా కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 90 శాతం వాటా వీరిదే ఉందని తెలుస్తోంది. ఒక్క రిలయన్స్ జియో వాటా 37.9 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఎయిర్టెల్ 32.4 శాతం, వోడాఫోన్ 20.4 శాతంలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్ (BSNL), ఎమ్టీఎన్ఎల్ (MTNL) వాటా కేవలం 9.2 శాతం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో మరింత తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
భారత ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చబోతున రిలయన్స్ ...
-
జియో మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం! జియో యూజర్లకు.. స్పెషల్ ఆఫర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో, కస్టమర్లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్‌ను పొందచ్చు. రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్‌లో.. రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్‌లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్‌కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్‌తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్‌లో జత చేసింది రిలయన్స్ జియో. ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
డేటా ఎక్కువ వినియోగిస్తున్నారా? జియో కొత్త ప్లాన్ వచ్చేసింది!
వివిధ రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా వినియోగించే వారి కోసం 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్ (Data Add on plan) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిఫా వాల్డ్ కప్ ఖతర్ 2022 జరుగుతున్న నేపథ్యంలో ఫుట్‌బాల్ లవర్స్ కోసం ఈ యాడ్ ఆన్ ప్లాన్‌ని ప్రారంభించింది. ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇది రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్, దీని వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్యాక్ మొత్తం 50GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 1GB డేటా కోసం వినియోగదారులు రూ.4.44 చెల్లిస్తారు. దీని గడువు ముగిసేలోపు మొత్తం డేటా ఉపయోగిస్తే, నెట్వర్క్ స్పీడ్ 64Kbpsకి పరిమితం అవుతుంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ డేటా ప్యాక్‌ను ఇప్పటికే ఉన్న బేస్ ప్లాన్‌తో కలిపి ఉపయోగించాల్సి ఉంటుంది. యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ కింద అందించే రోజువారీ డేటా అయిపోయిన తర్వాత ఈ 50GB డేటా వాడుకోవచ్చు. ఇదే కాకుండా రూ. 181, రూ. 241, రూ. 301 ధరలతో ఇలాంటి మరిన్ని యాడ్-ఆన్ డేటా ప్యాక్‌లు కూడా జియో అందిస్తోంది. చదవండి ‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు! -
ఫిక్సిడ్ లైన్లలో జియో టాప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఫిక్సిడ్ లైన్ల విభాగంలోనూ హవా కొనసాగిస్తోంది. తాజాగా ఆగస్టులో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను తోసిరాజని అగ్రస్థానం దక్కించుకుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జియో వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. మొత్తం వైర్‌లైన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య జూలైలో 2.56 కోట్లుగా ఉండగా ఆగస్టులో 2.59 కోట్లకు పెరిగింది. బీఎస్ఎన్ఎల్ 15,734 మంది యూజర్లు, ఎంటీఎన్ఎల్ 13,395 మంది కస్టమర్లను కోల్పోయాయి. జియోకు 2.62 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌కు 1.19 లక్షలు, వొడాఫోన్ ఐడియాకు (వీఐ) 4,202, టాటా టెలీ సర్వీసెస్‌కు 3,769 మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం టెలికం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య స్వల్పంగా 117.36 కోట్ల నుంచి 117.5 కోట్లకు పెరిగింది. జియోకు కొత్తగా 32.81 లక్షలు, ఎయిర్‌టెల్‌కు 3.26 లక్షల మంది మొబైల్ యూజర్లు జతయ్యారు. వీఐ 19.58 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 5.67 లక్షలు, ఎంటీఎన్ఎల్ 470 మంది యూజర్లను కోల్పోయాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల విషయానికొస్తే 80.74 కోట్ల నుంచి 81.39 కోట్లకు చేరాయి. జియోకు అత్యధికంగా 42.58 కోట్ల మంది, ఎయిర్‌టెల్‌కు 22.39 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త -
దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇక అప్పటి నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకోవడంలో జియో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా టెలికాం సెక్టార్ రెగ్యులర్ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. రిలయన్స్ జియో జూలైలోను అత్యధికంగా సబ్స్క్రైబర్లను పొందింది. కొత్తగా 29.4 లక్షల మంది మొబైల్ సబ్స్క్రైబర్లను జియో సంపాదించుకుంది. దీంతో వారి మొత్తం యూజర్ల సంఖ్య 415.96 లక్షలకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ జూలైలో 5.13 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో దాని మొబైల్ కస్టమర్ల సంఖ్య 36.34 కోట్లకు చేరుకుంది. డేటా ప్రకారం జూలై 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా వైర్లెస్ చందాదారుల సంఖ్య 114.8 కోట్లకు చేరింది. ప్రైవేట్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు వైర్లెస్ సబ్స్క్రైబర్లు 90.12 శాతం మార్కెట్ వాటా ఉండగా, రెండు పీఎస్‌యూ( PSU) యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు బీఎస్ఎన్ఎల్( BSNL) (ఎంటీఎన్ఎల్) (MTNL) 9.88 శాతం మార్కెట్ వాటా మాత్రమే కలిగి ఉంది. జూలై 2022 నెలలో, దాదాపు 1.02 కోట్ల మంది కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఎంచుకున్నట్లు నివేదిక పేర్కొంది. చదవండి: దేశంలో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ! -
ఇక సులభంగా రిలయన్స్ జియో రీఛార్జ్ సేవలు..!
ముంబై: మెటా, రిలయన్స్ జియో చేతులు కలపడం వల్ల దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ అభిప్రాయపడ్డారు. జియో వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను వాట్సాప్ ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చని బుధవారం తెలిపారు. మెటా ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 ఈవెంట్లో ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో, మెటా బృందాల పరస్పర సహకారంతో దేశంలో మరిన్ని మార్పులను వస్తాయని అన్నారు. "త్వరలో వాట్సాప్‌లో జియో వినియోగదారులకు 'ప్రీపెయిడ్ రీఛార్జ్' సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ సేవలు అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని ఆయన చెప్పారు. ఈ ఫీచర్ 2022లో విడుదల కానుంది. జియో ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ ఫీచర్ రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి కొన్ని సమయాల్లో బయటికి వెళ్లడం కష్టంగా ఉండే వృద్ధులకు ఈ ఫీచర్ భాగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. (చదవండి: చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం) భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ‘కిరాణా దుకాణాలు’ వెన్నెముక అని ఇషా అంబానీ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కొనుగోళ్ల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని .. ఇది కంపెనీగా జియోకి కస్టమర్లకి ఎంతో ఉపయోగపడిందన్నారు. అదే పద్దతిలో జియోమార్ట్ వల్ల వినియోగదారులకు కొనుగులు ప్రక్రియ ఎంతో సులభం అవుతుందన్నారు. మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని.. అనేక ఇతర దేశాలు అనుసరించడానికి భారత్ దారి చూపుతుందని అన్నారు. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..!) -
క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్!
క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ అందించే కొత్త ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. ఇప్పటి వరకు, జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది. ఈ కొత్త రిలయన్స్ జియో ప్లాన్ డిస్నీ+ హాట్ స్టార్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్ బీఓ, ఎఫ్ఎక్స్, షోటైమ్, ఇతర అంతర్జాతీయ కంటెంట్ కొత్త లైబ్రరీ ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధరలు వరుసగా రూ.499(వాలిడిటీ 28 రోజులు), రూ.666(వాలిడిటీ 56 రోజులు), రూ.888 (వాలిడిటీ 84 రోజులు), రూ.2,599(వాలిడిటీ 365 రోజులు)గా ఉన్నాయి. రూ.499 రిచార్జ్ ప్లాన్ కింద జుకు 3జిబి డేటాను అందిస్తుండగా, మిగిలిన మూడు ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీ డేటా లభిస్తాయి. (చదవండి: ఐపీఎల్ టీం... ఇప్పుడు మరింత కాస్ట్లీ గురు!) అలాగే, ఇంకా రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా కావాలంటే డేటా యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రిచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. రూ.549 యాడ్-ఆన్ ప్లాన్ మినహా అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అపరిమిత వాయిస్, ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. -
రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే!
భారతదేశంలో వచ్చే నెల సెప్టెంబర్ 10న విడుదల కానున్న జియోఫోన్ నెక్ట్స్ ధర, ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ప్రపంచంలో ఇదే అత్యంత చౌకైన ఫోన్ కానున్నట్లు తెలిపారు. తాజాగా, ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను టిప్ స్టార్ యోగేష్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు ఇతను కూడా దృవీకరించాడు. యోగేష్ పేర్కొన్న ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ ఫీచర్స్(అంచనా): 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్ 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ 𝗝𝗶𝗼𝗣𝗵𝗼𝗻𝗲 𝗡𝗲𝘅𝘁 •5.5" HD display •4G VoLTE Dual SIM •2/3GB RAM •16/32GB storage eMMC 4.5 •Qualcomm Snapdragon 215 •Android 11 (Go Edition) •Rear camera: 13MP •Front camera: 8MP •2,500mAh battery Launch next month, estimated price ₹3,499 — 𓆩Yogesh𓆪 (@heyitsyogesh) August 17, 2021 -
ఎయిర్‌టెల్‌కు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న జియో!
భారతీయ టెలికాం మార్కెట్లో మే నెలలో ఎయిర్టెల్ 46.13 లక్షల చందాదారులను కోల్పోయింది. ట్రాయ్ విడుదల చేసిన మే నెల గణాంకాల ప్రకారం.. ఎయిర్టెల్ ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుంది. మొత్తం మీద మే నెలలో 62.7 లక్షల మంది భారత మొబైల్ మార్కెట్ వినియోగదారులు తగ్గారు. జియో ఈ నెలలో 35.54 లక్షల మొబైల్ వినియోగదారులను చేర్చుకొని మొత్తం చందాదారుల సంఖ్యను 43.12 కోట్లకు పెంచుకుంది. మే నెలలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ భారీగా చందాదారులను కోల్పోయాయి. అలాగే, వోడాఫోన్ ఐడియాకు కూడా మే నెలలో 42.8 లక్షల మంది మొబైల్ చందాదారుల సంఖ్య తగ్గి, మొత్తం చందాదారుల సంఖ్య 27.7 కోట్లకు చేరుకుంది. ఎయిర్టెల్ 46.13 లక్షల మొబైల్ వినియోగదారులను కోల్పోయి, 34.8 కోట్ల చందాదారుల సంఖ్యతో మార్కెట్లో రెండవ అతిపెద్ద టెలికామ్ కంపెనీగా నిలిచింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా దేశంలో మే నెలలో మొత్తం వినియోగదారుల సంఖ్య 62.7 లక్షలు తగ్గారు, ప్రస్తుతం దేశంలో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య 117.6 కోట్లు. ఏపీ & తెలంగాణలో కూడా 2021 మే నెలలో భారీగా చందాదారులను పొందిన ఏకైక ఆపరేటర్ జియోనే. ఏపీ & తెలంగాణలో 3,21,46,712 మంది వినియోగదారులతో మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. జియో 46,119 మంది సభ్యులను చేర్చుకోగా, ఎయిర్టెల్ 4,08,257, వోడాఫోన్ ఐడియా 2,72,081 మంది వినియోగదారులను కోల్పోయాయి. అదే నెలలో బిఎస్ఎన్ఎల్ 4,15,690 మంది కస్టమర్లను కోల్పోయింది. -
4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో సత్తా చాటిన జియో..!
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటింది. 4జీ నెట్వర్క్ డౌన్లోడింగ్ స్పీడ్ పరంగా మరోసారి జియో అగ్రస్థానంలో నిలిచింది. జూన్ నెలలో డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో ఇతర నెట్‌వర్క్‌ల కంటే సెకనుకు సరాసరి 21.9 ఎమ్‌బీపీఎస్ వేగంతో జియో నెట్వర్క్ అన్నింటి కంటే ముందు ఉంది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్ ట్రాయ్ ఒక రిపోర్టులో తెలిపింది. అలాగే, వోడాఫోన్ ఐడియా అప్లోడింగ్ స్పీడ్ పరంగా ముందంజలో ఉంది. వోడాఫోన్ సుమారు 6.2 ఎమ్‌బీపీఎస్ అప్లోడ్ స్పీడ్ పరంగా ముందు అన్నింటితో పోలిస్తే ఉంది. రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ వేగం మే నెలతో(20.7 ఎమ్‌బీపీఎస్) పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక దీని సమీప పోటీదారుడు వోడాఫోన్ ఐడియా(డౌన్లోడ్ వేగం 6.5 ఎమ్‌బీపీఎస్) కంటే మూడు రెట్లు ఎక్కువ. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎయిర్టెల్ 4జీ డౌన్లోడ్ వేగం స్వల్పంగా పెరగింది. ఇప్పటికీ 5 ఎమ్‌బీపీఎస్ డౌన్లోడ్ వేగంతో కనిష్ట స్థాయిలో ఉంది. ట్రాయ్ ప్రకారం, వోడాఫోన్ ఐడియా మే నెలలో సగటున 6.2 ఎమ్‌బీపీఎస్ అప్లోడ్ వేగాన్ని కలిగి ఉంది. దాని తర్వాత రిలయన్స్ జియో 4.8 ఎమ్‌బీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్టెల్ 3.9 ఎమ్‌బీపీఎస్‌తో ఉంది. -
రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాక్
హైదరాబాద్: దేశీ ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్టెల్ తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది. గతంలో 5జీ సేవల కోసం కొంత సమయం కావాలని కోరిన ఎయిర్టెల్, ఒక్కసారే 5జీ సేవలను ఒక ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించే సరికి జియో కూడా విస్మయానికి గురి అయ్యింది.(చదవండి: 'రిలయెన్స్ జియో' మరో రికార్డ్) న్యూఢిల్లీకి చెందిన ఒక టెల్కో కంపెనీ నాన్-స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ లో 5జీ సేవలను పరీక్షించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు అందించవచ్చు అని పేర్కొంది. ప్రస్తుత నెట్వర్క్ టెక్నాలజీ కంటే 5జీ నెట్వర్క్ వేగం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. 5జీ ఫోన్లో ఫుల్ మూవీని కొన్ని సేకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది.(చదవండి: నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త!) ఎయిర్టెల్ కొత్త 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నుంచి పూర్తి అనుమతులు, సరిపడినంత స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఎయిర్టెల్ 5జీ సేవలు యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త 5జీ సేవల కోసం వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఎయిర్టెల్ పేర్కొంది. విజయవంతంగా 5జీ సేవలను పరీక్షించినందుకు ఇంజినీర్లను కంపెనీ అభినందించింది. 5జీ పరీక్షల కోసం ఎయిర్టెల్ ఒప్పో రెనో 5ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2ప్రో స్మార్ట్ఫోన్లను ఉపయోగించింది. ఎయిర్టెల్ ప్రత్యర్థి, భారతదేశపు అతిపెద్ద టెలికాం నెట్వర్క్ జియో 2021 రెండవ భాగంలో దేశంలో తన 5జి సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. -
5జీ సేవలకు సన్నద్ధం : ముఖేష్ అంబానీ
ముంబై : రిలయన్స్ జియో కేవలం మూడేళ్లలోనే 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించగా, ఇతర టెలికాం కంపెనీలకు 2జీ నెట్వర్క్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీని ఉద్దేశించి ముఖేష్ మాట్లాడుతూ జియో ప్రస్ధానాన్ని వివరించారు. జియో 4జీ నెట్వర్క్ ద్వారా భారతీయులకు అల్ట్రా హైస్పీడ్ కనెక్టివిటీ, సహేతుకమైన ధరల్లో ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తీరును ముఖేష్ అంబానీ గుర్తుచేశారు. జియోకు ముందు భారత్ 2జీ టెక్నాలజీకే పరిమితమైందని, భారత్ డేటా కష్టాలకు ముగింపు పలకాలని జియో నిర్ణయించుకుని డిజిటల్ విప్లవాన్ని చేపట్టిందని చెప్పారు. దేశమంతటా అత్యధిక వేగంతో పాటు మెరుగైన కవరేజ్‌తో ప్రపంచ శ్రేణి డిజిటల్ నెట్‌వర్క్‌ను సృష్టించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను తాము ప్రవేశపెట్టామని, జియో యూజర్లకు వాయిస్ సేవలను పూర్తి ఉచితంగా అందించామని చెప్పుకొచ్చారు. జియోకు ముందు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్ ఫోన్లతో సాధ్యంకాక వందకోట్ల భారతీయుల్లో సగానికి పైగా డిజిటల్ ఉద్యమానికి దూరంగా ఉన్నారని అన్నారు. 2016లో టెలికాం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్ధానంలో ఉన్న భారత్ అగ్రస్ధానానికి ఎగబాకిందని తెలిపారు. జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లో చేరుతున్నారని చెప్పారు. భారత్‌లో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి ఎగబాకిందని, ఇక అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని వివరించారు. దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం జరుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి : రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్.. -
రిలయన్స్ డిజిటల్లో యాపిల్ వాచ్ న్యూ సిరీస్ 6 లాంఛ్
సాక్షి, హైదరాబాద్ : యాపిల్ వాచ్ న్యూ సిరీస్ 6, యాపిల్ వాచ్ ఎస్ఈ, ఐపాడ్ 8 జనరేషన్ ప్రీ బుకింగ్‌ను అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మై జియో స్టోర్స్‌లో రిలయన్స్ డిజిటల్ ప్రారంభించింది. కస్టమర్లు ఈ ఉత్పత్తులను ఇక తమ సమీప రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్డిజిటల్.ఇన్ లోనూ ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈనెల 30 వరకూ పొందవచ్చని రిలయన్స్ డిజిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : రిలయన్స్ చేతికి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇక యాపిల్ వాచ్ సిరీస్ 6, వాచ్ ఎస్ఈ రిటైల్ విక్రయాలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. యాపిల్ వాచ్ సిరీస్ 6 బ్లడ్ ఆక్సిజన్ స్ధాయిలను తెలిపే ఫీచర్‌తో పాటు ఆల్ న్యూ స్లీపీయాప్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ సేవల వంటి ఆధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. న్యూ యాపిల్ వాచ్ సిరీస్ 6 ప్రారంభ ధర రూ 40,900 కాగా, ఇక యాపిల్ వాచ్ ఎస్ఈ శ్రేణి రూ . 29,900 నుంచి అందుబాటులో ఉంటుందని రిలయన్స్ డిజిటల్ పేర్కొంది. -
పెట్టుబడుల జోష్: రికార్డు గరిష్టానికి రిలయన్స్ షేరు
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రియలన్స్ ఇండస్ట్రీస్ షేరు గురువారం రికార్డు గరిష్టానికి తాకింది. అబుదాభి ఆధారిత ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ముమబదలా జియో ఫ్లాట్‌ఫామ్‌లో రూ.9,093 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం రియలన్స్ షేరు రికార్డు గరిష్టాన్ని అందుకునేందుకు కారణమైంది. జియోలో వరుస పెట్టుబడులు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు నిన్నటి ముగింపు(రూ.1579.95)తో పోలిస్తే 1.38శాతం లాభంతో రూ.1601.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.38శాతం లాభపడి రూ.1617.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు ఏడాది గరిష్ట స్థాయి కావడం విశేషం. ఉదయం 10గంటలకు షేరు క్రితం మునపటి ముగింపుతో పోలిస్తే 1.50శాతం లాభంతో రూ.1603.80 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.867.45, రూ.1617.70గా ఉన్నాయి రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ రూ.10లక్షల కోట్లకు.... రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో కేవలం 6వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్‌లో మొత్తం రూ.87,655.35 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు కంపెనీ తెలిపంది. ఈ నేపథ్యంలో నేడు రియలన్స్ రికార్డు గరిష్టాన్ని తాకింది. అలాగే కంపెనీ నిర్వహించిన రైట్ ఇష్యూ విజయవంతం కావడంతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ మరోసారి రూ.10లక్షల కోట్లకు చేరుకుంది. -
జియోలో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు
ముంబై : రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా జియోలో అమెరికన్ కంపెనీ రూ 6549 కోట్లు వెచ్చించనుంది. గత నాలుగు వారాల్లో ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ వంటి టెక్ దిగ్గజాల నుంచి జియో రూ 67,194 కోట్లు సమీకరించింది. భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు డిజిటల్ కనెక్టివిటీ కీలకమనే ముఖేష్ అంబానీ విజన్‌ను తాము పంచుకుంటున్నామని, భారత్‌లో డిజిటల్ విప్లవానికి ముందుండి చొరవ చూపిన జియోతో కలిసి పనిచేస్తామని జనరల్ అట్లాంటిక్ సీఈఓ బిల్ పోర్డ్ అన్నారు. ఇక ప్రపంచ టెక్ దిగ్గజాల పెట్టుబడులతో భారత్‌లో డిజిటల్ సొసైటీని పటిష్టపరిచేందుకు మార్గం సుగమం అవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్ -
రాబడిలో జియో టాప్
సాక్షి, న్యూఢిల్లీ : ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్టెల్ రూ 6720 కోట్ల ఏజీఆర్‌తో మూడవ స్ధానంలో నిలిచింది. ఇదే త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రెవిన్యూ మార్కెట్ వాటా రూ 1284 కోట్లుగా నమోదైంది. ఆయా కంపెనీల ఏజీఆర్‌ల ఆధారంగానే లైసెన్స్ ఫీజు, ఇతర ఫీజుల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రాబడిని లెక్కిస్తారు. ఇక గత ఏడాది రిలయన్స్ జియో ఏజీఆర్ ఈ త్రైమాసికంలో రూ 7125 కోట్లుగా నమోదైంది. ఇక స్ధూల రాబడిలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ల తర్వాత జియో మూడో స్ధానానికి పరిమితమైంది. రూ 13,542 కోట్లతో వొడాఫోన్ ఐడియా ట్రాయ్ జాబితాలో ముందువరుసలో నిలవగా, రూ 11,596 కోట్ల స్ధూల రాబడితో ఎయిర్టెల్ తర్వాత స్ధానంలో నిలిచింది. ఇక రిలయన్స్ జియో రూ 10,738 కోట్ల స్థూలలాభాన్ని ఆర్జించింది. మరోవైపు ఏజీఆర్ మార్కెట్ వాటాలో 22 టెలికాం సర్కిళ్లలో 11 సర్కిళ్లలో జియో ముందుండగా, ఆరు సర్కిళ్లలో ఎయిర్టెల్, 5 టెలికాం సర్కిళ్లలో వొడాఫోన్ ఐడియా భారీ రాబడిని రాబట్టాయని ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. -
జియోలో కొత్త ఐఫోన్లు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇటీవల తన కొత్త ఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఫోన్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా? అంటూ ఆపిల్ అభిమానులు వేచి చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ ఐఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్లను తమ నెట్‌వర్క్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్లను కస్టమర్లు www.jio.com, రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లు, మైజియో యాప్‌లలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 28 నుంచి ఈ రెండు డివైజ్‌లు స్టోర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. రెండు ఫోన్లలో కూడా జియో తన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం అడ్వాన్స్డ్ ఈసిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. ప్రీపెయిడ్ యూజర్లకు దేశంలో ఈసిమ్ యాక్టివేషన్‌ను అందిస్తున్న ఏకైక ప్రొవైడర్ జియో మాత్రమే. జియో డిజిటల్ లైఫ్‌ను అనుభూతి చెందడానికి ఈ ఐఫోన్ యూజర్లకు డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. దీనిలో ఒకటి నానో-సిమ్ కాగా, మరొకటి డిజిటల్ ఈసిమ్. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో ఇవే అధునాతనమైనవి. స్మార్ట్‌ఫోన్‌ను కొత్త శిఖరానికి తీసుకెళ్లడానికి ఇవి ఎంతో సహకరించనున్నాయి. ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. వేగవంతమైన, మెరుగైన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా 7-నానోమీటర్ చిప్‌ను ఏర్పాటు చేశారు. వేగవంతమైన ఫేస్ ఐడీ, వైడర్ స్టిరియో సౌండ్, లాంగర్ బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్, బ్యూటిఫుల్ గోల్డ్ ఫిన్నిష్, డౌన్లోడ్ స్పీడును పెంచే గిగాబిట్-క్లాస్ ఎల్‌టీఈను ఈ ఫోన్లు ప్రవేశపెట్టాయి. -
జియో దెబ్బ: భారీగా కుప్పకూలిన ఐడియా
మరో టెలికాం దిగ్గజం ఐడియాకు రిలయన్స్ జియో దెబ్బ భారీగా తగిలింది. టెలికాం ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జియో వల్ల ఇప్పటికే దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ తన లాభాలను భారీగా చేజార్చుకోగా, ఐడియా ఏకంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఐడియా సెల్యులార్ శనివారం విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కన్సాలిడేటెడ్ నికర నష్టాలు రూ.383.87 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో కంపెనీకి రూ.659.35 కోట్ల నికరలాభాలు ఉన్నాయి. జియో అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా ఆఫర్లే వీటి లాభాలకు భారీగా గండికండుతుందని తెలిసింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.9032.43 కోట్ల నుంచి రూ.8706.36 కోట్లకు పడిపోయిననట్టు బీఎస్ఈ ఫైలింగ్‌లో నమోదుచేసింది. ''అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నడిచిన త్రైమాసికంలో దేశీయ మొబైల్ ఇండస్ట్రి ఊహించని అంతరాయాలను ఎదుర్కొంది. ముఖ్యంగా టెలికాం సెక్టార్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంట్రీ అందించే ఉచిత వాయిస్, మొబైల్ డేటా ఆఫర్లే దీనికి కారణం'' అని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. చరిత్రలోనే మొదటిసారి భారత వైర్లెస్ సెక్టార్ వార్షిక రెవెన్యూలు 3-5 శాతం పడిపోయాయని పేర్కొంది. రెవెన్యూలు రికవరీ కావడానికి కేవలం ఆ కొత్త ఆపరేటర్ తమ ప్యాన్-ఇండియా మొబైల్ సర్వీసులపై ఛార్జీలు విధించడమే పరిష్కారమని తెలిపింది. ఇటీవలే ఐడియా తన ప్రత్యర్థి వొడాఫోన్‌ను తనలో విలీనం చేసుకోవాలని ప్లాన్స్ చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే టెలికాం ఇండస్ట్రీలో త్రిముఖ పోటీ తెరలేవనుంది. ఎయిర్టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ల విలీన సంస్థ తీవ్రంగా పోటీపడనున్నాయి. -
అన్న తమ్ముళ్ల మధ్య టెలికాం ఆఫర్ల వార్