రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే! | Jio Phone Next Phone Price, Specifications Tipped Again in India | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే!

Published Tue, Aug 17 2021 9:16 PM | Last Updated on Tue, Aug 17 2021 9:24 PM

Jio Phone Next Phone Price, Specifications Tipped Again in India - Sakshi

భారతదేశంలో వచ్చే నెల సెప్టెంబర్ 10న విడుదల కానున్న జియోఫోన్ నెక్ట్స్ ధర, ఫీచర్స్ ఆన్​లైన్​లో లీక్ అయ్యాయి. జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ప్రపంచంలో ఇదే అత్యంత చౌకైన ఫోన్ కానున్నట్లు తెలిపారు. తాజాగా, ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను టిప్ స్టార్ యోగేష్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు ఇతను కూడా దృవీకరించాడు. యోగేష్ పేర్కొన్న ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ ఫీచర్స్(అంచనా):

  • 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 
  • 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్ 
  • 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ 
  • క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ 
  • ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 
  • 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement