![Reliance Jio prepaid recharge through WhatsApp soon - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/15/jio-prepaid-recharge.jpg.webp?itok=K7Io-HcX)
ముంబై: మెటా, రిలయన్స్ జియో చేతులు కలపడం వల్ల దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ అభిప్రాయపడ్డారు. జియో వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను వాట్సాప్ ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చని బుధవారం తెలిపారు. మెటా ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 ఈవెంట్‌లో ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో, మెటా బృందాల పరస్పర సహకారంతో దేశంలో మరిన్ని మార్పులను వస్తాయని అన్నారు.
"త్వరలో వాట్సాప్‌లో జియో వినియోగదారులకు 'ప్రీపెయిడ్ రీఛార్జ్' సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ సేవలు అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని ఆయన చెప్పారు. ఈ ఫీచర్ 2022లో విడుదల కానుంది. జియో ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ ఫీచర్ రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి కొన్ని సమయాల్లో బయటికి వెళ్లడం కష్టంగా ఉండే వృద్ధులకు ఈ ఫీచర్ భాగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.
(చదవండి: చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం)
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ‘కిరాణా దుకాణాలు’ వెన్నెముక అని ఇషా అంబానీ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కొనుగోళ్ల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని .. ఇది కంపెనీగా జియోకి కస్టమర్లకి ఎంతో ఉపయోగపడిందన్నారు. అదే పద్దతిలో జియోమార్ట్ వల్ల వినియోగదారులకు కొనుగులు ప్రక్రియ ఎంతో సులభం అవుతుందన్నారు. మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని.. అనేక ఇతర దేశాలు అనుసరించడానికి భారత్ దారి చూపుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment