Akash Ambani
-
'నాన్న అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు'
భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను.. ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. నాన్న పనితీరు నాకు ఆదర్శమని 'ముంబై టెక్ వీక్' కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పటికి కూడా నాన్న (ముకేశ్ అంబానీ) తనకొచ్చిన అన్ని ఈమెయిల్‌కు రిప్లై ఇస్తూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ఉంటారని ఆకాష్ అంబానీ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా.. కంపెనీ వృద్ధి కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇది 45వ ఏడాది. ఆయన పనతీరు నాకు ఆదర్శమని.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.అమ్మకు, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇద్దరూ టీవిలో క్రికెట్ కూస్తూ ఉంటాము. అప్పుడు అమ్మ చిన్నచిన్న విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. అవన్నీ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అమ్మ, నాన్నకు అంకితభావం ఎక్కువ. అవి మాకందరికీ స్ఫూర్తి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కుటుంబాన్ని చూసే నేర్చుకున్నానని చెప్పారు.జీవితంలో పని మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. గత 10 సంవత్సరాలుగా రిలయన్స్‌లో పనిచేస్తూనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇషా, నేను కవల పిల్లలం. మేము ఇద్దరూ కూడా కుటుంబ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. నా పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. శ్లోకా భార్యగా రావడం నా అదృష్టం. తను నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది.పనిగంటలుముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' పనిగంటలపై కూడా మాట్లాడారు. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐని సంప్రదించండి.. అనిల్ అంబానీకి కోర్టు ఆదేశంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు. -
మొన్న క్యాప్‌జెమిని సీఈఓ.. నేడు ఆకాష్ అంబానీ
పనిగంటలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ముకేశ్ అంబానీ తనయుడు.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ 'ఆకాష్ అంబానీ' కూడా తన అభిప్రాయం వెల్లడించారు.ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' మాట్లాడుతూ.. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు.పనిగంటలపై క్యాప్‌జెమిని సీఈఓఉన్నత స్థాయి అధికారులు పని గంటలు ఎక్కువ చేయాలని పిలుపునిస్తుండగా.. క్యాప్‌జెమిని సీఈఓ అశ్విన్ యార్డి వారానికి 47.5 గంటల పని సరిపోతుందని, వారాంతాల్లో ఉద్యోగులకు పనికి సంబంధించిన ఎటువంటి ఈమెయిల్‌లు పంపవద్దని పిలుపునిచ్చారు. రోజుకి 9:30 గంటలు, వారానికి ఐదు రోజులు (47:30 గంటలు) పని చేస్తే చాలని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరంలో వెల్లడించారు.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?అంతకు ముందు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. 90 గంటలు పనిచేయాలని ఎల్ & టీ చైర్మన్ సుబ్రమణ్యన్ చెప్పారు. దీనిని పలువురు ప్రముఖులు ఖండించారు. ఇందులో ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' మొదలైనవారు ఉన్నారు. -
పని వేళలు కాదు.. నాణ్యత ముఖ్యం..
ముంబై: ఆఫీసులో ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. ప్రతి రోజు ఎంత నాణ్యమైన పని చేశామనేదే తనకు ముఖ్యమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. తనకు పని, కుటుంబం రెండూ ప్రాధాన్యతాంశాలేనని ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు జీవితంలో తమ తమ ప్రాధాన్యతలను గుర్తెరిగి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వారానికి 90 గంటల వరకు పని చేయాలంటూ కొందరు, 50 గంటలలోపు చాలంటూ మరికొందరు కార్పొరేట్లు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆకాశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మార్గనిర్దేశం చేసేందుకు తమ కంపెనీ 1,000 మంది డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజినీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుందని అంబానీ చెప్పారు. జామ్‌నగర్‌లో 1 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) సర్విసుగా అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్‌వర్త్‌ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్‌వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్‌వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్‌వర్త్‌తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. -
‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’
ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకు, కూతురు ఉంటే తల్లిదండ్రులు కూతురికే ముందు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ ఆనవాయితి దేశీయంగా దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలనే తేడా లేకుండా దీన్ని పాటిస్తున్నారు. ఇందుకు అంబానీ కుటుంబం కూడా అతీతం కాదని నిరూపించారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కవల పిల్లలు. మొన్న అక్టోబర్ 23న వారు పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తన సోదరుడి పెళ్లికి సంబంధించి ఇషా అంబానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘అన్నయ్య ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకామెహతాతో నిర్ణయించుకున్నారు. మార్చి 24, 2018న గోవాలో ఎంగేజ్మెంట్ పూర్తయింది. మే, 2018లో ఆనంద్ పిరమాల్‌తో నాకు నిశ్చితార్థం జరిగింది. ముందుగా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి, తన వివాహం ముందే జరగాల్సి ఉంది. కానీ నా పెళ్లి కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అందుకు వదిన శ్లోకామెహతా కూడా ఎంతో సహకరించింది. నా వివాహం డిసెంబర్ 2018లో పూర్తయిన తర్వాత మార్చి 9, 2019లో అన్నయ్య-వదినల పెళ్లి జరిగింది’ అని ఇషా అంబానీ చెప్పారు.ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్పిక్ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ముంబయి ఇండియన్స్ -
ఇషా, ఆకాష్ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ. ఐవీఎఫ్ ద్వారా ఈ కవల పిల్లలకు జన్మనిచ్చారు నీతా అంబానీ. అక్టోబర్ 23న పుట్టిన ఇషా , ఆకాష్ అంబానీలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?ఇషా, ఆకాష్ అంబానీ పుట్టిన రోజు సందర్బంగా గతంలో డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాతో నీతా అంబానీ సంభాషణ ఇపుడు వైరల్‌గా మారింది. ఇందులో తన కవల పిల్లలు ఇషా, ఆకాష్ పేర్ల వెనుకున్న కథను నీతా పంచుకున్నారు.కవలల పిల్లల ప్రసవం కోసం తాను అమెరికాలో ఉన్నానని నీతా తెలిపారు. అపుడు నత భర్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తనను కలిసి ఇండియా వెళ్లేందుకు విమానం దిగారో లేదో వెంటనే అమెరికా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే... నెలలకు నిండకుండానే. ఇషా, ఆకాష్‌కు జన్మనిచ్చారట నీతా. దీనితో ముఖేష్ U.S.కి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..నీతాకు డెలివరీ అయిందన్న సంగతి తెలియగానే అంబానీతోపాటు, నీతా తల్లి, డాక్టర్ ఫిరోజా, విమానంలో అమెరికాకు బయలు దేరారు. అపుడు వారు ప్రయాణిస్తున్న విమానం పైలట్ ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించారు. అంతేకాదు తమ పిల్లలకు ఇషా, ఆకాష్ పేర్లు ఎలా పెట్టిందీ వివరించారు నీతా. పిల్లలకు పేర్ల చర్చ వచ్చినపుడు పర్వతాల మీదుగా ఆకాశంలో ఎగురుతున్నపుడు ఈ వార్త తెలిసింది కాబట్టి అమ్మాయికి ఇషా (పర్వతాల దేవత) ఆకాష్ (ఆకాశం) అని అనే పేర్లు పెడదామని చెప్పారట అంబానీ. అదీ సంగతి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పుట్టిన మూడేళ్ల తర్వాత వారి మూడో సంతానం అనంత్ అంబానీ జన్మించాడు. కాగా ప్రస్తుతం ఇషా, ఆకాష్, అనంత్ రిలయన్స్వ్యాపార సమ్రాజ్య బాధ్యతల్లో ఉన్నారు. ఆకాష్ , డైమండ్స్ వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాను పె ళ్లాడాడు వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారవేత్త ఆనంద్పిరమిల్ వివాహమాడిన ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. అనంత్ తన చిన్న నాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జూలైలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ట్విన్స్, ఐకాన్ ఇషా, ఆకాశ్ అంబానీ రేర్పిక్స్
-
‘ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి’
మొబైల్ తయారీ రంగంలో భారత్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. గతంలో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లను కలిగి ఉన్న ఇండియా ప్రస్తుతం వీటి సంఖ్యను 200కు పైగా విస్తరించిందని చెప్పారు. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో వస్తోన్న మార్పులను గమనిస్తూ ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలని ప్రధాని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత్ ఒకప్పుడు వివిధ దేశాల నుంచి మొబైళ్లను భారీగా దిగుమతి చేసుకునేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచానికి అవసరమయ్యే ఫోన్లను భారత్ ఎగుమతి చేస్తోంది. గతంలో కంటే దేశీయంగా ఆరు రెట్లు ఎక్కువ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాం. డిజిటల్ సాంకేతికతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వచ్చే ఆవిష్కరణలకు భారత్ నాయకత్వం వహించాలి. దేశంలో టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా వృద్ధి చెందుతుంది. స్థానికంగా రెండేళ్ల క్రితమే 5జీ సేవలు ప్రారంభించాం. కానీ అది ఎంతో వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా మారింది. ప్రతి భారతీయడు నెలలో దాదాపు 30 జీబీ డేటాను వినియోగిస్తున్నాడు. ఇంటర్నెట్ అవసరాలు, డిజిటల్ లావాదేవీలు పెరగడం ఇందుకు ఒక కారణంగా ఉంది. దేశీయంగా యూపీఐ, ఓఎన్డీసీ వంటి పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతోంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీని మాత్రం అందరూ మంచి కోసమే వాడుకోవాలి’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలుకార్యక్రమంలో జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ..‘ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రపంచ స్థాయికి చేరింది. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, సంస్థల మధ్య సహకారానికి వేదికగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలో డిజిటల్ సూపర్ పవర్‌గా ఇండియా ఎదుగుతోంది. రాబోయే రోజుల్లో 6జీతో మరింత మెరుగైన సేవలందించనున్నాం. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్వీకరణలో గతంలో 155వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం అతిపెద్ద డేటా మార్కెట్‌గా ఎదిగింది. గ్లోబల్‌గా మూడో అతిపెద్ద యునికార్న్ హబ్‌గా మారింది. ప్రపంచంలోనే నం.1 యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా నిలిచింది. ఈ అభివృద్ధిలో జియో భాగమైనందుకు సంతోషంగా ఉంది. భారత్ వృద్ధి చెందేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి ఏఐ కీలకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సమగ్ర ఏఐ సేవలందించే సంస్థలను ప్రోత్సాహించాలి. ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీ 2020 ముసాయిదాను అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. ఏఐ ఆధారిత మెషీన్ లెర్నింగ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న భారతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలి’ అన్నారు. -
ఇషా అంబానీ సరికొత్త రికార్డ్!.. జాబితాలో ఆకాష్ కూడా..
హురున్ ఇండియా అండర్ 35 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలను వెల్లడించింది. ఈ లిస్టులో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 150 మంది 35 ఏళ్లలోపు వయసున్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.ఓ వైపు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు అంబానీ కుమార్తె ఇషా 2024 హురున్ ఇండియా అండర్ 35 జాబితాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఈ జాబితాలో అంబానీ కుమారుడు ఆకాష్ కూడా ఉన్నారు.ముకేశ్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ 'రిలయన్స్ రిటైల్' మేనేజింగ్ డైరెక్టర్. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంహురున్ ఇండియా అండర్-35 జాబితాలో ఇతరులు2024 హురున్ ఇండియా అండర్-35 జాబితాలో అనెరి పటేల్, అనీషా తివారీ, అంజలి మర్చంట్‌తో సహా మరో ఏడుగురు మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వీరి వయసు 33, 34 మధ్య ఉంది. వీరందరూ కుటుంబ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో షేర్‌చాట్ కో ఫౌండర్ అంకుష్ సచ్‌దేవా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. మామా ఎర్త్ సీఈఓ 35 సంవత్సరాల వయస్సు గల గజల్ అలగ్ కూడా ఉన్నారు. -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అనంత్-రాధిక రిసెప్షన్ : అంబానీ మనవడి రియాక్షన్, వైరల్ వీడియో
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ చిన్న కుమారుడు రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. పెళ్లి తరువాత శుభ్ ఆశీర్వాద్ , మంగళ్ ఉత్సవ్‌లను నిర్వహించారు గత కొన్ని రోజులుగా గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏదో ఒక ముచ్చట సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్లో అంబానీ వారసుడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకాకుమారుడు పృథ్వీ అంబానీ సందడి ప్రత్యేకంగా నిలుస్తోంది. అనంత్, రాధిక పెళ్లి తరువాత అంబానీ ఫ్యామిలీ అంతా ఫోటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడి పోయాడు. కానీ వెంటనే లేచి సర్దుకున్నాడు. దీంతో తల్లి శ్లోకా కంగారుపడుతూ ముందుకొచ్చింది. ఇంతలో నానమ్మ అతడికి మైక్ అందివ్వగా జై శ్రీకృష్ణ అంటూ ముద్దుగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Wow what a landing...Chalo koi to nikla humhre jesa inki family me 😂😃😃 pic.twitter.com/pRMBdKaC1Z— Piku (@RisingPiku) July 15, 2024 -
అంబానీ పెద్ద కోడలు శ్లోకా బర్త్‌డే : ఆకాశ్ స్పెషల్ విషెస్ వైరల్
ఒకవైపు రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం అంతా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా బర్త్డేఈ రోజు. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ శ్లోకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ముందుగా అంబానీ పెద్ద కుమారుడు, శ్లోకా మెహతా భర్త ఆకాశ్ అంబానీ తన భార్యకు స్పెషల్ విషెస్ అందించారు. తరువాత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా, ఆనంద్ పిరామిల్ దంపతులతోపాటు కాబోయే వధూవరులు అనంత్, రాధిక మర్చంట్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు. ప్రసిద్ధ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్ ఎండీ కుమార్తె శ్లోకా మెహతా. 1990, జూలై 11 న పుట్టింది. 2019 మార్చిలో ఆకాశ్ అంబానీనీ పెళ్లాడింది. వీరికి పృథ్వీ , వేద ఆకాశ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాగా జూలై 12న తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లాడ బోతున్నాడు. ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అతిథి మర్యాదల ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. అంతేకాదు వీరి పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి (ఫోటోలు)
-
ఇటాలియన్ బ్రాండ్ కారులో 'ఆకాష్ అంబానీ' - వీడియో
ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గతంలో చాలాసార్లు ఖరీదైన అన్యదేశ్య కార్లలో కనిపించారు. తాజాగా మరోసారి ఆకాష్ అంబానీ రూ. 10.5 కోట్ల కారును డ్రైవ్ చేస్తూ అగుపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆకాష్ అంబానీ ఇటీవల ముంబైలో ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue) కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఓ వీడియోలు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జియో గ్యారేజ్‌లో ఓ ఫెరారీ పురోసాంగ్యూ కారు ఉంది. కాగా ఇది రెండో ఫెరారీ పురోసాంగ్యూ అని తెలుస్తోంది. ఎరుపురంగులో చూడచక్కగా ఉన్న ఈ ఖరీదైన కారును ఆకాష్ అంబానీ స్వయంగా డ్రైవ్ చేయడం వీడియోలో చూడవచ్చు.ఆకాష్ అంబానీ డ్రైవ్ చేస్తూ కనిపించిన ఫెరారీ పురోసాంగ్యూ 4 డోర్స్ వెర్షన్. ఇది పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. ఈ కారు 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్‌లో ఫస్ట్ బర్త్‌డే
రిలయన్స్ అధినేత ముఖేశ్అంబానీ తన మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకలను ఏకంగా క్రూయిజ్ షిప్లో జరుపుకునేలా ప్లాన్ చేశారు. ముఖ్‌శ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకామెహతాల కూతురు వేదాఆకాశ్అంబానీ బర్త్‌డే వేడుకలను 900 మంది సెలబ్రిటీలతో కలిసి సముద్రంలో జరుపుకుంటున్నారు.అపరకుబేరుడు ముఖేశ్అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. మే 29న మొదలైన ఈవేడుక జూన్1న ముగియనుంది. అయితే మే31న అనంత్ అన్నయ్య-వదినల కూతురు వేదా మొదటి పుట్టినరోజు. దాంతో పెళ్లి వేడుకల్లోనే ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అనంత్-రాధిక జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌ను అంగరంగవైభవంగా జరుపుకున్నారు.ఇదీ చదవండి: ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులుఆకాశ్-శ్లోకా మెహతాలకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పృథ్వీ, కూతురు వేదా. పృథ్వీ డిసెంబర్ 2020లో జన్మించాడు. వేదా మే 31, 2023లో పుట్టింది. -
లక్షల కోట్లు ఉంటేనేం!.. 2 పాయింట్లు.. చిన్నపిల్లల్లా అంబానీల సంబరాలు
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో తొలి గెలుపు కోసం ఎంతగానో తపించి పోయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేయడంతో అటు పాండ్యాతో పాటు.. ఇటు మేనేజ్‌మెంట్‌పైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై వేటు వేసినందుకు తగిన శాస్తే జరిగిందంటూ సొంత అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వారి కోపాన్ని చల్లారుస్తూ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో మొదటి గెలుపు అందుకుంది. సొంత మైదానం వాంఖడేలో భారీ స్కోరు నమోదు చేయడమే కాకుండా ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 29 పరుగుల తేడాతో చిత్తు చేసి పాయింట్ల ఖాతా తెరిచింది. దీంతో ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మనకి రెండు పాయింట్లు వచ్చాయి అన్నట్లుగా కొడుకు ఆకాశ్‌తో కలిసి నీతా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు ఈ విజయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసింది. అటు హార్దిక్ పాండ్యా సైతం అనేక అవమానాల అనంతరం గెలుపు దక్కడంతో తొలిసారిగా మనస్ఫూర్తిగా నవ్వినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ హైలైట్‌గా నిలిచారు. చిన్నపిల్లలా తన సంతోషాన్ని పంచుకుంటూ ఆమె చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘‘వేల కోట్లు ఉంటేనేం.. నీతా మేడమ్‌కు ఇప్పుడు కలిగిన ఆనందం మాత్రం వెలకట్టలేనిది’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఇక తాజా పరాజయంతో నాలుగో ఓటమి నమోదు చేసిన ఢిల్లీ పదోస్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్లు: ►వేదిక: వాంఖడే, ముంబై ►టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్ ►ముంబై స్కోరు: 234/5 (20) ►ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 205/8 (20) ►ఫలితం: 29 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రొమారియో షెఫర్డ్(ముంబై- 10 బంతుల్లో 30 రన్స్- నాటౌట్) ►ఓవరాల్ టాప్ స్కోరర్: ట్రిస్టన్ స్టబ్స్(ఢిల్లీ- 25 బంతుల్లోనే 71 రన్స్- నాటౌట్). చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That feeling of your first win of the season 😀 A blockbuster batting and a collective bowling performance help Mumbai Indians get off the mark in #TATAIPL 2024 on a special day at home 🙌 Scorecard ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/5UfqRnNxj4 — IndianPremierLeague (@IPL) April 7, 2024 -
మాది ఫెవిక్విక్ బంధం..వారికి ‘నేను హనుమంతుడి లెక్క’
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలు మార్చి 1 నుంచి మార్చి 3 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ శుభ సందర్భంలో ముందస్తు పెళ్లి వేడుకకు ముందు అనంత్ అంబానీ తన తోబుట్టువులు ఆకాష్, ఇషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ముగ్గురి మధ్య పోటీ లేదని, తన తోబుట్టువులు తనకు సలహాదారులలాంటి వారని మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా మధ్య ఎలాంటి పోటీ లేదు. వారు నా సలహాదారుల లాంటి వారు. నేను వారి సలహాలను నా జీవితాంతం పాటించాలనుకుంటున్నాను. వారికి నేను హనుమంతుడి లెక్క. నా అన్న నా రాముడు. నా చెల్లెలు ఈశా నాకు తల్లితో సమానం. వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు. పోటీలు లేవు. మేము కలిసిపోయాం. మాది ఫెవిక్విక్ బంధం’ అంటూ నవ్వేశారు. తన తండ్రి ముఖేష్ అంబానీతో తనకున్న అనుబంధం గురించి అనంత్ మాట్లాడుతూ.. తన తండ్రి మార్గదర్శకత్వం లేనిది ఏదీ సాధించలేనని అన్నారు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవన్నీ నిర్మించగలుగుతున్నాను’ అని అన్నారు. -
వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉంటూ.. జీవితం గడుపుతున్న వీరు ఎప్పుడూ ఏదో ఒక వార్తలో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఒక సందర్భంగా 'ముఖేష్ అంబానీ' తన కొడుకు 'ఆకాశ్ అంబానీ' మీద కోప్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆకాశ్ అంబానీ ఒక సారి వాచ్‌మెన్‌తో కొంత గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాశ్‌ను మందలించి వాచ్‌మెన్‌కు సారీ చెప్పమని చెప్పారని, తండ్రి చెప్పినట్లే ఆకాశ్ వాచ్‌మెన్‌కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించింది. ఎప్పడూ సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ.. ఆకాశ్ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లు నీతా అంబానీ చెప్పింది. పిల్లలను సక్రంగా పెంచే క్రమంలో గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. ఇదీ చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు! వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందటానికి, సక్సెస్ మార్గంలో నడవడం వెనుక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో ముకేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు. -
జియో భారత్ జీపీటీ రెడీ.. కీలక విషయాలు చెప్పిన ఆకాశ్ అంబానీ
ముంబై: దేశీయంగా ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌ను రూపొందించడంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబేతో (ఐఐటీ–బీ) జట్టు కట్టింది. ఐఐటీ–బీ వార్షిక టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ) వంటి సాంకేతికతలను పైపైనే చూస్తున్నామని, వచ్చే దశాబ్దంలో ఇవి విస్తృతంగా వినియోగంలోకి వస్తాయని ఆకాశ్ చెప్పారు. ఉత్పత్తులు, సర్వీసులను ఏఐ సమూలంగా మార్చేయగలదని ఆయన వివరించారు. సోదరుడు అనంత్ అంబానీ వివాహం జరగనుండటంతో వచ్చే ఏడాది (2024) తమ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండగలదని ఆకాశ్ పేర్కొన్నారు. -
హార్దిక్ పాండ్యా వచ్చేశాడు: నీతా అంబానీ రియాక్షన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సోమవారం అధికారికంగా గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. పాండ్యా ఆగమనంపై ముఖ్యంగా నీతా అంబానీ తెగ మురిసిపోతున్నారు. అందుకే ప్రత్యేకంగా స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంబరాల్లో ముంబై ఇండియన్స్ హార్దిక్ తిరిగి ఇంటికి రావడం చాలా సంతోషం. ముంబై ఇండియన్స్ కుటుంబంతో హృదయ పూర్వక పునఃకలయిక! ముంబై ఇండియన్స్‌లో యువ స్కౌటెడ్ టాలెంట్ హార్ధిక్ ఇపుడు టీమ్ ఇండియా స్టార్‌గా చాలా ఎదిగిపోయాడు. ఇక ముంబై ఇండియన్స్ భవిష్యత్తును ఎంత ఎత్తుకు తీసుకెడతాడో అని ఎదురు చూస్తున్నాం అంటూ నీతా అంబానీ ప్రకటించారు. కీలక సమయాల్లో హార్దిక్ మంత్ర కావాలని నీతా కోరుకున్నారు. అందుకే అతణ్ణి తిరిగి పొందారంటున్నారు క్రికెట్ పండితులు. అటు హార్దిక్ తిరిగి రావడం గురించి ముంబై ఇండియన్స్ సహ యజమాని ఆకాష్ అంబానీ తన ఆనందాన్ని ప్రకటించారు. ఇది హ్యపీ హోం కమింగ్. ఏ జట్టుకైనా అతడు గొప్ప సమతూకంగా ఆడతాడు. అంతకుముందు MI కుటుంబంలో విజయం సాధించాడు. ఇపుడిక రెండోసారి కూడా విజయమే అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్‌కు సంబంధించి ఈ సీజన్ వరకు గుజరాత్ టైటన్స్ (Gujarat Titans, GT)కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఇపుడు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సరసన జట్టుతో చేరాడు. వచ్చే ఏడాదిలో జరిగే మెగా టోర్నమెంట్ ఐపీఎల్ 2024లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి. This brings back so many wonderful memories. Mumbai. Wankhede. Paltan. Feels good to be back. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/o4zTC5EPAC — hardik pandya (@hardikpandya7) November 27, 2023 విక్రమ్ సోలంకి ఏమన్నారంటే.. గుజరాత్ టైటాన్స్ తొలి కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీకి రెండుఅద్భుతమైన సీజన్‌లుఅందించడంలో కీలక పాత్ర పోషించాడంటూ గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి పాండ్యాను ప్రశంసించారు. కానీ ఇప్పుడు అసలు జట్టు ముంబై ఇండియన్స్‌కి తిరిగి వెళ్లాలనే తన నిర్ణయాన్ని గౌరవిస్తామని, భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నా మన్నారు కాగా అడుగు పెట్టిన తొలి సీజన్లోనే ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుని ఛాంపియన్‌గా నిలిచింది గుజరాత్ టైటాన్స్. ఆ ఈ ఏడాది లాస్ట్ బాల్ వరకూ ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో రన్నరప్‌గా నిలిచింది జీటీ. అలా వరుసగా రెండు సీజన్స్‌లోనూ గొప్ప ప్రతిభ కనబర్చి గుజరాత్ టైటాన్స్ జట్టును మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ నిలపగలిగాడీ ఆల్ రౌండర్ హార్ధిక్ ప్యాండ్యా అనడంలో ఎలాంటి సందేహంలేదు. -
రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్
ఆయిల్ నుంచి టెలికామ్ వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఈ సంస్థలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు కూడా ఒక్కో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ ముగ్గురూ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన వారసత్వ ప్రణాళికను ఈ రోజు అధికారికం చేసింది. కంపెనీ బోర్డులో ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారులు ఆమోదించారు. కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగటానికి షేర్ హోల్డర్ల నుంచి అంబానీ పిల్లలు ముగ్గురూ (ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ) వరుసగా 98.21 శాతం, 98.06 శాతం, 92.75 శాతం ఆమోదం పొందారు. ఇదీ చదవండి: ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే.. ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లపాటు నిర్వహించనున్నారు. నీతా అంబానీ పదవీ విరమణ తరువాత కూడా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. దీనికి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లబించింది. -
దేశంలో మొదటి స్పేస్‌ఫైబర్ ఇంటర్నెట్ను ప్రారంభించిన జియో
న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023’ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్పేస్ఫైబర్ను ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి శాటిలైట్ గిగాఫైబర్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా ఇంటర్నెట్ అందే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించే అవకాశాన్ని జియో కల్పించిందన్నారు. జియో స్పేస్ఫైబర్తో ఇంకా కొన్ని ఇంటర్నెట్ అందని ప్రాంతాలకు సేవలందించే వెసులుబాటు ఉంటుదన్నారు. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా గిగాబిట్ యాక్సెస్‌తో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఇప్పటికే భారత్‌లో 45 కోట్ల కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ వంటి సర్వీసుల సరసన జియోస్పేస్‌ఫైబర్‌ను చేర్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని కంపెనీ తెలిపింది. ప్రపంచంలో శాటిలైట్ టెక్నాలజీ(మీడియం ఎర్త్ ఆర్బిట్-ఎంఈఓ) కోసం జియో ఎస్ఈఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది. జియోస్పేస్‌ఫైబర్ ఇప్పటికే గుజరాత్ గిర్, ఛత్తీస్‌గఢ్ కోర్బా, ఒడిశా నవరంగాపూర్, అసోం ఓఎన్జీసీ జోర్హట్ వంటి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తుంది. -
85 శాతం 5జీ నెట్వర్క్ మాదే: ఆకాశ్ అంబానీ
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ సర్వీసులకు సంబంధించి 85 శాతం నెట్‌వర్క్‌ను తామే నెలకొల్పామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఊక్లా విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తొలుత చెప్పిన 2023 డిసెంబర్ గడువుకన్నా ముందుగానే దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించగలిగామని అంబానీ తెలిపారు. "నిబద్ధతతో కూడిన ట్రూ 5జీ రోల్‌అవుట్‌లో మా వేగం గురించి నేను ప్రత్యేకంగా గర్విస్తున్నాను. మేము వాగ్దానం చేసిన 2023 డిసెంబరు కాలపరిమితి కంటే ముందే దేశమంతటా బలమైన ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో కవర్ చేశాం. భారతదేశంలో మొత్తం 5జీ నెట్‌వర్క్‌లో 85 శాతం జియో నెలకొల్పినదే. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌ని ఏర్పాటు చేస్తున్నాం" అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. టెలికం శాఖ గణాంకాల ప్రకారం దేశీయంగా 3.38 లక్షల పైచిలుకు 5జీ నెట్వర్క్ బేస్ స్టేషన్లు ఉన్నాయి. ఊక్లా ప్రకారం.. మొత్తం తొమ్మిది స్పీడ్‌టెస్ట్ విభాగాల్లోనూ అవార్డులను దక్కించుకుని భారత్‌లో జియో నంబర్ వన్ నెట్‌వర్క్‌గా నిల్చింది. -
జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా జియో ఎయిర్‌ఫైబర్ సర్విసులను ఆవిష్కరించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు మంగళవారం ప్రకటించింది. వైర్లెస్ విధానంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్విసులను పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ ధరలు స్పీడ్‌ను బట్టి రూ. 599 నుంచి ప్రారంభమవుతాయి. వినాయక చవితి కల్లా వీటి సేవలను ప్రవేశపెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ఇప్పటికే ఫైబర్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సర్విసులను అందిస్తోంది. ఇది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వైర్‌లైన్ మాధ్యమం ద్వారా ఇంటర్నెట్ను అందిస్తుండగా.. ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ తరహాలో నెట్‌ను పొందడానికి ఉపయోగపడుతుంది. ‘మా ఫైబర్–టు–ది–హోమ్–సర్వీస్ జియోఫైబర్ ఇప్పటికే 1 కోటి మిందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రతి నెల వేల కనెక్షన్లు కొత్తగా జతవుతున్నాయి. ఇంకా అసంఖ్యాక గృహాలు, చిన్న వ్యాపారాలకు వేగవంతమైన ఇంటర్నెట్ను అందించాల్సి ఉంది. జియో ఎయిర్‌ఫైబర్ ఇందుకు తోడ్పడనుంది. విద్య, ఆరోగ్యం, స్మార్ట్‌హోమ్ వంటి సొల్యూషన్స్‌తో ఇది కోట్ల గృహాలకు ప్రపంచ స్థాయి డిజిటల్ వినోదం, స్మార్ట్‌హోమ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించగలదు‘ అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియోకు 15 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల వైర్‌లైన్ వేయడంలో ప్రతిబంధకాల కారణంగా పూర్తి స్థాయిలో విస్తరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జియోఎయిర్‌ఫైబర్ ఆ సవాళ్లను అధిగమించి, యూజర్లకు ఇంటర్నెట్ను చేరువ చేయడానికి ఉపయోగపడనుంది. జియోఫైబర్ ప్లాన్లు, ఎటువంటి మార్పు లేకుండా స్పీడ్‌ను బట్టి రూ. 399 నుంచి రూ. 3,999 వరకు రేటుతో యథాప్రకారం కొనసాగుతాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. ప్రత్యేకతలివీ.. ♦ ఎయిర్‌ఫైబర్ కేటగిరీలో అపరిమిత డేటాతో, స్పీడ్ 30 నుంచి 100 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. నెలవారీ ప్లాన్ల ధరలు రూ. 599 నుంచి రూ. 1,199 వరకు ఉంటాయి. ప్లాన్‌ను బట్టి 550 పైగా డిజిటల్ టీవీ చానళ్లు, 14 పైచిలుకు యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. ♦ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ కేటగిరీలో డేటా స్పీడ్ 300 నుంచి 1000 ఎంబీపీఎస్ వరకు (అపరిమితం) ఉంటుంది. ధర రూ. 1,499 నుంచి రూ. 3,999 వరకు ఉంటుంది. 550 పైగా డిజిటల్ టీవీ చానళ్లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర 14 పైగా ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. ♦ అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఫై రూటర్, 4కే స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్ లభిస్తాయి. -
వినాయక చవితికి జియో ఎయిర్‌ఫైబర్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి వారసుల ఎంట్రీ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పిల్లలు చేతికొచ్చిన వేళ.. ముఖేష్ అంబానీ మరో సంచలన నిర్ణయం!
రిలయన్స్ 46 వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బోర్డుకి నీత అంబానీ రాజీనామా చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాధ్యతల్ని అంబానీ వారసులు చేపట్టనున్నారు. ముఖేష్ అంబానీ వారసులు ఈశా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్‌లో నాన్ - ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లుగా నియమించారు. ఏజీఎం సమావేశానికి ముందు జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ముకేష్ తెలిపారు. వీరి నియామకాన్ని షేర్ హోల్డర్లు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆర్ఐఎల్ బోర్డుకి ముఖేష్ అంబానీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నీతా అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు రాజీనామా చేసినప్పటికీ, ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారని, తద్వారా కంపెనీ వృద్దికి సహాయసహకారాలుంటాయని తెలిపారు. రాజీనామా ఎందుకు చేశారంటే? రిలయన్స్ ఫౌండేషన్‌కు మార్గనిర్దేశం చేయడానికి, దేశ సేవ కోసం తమ సమయాన్ని వెచ్చించాలనే ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు నుండి నీతా అంబానీ రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు రిలయన్స్ పేర్కొంది. పిల్లలు చేతికొచ్చిన వేళ ముఖేష్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలు చేతికి వచ్చిన వేళ ఆస్తుల పంపకం మొదలు పెట్టారు. న్యూ ఎనర్జీని చిన్న కుమారుడు అనంత్ అంబానీకి , టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్నిపెద్ద కుమారుడు ఆకాష్‌కు, కవల సోదరి ఇషా అంబానీ రిటైల్ వ్యాపారం అప్పజెప్పారు. శామ్ వాల్టన్ బాటలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్ అంబానీ.. ఒక దుకాణంతో ప్రారంభించి ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్‌గా ఎదిగిన శామ్ వాల్టన్ ఫాలో అవుతున్నారు. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారని బ్లూంబర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. -
జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్‌ను లాంచ్ చేసింది. జియో 2 జీ ముక్త్ భారత్ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్‌తో పాటు కొత్త రూ. 123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఇన్-క్లాస్ జియో 4జీ నెట్వర్క్ తొలి 10 లక్షల జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని, కొత్త జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో అడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ప్రతీ భారతీయుడికి, ఇంటర్నెట్, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని నిరూపించాం. ఇకపై టెక్కాలజీ కొంతమంది ప్రత్యేక హక్కుగా మిగలబోదు అని ఆకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 1.77-అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో JioCinema, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత సంగీత యాప్ JioSaavn, JioPayని కలిగి ఉంది. -
మరోమారు తాతయిన ముకేష్ అంబానీ.. పేరుతోనే వైరల్ అయినా వారసురాలు
-
ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. గత వారం (మే 31న) ఆకాష్-శ్లోక దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. 2020 డిసెంబరులో ఈ దంపతులకు తొలి సంతానంగా పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. అయితే పాపాయి పేరుపై అభిమానులు చాలా ఊహాగానాలే చేశారు. వీటన్నింటికీ చెక్‌పెడుతూ ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ తమ బిడ్డ లిటిల్ ప్రిన్సెస్ పేరు ‘వేద ఆకాష్ అంబానీ’ గా వెల్లడించారు. (మనవరాలి కోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. "శ్రీకృష్ణ భగవానుడి దయ, ధీరూభాయ్ అండ్ కోకిలాబెన్ అంబానీల ఆశీర్వాదంతో, పృథ్వీ తన చిన్న చెల్లెలు వేద ఆకాష్ అంబానీగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రకటించారు. ‘వేద’ అంటే ఏమిటి? వేద పేరుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది, జ్ఞానం, జీవితంపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ఇది సూచిస్తుందట. వేద అనేది 'జ్ఞానం' ‘తెలివి తేటలను’ సూచించే సంస్కృత మూలాలున్నదని జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట. అంతేకాదు గొప్ప సక్సెస్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి తన తల్లి, తాత ముఖేశ్ అంబానీలకు గొప్ప పేరు తెస్తుందని చెబుతున్నారు. కాగా ఆయిల్-టు-టెలికాం-టు-రిటైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు . వీరిలో కవలలు ఆకాష్ . ఇషా కాగా చిన్న కుమారుడు అనంత్. రిటైల్ వెంచర్ బాధ్యతలు చూస్తున్న ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. ఆకాష్ రిలయన్స్ జియోకు సారధ్యం వహిస్తున్నాడు. ఇక న్యూ ఎనర్జీ వింగ్ హెడ్‌గా ఉన్న అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాధికా మర్చంట్‌తో ఇప్పటికే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) -
రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ నెక్లెస్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రూ. 451 కోట్ల డైమండ్ నెక్లెస్ ఇక మార్కెట్లో కనిపించదట. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? శ్లోకా మెహతాకు ముఖేశ్, నీతా అంబానీలు బహుమతిగా ఇచ్చిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్‌గా నిలిచినసంగతి తెలిసిందే. ‘మౌవాద్ ఎల్' సాటిలేని 91-డైమండ్ నెక్లెస్' ను వివాహ వేడుకలో శ్లోకా మెహతాకి ఈ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆకాశ్ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. 91 వజ్రాలతో, ముఖ్యంగా ఇంటర్నల్‌గా ఎలాంటి దోషం లేని వజ్రాన్ని పొదిగిన దీని విలువ 451 కోట్ల రూపాయలు. ఈ ప్రత్యేకమైన డైమండ్ నెక్లెస్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) తాజా నివేదికల ప్రకారం డిజైన్ మార్పుకారణంగా ఈ ఖరీదైన డైమండ్ నెక్లెస్ సెట్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదు. ఈ డైమండ్స్ పసుపు రంగును పెంచడానికి, మరింత బ్రైట్‌గా చేయడంతో డిజైన్‌లో కూడా మర్పులు చేసి రీకట్ చేశారట. ఫలితంగా దాదాపు 200 క్యారెట్ల విలువైన ఈ నెక్లెస్ బరువు 100 క్యారెట్లకు పైగా తగ్గింది. 2022లో సథెబీలో 'మౌవాద్ ఎల్ ఇన్‌కంపారబుల్ 91 డైమండ్ నెక్లెస్'ను ప్రదర్శించారు. కాగా శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆకాశ్- శ్లోక దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి ఉన్నాడు. Behold the most expensive necklace ever created ― The L'Incomparable Diamond Necklace, only made possible by Mouawad. #Mouawad #MouawadDiamondHouse #RareJewels #Diamond #GuinnessWorldRecordhttps://t.co/0dlypdX1MH pic.twitter.com/Zf28a5CWa1 — Mouawad (@mouawad) August 2, 2018 -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. జియో సినిమాలో ఫ్రీగా భారత్-విండీస్ సిరీస్
క్రికెట్ ప్రేమికులకు జియో సినిమా (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్) శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2023 సీజన్ తరహాలోనే త్వరలో ప్రారంభంకానున్న భారత్-వెస్టిండీస్ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12-ఆగస్ట్ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధినేత ఆకాశ్ అంబానీ వెల్లడించారు. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
అంబానీ పిల్లలు ఏం చదువుకున్నారు ..? వాళ్ళ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
ఆకాష్ అంబానీ ముద్దుల తనయ ఫస్ట్ పిక్ - వీడియో వైరల్
ఇటీవల అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో సంబరాలు అమరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా హాస్పిటల్‌కి వెళ్లి దంపతులను అభినందించారు. అంతే కాకుండా ఆ బిడ్డను ఇంటికి తీసుకెళుతున్నప్పుడు నీతా అంబానీ ఎంతగానో ఉప్పొంగిపోయింది. శ్లోకా మెహతా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బిడ్డతో కలిసి భర్త ఆకాష్ అంబానీ, నీతా అంబానీ, ముఖేష్ అంబానీతో కలిసి ఇంటికి ఖరీదైన లగ్జరీ కారులో బయలుదేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆకాష్ అంబానీ ముద్దుల తనయని కూడా చూడవచ్చు. బేబీ పింక్ క్యాప్‌లో పాప ముద్దుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారసురాలితో బయలుదేరిన కుటుంబం చాలా ఆనందంగా ఉంటడం ఇక్కడ గమనించవచ్చు. యువరాణి స్వాగతం పలకడానికి అప్పటికే ఇంటిని చాలా అందంగా అలంకరించారు. ఇప్పటికే ఆకాష్ అంబానీ & శ్లోకా మెహతా దంపతులకు పృథ్వీ అనే రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కాగా ప్రస్తుతానికి రెండవ బిడ్డ పేరుని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: ముద్దుల మనవరాలి కోసం కొండమీద కోతినైనా తీసుకురాగల సామర్థ్యం ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సొంతం. అందుకే ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్‌ను ఇంటికి తీసుకెళ్లందుకు భారీ కాన్వాయ్‌నే ఏర్పాటు చేయారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్‌తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిజినెస్ వర్గాల్లోనూ విశేషంగా నిలుస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్‌తో ఇంటికి చేరింది. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి సూపర్ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్ ముంబై వీధుల్లో సందడి చేసింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే పృథ్వి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అంబానీ కుటుంబంలోని ఈ పాపాయి రావడంతో ముఖేశ్, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె ఇషా, ఆనంద్ పిరామల్ దంపతులకు ట్విన్స్ కృష్ణ ,ఆదియా ఉన్నారు. -
రిచ్ కిడ్స్: అంబానీ కొడుకులు, కూతురు ఏం పని చేస్తారు.. ఎంత సంపాదిస్తారు?
దేశంలోనే కాదు.. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం.. ముఖేష్ అంబానీ కుటుంబం. ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఉత్సాహంగా పనిచేస్తూ కుటుంబానికి విజయవంతంగా నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారి పిల్లలు అంటే ఇద్దరు కొడుకులు, కూతురు ఏం పని చేస్తున్నారు.. వ్యక్తిగతంగా ఎంత సంపాదిస్తున్నారన్నది ఆసక్తికరం. రిలయన్స్ గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి తన పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ఉన్నత చదువులు చదివారు. వారి తండ్రి, తాతలను అనుసరించి వ్యాపారంలో నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. వారు రిలయన్స్ గ్రూప్‌లో ముఖ్యమైన విభాగాలను చూసుకుంటున్నారు. ఆకాష్ అంబానీ ఆకాష్ అంబానీ యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్‌లోని ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. వ్యాపారం విషయానికి వస్తే తన తండ్రిని అనుసరించారు. ఆకాష్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో టెలికాం సేవలు, జియో సినిమా ఉన్నాయి. ఆకాష్ అంబానీ జీతం ఎంత అనేది వెల్లడించనప్పటికీ, ఆయన నెలవారీ జీతం దాదాపు రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా. ఇషా అంబానీ సోదరుడు ఆకాష్ అంబానిలాగే ఇషా అంబానీ కూడా వ్యాపారంలో మెలకువలు సాధించింది. ఆమె శిక్షణ పొందిన బిజినెస్ అనలిస్ట్ అలాగే సలహాదారు. యూఎస్‌లోని అగ్రశ్రేణి సంస్థలో కొంతకాలం పనిచేసిన తరువాత ఇషా అంబానీ తన తండ్రి వ్యాపారంలో చేరారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డివిడెండ్ లాభాలతో కలిపి ఇషా అంబానీ నెలవారీ జీతం రూ.35 లక్షలు ఉంటుందని అంచనా. అనంత్ అంబానీ ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు, ఆఖరి సంతానం అయిన అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఎనర్జీ వింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు మెంబర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అంచనాల ప్రకారం.. అనంత్ అంబానీ నెలవారీ జీతం రూ. 35 లక్షలు. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
అంబానీ ఇంట కొత్త వారసురాలొచ్చింది!
-
అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత, ఆసియా బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఇంటికి ఆడబిడ్డ రూపంలో లక్ష్మీదేవి తరలి వచ్చింది. ముఖేశ్, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు సోమవారం(మే 31న) కుమార్తె పుట్టింది.దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అంబానీ కుటుంబం దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బుజ్జి పాపాయికి ఏం పేరు పెడతారనే చర్చ కూడా ఊపందుకుంది. (వారసురాలొచ్చేసింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆకాష్ అంబానీ దంపతులు) ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల మనవరాలు అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కమెంట్ చేస్తున్నారు. మే 31న మిథున రాశి (జెమిని) పాపాయి పుట్టిందని, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,‘కే’ అనే అక్షరం ఉత్తమమైందని భావిస్తున్నారు. అంతేకాదు కష్వి, కైరా, కియానా, కుహూ, కనికా , క్రిష్టి లాంటి పేర్లయితే బావుంటాయంటూ కమెంట్ చేశారు. కాగా 2019, మార్చిలో పెళ్లి చేసుకున్న శ్లోకా మెహతా-ఆకాష్ అంబానీ జంటకు ఇప్పటికే పృథ్వీ అనే కుమారుడు ఉన్నాడు. డిసెంబర్ 2020లో పృథ్వీకి జన్మనిచ్చిన శ్లోకా గత ఏప్రిల్‌లో జరిగిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించినన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? -
వారసురాలొచ్చేసింది.. అంబానీ ఇంట మళ్ళీ ఆనందాల వెల్లువ..!!
భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఇంటికి వారసురాలు వచ్చేసింది. ముకేశ్ పెద్ద కొడుకు 'అకాశ్ అంబానీ & శ్లోక మెహతా' దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా బుధవారం హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనించింది. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు. కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన 'పరిమల్ నథ్వానీ' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆకాష్, శ్లోక అంబానీల ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ అమూల్యమైన క్షణాలు జీవితంలో అపారమైన ప్రేమను తెస్తాయని ట్వీట్ చేశారు. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) 2023 ఏప్రిల్ నెలలో ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో కనిపించిన శ్లోక మెహతా మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది. (ఇదీ చదవండి: మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?) Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi — Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023 ఇదిలా ఉండగా గత సంవత్సరం ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రసవించిన ఈమె ఇండియాకు కవలలతో రావడంతో అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి వేదపండితులు రప్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అంతే కాకుండా ఇంటికి కవలలు వచ్చిన సంతోషంతో సుమారు 300 కేజీల బంగారం దానం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఐదు అనాధ శరణాలయాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
మనవడితో ముఖేష్ అంబానీ మురిపెం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు, వీడియో!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. కొడుకు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోక మెహతా, మనవడు పృథ్వీతో కలిసి సిద్ధి వినాయకున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనవడు పృథ్వీని ముఖేష్ అంబానీ ఎత్తుకుని కనిపించారు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు, ఆలయంలో ఉన్నంత సేపు ఆయన తన మనవడిని ఎత్తుకునే ఉన్నారు. వారి వెంట పృథ్వీ తల్లి, ప్రస్తుతం గర్భిణిగా ఉన్న శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ కుటుంబం గత వారం కూడా సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించింది. అప్పుడు కూడా ముఖేష్ అంబానీ మనవడిని ఇలాగే ఎత్తుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
కంగ్రాట్స్ రాయుడు! ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్! థాంక్యూ ఆకాశ్!
IPL 2023- Ambati Rayudu: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గత కొన్నేళ్లుగా సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. బుధవారం నాటి మ్యాచ్‌తో ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కేతో పాటు ముంబై ఇండియన్స్ కూడా అంబటి రాయుడు అరుదైన ఘనతను గుర్తిస్తూ ట్రిబ్యూట్ ఇచ్చింది. మూడు ట్రోఫీలు కాగా గతంలో ముంబై ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించిన రాయుడు ఆ జట్టు తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ట్రోఫీలు గెలిచిన మూడు సందర్బాల్లో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ రాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్ ఇందుకు సంబంధించిన వీడియోను ఎంఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘హాయ్ అంబటి.. ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ముంబై ఇండియన్స్ విజయాల్లో నీకూ భాగం ఉంది. ముంబై తరఫున నువ్వు ఆడిన ఇన్నింగ్స్‌లో రెండు నా ఫేవరెట్. ఒకటి.. రాజస్తాన్ రాయల్స్ మీద 10 బంతుల్లో 30 పరుగులు చేశావు. 2014 నాటి ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన అత్యుత్తమ మ్యాచ్‌లలో అదీ ఒకటి అని కచ్చితంగా చెప్పగలను. ఇక రెండోది.. బెంగళూరులో మ్యాచ్‌లో నువ్వూ, పొలార్డ్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ ఇన్నింగ్స్ కూడా నాకిష్టం. ముంబై ట్రోఫీలు గెలిచిన ప్రతీ సందర్భంలో నీ వంతు పాత్ర పోషించావు. కెరీర్లో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నీకు మరోసారి శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి’’ అని ఆకాశ్ అంబానీ.. అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. థాంక్యూ ఆకాశ్ ఇక ముంబై ఇండియన్స్ తనపై కురిపించిన ప్రేమకు బదులిస్తూ.. ‘‘నాపై నమ్మకం ఉంచి 2010 నుంచి నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించారు. ముంబైతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రోఫీ గెలిచిన సందర్భాలు ఎల్లప్పుడూ నా మదిలో మెదులుతూ ఉంటాయి. థాంక్యూ సో మచ్ ఆకాశ్. ఎంఐ పల్టన్’’ అంటూ అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో అంబటి రాయుడు 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఎదుర్కొన్న రాయుడు 23 పరుగులు సాధించాడు. ఇక చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఢిల్లీపై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. చదవండి: Virat Kohli-SKY: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. ఆ తర్వాత; వీడియో వైరల్ Thank you so much Akash and mi paltan..it really means a lot and have immense gratitude for giving me an opportunity and believing in me from 2010..I have such great memories with mi and I have cherished each and every trophy win that I have been a part of… 😊😊😊🙏🙏 https://t.co/BLuAEn8A5p — ATR (@RayuduAmbati) May 10, 2023 ATR going double the Ton Distance!🔥#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HbwBr8vRM4 — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంబానీనా మజాకా...కార్ రేటు తెలిస్తే కళ్ళు తిరుగుతాయి
-
ఖరీదైన ఫెరారీ కారుతో ఆకాశ్ అంబానీ చక్కర్లు: దీని ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, వ్యాపారవేత్త ఆకాశ్ అంబానీ ఖరీదైన కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.. లగ్జరీ కార్లంటే ఇష్టపడే ఆకాశ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లతో పాటు వరల్డ్‌లోనే లావిష్ కార్లున్నాయి. ఖరీదైన, స్పోర్ట్స్ కార్లను డ్రైవ్ చేస్తూ తరచుగా ముంబై మహానగరంలో దర్శనమిస్తూ ఉంటాడు ఆకాశ్. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!) స్వతహాగా ఖరీదైన కార్ల ప్రేమికుడైన ఆకాశ్‌కు ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడమే కాదు ముంబై వీధుల్లో డ్రైవింగ్ థ్రిల్ అనుభవించడం కూడా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఎరుపు రంగు ఫెరారీ కారులో హల్చల్ చేయడంలో ఫ్యాన్స్ దృష్టిలో పడింది. ఆకాష్ అంబానీ తన డ్రైవింగ్ నైపుణ్యంతో ఫెరారీ SF90ని పరుగులు పెట్టించడం విశేషం. ఇన్‌స్టాలో ఆకాశ్ అంబానీ ఫ్యాన్ పేజీ రెడ్ ఫెరారీ SF90ని నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. ఫ్రంట్ సీట్ లో కూర్చుని వైట్ కలర్ టీ షర్ట్ లో దర్జాగా కనిపించాడు. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఫెరారీ SF90 ధర రూ. 7.50 కోట్లు. నివేదికల ప్రకారం 'ప్రాన్సింగ్ హార్స్' లోగో ఉన్న ఈ కారును భారతదేశంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ కారు ఉంది. 7.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈకారుకు ఇది కారుకు 26 km (16 mi) రేంజ్‌ను అందిస్తుంది. ఇటీవల ఎల్లో కలర్ మెక్లారెన్ కారులో ఆకాశ్ అంబానీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ కారు ధర సుమారు రూ. 3.30 - 4.85 కోట్లు. మెక్లారెన్ కారులో ఫోల్డబుల్ డ్రైవర్ డిస్ప్లే, స్టాటిక్ అడాప్టివ్ హెడ్లైట్లు, వేరియబుల్ డ్రిఫ్ట్ కంట్రోల్, మెక్లారెన్ ట్రాక్ టెలిమెట్రీ ,కార్బన్-సిరామిక్ బ్రేక్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc) -
కొడుకు పెళ్లికి అంబానీ దంపతుల వినూత్న ఆహ్వానం!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం. ఈ కుటుంబంలో ఏ వేడుకనైనా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీల వివాహాలు అత్యంత విలాసవంతంగా జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇదీ చదవండి: Ambani advice: ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం 2019 మార్చి 9న జరిగింది. ఈ వేడుకలో ఆకాశ్ తల్లి నీతా అంబానీ, సోదరి ఇషా అంబానీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వైభవోపేతంగా జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వయంగా చేతి రాతతో వివాహ ఆహ్వానం తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహానికి అతిథులకు వినూత్నంగా ఆహ్వానం పలికారు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు. స్వయంగా చేతి రాతతో వివాహ ఆహ్వానాలను అతిథులకు పంపారు. వాటికి సంబంధించిన ఫోటో అంబానీ కుటుంబానికి చెందిన ఒక ఫ్యాన్ పేజీలో ఇటీవల ప్రత్యక్షమైంది. ‘శ్రీకృష్ణుని కృపా కటాక్షాలతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మా ప్రియమైన కుమారుడు ఆకాశ్, అతని సోల్ మేట్ శ్లోకతో వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము...’ అంటూ ఆ ఆహ్వాన పత్రికలో రాశారు. అయితే ఈ పత్రికను ముఖేష్ అంబానీ, నీతా అంబానీలలో స్వయంగా ఎవరు రాశారన్నది మాత్రం తెలియలేదు. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!
కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కీర్తి పొందిన 'ముఖేష్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపార ప్రపంచంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ముందుకు సాగుతున్న ఈ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా.. పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 13వ అత్యంత సంపన్న బిలియనీర్ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు ఇటీవల ఫోర్బ్స్ నివేదించింది. ఈయన నికర ఆస్తుల విలువ 84.1 బిలియన్ డాలర్లు అని అంచనా. అంబానీ పిల్లలు కూడా తండ్రి వ్యాపారాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ.. తండ్రికి తగ్గ పిల్లలుగా ఖ్యాతి పొందారు. ఇంతకీ ముఖేష్ అంబానీ పిల్లలు రిలయన్స్ గ్రూప్‌లో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆకాష్ అంబానీ: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో చైర్మన్. భారతదేశంలో అతి పెద్ద టెలికాం బిజినెస్ ఆకాష్ నియంత్రణలో ఉంది. అంతే కాకుండా ఈయన ముంబై IPL జట్టుకు కో-ఓనర్ కూడా. ముంబైలోని క్యాంపియన్ స్కూల్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన ఆకాష్ అంబానీ 2013లో యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత తండ్రి వ్యాపార రంగంలో అడుగులు వేశారు. మొదట్లో జియో ఇన్ఫోకామ్‌లో స్ట్రాటజీ చీఫ్‌గా ప్రారంభమై దానిని వేగంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ప్రస్తుతం ఆతని ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) ఇషా అంబానీ: ముఖేష్, నీతా అంబానీల కవల పిల్లలు ఇషా, ఆకాష్. వీరి ముగ్గురు పిల్లల్లో 'ఇషా' ఒక్కగానొక్క అమ్మాయి. ఈమె ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తోంది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్తి చేసిన తరువాత మిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇషా అంబానీ ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?) అనంత్ అంబానీ: ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు అనంత్ అంబానీ. ఈయన రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారానికి బాధ్యతలు వహిస్తూ.. రిలయన్స్ 02C & రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని అంచనా. ఇటీవల అనంత్ అంబానీకి రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. -
ఆకాష్ అంబానీతో యాపిల్ సీఈవో టిమ్‌కుక్ భేటీ.. కారణం అదేనా?
భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) పేరిట ఏర్పాటైన ఈ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు రోజు అంటే ఏప్రిల్ 17న టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ రుచి చూడడం నుంచి దేశంలో ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్లను కలిసినట్లు తెలుస్తోంది. ఇక దేశీయంగా యాపిల్ వ్యాపార వ్యవహారాల నిమిత్తం కుక్ ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, ముంబై అల్టామౌంట్ రోడ్‌లోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాకు వెళ్లారు. అక్కడ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీని కలిశారు. ఆ తర్వాత టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిశారని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి ముంబై వీధుల్లో టిమ్‌కుక్ సందడి చేశారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అమితంగా ఇష్టపడే ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ (అంబానీల సూచన మేరకు) ఆరగించారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 దీనికి సంబంధించిన ఫోటోను మాధురి దీక్షిత్ ట్వీట్ చేశారు. ముంబైలో వడా పావ్ కంటే మెరుగైన స్వాగతం మరొకటి ఉండదు అంటూ పోస్ట్ చేశారు. దీనికి టిమ్ కుక్ 'నాకు మొదటిసారి వడ పావ్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది చాలా రుచిగా ఉంది’అంటూ టిమ్ కుక్ బదులిచ్చారు. చదవండి👉భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. ప్రారంభించిన టిమ్‌కుక్! -
5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. వీటితో నగరాలు స్మార్ట్‌గా, సొసైటీలు సురక్షితమైనవిగా మారగలవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆకాశ్ అంబానీ ఈ విషయాలు చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో 5జీ వినియోగంతో అంబులెన్సులు డేటా, వీడియోను రియల్ టైమ్‌లో వైద్యులకు చేరవేయగలవని, రిమోట్ కన్సల్టేషన్లు, వేగవంతమైన రోగనిర్ధారణ విధానాలతో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం విషయానికొస్తే వాతావరణం తీరుతెన్నులు, నేలలో తేమ స్థాయి, పంటల ఎదుగుదల మొదలైన వాటి గురించి డేటా ఎప్పటికప్పుడు పొందడం ద్వారా సరైన సాగు విధానాలు పాటించేందుకు వీలవుతుందని ఆకాశ్ చెప్పారు. అంతిమంగా సమాజంపై 5జీ, అనుబంధ టెక్నాలజీలు సానుకూల ప్రభావాలు చూపగలవని వివరించారు. -
సోమనాథ్ ఆలయానికి అంబానీ భారీ విరాళం
అహ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మహాశివరాత్రి పర్వదినాన గుజరాత్‌లోని సోమనాథ్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఆలయంలో తనయుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్‌తో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు 1.51 కోట్ల విరాళం ఇచ్చారాయన. ఇక ఆలయంలో ఈ తండ్రీకొడుకుల ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరేబియా సముద్ర తీరంలో కొలువైన సోమనాథ్ ఆలయానికి.. 12 జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా పేరుంది. મુકેશ અંબાણીએ પુત્ર આકાશ અંબાણી સાથે આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરે મહાદેવને શિશ ઝૂકાવી દર્શન કર્યા હતા.#MukeshAmbani #Ambani #AkashAmbani #SomnathMandir #Somnath pic.twitter.com/oAAFmNUFYf — Gujarat Samachar (@gujratsamachar) February 18, 2023 ఇదిలా ఉంటే కిందటి ఏడాది సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ముకేశ్ అంబానీ.. కోటిన్నర రూపాయలు విరాళంగా ఇచ్చిన సంగతి విదితమే. -
ముగ్గురు పిల్లలకు.. మూడు టార్గెట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ!
బిలియనీర్ ముఖేష్ అంబానీ 2023 చివరి నాటికల్లా 5జీ నెట్ వర్క్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. తద్వారా రీటైల్ విభాగంలో మరిన్ని లక్ష్యాల్ని అధిరోహించి రిలయన్స్ సామ్రాజ్యాన్ని మరింత వృద్ధి చేయాలని తన ముగ్గురు పిల్లలకు పిలుపునిచ్చారు. అందుకు ఇటీవల ఖతార్‌లో జరిగిన ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనాను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సి టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలని సూచించారు. 2021 రిలయన్స్ ఫ్యామిలీ డేలో తన వారసత్వ ప్రణాళిక గురించి ముఖేష్ అంబానీ మాట్లాడారు. ముగ్గురు పిల్లల కోసం తన వ్యాపారాన్ని మూడు భాగాలుగా విభజించి పెద్ద కుమారుడు ఆకాష్ కోసం టెలికాం, డిజిటల్ బిజినెస్.., కవలలైన ఇషా అంబానీకి రిటైల్..అనంత్ అంబానీకి కోసం న్యూ ఎనర్జీ బిజినెస్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా.. భవిష్యత్‌లో రిలయన్స్ సాధించాల్సిన మూడు లక్ష్యాల గురించి మాట్లాడారు.‘‘సంవత్సరాలు...దశాబ్దాలు గడిచిపోతాయి.. రిలయన్స్ మర్రి చెట్టులాగా పెద్దదవుతూనే ఉంటుంది. దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తాయి. వేర్లు మరింత లోతుకు వెళ్తాయి. నానాటికీ పెరుగుతున్న భారతీయులు జీవితాలు స్ప్రృశిస్తూ వారి జీవితాల్ని సుసంపన్నం చేయడం, వారిని శక్తివంతం చేయడం, వారిని పోషించడం,వారి పట్ల శ్రద్ధ వహించడమే రిలయన్స్ లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో నాయకులు,ఉద్యోగుల నుంచి సంస్థ యొక్క అంచనాలను తెలియజేయాలన్నారు. ఆకాష్ అంబానీ "ఆకాష్ అధ్యక్షతన, ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా జియో భారతదేశం అంతటా ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను విడుదల చేస్తోంది. జియో 5జీ విస్తరణ 2023లో పూర్తవుతుంది" అని అన్నారు. అయితే జియో ప్లాట్‌ఫారమ్‌లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, ఆయా సమస్యలకు పరిష్కారాలను అందించాల్సిన అవసరం ఉంది.ప్రతి ఒక్క గ్రామం 5జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది కాబట్టి.. నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి సౌకర్యాలతో గ్రామీణ-పట్టణల మధ్య అంతరాన్ని తగ్గించేలా జియో భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందనే అభి ప్రాయం వ్యక్తం చేశారు. ఇషా అంబానీ ఇషా సారధ్యంలో రిటైల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. రిటైల్ టీమ్‌లోని మీరందరూ మరింత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు అధిరోహించే సత్తా మీకుందంటూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు. జియో తరహాలో రిటైల్ బిజినెస్ దేశ సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది. మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, ఎస్ఎంఈలకు మరింత ఉత్పాదకతను పెంచి వ్యాపారులు మరింత సంపన్నంగా మారడంలో సహాయపడుతుందని అన్నారు. అనంత్ అంబానీ రిలయన్స్ కొత్త సామర్థ్యాలు, అనుకున్న లక్ష్యాలతో ఆయిల్-టు-కెమికల్ వ్యాపారంలో తన నాయకత్వాన్ని పెంచుకుంటూనే ఉంది. అలాగే మీడియా, ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని డిజిటల్ సేవలతో అనుసంధానం చేయడం వల్ల పరిశ్రమకు పునరుత్తేజం అవుతుందని ముఖేష్ అంబానీ చెప్పారు. గిగా కర్మాగారాలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం, తద్వారా కొత్త ఇంధన వ్యాపారం సంస్థను మార్చగల సామర్ధ్యం. ఈ రాబోయే తరం వ్యాపారంలో అనంత్ చేరడంతో, జామ్‌నగర్‌లోని గిగా ఫ్యాక్టరీలను సిద్ధం చేయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్నాం’ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు 'గ్రీనెస్ట్' కార్పొరేట్‌గా కూడా అవతరించే మార్గంలో ఉందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. -
మరో మైలురాయి: జియో 5జీ సేవల్లో తొలి రాష్ట్రంగా గుజరాత్
సాక్షి,ముంబై: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్క్ష్యంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రూ-5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించిన జియో తాజాగా మరో ఘనతను సాధించింది. భారతదేశంలో జియో 5 జీ సేవలను పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ విషయంలో రిలయన్స్ జన్మభూమి కాబట్టి గుజరాత్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) ‘ట్రూ 5G ఫర్ ఆల్’ ఇనిషియేటివ్ కింద జిల్లా ప్రధాన కార్యాలయాలలో 100శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. ‘జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్’ నేటి (నవంబరు 25) నుంచి 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు పొందుతారు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు) గుజరాత్లో ఈ శుభారంభం ఒక ముఖ్యమైన నిజమైన 5G-ఆధారిత చొరవతో జరుగుతోందని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద మొదట గుజరాత్‌లోని 100 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి, దీనితో పాఠశాలల్ని అనుసంధానం చేస్తుందని జియో ప్రకటించింది. ⇒ JioTrue5G కనెక్టివిటీ ⇒ అధునాతన కంటెంట్ ప్లాట్‌ఫారమ్ ⇒ ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక ⇒ స్కూల్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ ఈ సాంకేతికత ద్వారా, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. డిజిటల్ ప్రయాణంలోనాణ్యమైన విద్య , తద్వారా సాధికారత ఈజీ అవుతుందని కంపెనీ తెలిపింది. 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే పది, పదిహేనే ళ్లలో 300-400 మిలియన్ల నైపుణ్యం కలిగిన భారతీయులు వర్క్‌ఫోర్స్‌లో చేరనున్నారు. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాన్ని మాత్రమే అందించడంతోపాటు,2047 నాటికి అభివృద్ధి చెందిన మన దేశ ఆర్థిక వ్యవస్థగా మారాల ప్రధానమంత్రి లక్క్ష్య సాధనతో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో 1.3 బిలియన్ల యూజర్లతో డిజిటల్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్‌గా నిలిపిందని పేర్కొంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) -
ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్
జియో యూజర్లకు బంపరాఫర్. 5జీ నెట్ వర్క్ సదుపాయం లేకున్నా.. 5జీ వైఫైని వినియోగించుకునే సౌకర్యాన్ని రిలయన్స్ జియో తన యూజర్లకు కల్పించింది. దీపావళి సందర్భంగా జియో ట్రూ 5జీ నెట్ వర్క్‌ను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో మిగిలిన ప్రాంతాలకు చెందిన యూజర్లను ఇతర 5జీ నెట్ వర్క్‌ల వైపు (ఇప్పటికే ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంది) మొగ్గు చూపకుండా ఉండేందుకు జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ వేశారు. జియో ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో 5జీ వైఫైను విడుదల చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్, 5జీ సిమ్ లేని యూజర్లు ఏ స్మార్ట్ఫోన్లలో అయినా ఈ 5జీ వైఫై సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ వైఫైని ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్,రైల్వే స్టేషన్స్, బస్టాండ్, కమర్షియల్ హబ్స్ తోపాటు జియో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రానున్న ఢిల్లీ,ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ఉపయోగించుకునే సౌకర్యాన్ని రిలయన్స్ కల్పించింది. ‘5జీ అనేది అతి కొద్దిమందికి లేదా, పెద్ద పెద్ద నగరాల్లోని కస్టమర్లకి మాత్రమే కాదు. ప్రతి దేశ పౌరుడికి, ప్రతి ఇంటికి, భారతదేశం అంతటా ప్రతి వ్యాపారానికి అందుబాటులో ఉండాలి. జియో ట్రూ 5జీని ప్రతి భారతీయుడికి ఉపయోగించుకునేలా ఇది ఒక అడుగు’ మాత్రమే అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ జియో 5జీ వైఫై విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జియో ట్రూ 5జీ టెస్టింగ్ చెన్నైలో సైతం నిర్వహించింది. దీంతో దీపావళికి జియో 5జీ అందుబాటులోకి రానున్న ప్రాంతాల్లో చెన్నైకి స్థానం లభించింది. ఈ ఫోన్లలో 5జీ సేవలు యాపిల్,శాంసంగ్ గూగుల్ వంటి ప్రధాన ఫోన్ తయారీదారులు రాబోయే రెండు నెలల్లో 5జీ రెడీ ఓటిఎ (ఓవర్-ది-ఎయిర్) అప్ డేట్లను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 లాంచ్ చేసింది. ఇది జియో ట్రూ 5 జీకి సపోర్ట్ చేసిన ఫోన్ల జాబితాలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. చదవండి👉 దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం -
యూజర్లకు శుభవార్త, దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో దేశంలో 5జీ సేవల్ని అధికారికంగా ప్రారంభించింది. రెండు నెలల క్రితం రిలయన్స్ ప్రకటించినట్లుగానే..శనివారం హై స్పీడ్ టెలికం సర్వసుల్ని అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్‌లో ఉన్న ప్రముఖ శ్రీనాథ్జీ ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది దీపావళి నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా,చెన్నైలలో ఎంపిక చేసిన యూజర్లకు 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ సేవల్ని వినియోగించుకునే సదుపాయం కలగనుంది. Reliance Jio chairman, Akash Ambani and his wife Shloka Ambani offered prayers at Shrinathji Temple in Nathdwara, Rajasthan today. Earlier today he launched Jio 5G services from Nathdwara. pic.twitter.com/adE7RHAKZy — ANI (@ANI) October 22, 2022 2023 డిసెంబర్ నాటికి టెలికం సంస్థ రిలయన్స్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రతీ పట్టణం, తాలూకా ఇలా అన్నీ ప్రాంతాల్లో జియో సేవల్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆగస్ట్ 29న దేశంలో 5జీ నెట్ వర్క్ ప్రారంభం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి👉 జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్వర్క్ పొందండిలా! -
దేశంలో 5జీ సేవలు, జియో 5జీ ప్లాన్ వివరాలు ఇవేనా?
దేశంలో 5జీ నెట్ అందుబాటులోకి వస్తే వాటి ధరలు భారీగా పెరుగుతాయా? పెరిగితే ఎంత పెరుగుతాయనే అంశాలపై వినియోగదారుల్లో చర్చ మొదలైంది. అయితే 5జీ సేవల్ని మోదీ ప్రారంభించిన అనంతరం ఆకాష్ అంబానీ మీడియాతో మాట్లాడారు. జియో సంస్థ వినియోగదారులకు ఆమోదయోగ్యంగా 5జీ ప్లాన్లను ప్రవేశ పెడుతుందని అన్నారు. ప్రతీ దేశ పౌరుడు 5జీ నెట్ వర్క్‌ను వినియోగించేలా ప్రొడక్ట్ నుంచి సర్వీసులు వరకు తక్కువ ధరకే అందిస్తామన్నారు. 5జీపై మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ..1జీబీ డేటా గతంలో రూ.300 ఉంటే..ఇప్పుడు రూ.10కే లభ్యం అవుతుంది. యావరేజ్‌గా దేశ పౌరుడు నెలకు 14జీబీ డేటాను వినియోగిస్తే..దాని ధర రూ.4200, కానీ రూ.125 నుంచి రూ.150 మధ్యలో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో తొలిసారి 5జీ సేవలు ప్రారంభం కావడం.. జియో 5జీ ప్లాన్, సిమ్ కార్డ్‌ల గురించి చర్చ మొదలైంది. అంతేకాదు జియో 5జీ ప్లాన్ల ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయంటూ పలు నివేదికలు విడుదలయ్యాయి. జియో సిమ్ కార్డ్ ఈ ఏడాది ఆగస్ట్ 29న జరిగిన రిలయన్స్ 45వ ఏజీఎం సమావేశంలో 5జీ సేవల వినియోగంపై జియో ప్రకటన చేసింది. ఆ సందర్భంగా ఎటువంటి నెట్ వర్క్‌కు కనెక్షన్ లేకుండా స్టాండ్ అలోన్ (Standalone) అనే 5జీ సర్వసుల్ని అందిస్తామని చెప్పింది. దీంతో ఈ సేవల కోసం 4జీ సిమ్ కార్డ్‌ను వినియోగించలేమని, సిమ్ కార్డును 5జీ నెట్ వర్క్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని టెలికం నిపుణులు చెబుతున్నారు. జియో స్పీడ్ జియో సంస్థ దేశ వ్యాప్తంగా 8 నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..ముంబైలో 4జీ కంటే 5జీ 8ఎక్స్ స్పీడ్‌తో జియో పనిచేస్తుందని, ట్రయల్స్‌లో జియో డౌన్లోడ్ స్పీడ్ 420 ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడ్ 412 ఎంబీపీఎస్ ఉంది. జియో 5జీ ధర దేశంలో జియో 4జీ ప్లాన్ ప్రారంభ ధర నెలకు రూ.239. రోజుకు 1.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అలాగే 5జీ ప్లాన్లు సైతం అదే తరహాలో ఉంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఇతర నెట్ వర్క్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేలా జియో 5జీ ప్రారంభ ధర నెలకు రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. -
‘టైమ్100’లో ఆకాశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన టైమ్100 నెక్ట్స్ జాబితాలో దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు, జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. బిజినెస్, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ తదితర రంగాల రూపురేఖలను మార్చగలిగే సామర్థ్యాలున్న 100 మంది వర్ధమాన నాయకులతో టైమ్ మ్యాగజైన్ దీన్ని రూపొందించింది. ఇందులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆకాశ్ అంబానీయే. ఆయన కాకుండా భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త ఆమ్రపాలి గాన్ కూడా జాబితాలో ఉన్నారు. జూనియర్ అంబానీ 22 ఏళ్లకే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. 42.6 కోట్ల మంది పైగా యూజర్లున్న జియోకి చైర్మన్‌గా ఇటీవల జూన్‌లోనే నియమితులయ్యారు. పారిశ్రామిక నేపథ్యం గల కుటుంబ వారసుడైన అంబానీ .. వ్యాపార పగ్గాలు చేపడతారన్న అంచనాలు సహజంగానే ఉన్నాయని, ఆయన కూడా కష్టించి పనిచేస్తున్నారని టైమ్ పేర్కొంది. ‘గూగుల్, ఫేస్బుక్ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించడంలో ఆకాశ్ కీలకపాత్ర పోషించారు‘ అని వివరించింది. మరోవైపు, అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల సైట్ అయిన ’ఓన్లీఫ్యాన్స్’కి ఆమ్రపాలి గాన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌లో చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత పదోన్నతి పొందారు. అమెరికన్ సింగర్ ఎస్జెడ్ఏ, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు యా మోరాంట్, టెన్నిస్ ప్లేయర్ కార్లోక్ అల్కెరాజ్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. -
ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా!
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ రీటైల్ బాధ్యతల్ని కుమార్తె ఇషా అంబానీకి అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీ 45వ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ.. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్ని ఇషా అంబానీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ముఖేష్ అంబానీ ప్రకటన అనంతరం రిలయన్స్ రీటైల్ నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు చేయడం, పేమెంట్స్ చేయడంతో పాటు ఎఫ్ఎంసీజీ విభాగంలోకి అడుగుపెడుడుతున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడికి హైక్వాలిటీ, తక్కువ ధరకే నిత్యవసర వస్తువుల్ని అందించేలా రీటైల్ విభాగాన్ని డెవలెప్ చేసినట్లు చెప్పారు. కాగా, సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్‌ను రిలయన్స్ రిటైల్ విభాగంలోకి రానున్నాయి. ఆకాష్..ఈషా..అనంత్ ముకేష్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. ఇప్పటికే ఈ ముగ్గురికి ముఖేష్ అంబానీ ఆస్తుల పంపకం ప్రక్రియను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో పెద్ద కొడుకు ఆకాశ్ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతల్ని కట్టబెట్టారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. తాజాగా ఇషా అంబానీకి రిటైల్ గ్రూప్ బాధ్యతల్ని అప్పగించారు. చిన్న కొడుకు ముఖేష్ అంబానీకి న్యూఎనర్జీ బిజినెస్ విభాగాన్ని అప్పగించే యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి శామ్ వాల్టన్ బాటలో ముఖేష్ అంబానీ రిలయన్స్ లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం అన్నీ రంగాలలో విస్తరించి ఉంది. ఇదే వైభవం భవిష్యత్తులోనూ కొనసాగాలంటే పక్కా ప్లాన్, అంతకుమించిన వ్యూహం అవసరం. అందుకోసం కసరత్తు చేస్తున్న ముకేష్ అంబానీ..వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్ నడిచిన బాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. ఇందుకోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాద్యతలను దానికి పూర్తిగా అప్పగించాలని ముఖేష్ అంబానీ చూస్తున్నారు. కొత్త సంస్థలో బోర్డు సభ్యులుగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, అతని ముగ్గురు పిల్లలు మరికొందరు కుటుంబ సభ్యులు ఉంటారు. ముఖేష్ అంబానీ సన్నిహిత సహచరులు రిలయన్స్ సామ్రాజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ బోర్డులో స్థానం కల్పించానున్నట్లు బ్లూంబర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. -
CSA T20 League: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా..
CSA T20 League- MI Capetown: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా కేప్‌టౌన్ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంఐ కేప్‌టౌన్ పేరిట బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో బుధవారం జట్టు పేరును ప్రకటించింది యాజమాన్యం. తాజాగా ఎంఐ కేప్‌టౌన్‌లో భాగం కానున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా తమ ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల వివరాలు వెల్లడించింది. రబడ సహా.. ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఎంఐ కేప్‌టౌన్ నిర్మాణ ప్రయాణంలో ముందడుగు పడినందుకు సంతోషంగా ఉంది. రషీద్, కగిసో, లియామ్, సామ్లను మా ఫ్యామిలీ(#OneFamily)లోకి ఆహ్వానించడం ఆనందకరం. ఇక డెవాల్డ్ మాతో తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దూకుడైన ఆటకు ఎంఐ పర్యాయపదం లాంటిది. ఎంఐ కేప్‌టౌన్.. అలాగే మా ఇతర జట్లు కూడా ఇలాగే ముందుకు సాగుతూ దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరినీ అలరిస్తాయి’’ అని పేర్కొన్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరున్న సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో విదేశీ లీగ్‌లలోనూ ముంబై ఇండియన్స్(ఎంఐ) పేరు కలిసి వచ్చేలా.. సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ పేర్లు పెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రొటిస్ యువ సంచలన ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 -
దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ టీమ్‌పై రిలయన్స్ కన్ను!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. క్రికెట్ ప్రపంచంలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన టీ20 లీగ్ టీమ్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో తమ ముంబై ఇండియన్స్ టీమ్ బ్రాండ్ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని పేర్కొంది. యూఏఈ టీ20 లీగ్‌లో కూడా ఒక టీమ్‌ను దక్కించుకుంటున్నట్లు రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీని కూడా కలిపితే మూడు దేశాల్లో తమకు టీ20 టీమ్‌లు ఉన్నట్లవుతుందని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియో ఇనిస్టిట్యూట్ ప్రారంభం.. రిలయన్స్ ఏర్పాటు చేసిన జియో ఇనిస్టిట్యూట్‌లో తొలి బ్యాచ్‌కు తరగతులు ప్రారంభమయ్యాయి. దేశీయంగా అత్యుత్తమ ప్రమాణాలతో ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై శివార్లలో 800 ఎకరాల విస్తీర్ణంలో జియో ఇనిస్టిట్యూట్ ఏర్పాటైంది. దీని కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 1,500 కోట్లు వెచ్చించింది. అంతర్జాతీయంగా పేరొందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ మొదలైన వాటితో జియో ఇనిస్టిట్యూట్ భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి. -
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపర కుబేరుడు, రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియకు తెరతీశారు. టెలికం అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోకు ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు. తద్వారా టెలికం విభాగం పగ్గాలను తనయుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో భారీ మార్పులకు ముకేశ్ అంబానీ బాటలు వేశారు. పెద్ద కొడుకు ఆకాశ్ ఎం.అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు అనుగుణంగా టెలికం బోర్డు నుంచి వైదొలిగారు. సోమవారం సమావేశమైన కంపెనీబోర్డు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ ఎం. అంబానీని చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు రిలయన్స్ జియో స్టాక్ ఎక్స్ఛేంజ్జీలకు తాజాగా సమాచారమిచ్చింది. సోమవారం సాయంత్రం ముకేశ్ అంబానీ రాజీనామా చేసినట్లు బోర్డు వెల్లడించింది. 217 బిలియన్ డాలర్ల విలువైన ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ గ్రూప్.. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా, న్యూఎనర్జీ విభాగాలలో విస్తరించిన విషయం విదితమే. వారసులకు బాధ్యతలు... ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలుకాగా.. చిన్న కుమారుడు అనంత్. రిటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30 ఏళ్లు) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఈషా వివాహం చేసుకున్న విషయం విదితమే. అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ కాగా.. ఇప్పటికే ఆకాశ్, ఈషా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) బోర్డులో విధులు నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యవెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్ విభాగాలతోపాటు ఆన్లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్‌ను రిలయన్స్ రిటైల్ కలిగి ఉంది. ఇక డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్) బోర్డులోనూ 2014 అక్టోబర్ నుంచీ వీరిద్దరూ కొనసాగుతున్నారు. ఇక 26 ఏళ్ల అనంత్ ఇటీవలే ఆర్ఆర్వీఎల్ బోర్డులో డైరెక్టరుగా చేరారు. 2020 మే నుంచి జేపీఎల్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎండీగా పంకజ్... ఈ నెల 27 నుంచి ఐదేళ్లపాటు ఎండీగా పంకజ్ మోహన్ పవార్‌ను బోర్డు ఎంపిక చేసినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మాజీ కార్యదర్శి రమీందర్ సింగ్ గుజ్రాల్, మాజీ సీవీసీ కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు పేర్కొంది. వీరిరువురూ ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో కొనసాగుతున్నారు. కంపెనీ ప్రధానంగా మూడు బిజినెస్ విభాగాలను కలిగి ఉంది. ఇవి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికంసహా డిజిటల్ సర్వీసులు. రిటైల్, డిజిటల్ సర్వీసులను పూర్తి అనుబంధ ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసింది. న్యూఏజ్పై దృష్టి... ఆర్‌ఐఎల్‌కుగల 3 బిజినెస్‌లూ పరిమాణంలో సమానమేకాగా.. గ్రూప్‌లోని ఆధునిక విభాగాలు రిటైల్, టెలికంలలో ఆకాశ్, ఈషా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అనంత్ పునరుత్పాదక ఇంధనం, చమురు, కెమికల్ యూనిట్లకు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయం ద్వారా 65 ఏళ్ల పారిశ్రామిక దిగ్గజం ముకేశ్.. ఆస్తుల పంపకం విషయంలో స్పష్టంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2002లో తండ్రి మరణం తదుపరి వ్యాపార సామ్రాజ్య విభజనలో తమ్ముడు అనిల్ అంబానీతో వివాదాలు నెలకొన్న కారణంగా ముకేశ్ ప్రస్తుత నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు వారు చెబుతున్నారు. ఈ వార్తలతో ఆర్ఐఎల్ షేరు 1.5 శాతం బలపడి రూ. 2,530 వద్ద ముగిసింది. ఆర్ఐఎల్ చైర్మన్‌గా ముకేశ్... ఆర్ఐఎల్కు ముకేశ్ అంబానీ చైర్మన్, ఎండీగా, ఆయన సతీమణి నీతా అంబానీ బోర్డులో సభ్యురాలిగా కొనసాగనున్నారు. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చైర్మన్‌గానూ ముకేశ్ కొనసాగనున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌సహా అన్ని జియో డిజిటల్ సర్వీసుల బ్రాండ్లు జియో ప్లాట్‌ఫామ్స్ కిందకు వస్తాయి. కంపెనీ వివరాల ప్రకారం అంబానీ కుటుంబ వాటా ఆర్ఐఎల్లో 50.6 శాతానికి చేరింది. 1973లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి👉 ముఖేష్ అంబానీ తన ఆస్తులన్ని ఎవరి పేరిట రాశారో తెలుసా? -
అంబానీ రాజీనామా, జియోకి కొత్త బాస్ ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేశ్ అంబానీ వైదొలగినట్టు జియో మంగళవారం తెలిపింది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,ముఖేశ్ కుమారుడు ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా సంస్థ ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం (జూన్ 27, 2022) జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. -
అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట పట్టిన పృథ్వీ అంబానీ!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనవడు పృథ్వీ ఆకాష్ అంబానీ తన తల్లి శ్లోకా మెహతాతో కలిసి బుడి బుడి అడుగులతో బడి బాట పట్టాడు. ముంబైలోని ఒక ప్లే స్కూల్లో అడుగుపెట్టాడు. 15 నెలల వయసున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీలు ఎత్తుకుని తీసుకు వచ్చారు. దేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన పృథ్వీ ఆకాష్ అంబానీని మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌కు పంపాలని ముఖేష్ అంబానీ కుటుంబం నిర్ణయించుకుంది. పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకోవడం విశేషం. పృథ్వీ తల్లిదండ్రులు తమ కుమారునికి సురక్షితమైన వాతావరణం, నాణ్యమైన విద్యను అందించడానికి ఈ స్కూల్‌ను ఎంచుకున్నారు. పృథ్వీ సాధారణ జీవితాన్ని గడపాలని ముఖేష్ కుటుంబం కోరుకోవడం విశేషం. పృథ్వీ అంబానీ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని సన్నాహాలు చేశారు. పృథ్వీ అంబానీ క్షేమంగా ఉండేందుకు ఆయన వెంట ఎప్పుడూ ఒక డాక్టర్ ఉండనున్నారు. అంబానీ మొదటి మనవడి భద్రత చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారు సాధారణ దుస్తులలో ఉంటారు. అటుగా వచ్చేవారిపై నిఘా పెట్టి ఉంటారు. 2019లో వివాహం చేసుకున్న శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీలకు పృథ్వీ ఆకాష్ అంబానీ డిసెంబర్ 10, 2020న జన్మించారు. (చదవండి: దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌బస్ హెలికాప్టర్ కొన్న కేరళ బిలియనీర్!) -
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
వాట్సాప్ ద్వారా నిత్యావసర సరుకులు డెలివరీ
నిత్యావసరాలు, కూరగాయలు మొదలైన వాటిని వాట్సాప్ ద్వారా ఆర్డరు చేస్తే ఇంటి వద్దకే అందించేలా రిటైల్ దిగ్గజం జియోమార్ట్ కొత్త సర్వీసు ప్రవేశపెడుతోంది. ఫ్యూయల్ ఫర్ ఇండియా పేరిట మెటా నిర్వహించిన కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ‘బ్రెడ్, పండ్లు..కూరగాయలు, శీతలపానీయాలు ఇలా ఏ సరుకులైనా, ఆ రోజుకు కావాల్సినా లేక ఆ వారానికి కావాల్సినవైనా జియోమార్ట్‌కు వాట్సాప్ ద్వారా ఆర్డరు చేయొచ్చు. తరచుగా కావాలంటే సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. మీ కొనుగోళ్ల చరిత్రను బట్టి వ్యక్తిగత సిఫార్సులు పొందవచ్చు‘ అని ఈషా అంబానీ పేర్కొన్నారు. ‘వాట్సాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ అత్యంత సరళంగా, సులభతరంగా ఉంటుంది‘ అని ఆకాశ్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ద్వారా ఆర్డర్ల డెలివరీ ఉంటుంది. దేశీయంగా రిటైల్ వ్యయాల్లో ఆహారం, కిరాణా సరుకుల వాటా భారీగా ఉంటుంది. 2025 నాటికి ఇది 1.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరవచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. జియోమార్ట్ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 5 లక్షల పైచిలుకు రిటైలర్లు ఉన్నారని, ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆకాష్ వివరించారు. వాట్సాప్‌తో రీచార్జ్ కూడా.. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు సైతం త్వరలో వాట్సాప్ ద్వారా రీచార్జి చేయించుకోవచ్చని ఆకాశ్ పేర్కొన్నారు. చెల్లింపులతో పాటు మొబైల్ రీచార్జింగ్లకు కూడా వాట్సాప్ ఉపయోగపడనుండటం ఆసక్తికరమని ఆయన తెలిపారు. 2022లో జియో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. రీచార్జింగ్ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేస్తుందని, రీచార్జ్ వంటి అవసరాల కోసం బైటికి వెళ్లలేని సీనియర్ సిటిజన్లులాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈషా అంబానీ తెలిపారు. 2021 సెప్టెంబర్ ఆఖరు నాటికి జియోకు 42.95 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఇక సులభంగా రిలయన్స్ జియో రీఛార్జ్ సేవలు..!
ముంబై: మెటా, రిలయన్స్ జియో చేతులు కలపడం వల్ల దేశీయంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని జియో ప్లాట్‌ఫారమ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ అభిప్రాయపడ్డారు. జియో వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను వాట్సాప్ ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చని బుధవారం తెలిపారు. మెటా ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 ఈవెంట్లో ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో, మెటా బృందాల పరస్పర సహకారంతో దేశంలో మరిన్ని మార్పులను వస్తాయని అన్నారు. "త్వరలో వాట్సాప్‌లో జియో వినియోగదారులకు 'ప్రీపెయిడ్ రీఛార్జ్' సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ సేవలు అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని ఆయన చెప్పారు. ఈ ఫీచర్ 2022లో విడుదల కానుంది. జియో ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ ఫీచర్ రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి కొన్ని సమయాల్లో బయటికి వెళ్లడం కష్టంగా ఉండే వృద్ధులకు ఈ ఫీచర్ భాగ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. (చదవండి: చైనాకు గట్టి షాక్!.. కీలక స్కీమ్‌కు కేంద్రం ఆమోదం) భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ‘కిరాణా దుకాణాలు’ వెన్నెముక అని ఇషా అంబానీ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కొనుగోళ్ల విషయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని .. ఇది కంపెనీగా జియోకి కస్టమర్లకి ఎంతో ఉపయోగపడిందన్నారు. అదే పద్దతిలో జియోమార్ట్ వల్ల వినియోగదారులకు కొనుగులు ప్రక్రియ ఎంతో సులభం అవుతుందన్నారు. మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ.. భారతదేశం వేగంగా ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని.. అనేక ఇతర దేశాలు అనుసరించడానికి భారత్ దారి చూపుతుందని అన్నారు. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఐటీ కంపెనీల సంచలన నిర్ణయం..!) -
తాత అయిన ముకేష్ అంబానీ
న్యూఢిల్లీ: భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తాత అయ్యారు. ముకేశ్ అంబా నీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోక దంపతులకు ముంబైలో కొడుకు పుట్టాడని అంబానీ కుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తాత. నానమ్మలైనందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొత్త శిశువు రాక అంబానీ, మెహత కుటుంబాల్లో ఆనందోత్సాహాలను నింపిందని వివరించారు. వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోక, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో జరిగింది. -
తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు
ముంబై: అంబానీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. నీతా- ముఖేష్ అంబానీ దంపతులు బామ్మ- తాతయ్యలుగా ప్రమోషన్ పొందారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. నీతా- ముఖేష్ అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు. ధీరూభాయి- కోకిలాబెన్ మునిమనవడికి స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది’’ అంటూ శుభవార్తను పంచుకుంది. కాగా గతేడాది మార్చిలో ఆకాశ్- శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటయ్యారు. శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె అన్న విషయం తెలిసిందే.(చదవండి: ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు) ఇక ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వారసత్వాన్ని నిలబెడుతూ ఆయన సంతానం కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వ్యాపారవేత్తలుగా రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లైన ఆయన కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
క్రికీతో జియో కొత్త రియాలిటీ గేమింగ్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ అగ్మెంట్ రియాలిటీ మొబైల్ గేమింగ్ సంస్థ క్రికీ, జియోతో కలిసి కొత్తగా రియాలిటీ గేమింగ్ యాప్ యాత్రను భారత్‌లో ప్రారంభించింది. ఇందుకోసం జియో కూడా సిరీస్ ఎ ఫండింగ్ రౌడ్‌కు నాయకత్వం వహించి దాదాపు 22 మిలియన్ డాలర్లను క్రికీకు ఇచ్చింది. ఈ యాప్‌లో జియోతో కలిసి భారతదేశంలో ప్రారంభించిన సందర్భంగా క్రికీ వ్యవస్థాపకులు జాన్వీ, కేతకి శ్రీరామ్‌లు మాట్లాడుతూ.. ‘ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు మరింత వినోదాన్ని అందించేందుకు మా క్రికీ యాప్ ప్రేరణ ఇచ్చింది. అందుకే ఆన్లైన్ ఆటగాళ్ల కోసం కొత్తగా యాత్ర యాప్‌ను ప్రారంభించాం. మీ మొబైల్లో గేమ్ ఆడుతున్నసమయంలో ఈ యాప్ మిమ్మల్ని ఆటలో లీనం చేస్తుంది. ఎ విధంగా అంటే ఈ యాప్‌ను త్రిడీలో రూపోందించినందున ఇందులో గేమ్ మీకు వాస్తవిక భావన కలిగిస్తుంది. కేవలం మీ మొబైల్ కెమెరాతో ఆటగాళ్లను యాక్షన్, ఆడ్వెంచర్‌లతో ఫాంటసీ ప్రపంచాన్ని మీ ఇంటికే తీసుకువస్తుంది. అయితే అగ్మెంట్ రియాలిటీ గేమ్‌లో రాక్షసుడు సైన్యాన్ని ఓడించే ప్రయత్నం చేయడం, బాణం, విల్లు చక్రం, మెరుపు, ఫైర్ బోల్ట్ వంటి ఆయుధాలను ఉపయోగించి ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనవచ్చు. ఈ రియాలిటీ గేమ్ అంతా త్రీడిలో ఉన్నందున యాత్ర యూజర్లంతా ఈ ఆటలో వాస్తవంగా పాల్గొన్న అనుభూతిని ఇస్తుంది’ అని వారు చెప్పుకొచ్చారు. ఇక ఆటగాళ్లు తమ ఆటను స్నేహితులతో పంచుకునే ఆప్షన్ కూడా ఉంది. మీ గేమ్ పూర్తి కాగానే వీడియో ఫేరింగ్ ఆప్షన్‌తో పాటు ఇతరులు పోస్టు చేసిన గేమ్ వీడియోను కూడా చూడటానికి వీడియో ఫీడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే తిరిగి అదే గేమ్‌ను ఆడేందుకి డిజిటల్ గ్రౌండ్ ఆప్షన్ సౌకర్యం కూడా ఉందని వారు పేర్కొన్నారు. అయితే జియో మొబైల్ యూజర్లకు మాత్రం కొన్ని అదనపు ఫిచర్లను అందిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అవి: 3డీ అవతార్ ఫీచర్, గెమ్‌ప్లే టోకెన్లు(అదనపు ఆయుధాలు, పవన్ ఆన్‌లాక్ చేయడం), గేమ్ ప్లేస్‌లు. అదే విధంగా దీనిపై జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్‌తో క్రికీ ఒక తరం భారతీయులను ప్రేరేపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అనుభవనాలను భారతీయులకు అందించేందుకు ఈ యాత్ర యాప్ మా దృష్టి ఆకర్షించిందన్నారు. ఈ యాప్ వినియోగాదారులంతా రియాలిటి గేమ్‌లో మంచి అనుభూతిని పొందుతారని, కాబట్టి ఆన్లైన్ గేమ్ ప్రియులంతా ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఫాంటసీ అనుభవాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమింగ్‌తో ఆటగాళ్లంత తమ స్వంత ప్రపంచ అనుభూతిని పొందడానికి యాత్ర యాప్ ఆక్సెస్‌ను జియో యూజర్లతో పాటు, జియోతర మొబైల్ యూజర్లకు కూడా కల్పిస్తున్నాం’ అని ఆకాష్ తెలిపారు. అయితే ఈ క్రికీ యాప్ ఇప్పడు ఐఓసీ(ios) యాప్ స్టోర్లతో పాటు గూగుల్ ప్లే స్టోర్లలో ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. -
ఫార్చ్యూన్ 40లో అంబానీ ట్విన్స్
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత అతని సంతానం కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ (29) అరుదైన ఘనత సాధించారు. 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన ′40 అండర్-40′ లో రిలయన్స్ చైర్మన్ బిలియనీర్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ట్విన్స్ 28 ఏళ్ల ఇషా, ఆకాష్ నిలిచారు. టెక్నాలజీ జాబితాలో ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పేర్లను పొందుపరిచింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సవాళ్లను ఈ యువ ఎగ్జిక్యూటివ్‌లు సమర్థంగా ఎదుర్కొన్నారని పేర్కొంది. సోదరుడు అనంత్, (25) తో కలిసి తమ తండ్రి సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారని ఫార్చ్యూన్ మేగజీన్ ప్రశంసించింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన ఫార్మా దిగ్గజం,ప్రపంచంలోని అతిపెద్ద టీకాల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా భారతదేశపు ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ బైజు సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ (39), ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లలోపు ప్రభావవంతమైన ఫార్చ్యూన్ వార్షిక జాబితాలో నిలిచారు. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ప్రభుత్వ, రాజకీయాలు, మీడియా, వినోదం అనే ఐదు విభాగాలలో 40మంది ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించి ఈ వార్షిక జాబితాను రూపొందిస్తుంది. -
ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కి కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ చోటు దక్కించుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్‌లో చేరారు. యేల్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్ పేర్కొంది. అలాగే రిలయన్స్ సామ్రాజ్యాన్ని నడిపించేందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారని తెలిపింది. మరోవైపు, భారీ స్థాయిలో ఆన్లైన్ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్ నిరూపించారని ఫార్చూన్ పేర్కొంది. అటు స్టార్టప్స్ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్ గురించి అంతగా తెలియని మను జైన్ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది. చదవండి: బ్లూచిప్ షేర్ల దన్ను -
‘ఆ యార్కర్లను ఫ్యాన్స్ మిస్సవనున్నారు’
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్‌కు శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగా షాకిచ్చాడు. యూఎఈ వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 సీజన్లో మలింగా యార్కర్లను క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించలేరు. ఈ ఐపీఎల్లో పాల్గోనడం లేదని లసిత్ మలింగా బుధవారం ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ తరపున లసిత్ మలింగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా లసిత్ మలింగా స్థానంలో ఆసీస్ పేసర్ జేమ్స్ పాటిన్సన్ ఆడనున్నాడు. అయితే ఈ అంశంపై ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ జట్టుకు మలింగా లెజెండ్ అని, ఈ ఐపీఎల్లో మలింగ్ ఆడకపోవడం జట్టుకు ఇబ్బందేనని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా కొన్ని వ్యక్తిగత సమస్యలతో మలింగా అతని కుటుంబంతో గడపడం అత్యవసరమని పేర్కొన్నాడు. కాగా మలింగా స్థానంలో జట్టులో ఆడనున్న జేమ్స్ పాటిన్సన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ కుటుంబం వలె మేనేజ్మెంట్, జట్టు ఆటగాళ్లంతా సంతోషంగా ఉంటామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నాడు. కాగా గత ఐపీఎల్లో చెన్నైతో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన మలింగ, మెరుపు బౌలింగ్‌తో కేవలం ఒక పరుగు తేడాతో ముంబయి ఇండియన్స్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు. కాగా ఇప్పటి వరకూ 122 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ 19.80 సగటుతో ఏకంగా 170 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2019 సీజన్లో 12 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ,16 వికెట్లు పడగొట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. (చదవండి: నేను ఎందుకిలా?: లసిత్ మలింగా) -
అందుకే అట్లాంటిక్‌తో భాగస్వామ్యం
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 873 డాలర్ల వాటాను జనరల్ అట్లాంటిక్ సంస్థకు అమ్మి ఈ సంస్థతో భాగస్వామ్యం కావడంపై ఆయన తనయుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ఆకాశ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని భారతీయులంతా డిజిటల్ సాధికారత పొందేందుకు చేస్తున్న మా ప్రయత్నంలో జనరల్ అట్లాంటిక్ వంటి ప్రఖ్యాత గ్లోబల్ ఇన్వెస్టర్లు మాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. దీంతో మార్చి 2021కు ముందే రిలయన్స్ 20 బిలియన్ డాలర్ల నికర రుణాన్ని చెల్లించాలని పెట్టుకున్న గడువుకు ఈ నిధులు మద్దతు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) కాగా జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటేడ్ పెట్టుబడులను విస్తరించేందుకు అంబానీ ఎయిర్బిన్బీ ఐఎన్‌సీ, ఉబెర్ టెక్నాలీస్ల మొదటి పెట్టుబడుల సంస్థ అట్లాంటిక్‌కు 873 మిలియన్ డాలర్ల వాటాను అమ్మిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు 1.3 శాతం వాటాను తీసుకోవడానికి మరో విదేశీ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆమెరికా ఆధారిత సంస్థ అయిన ఈక్విటీ ఫండ్.. అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిజిటల్ సేవల కోసం 1.16 ట్రిలియాన్ డాలర్లు(68 బిలియన్ డాలర్ల) ఎంటర్పైజ్ విలువను నిర్థేశిస్తున్నట్లు ఆదివారం ముంబైకి చెందిన ఓ కంపెనీ తెలిపింది. అంతేగాక బ్లూమ్‌బర్గ్ న్యూస్ ద్వారా జనరల్ అట్లాంటిక్ సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. (2033 నాటికి ముకేశ్ సంపద.. లక్ష కోట్ల డాలర్లు!) కాగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.34 శాతం వాటా కోసం ఈక్విటీ సంస్థ, జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో నాలుగు వారాల్లో ఇది నాలుగో డీల్, ఈ నాలుగు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.67,195 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. జనరల్ అట్లాంటిక్ డీల్ పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లుగానూ ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. -
అంబానీ కుటుంబానికి ఐటీ నోటీసులు?!
సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను శాఖ రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకు షాకిచ్చినిట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం అంబానీ భార్య నీతా అంబానీ, వారి సంతానం అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలకు నోటీసులిచ్చింది. బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అనేక దేశాల నుండి వచ్చిన సమాచారంపై దర్యాప్తు జరిపిన తరువాత ఆదాయపు పన్ను శాఖ వీరికి నోటీసులు పంపింది. అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు అనేక దేశాల్లో విదేశీ ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం. 2019, మార్చి 28న ఆదాయ పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్తలపై దర్యాప్తు ప్రారంభించిన తరువాత 2011 లో, హెచ్ఎస్బీసీ జెనీవాలో 700 మంది భారతీయులకు ఖాతాలున్న వివరాలు భారత ప్రభుత్వానికి లభించాయి. 2015 లో, స్విస్ లీక్స్ గా పిలిచే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) హెచ్ఎస్బీసీ జెనీవా ఖాతాదారుల సంఖ్య 1,195 అని పేర్కొంది. 601 మిలియన్ డాలర్ల బ్యాలెన్స్‌తో 14 హెచ్ఎస్బిసి జెనీవా బ్యాంక్ ఖాతాల క్లస్టర్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఇవన్నీ అనేక మధ్యవర్తుల ద్వారా రిలయన్స్ గ్రూపుతో అనుసంధానించ బడ్డాయని తెలిపింది. ఈ 14 కంపెనీలలో ఒకదానిలో "అంతిమ లబ్ధిదారులు" గా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయనీ, వివిధ విదేశీ, దేశీయ సంస్థల ద్వారా ఈ సంస్థలలో భారీ మొత్తాన్ని ఎలా అనుసంధానించబడి, ఎలా పెట్టుబడి పెట్టారో ఐటి నివేదిక వెల్లడించినట్టు పేర్కొంది. ముంబైలోని అదనపు ఆదాయ కమిషనర్ ద్వారా బ్లాక్ మనీ (అప్రకటిత విదేశీ ఆస్తులు, ఆదాయం) టాక్స్ యాక్ట్ 2015, సెక్షన్ 10 లోని సబ్ సెక్షన్ (ఐ) ప్రకారం ఈ నోటీసులు లిచ్చినట్టు నివేదిక పేర్కొంది. ఖండించిన రిలయన్స్ మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి ఈ నివేదికలను పూర్తిగా ఖండించారు. అలాగే ఐటీ శాఖ నోటీసులేవీ తమకు అందలేదని పేర్కొన్నారు. -
కాలేజీలో మొదలై ఆకాష్ అంబానీ పెళ్లి వరకు అతడే..
హిమాయత్‌నగర్: ఆ యువకుడు మైక్ పట్టుకుంటే స్టేడియంలోని క్రీడాభిమానుల్లో జోష్ పెరగాల్సిందే. వేడుకల్లో వేసే పంచ్‌లకు అతిథులు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. కాలేజీలో జరిగిన చిన్న ఈవెంట్‌తో మొదలైన ప్రయాణం ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లిలో యాంకరింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. కాలేజీ క్రికెట్ కామెంట్రీనుంచి మొదలైన జర్నీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున యాంకరింగ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకునేంతగా ఎదిగాడు. అతడే ‘సన్నీ ఖండేల్వాల్’.. మన నగర యువకుడు. క్రికెటర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లో టెన్షన్‌గా ఉన్నప్పుడు వారికి నచ్చిన మ్యూజిక్‌ని ట్యూన్ చేస్తూ.. స్టెప్పులేస్తూ వారిని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ ‘ది ఫోర్త్ అంపైర్’గా గుర్తింపు పొందాడు మన సిటీ కుర్రాడు. నగరానికి చెందిన రమేష్ ఖండేల్వాల్, సీమ ఖండేల్వాల్ కుమారుడు సన్నీ ఖండేల్వాల్. అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్లో అక్షరాభ్యాసం చేసిన ఇతడు.. సెయింట్ మేరీస్‌లో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లో నుంచే మంచి యాంకర్ అవ్వాలనే అభిలాష ఇతడిలో పెరిగింది. కాలేజీలో జరిగే చిన్నా, చితకా పార్టీలు, ఈవెంట్లకు సన్నీనే యాంకరింగ్ చేసేవాడు. కొడుకులోని తపనను చూసిన తండ్రి.. భవిష్యత్‌లో యాంకరింగ్‌కు మంచి అవకాశం ఉంటుందని భరోసా ఇవ్వడంతో సన్నీ ఈవెంట్స్ కోర్సు కూడా చేశాడు. మిస్టర్ వలంటైన్ విన్నర్ ఏటా ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే ‘మిస్టర్ యూత్’ ప్రోగ్రాంకి కాలేజీ నుంచి సన్నీ పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోటీ పడగా ‘వీజే హంట్’ విభాగంలో, ‘స్టేజ్ అప్పీరెన్స్’లో సౌత్ ఇండియా–20గా నిలిచాడు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి ‘మిష్టర్ వలంటైన్’ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు మన హైదరాబాదీ. దుబాయ్‌లో సైతం.. దుబాయ్‌లో నిర్వహించే టీ–10 క్రికెట్ పోటీలకు సైతం సన్నీ యాంకరింగ్ చేస్తుడండం గమనార్హం. ఇందుకోసం అక్కడి నిర్వాహకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ యాంకర్లను ఆహ్వానించగా.. సన్నీ మాత్రమే ఎంపికయ్యాడు. దుబాయ్ లీగ్‌లో మన సన్నీ యాంకరింగ్ చూసిన అక్కడి అపర కుబేరుల్లో ఒకరైన రిజ్వాన్ నిజాన్ మంత్రముగ్ధుడై సన్నీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటా.. పాటా.. మాటలతో మైమరపించే సన్నీ ఖండేల్వాల్, ప్రొ కబడ్డీ పోటీల్లో సుస్మితాసేన్‌తో.. సచిన్‌నే మైమరిపించాడు మూడేళ్ల క్రితం నగరంలోని ఇనార్బిట్ మాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. ఆవేడుకను సన్నీనే యాంకర్. సచిన్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఈ ఈవెంట్‌కు పోటెత్తారు. వారందికీ ‘టైన్ టైంస్ సచిన్..సచిన్’.. అన్న నినాదాన్ని వారందరిలోకీ ఎక్కించాడు. సచిన్ వేదిక ఎక్కిన వెంటనే అభిమానులంతా ఒక్కసారిగా అదేవిధంగా స్పందించారు. ఆ కాంప్లిమెంట్‌కు ఫిదా అయిపోయాడు. ఐపీఎల్ సమయంలో యాంకరింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్‌ను గెలుపుదిశగా ప్రోత్సహిస్తున్న తనపై సచిన్ చూపించే అభిమానాన్ని వర్ణించలేనంటూ సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం పరిచాడు. సన్నీ ప్రొ కబడ్డీలోనూ అదే జోష్ చూపుతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు చెందిన కబడ్డీ టీమ్‌కి సన్నీ యాంకరింగ్ చేస్తూ తనకు మాత్రమే సొంతమైన చతురత.. చలోక్తులతో జట్టు సభ్యులను, యజమాని అక్షయ్ కుమార్ మన్ననలు అందుకున్నాడు. ఐపీఎల్‌లోకి అలా.. కాలేజీ ఈవెంట్లు, వేడుకల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సన్నీ.. ‘ఇండియన్ క్రికెట్ లీగ్’కు 2005–2006లో యాంకరింగ్ చేశాడు. ఇది చేస్తుండగా 2006లో ప్రారంభమైన ‘ఐపీఎల్’కి అనుకోకుండా యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. మూడేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్, అనంతరం పూణేకి ప్రాతినిధ్యం వహించాడు. వీటిలో సన్నీ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ ఆరో సీజన్‌కు యాంకరింగ్ చేసేందుకు ఆహ్వానించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌కు యాంకరింగ్ చేస్తూ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల కుటుంబానికి ‘సన్ని’హితుడిగా మారిపోయాడు. ఆకాష్ అంబానీ వివాహాన్ని ఎంత అట్టహాసంగా చేశారో దేశమంతా తెలిసిందే. ఆ పెళ్లిల్లో నీతూ అంబానీకి ఇష్టమైన ‘కృష్ణ రాసలీల’ గురించి తెలుసుకున్న సన్నీ.. ఆ థీమ్‌ను ‘ఎయిర్–వాటర్–ఎర్త్’ రూపంలో కళాకారులతో ప్రదర్శించి ఆ పెళ్లి వేడుకకు వచ్చిన అతిథుల దృష్టిలో నిలిచిపోయాడు. ‘ఈ ప్రదర్శనకు ముఖేష్, నీతూ అంబానీలు సైతం ఆశ్చర్యంతో పులకించిపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. -
రూ. 300 కోట్ల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్
ఆకాశమంత పందిరిలా సాగే కార్పొరేట్ వెడ్డింగ్‌లో ప్రతీ అంశమూ ప్రత్యేకంగానే నిలుస్తుంది. వెడ్డింగ్ కార్డులు దగ్గరినుంచి, సంగీత్, బారాత్‌లంటూ పెళ్లి దాకా సాగా హడావిడి ఇంతా అంతా కాదు. ఈనేపథ్యంలోనే రిలయన్స్ కుటుంబం కొత్త కోడలికి ఇచ్చిన భారీ కానుక ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అక్షరాలా 300 కోట్ల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్‌ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తన కొత్త కోడలు శ్లోకా మెహతాకు కానుకగా ఇచ్చారు. నిజానికి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట మొదట నీతా అంబానీ. కానీ సమయానికి తగ్గట్టుగా మనసు మార్చుకున్న నీతా దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారట. అందుకే అత్యంత విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ గిఫ్ట్‌గా అందించారట. తనెంతో ఇష్టంగా చేయించిన వజ్రాల హారాన్ని శ్లోకా మెడలో అలంకరించి నీతా ముచ్చట పడిపోగా, అటు అత్తగారిచ్చిన ప్రేమ పూర్వక కానుకతో శ్లోకా కూడా అంతే మురిసిపోయారట.. వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు మార్చి తొమ్మిదిన ముంబైలో అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram #akashambani #akashloka #shlokamehta #ishaambani #anantambani #anandpiramal #radhikamerchant #nitaambani #neetaambani #mukeshambani #kokilabenambani #akustoletheshlo #ambani #ambaniwedding #ambaniengagement #weddingcelebrations #weddingbells #wedmegood #weddingoftheyear #indianwedding #bridesofindia #sabyasachibride #weddingdecor #engagementdecor #floraldecor #engagement #weddingsutra A post shared by Shloka_Akash_Ambani (@shloka_akash_ambani) on Mar 19, 2019 at 9:43pm PDT -
ఇక చాలు.. ఆపేయండి!
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, అబ్రామ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మిషా కపూర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అందుకే ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు కెమెరా కన్నును క్లిక్‌మనిపిస్తారు . ఇక పేరెంట్స్‌తో కలిసి బుల్లి స్టార్స్ కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ తతంగమంతా బచ్చన్ల రాజకుమారి ఆరాధ్యకు విసుగు తెప్పించింది. మాటిమాటికీ ఫోజులివ్వమని అడగటమే కాకుండా వెనుక నుంచి కూడా తనను ఫొటోలు తీయడానికి ప్రయత్నించడంతో ఫొటోగ్రాఫర్లకు క్యూట్ కౌంటర్ ఇచ్చింది. అసలు విషమయేమిటంటే.. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతాల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు సహా దాదాపు బాలీవుడ్ తారగణమంతా తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి రిసెప్షన్ వేడుకకు తల్లిదండ్రులు ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్‌లతో కలిసి ఆరాధ్య బచ్చన్ కూడా హాజరైంది. ఇందులో భాగంగా ఫొటోలు దిగే క్రమంలో నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే పదే పదే సేమ్ పొజిషన్లో ఉండాలని చెప్పడం, స్టేజ్ దిగుతున్న క్రమంలో కూడా ఫొటోలు తీయడంతో చిర్రెత్తుకొచ్చిన ఆరాధ్య.. ‘ఇక చాలు.. ఆపేయండి’ అంటూ ఫొటోగ్రాఫర్లకు స్వీట్ షాక్ ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. View this post on Instagram #Bachchan Family at #AkashAmbani Shloka Mehta’s Wedding Reception . . . #Aishwarya #aishwaryarai #aishwaryaraibachchan #abhishekbachchan #amitabhbachchan #ranbirkapoor #anushkasharma #deepikapadukone #priyankachopra #katrinakaif #sonamkapoor #jacquelinefernandez #salmankhan #aliabhatt #shahrukhkhan #shraddhakapoor #longines #ranveersingh #bollywood #magezine #pinkvilla #bollywoodstyle #TBWORLD2018 #بالیوود #بالیوود_ایران #تبلیغات #بالیوود_پارس #آیشواریا_رای A post shared by Aishwarya Rai Queen (@aishwarya_rai_queen) on Mar 10, 2019 at 12:02pm PDT -
ఘనంగా ఆకాశ్, శ్లోకా వివాహం
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. అంగరంగా వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జరిగిన భరాత్‌లో ముఖేశ్ భార్య నీతాతో పాటు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లాలు సందడి చేశారు. రాత్రి 8.15 గంటల తర్వాత వివాహ కార్యక్రమం మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీబ్లేయర్ దంపతులు, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ వేడుకల్లో రజనీకాంత్, ప్రియాంక్ చోప్రా, ఐశ్వర్య రాయ్, అభిషేక్, అమితాబ్, అమీర్ ఖాన్ , రతన్ టాటా, సచిన్, టైగర్ ష్రాప్, దిశా పటాని, కియరా అద్వానీ, జాన్వీ కపూర్, విద్యాబాలన్, అలియా భట్, పాండ్యా సోదరులు, యువరాజ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, గతేడాది ముఖేశ్ కుతూరు ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమల్‌తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
అంబానీ ఇంట పెళ్లి సందడి
-
ఆ పెళ్లికి అతిరథ మహారథులు
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా వివాహ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 9వ తేదీ శనివారం, రాత్రి ) ఆకాశ్, శ్లోకా మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లి సందడి ముంబై జియో టవర్స్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకుకు దేశ విదేశాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులతో పాటు, హితులు, సన్నిహితులు, బంధు మిత్రులతో పెళ్లి వేడుక కళకళలాడుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖేశ్, నీతా అంబానీ దంపతులతో పాటు, వరుడు ఆకాశ్ అంబానీ .. ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ వివాహానికి ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు, కోకిలా బెన్ అంబానీ సందడి చేస్తుండగా, పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రముఖులు ఇప్పటికేవివాహ వేదికకు తరలి వచ్చారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమతి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, టోనీబ్లేయర్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. View this post on Instagram Amazing decor 👍👍👍👍#akashambani #shlokamehta wedding ❤️#bigfatindianwedding #desibride #weddingoftheyear @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 9, 2019 at 2:48am PST -
ఆకాశ్, శ్లోకా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ , శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. స్విస్‌లోని సెయింట్ మోర్తిజ్ వేదికగా మూడు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగాయి. ఈ వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులు ఆకాశ్-శ్లోకా గుర్రపు బండిలో కాసేపు ఊరేగుతూ వేదికకు చేరుకుని అందర్నీ అలరించారు. బాణా సంచావెలుగులతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. సుమారు 850 మంది అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు రణ్‌బీర్ కపూర్,అలియా భట్ తోపాటు లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ఇంకా కరణ్ జోహార్, పింకీ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లూనా పార్క్‌లో ప్రత్యేక వినోద కార్యక్రమాలతోపాటు అతిథుల సౌకర్యార్థం హోటల్ మోర్టిజ్లోని అత్యంత విలాసవంతమైన గదులను బుక్ చేశారట. కాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం మార్చి 9న ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే. View this post on Instagram Firecracker show done right! 💯 #ambanipreweddingcelebrations A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 9:40pm PST View this post on Instagram Yet another video of the fireworks last night to prove the grandeur of the event! 💥 A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 11:39pm PST View this post on Instagram Ranbir Kapoor blesses the Couple Of The Hour - Akash & Shloka! 💜 A post shared by AkashWedsShloka (@akashwedsshloka) on Feb 25, 2019 at 12:06pm PST -
వైరల్: ఆకాశ్ అంబానీ పెళ్లి పత్రిక
-
ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా..!
ముంబై: ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ బహుశా ప్రస్తుతం ఇలాంటి పాటలనే అంబానీ కుటుంబ సభ్యులు పాడుకుంటున్నారనుకుంటా. ఎందుకంటే అంబానీ ఇంట వివాహమంటే అందరిలోనూ భారీగానే అంచనాలే ఉంటాయి. దీంతో ఆహ్వాన పత్రికల నుంచి మొదలు వివాహ వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి పందిరి, సంగీత్, మెహందీ, వివాహ వేడుకలు ఇవన్నీ వార్తల్లో నిలిచేవే. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతాల గారాల పట్టి ఈశా వివాహ వేడుకలను జనం మరువకముందే మరో వేడుకకు అంబానీ కుటుంబం సిద్దమైంది. ఆకాశ్ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చి 9న జియో వరల్డ్ సెంటర్ వేదిక జరగనున్న విషయం తెలిసిందే. (అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!) ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలు కాగా.. అతిథులను ప్రత్యేకంగా పిలిచే పనిలో పడ్డారు. ఇక తొలి వివాహ ఆహ్వాన పత్రికకు సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే వీరి పెళ్లి పత్రికకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఇప్పడు దానికి సంబంధించి మరో వీడియో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత గ్రాండ్ డిజైన్ చేసిన ఈ పత్రికలో ముఖేశ్-నీతా అంబానీలు స్వహస్త్రాలతో రాసిన లేఖ తొలుత దర్శనమిస్తుంది. అనంతరం వివాహానికి సంబంధించిన వివరాలు, అతిథలుకు ఇచ్చే బహుమతులు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటాయి. దీంతో ఈ పత్రిక చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా.. ఆ మాత్రమైనా ఉండాలి’ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. (అంబానీ ఇంట వివాహం : స్టాలిన్‌కు ఆహ్వానం) -
ముఖేష్ అంబానీతోనే స్టెప్పులేయించింది
ముంబై : అంబానీల ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. మొన్నటివరకూ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకలతో బిజీగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబం మరో పెళ్లి వేడుకకు సిద్ధమవుతోంది. నీతా అంబానీ - ముఖేష్ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి పనులు షూరు అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో.. ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం జరిగింది. మార్చి 9నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుక పనులు చకచక జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. ఇషా అంబానీ పెళ్లి చేసుకుంది.. మరికొద్ది రోజుల్లో ఆకాశ్ అంబానీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి అనంత్ అంబానీ మీద పడిందట. నువ్వేప్పుడు పప్పన్నం పెడతావని అనంత్‌ను అడుగుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో అనంత్ అంబానీ గర్ల్ ఫ్రెండ్ రాధిక మర్చంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ పెళ్లిలో తీసిన ఈ వీడియోలో ఇషా, అనంత్ అంబానీలు డోలు వాయిస్తుండగా.. అందుకు అనుగుణంగా ముఖేష్ అంబానీ, రాధిక మర్చంట్ డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మామాకోడళ్ల అనుబంధం బాగానే ఉంది.. త్వరలో మీరు కూడా పెళ్లి పీటలు ఎక్కండి.. ఓ పనైపోతుంది’ అంటున్నారు నెటిజన్లు. -
అంబానీ ఇంట వివాహం : స్టాలిన్‌కు ఆహ్వానం
సాక్షి, చెన్నై : ఆసియా కుబేరుడు, రిలయన్స్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబరులో పిరమిల్ గ్రూపు వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా మూడు నెలలకు తర్వాత.. వచ్చేనెల( మార్చి) 9న ముఖేష్-నీతా అంబానీల తనయుడు ఆకాశ్ అంబానీ వివాహం జరగనుంది. వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, అంబానీ ఇంటి కోడలుగా వెళ్లనుంది. మార్చి 9నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుక పనులు చకచక జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వివాహానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముఖేష్ దంపతులు అతిథులను ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. (అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!) సోమవారం సాయంత్రం తొలి శుభలేఖను ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో అందించిన ముఖేష్ దంపతులు.. అదే రోజు చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్‌ను కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ముఖేశ్ దంపతుల నుంచి ఆహ్వానం అందడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ వారితో ఉన్న కొన్ని ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు It was a pleasure to receive a courtesy call from Thiru Mukesh Ambani, Chairman Reliance Industries Limited, in Chennai earlier this evening. pic.twitter.com/acjKFLjzX9 — M.K.Stalin (@mkstalin) February 11, 2019 -
అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!
ముంబై : ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ తేదీ ఖరారైంది. ఆకాశ్ అంబానీ- వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా నిశ్చితార్థం గతేడాది జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెల(మార్చి) 9 నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్ సెంటర్ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్- శ్లోకాల వివాహ ఆహ్వాన మొదటి పత్రికను గణనాథుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబరులో పిరమిల్ గ్రూపు వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ఇషా- ఆనంద్‌ల వివాహ ఆహ్వాన తొలి పత్రికను కూడా ఇక్కడే ఉంచి పూజలు నిర్వహించారు. -
ఇషా ఎంగేజ్మెంట్లో రాధిక కూడా!!
భారతీయ కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా, ఇషా- ఆనంద్ పిరమాల్‌ల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక అంబానీ ఫ్యామిలీలో చిన్నవాడైన అనంత్ అంబానీ కూడా వివాహానికి సిద్ధమైనట్టుగానే కన్పిస్తోంది. యాంకర్ హెల్త్‌కేర్ సీఈవో, వైస్ చైర్మన్ విరైన్ మెర్చంట్ కూతురు రాధికా మర్చంట్‌తో అనంత్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అంబానీ ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అయితే లోకో కోమోలో జరిగిన ఇషా ఎంగేజ్మెంట్లో వీరిద్దరు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో వీరి రిలేషన్ నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ఇషా ఎంగేజ్మెంట్ వేడుకలో.. ఇషా చేయి పట్టుకుని ముఖేశ్ అంబానీ ఆనంద్ దగ్గరికి తీసుకువస్తున్న సమయంలో.. ఆయన వెనుకే నడుస్తున్న ఆకాశ్ అంబానీ కాబోయే భార్య శ్లోకా మెహతా చేయి పట్టుకుని నడుస్తుండగా.. అనంత్ రాధిక చేయి పట్టుకుని నడుస్తున్నాడు. దీంతో అనంత్- రాధికల ప్రేమకు కూడా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా లోకో కోమోలో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీలో ఇషా పీచ్ కలర్ డిజైనర్ గౌన్‌లో మెరిసిపోగా.. ఆనంద్ పిరమాల్ గ్రీన్ కలర్ షేర్వానీలో వెలిగిపోయారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకకు సోనమ్ కపూర్ దంపతులు, ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కరణ్ జోహర్, మనీష్ మల్హోత్ర వంటి బాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు. View this post on Instagram #IshaAnandEngagement In #LakeComo #Italy. #IshaAnand A post shared by salil sand (@salilsand) on Sep 22, 2018 at 12:13pm PDT -
ఆ వేడుకలో బాలీవుడ్ చిందులు
మొన్నామధ్య సోనమ్ కపూర్ పెళ్లితో బాలీవుడ్ దద్దరిల్లింది. తారాగణం అంతా కదిలివచ్చి పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యాపారదిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివాహ వేడుకకు హాజరై సందడిచేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా ప్రీ వెడ్డింగ్ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్ చేసిన డ్యాన్స్‌లు వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లు హైలెట్‌గా నిలిచారు. ఈ కార్యాక్రమానికి ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, టైగర్ ఫ్రాఫ్, కరణ్ జోహార్, విద్యాబాలన్, మాధురి దీక్షిత్, అలియాభట్ ఇలా భారీ తారాగణం విచ్చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలు చిన్ననాటి స్నేహితులు. శ్లోకా మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారంలో పేరుగాంచినవారన్న సంగతి తెలిసిందే. ఈ నూతన జంట ఈ ఏడాది చివరికల్లా పెళ్లిబంధంతో ఒక్కటవ్వనున్నారు. -
అంబానీ ఇంట హోరెత్తిన పెళ్లి సంబరాలు
-
ఘనంగా ఆకాశ్ నిశ్చితార్థం
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, బాలీవుడ్, క్రీడ, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, మనోజ్ సిన్హా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (కుటుంబ సమేతంగా), ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, మాజీ ఎంపీ ప్రియాదత్ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపార రంగం నుంచి రతన్ టాటా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కోటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్, ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ముంబైలో వధువు శ్లోక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ (భార్య గౌరీతో కలిసి), రేఖ, అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్, విద్యా బాలన్, మాధుర్ భండార్కర్, విదూ వినోద్ చోప్రా, జావెద్ అక్తర్‌లు క్రీడా రంగం నుంచి సచిన్, హర్భజన్, జహీర్ ఖాన్ తదితరులు ఈ నిశ్చితార్థ కార్యక్రమం విందుకు హాజరయ్యారు. వీరి పెళ్లి డిసెంబర్లో జరగొచ్చని తెలుస్తోంది. -
ఆకాశ్, శ్లోకల ప్రీ-ఎంగేజ్మెంట్లో నీతా అంబానీ డ్యాన్స్
-
ఆకాశ్-శ్లోకా మెహతాల మెహందీ ఫంక్షన్
-
నీతా అంబానీ డ్యాన్స్ వీడియో వైరల్
ముంబై : బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాల నిశ్చితార్థపు ముందస్తు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రేపు(శనివారం) సౌత్ ముంబైలోని అంటిలియాలో ఉన్న అంబానీ 27 అంతస్తుల భవనంలో వీరి నిశ్చితార్థపు వేడుకను అంబానీ ఫ్యామిలీ ఘనంగా నిర్వహించబోతోంది. ఈ నిశ్చితార్థానికి ముందస్తుగా జరుగుతున్న వేడుకలకు ఫిల్మ్ ఇండస్ట్రికి చెందిన షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్లు హాజరయ్యారు.షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్‌తో ఈ పార్టీకి హాజరు కాగ, సచిన్ తన సతీమణి అంజలితో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు. అంతేకాక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న ప్రియాంక చోప్రా, తన బాయ్‌ఫ్రెండ్ అమెరికా సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ఈ ప్రీ-ఎంగేజ్మెంట్ పార్టీలో తళుక్కున మెరిశారు. బుధవారం అంబానీ హౌజ్‌లో జరిగిన మెహందీ వేడుకతో ఈ ప్రీ-ఎంగేజ్మెంట్ పార్టీలు ప్రారంభయ్యాయి. ఆకాశ్, శ్లోకాలకు అంబానీ గారాల పట్టి, ఆ ఇంటి ఆడబిడ్డ ఇషా అంబానీ హారతి పడుతున్న వీడియోను సైతం ట్విటర్లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. అంతేకాక కొడుకు నిశ్చితార్థపు సంబురాల్లో నీతా డ్యాన్సులతో అలరించారు. ఆకాశ్ అంబానీ కూడా తన కాబోయే భార్య శ్లోకాతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఘనంగా ప్రి ఎంగేజ్మెంట్ పార్టీ
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ప్రి ఎంగేజ్మెంట్ పార్టీ గురువారం రాత్రి ముంబైలోని ముకేశ్ నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు షారూక్ ఖాన్ దంపతులు, రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్, విదూ వినోద్ చోప్రా, ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ దంపతులు తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్‌తో కలసి వచ్చారు. (అంజలి, సచిన్ తెందూల్కర్ , గౌరి, షారుఖ్‌ఖాన్ , ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ) -
అట్టహాసంగా ఆకాశ్, శ్లోకాల మెహందీ ఫంక్షన్
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాల మెహందీ వేడుక ముంబైలోని అంబానీ రెసిడెన్సీలో బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ దిగ్గజాలు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల మెహందీ వేడుకకు చెందిన ఓ ఫోటోను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వేడుకలో ప్రియాంక ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిలియాని డిజైన్ చేసిన తెలుపు రంగు చీరను కట్టుకుని తళుక్కుమని మెరిసారు. ‘కంగ్రాట్యులేషన్స్ ఆకాశ్, శ్లోకా! ఈ వేడుకు ఎంత అద్భుతంగా ఉంది. లవ్ యూ బోత్. ప్రీ, ప్రీ.. ఎంగేజ్మెంట్ పార్టీ’ అనే క్యాప్షన్‌తో ప్రియాంక ఈ ఫోటోను షేర్ చేశారు. త్వరలోనే ప్రియాంక చోప్రా కూడా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆకాశ్, శ్లోకాల మెహందీ వేడుకకు చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో నేవి బ్లూ టాప్, హెవీ ఎంబ్రాయిడ్తో క్రీమ్ లెహంగాలో శ్లోకా ముసిముసి నవ్వులతో మెరిసిపోగా.. ఆకాశ్ తెల్లటి కుర్తాతో సింపుల్‌గా కనిపించాడు. గుండ్రటి చెవిదిద్దులు, పింక్ లిప్స్‌తో శ్లోకా మెరిసిపోయింది. ప్రియాంకతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, కిరణ్ రావులు పాల్గొన్నారు. శనివారం వీరి ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతుంది. ఈ నిశ్చితార్థపు ఆహ్వానాలను కూడా అంబానీ ఫ్యామిలీ జూన్ మొదటి వారంలోనే అందరికీ అందించింది. రెండు నెలల క్రితమే శ్లోకా, ఆకాశ్‌ల పెళ్లి నిశ్చియమైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి నిశ్చియమైన కొన్ని రోజులకే, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైంది. వీరి ఫోటోలు, అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన పార్టీల ఫోటోలు అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగ, శ్లోకా మెహతా డైమాండ్ వ్యాపారి రస్సెల్ మెహతా, మోన మెహతాల కూతురు. రోజీ బ్లూ డైమాండ్స్‌ను వీరి కుటుంబం నిర్వహిస్తోంది. -
శ్లోకాకు ఆకాశ్ ఎలా ప్రపోజ్ చేశాడంటే...
దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. జూన్ 30న ఆకాశ్ అంబానీ, శ్లోకాకు అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ప్రయాణం మొదలైన రోజు నుంచి ఆకాశ్ - శ్లోకా ఫోటోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోన్నాయి. అయితే ఇంతకూ ఆకాశ్ శ్లోకాకు ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా...? ఆకాశ్ - శ్లోకా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులనే సంగతి తెలిసిందే. అయితే గత మార్చి 24న ఆ స్నేహబంధం కాస్తా ప్రేమ బంధంగా మారింది. మార్చి 24న గోవాలో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీకి ముఖేశ్ అంబాని, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్‌తో పాటు మరికొందరు దగ్గరి స్నేహితులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో...సూర్యుడు అస్తమిస్తుండగా...తన మనసులో ఉదయించిన ప్రేమను ఆకాశ్ తన చిన్న నాటి నేస్తం శ్లోకాకు తెలియజేసాడు. ఆ తర్వాత ఇంకేముంది...శ్లోకాతోపాటు కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడం...పార్టీ చేసుకోవడం అంతా మాయాలా జరిగిపోయాయంటున్నాడు ఆకాశ్. అన్నట్లు ఆ సమయంలో శ్లోకా కుంటుంబం కూడా అక్కడే ఉంది. ఈ నెల 30న ఆకాశ్ - శ్లోకాల నిశ్చితార్థపు వేడుక అంబానీల నివాసం అంటిల్లాలో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
ఎంగేజ్మెంట్ హోస్ట్‌గా స్టార్హీరో?
ముంబై : దేశీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. తమ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీకి, రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాకు త్వరలోనే వివాహం జరిపించబోతున్నారు. వీరి పెళ్లితో పాటు, అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైపోయింది. దీంతో అంబానీ కుటుంబమంతా పెళ్లి పనులతో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ, శ్లోకాకు జూన్ 30న అధికారికంగా నిశ్చితార్థపు వేడుకను నిర్వహించబోతున్నారు. అంబానీ రెసిడెన్సీలోని అంటిల్లాలో ఈ వేడుక జరుగబోతుంది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కదలి రాబోతున్నారు. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థపు వేడుకకు హోస్ట్‌గా నిర్వహించబోతున్నారని అంబానీ సన్నిహిత వర్గాలు చెప్పాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు రాబోతున్న ఈ ఈవెంట్‌కు, కింగ్ ఖాన్‌ను మించిన హోస్ట్ మరెవరూ ఉండరని పలువురంటున్నారు. బాలీవుడ్‌లోని ఫ్రెండ్స్‌తో కలిసి, ఈ కపుల్ స్టేజీపై చిందులు కూడా వేయబోతున్నారట. కాగ, ఈ ఏడాది మార్చి 24న రోజి బ్లూ డైమాండ్స్ రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాకు ఆకాశ్ లవ్ ప్రపోజ్ చేయడం, ఆమె అంగీకరించడం జరిగింది. ఆ అనంతరం అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చింది. శ్లోకా, ఆకాశ్‌లు చిన్ననాటి స్నేహితులు. రస్సెల్, మోనా మెహతాలకు శ్లోకా చిన్న కూతురు. -
వినూత్నంగా ఆకాశ్, శ్లోకాల పెళ్లి కార్డు
-
అదరగొడుతున్న ఆకాశ్, శ్లోకాల పెళ్లి కార్డు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, డైమాండ్ వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను మనువాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం అధికారికంగా ఈ నెల 30న ముంబైలో 39 అట్లామౌంట్ రోడ్లో జరుగబోతోంది. మరోవైపు వీరి పెళ్లి కూడా డిసెంబర్లో జరుగబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన కార్డు తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డు అంబానీ ఫ్యామిలీ స్థాయిని మించి ఉంది. ఆకర్షణీయమైన తెల్లటి రంగు బాక్స్.. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే చిన్న ఆలయం.. గ్లాస్ డోర్‌తో ఉన్న ఆ ఆలయంలో, అన్ని శుభకార్యాలకు ఫలప్రదమైన వినాయకుడి విగ్రహం ఉన్నాయి. ఆ చిన్ని ఆలయంపైనే ఆకాశ్, శ్లోకాల వెడ్డింగ్ కార్డు ఉంది. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కూడా ఆన్లైన్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం వివాహ ఆహ్వాన పత్రిక ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థానికి అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో ఆమె బుధవారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. నిశ్చితార్థపు తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక కూడా గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఆకాశ్, శ్లోకా నిశ్చితార్థం ; తొలి ఆహ్వానం ఎవరికంటే..
ముంబై : దేశీ కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల పెళ్లి గురించి ప్రతి విషయం వైరల్‌గా మారుతుంది. మార్చిలోనే గోవాలో వీరి నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖేశ్ దంపతులు తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు. కాగా వీరి నిశ్చితార్థ వేడుకను అధికారికంగా జూన్ 30న ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో జరపనున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ తాజాగా ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ముఖేశ్ సతీమణి నీతా అంబానీ అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె... తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఆకాశ్ అంబానీ, శ్లోకా ఆహ్వాన పత్రిక..
-
ఆకాశ్, శ్లోకా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్, వైరల్
ముంబై : అంబానీ ఫ్యామిలీలో ఏది జరిగినా స్పెషలే. ఇక కూతురు, కొడుకుల వివాహమంటే ఏ రేంజ్లో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి అంగరంగ వైభవంగా.. అతిథులకు కళ్లు జిగ్గేల్లామనేలా ఆనందంలో ముంచేస్తుంది. ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ వివాహం, తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతతో నిశ్చియమైంది. ఆకాశ్‌తో పాటు అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో జరుగబోతోంది. వీరి వివాహాలను ధృవీకరించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే గ్రాండ్‌గా పార్టీలు కూడా చేసింది. తాజాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ అధికారికంగా చేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఈ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని అంబానీ ఫ్యామిలీ ఎంతో అట్టహాసంగా రూపొందించింది. జూన్ 30న శనివారం ముంబైలోని 39 అట్లామౌంట్ రోడ్లో నిశ్చితార్థపు వేడుక ఉంటుందని, తమ ప్రియమైన వారందరూ హాజరుకావాలంటూ అంబానీ ఫ్యామిలీ తన కొడుకు నిశ్చితార్థానికి ఆహ్వానిస్తోంది. ఆకాశ్, శ్లోకాల వివాహం చేయాలని నిర్ణయించిన అనంతరం, బాలీవుడ్ నటీనటులకు, సెలబ్రిటీలకు, ఆకాశ్, శ్లోకాల స్నేహితులకు ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. తాజాగా నిశ్చితార్థాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలోనే పెళ్లి తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. డైమాండ్ వ్యాపారి రస్సెల్, మోనా మెహతాల కూతురే శ్లోకా మెహతా. ఆకాశ్, శ్లోకాలు ఎంతో కాలంగా స్నేహితులు కావడం విశేషం. -
రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగ నియామకాలు
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారీగా ఉద్యోగాల నియామకాలకు తెరతీసింది. ఈ ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను జియో చేపడుతోంది. ఈ నియామకాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో నిపుణులైన ప్రొఫిషనల్స్‌ను జియో నియమించుకోవడం ప్రారంభించింది. జియో నియమించుకునే ఈ ఏఐ టీమ్ ఆకాశ్ అంబానీ నేతృత్వంలో పనిచేయనున్నారని మింట్ రిపోర్టు చేసింది. ఈ ఏఐ టీమ్‌ను నిర్మించడానికి జియో కొంతమంది సీనియర్ అధికారులను నియమించిందని, బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ఈ టీమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని తెలిపింది. ఆకాశ్ అంబానీ ఈ టీమ్‌పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తన భుజాలపై వేసుకున్నారని జియో అధికారులు చెప్పినట్టు రిపోర్టు కోడ్ చేసింది. ఏఐతో పాటు బెంగళూరులో మిగత నియామకాల ప్రక్రియను కూడా జియో ప్రారంభించింది. మిషన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే వారిని కంపెనీ తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75 వేల నుంచి 80 వేల మందిని నియమించుకోనున్నామని జియో చీఫ్ హ్యుమన్ రిసోర్సస్ ఆఫీసర్ సంజయ్ జాగ్ కూడా చెప్పారు. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, దీనిలో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లు కూడా ఉన్నట్టు జాగ్ చెప్పారు. ‘రిలయన్స్ రెడీ’అనే దాని కోసం కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సహకారంతో కూడా నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రిఫెరల్స్ ద్వారా 60 శాతం నుంచి 70 శాతం నియమిస్తున్నామని, తమ రిక్రూట్మెంట్ ప్లాన్‌లో కాలేజీలు, ఎంప్లాయీ రిఫెరల్స్ ప్రధాన భాగాలని జాగ్ చెప్పారు. -
ఇషా కోసం ఆకాశ్ అంబానీ భావోద్వేగ ప్రసంగం
-
ఆకాశ్ అంబానీ భావోద్వేగ ప్రసంగం : వైరల్
ముంబై : బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్మెంట్ పార్టీని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్‌గా షేర్ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీ, తండ్రి ముఖేష్‌తో ఇషా వేసిన స్టెపులు, బాలీవుడ్ దిగ్గజాలతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో మంచి వ్యూస్‌ను సంపాదించుకుంటున్నాయి. తాజాగా అంబానీ బ్రదర్లు ఆకాశ్, ఆనంత్లు సోదరి ఇషా, బావ ఆనంద్‌తో కలిసి ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆకాశ్ అంబానీ తన సోదరి ఇషా కోసం భావోద్వేగ ప్రసంగాన్ని ఇచ్చారు. అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ఆయన ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా వివరించారు. ఇషా అంబానీ ఎంగేజ్మెంట్ పార్టీలో ఆకాశ్ ఈ ప్రసంగమిచ్చారు. అంతకముందు ఇషా అంబానీ కూడా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థ సమయంలో తన కాబోయే వదినను ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. కొన్ని రోజుల క్రితమే ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థం కూడా జరిగింది. కుదిరితే ఈ ఇరు జంటల వివాహం ఒకేసారి అంబానీ కుటుంబం నిర్వహించనుంది. కవలలైన ఇషా, అంబానీల పెళ్లిళ్లు నిశ్చయమవడంతో, అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కాగా, ఇషాకు ఎంతో కాలంగా స్నేహితుడైన ఆనంద్, మహాబలేశ్వరం ఆలయంలో ఆమెకు ప్రపోజ్ చేయగా, ఇషా అంగీకరించడం... అనంతరం ఇరు కుటుంబాలు కలిసి ఎంగేజ్మెంట్ పార్టీ నిర్వహించడం జరిగింది. -
అంబానీ కోడలు సంపదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టబోతోంది. ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను త్వరలోనే పరిణయం ఆడబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్లోకా మెహతా గురించి ఫినాప్ రిపోర్టు పలు ఆసక్తికర విషయాలను నివేదించింది. శ్లోకా మెహతా సంపద, ఆమె ఇప్పటి వరకు చేపట్టిన బాధ్యతలు అన్నింటితో ఒక రిపోర్టు నివేదించింది. ఈ రిపోర్టులో శ్లోకా మెహతాకు రూ.120 కోట్ల నికర సంపద ఉన్నట్టు తెలిపింది. ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ కార్లను ఆమె కలిగి ఉన్నారని, వీటిలో మినీ కాపర్, మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ వంటి కార్లు ఉన్నాయని పేర్కొంది. ఇటీవలే ఆమె రూ.4 కోట్ల విలువైన బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేసిందని రిపోర్టు చేసింది. గత కొన్నేళ్లుగా శ్లోకా మెహతా సంపద 23 శాతానికి పైగా పెరిగినట్టు తెలిపింది. శ్లోకా మెహతా తండ్రి రస్సెల్ మెహతా, రోజీ బ్లూ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్. రోజి బ్లూ అనే సంస్థ డైమాండ్ కటింగ్, పాలిషింగ్, ట్రేడింగ్ కంపెనీ. భారత్‌లో ఈ కంపెనీ చాలా బలమైనదిగా ఉంది. భారత్‌తో పాటు రోజీ బ్లూ సంస్థ యూఏఈ, ఇజ్రాయిల్, బెల్జియం, అమెరికా, జపాన్, హాంకాంగ్, చైనాలలో కూడా తన కార్యకలాపాలను సాగిస్తోంది. 1960 నుంచి రస్సెల్ మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సంస్థ క్లీన్ క్రెడిట్ హిస్టరీనే కలిగి ఉంది. శ్లోకా మెహతా రస్సెల్ మెహతా, మోనా మెహతాలకు చిన్న కూతురు. ఆమె సోదరుడు విరాజ్ నిషా సేథ్‌ను పెళ్లి చేసుకున్నారు. నిషా సేథ్ గ్రేట్ ఈస్టరన్ షిప్పింగ్ ఫ్యామిలీకి చెందిన ఆమె. సోదరి దియా ఆయుష్ జతియా, హార్డ్‌క్యాసిల్ రెస్టారెంట్ల కొడుకు అమిత్ జతియాను గతేడాది వివాహమాడారు. 2014లో శ్లోకా మెహతా రోజీ బ్లూ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇది రోజీ బ్లూ గ్రూప్ కంపెనీకి చెందిన దాతృత్వ సంస్థ. ఎన్జీఓలను, వాలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కనెక్ట్‌ఫర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. పెళ్లి చేసుకోబోతున్న ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాలు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుకున్నప్పటి నుంచే వీరిద్దరికి పరిచయం ఉంది. అంబానీ, మెహతా కుటుంబాల మధ్య కూడా అనుబంధం ఉంది. ఒకరి ఇంట్లో జరిగే వేడుకలకు మరొకరు హాజరయ్యేవారు. ఆ విధంగా నీతా, ముఖేష్ అంబానీలకు శ్లోకా నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచి తెలుసు. చదువుల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే శ్లోకా ఇంటర్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ స్కూలు నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. -
వారిద్దరి ప్రేమ.. ఓ పద్య రూపంలో
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. ముఖేష్ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కూతురు శ్లోక మెహతా వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య మార్చి 24న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే అంబానీ కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్న శ్లోక మెహతకు నీతా అంబానీ, ఇషా అంబానీ ప్రత్యేక రీతిలో ఆహ్వానం పలికారు. కాబోయే వధూవరులను ఉద్దేశిస్తూ.. వారి అపురూపమైన ప్రేమను తెలుపుతూ నీతా అంబానీ ఏకంగా ఓ పద్యమే రాశారు. ‘ఏబీసీడీలు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లారు. అప్పట్లో వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలీదు. చిన్నప్పుడు వారు తిన్న జెల్లీ బీన్స్, చాకొలెట్స్ వారి జీవితాలను మధురంగా మార్చాయి. చిన్నప్పుడు వేసుకున్న పోనీటెయిల్స్, ఆడుకున్న బార్బీ బొమ్మలు, చిన్న చిన్న గొడవలు..ఇవన్నీ జరిగి ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు ఇద్దరూ పెద్దవారయ్యారు. వారికళ్లలో ప్రేమ దాగి ఉంది. ఇద్దరి హృదయాలు ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అన్న ఒక్క మాటే కోరుకుంటున్నాయి. వారిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడూ ఒకరికొకరు ఇలా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ నీతా ఈ పద్యాన్ని రాశారు. అటు ఇషా అంబానీ కూడా ఆకాశ్-శ్లోక ఎంగేజ్మెంట్ రోజు హృదయాన్ని హత్తుకునే మెసేజ్‌ను తన వదినకు అందించారు. ‘ఈ రోజు మొత్తం హృదయాలకు సంబంధించింది. శ్లోకా ఓ హృదయం, ఆకాశ్ ఓ హృదయం. ఇది హృదయాలకు సంబంధించిన వేడుక. నేను, అనంత్ మీ వివాహం జరగబోతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు కలిగినంత సంతోషం ఇదివరకెప్పుడూ కలగలేదనుకుంటా. వదిన రూపంలో నాకు సోదరి దొరుకుతోంది. శ్లోకను వదిన అని పిలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్లోక నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె సోదరి దియా నేను కలిసే చదువుకున్నాం. తల్లులు వేరైనా.. నేను, శ్లోక, దియా అక్కాచెల్లెళ్లలా ఉండేవాళ్లం. శ్లోక మా ఇంట్లోకి వస్తున్న సందర్భంగా మా కుటుంబం పరిపూర్ణం అయినట్లుగా ఉంది’ అని ఇషా అంబానీ అన్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ శ్లోకా మెహతాను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానించిన తీరు ఆకట్టుకుటోంది. డిసెంబర్లో ముంబైలో శ్లోక, ఆకాశ్‌ల వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. -
ముకేశ్ తనయుడి ముందస్తు నిశ్చితార్థ విందు
-
ఘనంగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థం
-
ఆకాశ్ అంబానీ పెళ్లి డిసెంబర్లో!!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. స్కూల్లో తనతో కలిసి చదువుకున్న వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం ఈ ఏడాది డిసెంబర్ నెల మొదట్లో జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవడం కోసం ఇరు కుటుంబాలు, సన్నిహితులు తాజాగా(ఈ నెల 24న) గోవాలోని ఒక ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో కలుసుకున్నట్లు సమాచారం. అయితే, నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలొస్తున్నాయి. గోవా కార్యక్రమానికి సంబంధించి ముకేశ్, రసెల్ మెహతా కుటుంబ సభ్యుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆకాశ్, శ్లోకా చేతిలో చేయివేసి నిలుచునున్న ఫొటో, శ్లోకాకు ముకేశ్ అంబానీ స్వీట్ తినిపిస్తున్న ఫొటో కూడా ఉంది. కార్యక్రమానికి ముకేశ్, నీతా అంబానీలతో పాటు ఆకాశ్ నాన్నమ్మ కోకిలాబెన్ కూడా హాజరయ్యారు. కాగా, వివాహ ఉత్సవాలు 4–5 రోజుల పాటు ఉంటాయని, డిసెంబర్ 8–12 మధ్య ముంబైలోని ఒబెరాయ్ హోటల్ ఇందుకు వేదికయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, అధికారికంగా ఇరు కుటుంబాల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, ఆకాశ్‌లు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఇరు కుటుంబాలకు చాలా ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉంది. ముకేశ్ అంబానీకి ముగ్గురు సంతానం. వీరిలో కుమార్తె ఈషా, ఆకాశ్‌లు కవలలు. ఇక చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ఆకాశ్ ఇప్పటికే రిలయన్స్ టెలికం వెంచర్ జియో డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. రసెల్, మోనా మెహతాలకు ముగ్గురు సంతానం కాగా, శ్లోకా చిన్న కుమార్తె. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వచ్ఛంద సంస్థలకు వాలంటీర్లను అందించే కనెక్ట్‌ఫర్ అనే సంస్థకు ఆమె సహ–వ్యవస్థాపకురాలు. కాగా శ్లోకా తల్లి మోనా మెహతాతో పీఎన్బీ రుణ కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. -
జియోతో సావన్ జట్టు
న్యూఢిల్లీ: దాదాపు 1 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాం నెలకొల్పే దిశగా జియో మ్యూజిక్, డిజిటల్ మ్యూజిక్ సేవల సంస్థ సావన్ చేతులు కలిపాయి. దేశీయంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లో ఈ భాగస్వామ్యం జియో–సావన్ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు తోడ్పడగలదని రిలయన్స్ జియో (ఆర్‌జియో) డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్‌కి సంబంధించి జియోమ్యూజిక్ విలువ 670 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఒప్పందం ప్రకారం డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంపై రిలయన్స్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
అంబానీ ఇంట పెళ్లి సందడి...!
న్యూఢిల్లీ : అంబానీల ఇంట్లో పెళ్లి బాజా మోగనుందా? అపర కుబేరుడు, దేశీ కార్పొరేట్ రంగ రారాజు ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోనున్నారా? విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇంతకీ ఈ కార్పొరేట్ యువరాజును మనువాడబోయే వధువు ఏవరంటారా...! డైమండ్ కింగ్‌గా పేరుగాంచిన రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా అంటూ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిశ్చితార్థంపై కొద్ది వారాల్లో ప్రకటన వెలువడనుందని.. ఈ ఏడాది డిసెంబర్ ఆరంభంలో వివాహం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయా వర్గాల సమాచారం. అయితే, ఈ పెళ్లి విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరు కుటుంబాలు నిరాకరించడం గమనార్హం. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి ఇంకా తేదీలేవీ ఖరారు కాలేదని ముకేశ్ అంబానీ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపారు. 'ఆకాశ్ అంబానీ పెళ్లికి సంబంధించిన శుభవార్తను తగిన సమయంలో ముకేశ్ కుటుంబమే స్వయంగా అందరితో పంచుకుంటుంది. పెళ్లి ఖరారైతే కచ్చితంగా అది భారత్‌లోనే జరుగుతుంది' అని ఆయా వర్గాలు వివరించారు. ఈ నెల 24న నిశ్చితార్థం ఉండొచ్చన్న వార్తలను తోసిపుచ్చారు. ఎవరీ శ్లోకా మెహతా? 'రోజీ బ్లూ డైమండ్స్' అధినేత రసెల్ మెహతా కుటుంబంతో ముకేశ్ అంబానీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీ కూడా ఒకరికొకరు ఇదివరకే తెలుసనేది సంబంధిత వార్గాల సమాచారం. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో వీరిద్దరూ కలిసి చదువుకోవడం విశేషం. 2009లో హైస్కూలు విద్యను పూర్తి చేసుకున్న శ్లోకా మెహతా... ఆ తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ డిగ్రీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. రోజీ బ్లూ ఫౌండేషన్‌లో 2014 జూలై నుంచి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన వాలంటీర్లను అందించే 'కనెక్ట్‌ఫర్' అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా ఆమె. రసెల్, మోనా మెహతాల ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె శ్లోకా. ఇక ముకేశ్, నీతా అంబానీలకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు ఆకాశ్, కుమార్తె ఈషా అంబానీలు కవలలు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం వెంచర్ రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఇప్పటికే ఆకాశ్ అంబానీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మెగా కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి మోనా మెహతాతో బంధుత్వం ఉండటం కొసమెరుపు. అప్పట్లోనే ఇష్టపడ్డారా..? ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడేవారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచారని తెలుస్తోంది. శ్లోక కూడా అతని ప్రేమను అప్పుడే అంగీకరించడం, తాజాగా కుటుంబ సభ్యులు ఒకే చెప్పేయడంతో వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ప్రచారం సాగుతోంది.