భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఇంటికి వారసురాలు వచ్చేసింది. ముకేశ్ పెద్ద కొడుకు 'అకాశ్ అంబానీ & శ్లోక మెహతా' దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా బుధవారం హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనించింది.
అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు. కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన 'పరిమల్ నథ్వానీ' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆకాష్, శ్లోక అంబానీల ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ అమూల్యమైన క్షణాలు జీవితంలో అపారమైన ప్రేమను తెస్తాయని ట్వీట్ చేశారు. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?)
2023 ఏప్రిల్ నెలలో ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో కనిపించిన శ్లోక మెహతా మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది.
(ఇదీ చదవండి: మళ్ళీ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?)
Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi
— Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023
ఇదిలా ఉండగా గత సంవత్సరం ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రసవించిన ఈమె ఇండియాకు కవలలతో రావడంతో అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి వేదపండితులు రప్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అంతే కాకుండా ఇంటికి కవలలు వచ్చిన సంతోషంతో సుమారు 300 కేజీల బంగారం దానం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఐదు అనాధ శరణాలయాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment