second child
-
జూనియర్ విరాట్ ‘అకాయ్’.. అర్థమేంటో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటే ఈ జంట(Virushka Second Baby) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ బాబుకు ‘అకాయ్’ (Akaay)గా నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే.. కాస్త కొత్తగా అనిపిస్తుండడంతో విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని చెబుతున్నారు. ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధృవీకరించలేదనే విషయం తెలిసిందే. అంతకు ముందు.. ‘‘ ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ ‘అకాయ్’.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని విరాట్-అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. గంట వ్యవధిలో మిలియన్లకు పైగా లైక్‌లను అందుకుంది. క్రీడా, సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కాగా, 2017లో ఇటలీలో టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2021, జనవరి 11న ఓ పాప జన్మించింది. ఆ చిన్నారికి వామిక అని పేరు పెట్టారు. -
ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. గత వారం (మే 31న) ఆకాష్-శ్లోక దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. 2020 డిసెంబరులో ఈ దంపతులకు తొలి సంతానంగా పృథ్వీ అనే కొడుకు పుట్టాడు. అయితే పాపాయి పేరుపై అభిమానులు చాలా ఊహాగానాలే చేశారు. వీటన్నింటికీ చెక్‌పెడుతూ ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా అంబానీ తమ బిడ్డ లిటిల్ ప్రిన్సెస్ పేరు ‘వేద ఆకాష్ అంబానీ’ గా వెల్లడించారు. (మనవరాలి కోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. "శ్రీకృష్ణ భగవానుడి దయ, ధీరూభాయ్ అండ్ కోకిలాబెన్ అంబానీల ఆశీర్వాదంతో, పృథ్వీ తన చిన్న చెల్లెలు వేద ఆకాష్ అంబానీగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది" అని ప్రకటించారు. ‘వేద’ అంటే ఏమిటి? వేద పేరుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది, జ్ఞానం, జీవితంపై ఆలోచనాత్మక దృక్పథాన్ని ఇది సూచిస్తుందట. వేద అనేది 'జ్ఞానం' ‘తెలివి తేటలను’ సూచించే సంస్కృత మూలాలున్నదని జ్యోతిష్య శాస్త్ర పండితుల మాట. అంతేకాదు గొప్ప సక్సెస్, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి తన తల్లి, తాత ముఖేశ్ అంబానీలకు గొప్ప పేరు తెస్తుందని చెబుతున్నారు. కాగా ఆయిల్-టు-టెలికాం-టు-రిటైల్ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలు . వీరిలో కవలలు ఆకాష్ . ఇషా కాగా చిన్న కుమారుడు అనంత్. రిటైల్ వెంచర్ బాధ్యతలు చూస్తున్న ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. ఆకాష్ రిలయన్స్ జియోకు సారధ్యం వహిస్తున్నాడు. ఇక న్యూ ఎనర్జీ వింగ్ హెడ్‌గా ఉన్న అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాధికా మర్చంట్‌తో ఇప్పటికే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) -
వారసురాలొచ్చేసింది.. అంబానీ ఇంట మళ్ళీ ఆనందాల వెల్లువ..!!
భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఇంటికి వారసురాలు వచ్చేసింది. ముకేశ్ పెద్ద కొడుకు 'అకాశ్ అంబానీ & శ్లోక మెహతా' దంపతులు మరో సారి తల్లిదండ్రులయ్యారు. శ్లోకా బుధవారం హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనించింది. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు. కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన 'పరిమల్ నథ్వానీ' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో ఆకాష్, శ్లోక అంబానీల ప్రిన్సెస్ రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఈ అమూల్యమైన క్షణాలు జీవితంలో అపారమైన ప్రేమను తెస్తాయని ట్వీట్ చేశారు. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?) 2023 ఏప్రిల్ నెలలో ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో బేబీ బంప్‌తో కనిపించిన శ్లోక మెహతా మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది. (ఇదీ చదవండి: మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?) Heartiest congratulations to Akash and Shloka Ambani on the joyous arrival of their little princess! May this precious blessing bring immense happiness and love to your lives. pic.twitter.com/MXHdohoxqi — Dhanraj Nathwani (@DhanrajNathwani) May 31, 2023 ఇదిలా ఉండగా గత సంవత్సరం ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రసవించిన ఈమె ఇండియాకు కవలలతో రావడంతో అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. ఆ సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి వేదపండితులు రప్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అంతే కాకుండా ఇంటికి కవలలు వచ్చిన సంతోషంతో సుమారు 300 కేజీల బంగారం దానం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఐదు అనాధ శరణాలయాలు కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
తండ్రైన తమిళ స్టార్.. భార్యకు కన్నీటితో థ్యాంక్స్
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య ఆర్తి సోమవారం (జూలై 12న) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శివకార్తికేయన్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. "18 ఏళ్ల తర్వాత ఈ రోజు మా నాన్న నా చేయి పట్టుకున్నాడు, అది కూడా నా కొడుకు రూపంలో. ఎన్నో ఏళ్ల నుంచి మోస్తూ వస్తున్న బాధను నా భార్య నేడు పోగొట్టింది. ఆమెకు కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు" అని ట్వీట్ చేశాడు. దీనికి తండ్రి ఫొటో ముందు తన చేయిని అప్పుడే పుట్టిన బాబు పట్టుకుని ఉండగా క్లిక్‌మనిపించిన ఫొటోను జత చేశాడు. ఇది చూసిన అభిమానులు కుట్టి శివకార్తికేయన్ వచ్చేశాడోచ్ అంటూ #KUTTYSK అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. శివకార్తికేయన్, ఆర్తి దంపతులకు 2013లో ఆరాధన అనే కూతురు జన్మించింది. పాప పుట్టిన ఎనిమిదేళ్ల తర్వాత కొడుకు జన్మించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే శివకార్తికేయన్ ప్రస్తుతం 'డాన్' సినిమా చేస్తున్నాడు. అతడు హీరోగా నటించిన 'డాక్టర్' సినిమా త్వరలోనే థియేటర్లో లేదా ఓటీటీలో రిలీజ్ కానుంది. 18 வருடங்களுக்குப் பிறகு இன்று என் அப்பா என் விரல் பிடித்திருக்கிறார் என் மகனாக…என் பல வருட வலி போக்க தன் உயிர்வலி தாங்கிய என் மனைவி ஆர்த்திக்கு கண்ணீர்த்துளிகளால் நன்றி🙏 அம்மாவும் குழந்தையும் நலம்🙏👍❤️😊 pic.twitter.com/oETC9bh6dQ— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 12, 2021 -
కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్‌ధీర్
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కొడుకుని భుజంపై ఎత్తుకొని ముఖం కనిపించకుండా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగానీ ఇప్పటి వరకు తమ చిన్న కుమారుడి ఫోటోను పూర్తిగా చూపించలేదు. ఇప్పటికే తైమూర్‌కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తైమూర్ తమ్ముడి కోసం కూడా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తన రెండో కుమారుడిని ప్రపంచానికి నెమ్మదిగా పరిచయం చేయాలన్న ఆలోచనలో సైఫ్ కపూల్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కరీనా తండ్రి, నటుడు రణ్‌దీ కపూర్ రెండో మనువడి పిక్‌ను షేర్ చేసేశాడు. సోమవారం రోజు ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ ఫోటోను షేర్ చేశారు. వారిలో ఒకరు పెద్ద మనువడు తైమూర్ కాగా, మరొకరు చిన్న మనువడిగా తెలుస్తోంది. ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కాసేపటికే రణధీర్ ఆ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టేసింది. కొంతమంది స్క్రీన్‌షాట్ తీసుకొని రీపోస్టు చేస్తున్నారు. రణధీర్ పోస్టు ఎందుకు తొలగించారో తెలియదు కానీ పిక్‌లో ఉన్నది కరీనా రెండో కొడుకేనని నెటిజన్లు ఊహించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016 డిసెంబర్లో తైమూర్ మొదటి సంతానంగా జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత అతడికి తమ్ముడు పుట్టాడు. సెకండ్ బేబీకి పేరును ఇంకా వెల్లడించలేదు. చదవండి: జస్ట్ నెల రోజులకే.. కరీనా రెడీ! తైమూర్‌కు తమ్ముడొచ్చాడు -
జూనియర్ రాఖీభాయ్
‘బాహుబలి’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి కరోనావల్ల లాక్డౌన్ అయ్యింది. దాంతో అప్పుడు జరగాల్సిన వేడుకను వాయిదా వేశారు. సోమవారం బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు యష్. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలో బాబుకి య«థర్వ యష్ అని పేరు పెట్టారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులు ‘జూనియర్ రాఖీ భాయ్‌కి శుభాకాంక్షలు’ అని కామెంట్స్పెట్టారు. ‘కేజీఎఫ్’లో యష్ చేసిన పాత్ర పేరు రాఖీ భాయ్ అనే సంగతి తెలిసిందే. -
మా రాకుమారుడి పేరెంటో తెలుసా?
బాలీవుడ్లో బెస్ట్ జోడి షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లు. వీరి ఇంట ఇప్పుడు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మీరా నిన్న సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ చిన్ని రాకుమారుడు పేరును షాషిద్ కపూర్, అందరూ ఊహించినట్టుగానే నేడు ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. తమ రాకుమారుడు పేరు ‘జైన్ కపూర్’ గా పేర్కొన్నాడు. ‘జైన్ కపూర్ ఇక్కడ. మేము పూర్తి అనుభూతి చెందుతున్నాం. అందరి అభినందనలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ టూ ఆల్’ అని ట్వీట్ చేశారు. అంతేకాక, షాహిద్ కపూర్ తన భార్య కోసం ప్రత్యేకంగా ఓ క్యూట్ బర్త్‌డే కేక్‌ను కూడా డిజైన్ చేయించారు. డఫోడిల్క్రియేషన్స్ ఈ కేక్‌ను డిజైన్ చేశారు. దానిపై హ్యాపీ బర్త్‌డే మదర్ హెన్ అని రాయించాడు షాహిద్. తన చిన్ని రాకుమారుడి పేరును రివీల్ చేస్తూ షాహిద్ కపూర్ చేసిన ట్వీట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘జైన్ కపూర్ కూడా తన పేరు లాగా చాలా అందంగా ఉంటాడు. బేబి బాయ్‌ను చూడటానికి మేమందరం ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నాం’ అని డాక్టర్ ఇందిరా ట్వీట్ చేశారు. ‘జైన్ చూడటానికి మేమందరం వేచిచేయలేకపోతున్నాం. మా ప్రేమను, అభినందనలను పంపుతున్నాం’టాటాస్కై కూడా ట్వీట్ చేసింది. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు పుట్టడంతో, వారి ఫ్యామిలీ పూర్తైనట్టు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Zain Kapoor is here and we feel complete. Thank you for all the wishes and blessings. We are overjoyed and so grateful. Love to all. ❤️🙏 — Shahid Kapoor (@shahidkapoor) September 7, 2018 -
జెనీలియా మళ్లీ...?
ముంబై: వరుస శుభవార్తలతో బాలీవుడ్ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే హీరోయిన్ రాణీ ముఖర్జీ, ఆదిత్యా చోప్రా ఇంట్లోకి ఓ బుజ్జి అతిథి చేరి సంతోషాన్ని పంచింది. ఇపుడిక జెనీలియా వంతట. ఇప్పటికే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు మళ్లీ తల్లి కాబోతోందట. బాలీవుడ్ క్యూట్ కపుల్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దేశ్‌ముఖ్ కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా బాలీవుడ్ హీరో హీరోయిన్లు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే (నవంబర్ 24న) వీరి ముద్దుల కొడుకు రియాన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
మాకు ఒక్క బిడ్డే చాలు....
బీజింగ్: చైనాలో కుటుంబానికి ఒక్కరే బిడ్డ అనే వివాదాస్పద చట్టాన్ని సవరించి ఇద్దరు బిడ్డలను కనేందుకు అవకాశం ఇస్తున్నామని చైనా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ప్రజల నుంచి అనుకూల స్పందన పెద్దగా లేదు. చైనాకు చెందిన ‘సినా’ న్యూస్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో కేవలం 29 శాతం మంది ప్రజలు మాత్రమే రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి చూపారు. 71 శాతం మంది ఒక బిడ్డే చాలని చెప్పారు. 1, 66,000 మంది అభిప్రాయాలను సేకరించగా వారీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండో బిడ్డను కావాలని కోరుకుంటున్న వారిలో కూడా ఎక్కువ మంది సంపన్న వర్గాల వారే ఉన్నారు. కేవలం ఆర్థిక కారణాల వల్లనే తాము రెండో సంతానం వద్దనుకుంటున్నామని 71 శాతం మంది చెప్పారు. రెండో సంతానం కన్నా ఓ ఫ్లాట్, ఓ కారు కొనుక్కునేందుకే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బీజింగ్, షాంఘైలాంటి నగరాల్లో ఓ పాపను పెంచాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని వారంటున్నారు. ఒకే సంతానం అనే నిబంధనను ఎత్తివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విద్యావేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. 1979 నుంచి ఒకే సంతానం అనే చట్టాన్ని కఠినంగా అమలు చేయడం వల్లన ప్రజలు కూడా ఆ విధానానికే అలవాటు పడిపోయారని, పైగా చైనా ప్రజల్లో ఫర్టిలిటి రేటు కూడా ఇప్పడు గణనీయంగా పడిపోయిందని వారు తెలిపారు. 1950లో చైనా ప్రజల్లో 6.6 శాతం ఉన్న ఫర్టిలిటీ రేటు ఈ ఏడాదికి 1.2 శాతానికి పడిపోయిందని వారు చెప్పారు. దేశంలో నానాటికి పడిపోతున్న యువతరాన్ని పెంచడం కోసం రెండోసంతాన భాగ్యాన్ని కల్పిస్తున్నామంటున్న ప్రభుత్వం అంచనాలు తలకిందులయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండో సంతానం కనేందుకు రెండేళ్ల క్రితమే అనుమతించినప్పటికీ పది శాతం మంది కూడా రెండో సంతానానికి ఉత్సాహం చూపకపోవడమే ఇందుకు ఉదాహరణని వారన్నారు. ప్రమాదాల్లో ఉన్న ఒక్క సంతానాన్ని కోల్పేయిన వారుమాత్రమే మరో సంతానం కోసం ముందుకొచ్చారని వారు తెలిపారు. -
రెండో సంతానానికి చైనా అంగీకారం!
బీజింగ్: చైనాలో రెండో సంతానం కల్గి ఉండటానికి అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి గాను బీజింగ్ లోని 20,000 మంది చైనా జంటలకు అనుమతినిచ్చింది. గతంలో ఉన్న ఏక శిశు విధానాన్ని ఫిబ్రవరిలో సడలించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. దేశంలోని జనాభాలో భారీ స్థాయిలో సమతుల్యత దెబ్బతినడంతో రెండో సంతానానికి మార్గం సుగుమం చేసింది. ఇందుకు బీజింగ్ నగరంలో 21, 249 మంది జంటలు రెండో సంతానానికి దాఖలు చేసుకోగా, 19, 363 మంది జంటలకు అనుమతి లభించింది. ఈ రకంగా అనుమతి లభించిన వారిలో 56 శాతం మంది మహిళలు 31 నుంచి 35 ఏళ్ల లోపు వారే. జనాభా పెరుగుదల రేటును నియంత్రించేందుకు చైనా ప్రవేశపెట్టిన ఏక శిశు విధానాన్నిదశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే దేశంలోని తరాల మధ్య పెరుగుతున్న భారీ వ్యత్యాసాన్ని నివారించేందుకు ఈ తాజా విధానం ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. -
చైనాలో రెండో బిడ్డకు ఓకే!!
చైనాలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి దంపతులు రెండో బిడ్డను కనేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే.. ఇందుకు ఓ కండిషన్ ఉందండోయ్!! తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు వారి తల్లిదండ్రులకు ఒకరే బిడ్డ అయి ఉండాలి. చైనాలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోవడం, యువతీ యువకుల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో ఆలస్యంగానైనా మేల్కొన్న అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) స్థాయీ సంఘం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ స్థాయీ సంఘం తీర్మానానికి చైనాలో చట్టబద్ధత ఉంటుంది. దీనికి అనుగుణంగా అక్కడి రాష్ట్రాలు కూడా తమ కుటుంబ నియంత్రణ విధానాలను మార్చుకోవాలని, లేదా అవసరమైతే ప్రత్యేక చట్టాలు కూడా చేయాలని తెలిపారు. ఇప్పటివరకు చైనాలో అమలులో ఉన్న 'ఒకే సంతానం' నిబంధనను సడలించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) నిర్ణయించింది. రాజ్యాంగంలో కూడా కుటుంబ నియంత్రణను అత్యవసర విషయంగా పేర్కొనడంతో, ఇప్పుడు దాన్ని సవరించడానికి అత్యున్నత శాసన వ్యవస్థ కలగజేసుకోవాల్సి వచ్చింది.