జూనియర్ విరాట్ ‘అకాయ్’.. అర్థమేంటో తెలుసా? | Akaay Meaning: The Name of Anushka Sharma and Virat Kohli 2nd Child - Sakshi
Sakshi News home page

virushka: కొడుకుకు విరాట్‌ పెట్టిన పేరు అర్థం ఏమిటి?

Published Wed, Feb 21 2024 7:55 AM | Last Updated on Wed, Feb 21 2024 10:37 AM

Akaay Meaning: Anushka Sharma Virat Kohli 2nd Child Name Means - Sakshi

టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటే ఈ జంట(Virushka Second Baby) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ బాబుకు ‘అకాయ్‌’ (Akaay)గా నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే.. 

కాస్త కొత్తగా అనిపిస్తుండడంతో విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని చెబుతున్నారు.

ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్‌ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధృవీకరించలేదనే విషయం తెలిసిందే. అంతకు ముందు.. 

‘‘ ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ ‘అకాయ్’.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని విరాట్-అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే..  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. గంట వ్యవధిలో మిలియన్లకు పైగా లైక్‌లను అందుకుంది. క్రీడా, సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

కాగా, 2017లో ఇటలీలో టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2021, జనవరి 11న ఓ పాప జన్మించింది. ఆ చిన్నారికి వామిక అని పేరు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement