Virushka
-
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
Virat Kohli- Akaay: బ్రిటన్ పౌరుడిగా కోహ్లి కుమారుడు?
Virat Kohli And Anushka Sharma Son Akaay: క్రికెట్, సినీ అభిమాన వర్గాల్లో ఇప్పుడంతా ‘అకాయ్’ గురించే చర్చ. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ ముద్దుల కుమారుడికి అకాయ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. వామికకు తమ్ముడు పుట్టాడంటూ ఈ సెలబ్రిటీ జంట ప్రకటించగానే బాబు పేరుకు అర్థమేమిటి? చూడటానికి ఎలా ఉంటాడు? లండన్‌లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటిష్ పౌరసత్వం ఇస్తారా? వంటి అంశాల గురించి ఇటు కింగ్ కోహ్లి అభిమానులు.. అటు అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాయ్ అన్న పేరుకు అర్థం టర్కిష్ భాషలో ప్రకాశించే చంద్రుడు అని కొందరు.. హిందీలో అయితే.. ‘భౌతిక శరీరానికి మించి అతీతమైన వ్యక్తి’ అని ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. కోహ్లి దంపతులు ఇప్పట్లో అకాయ్ రూపాన్ని చూపించే చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకొందరు కృత్రిమ మేధతో ఫొటోలు సృష్టించి వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? మరి ‘అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? స్పోర్ట్స్ తక్ అందించిన వివరాల ప్రకారం.. కేవలం యునైటైడ్ కింగ్డం ఆస్పత్రిలో జన్మించాడు కాబట్టి జన్మతః అకాయ్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఇవ్వరు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా బ్రిటిష్ సిటిజన్ అయి ఉండాలి/ లేదంటే అక్కడ సుదీర్ఘకాలంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే యూకేలో పుట్టిన బిడ్డకు బ్రిటిష్ సిటిజన్‌గా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా.. బ్రిటన్ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు యూకే వెలుపల జన్మించిన బిడ్డకు తమ సిటిజన్‌గా గుర్తింపునిస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే, బిడ్డ పుట్టేనాటికి తల్లిదండ్రుల సిటిజన్‌షిప్ స్టేటస్ ఏమిటన్న దానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. కేవలం అదొక్కటే ఇక అకాయ్ విషయానికొస్తే.. ఈ చిన్నారి లండన్‌లో జన్మించినా అతడి తల్లిదండ్రులు ఇద్దరూ ‘విరుష్క’ భారత పౌరులు అన్న విషయం తెలిసిందే. కాబట్టి అకాయ్ బ్రిటిష్ పౌరసత్వం పొందేందుకు అనర్హుడు. భారత పౌరుడిగానే అతడికి గుర్తింపు ఉంటుంది. అయితే, అకాయ్ పాస్‌పోర్ట్ మాత్రం బ్రిటన్‌లో తయారు చేస్తారు. కాగా 2017లో ఇటలీ వేదికగా పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి- అనుష్క శర్మలకు తొలుత కుమార్తె వామిక(2021, జనవరి) జన్మించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ జంట తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సంతోష సమయంలో కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన కోహ్లి.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. చదవండి: ఆటలో విఫలం..! ఖరీదైన కారు కొన్న రహానే.. ధర ఎన్ని కోట్లంటే?! -
Virat Kohli: ఇక ఇండియా హాయిగా నిద్రపోతుంది!
Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్, అనుష్క. ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్ చాంప్.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్ చేశాడు. ఇండియా హాయిగా నిద్రపోతుంది ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్లకు కంగ్రాట్స్. ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ సహా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు విరుష్కను విష్ చేశారు. ఫిబ్రవరి 15న జననం కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, సిరీస్‌కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం Congratulations to Virat and Anushka on the arrival of Akaay, a precious addition to your beautiful family! Just like his name lights up the room, may he fill your world with endless joy and laughter. Here's to the adventures and memories you'll cherish forever. Welcome to the… https://t.co/kjuoUtQ5WB — Sachin Tendulkar (@sachin_rt) February 20, 2024 ❤️ pic.twitter.com/BgpfycayI4 — Virat Kohli (@imVkohli) February 20, 2024 -
జూనియర్ విరాట్ ‘అకాయ్’.. అర్థమేంటో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటే ఈ జంట(Virushka Second Baby) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ బాబుకు ‘అకాయ్’ (Akaay)గా నామకరణం చేసినట్లు తెలిపారు. అయితే.. కాస్త కొత్తగా అనిపిస్తుండడంతో విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని చెబుతున్నారు. ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధృవీకరించలేదనే విషయం తెలిసిందే. అంతకు ముందు.. ‘‘ ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ ‘అకాయ్’.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని విరాట్-అనుష్క జంట సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ తెగ వైరల్‌గా మారింది. గంట వ్యవధిలో మిలియన్లకు పైగా లైక్‌లను అందుకుంది. క్రీడా, సినీ రంగంతో ఇరువురి ఫ్యాన్స్ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కాగా, 2017లో ఇటలీలో టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2021, జనవరి 11న ఓ పాప జన్మించింది. ఆ చిన్నారికి వామిక అని పేరు పెట్టారు. -
మనసంతా నువ్వే.. నీపై నా ప్రేమ అనంతం.. కోహ్లి పోస్ట్ వైరల్
Virat Kohli- Anushka Sharma Cut Cake On Their 6th Wedding Anniversary: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా మనసంతా నువ్వే... నీపై నా ప్రేమ అనంతం’’ అన్న చందంగా ఎమోజీలతో భార్య పట్ల తన భావాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడీ రన్‌మెషీన్. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు. నాడు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా.. అనుష్క నుదిటిన సింధూరం దిద్ది భార్యగా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు కోహ్లి. పబ్లిసిటీకి దూరంగా అప్పటి నుంచి విరుష్క జోడీ మరింత పాపులర్ అయింది. ఇక పెళ్లినాటికే విరాట్ టీమిండియా కెప్టెన్‌గా.. అనుష్క కూడా బీ-టౌన్లో హీరోయిన్గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను సీక్రెట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఇక వివాహ సమయంలో విరుష్క సవ్యసాచి డిజైన్ చేసిన పేస్టల్ కలర్ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో విరాట్ అనుష్కను పెళ్లాడాడు. వీరి పరిణయం సందర్భంగా పంజాబీ సింగర్ హర్ష్‌దీప్ కౌర్ తన గాత్రంతో అద్భుతమైన పాటను ఆలపించింది. ‘పీర్ వి తూ’(పవిత్రమైన ప్రేమ అన్న అర్థంలో) అంటూ సాగే ఈ గీతం విరుష్క జోడీకి చక్కగా సరిపోయిందంటూ అప్పట్లో ప్రశంసలు కురిశాయి. ఇక విరాట్ -అనుష్క ఆరో పెళ్లి రోజు సందర్భంగా హర్ష్‌దీప్ కౌర్ మరోసారి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అనుష్క సైతం తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా విరుష్క జంటకు కుమార్తె వామిక సంతానం. సౌతాఫ్రికా టూర్‌తో రీఎంట్రీ ఇక వన్డే వరల్డ్‌కప్-2023 టాప్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. డిసెంబరు 26 నుంచి టీమిండియా- సౌతాఫ్రికా ఆడబోయే తొలి టెస్టులో అతడు భాగం కానున్నాడు. మరోవైపు అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని.. విరుష్క జోడీ రెండోసారి తల్లిదండ్రులు కానున్నానరే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Harshdeep Kaur (@harshdeepkaurmusic) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
#Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఇటలీలోని టస్కనీ వేదికగా ‘విరుష్క’ వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్- అనుష్క ఒక్కటయ్యారు. షాంపూ యాడ్ ద్వారా 2013లో పరిచయమైన వీరిద్దరు చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సెలబ్రిటీల లాగే వీరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ వదంతులు వ్యాప్తి చేసిన వారి మాటలను నీటి మూటలు చేస్తూ విరుష్క వెడ్లాక్తో ముడిపడిపోయారు. కాగా విరాట్- అనుష్క జోడీ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా .. రహస్యంగా పెళ్లి తంతు ముగించేశారు. విరాట్ కాదు రాహుల్! ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్‌తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్- తాను ఒక్కటయ్యామని తెలిపింది. అంతేకాదు విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్ కాకుండా నకిలీ పేరు వాడినట్లు వెల్లడించింది. ‘‘మేము నిరాడంబరంగా.. హోమ్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మొత్తం ఆరోజు 42 మంది ఉన్నారు. అదొక సెలబ్రిటీ జంట పెళ్లిగా కాకుండా.. కేవలం విరాట్- అనుష్కల పెళ్లిలా ఉండాలని కోరుకున్నాం. అంతేకాదు కేటరర్ విషయంలో విరాట్ పేరు బయటికి రాకుండా అతడికి ‘రాహుల్’ అనే నకిలీ పేరును వాడాం. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించాం. అందుకే హంగూఆర్భాటాలు లేకుండా పవిత్రత, శాంతితో కూడిన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపింది. అప్పటికే టీమిండియా కెప్టెన్‌గా విరాట్ పెళ్లినాటికి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి- నటిగా అనుష్క శర్మ తమ కెరీర్లో తారస్థాయిలో ఉన్నారు. అయితే, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీడియాకు దూరంగా వామిక ఇక ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించింది. పాపకు వామికా కోహ్లిగా నామకరణం చేసిన విరుష్క... ఇంతవరకు ఆమె ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా.. స్టార్ కిడ్‌గా కాకుండా సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఇప్పటికే విరుష్క జోడీ వెల్లడించింది. రికార్డుల రారాజు.. వరల్డ్‌కప్ ఓటమితో కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2023 టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెలవులు తీసుకున్న కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్ టూర్‌కు వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రన్‌మెషీన్ డిసెంబరు 26న మైదానంలో దిగే అవకాశం ఉంది. చదవండి: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది........ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!.. -
విరుష్క జంటకు శుభాకాంక్షల వెల్లువ
ఢిల్లీ : ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నామంటూ విరుష్క జంట శుభవార్త చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ట్విటర్లో విరాట్ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్గా దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'ప్రస్తుతం నా భార్య గర్భవతి..త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్‌షిప్‌లో ది మోస్ట్ మొమరబుల్ మూమెంట్ ఇదే.. మేం త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అంటూ ట్వీట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) #virushka expecting their first baby. Le Memers- pic.twitter.com/bTjbszK7Uy — Arindam (@ArindamSarma7) August 27, 2020 స్నేహితులు, ప్రముఖుల, అభిమానులు అందమైన జంటకు హార్టీ కంగ్రాట్స్ అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేసేస్తున్నారు. ఈ శుభసందర్భంగా విరాట్ రియక్షన్ ఇలా ఉంటుందంటూ పలువురు మీమ్ మేకర్స్ ఇప్పటికే మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్లో విరుష్క మీమ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక 2013 నుంచి రిలేషిన్‌షిప్‌లో విరుష్క జోడి.. 2017లో డిసెంబర్ 11న ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు. అటు క్రీడారంగంలో విరాట్‌కు, ఇటు సినీ రంగంలో అనుష్కకు కోట్లాదిమంది అభిమానులున్నారు. ప్రత్యేకించి విరుష్క జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. Virat and Anushka they will become parent in JAN 2021 VIRAT TO YEAR 2020 :#Virushka pic.twitter.com/wlLf4hqcVU — Logical Army 🇮🇳 (@nitin_sta) August 27, 2020 -
విరుష్క విహారం...
ముంబై: క్రికెట్–బాలీవుడ్ జోడీ కోహ్లి–అనుష్క ఏమాత్రం విరామం దొరికినా... విహారంలో మునిగిపోతారు. సఫారీని క్లీన్‌స్వీప్ చేసిన ఆనందంలో ఉన్న భారత కెప్టెన్ కోహ్లికి బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. నిత్యం పర్యటనలు, నెట్స్‌లో ప్రాక్టీసుతో నిమగ్నమయ్యే విరాట్ తన సతీమణి అనుష్కతో కలిసి కలిసొచ్చిన ఈ సమయాన్ని అహ్లాదకరంగా మలచుకుంటున్నాడు. అన్నట్లు తమ విహారాన్ని ఎంజాయ్ చేసే విరుష్క జోడీ ఈ ఆనందాన్ని తమ అభిమానులతో ఎంచక్కా పంచుకుంటుంది. సోషల్నెట్వర్క్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంతోషక్షణాల్ని పంచుకోవడంలో విరాట్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. తనకు నచ్చిన ఓ పర్యాటక ప్రదేశం వద్ద ఇద్దరు చెట్టాపట్టాలేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన గుండెనిండా అనుష్కే అన్న అర్థం వచ్చేలా ఆ ఫోటో కింద హృదయాకారపు ఎమోజీలను జతచేశాడు. తద్వారా అనుష్క పరువాలలో తడిసిముద్దయ్యే కోహ్లి... తనపై ఉండే ఒత్తిడిని ఎప్పటికప్పుడు జయిస్తున్నాడు. సారథిగా సిరీస్ విజయాల్నీ అస్వాదిస్తున్నాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టి20ల సిరీస్‌లో అతనికి విశ్రాంతినివ్వగా టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మ చేపడతాడు. -
విరుష్క చిలిపి తగాదా ముచ్చట చూశారా?
ముచ్చటైన జంట టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నటించిన మన్యవార్-మాహే ప్రకటన గుర్తుందా..ఈ స్వీట్ అండ్ సెలబ్రిటీ కపుల్ పెళ్లికి ముందు చేసిన ఈ యాడ్‌తో అందరి చూపులనూ కట్టిపడేశారు. అన్యోన్యమైన జంట అంటే ఇలా ఉండాలి అన్నట్టు నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా పెళ్లి తరువాత..వీరి వివాహ వార్షికోత్సవానికి కేవలం కొన్ని వారాల ముందు చేసిన అదే మన్యవర్-మోహే ప్రకటన ఇపుడు హల్చల్ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రమాణాలు, పెళ్లి తరువాత ప్రయాణం..ఈ చిలిపి తగాదాలతో చూడముచ్చటగా అద్భుతంగా ఉన్న ఈ యాడ్‌ను చూసి ఆనందించాల్సిందే.. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో లక్షలాది లైక్‌లు, కమెంట్ల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా ఈ యాడ్ చూసిన అభిమానులు ‘బెస్ట్ కపుల్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ తెగ మురిసిపోతున్నారు. అటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, ధడక్ దర్శకుడు శశాంక్ ఖైతాన్ కూడా తాజా ప్రకటన చూసి విరాట్-అనుష్క జంటపై ప్రశంసలు కురిపించారు. వ్యాపార ప్రమోషన్లో వాణిజ్య ప్రకటనలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. ఇక సదరు యాడ్లకు సెలబ్రిటీల స్పెషల్ ఎట్రాక్షన్ తోడైతే వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా సులువు. ఆ కోవలోనిదే. ఇండియన్ సల్వార్ సూట్, సాంప్రదాయ, డిజైనర్ వివాహ దుస్తులకు పెట్టింది పేరైన మాన్యవర్-మాహే ప్రకటన కూడా. View this post on Instagram Celebrating love everyday #SaathSaathHamesha ✨🌟 @manyavarmohey @virat.kohli A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Nov 19, 2018 at 8:42pm PST -
అనుష్క శర్మనే నా కెప్టెన్
-
ఆమె నా కెప్టెన్ : కోహ్లి
న్యూఢిల్లీ : టీమిండియాకు సారథ్యం వహించే విరాట్ కోహ్లి మైదానం బయట తన కెప్టెన్ మాత్రం తన ప్రేయసి, సతీమణి అనుష్కా శర్మనే అని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లి నోట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆఫ్ ది ఫీల్డ్‌లో మీ కెప్టెన్ ఎవరని అడిగిన ప్రశ్నకు కోహ్లి నవ్వుతూ.. ‘ఇంకెవరు అనుష్క శర్మనే’ అని బుదులిచ్చాడు. అంతేగాకుండా తన జీవితంలో నిర్ణయాలు తీసుకునే అన్ని హక్కులు అనుష్కాకే ఉన్నాయన్నాడు. ఆమె తన బలం, సర్వస్వమని అభిప్రాయపడ్డాడు. జీవితభాగస్వామిగా ఎలా ఉండాలనుకుంటారో అలాంటి వ్యక్తే తనకు భాగస్వామిగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. అనుష్కాకు క్రికెట్ అంటే పిచ్చి అని, ఆటను అర్థం చేసుకోవడమే కాకుండా ఆటగాళ్ల సెంటిమెంట్స్‌ను కూడా అర్థం చేసుకోగలదన్నాడు. ఇది ఆమెలో ఉన్న గొప్ప విషమని చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ల ప్రేయాయణం అనంతరం ఈ జంట గతేడాది డిసెంబర్లో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఐపీఎల్లో అనుష్క విరాట్ జట్టైన బెంగళూరు మ్యాచ్‌లకు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలోని కోహ్లి వ్యాఖ్యలకు వీడియోను జోడిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. -
విరుష్క.. ఇక ఆపితేనే మంచిది!
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ కమ్ కెప్టెన్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ... వివాహం తర్వాత తమ బంధాన్ని మరింత ధృడంగా మార్చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో టైమింగ్ ఫోటోలతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. అయితే అభిమానులు పెట్టింది చాలూ.. ఇక ఆపమంటున్నారు. తమ తమ వృత్తుల్లో నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ.. టైం దొరికితే చాలూ ఇలా అల్లుకుపోతున్నారు. ట్రై సిరీస్‌కు విరామం లభించటంతో కోహ్లి.. జీరో, సుయి ధాగా చిత్రాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క... కొత్త ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అనుష్క కొహ్లీని ముద్దాడుతున్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫోటో పెట్టిన గంటలోనే 7 లక్షల లైకులు. వేలల్లో కామెంట్లు... ఫ్యాన్స్ ఖుష్. అంతా హ్యాపీనే. కానీ.. వీళ్లను చూసి అసూయ పడేవాళ్లు కూడా లేకపోలేదు. అందుకే ఇకపై అలాంటి ఫోటోలు పెట్టడం ఆపితేనే మంచిందన్నది విరుష్కల హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్. 💑 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 11, 2018 at 5:38am PDT Chilling and how! 😎 A post shared by Virat Kohli (@virat.kohli) on Mar 11, 2018 at 4:22am PDT Watching the sunrise & sunset in Chanderi is one of my most cherished moments in life! Will miss it now that the shoot here comes to an end. Next stop.. Bhopal! #suidhaaga #TeamPixel #Pixel2XL #sponsored 🌞 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 10, 2018 at 5:32am PST -
తిరుగులేని టీమిండియా.. ఆటగాళ్ల వీరవిహారం!
క్రికెట్లో విజయానికి చిరునామాగా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లి పూర్తిస్థాయిలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టింది ఈ ఏడాదే. గత ఏడాది వరకు టెస్టుల్లో మాత్రమే కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లి.. ఈ ఏడాది ధోనీ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో వన్డేలు, టీ-20ల నాయకత్వ పగ్గాలు కూడా అందుకున్నాడు. దీంతో మూడు ఫార్మెట్లలోనూ సారథిగా జట్టుపై పూర్తి పట్టు సాధించాడు. ఇక, ఈ ఏడాది అభిమానులు ఎక్కువగా కోహ్లి జపమే చేశారు. ఏడాది మొదట్లో కెప్టెన్సీ తీసుకోవడం మొదలు, చివర్లో పెళ్లి వరకూ అభిమానుల ఊహకందనిరితీలో కోహ్లి అలరిస్తూ వచ్చాడు. ఒక్క చాంపియన్ ట్రోఫీ మినహా అన్ని సిరీస్‌ల్లో విజయం సాధించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కొత్త పెళ్లికొడుకు కోహ్లికి వచ్చే ఏడాది ఎన్నో సవాళ్లు ముందున్నాయి. టీమిండియా విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ ఏడాది జరిగిన ది బెస్ట్ ఘటనలపై ఓ లుక్ వేద్దాం..(సాక్షి ప్రత్యేకం) టీమిండియా నయా కెప్టెన్.. ఈ ఏడాది మొదట్లో వన్డే, టీ20ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు జట్టు విజయాలతోనూ అభిమానులను అలరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌కు విశ్వరూపం చూపించాడు. 350పరుగుల లక్ష్యాన్ని కేదార్ జాదవ్ (76బంతుల్లో120) సహకారంతో కోహ్లి (104 బంతుల్లో122) అలవోకగా ఛేదించాడు.(సాక్షి ప్రత్యేకం) అలాంటి ఇన్నింగ్స్‌లు చెప్పలేనన్ని ఉన్నాయి. కెప్టెన్‌గా ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై వరుస సిరీస్ విజయాలు అందుకున్నాడు. ఈ విజయ పరంపరతో ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్లో నంబర్ వన్ స్థానం టీమిండియా వాకిట నిలిచింది. ఈ ఏడాది కోహ్లి టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించడం గమనార్హం. టీమిండియా ఫిట్నెస్ జపం.. ‘‘యథా రాజా తథా ప్రజా’’ అన్నట్టు ఫిట్నెస్ విషయంలో కెప్టెన్ కోహ్లిని మిగతా ఆటగాళ్లు అనుసరిస్తున్నారు. ఇప్పుడు అందరు అటగాళ్లు దేహదారుఢ్యంపై దృష్టిపెట్టి ఆటలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రతి ఆటగాడు కోహ్లియే మాకు ఫిట్నెస్ గురువు అంటున్నాడు. కుంబ్లేతో వివాదం-కొత్త కోచ్ నియామకం కోచ్‌గా కుంబ్లే నియాయకం తర్వాత జట్టులో కొత్త ఉత్సాహంతోపాటు క్రమశిక్షణ ఎక్కువైంది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో కుంబ్లే కాస్త కటువుగా వ్యవహరించడంతో ఆయన మాకోద్దు బాబోయ్ అంటూ కోహ్లి అండ్ కో బీసీసీఐతో మొరపెట్టుకుంది. దీంతో కుంబ్లే బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని త్రిమూర్తులు (సచిన్,గంగూలి,లక్ష్మణ్) నియమించారు. గెలిస్తే పార్టీ లేకుంటే మరింత ప్రాక్టీస్ అన్న రవిశాస్త్రి ఫార్ములా ఆటగాళ్లందరికీ నచ్చడంతో వారు ఈ కోచ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కోహ్లి కెప్టెన్సీలో కొత్త వారికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి. కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్ లాంటి వారికి వరుస అవకాశాలు లభిస్తుండగా.. సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ వంటి కొత్త ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు.(సాక్షి ప్రత్యేకం) స్పిన్ ద్వయం అనగానే ఒకప్పుడు కుంబ్లే-హర్భజన్, అశ్విన్-జడేజాలు గుర్తుకువచ్చేవాళ్లు.. ఇప్పుడు కుల్దీప్ యాదవ్- యజువేంద్ర చాహల్ జోడీ కూడా తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఆటగాళ్ల రికార్డులు ఈ ఏడాది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (వన్డేల్లో నంబర్ వన్, టెస్టుల్లో నం. టూ, టీ20లో నం 3) కోహ్లి సత్తా చాటుతుండగా.. టెస్ట్‌ల్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న పుజారా మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కానిరీతిలో డబుల్ సెంచరీలు మూడు సాధించిన రోహిత్ శర్మ.. టీ-20లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(సాక్షి ప్రత్యేకం) పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హార్థిక్ పాండ్యా తమదైన రికార్డులు నెలకొల్పాడు. ఈ సంవత్సరం టెస్టులకే పరిమితమైనా అద్భుత ప్రదర్శనతో టీంఇండియా విజయాలలో స్పిన్ ద్వయం అశ్విన్-జడేజాలు తమ వంతు పాత్ర పోషించారు. ఈ ఏడాది చివర్లో కోహ్లి తన పెళ్లి కోసం విరామం తీసుకోవడంతో అతని స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శ్రీలంకతో వన్డే, టీ20ల సిరీస్‌లో రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ అదుర్స్, ముచ్చటగా మూడోసారి ముంబై ఈ సారి ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. కొత్త ఆటగాళ్లు తెరపైకి వచ్చారు. కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముంబై కప్ గెలువడంలో కీలకపాత్ర పోషించింది. కోహ్లి ఉండటంతో బెంగళూర్‌పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈసారి బెంగళూరు జట్టు అభిమానులకు నిరాశ మిగిలించింది. (సాక్షి ప్రత్యేకం) అదరగొట్టిన మహిళల క్రికెట్ టీం క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది డబుల్ బొనాంజా అందించిందని చెప్పవచ్చు. పురుషుల జట్టు వరుస విజయాలతో అదరగొట్టగా.. మహిళల జట్టు అద్భుతమైన పోరాటపటిమతో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకొని అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీరాజ్, ఏక్తాబిస్త్, జులాన్ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్ తదితర మహిళా క్రికెటర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొదటిసారిగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా.. టీమిండియా మ్యాచ్‌లకు భారత్‌లో విశేష ఆదరణ లభించింది. (సాక్షి ప్రత్యేకం)సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసీస్‌పై సెంచరీ చేసి జట్టును గెలిపించగా.. ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడినప్పటికీ.. భవిష్యత్‌లో మహిళల క్రికెట్ జట్టు అద్భుతాలు సాధించగలదని అభిమానుల్లో ఆశలు నింపింది. చివర్లో పెళ్లి విందు ఆటతోపాటు ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన ప్రియురాలు అనుష్క శర్మను పెళ్లాడారు. వీరిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిశాక హఠాత్తుగా విరామం తీసుకున్న కోహ్లి.. పెద్దగా హడావిడి లేకుండా ఇటలీకి వెళ్లి.. డిసెంబర్11న అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలోని టస్కనీ పట్టణంలో వీరి వివాహం కొద్దిమంది సన్నిహితుల నడుమ అట్టహాసంగా జరిగింది. ఇదిగో మా పెళ్లి ఇలా జరిగిందంటూ తమ పెళ్లి ఫొటోలను కోహ్లి, అనుష్క ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు.(సాక్షి ప్రత్యేకం) ఆ ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేశాయి. ఈ ఏడాది అతిపెద్ద పెళ్లి వేడుకగా ఇది నిలిచింది. అనంతరం ఢిల్లీలో, ముంబైలో కోహ్లి-అనుష్క జంట అన్ని రంగాల ప్రముఖులకు వివాహ విందు ఇచ్చింది. -
ఎమ్మెల్యే పేరిట కోహ్లి దేశభక్తి సిక్సర్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో వివాహం చేసుకున్న టీమిండియా విరాట్ కోహ్లిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ సెలబ్రిటీలు ఎమ్మెల్యేకి కౌంటర్ ఇస్తున్నారు. కోహ్లి, అనుష్కలకు దేశభక్తి లేదని, అందుకే ఇండియాలో కాకుండా ఇటలీలో వివాహం చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సూజిత్ సర్కార్(పింక్ ఫేమ్ ) తన ట్విట్టర్లో స్పందించారు. ‘‘దేశభక్తి లేని విరాట్ తన తొలి సిక్సర్‌ను దేశభక్తి ఉన్న ఎమ్మెల్యే పేరు మీదే కొడతాడు’’ అంటూ సెటైర్‌తో ఓ ట్వీట్ చేశాడు. ఇక కమెడియన్ వీర్‌దాస్ అయితే పన్నాలాల్‌ను పర్యవసనాలు ఆలోచించని ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశాడు. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్లో ‘‘ఇక నుంచి కొత్త రూలు . ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆలోచించకుండా, పిచ్చిగా మాట్లాడితే న్యూస్ చానెల్స్ వాటిని ప్రచారం చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు’’ అంటూ ట్వీట్ చేశాడు. Next time @imVkohli hits his unpatriotic 1st sixer out of the park it will be in the name of that patriotic MLA. — Shoojit Sircar (@ShoojitSircar) 20 December 2017 Ok. New rule. Anytime an MLA of no consequence says something incredibly ignorant and stupid...the news channels that carry it and make it trend are fined money. What say? — Vir Das (@thevirdas) 20 December 2017 -
ఘనంగా ‘విరుష్క’ రిసెప్షన్
-
విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా ప్రధాని మోదీ
-
విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా మోదీ
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహ విందు గురువారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. దీంతో తమ కుటుంబసభ్యులు, బంధువులు, మరికొందరు సెలబ్రిటీల కోసం నిన్న (శుక్రవారం రాత్రి) గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. కాగా ఈ నూతన జంట బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసి, రిసెప్షన్ రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఈ నెల 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు కోహ్లి రిసెప్షన్ ఇవ్వనున్నారు. -
కంగ్రాట్స్ ‘విరుష్క’: మోదీ
-
కంగ్రాట్స్ ‘విరుష్క’: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల వివాహంతో ఒక్కటైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రేపు (గురువారం) న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, మరికొందరు సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. ఈ రిసెప్షన్‌కు హాజరుకావాల్సిందిగా కోహ్లి-అనుష్కలు ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తనను కలిసిన విరుష్క జోడీకి మోదీ అభినందనలు తెలిపారు. మోదీని విరుష్క జోడీ కలుసుకున్న సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విరుష్క... ఆ స్వర్గమేంటో తెలిసిపోయింది
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : డిసెంబర్ 11న వివాహం తర్వాత అనుష్క-కోహ్లి హనీమూన్ ఎక్కడికి వెళ్లారంటూ ఆరాలు తీయటం కొందరి వంతు అయ్యింది. ఇంతలో అనుష్క స్వర్గంలో ఉన్నామంటూ ఓ ఫోటోను షేర్ చేయటంతో ఆ ఆత్రుత మరింతగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఎవరికి తోచిన రీతిలో వారు కథనాలు, మరికొందరు కామెంట్లతో సెటైర్లు పేల్చారు. సౌతాఫ్రికా, ఆస్టేలియా గోల్డ్ కోస్ట్, ఫ్రెంచ్ రివరియా, మాల్దీలు ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిన్లాండ్లో ఉన్నట్లు చేస్తున్నారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మొన్న ప్రచురించిన ఫోటో కూడా అక్కడిదేనని.. రోవనేమి, ల్యాప్‌లాండ్ ప్రాంతంలో వీరు బస చేశారని అందులో పేర్కొంది. ఫిన్లాండ్లో వీరిద్దరి స్వేచ్ఛా విహారం గురించి అక్కడి మీడియా సంస్థ కూడా కథనం ప్రచురించింది కూడా. ఇటలీలోని 13వ శతాబ్దానికి చెందిన బోర్గో ఫినోచ్చిటో రిసార్ట్‌లో వైభవంగా ఈ జంట వివాహం చేసుకున్న వివాహం తెలిసిందే. In heaven, literally 😇😍 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Dec 15, 2017 at 12:25am PST -
‘విరుష్క’ కోసం అల్లాను ప్రార్థిస్తున్నా.!
సాక్షి, హైదరాబాద్ : పెళ్లితో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మలపై అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ వర్గాల నుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. కోహ్లి అత్యంతగా అభిమానించే బౌలర్, అతన్ని ఆరాధ్యంగా చూసే పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ హృదయం ద్రవించే శుభాకాంక్షలు తెలిపాడు. పాక్ ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ.. విరాట్ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. అతని కొత్త జీవితం బాగుండాలని ఇప్పటికే ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశా. క్రికెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్లే వివాహ జీవితంలో విజయవంతం కావాలని, వారి ఇరువురూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా. అంతేకాకుండా దిష్టి కళ్ల నుంచి రక్షించాలని కోరుకుంటున్నా. చాలా మంది దృష్టి వారి మీద ఉన్నట్లే దిష్టి కళ్లూ వారిపై ఉంటాయి. అందుకే వారి నూతన జీవితం బాగుండేలా ఆ అల్లాను వేడుకుంటున్నా’ అని అమిర్ వ్యాఖ్యానించాడు. పలు సందర్భాల్లో అమిర్ బౌలింగ్‌ను కోహ్లి ప్రశంసించడమే కాకుండా తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ అమిర్దేనని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గతంలో కోహ్లిని సైతం అమిర్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు. -
నెక్ట్స్ వీరే..
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు వివాహ బంధంతో ఒక్కటవడంతో సెలబ్రిటీలు, ప్రముఖులంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విరుష్కకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతుల వెడ్డింగ్ ఫోటోను పోస్ట్ చేసి సరికొత్త జీవన ప్రయాణం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.అయితే ఇన్స్టాగ్రామర్లు దీనిపై పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ చేశారు. గతంలో సన్నిహితంగా మెలిగిన సల్మాన్, కత్రినాలు ఒక్కటి కావాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు.మరి మీ పెళ్లెప్పుడు అంటూ కొందరు, సల్మాన్‌ను పెళ్లి చేసుకుంటారని ఆశిస్తున్నామంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. సల్మాన్, కత్రినా మాత్రం తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని గాసిప్స్‌ను తోసిపుచ్చుతూ పలుమార్లు స్పష్టం చేశారు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వలో టైగర్ జిందా హైలో స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ మూవీ విడుదల కానుంది. -
విరాట్-అనుష్క పెళ్లిపై జోకులే జోకులు!
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ పెళ్లి.. ఇప్పుడిదే ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్.. నెటిజన్లు ఇప్పుడు వీరి పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. అభినందనలతో వీరిని ముంచెత్తుతున్నారు. అనుష్కతో తన పెళ్లి గురించి ప్రకటిస్తూ కోహ్లి చేసిన ట్వీట్..అతి తక్కువ సమయంలో అత్యధిక మంది రీట్వీట్ చేశారు. దీంతో 2017లో అత్యధికమంది రీట్వీట్ చేసి.. ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2017’ ఘనతను ఇది సొంతం చేసుకుంది. అభినందనలే కాదు వీరి పెళ్లిపై జోకులు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి గురించి వెల్లడిస్తూ అనుష్క, విరాట్ ఒకేరకమైన మెసేజ్‌ను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘నీ మెసెజ్ మస్తుంది. కాపీ చేసుకోవాలా?’ అని కోహ్లి అడిగితే.. ‘హా కాపీ చేసుకో.. కానీ ఫొటో మాత్రం మార్చు’ అని అనుష్క చెప్పినట్టు ఓ నెటిజన్ చమత్కరించాడు. Just BFF things. #VirushkaWEDDING pic.twitter.com/c9dMKbPa9R — East India Comedy (@EastIndiaComedy) 11 December 2017 ప్రధాని మోదీ ట్విట్టర్లో విరుష్క జంటకు ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ అభినందనలు తెలిపాడు. దీనికి కోహ్లి కృతజ్ఞతలు తెలుపగా.. ‘ఇంకో మాట.. నీ పెళ్లి సర్టిఫికెట్‌ను ఆధార్‌తో డిసెంబర్ 31లోపు తప్పకుండా లింక్చేయి’ అని ప్రధాని మోదీ సూచించాడు. ఇది నిజం కాదు.. ఫొటోషాప్ చేసి ఫన్నీగా ఓ నెటిజన్ పెట్టిన వ్యంగ్యాస్త్రం. ,😂😂😂😁😀😎#VirushkaWEDDING pic.twitter.com/JfxtAValZa — Makarand Shendkar (@makarand1995) 12 December 2017 మొదటిరాత్రి విరాట్ ఒత్తిడిలో ఉండి ఉంటాడు. ఎందుకంటే యూరప్‌లోని అతనికి పెద్దగా రికార్డు లేదు అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు. భాయ్ నెక్ట్స్ మ్యాచ్ ఆడుతావా? అని రోహిత్ అడిగితే.. నేను హనీమూన్‌లో ఉన్న దుకాన్ బంద్ అంటూ ఓ నెటిజన్ జోకును పేల్చాడు. డ్యాండ్రఫ్ బనాదీ జోడీ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా పెద్దసంఖ్యలో జోకులు వెల్లువెత్తుతున్నాయి. Virat must be under pressure at his first night His record in Europe is not very good 😬😷🤑#VirushkaWEDDING — simran kaur (@simran_Gulabo) 11 December 2017 -
హనీమూన్‌కు బయలుదేరిన విరుష్క.. స్పాట్ ఇదే!
ఈ ఏడాది బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఏదంటే టక్కున విరాట్ కోహ్లి-అనుష్క శర్మల పెళ్లి గురించి చెప్పవచ్చు. ఎన్నాళ్లుగానే ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఒకింత రహస్యంగా ఇటలీలోని టస్కనీ పట్టణంలో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సంబరంగా వీరి పెళ్లి జరిగింది. చూడముచ్చటగా ఉన్న వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. మరి విరుష్క దంపతుల పెళ్లితంతు ముగిసింది. మరీ హనీమూన్‌కు ఎక్కడి వెళుతున్నారంటే.. ఇటలీలోనే పక్కన రోమ్‌లో ప్రణయయాత్ర సాగించాలని ఈ జంట నిర్ణయించిందట. మంగళవారం సాయంత్రం వీరు రోమ్‌లో హనీమూన్‌కు బయలుదేరి వెళ్లారని ఓ బాలీవుడ్ వెబ్సైట్ వెల్లడించింది. టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు భర్త కోహ్లితో కలిసి అనుష్క వెళ్లనుంది. ఇద్దరు కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొనున్నారు. జనవరి తొలివారం అనంతరం ఆమె భారత్‌కు తిరిగివచ్చి మళ్లీ సినిమాలతో బిజీ కానుంది. -
వెడ్డింగ్ రింగ్ ఖరీదెంతంటే..
టస్కనీ: ఇటలీలో అత్యంత వైభవంగా జరిగిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహం హాట్ టాపిక్‌గా మారడంతో వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. కన్నుల పండువగా జరిగిన విరుష్క వివాహ ఫోటోలు పలువురిని ఆకర్షిస్తుండగా, తాజాగా వారి ఎంగేజ్మెంట్ రింగ్‌పై ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. అనుష్కకు చక్కగా సరిపోయే వెడ్డింగ్ రింగ్ కోసం విరాట్ మూడు నెలలు అన్వేషించాడని చెబుతున్నారు. ఆస్ర్టియాకు చెందిన ప్రఖ్యాత డిజైనర్చే అరుదైన డైమండ్ రింగ్‌ను అనుష్క కోసం స్వయంగా విరాట్ చేయించాడని కోహ్లి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రింగ్ అత్యంత అద్భుతంగా ఉండటంతో పాటు భిన్న కోణాల్లో చూసిన ప్రతిసారి ఆశ్యర్యానికి లోను చేసే విధంగా ఉంటుందని తెలిపాయి. ఈ స్పెషల్ డైమండ్ రింగ్ ఖరీదు రూ కోటి ఉంటుందని దీని ప్రత్యేకతలకు ఆ ధర ఎక్కువేమీ కాదని చెబుతున్నారు. ఎవరైనా ఈ రింగ్‌ను చూస్తే దాన్నుంచి చూపు మరల్చుకోని విధంగా ఉంటుందని సమాచారం. రింగ్ ఖరీదు చూస్తే విరుష్క వివాహానికి వేదికైన ఇటలీలోని ప్రఖ్యాత రిసార్ట్స్ రెంట్ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఎన్నో ఊహాగానాల నడుమ చిరకాల స్నేహితులైన విరాట్, అనుష్కల వివాహం ఇటలీలోని టస్కనీలో అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన విషయం తెలిసిందే. -
‘విరుష్క’ పెళ్లి వేడుక వీడియో...
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సోమవారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి దుస్తులు డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ .. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కోహ్లీ-అనుష్కల ఫోటోను షేర్ చేశాడు. అలాగే నూతన వధూవరులు...ఈ నెల 21న ఢిల్లీలో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులకు రిసెన్షన్ ఏర్పాటు చేశారు. వివాహ వేడుకకు సంబంధించి వీడియోను మీరూ చూడండి... అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట