Virat Kohli- Akaay: బ్రిటన్‌ పౌరుడిగా కోహ్లి కుమారుడు? | Will Virat Anushka Son Akaay Have British Citizenship What We Know | Sakshi
Sakshi News home page

Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్‌ పౌరసత్వం?!.. అందుకే లండన్‌లో..?

Published Thu, Feb 22 2024 10:48 AM | Last Updated on Thu, Feb 22 2024 11:28 AM

Will Virat Anushka Son Akaay Have British Citizenship What We Know - Sakshi

Virat Kohli And Anushka Sharma Son Akaayక్రికెట్‌, సినీ అభిమాన వర్గాల్లో ఇప్పుడంతా ‘అకాయ్‌’ గురించే చర్చ. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తమ ముద్దుల కుమారుడికి అకాయ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.

వామికకు తమ్ముడు పుట్టాడంటూ ఈ సెలబ్రిటీ జంట ప్రకటించగానే బాబు పేరుకు అర్థమేమిటి? చూడటానికి ఎలా ఉంటాడు? లండన్‌లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటిష్‌ పౌరసత్వం ఇస్తారా? వంటి అంశాల గురించి ఇటు కింగ్‌ కోహ్లి అభిమానులు.. అటు అనుష్క ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అకాయ్‌ అన్న పేరుకు అర్థం టర్కిష్‌ భాషలో ప్రకాశించే చంద్రుడు అని కొందరు.. హిందీలో అయితే.. ‘భౌతిక శరీరానికి మించి అతీతమైన వ్యక్తి’ అని ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. కోహ్లి దంపతులు ఇప్పట్లో అకాయ్‌ రూపాన్ని చూపించే చేసే ఛాన్స్‌ లేదు కాబట్టి ఇంకొందరు కృత్రిమ మేధతో ఫొటోలు సృష్టించి వాటితోనే సరిపెట్టుకుంటున్నారు.

అకాయ్‌’ బ్రిటిష్‌ పౌరుడు అవుతాడా?
మరి ‘అకాయ్‌’ బ్రిటిష్‌ పౌరుడు అవుతాడా? స్పోర్ట్స్‌ తక్‌ అందించిన వివరాల ప్రకారం.. కేవలం యునైటైడ్‌ కింగ్‌డం ఆస్పత్రిలో జన్మించాడు కాబట్టి జన్మతః అకాయ్‌కు బ్రిటిష్‌ పౌరసత్వం ఇవ్వరు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా బ్రిటిష్‌ సిటిజన్‌ అయి ఉండాలి/ లేదంటే అక్కడ సుదీర్ఘకాలంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే యూకేలో పుట్టిన బిడ్డకు బ్రిటిష్‌ సిటిజన్‌గా గుర్తింపు లభిస్తుంది.

అదే విధంగా.. బ్రిటన్‌ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు యూకే వెలుపల జన్మించిన బిడ్డకు తమ సిటిజన్‌గా గుర్తింపునిస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే, బిడ్డ పుట్టేనాటికి తల్లిదండ్రుల సిటిజన్‌షిప్‌ స్టేటస్‌ ఏమిటన్న దానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది.

కేవలం అదొక్కటే
ఇక అకాయ్‌ విషయానికొస్తే.. ఈ చిన్నారి లండన్‌లో జన్మించినా అతడి తల్లిదండ్రులు ఇద్దరూ ‘విరుష్క’ భారత పౌరులు అన్న విషయం తెలిసిందే. కాబట్టి అకాయ్‌ బ్రిటిష్‌ పౌరసత్వం పొందేందుకు అనర్హుడు. భారత పౌరుడిగానే అతడికి గుర్తింపు ఉంటుంది. అయితే, అకాయ్‌ పాస్‌పోర్ట్‌ మాత్రం బ్రిటన్‌లో తయారు చేస్తారు.

కాగా 2017లో ఇటలీ వేదికగా పెళ్లి చేసుకున్న విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మలకు తొలుత కుమార్తె వామిక(2021, జనవరి) జన్మించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ జంట తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సంతోష సమయంలో కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన కోహ్లి.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

చదవండి: ఆటలో విఫలం..! ఖరీదైన కారు కొన్న రహానే.. ధర ఎన్ని కోట్లంటే?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement